Tuesday, 7 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరిలో ఘనంగా మాజీ జడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకలు. 🔸చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸“చెంచల్ బాబు యాదవ్ గారు ప్రజాసేవలో ఆదర్శప్రాయుడు” అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రశంసలు..!

🔸ఉదయగిరిలో ఘనంగా మాజీ జడ్పీ చైర్మన్ పొన్నెబోయిన చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకలు. 🔸చెంచల్ బాబు యాదవ్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్న ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్..! 🔸“చెంచల్ బాబు యాదవ్ గారు ప్రజాసేవలో ఆదర్శప్రాయుడు” అని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ ప్రశంసలు..! 🔸రాజకీయరంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్ష..! అక్టోబర్ 31న ఉదయగిరి మండల కేంద్రంలో మాజీ జడ్పీ చైర్మన్, తెలుగు దేశం పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ గౌరవనీయులు శ్రీ పొన్నెబోయిన చెంచల్ బాబు యాదవ్ గారి జన్మదిన వేడుకలు అభిమానుల నడుమ ఘనంగా, ఉత్సాహభరితంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు, చెంచల్ బాబు యాదవ్ గారికి పుష్పగుచ్ఛం అందించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ గారు మాట్లాడుతూ — చెంచల్ బాబు యాదవ్ గారు రాజకీయరంగంలో విశేష సేవలందించిన నాయకుడని, ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఎల్లప్పుడూ ముందుండే వ్యక్తిగా గుర్తింపు పొందారని తెలిపారు. ప్రజా సేవ పట్ల ఆయనకు ఉన్న అంకితభావం, యువ నాయకులకు ప్రేరణగా నిలుస్తుందన్నారు. అలాగే చెంచల్ బాబు యాదవ్ గారు భవిష్యత్తులో రాజకీయరంగంలో మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు. ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో నిండు నూరేళ్లు జీవించి ప్రజలకు మరింత సేవ చేయాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక టిడిపి నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని కేక్ కట్ చేయించి పూలమాలలతో సన్మానించడం వంటి కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మైనర్ బాలికపై జనసేన నేత వేధింపులు

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐ.పోలవరం లో ఆరో తరగతి చదువుతున్న మైనర్ బాలికపై లైంగిక వేధింపులు.తన కూతురి పట్ల అసభ్య కరంగా ప్రవర్తిస్తున్నాడని స్కూల్లో గతంలో పిటిఐగా పనిచేస్తున్న వెంకటకృష్ణ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన మైనర్ బాలిక తల్లి.ప్రస్తుతం జనసేనలో యాక్టివ్ గా ఉన్న వెంకటకృష్ణ. చాక్లెట్స్ కొంటానని చెప్పి మైనర్ బాలికను రూమ్ కి తీసుకుని వెళ్లి అసభ్యకరంగా ప్రవర్తించే వాడని ఫిర్యాదు… పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు… చిన్నారులను లైంగికంగా వేధించే వాళ్లను చంపేయాలని కోరుతున్న మైనర్ బాలిక కుటుంబ సభ్యులు…

భక్తి

నాగుపాముకే పూజలు చేసిన భక్తుడు…..చూస్తూ ఉండి పోయిన నాగుపాము…..కాస్త అటు ఇటు జరిగితే…ఇక అంతే*

ఏలూరు జిల్లా:పున్నమి ప్రతినిధి జంగారెడ్డిగూడెం పట్టణంలో కార్తీక మాసం సందర్భంగా అరుదైన ఘటన చోటుచేసుకుంది. పెరంపేట రోడ్డులోని బాట గంగానమ్మ ఆలయం సమీపంలో వేప చెట్టు వద్ద నాగుపాము ప్రత్యక్షమైంది. దీంతో భక్తులు నేరుగా పాముకే పూజలు చేశారు. ఈ సంఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Video: https://youtube.com/shorts/Lyn2XS45VqE?si=ZTa6LNpLtF1Twgix

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తుపాను నష్టాలను ‘మన మిత్ర’ ద్వారా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే అవకాశం

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో తుపాను ప్రభావిత ప్రజలు తమ సమస్యలను నేరుగా ప్రభుత్వానికి తెలియజేయడానికి కొత్త అవకాశం లభించింది. కూటమి ప్రభుత్వం వాట్సాప్‌లో ప్రారంభించిన ‘మన మిత్ర’ సేవ ద్వారా తుపాను నష్టాల వివరాలు పంపే వీలు కల్పించింది. ప్రజలు తమ ప్రాంతంలో జరిగిన నష్టం, అవసరాలను ఫోటోలు లేదా సందేశాల రూపంలో పంపగలరు. అందిన సమాచారం సంబంధిత శాఖలకు నేరుగా చేరుతుందని అధికారులు తెలిపారు. ప్రజల సమస్యలు వేగంగా పరిష్కారమవుతాయన్న నమ్మకంతో ప్రభుత్వం ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది.

జోగులాంబ గద్వాల

ఛలో హైదరాబాద్ నవంబర్ 1న – దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని విజయవంతం చేద్దా, పోగుల రాజేష్ మాదిగ MRPS జిల్లా కన్వీనర్

ఛలో హైదరాబాద్ నవంబర్ 1న – దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని విజయవంతం చేద్దా, పోగుల రాజేష్ మాదిగ MRPS జిల్లా కన్వీనర్ జోగులాంబ గద్వాల జిల్లా (పున్నమి ప్రతినిధి)అక్టోబర్ 31 : సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే గవాయ్ పై జరిగిన దాడికి నిరసనగా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు,పద్మశ్రీ గ్రహీత మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ అన్న గారి ఆదేశానుసారం రేపు నవంబర్ 1న తలపెట్టిన ఛలో హైదరాబాద్ ఆత్మగౌరవ నిరసన ర్యాలీని ఉద్దేశించి ఎమ్మార్పీఎస్ జిల్లా కన్వీనర్ పోగుల రాజేష్ మాదిగ మాట్లాడుతూ….ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ నేతృత్వంలో ఛలో హైదరాబాద్ నవంబర్ 1న దళితుల ఆత్మగౌరవ నిరసన ర్యాలీని విజయవంతం చేయుటకై జిల్లాలోని ఎమ్మార్పీఎస్,ఎంఎస్పి,అనుబంధ సంఘాల నాయకులు,ప్రజా సంఘాలు,మానవత వాదులు, కార్యకర్తలు,ప్రతి దళిత సోదరుడు పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు.

ఆంధ్రప్రదేశ్

కృష్ణాజిల్లా నిరుద్యోగులకు శుభవార్త – కలెక్టర్ డీకె బాలాజీ

పత్రికా ప్రకటన నవంబర్ 1న కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ నందు జాబ్ మేళా.. -నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి…-జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు గాను ది.01.11.2025 శనివారం నాడు ఉదయం 09:00 గంటలకు కృష్ణాజిల్లా ,పామర్రు మండలం కురుమద్దాలిలోని రూరల్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్(కమ్యూనిటీ హాల్) నందు “జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీ డి.కె.బాలాజీ,ఐఏఎస్ గారు తెలియజేశారు.. ఈ జాబ్ మేళాలో, జపనీస్ MNC – NS ఇన్స్ట్రుమెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్, అమెరికన్ MNC – కోల్గేట్ పల్మోలివ్ లిమిటెడ్, ఫాక్స్కాన్ MNC, టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్, PVS లాబొరేటరీస్ లిమిటెడ్, సంతోష్ ఆటోమోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, ఇన్నోవ్సోర్స్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసి, క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ లిమిటెడ్, వరుణ్ గ్రూప్, శ్రీనివాస ట్రాక్టర్స్(ఎస్కార్ట్స్ లిమిటెడ్)వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి.విక్టర్ బాబు గారు మరియు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ గారు తెలిపారు. ఈ కంపెనీలలో గల ఉద్యోగాలకు టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.ఫార్మసి పూర్తిచేసిన 18 నుండి 35 సంవత్సరాల లోపు యువత అర్హులని, ఎంపిక అయిన వారికి వేతనము మరియు ఇతర సౌకర్యాలతో కూడిన ఉద్యోగ అవకాశాలు కలవని, నవంబర్ 1న నిర్వహించబోయే జాబ్ మేళాకు హాజరయిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహించడం ద్వారా సదరు ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నట్లు తెలిపారు. Sd/-డి. విక్టర్ బాబుడిజిగ్నేటెడ్ ఆఫీసర్/ఉపాధి కల్పన అధికారికృష్ణా జిల్లా dr పి.నరేష్ కుమార్జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారికృష్ణా జిల్లా*పత్రికా ప్రకటన*

తిరుపతి

*ఇందిరాగాంధీకి గారికి ఘన నివాళులు అర్పించిన తలపా దామోదరం రెడ్డి*

భారతరత్న, భారతదేశ తొలి మహిళా ప్రధాని స్వర్గీయ ఇందిరాగాంధీ వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన కాంగ్రెస్ శ్రేణులు. శ్రీకాళహస్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త తలపా దామోదరం రెడ్డి మాట్లాడుతూ అతి చిన్న వయసులోనే భారతదేశ తొలి మహిళా ప్రధానిగా, భారతరత్న పొందిన తొలి మహిళగా భారతదేశ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి ముఖ్యనేత, దేశంలో పేదరిక నిర్మూలన కొరకు 20 సూత్రాల పథకం అమలు చేసిన ఏకైక వ్యక్తి, బ్యాంకులను జాతీయ చేసి దేశ ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టిన గొప్ప నాయకురాలు, దేశంలోని ఆనాడు ఉన్నటువంటి ఎన్నో సమస్యలకు పరిష్కారం కనుగొన్న ఉక్కు మహిళ ఇందిరా గాంధీ గారు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి మండల అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, పట్టణ యువజన అధ్యక్షులు ఆంటోనీ, శ్రీకాళహస్తి మండలం యువజన అధ్యక్షులు నవీన్, నాగరాజు,మహేష్, అరుణ్, సారధి, తరుణ్ తదితరులు పాల్గొన్నారు.

కాకినాడ

శ్రీ మరిడమ్మ అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో పూజ

పున్నమి న్యూస్, పెద్దాపురం 31/10 శ్రీ మరిడమ్మ అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో శుక్రవారం ఉదయం వేద పండితులు ఆలయ మండపంలో కుంకుమ పూజ నిర్వహించారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి కే. విజయ లక్ష్మి మాట్లాడుతూ ప్రతి శుక్రవారం అమ్మవారికి బంగారు,వెండి పుష్పాలతో పూజ నిర్వహిస్తారని తెలిపారు. భక్తులు అమ్మవారికి కుంకుమ పూజలు చేయించుకోవచ్చు అన్నారు. ఆలయ వేద పండితులు i.v ప్రసాద్ శర్మ,s.v. శాస్త్రి, శంకర్ శాస్త్రి అసాధులు రాయ రామచంద్ర ప్రసాద్,రాయ విజయ కుమార్, సిబంది వెంకట రమణ, లోవ రాజు, భక్తులు , పెద్దాపురం బీజేపీ టౌన్ ప్రెసిడెంట్ బొలిశెట్టి రామ్ కుమార్, బీజేపీ వైస్ ప్రెసిడెంట్ కాకి భార్గవి పాల్గొన్నారు. పూజ అనంతరం భక్తులకు ప్రసాద వితరణ చేశారు.

తూర్పు గోదావరి

కూటమి ప్రభుత్వ అభూత కల్పనలు ప్రజల అర్థం చేసుకున్నారు

కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత. “వైయస్సార్సీపి సంస్థాగత బలోపేతం” -మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వాడ వాడలా కోటి సంతకాల సేకరణ. -కూటమి ప్రభుత్వంపై అన్ని వర్గాల్లో వ్యతిరేకత. -నిడదవోలు మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు, పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్. పెరవలి, అక్టోబర్ 30 : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జగనన్న నేతృత్వంలో సంస్థాగత పటిష్టవంతంగా ప్రజలలో మమేకం అయిందని, కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు, అభూత కల్పలను ప్రజలు అర్థం చేసుకున్నారని నిడదవోలు నియోజకవర్గ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పట్ల అన్ని వర్గాల్లో వ్యతిరేకత వచ్చిందన్నారు. నిర్మాణాత్మకంగా మనం ప్రజల ముందుకు వెళ్లి మళ్లీ జగనన్నను సీఎం చేయాలన్నారు. రానున్నది జగనన్న కార్యకర్తల ప్రభుత్వం అని గుర్తించాలన్నారు. ప్రజా సమస్యల పట్ల ప్రజల్లో మమేకమై పార్టీకి పూర్వ వైభవం తీసుకొచ్చి జగనన్నను పూర్వ వైభవం తీసుకొచ్చి జగనన్నను మళ్లీ సీఎంను చేసినప్పుడే ప్రజలకు న్యాయం జరుగుతుందని ఆ దిశగా పార్టీ శ్రేణులంతా కృషి చేయాలని పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ అన్నారు. త్వరలో ప్రతి ఒక్కరికి పార్టీ ఐడి కార్డులు సైతం ఇస్తుందని చెప్పారు. పెరవలి, ముక్కామల గ్రామాలలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. కోటి సంతకాల కార్యక్రమానికి సంబంధించి పార్టీ శ్రేణులతో పెరవలి గ్రామంలో నిడదవోలు మాజీ శాసనసభ్యులు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిడదవోలు నియోజకవర్గ ఇన్చార్జ్ జి శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమాలకు రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరు శ్రీనివాస్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. జగనన్న ప్రభుత్వంలో నిర్వహించిన ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను ఇప్పుడు ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని, కూటమి ప్రభుత్వం ఎన్నో హామీలు ఇచ్చి వాటిని తుంగలో తొక్కి ప్రజలను దారుణంగా మోసం చేసిందనే విషయాన్ని ప్రజలు గుర్తించారని ఈ సందర్భంగా మాజీ శాసనసభ్యులు జి శ్రీనివాస్ నాయుడు అన్నారు. ముక్కామల గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరించడాన్ని వివరించారు. స్థానికులు స్వచ్ఛందంగానే ముందుకు వచ్చి గవర్నర్ కి ఇచ్చే కోటి సంతకాల సేకరణలో భాగంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కోటి సంతకాల్లో భాగంగా సంతకాలు చేసి సెల్ఫోన్ నెంబర్లు సైతం వేయడం విశేషత సంతరించుకుంది. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ..రచ్చబండ కార్యక్రమాలను వివరిస్తూ కోటి సంతకాల కార్యక్రమం పై ఈ సందర్భంగా శ్రీనివాస్ నాయుడులు పెరవలి లో జరిగిన సమావేశంలో పార్టీ శ్రేణులతో మాట్లాడారు. పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చే విధంగా పార్టీ శ్రేణులంతా రెట్టింపు ఉత్సాహంతో పనిచేసి వైఎస్ఆర్సిపి సంస్థగత పటిష్టతకు పునరంకితం కావాలని ఈ సందర్భంగా జి శ్రీనివాస్ నాయుడు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో స్థానిక నాయకులు, ఎంపీటీసీలు జడ్పీటీసీలు సర్పంచులు కార్యకర్తలు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

నేడు CM సమావేశo

*నేడు విజయవాడలో సీఎం చంద్రబాబు పర్యటన*మ.3 గంటలకు పార్టీ కార్యాలయానికి చంద్రబాబుటీడీపీ నేతలతో సమావేశంకానున్న సీఎం చంద్రబాబుతిరువూరు వ్యవహారంతో పాటు…పలు నియోజకవర్గాల్లో నేతల ఆధిపత్య పోరుపై చర్చకూటమి పార్టీల సమన్వయం, టీడీపీ కమిటీలపైనా చర్చ.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.