Tuesday, 7 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*ముత్తుకూరు పంచాయతీలోని కట్టకింద గిరిజన కాలనీ నందు పర్యటించిన బొబ్బేపల్లి*

*డిప్యూటీ సీఎం పంచాయతీరాజ్ శాఖ మంత్రి శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు* *సర్వేపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు సర్వేపల్లి నియోజకవర్గం లోని ముత్తుకూరు మండలం ముత్తుకూరు గ్రామపంచాయతీ పరిధిలోని కట్టకింద గిరిజన కాలనీ నందు పర్యటించి వారి స్థితిగతులు అడిగి తెలుసుకోవడం జరిగింది* *గిరిజన కాలనీ నందు మొందా తుఫాన్ కారణంగా నీళ్లు నిలబడిపోయి ఆ నీళ్లు బయటకు వెళ్లే దానికి మార్గం లేక ఆ నీళ్ళలో పాముల తిరుగుతూ గిరిజనులు ఇబ్బందులు పడుతున్నారూ అనేటువంటి విషయం తెలియజేయడం జరిగింది. ఈ విషయాన్ని స్థానిక ఎంపీడీవో గారికి తెలియజేశాం. దాంతోపాటు స్థానికంగా ఒక ఇద్దరు మనుషులను పెట్టి దిగువకి కాలువనులోడిచ్చి ఆ నీళ్లన్నీ కూడా వెళ్లే విధంగా కాలువను తొవ్వించడం జరిగింది. కూటమి ప్రభుత్వం పేదల కోసం గిరిజనులకి అండగా వారికి ఏ ఇబ్బంది వచ్చినా మేము సైతం అంటూ అందుబాటులో ఉండి వారికి అన్ని విధాల ఆదుకునే దానికి మా వంతు మేము కృషి చేస్తాం స్థానిక శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు కూడా తుఫాన్ కారణంగా మూడు రోజులు పాటు 117 పంచాయతీల్లో కూడా అనేక సేవా కార్యక్రమాలను నిర్వహించడం అందరికీ కూడా అందుబాటులో ఉండి ప్రభుత్వ యంత్రాంగాన్ని కూడా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా అందర్నీ అన్ని విధాల ఆదుకునే విధంగా ప్రయత్నం చేయడం జరిగింది. అందులో భాగంగా నేను కూడా మా వంతు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎక్కడ ఇబ్బందున్న వారికి అందుబాటులో ఉండి సమస్యలను పరిష్కరిస్తూ ముందుకి వెళ్లడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముత్కూరు మండల సీనియర్ నాయకులు రహీం, సందూరి శ్రీహరి, జెడ్డా చిన్న, దబ్బి సతీష్, కుడుమల రాణమ్మ, కత్తి చారుముడి, కత్తి నరసమ్మ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

వీధి కుక్కలు కేసులో మరోసారి సుప్రీంకోర్టు ఆగ్రహం

వీధి కుక్కల కేసులో రాష్ట్రాల నిర్లక్ష్యంపై సుప్రీంకోర్టు ఆగ్రహం – నవంబర్ 3న ప్రధాన కార్యదర్శులు హాజరు కావాలని ఆదేశం. వీధి కుక్కల సమస్యపై రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. అఫిడవిట్ దాఖలు చేయమంటే రాష్ట్ర ప్రభుత్వాలు నిద్రపోతున్నాయా అని తీవ్రంగా ప్రశ్నించింది. కోర్టు తీర్పును గౌరవించడం లేదని వ్యాఖ్యానిస్తూ అసహనం వ్యక్తం చేసింది. బెంగాల్, తెలంగాణ మినహా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు నవంబర్ 3న వ్యక్తిగతంగా హాజరుకావాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. వీధి కుక్కల సమస్యపై తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు జారీ చేసింది.

శ్రీకాకుళం 

నగర పరిధి స్థానిక రామ్ లక్ష్మణ్ జంక్షన్ హోటల్ గ్రాండ్ లో సూపర్ అంటే ఆఫ్ పోలీస్ అండ్ రీజినల్ విజిలెన్స్ అండ్ హెడ్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన బర్ల ప్రసాదరావు గారి సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు . గొండు శంకర్ .

ఈరోజు 31-10-2025, శుక్రవారం శ్రీకాకుళం నియోజకవర్గం. విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) నగర పరిధి స్థానిక రామ్ లక్ష్మణ్ జంక్షన్ హోటల్ గ్రాండ్ లో సూపర్ అంటే ఆఫ్ పోలీస్ అండ్ రీజినల్ విజిలెన్స్ అండ్ హెడ్ఫోర్స్మెంట్ ఆఫీసర్గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన బర్ల ప్రసాదరావు గారి సన్మాన సభ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు . గొండు శంకర్ .

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉపాధి హామీ కొత్త డిజిటల్ హాజరు

ఉపాధి హామీ కూలీల హాజరులో అక్రమాలను అరికట్టేందుకు ఈ కొత్త విధానం నవంబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి వస్తుంది. హాజరు నమోదు కోసం ప్రధానంగా ఎన్‌ఎంఎంఎస్‌ (NMMS) మరియు ఫేస్‌ ఆర్‌డీ యాప్‌ (Face RD App) లను ఉపయోగిస్తారు. కూలీలు రోజుకు రెండు సార్లు (ఉదయం 8 గంటలకల్లా, మధ్యాహ్నం 4 గంటలకు) హాజరు నమోదు చేయాలి. ఫేస్ ఆర్‌డీ యాప్ ద్వారా గ్రూప్‌లో ఒకరిని ర్యాండమ్‌గా ఎంపిక చేసి, వారి ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా గ్రూప్ హాజరును గుర్తిస్తారు. ఈ కొత్త విధానం అమలు కోసం జిల్లాలో కూలీల ఈకేవైసీ (e-KYC) ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. నిజంగా పనికి వచ్చే కూలీలు నష్టపోకుండా ఉండేందుకే ఈ యాప్‌లను అందుబాటులోకి తెచ్చినట్లు అధికారులు తెలిపారు.

E-పేపర్

ప్రజా సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. సమావేశంలో పాల్గొన్న సనిసెట్టి నవీన్ కుమార్ . అద్యక్షుడు- అన్నమయ్య జిల్లా వైయస్ఆర్సిపి వాణిజ్య విభాగం

రాజంపేట అక్టోబర్ పున్నమి ప్రతినిధి రాజంపేట రైల్వే స్టేషన్ నందు నిర్వహించిన స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ మెంబెర్స్ మరియు ప్రజా సమీక్ష సమావేశంలో పాల్గొనడం జరిగింది. ఈ సమావేశంలో రైల్వే ఉన్నతాధికారులతో ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ అభివృద్ధి మరియు రాజంపేట రైల్వే స్టేషన్ నందు సీనియర్ సిటిజన్స్ కొరకు లిఫ్ట్ ప్రొవిజన్,మరియు స్టేషన్ కు వచ్చే ప్రయాణికులకు RO నీరు తదితర అంశాల మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రైల్వే ఉన్నతాధికారులు, రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సిబ్బంది, రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ శ్రీ జనార్ధన్ గారు, రైల్వే వినియోగదారులు మరియు స్టేషన్ కన్సల్టేటివ్ కమిటీ మెంబర్స్ పాల్గొనడం జరిగింది. మీ- సనిసెట్టి నవీన్ కుమార్ . అద్యక్షుడు- అన్నమయ్య జిల్లా వైయస్ఆర్సిపి వాణిజ్య విభాగం ,రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆరవ తరగతి బాలికపై జనసేన నాయకుడు లైంగిక వేధింపులు బాణాపురం లో దారుణం

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం బాణాపురంలో అమానుష సంఘటన చోటుచేసుకుంది ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ఐ పోలవరం మండలం బాణాపురంలో ఆరో తరగతి చదువుతున్న ఒక బాలికను అదే గ్రామానికి చెందిన జనసేన క్రియాశీలక సభ్యుడు రాయపురెడ్డి సత్య వెంకటకృష్ణ అలియాస్ బాబి అనే వ్యక్తి లైంగికంగా వేధించాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గతంలో ఆ చిన్నారి చదువుతున్న స్కూల్లో పి ఈ టి గా పని చేసే ఆ వ్యక్తి చిన్నారికి చాక్లెట్లు కొనిచ్చి రూమ్ కి పిలిచి మీద చేయి వేసి లైంగికంగా వేధించేవాడని ఆ చిన్నారి ఆమె తల్లికి చెప్పడంతో ఈ అమానుష సంఘటన వెలుగులోకి వచ్చింది. ఈ విషయంపై ఆమె తల్లి అమలాపురం డి.ఎస్.పి కి ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ఆదేశాలతో ఐ పోలవరం ఎస్ఐ రవీంద్రబాబు క్రైమ్ నెంబర్725/2025 సెక్షన్65(2),BNS సెక్షన్ 6 పోక్సో చట్టం కింద కేసు నమోదు చేయడం జరిగింది. ఈ సంఘటనతో ఆ గ్రామంలో ఉదృత వాతావరణం నెలకొంది తన చిన్నారిపై లైంగిక వేధింపులకు గురి చేసిన ఆ వ్యక్తిని కఠినంగా శిక్షించాలని ఇటువంటి అమానుష పనులు చేసే కామాంధులను ఉరితీయాలని ఆమె తల్లి మీడియా ను కోరింది.

తిరుపతి

జనసేన పర్యటనలో గిరిజనుల సమస్యలు తెలుసుకుంటున్న పేట బ్రదర్స్ మిత్రబృందం*

* జనసేన పర్యటనలో భాగంగా తొట్టంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ లోని గణపతి పురం గిరిజన కాలనీ పర్యటించడం జరిగింది, అక్కడున్న గిరిజనులు దాదాపుగా 30 నుండి 35 సంవత్సరాలుగా నివాసముంటున్నామని ఇంకా గుడిసెలలోనే జీవనం సాగిస్తున్నామని తెలపడం జరిగింది, అంతేకాకుండా గత ప్రభుత్వంలో 30 కుటుంబాలకు గాను కేవలం 5 కుటుంబాలకు మాత్రమే ఇంటి పట్టాలిచ్చారని కనీసం ఆ ఇంటి స్థలం ఎక్కడ ఉన్నది ఆ స్థలం కూడా మాకు తెలియపరచలేదని ఆవేదన వ్యక్తం చేశారు, మిగిలిన 25 కుటుంబాల గురించి అసలు ఆలోచన చేయలేదని చెప్పడం జరిగింది, ఎన్నో సంవత్సరాలుగా అందరూ వస్తున్నారు పోతున్నారు మా సమస్యలు తెలుసుకుంటున్నారే కానీ పరిష్కరించట్లేదని కనీసం మీరు అయిన మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు, కచ్చితంగా మీ సమస్యలన్నిటిని స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి దృష్టికి మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి ఈ కూటమి ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగే లాగా కృషి చేస్తామని తెలపడం జరిగింది. వీధి లైట్లు కూడా లేవని తెలపడంతో వెంటనే సర్పంచ్ గారికి ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది, వారం రోజుల లోపు ఏర్పాటు చేస్తామని అతను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, తేజ, మనీ, ప్రదీప్ కుమార్, కల్లిపూడి వెంకటేష్, దినేష్, గోపి, తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్

వరద ప్రభావిత ప్రాంతల్లో నేడు బీజేపీ బృందం పర్యటన

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతి నిధి) తెలంగాణ లో ఇటీవల కురిసిన భారీ వర్షాల నేపథ్యంలో జరిగిన నష్టం ని అంచనా వేసి రైతుల పక్షం న పోరాటం చేసేందుకు ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు బిజెపి నేతలు సిద్ధం అయ్యారు. భారీ వర్షాల కారణంగా పంటలు, ఆస్తులు నష్టపోయిన రైతులు, పేద ప్రజలకు అండగా నిలవడానికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు శ్రీ ఎన్. రామచందర్ రావు నేడు సూర్యాపేట, ఖమ్మం జిల్లాల్లో పర్యటించనున్నారు. అదే విధంగా వరంగల్‌లో బిజెపి జాతీయ కార్యవర్గ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు శ్రీ ఈటెల రాజేందర్, బిజెపి కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బసవ లక్ష్మీ నరసయ్య, మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ తదితరులు పర్యటించి వరద ప్రాంతాల్లో పరిస్థితులను పరిశీలించనున్నారు.

కాకినాడ

కాండ్రకోట దబ్బా కాలువ వద్ద వరద ఉధృతిని పరిశీలించిన ఎమ్మెల్యే చినరాజప్ప

పున్నమి న్యూస్, పెద్దాపురం. 31/10 ఏలేరు ప్రాజెక్టుకు భారీగా చేరుతున్న వరద నీరు ప్రాజెక్టు నుండి 8వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదలడంతో, కిర్లంపూడి మండలం రాజుపాలెం వద్ద ఏలేరు కాలువకు గండి. తుపాన్ వల్ల ఇటీవల ఏలేరు అధికంగా నీరు విడుదల చేయడంతో పెద్దాపురం మండలం కాండ్రకోట లోని దబ్బా కాలవ వద్ద పరిస్థితిని పరిశీలించి, ఇరిగేషన్ అధికారులు అడిగి తెలుసుకున్న పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయలు చిన రాజప్ప, మాజీ గుడా డైరెక్టర్ ఎలిసెట్టి నాని తిరుపతి సర్పంచ్ మొయిళ్ళ కృష్ణమూర్తి ఏఎంసి డైరెక్టర్ రేలంగి వెంకట్రావు టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొన్న కుచాడి శ్రీహరిరావు

అక్టోబర్ 31, నిర్మల్, పున్నమి ప్రతినిధి :భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, అజేయ నాయకురాలు శ్రీమతి ఇందిరా గాంధీ గారి 41వ వర్ధంతి సందర్భంగానిర్మల్ జిల్లా కేంద్రంలోని డీసీసీ క్యాంపు కార్యాలయంలోడీసీసీ అధ్యక్షులు శ్రీ కూచాడి శ్రీహరి రావు గారి ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది.ఈ సందర్భంగా శ్రీహరి రావు గారు మాట్లాడుతూ“ఇందిరా గాంధీ గారు భారత రాజకీయ చరిత్రలో ఒక అజరామరమైన నాయకురాలు. దేశం కోసం త్యాగం చేసిన ధైర్యవంతురాలు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.