Tuesday, 7 April 2026

Blog

తిరుపతి

జనసేన పర్యటనలో గిరిజనుల సమస్యలు తెలుసుకుంటున్న పేట బ్రదర్స్ మిత్రబృందం*

* జనసేన పర్యటనలో భాగంగా తొట్టంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ లోని గణపతి పురం గిరిజన కాలనీ పర్యటించడం జరిగింది, అక్కడున్న గిరిజనులు దాదాపుగా 30 నుండి 35 సంవత్సరాలుగా నివాసముంటున్నామని ఇంకా గుడిసెలలోనే జీవనం సాగిస్తున్నామని తెలపడం జరిగింది, అంతేకాకుండా గత ప్రభుత్వంలో 30 కుటుంబాలకు గాను కేవలం 5 కుటుంబాలకు మాత్రమే ఇంటి పట్టాలిచ్చారని కనీసం ఆ ఇంటి స్థలం ఎక్కడ ఉన్నది ఆ స్థలం కూడా మాకు తెలియపరచలేదని ఆవేదన వ్యక్తం చేశారు, మిగిలిన 25 కుటుంబాల గురించి అసలు ఆలోచన చేయలేదని చెప్పడం జరిగింది, ఎన్నో సంవత్సరాలుగా అందరూ వస్తున్నారు పోతున్నారు మా సమస్యలు తెలుసుకుంటున్నారే కానీ పరిష్కరించట్లేదని కనీసం మీరు అయిన మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు, కచ్చితంగా మీ సమస్యలన్నిటిని స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి దృష్టికి మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి ఈ కూటమి ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగే లాగా కృషి చేస్తామని తెలపడం జరిగింది. వీధి లైట్లు కూడా లేవని తెలపడంతో వెంటనే సర్పంచ్ గారికి ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది, వారం రోజుల లోపు ఏర్పాటు చేస్తామని అతను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, తేజ, మనీ, ప్రదీప్ కుమార్, కల్లిపూడి వెంకటేష్, దినేష్, గోపి, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

వరద ప్రభావిత ప్రాంతల్లో నేడు బీజేపీ బృందం పర్యటన

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతి నిధి) తెలంగాణ లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన నష్టం ని అంచనా వేసి రైతుల పక్షం న పోరాటం చేసేందుకు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు బిజెపి నేతలు సిద్ధం అయ్యారు. భారీ వర్షాల కారణంగా పంటలు, ఆస్తులు నష్టపోయిన రైతులు, పేద ప్రజలకు అండగా నిలవడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు నేడు సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు. అదే విధంగా వరంగల్‌లో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బసవ లక్ష్మీ నరసయ్య, మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ తదితరులు పర్యటించి వరద ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించనున్నారు.

కాకినాడ

కాండ్రకోట దబ్బా కాలువ వద్ద వరద ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే చినరాజప్ప

పున్నమి న్యూస్, పెద్దాపురం. 31/10 ఏలేరు ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు ప్రాజెక్టు నుండి 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో, కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి. తుపాన్ వల్ల ఇటీవల ఏలేరు అధికంగా నీరు విడుదల చేయడంతో పెద్దాపురం మండలం కాండ్రకోట లోని దబ్బా కాలవ వద్ద పరిస్థితిని పరిశీలించి, ఇరిగేషన్ అధికారులు అడిగి తెలుసుకున్న పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయలు చిన రాజప్ప, మాజీ గుడా డైరెక్టర్ ఎలిసెట్టి నాని తిరుపతి సర్పంచ్ మొయిళ్ళ కృష్ణమూర్తి ఏఎంసి డైరెక్టర్ రేలంగి వెంకట్రావు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కుచాడి శ్రీహరిరావు

అక్టోబర్ 31, నిర్మల్, పున్నమి ప్రతినిధి :భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, అజేయ నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ గారి 41వ వర్ధంతి సందర్భంగానిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలోడీసీసీ అధ్యక్షులు శ్రీ కూచాడి శ్రీహరి రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీహరి రావు గారు మాట్లాడుతూ“ఇందిరా గాంధీ గారు భారత రాజకీయ చరిత్రలో ఒక అజరామరమైన నాయకురాలు. దేశం కోసం త్యాగం చేసిన ధైర్యవంతురాలు.

కడప

[31/10, 1:20 pm] Tappa Shakeer Hussain: *వల్లూరి వారి వివాహ వేడుకల్లో ప్రవీన్ కుమార్ రెడ్డి

[31/10, 1:20 pm] Tappa Shakeer Hussain: *వల్లూరి వారి వివాహ వేడుకల్లో ప్రవీన్ కుమార్ రెడ్డి* పున్నమి అక్టోబర్ 31శుక్రవారం వైస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు రూరల్ మండలం కల్లూరి గ్రామానికి చెందిన వల్లూరు నిరంజన్ రెడ్డి గారి కుమారుని వివాహ వేడుకలో పాల్గొన్న *డా* *జి* *వి ప్రవీణ్ కుమార్ రెడ్డి* E. V. సుధాకర్ రెడ్డి , వెలవలి నవీన్ కుమార్ రెడ్డి, కాకర్ల షణ్ముఖ రెడ్డి ,

E-పేపర్

రాజంపేట పట్టణం 3 వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అద్యక్షులు సనిశెట్టి నవీన్ కుమార్ గారు ప్రారంభించారు.*

*ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో రాజంపేట పట్టణం 3 వ వార్డులో కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ పార్టీ వాణిజ్య విభాగం అద్యక్షులు. రాజంపేట . —————————– *రాజంపేట నియోజకవర్గంలోని రాజంపేట లో ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటుకు అప్పగిస్తూ కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అద్యక్షులు సనిశెట్టి నవీన్ కుమార్ గారు ప్రారంభించారు.* *ఈ సందర్బంగా మెడికల్ కళాశాల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా.. ముద్రించిన ,పాంప్లీట్ ను, సంతకాల సేకరణ … *మన రాష్ట్రంలో స్వాతంత్రం వచ్చిన నాటి నుంచి .. కేవలం 11 మెడికల్ కళాశాలలు మాత్రమే ఉంటే.. వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో.. ఏకంగా 17 నూతన మెడికల్ కళాశాలల ను తీసుకువచ్చారని అన్నారు.* *విద్య, వైద్యం, రెండు ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటూ.. ప్రజలకు మెరుగైన సేవలు అందించేందుకు.. జగన్మోహన్ రెడ్డి గారు యత్నించారని తెలిపారు.* • *ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే.. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్.. (పిపిపి ) మోడ్ అని చెబుతూ..అన్ని వ్యవస్థలను ప్రైవేటుకు కట్టబడుతుందన్నారు.* • *గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు..నూతన మెడికల్ కళాశాలలో తీసుకువచ్చారనే అక్కసుతోనే.. ఈరోజు చంద్రబాబు నాయుడు వాటన్నిటిని ప్రైవేటుకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకోవడం దుర్మార్గమన్నారు.* • *ఈ రాష్ట్రంలో దశలవారీగా 17 మెడికల్ కళాశాలను ప్రారంభించాలనే సంకల్పంతో… జగన్మోహన్ రెడ్డి గారు పనిచేసి..ఇప్పటికే 7 మెడికల్ కళాశాలలను పూర్తి చేశారని తెలిపారు.* • *మెడికల్ కళాశాల అంటే.. కేవలం కళాశాల మాత్రమే కాదని.. అది ఒక వ్యవస్థలా పనిచేస్తూ..ప్రజా ఆరోగ్యానికి.. అండగా సేవలందిస్తుందని తెలిపారు .* • *ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉందంటే.. ఆ ప్రాంతంలో ప్రజలకు ఉచిత వైద్య సేవలతో పాటు..పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించేందుకు.. అవకాశాలు మెండుగా ఉంటాయన్నారు.* • *ఈరోజు అవేమీ పట్టవన్నట్టుగా కూటమి ప్రభుత్వం.. ప్రజల ఆకాంక్షను కూడా.. లెక్కచేయకుండా మెడికల్ కళాశాలను ప్రైవేటుపరం చేయడం సిగ్గుచేటన్నారు.* • *ఈరోజు మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరిస్తూ..కూటమి ప్రభుత్వం.. తీసుకున్న నిర్ణయాన్ని.. వైఎస్ఆర్సిపి తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు.* • *అందులో భాగంగానే వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపుమేరకు.. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ వ్యతిరేకంగా.. వైఎస్ఆర్సిపి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని తెలిపారు.* • *ఈ కార్యక్రమం ద్వారా కడప నియోజకవర్గంలో 60 వేల నుంచి.. లక్ష సంతకాల వరకు సేకరింస్తామని తెలిపారు..* • *ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం పూర్తి చేసి.. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి అధ్యక్షతన గవర్నర్ గారికి పంపి..కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తామన్నారు* • *అప్పటికి ప్రభుత్వం వెనక్కు తగ్గకపోతే.. కోర్టుల ద్వారా న్యాయపోరాటం చేస్తామన్నారు.*

ఆంధ్రప్రదేశ్

వాట్సప్ గ్రూప్ అడ్మిన్లు తస్మాత్ జాగర్త

10 వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లకు నోటీసులు అసత్య కథనాల కట్టడికి పోలీసుశాఖ చర్యలు *10 వాట్సాప్ గ్రూపుల అడ్మిన్లకు నోటీసులు* *అసత్య కథనాల కట్టడికి పోలీసుశాఖ చర్యలు* సోషల్ మీడియాలో ఆసత్య ప్రచారాల కట్ట డికి పోలీస్ శాఖ నడుం బిగించింది. వాట్సాప్ గ్రూపుల్లో పోలీసు అధికారులను, సిబ్బంది ని సభ్యులుగా చేర్చుకుని కథనాలు పోస్టు చేస్తూ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో.. పోలీస్ శాఖ చర్యలకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సృష్టించి పోస్ట్ చేసినా, వాటిని ఫార్వర్డ్ చేసినా అందుకు గ్రూపు అడ్మిన్లదే బాధ్యత అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిసా రిగా 15 వాట్సాప్ గ్రూపులను గుర్తించారు. ముందుగా 10 క్రైమ్ గ్రూపుల అడ్మిన్ లకు నోటీసులు ఇవ్వాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. వారు నివాసం ఉండే పరిధిలోని పోలీ స్ స్టేషన్ల నుంచి వారికి పిలుపు వచ్చింది. స్టేషన్కు వచ్చి నోటీసులు తీసుకోవాలని సూచించారు. నగరంలోని లాలాపేట స్టేషన్ పరిధిలో ఉన్న నాలుగు గ్రూప్లో అడ్మిన్లకు నోటీసులు సిద్ధం చేసి.. వాటిని తీసుకోవాలని ఫోన్లు చేసి చెప్పారు. అలాగే అరండల్ పేట, నగరంపాలెం, పెదకాకానితో పాటు పొన్నూరు టౌన్కు చెందిన అడ్మిన్లు ఉన్నారు. అలాగే మరో రెండు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల అడ్మిన్లు కూడా ఉన్నారు. వారికి కూ డా నోటీసులు ఇవ్వనున్నారు. రెండో దఫా కూడా మరికొన్ని గ్రూపులకు నోటీసులు ఇచ్చేం దుకు చర్యలు ప్రారంభించారు. అలాగే యూ ట్యూబ్ చానళ్ల పేరుతో.. పోలీసులను, వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. కొందరు ఏకంగా జిల్లా పోలీస్ కార్యాలయానికే వచ్చి బాధితులను డబ్బు డిమాండ్ చేస్తున్న విషయం కూడా పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది.సోషల్ మీడియాలో ఆసత్య ప్రచారాల కట్ట డికి పోలీస్ శాఖ నడుం బిగించింది. వాట్సాప్ గ్రూపుల్లో పోలీసు అధికారులను, సిబ్బంది ని సభ్యులుగా చేర్చుకుని కథనాలు పోస్టు చేస్తూ బ్లాక్ మెయిలింగ్కు పాల్పడుతున్నట్లు పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో.. పోలీస్ శాఖ చర్యలకు సిద్ధమైంది. సోషల్ మీడియాలో తప్పుడు కథనాలు సృష్టించి పోస్ట్ చేసినా, వాటిని ఫార్వర్డ్ చేసినా అందుకు గ్రూపు అడ్మిన్లదే బాధ్యత అని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇందులో భాగంగా తొలిసా రిగా 15 వాట్సాప్ గ్రూపులను గుర్తించారు. ముందుగా 10 క్రైమ్ గ్రూపుల అడ్మిన్ లకు నోటీసులు ఇవ్వాలని పోలీస్ శాఖ నిర్ణయించింది. వారు నివాసం ఉండే పరిధిలోని పోలీ స్ స్టేషన్ల నుంచి వారికి పిలుపు వచ్చింది. స్టేషన్కు వచ్చి నోటీసులు తీసుకోవాలని సూచించారు. నగరంలోని లాలాపేట స్టేషన్ పరిధిలో ఉన్న నాలుగు గ్రూప్లో అడ్మిన్లకు నోటీసులు సిద్ధం చేసి.. వాటిని తీసుకోవాలని ఫోన్లు చేసి చెప్పారు. అలాగే అరండల్ పేట, నగరంపాలెం, పెదకాకానితో పాటు పొన్నూరు టౌన్కు చెందిన అడ్మిన్లు ఉన్నారు. అలాగే మరో రెండు ఇతర రాష్ట్రాలు, ఇతర జిల్లాల అడ్మిన్లు కూడా ఉన్నారు. వారికి కూ డా నోటీసులు ఇవ్వనున్నారు. రెండో దఫా కూడా మరికొన్ని గ్రూపులకు నోటీసులు ఇచ్చేం దుకు చర్యలు ప్రారంభించారు. అలాగే యూ ట్యూబ్ చానళ్ల పేరుతో.. పోలీసులను, వ్యాపారులను బ్లాక్ మెయిల్ చేస్తున్న ఘటనలపై పోలీస్ శాఖ దృష్టి సారించింది. కొందరు ఏకంగా జిల్లా పోలీస్ కార్యాలయానికే వచ్చి బాధితులను డబ్బు డిమాండ్ చేస్తున్న విషయం కూడా పోలీసు అధికారుల దృష్టికి వచ్చింది.

ఆదిలాబాదు

ఘనంగా ఏఐటియుసి 106 వ ఆవిర్భావ దినోత్సవం

ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గ కేంద్రంలో ఏఐటీయూసీ 106వ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించగా ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కామ్రేడ్ గోదావరి జెండా ఆవిష్కరణ చేశారు. అనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ ఏఐటియుసి నిరంతరం కార్మికుల హక్కుల కొరకు పోరాడుతుందన్నారు. కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, 4 లేబర్ కోడ్స్ రద్దు చేసి 44 కార్మిక చట్టాలని పునరుద్ధరించాలనీ డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు దాస్, భోజన్న, గౌరక్క, భాగీరథ, మల్లు బాయ్, సత్తమ్మ, సత్యభామ, వసంత, మున్సిఫ్ సభ్యులు మరియు కార్మికులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

చిత్తురు కోర్టు సంచలన తీర్పు

చిత్తూరు: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. పదేళ్ల క్రితం అప్పటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే వారిని హతమార్చారు. ఈ కేసులో ఐదుగురు నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. నేడు వారికి ఉరిశిక్ష ఖరారు చేశారు. *ఐదుగురికి ఉరిశిక్ష.. చిత్తూరు కోర్టు సంచలన తీర్పు* చిత్తూరు: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఐదుగురు దోషులకు ఉరిశిక్ష ఖరారు చేసింది. పదేళ్ల క్రితం అప్పటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతుల హత్య జరిగింది. నగర పాలక సంస్థ కార్యాలయంలోనే వారిని హతమార్చారు. ఈ కేసులో ఐదుగురు నిందితుల ప్రమేయం ఉందని చిత్తూరులోని ఆరో అదనపు జిల్లా సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.శ్రీనివాసరావు ఇటీవల తీర్పు ఇచ్చారు. నేడు వారికి ఉరిశిక్ష ఖరారు చేశారు. ఈ కేసులో తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాసరం రమేష్ (ఏ22) తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్.శ్రీనివాసాచారి(ఏ21) కేసు విచారణ సాగుతుండగానే మృతిచెందారు. దాంతో 21 మంది నిందితులుగా ఉన్నారు. ఇందులో మేయర్ భర్త మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ(ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్(ఏ2), జయప్రకాష్రెడ్డి అలియాస్ జయారెడ్డి(ఏ3), మంజునాథ్ అలియాస్ మంజు(ఏ4), మునిరత్నం వెంకటేష్(ఏ5)లు దోషులుగా తేలారు.ఈ కేసులో తొలుత 23 మందిని నిందితులుగా పేర్కొన్నారు. కాసరం రమేష్ (ఏ22) తనకు కేసుతో సంబంధం లేదని పిటిషన్ దాఖలు చేయగా అతడి పేరును తప్పిస్తూ న్యాయస్థానం ఉత్తర్వులు ఇచ్చింది. ఎస్.శ్రీనివాసాచారి(ఏ21) కేసు విచారణ సాగుతుండగానే మృతిచెందారు. దాంతో 21 మంది నిందితులుగా ఉన్నారు. ఇందులో మేయర్ భర్త మోహన్ మేనల్లుడు శ్రీరామ్ చంద్రశేఖర్ అలియాస్ చింటూ(ఏ1), గోవింద స్వామి శ్రీనివాసయ్య వెంకటాచలపతి అలియాస్ వెంకటేష్(ఏ2), జయప్రకాష్రెడ్డి అలియాస్ జయారెడ్డి(ఏ3), మంజునాథ్ అలియాస్ మంజు(ఏ4), మునిరత్నం వెంకటేష్(ఏ5)లు దోషులుగా తేలారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.