Tuesday, 7 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

ఇద్దరు చనిపోయినా.. దాచారు: దాడిశెట్టి

తుఫాను వల్ల కాకినాడలో ఇద్దరు చనిపోయారని మాజీ మంత్రి దాడిశెట్టి రాజా తెలిపారు. ఆ మరణాలను ప్రభుత్వం దాచేసిందని ధ్వజమెత్తారు. జిల్లాలో 40 వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని YCP చీఫ్ జగన్తో జరిగిన వీడియో కాన్ఫరెన్సులో వివరించారు. అటు వరద బాధితులకు అందుబాటులో ఉంటున్నామని ఆ పార్టీ సీనియర్ నేత కన్నబాబు తెలిపారు. రైతుల తర్వాత తమ ప్రాంతంలో మత్స్యకారులే తీవ్రంగా నష్టపోయారని జగన్కు వివరించారు.

తెలంగాణ

ధాన్యం తడవకుండా చూడాలని ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ ఛార్జ్ లను ఆదేశించిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) వర్షానికి ధాన్యం తడవకుండా జాగ్రత్తలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఇన్ ఛార్జ్ లను ఆదేశించారు. గురువారం ఆమె జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ తో కలిసి, నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం చిరుమర్తి గ్రామం లో ఐకెపి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. మోందా తుఫాను కారణంగా గడిచిన రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఐకెపి కేంద్రంలోని ధాన్యం తడిసి రంగు మారిపోగా, ధాన్యం కొనుగోలు విషయంలో చిరుమర్తి కొనుగోలు కేంద్రానికి అనుసంధానం చేసిన రైస్ మిల్లుతో సమన్వయం చేసుకొని, ధాన్యం దించుకునేలా చూడాలని డిఆర్డిఓ శేఖర్ రెడ్డికి సూచించారు. ఎక్కువ రోజులు ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉండవద్దని వర్షాలను దృష్టిలో ఉంచుకొని ధాన్యం తడవకుండా టార్పాలిన్లు కప్పి ఉంచాలని చెప్పారు. అయితే ఈ కేంద్రంలో కేవలం నలుగురు రైతులకు చెందిన ధాన్యం మాత్రమే వర్షానికి తడిసిపోయి రంగు మారిపోయినట్లు డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి జిల్లా కలెక్టర్ కు వివరించారు.

E-పేపర్

మోంథా తుఫాన్ బాధితులకు ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ ఆధ్వర్యంలో 400కు పైగా ఆహారం ప్యాకెట్లు,వాటర్ పాకిట్లు దాదాపు150 కుటుంబాలకు పంపిణీ.

నంద్యాల పట్టణంలోని 26,27వ వార్డులలో మోంత తుఫాన్ తీవ్రత వల్ల వరద ముంపు ప్రాంత ప్రజలు పలుచోట్ల చాలా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు కాబట్టి నంద్యాల వాస్తవ్యులై ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ నంద్యాల ప్రాంతంలో వరద మంపు ప్రాంతంలో నివసిస్తున్న ప్రజలు ఇబ్బందులు గురవుతున్న విషయం తెలుసుకొని వెంటనే తాను నమ్మే సిద్ధాంతం ప్రార్థించే పెదవుల కన్నా.. సహాయం చేసే చేతులు మిన్న. అనే నినాదంతోనే ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించే మనసున్న వ్యక్తిగా ఆయన ఒక మంచి పేరు అందులో భాగంగా ఈ రోజు పట్టణంలోని స్థానిక 26,27వ వార్డు దేవనగర్,శ్యామ్ నగర్ లో వరద ముంపు వల్ల తీవ్ర ఇబ్బంది గురవుతున్నటువంటి కుటుంబాలను గుర్తించి వారికి అన్నదాన వితరణ చేయాలని అటువంటి ముఖ్య ఉద్దేశం తోటి ఈరోజు దాదాపు 400కు పైగా దాదాపు 150 కుటుంబాలకు ఆహార ప్యాకెట్లను మరియు వాటర్ ప్యాకెట్లను పంపిణీ చేశారు ఇంత మంచి కార్యక్రమంలో నంద్యాల జనసేన పార్టీ యువ నాయకులు చందు,సుందర్, రాంబాబులు తో పాటు 26,27 వ వార్డులో తెలుగుదేశం పార్టీ ఇన్చార్జి అయిన మల్లెల భాస్కర్ లు ముఖ్యఅతిథులుగా పాల్గొని వార్డులలోని వరదల వల్ల ఇబ్బందుల గురైనటువంటి కుటుంబాలను గుర్తించి ప్రతి ఇంటికి దాదాపు 150 కుటుంబాలకు ఆహార ప్యాకెట్లను చేర్చాలని తమ వార్డు లోని వరద ముంపుకు గురైన ప్రతి ఒక్క కుటుంబానికి సహాయం అందాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ కార్యక్రమంలో వారు అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందించారు. ఈ కార్యక్రమంలో వరదల వల్ల తీవ్ర ఇబ్బందికి గురైన కొన్ని కుటుంబాల వారు మాట్లాడుతూ ఈ విధంగా తమకు ఇలాంటి ఇబ్బందికర పరిస్థితుల్లో ఆహార ప్యాకెట్లను,నీటిని మా ఇంటి వద్దకు వచ్చి అందించడం వల్ల చాలా సంతోషకరమని ఆనందం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధులు పాల్గొన్న జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు సుందర్ రాంబాబులు మాట్లాడుతూ ఇలాంటి విపత్కర పరిస్థితులలో రాజకీయ, కులమతాలకతీతంగా ప్రతి ఒక్కరు వరద బాధితులను ఆదుకోవాల్సిన అవసరం ప్రతిఒక్కరి బాథ్యత ఉందన్నారు. ఈ సందర్భంగా వరద బాధితులను ఆదుకునేందుకు ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ తమ వంతు సహాయంగా నేడు 26, 27 వ వార్డు వరద ముంపుకు గురైన బాథిత ప్రజలకు అన్నదాన వితరణ కార్యక్రమం నిర్వహించారు.గోళ్ల రాజేష్ వారు వ్యాపార రిత్యా అందుబాటులో లేకపోయినప్పట్టికి నంద్యాల ప్రజలను దృష్టిలో ఉంచుకొని అన్నదాన వితరణ కార్యక్రమం ఏర్పాటు చేయడంపై గోళ్ల రాజేష్ ను జనసేన పార్టీ నాయకులు అభినందించారు. అదేవిధంగా గతంలో నుంచి కూడా నేటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తు వస్తున్నారని భవిష్యత్తులో ఇలాంటి ప్రజలకు ఉపయోగపడే విధంగా ప్రజలకు సహాయం అందించే సేవా కార్యక్రమాలు చేసిన వారికి ఎప్పుడు తాము తోడుగా ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో మీడియా సోదరులు రిపోర్టర్ నూర్ భాషా మాట్లాడుతూ ముందుగా ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న నంద్యాల జనసేన పార్టీ యువ నాయకులు చందు,సుందర్, రాంబాబు లకు మరియు 26, 27వ వార్డులు దేవ నగర్, శ్యాంనగర్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ భాస్కర్ కు కృతజ్ఞతలు,ధన్యవాదాలు తెలిపారు. తమ వార్డులో ఈ విధంగా ఆహార పంపిణీ కార్యక్రమం ఉందని అందుకు మీరు రావాలని పిలవగానే తమకు ఎన్నో కార్యక్రమాలు,పనులు ఉన్నప్పటికీ పిలవగానే ఈ కార్యక్రమంలో పాల్గొని అన్ని విధాల సహాయ సహకారాలు అందించిన జనసేన పార్టీ నాయకులు రాచమడుగు చందు,సుందర్, రాంబాబులకు,తెలుగుదేశం పార్టీ 26,27వ వార్డు ఇన్చార్జి తెలుగుదేశం పార్టీ నాయకులు భాస్కార్ కి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలిపారు ఈ సందర్భంగా నూర్ బాష మాట్లాడుతూ గతంలో నుంచి కూడా ప్రముఖ వ్యాపారవేత్త గోళ్ల రాజేష్ వారు కొన్ని వ్యాపార కారణాలవల్ల ఇక్కడికి రాలేకపోయారని అయినా కూడా నంద్యాల వాసి అయిన గోళ్ల రాజేష్ నంద్యాల పట్టణంలోని వరద ముంపు ప్రాంతాలలో తీవ్ర ఇబ్బంది గురవుతున్న ప్రజలకు తనవంతు సహాయంగా అన్నదాన వితరన కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావించి ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు తన ద్వారా చేయించడంపై నూర్ భాషా సంతోషం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో భగవంతుడు గొళ్ల రాజేష్ కి అన్ని విధాల ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ప్రసాదించాలని ఇంకా రానున్న రోజుల్లో ఎన్నో ప్రజలకు సేవా కార్యక్రమాలు చేయాలని అందుకు ఎల్లప్పుడూ తన వంతు బాధ్యతగా ఆయన వెంట ఉంటామని మీడియా మిత్రులు రిపోర్టర్ నూర్ భాషా తెలిపారు ఈ కార్యక్రమంలో సవారి,చిన్న,రవి, సంజీవరాయుడు,శివశంకర్,విజయ్,షాలీ,అల్తాఫ్, వార్డు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

విద్యార్థులకు ఒత్తిడిని లేని విద్య అందించాలి

ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు ఒత్తిడి లేని విద్యను అందించాలని రిటైర్డ్ ప్రధానోపాధ్యా యుడు చెవ్వాకుల సూర్యప్రకాశ్ రావు కోరారు. కార్పొరేట్ కళాశాలలో చదువుతూ ఒత్తిడికి గురై మరణించిన విద్యార్థి నాయకుడు యాలంగి సుమిత్ రామారావు జయంతిని రాజోలులో గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా సుమిత్ రామారావు చిత్రపటానికి పలువురు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

ఆంధ్రప్రదేశ్

నకిలీ మద్యం కేసు: ముగిసిన నిందితుల కస్టడీ

నకిలీ మద్యం కేసులో జనార్దన్, జగన్మోహనరావు కస్టడీ ముగియగా VJA కోర్టులో హాజరుపరిచారు. ఇద్దరి స్టేట్మెంట్లను అధికారులు న్యాయస్థానానికి సమర్పించారు. జోగి రమేశ్ చెబితేనే నకిలీ మద్యం తయారు చేశానని జనార్దన్ రావు చెప్పగా ఆ స్టేట్మెంట్ రికార్డ్ చేసినట్లు సమాచారం. అందుకు సంబంధించిన ఆడియో, వీడియో సైతం కోర్టుకు ఇచ్చినట్లు తెలుస్తోంది. వీరిద్దరినీ 7 రోజుల పాటు ఎక్సైజ్, సిట్ అధికారులు ప్రశ్నించారు

తిరుపతి

సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్

శ్రీకాళహస్తి పట్టణంలో 2 k రాన్ నిర్వహిస్తున్నట్లు శ్రీకాళహస్తి డిఎస్పీ నరసింహమూర్తి తెలిపారు.సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా యూనిటీ ఫర్ రన్ లో భాగంగా శుక్రవారం ఉదయం 6 గంటలకు శ్రీకాళహస్తి పట్టణం నందు గల ద స్కూల్ ఆవరణ నుంచి వి ఎం సి సర్కిల్, గాలిగోపురం, సూపర్ బజార్,పెళ్లి మండపం, కుమార్ స్వామి తిప్ప,బస్టాండ్ వరకు ఈ కార్యక్రమం ఉంటుంది.ఈ కార్యక్రమం నందు ప్రజలు,విద్యార్థిని విద్యార్థులు,క్రీడాకారులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.

చిత్తూరు

రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు గ్రoడ్రాజుపల్లె విద్యార్థి యాసిర్

పలమనేరు నియోజకవర్గం, గంగవరం మండలానికి చెందిన గండ్రాజుపల్లె 8వ తరగతి విద్యార్థి ఎస్. యాసిర్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలకు ఎంపిక అయ్యారని ప్రధానోపాధ్యాయులు నాగరాజు తెలిపారు. జిల్లా స్థాయిలో గురువారం నిర్వహించిన సెపక్ టక్రా అనే అంతర్జాతీయ క్రీడా పోటీలకు అండర్-14 కేటగిరీ తరపున ఎంపికైనందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నాగరాజ, వ్యాయమ ఉపాధ్యాయులు రామకృష్ణ, ఉపాధ్యాయ బృందం విద్యార్థియాసిర్ కు హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాగా ఈ పోటీలు జిల్లాలోని ఎస్.ఆర్.పురం మండలం గంగమ్మగుడి జెడ్పీ హైస్కూల్ లో నిర్వహించారు. విద్యార్థి యాసిర్ కృషి, పట్టుదలతో విజయాన్ని సాధించడం పట్ల ఆ పాఠశాల కుటుంబం గర్వంగా భావిస్తోంది. తదుపరి రాష్ట్ర స్థాయి సెపక్ టక్రా పోటీలు నవంబర్ 2, 3, మరియు 4 తేదీలలో అనంతపురంలో జరగనున్నాయి. యాసిర్ ఈ పోటీల్లో కూడా ప్రతిభ కనబరచాలని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

విశాఖపట్నం

జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ నిధులను నరేంద్ర మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పెట్టుబడులు పె ట్టడాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా

విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:- దేశంలో ప్రతిష్టాత్మకమైన జీవిత బీమా సంస్థ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రభుత్వ రంగ సంస్థ నిధులను నరేంద్ర మోడీ ప్రభుత్వం దొడ్డిదారిన అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీస్ లో పెట్టుబడులు పె ట్టడాన్ని వ్యతిరేకిస్తూ భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ విశాఖ జిల్లా సమితి ఆధ్వర్యంలో జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి పాత్రపల్లి చంద్రశేఖర్ పాల్గొని మాట్లాడుతూ 2023 హిండెన్బర్గ్ నివేదిక 2024 అమెరికా ఇన్వెస్టర్స్ ను మోసం చేసి కాంట్రాక్టులు కాజేయడానికి ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో అక్కడ న్యాయస్థానాలు నోటీసులు పంపించడం అలాగే 2025లో ఎల్ఐసి పెట్టుబడులు 3.9 బిలియన్ డాలర్లు అంటే అక్షరాల 35 వేల కోట్ల రూపాయలు పెట్టుబడిని ఎల్ఐసి అదాని గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో పెట్టడం చాలా దుర్మార్గమైన చర్యని దీనిలో భారత ఆర్థిక మంత్రిత్వ శాఖ నీతి అయోగ్ ఎల్ఐసి వీళ్ళ ముగ్గురు కలిపి సంయుక్తంగా అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి అధానీని నిలబెట్టడం కోసం అంతర్జాతీయ రుణ దాతలు అంతర్జాతీయ బ్యాంకు నుండి అప్పులు పొందడం కోసం ఈరోజు ఎల్ఐసి పెట్టుబడులను పెట్టడం జరిగిందని వాషింగ్టన్ పోస్ట్ స్పష్టమైన వేదిక యంత్రాలతో ప్రచురించడం జరిగిందని అన్నారు ఒకవైపు నరేంద్ర మోడీ ప్రధాని బాధ్యతలు చేపట్టిన తర్వాత తన మిత్రుడైన ఆదానీ కోసం ఈ దేశంలో సకల సంపదలను అదాని కి కట్టబెట్టే ప్రయత్నం జరుగుతోంది ఒకవైపు వాడరేవులు విమానరంగం విద్యుత్తు రైల్వేలు సకల సంపదని ఈరోజు ఆదానికి కట్టబెట్టే ప్రయత్నం చేయడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఆన్నారు ఇది ఆశ్రిత పెట్టుబడిదారీ విధానానికి తెర లేపడం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు వెంటనే ఈ కుంభకోణం పైన సంయుక్త పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించి తగు చర్యలు తీసుకోవాలని సిపిఐ విశాఖ జిల్లా డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కే సత్యాంజనేయ ఎం మన్మధరావు ఆర్ శ్రీనివాసరావు సీఎం క్షేత్రపాలరెడ్డి సిపిఐ జిల్లా సమితి సభ్యులు పడాల గోవింద్ aisf జిల్లా కార్యదర్శి యు నాగరాజు, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు వై రాంబాబు ఆంధ్రప్రదేశ్ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షులు వనజాక్షి, మహిళా సమాఖ్య నాయకులు పుష్పలత, పద్మ, రమణమ్మ, పార్టీ సభ్యులు మీసాల శ్రీనివాసరావు, ఆడారి ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు

తెలంగాణ

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన : సీఎం

నకిరేకల్ :అక్టోబర్ (పున్నమి ప్రతినిధి ) మోంథా తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని ప్రాణ,పశు, ఆస్తి నష్టం, వంటివి జరగకుండా చూడాలని సీఎం ఏ రేవంత్ రెడ్డి, జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు, ఇతర అధికారులను ఆదేశించారు. హైదరాబాదు నుండి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ఇతర ఉన్నతాధికారులతో కలసి రాష్ట్రంలోని మంత్రులు, జిల్లా కలెక్టర్లు,ఎస్పీలు, జిల్లా ఇతర అధికారులతో తుపాను ప్రభావం పై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ కు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ సంబంధిత శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.