Tuesday, 7 April 2026

Blog

కాకినాడ

శ్రీ మరిడమ్మ అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో పూజ

పున్నమి న్యూస్, పెద్దాపురం 31/10 శ్రీ మరిడమ్మ అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో శుక్రవారం ఉదయం వేద పండితులు ఆలయ మండపంలో కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కే. విజయ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో పూజ నిర్వహిస్తారని తెలిపారు. భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవచ్చు అన్నారు. ఆలయ వేద పండితులు i.v ప్రసాద్ శర్మ,s.v. శాస్త్రి, శంకర్ శాస్త్రి అసాధులు రాయ రామచంద్ర ప్రసాద్,రాయ విజయ కుమార్, సిబంది వెంకట రమణ, లోవ రాజు, భక్తులు , పెద్దాపురం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రామ్ కుమార్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కాకి భార్గవి పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

తూర్పు గోదావరి

కూటమి ప్రభుత్వ అభూత కల్పనలు ప్రజల అర్థం చేసుకున్నారు

కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత. “వైయస్సార్సీపి సంస్థాగత బలోపేతం” -మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వాడ వాడలా కోటి సంతకాల సేకరణ. -కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత. -నిడదవోలు మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్. పెరవలి, అక్టోబర్ 30 : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నేతృత్వంలో సంస్థాగత పటిష్టవంతంగా ప్రజలలో మమేకం అయిందని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, అభూత కల్పలను ప్రజలు అర్థం చేసుకున్నారని నిడదవోలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. నిర్మాణాత్మకంగా మనం ప్రజల ముందుకు వెళ్లి మళ్లీ జగనన్నను సీఎం చేయాలన్నారు. రానున్నది జగనన్న కార్యకర్తల ప్రభుత్వం అని గుర్తించాలన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రజల్లో మమేకమై పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి జగనన్నను పూర్వ వైభవం తీసుకొచ్చి జగనన్నను మళ్లీ సీఎంను చేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆ దిశగా పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. త్వరలో ప్రతి ఒక్కరికి పార్టీ ఐడి కార్డులు సైతం ఇస్తుందని చెప్పారు. పెరవలి, ముక్కామల గ్రామాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కోటి సంతకాల కార్యక్రమానికి సంబంధించి పార్టీ శ్రేణులతో పెరవలి గ్రామంలో నిడదవోలు మాజీ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్చార్జ్ జి శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలకు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగనన్న ప్రభుత్వంలో నిర్వహించిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కి ప్రజలను దారుణంగా మోసం చేసిందనే విషయాన్ని ప్రజలు గుర్తించారని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ముక్కామల గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వివరించారు. స్థానికులు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చి గవర్నర్ కి ఇచ్చే కోటి సంతకాల సేకరణలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోటి సంతకాల్లో భాగంగా సంతకాలు చేసి సెల్ఫోన్ నెంబర్లు సైతం వేయడం విశేషత సంతరించుకుంది. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ..రచ్చబండ కార్యక్రమాలను వివరిస్తూ కోటి సంతకాల కార్యక్రమం పై ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయుడులు పెరవలి లో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా పార్టీ శ్రేణులంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి వైఎస్ఆర్సిపి సంస్థగత పటిష్టతకు పునరంకితం కావాలని ఈ సందర్భంగా జి శ్రీనివాస్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

నేడు CM సమావేశo

*నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన*మ.3 గంటలకు పార్టీ కార్యాలయానికి చంద్రబాబుటీడీపీ నేతలతో సమావేశంకానున్న సీఎం చంద్రబాబుతిరువూరు వ్యవహారంతో పాటు…పలు నియోజకవర్గాల్లో నేతల ఆధిపత్య పోరుపై చర్చకూటమి పార్టీల సమన్వయం, టీడీపీ కమిటీలపైనా చర్చ.

తిరుపతి

శ్రీకాళహస్తి లో ఐక్యతా పరుగు

సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శ్రీకాళహస్తి పట్టణంలో పోలిస్ శాఖ ఆధ్వర్యంలో 2 కె రన్ నిర్వహించడం జరిగింది. ఈ రన్ కార్యక్రమాన్ని డిఎస్పీ నరసింహ మూర్తి జెండా ఊపి ప్రారంభించారు.ముందుగా అందరి దగ్గర ఐక్యత ప్రతిజ్ఞ చేయించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి దేశం మొత్తానికి చాలా ప్రత్యేకమైన సందర్భం.సర్దార్ పటేల్ ఆధునిక కాలంలో దేశంలో ని గొప్ప వ్యక్తులలో ఒకరు.పరిశుభ్రత మరియు సుపరిపాలనకు ఆయన అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.దేశ ఐక్యత మరియు సమగ్రత కోసం ఆయన ఎంతో కృషి చేశారని సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి అయిన అక్టోబర్ 31న దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్న ఐక్యత పరుగులో భాగంగా శ్రీకాళహస్తిలో 2 కె రన్ నిర్వహించడం జరిగిందన్నారు.యువత డ్రక్స్ కు దూరంగా ఉండాలని అన్నారు.సైబర్ నేరాలను ఎదుర్కోవడం లో ప్రజలకు అండగా ఉంటామని అన్నారు. ఐక్యతతోనే అభివృద్ధి సాధ్యమని వారన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ శాఖ సిబ్బంది, ఉపాధ్యాయులు,విద్యార్థులు,ప్రజలు,యువత పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

🚨ప్రతి సంవత్సరం ఈ–KYC తప్పనిసరి!🚨

కేంద్ర ప్రభుత్వ గ్యాస్ సబ్సిడీ పొందాలంటే ప్రతి సంవత్సరం ఈ–KYC చేయించుకోవాలి అని ఆయిల్ కంపెనీలు స్పష్టం చేశాయి. ఈ–KYC చేయడానికి మార్గాలు: 1️⃣ ఇండియన్ ఆయిల్ / హెచ్‌పీ / భారత్ పెట్రోలియం యాప్ ద్వారా 2️⃣ గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ ఆఫీస్‌లో 3️⃣ సిలిండర్ డెలివరీ చేసే బాయ్ వద్ద ఉన్న యాప్ ద్వారా సేవ ఉచితం | బయోమెట్రిక్ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి ప్రతి ఆర్థిక సంవత్సరంలో ఒకసారి చేయాలి. సంవత్సరానికి గరిష్టంగా 9 సిలిండర్లకే సబ్సిడీ, అందులో 8వ, 9వ సిలిండర్ల సబ్సిడీ KYC పూర్తి అయ్యే వరకు నిలిపి వేయబడుతుంది. మార్చి 31లోపు పూర్తి చేయకపోతే సబ్సిడీ రద్దవుతుంది. సరఫరా కొనసాగుతుంది కానీ రాయితీ రాదు.

తిరుపతి

కేవీబీపురం రెవెన్యూలో కాసుల కక్కుర్తి*

*నాయకులకు కొమ్ముకాస్తూ*,రైతుల కడుపులు కొడుతున్న అధికారులు _ *కాసుల కోసం పట్టా* భూములనే మార్చేస్తున్న వైనం _ *నెల వ్యవధిలో మూడు అక్రమ పాసుబుక్కు మార్పు ఘటనలు* _ కేవీబీపురం *రెవెన్యూలొ కుల సేవలు* సాగుతున్నాయా..!! _ గత మూడు నెలలుగా *కేవీబీపురం తహసీల్దార్* కార్యాలయం *పై మిన్నం టుతున్న ఆరోపణలు* _ *పాసుబుక్కులు మార్చేసి, ఆర్ డి ఓ కోర్టులో తేల్చుకోవాలని ఉచిత సలహా* _ లంచాలకు పాలుమారి, రైతుల గోష్ట పోసుకుంటున్నారా..! _ ఇన్ని ఘటనలు జరుగుతున్నా పై స్థాయి *అధికారులు నోరు మెదపరు* ఎందుకని.. 🤔 _ *అధికారులను తప్పు ధారి* పట్టిస్తున్న ఆ నాయకుడు ఎవరూ..! _ నాయకుడి మాట దాటని, *రైతుల కడుపు కొడుతున్న అధికారులు* ఎవరూ..,?? _ *తప్పుడు* దారుల్లో పరుగులు పెడుతున్న *VRO లపై చర్యలేవి..?* _ ఫిర్యాదులు అందినా *అధికారులు ఎందుకు స్పందించడం లేదు.?* *_ భాదితుల గోశా, అధికారి మాట, జిల్లా అధికారి వివరణ* *….. ✍️. … సూన్ 🫡* *కేవీబీపురం రెవెన్యూలో ఇది సంగతి* రెవెన్యూ అధికారుల ద్వారా మీకు అన్యాయం జరిగి ఉంటే… ఆధారాలతో సహా మా దృష్టికి తీసుకురండి.. Call… 9701127432

Blog

ఆల్ ఇండియా ఐడియల్ టీచర్స్ అసోసియేషన్ (AIITA) – నంద్యాల యూనిట్ నూతన కార్యవర్గం ఎన్నిక

నంద్యాల చాంద్ బాడ ,క్రాంతి రేఖ గ్రంథాలయంలో, రాష్ట్ర అడ్వైజరీ కౌన్సిల్ సభ్యులు షబ్బీర్ హుస్సేన్ పర్యవేక్షణ లో నంద్యాల జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ సలీం, ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఇర్ఫాన్, కోశాధికారి రహీం ఆధ్వర్యంలో నంద్యాల యూనిట్ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు కార్యవర్గం ఈ విధంగా ఉంది అధ్యక్షులు: B. కరీముల్లా ఉపాధ్యక్షులు: ఖాజీ జమీల్ అహ్మద్ ప్రధాన కార్యదర్శి: SP రసూల్ మహిళా కన్వీనర్: M. రుక్సానా సహ-కన్వీనర్: S.సోఫియా జాయింట్ సెక్రటరీ: సయ్యద్.జమీల్ కోశాధికారి: హాఫిజ్ షోయజుజ్జామాన్ ఈ సందర్భంగా రాష్ట్ర అడ్వైజరి కౌన్సిలింగ్ మెంబర్స్, జిల్లా అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి మరియు కోశాధికారి నూతన కార్యవర్గానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారు మాట్లాడుతూ, AIITA అనేది దేశవ్యాప్తంగా ఉపాధ్యాయుల ద్వారా “నాణ్యతతో కూడిన విలువల ఆధారిత విద్య” “క్వాలిటీ ఎడ్యుకేషన్ విత్ వ్యాల్యూస్” కోసం అహర్నిశం కృషి చేస్తుందని పేర్కొన్నారు స్థానిక అధ్యక్షులు బి. కరీముల్లా మాట్లాడుతూ – “AIITA విద్యార్థులలో నైతికతను, ఉపాధ్యాయులలో వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించడానికి దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సంస్థ ఆశయ సాధనలో నా వంతు కృషి చేస్తాను నంద్యాల యూనిట్ బలోపేతానికి పూర్తి సహకారం అందిస్తాను” అని తెలిపారు.

E-పేపర్

కుందు బ్రిడ్జి పై జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను పరిశీలించిన ఎన్ఎండి ఫయాజ్

మొంథా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న , కుందు బ్రిడ్జి పై జరుగుతున్న రోడ్డు మరమ్మత్తు పనులను టిడిపి రాష్ట్ర యువ నాయకులు ఎన్ఎండి ఫయాజ్ ఈరోజు స్వయంగా వెళ్లి పరిశీలించారు ఈ సందర్భంగా ఎన్ఎండి ఫయాజ్ మాట్లాడుతూ మొంథా తుఫాన్ ఉధృతి వల్ల కుందు బ్రిడ్జి పైనుంచి భారీగా నీరు ప్రవహించడంతో రోడ్డు తీవ్రంగా దెబ్బతిందని . దీంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని మంత్రి ఫరూక్ గారి ఆదేశాల మేరకు బ్రిడ్జి పై రోడ్డు మరమ్మత్తు పనులను స్వయంగా పర్యవేక్షించడం జరిగిందని . ప్రజలకు రాకపోకలకు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు దెబ్బతిన్న ఈ రోడ్డును శరవేగంగా మరియు నాణ్యతతో మరమ్మత్తులు పూర్తి చేయడం జరుగుతుందన్నారు ప్రజలు ఎదుర్కొంటున్న ఈ సమస్యను తక్షణమే పరిష్కరించడం ద్వారా నందమూరి నగర్ , వైయస్సార్ నగర్ మరియు ఇతర ప్రాంతాల ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం సులభతరం అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో తాటికొండ బుగ్గ రాముడు , మరాఠీ సూరి , తాటికొండ మహేష్ , ఎమ్మార్వో శ్రీను , డిప్యూటీ ఎమ్మార్వో సంజీవ మరియు వార్డు ప్రజలు పాల్గొన్నారు

తిరుపతి

తుఫాను బాధిత ప్రాంతాలను పరిశీలించిన శ్రీకాళహస్తి ఎమ్మార్వో

మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాలకు శ్రీకాళహస్తి పట్టణంలోని నాలుగో వార్డ్ నందు గల ఏనుగులగుంట ప్రాంతం ముంపుకు గురికావడంతో అనేక కుటుంబాలు వారు నివాసం ఉంటున్న ఇళ్లను కోల్పోవడం జరిగింది.ఈ ప్రాంతాన్ని స్థానిక ఎమ్మార్వో గురువారం సందర్శించారు.ఈ సందర్భంగా భాగంగా వారు మాట్లాడుతూ తుఫాన్ కారణంగా ఇళ్లను కోల్పోయినటువంటి బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని తెలియజేశారు. ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి బాధిత కుటుంబాలకు అవసరమైన సహాయ సహకారాలను అందించడం జరుగుతుందని ఎమ్మార్వో భరోసా ఇవ్వడం జరిగింది.ఈ కార్యక్రమంలో నాలుగో వార్డ్ ఇంచార్జ్ ఉలస రామ్మూర్తి,నాలుగో వార్డ్ బూత్ ఇంచార్జ ఉలస సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉమెన్స్ వన్డే వరల్డ్‌కప్ 2025 ఆస్ట్రేలియాపై భారత్ విజయం – ఫైనల్‌కు దూసుకెళ్లిన టీమ్ఇండియా

మహిళల వన్డే వరల్డ్‌కప్ 2025లో భారత జట్టు అద్భుత చరిత్ర సృష్టించింది. ముంబయిలో జరిగిన రెండో సెమీఫైనల్‌లో బలమైన ఆస్ట్రేలియా జట్టును 5 వికెట్ల తేడాతో ఓడించి ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా జట్టు 49.5 ఓవర్లలో 338 పరుగులు చేసింది. ఫీబీ లిచ్‌ఫీల్డ్ 93 బంతుల్లో 119 పరుగులతో మెరిసింది. భారత బౌలర్ శ్రీ చరణి 10 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. తదుపరి లక్ష్యాన్ని చేధించేందుకు బరిలోకి దిగిన భారత మహిళా జట్టు అద్భుత బ్యాటింగ్ ప్రదర్శించింది. జెమిమా రోడ్రిగ్స్ 134 బంతుల్లో అజేయంగా 127 పరుగులు చేయడం ద్వారా జట్టును విజయతీరాలకు చేర్చింది. ఆమెకు తోడుగా ఇతర బ్యాటర్లు సమర్థంగా ఆడారు. చివరికి భారత్ 48.3 ఓవర్లలో 341/5 పరుగులు సాధించి 5 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో భారత్ మహిళల వరల్డ్‌కప్‌ ఫైనల్‌లోకి అర్హత సాధించింది. ఫైనల్ లో సౌత్ ఆఫ్రికా పై ఢీ , దేశవ్యాప్తంగా అభిమానులు ఆనందంతో ఉత్సాహం వ్యక్తం చేస్తున్నారు. జెమిమా రోడ్రిగ్స్‌ అజేయ శతకం భారత్ విజయానికి కీలకం అయింది. ఇప్పుడు భారత మహిళా జట్టు చరిత్రాత్మక కప్ విజయం దిశగా అడుగులు వేస్తోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.