Tuesday, 7 April 2026

Blog

విశాఖపట్నం

విశాఖ నగర డిసిపి1 గా జగదీష్ అడహళ్లి

విశాఖ నగర డిసిపి1 గా జగదీష్ అడహళ్లి* విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:- *జగదీష్ అడహళ్లి ఆంధ్రప్రదేశ్ క్యాడర్ ఐపీఎస్ అధికారి. 2020లో UPSC పరీక్షలో 440వ ర్యాంకు సాధించి ఐపీఎస్ అధికారి అయ్యారు. అతను మొదట్లో అసిస్టెంట్ కమిషనర్‌గా పనిచేశారు, ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో అనేక హోదాల్లో పనిచేశారు. ప్రస్తుతం అతను అల్లూరి జిల్లా ASPగా పనిచేస్తూ విశాఖ డీసీపీ -1 గా బదిలీ అయ్యారు*…

విశాఖపట్నం

శ్రీ‌క‌న‌క మ‌హాల‌క్ష్మి అమ్మ‌వారి రాట మ‌హోత్సానికి క‌లెక్ట‌ర్ కు ఆహ్వానం*

*శ్రీ‌క‌న‌క మ‌హాల‌క్ష్మి అమ్మ‌వారి రాట మ‌హోత్సానికి క‌లెక్ట‌ర్ కు ఆహ్వానం* *విశాఖ‌ప‌ట్ట‌ణం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* మార్గ‌శిర మాసోత్స‌వాల‌ నేప‌థ్యంలో న‌వంబ‌ర్ 01వ తేదీన జ‌ర‌గ‌నున్న‌ బురుజుపేట శ్రీ క‌న‌క మ‌హాలక్ష్మి అమ్మ‌వారి పందిరి రాట మహోత్స‌వ క్ర‌తువుకు విచ్చేయ‌వ‌ల్సిందిగా కోరుతూ ఆల‌య అధికారులు జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ను సాద‌రంగా ఆహ్వానించారు. ఆల‌య ఈవో కె. శోభారాణి, ఇత‌ర అధికారులు, అర్చ‌కులు క‌లెక్ట‌ర్ను గురువారం సాయంత్రం త‌న ఛాంబ‌ర్లో క‌లిసి సంప్ర‌దాయ రీతిలో ఆహ్వానం తెలిపారు. దుశ్సాలువాతో స‌త్క‌రించి ఆహ్వాన ప‌త్రికను, అమ్మ‌వారి ప్ర‌సాదాన్ని అంద‌జేశారు. అర్చ‌కులు, వేద పండితులు అక్షిత‌లు చ‌ల్లి ఆశ్వీర‌చ‌నాలు అంద‌జేశారు. క‌న‌క మ‌హాలక్ష్మి అమ్మవారి ఆల‌య స‌న్నిధిలో న‌వంబ‌ర్ 01వ తేదీన మార్గ‌శిర మాసోత్స‌వాల‌కు అంకురార్ప‌ణ జ‌ర‌గ్గా న‌వంబ‌ర్ 21 నుంచి డిసెంబ‌ర్ 19వ తేదీ వ‌ర‌కు ఉత్స‌వాలు జ‌ర‌గ‌నున్న‌ట్లు ఆల‌య‌ అధికారులు తెలిపారు.

విశాఖపట్నం

గుడిలోవ హైవేపై లారీ బోల్తా

గుడిలోవ హైవేపై లారీ బోల్తా *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* విశాఖ ఆనందపురం మండలం గుడిలోవ హైవేపై అల్లం లోడుతో వెళ్తున్న లారీ బెంగళూరు నుంచి కలకత్తా వెళ్తున్న క్రమంలో గురువారం ఉదయం పెందుర్తి వైపు నుంచి అనందపురం వెళ్తున్న గుడిలోవ వద్ద వచ్చేసరికి అదుపుతప్పి హైవేలో లారీ బోల్తా పడింది. ఈ ఘటనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న ట్రాఫిక్ ఎస్ఐ పాపారావు తన సిబ్బందితో ఘటన స్థలానికి చేరుకుని ట్రాఫిక్ను క్లియర్ చేశారు. లారీ డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డారు.

విశాఖపట్నం

సీఎం సహాయనిధికి రూ.5 లక్షలు అందించిన గంటా రవితేజ*

*సీఎం సహాయనిధికి రూ.5 లక్షలు అందించిన గంటా రవితేజ* *తుపాను నేపథ్యంలో పుట్టినరోజు వేడుకలు రద్దు చేసుకున్న యువనేత* _*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*:_ సీఎం సహాయ నిధికి భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు కుమారుడు, టీడీపీ యువ నాయకుడు గంటా రవితేజ రూ. 5 లక్షలు అందజేశారు. విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ను ఉండవల్లి నివాసంలో గురువారం కలిసి ఈ మేరకు చెక్కును అందించారు. మొంథా తుపాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపిన నేపథ్యంలో గురువారం తన పుట్టినరోజు వేడుకలను రవితేజ రద్దు చేసుకున్నారు. బాధితులను ఆదుకోవడానికి తన వంతు బాధ్యతగా నియోజకవర్గంలో పార్టీ యువతతో వచ్చి ఈ మొత్తాన్ని విరాళంగా ఇచ్చారు. అనంతరం “గీత మకరందం” ఆధ్యాత్మిక గ్రంథాన్ని లోకేష్ కు బహూకరించారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ కార్యకలాపాల గురించి లోకేష్ ఆరా తీశారు. భీమిలి టీడీపీకి కంచుకోటని, కె.ఎస్.ఎస్.లు.. కమిటీలు.. విజయవంతంగా పూర్తి చేశామని రవితేజ తెలిపారు. లక్ష పైగా పార్టీ సభ్యత్వాలు నమోదు చేసిన విషయాన్ని లోకేష్ కు వివరించారు. యువత భాగస్వామ్యంతో పార్టీని మరింత పటిష్టం చేసే దిశగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. రవితేజకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేసిన లోకేష్.. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటిస్తూ ప్రజలతో మమేకం కావాలని సూచించారు.

అమరావతి

ఏపీలో భిక్షాటన నిషేధం జీవో జారీ చేసిన ప్రభుత్వం

ఏపీలో భిక్షాటన నిషేధం జీవో జారీ చేసిన ప్రభుత్వం అమరావతి పున్నమి ప్రతినిధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్రంలో భిక్షాటనను పూర్తిగా నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నది. ఈ మేరకు ‘భిక్షాటన నివారణ (సవరణ) చట్టం- 2025’ అధికారికంగా ప్రచురితమైంది. ఈ చట్టం అమలుతో ఇకపై ఏపీలో ఎక్కడ భిక్షాటన చేసినా తీవ్రమైన నేరంగా పరిగణించనున్నారు. ఈ నెల 15న చట్టానికి గవర్నర్ ఆమోదముద్ర వేయగా 27న ఏపీ గెజిట్‌లో చట్టం ప్రచురితమైంది. లా డిపార్ట్‌మెంట్ సెక్రటరీ గొట్టాపు ప్రతిభా దేవి సంతకంతో జీవో ఎంఎస్ నం.58 విడుదల చేశారు. ఈ చట్టాన్ని సంక్షేమ, పోలీసు శాఖ సమన్వయంతో అమలు చేయనున్నాయి. రాష్ట్రంలో పెరుగుతున్న భిక్షాటన మాఫియా, వ్యవస్థీకృత భిక్షాటనను పూర్తిగా నిర్మూలించడం, నిరుపేదలకు పునరావాసం కల్పించాలన్న లక్ష్యంతో చట్టాన్ని తీసుకొచ్చారు.

తెలంగాణ

ఏఐటీయూసీ105 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని వారం రోజులపాటు ఘనంగా నిర్వహించండి

పున్నమి అక్టోబర్ 30 తెలంగాణ: రామగుండం: సంఘటిత అసంఘటిత రంగ కార్మికులకు కార్మికులకు ఏఐటీయూసీ రామగుండం నగర కమిటీ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ ల పిలుపు భారతదేశంలో కార్మిక వర్గ పోరాటాలకు ప్రతినిథ్యం వహిస్తూ ఏర్పడిన మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న స్థాపించబడింది. స్వతంత్ర సమరయోధులు లాలా లజపతిరాయ్,బాల గంగాధర్ తిలక్,జవహర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వి వి గిరి తో పాటు ఆనాటి కమ్యూనిస్టు కార్మిక సంఘాల నాయకులైన ఎస్ ఏ డాంగే, ఇంద్రజిత్ గుప్తా,పార్వతి కృష్ణన్, ఏబీ బర్ధన్,మగ్దూం మొయినుద్దీన్, రాజ్ బహుదూర్ గౌర్,కే ఎల్ మహేంద్ర లాంటి పోరాట యోధులు ఏఐటీయూసీ కి నాయకత్వం వహించారు. దేశానికి సంపూర్ణ స్వాతంత్రం ఇవ్వాలని నినదించిన మొట్టమొదటి సారిగా తీర్మానించిన ఏకైక కార్మిక సంఘం ఏఐటీయూసీ. స్వతంత్రానికి ముందు తరువాత కార్మిక హక్కుల కొరకు పోరాడి ట్రేడ్ యూనియన్ చట్టం పారిశ్రామిక సంబంధాల ప్రమాదాల పరిహారాల చట్టం, కనీస వేతన చట్టం,బోనస్ గ్రాట్యుటీ – ఈఎస్ఐ,పి ఎఫ్, బీడీ కార్మికుల చట్టం, భవన నిర్మాణ కార్మికుల చట్టం, గ్రామీణ ఉపాధి హామీ పథకం లాంటి 44 కార్మిక చట్టాలను ఏఐటీయూసీ పోరాడి సాధించింది. రామగుండం నియోజకవర్గంలోని అసంఘటిత రంగాలైన మునిసిపల్, ఆర్ టి సి, ఎన్ టి పి సి, ఆర్ ఎఫ్ సి ఎల్, మెడికల్, సింగరేణి,భసంత్ నగర్ సిమెంట్ ఫ్యాక్టరీ,తెలంగాణ పవర్ ప్రాజెక్ట్, శానిటరీ కార్మికులు,మధ్యాహ్న భోజన కార్మికులు,అంగన్ వాడి, ఆశ,ఏ ఎన్ ఎం ఇతర కార్మికులకు హమాలీలకు,భవన నిర్మాణ కార్మికులకు,ఉపాధి హామీ కార్మికులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాల వల్ల కనీస కార్మిక చట్టాలైన పిఎఫ్,ఈఎస్ ఐ, గ్రాట్యుటీ,సమాన పనికి సమాన- వేతనం,పనికి తగిన ప్రతిపలం లేని తీవ్రమైన పని ఒత్తిడితో అనేక ఇబ్బందులు ఆటుపోట్లు కార్మిక వర్గం ఎదుర్కొంటుంది. కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ పెద్ద నోట్ల రద్దు చేసి స్వీస్ బ్యాంకుల్లో ఉన్న నల్లధనాన్ని వెనక్కి తీసుకొచ్చి ప్రతి పౌరునికి బ్యాంకు ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తానని, సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాల కల్పన,ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మాణం,రైతుకు ఆదాయ రెట్టింపు లాంటి బూటక వాగ్దానాలు మోసపూరిత మని తేలిపోయాయి. పూర్తిగా అన్ని రంగాలలో ప్రైవేట్ పరం చేస్తూ ఆదాని,అంబానీలకు వేల కోట్లు కట్టబెట్టి కార్మిక వర్గంపై యుద్ధం చేస్తుంది.100 సంవత్సరాలుగా పోరాడి సాధించుకున్న 44 కార్మిక చట్టాలను వీటిలో ముఖ్యమైన 29 చట్టాలను మార్పిడితో వ్యాపారం సులభతరం పేరుతో పెట్టుబడిదారులకు ఆదాని, అంబానీలకు అనుకూలంగా నాలుగు లేబర్ కోడ్ లను ప్రవేశపెట్టి కార్మికుల హక్కులను పాలకులు హరించి వేస్తున్నారు. ప్రజలపై నిత్యవసర వస్తువులు పెట్రోల్ డీజిల్ గ్యాస్ లాంటి వస్తువులపై విపరీతంగా ధరలు పెంచి అసంఘటిత కార్మిక రంగం నడ్డి విరుస్తుంది.ప్రభుత్వ రంగంలోని రక్షణ రంగం బ్యాంకులు ఇన్సూరెన్స్,బొగ్గు, ఉక్కు గనులు, రైల్వే, విమానయాన, పోర్టులు పోస్ట్ ఆఫీసులు,బిఎస్ ఎన్ ఎల్, ఆయిల్ కంపెనీ లు ఓ ఎన్ జి ఎస్, బి ఏ ఈ, ఇస్రో లాంటి అనేక పరిశ్రమలను ఆదాని, అంబానీలకు అనుకూలంగా నిర్ణయాలు చేస్తూ ప్రైవేట్ పరం చేయబడుతుంది. ఇది యావత్ అన్ని వర్గాల కార్మిక వర్గం గ్రహించాలి. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాల బోర్డు సిఫారసు చేసి ఐదు జీవోలను అమలు చేయకుండా పారిశ్రామికవేత్తల అభిప్రాయాలకు వంత పాడుతుంది. సుమారు 18 సంవత్సరాలుగా అటు కేంద్రంతో పాటు ఇటు రాష్ట్రంలో షెడ్యూల్డ్ పరిశ్రమలలో కనీస వేతనాలు పెంచబడలేదు. కాంట్రాక్ట్ విధానాన్ని రద్దు చేస్తామన్న ప్రభుత్వం మాట తప్పింది. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి-సమాన వేతనం చెల్లించడం లేదు.ఏఐటీయూసీ రామగుండం నియోజకవర్గంలోని సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులకు వలస కార్మికులకు వీరితో పాటు ఆటో డ్రైవర్లకు ప్రభుత్వం ఇస్తానన్న 12000 రూపాయలు ఇవ్వాలని ఆటో డ్రైవర్ కార్మికులకు కూడా అండగా ఉండి వారి సౌకర్యాలు ఇతర కార్మిక ఉద్యోగులకు భద్రత ఉపాధి హక్కులకై ఏఐటీయూసీ పోరాడుతుంది. ఏఐటీయూసీ 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించింది. 105 వా ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రామగుండం నియోజకవర్గం లోని అన్ని వర్గాల సంఘటిత అసంఘటిత రంగాల కార్మికులు ఆయా పని స్థలాల్లో బస్తీలలో వారం రోజులపాటు ఆవిర్భావ దినోత్సవ సభలు సమావేశాలు నిర్వహిస్తూ ఎర్ర తోరణాలతో ఎరుపుమయం చేసి ఏఐటీయూసీ జెండాలు ఎగురవేయాలని ముఖ్యమైన నాయకులకు సీనియర్స్ ని గుర్తించి శాలువా మెమొంటోలతో సన్మానం సత్కారం చేసి ఒక పండుగ వాతావరణంలో ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని జరపాలని కార్మిక వర్గానికి ఏఐటీయూసీ రామగుండం నగర సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్ర శేఖర్ లు పిలుపునిచ్చారు.

రంగారెడ్డి

వాగులో కొట్టుకుపోయి మహిళ మృతి

పున్నమి: అక్టోబర్ 30 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట్ మండలం: మొంథా తుఫాను కారణంగా ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు మజీదూర్-బాటసింగారం మధ్య వాగు ఉద్ధృత రూపం దాల్చింది. అటుగా వచ్చిన దంపతులు వరదలో కొట్టుకుపోయారు. గమనించిన యువకులు భర్తను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. మహిళ నీటిలో గల్లంతై చనిపోయింది. మృతురాలు నెర్రపల్లికి చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. పుట్టింటి నుంచి భువనగిరికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

రంగారెడ్డి

వాగులో కొట్టుకుపోయి మహిళ మృతి

పున్నమి: అక్టోబర్ 30 రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట్ మండలం: మొంథా తుఫాను కారణంగా ఒకరు మృతి చెందారు. స్థానికుల వివరాలు మజీదూర్-బాటసింగారం మధ్య వాగు ఉద్ధృత రూపం దాల్చింది. అటుగా వచ్చిన దంపతులు వరదలో కొట్టుకుపోయారు. గమనించిన యువకులు భర్తను క్షేమంగా ఒడ్డుకు చేర్చారు. మహిళ నీటిలో గల్లంతై చనిపోయింది. మృతురాలు నెర్రపల్లికి చెందిన కృష్ణవేణిగా గుర్తించారు. పుట్టింటి నుంచి భువనగిరికి వెళుతుండగా ఈ ఘటన జరిగింది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కార్తీకమాస అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాతలుగా సింధు డ్రెస్సెస్ అధినేత గంగిశెట్టి సుధాకర్ రావు వారి కుటుంబసభ్యులు

కార్తీకమాస అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాతలుగా సింధు డ్రెస్సెస్ అధినేత గంగిశెట్టి సుధాకర్ రావు వారి ధర్మపత్ని ధనలక్ష్మి కుమారుడు కృష్ణ చైతన్య కుమార్తె రామ ప్రత్యూష వ్యవహరించారు. ముందుగా దేవస్థానం నందు అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు గావించి కార్తీకమాస విశిష్టతను గురించి దేవస్థాన ప్రధానార్చకులు తెలియజేశారు. ఈ కార్తీక మాసంలో అన్నదానం చేస్తే వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యములతో అష్ట ఐశ్వర్యముల అవుతారు అని దేవస్థాన గురుస్వాములు చేబ్రోలు వసంతరావు ACDC ప్రసాద్ స్వామి బొక్కల మస్తాన్ రెడ్డి తెలియజేశారు. పై అన్నదాన కార్యక్రమమును దేవస్థానం చైర్మన్ కరకల మాలకొండ రెడ్డి మరియు ట్రెజరర్ కొంకల శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో స్వాములకు విశేషంగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని అందించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కార్తీకమాస అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాతలుగా సింధు డ్రెస్సెస్ అధినేత గంగిశెట్టి సుధాకర్ రావు వారి కుటుంబసభ్యులు

కార్తీకమాస అన్నదాన కార్యక్రమంలో భాగంగా ఈరోజు అన్నదాతలుగా సింధు డ్రెస్సెస్ అధినేత గంగిశెట్టి సుధాకర్ రావు వారి ధర్మపత్ని ధనలక్ష్మి కుమారుడు కృష్ణ చైతన్య కుమార్తె రామ ప్రత్యూష వ్యవహరించారు. ముందుగా దేవస్థానం నందు అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు గావించి కార్తీకమాస విశిష్టతను గురించి దేవస్థాన ప్రధానార్చకులు తెలియజేశారు. ఈ కార్తీక మాసంలో అన్నదానం చేస్తే వారి కుటుంబం సుఖ సంతోషాలతో ఆయురారోగ్యములతో అష్ట ఐశ్వర్యముల అవుతారు అని దేవస్థాన గురుస్వాములు చేబ్రోలు వసంతరావు ACDC ప్రసాద్ స్వామి బొక్కల మస్తాన్ రెడ్డి తెలియజేశారు. పై అన్నదాన కార్యక్రమమును దేవస్థానం చైర్మన్ కరకల మాలకొండ రెడ్డి మరియు ట్రెజరర్ కొంకల శ్రీనివాసులు రెడ్డి ప్రత్యేక పర్యవేక్షణలో స్వాములకు విశేషంగా అన్న ప్రసాద కార్యక్రమాన్ని అందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.