Tuesday, 7 April 2026

Blog

నిర్మల్

నిర్మల్ జిల్లాలో వర్షపాతం

నిర్మల్ 30/10/25 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లాలో గురువారం 1200.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. *ముదోల్ మండలంలో అత్యధికంగా 110.4 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది,* బాసర మండలంలో 104.4, లక్ష్మణ చందా 61.4, సోన్ 81.4, నిర్మల్ గ్రామీణం 62.8, నిర్మల్ పట్టణంలో 52.8, సారంగాపూర్ మండలంలో 62.2, దిలావర్పూర్ మండలంలో 32.2, లోకేశ్వరం మండలంలో 42, నర్సాపూర్ (జి) మండలంలో 35.8, కుంటాల మండలంలో 28, భైంసా మండలంలో 75.6, తానూరు మండలంలో 52.4, కుబీర్ మండలంలో 61, మామడ మండలంలో 39.4, పెంబి మండలంలో 81.6, ఖానాపూర్ మండలంలో 101.4, కడం పెద్దూర్ లో 73.2, దస్తురాబాద్ మండలంలో 42.4, మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయింది. జిల్లావ్యాప్తంగా 63.2 మిల్లీమీటర్ ల సగటు వర్షపాతం నమోదయింది. కాగా పైన తెలిపిన విధంగా మెంథా తుఫాన్ ప్రభావం నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఉంది, ఎడతెరిపిలేని వర్షాలు నిర్మల్ జిల్లా వ్యాప్తంగా కురుస్తున్నాయి.

విశాఖపట్నం

IMS తో సరికొత్త విధానానికి నాంది – ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో విప్లవాత్మక మార్పు

విజనరీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రణాళికకు రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ప్రశంస గాజువాక, అక్టోబర్ 29 (పున్నమి ప్రతినిధి) ప్రజా సమస్యల పరిష్కారంలో వేగం, సమన్వయం, పారదర్శకత తీసుకురావడమే సాంకేతికత యొక్క అసలైన అర్థం అని రాష్ట్ర టీడీపీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఆ దిశగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన రియల్ టైమ్ ఇన్సిడెంట్ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (IMS) ఆంధ్రప్రదేశ్ పాలనలో కొత్త యుగానికి నాంది పలుకుతుందని ఆయన అన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో విప్లవాత్మక మార్పు ప్రజల సమస్యల పరిష్కారంలో కొత్త దిశగా అడుగులు వేస్తూ, పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రెస్సల్ సిస్టమ్ (PGRS) ను ఆధునికీకరించి IMS రూపంలో ప్రభుత్వం అందుబాటులోకి తీసుకువచ్చిందని పల్లా తెలిపారు. ప్రజల ఫిర్యాదులు, ఫీల్డ్‌లో తలెత్తే సమస్యలు ఇకపై రియల్ టైమ్‌లో ప్రభుత్వానికి చేరుతాయి. సంబంధిత శాఖలు వెంటనే స్పందించి, సమస్య పరిష్కారం అయ్యే వరకు పర్యవేక్షిస్తాయని ఆయన వివరించారు. రియల్ టైమ్ స్పందన – వేగవంతమైన పరిష్కారం రాష్ట్రవ్యాప్తంగా వివిధ విభాగాలు, జిల్లాల్లో తలెత్తే సమస్యలను RTGS ఆధ్వర్యంలో IMS వ్యవస్థ పర్యవేక్షిస్తుంది. ప్రతి ఫిర్యాదు, ప్రతి ఘటనపై సంబంధిత శాఖ మంత్రి, సెక్రటరీ, కలెక్టర్, ఎస్‌పీ వంటి అధికారులను IMS WhatsApp గ్రూప్‌లో చేర్చుతారు. సమస్య పరిష్కారం అయ్యే వరకు ఆ గ్రూప్ యాక్టివ్‌గా ఉంటుంది. ప్రజలు తమ ఫిర్యాదు స్థితిని IMS డాష్‌బోర్డ్ ద్వారా రియల్ టైమ్‌లో ట్రాక్ చేసుకోవచ్చు. ఇకపై ప్రజా సమస్య – ప్రభుత్వ స్పందన మధ్య ఎలాంటి గ్యాప్ ఉండదని పల్లా తెలిపారు. “ఇది నిజమైన గవర్నెన్స్ రివల్యూషన్,” అని ఆయన అన్నారు. చంద్రబాబు విజన్ – లోకేష్ టెక్ లీడర్‌షిప్ ఫలితం IMS వ్యవస్థ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి, మంత్రివర్యులు నారా లోకేష్ సాంకేతిక విజన్ కలయికతో పుట్టిన ఆధునిక పరిపాలన వ్యవస్థ అని పల్లా పేర్కొన్నారు. “చంద్రబాబు గారు ఎప్పుడూ సాంకేతికతను ప్రజా సేవలో వినియోగిస్తారు. రియల్ టైమ్ గవర్నెన్స్ నుండి IMS వరకు ఆయన నాయకత్వం వల్లే ఆంధ్రప్రదేశ్ దేశానికి ఆదర్శంగా నిలిచింది,” అని అన్నారు. లోకేష్ టెక్నాలజీ లీడర్‌షిప్ వల్ల ప్రభుత్వ విభాగాల మధ్య సమన్వయం మరింత బలోపేతం అయిందని పేర్కొన్నారు. “ప్రతి సమస్యకు సమయపరిమితి, బాధ్యత, ఫాలో-అప్ ఇవన్నీ ఒకే వేదికపై కనిపిస్తున్నాయి. ఇదే సుపరిపాలన,” అని పల్లా అన్నారు. డిజిటల్ గవర్నెన్స్‌లో ఆంధ్రప్రదేశ్ – దేశానికి ఆదర్శం RTGS, IMS వంటి ఆధునిక వ్యవస్థలతో ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొత్త దశలోకి అడుగుపెట్టిందని పల్లా తెలిపారు. “ప్రజలకు సమయానుకూల సేవలు అందించడమే కాదు, సమస్యలు విస్తరించకముందే పరిష్కరించడమే ఈ వ్యవస్థ ఉద్దేశ్యం. ఇది చంద్రబాబు దూరదృష్టి, లోకేష్ సాంకేతిక నైపుణ్యం కలయికతో సాధ్యమైంది,” అని పల్లా శ్రీనివాసరావు పేర్కొన్నారు.

అల్లూరి సీతారామరాజు

అరకు: నేలకూలిన ఇరగాయి ప్రాథమిక పాఠశాల భవనం

గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు అరకులోయ మండలంలోని ఇరగాయి పంచాయతీ కేంద్రంలో ప్రాథమిక పాఠశాల భవనం బుధవారం సాయంత్రం నేల కూలింది. ఈ పాఠశాల శిథిలావస్థకు చేరిన మరమ్మతులు చేయకపోవడంతో వర్షానికి నాని కూలిందని స్ధానికులు తెలిపారు. ప్రస్తుత తుఫానుకు పాఠశాలలు సెలవుల కారణంగా విద్యార్థులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిందన్నారు. తక్షణమే ప్రభుత్వం నూతన పాఠశాల భవనము నిర్మించాలని గ్రామస్తులు కోరారు.

Blog

కుల వివక్షతో ఉద్యోగుల అవమానం అధికారిపై వెంటనే చర్యలు తీసుకోవాలి నల్ల బ్యాడ్జీలతో నంద్యాల వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నిరసన

చిత్తూరు జిల్లా వాణిజ్య పన్నుల శాఖ సబ్‌డివిజనల్‌ జాయింట్‌ కమిషనర్‌ రవీంద్రనాథ్‌రెడ్డి కుల వివక్షతో ఉద్యోగులను అవమానించిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఆ అధికారి పై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం నంద్యాల జిల్లా యూనిట్‌ డిమాండ్‌ చేసింది. బుధవారం భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టి సంఘం జిల్లా అధ్యక్షుడు కె. నాగేంద్రప్ప, కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆ అధికారి తన వద్ద పనిచేసే సబ్‌ఆర్డినేట్లు ఏ.లవ్‌కుమార్‌, కే. భరత్‌లను కులం పేరుతో దూషించి, మానసిక వేధింపులకు పాల్పడడం ప్రజాస్వామ్యానికి మచ్చ అని అన్నారు. చెప్పులు బయట వదిలి లోపలికి రావాలని ఆదేశించడం అవమానమని మండిపడ్డారు. ఇలాంటి ప్రవర్తనకు అధికారం ఎవరు ఇచ్చారని ప్రశ్నించారు. వెంటనే రవీంద్రనాథ్‌రెడ్డిని సస్పెండ్‌ చేయాల్సిందిగా డిమాండ్‌ చేశారు. జిల్లా కోశాధికారి శ్రీనివాసులు మాట్లాడుతూ ఉన్నతాధికారి హోదాలో కూర్చున్న వ్యక్తి కుల వివక్ష చూపించడం సిగ్గుచేటుందని, ప్రభుత్వం విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. భోజన విరామ నిరసనలు రేపటితో పాటు ఎల్లుండి కూడా వాణిజ్య పన్నుల శాఖ కార్యాలయం ఎదుట కొనసాగనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం ఉపాధ్యక్షురాలు ఆర్. విజయలక్ష్మి, నగర కోశాధికారి వెంకట చక్రధర్‌, సభ్యులు బుల్లెట్ భాష, నిర్మల, సుబ్బరత్నమ్మ, రషీద్‌, లక్ష్మణ్‌ నాయక్‌, ఆయేషా, సుమంత్‌, సుమన్‌, సుజాత, అనిత కాశయ్య తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వకపోతే రూ.15 లక్షల జరిమానా

రాష్ట్రంలో నిబంధనలు ఉల్లంఘించే ప్రైవేటు విద్యాసంస్థలపై చర్యలు తీసుకుంటామని ఏపీ ఉన్నత విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్‌ హెచ్చరించింది. విద్యార్థుల ఒరిజినల్‌ సర్టిఫికెట్లు ఇవ్వటం లేదని ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి సంస్థలకు రూ.15 లక్షల జరిమానా విధిస్తామన్న కమిషన్. కోర్సు పూర్తయినా సర్టిఫికెట్లు ఇవ్వడం లేదని, ఫీజలు అధికంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు అందాయి. ఇవి విద్యార్థుల చదువులు, ఉద్యోగావకాశాలను దెబ్బతీస్తాయి. ఇలాంటి సంస్థలకు జరిమానా, గుర్తింపు రద్దుచేసేందుకు విశ్వవిద్యాలయానికి సిఫార్సు చేస్తామన్న కమిషన్‌.రూల్స్ ప్రకారం ఒరిజినల్‌ సర్టిఫికెట్లను విద్యాసంస్థలు తీసుకోకూడదు. విద్యార్థులకు సమస్యలు ఉంటే # 87126 27318, 08645 -274445# లకు ఫిర్యాదు చేయవచ్చు. టోల్ ఫ్రీ నెంబర్.ap. 1100🙏100🙏N.1915🙏జిల్లా కన్జ్యూమర్ కోర్టు& జిల్లా కలెక్టర్లకు &.SP. గారికి ఫిర్యాదులు చెయ్యొచ్చు రాష్ట్ర ప్రజలు, తల్లిదండ్రులు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మొంథా తుఫాన్‌లో ప్రజల కోసం ప్రాణాల పణంగా పెట్టిన విద్యుత్ సిబ్బంది!

డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో మామిడికుదురు మండలం మరియు గోగనిమటం ప్రక్క గ్రామంలో తుఫాన్ బీభత్సం సృష్టించినా ప్రజలకు విద్యుత్ అందించేందుకు ధోన్ డివిజన్, నంద్యాల సర్కిల్‌కు చెందిన విద్యుత్ సిబ్బంది ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏఈ నాగేశ్వరరెడ్డి గారు ఏడిఈ నాగేంద్ర గారు, లైన్మెన్ లాజర్ గారు, లైన్మెన్ కాటమరాజు గారు, జూనియర్ లైన్మెన్ బృందం అహర్నిశలు శ్రమించారు. భారీగా గాలులు, వర్షాలకు కూలి పడిపోయిన స్తంభాలు – ఎలాంటి ప్రమాదాలకైనా భయపడకుండా ప్రజలకు విద్యుత్‌ను పునరుద్ధరించేందుకు విద్యుత్ సిబ్బంది కృషి చేశారు. తుఫాన్ మధ్యలోనూ, చీకట్లోనూ, రాత్రింబవళ్లు నిద్రాహారాలు మాని విద్యుత్తును పునరుద్దాలించేందుకు పనిచేసి ప్రజలకు వెలుగుని అందించారు. ఇలాంటి సిబ్బంది dedication మనందరికీ స్ఫూర్తి! ఏఈ నాగేశ్వరరెడ్డి గారు ఏడిఈ నాగేంద్ర గారు లైన్మెన్ లాజర్ గారు లైన్మెన్ కాటమరాజు గారు జూనియర్ లైన్మెన్ బృందం, రాయలసీమ వీరులకు మా హృదయపూర్వక అభినందనలు!

పల్నాడు

టెలికాం కంపెనీలు సన్నాహాలు

ఇన్‌కమింగ్‌ కాల్స్‌కు మొబైల్ స్క్రీన్లలో వ్యక్తి పేరు మార్చి నెలకల్లా అందుబాటులోకి తెచ్చేందుకు టెలికాం కంపెనీలు సన్నాహాలు మొబైల్‌లో సేవ్ చేయని నెంబర్ నుండి కాల్ వస్తే కేవలం నెంబర్ మాత్రమే వచ్చేది వ్యక్తి పేరు కోసం ట్రూకాలర్‌ వంటి థర్డ్‌ పార్టీ యాప్స్‌ను ఉపయోగించేవాళ్ళం కానీ మార్చి నుండి నెంబర్ ఎవరి గుర్తింపు కార్డుపై తీసుకుంటే వారి పేరు ఫోన్ చేసినప్పుడు వచ్చే విధంగా సన్నాహాలు ఈ సేవలు దేశవ్యాప్తంగా వచ్చే ఏడాది మార్చి నాటికి అందుబాటులోకి రానున్నట్లు సమాచారం…..

తిరుపతి

జాతీయస్థాయి టోర్నమెంట్లో పాల్గొంటున్న విక్రమ్ టెన్నిస్ అకాడమీ క్రీడాకారులు

శ్రీకాళహస్తి అక్టోబర్ ౩౦, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి విక్రమ్ టెన్నిస్ అకాడమీకి చెందిన క్రీడాకారులు 01-11-2025 నుండి 03-11-2025 వరకు నిర్వహించబడుతున్న తిరుపతి జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అండర్ 14, 17 & 19 బాలురు, బాలికల టెన్నిస్లో జాతీయ స్థాయిలో పాల్గొనే అవకాశం ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ టీమ్ సెలెక్షన్ ద్వారా విక్రమ్ టెన్నిస్ అకాడమీ ఎన్నికైన సందర్బంగా విక్రమ్ టెన్నిస్ అకాడమీ నిరవహుకులు మాట్లాడుతూ.. తమ ఆకడమీలో శిక్షణ పొందిన క్రీడాకారులు జాతీయస్థాయి టోర్నమెంట్లో పాల్గొంటున్నందుకు తమకు చాల సంతోషంతొషంగా ఉందని ఈ రాష్ట్ర స్థాయిలో జరిగే లాన్ టెన్నిస్ టోర్నమెంట్ అందరు విచ్చేసి పోటీలను వీక్షించి టోర్నమెంట్ ను విజయవంతం చేయవలసిందిగా మనవి చేశారు. టోర్నమెంట్ ఉదయం 9 గంటలకు ప్రారంభం అవుతుందని అకాడమీ నిర్వాహుకులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

🔸మొంథా తుఫాన్ ప్రభావం – ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ఆదేశాలపై వరద బాధితులకు సహాయచర్యలు..! 🔸ఉదయగిరి ఎమ్మెల్యే సురేష్ గారి మార్గదర్శకత్వంలో వరద బాధితులకు తక్షణ సహాయం..! 🔸కొండాపురం, కలిగిరి మండలాల్లో తుఫాను బాధితులకు అండగా నిలిచిన స్థానిక నాయకులు..! 🔸మొంథా తుఫాన్: ఉదయగిరి నియోజకవర్గంలో ప్రజలకు అండగా ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కలిగిరి అక్టోబర్ 29న అక్టోబర్ 28 మంగళవారం నాడు తుఫాను “మొంథా” ప్రభావంతో ఇటీవల జిల్లాలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో, ప్రజలు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండేందుకు ఉదయగిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవ శ్రీ కాకర్ల సురేష్ గారు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఆ ఆదేశాల మేరకు స్థానిక నాయకులు ముందుకు వచ్చి, కొండాపురం మండలంలోని చింతలదీవి ఎస్సీ కాలనీ, సాయిపేట పంచాయతీకి చెందిన కొమ్మిపాలెం గ్రామం, అలాగే కలిగిరి మండలంలోని వెంకన్నపాలెం ఎస్టీ కాలనీ మరియు రావులకొల్లు గ్రామంలోని ఎస్టీ కాలనీల్లో తుఫాను ప్రభావంతో ఇబ్బందులు పడుతున్న వరద బాధిత కుటుంబాలకు సహాయక చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు బాధితులకు దుప్పట్లు, తినుబండారాలు, కూరగాయలు, ముఖ్య ఆహార పదార్థాలు పంపిణీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రభుత్వ యంత్రాంగం సమన్వయంతో తగిన చర్యలు తీసుకుంటూ, అవసరమైన సహాయాన్ని అందజేశారు. ప్రజల సంక్షేమమే ముఖ్యమని భావించిన ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు, ప్రతీ గ్రామంలోనూ పరిస్థితులను నిశితంగా గమనిస్తూ, అవసరమైతే తక్షణ సహాయం అందేలా అధికారులను సూచించారు.

ఖమ్మం

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ….లకావత్ గిరిబాబు

పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని వైరా నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు పంటలు నీట మునగడంతో రైతులకు తీవ్ర నష్టం కలిగిందన్నారు. చేతికొచ్చిన పంటలు రైతుల కళ్ళ ముందే వర్షాలకు నీటిలో మునగడంతో వరి, మిర్చి, మొక్కజొన్న, పాటు పత్తి కాయల సైతం నల్లగా మారాయని, నష్టపోయిన పంటల వివరాలను అంచనా వేసి ఎకరానికి రూ.30వేల నుంచి 50 వేల చొప్పున పరిహారం చెల్లించాలన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే నష్టపోయిన రైతులను గుర్తించి రైతులందరినీ సమీకరించి ప్రభుత్వ కార్యాలయం ముందు ధర్నాకు పిలుపు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు రైతులు బాధలతో ఆత్మహత్యలకు పాల్పడే అవకాశం ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రైతన్నలకు అండగా ఉంటూ పంట నష్టపరిహారం చెల్లించే వరకు రైతుల వెంటే ఉంటామన్నారు. పంట నష్టపోయిన పంటలను వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక అందించాలని ఆయన కోరారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.