Tuesday, 7 April 2026

Blog

విశాఖపట్నం

స్వర్గీయ శ్రీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా “జాతీయ సమైక్యతా దినోత్సవం” (రాష్ట్రీయ ఏక్తా దివస్) లో భాగంగా నివాళులు అర్పించిన డీఐజీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్

దేశ సమైక్యత, ఐక్యత, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి, స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ నిర్మాణ శిల్పి, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి హోం మంత్రి స్వర్గీయ శ్రీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా, విశాఖపట్నం రేంజ్ పోలీసు కార్యాలయంలో “జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్)” ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ పటేల్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు తదనంతరం ఆయన మాట్లాడుతూ — భారత స్వాతంత్య్రానంతరం దేశంలోని అనేక రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు పోషించిన అత్యంత కీలక పాత్ర దేశ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన దారిలోనే మనం దేశ సమైక్యత, సమగ్రత, భద్రతను కాపాడటానికి అంకితభావంతో సేవ చేయాలని పోలీసు సిబ్బందిని పిలుపునిచ్చారు. తరువాత పోలీసు సిబ్బందితో కలిసి దేశ ఐకమత్యం, సమగ్రత, అంతర్గత భద్రతను కాపాడేందుకు అంకితమవుతామనే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. దేశ ప్రజలలో సమైక్యతా భావాన్ని మరింతగా పెంపొందించేందుకు కృషి చేస్తామని డీఐజీ తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం మేనేజర్ బాల సూర్యారావు, ఇతర అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అమరులైన పోలీస్ వారికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కాకర్ల

ఉదయగిరి మండల కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పోలీస్ సంస్మరణ వారోత్సవాలు మరియు జాతీయ ఐక్యత – 2025 దినోత్సవం ఘనంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్. వెంకట్రావు గారి ఆధ్వర్యంలో, నోవా బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరై రిబ్బన్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ — స్వాతంత్రం వచ్చినప్పటి నుండి విధి నిర్వహణలో ఇప్పటి వరకు 36వేల మంది పోలీస్ సిబ్బంది ప్రాణాలను అర్పించగా వారి త్యాగాలను గౌరవించుకుంటూ మాన్యశ్రీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వారి పేర్లతో కూడిన నేషనల్ పోలీస్ మెమోరియల్ ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేసి, జాతికి అంకితం చేశారని, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారి త్యాగనిరతిని ప్రశంసిస్తూ, అమరు అమరులైన పోలీస్ వీరులను స్మరిస్తూ వారి కుటుంబాలను పరామర్శించి ఓదార్పునిచ్చారని తెలిపారు. వారి బాటలోనే మేము కూడా అమరులైన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న పోలీసు సిబ్బంది త్యాగాలు అపూర్వమైనవి, అమరులైన వారి త్యాగాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. పోలీసులు సమాజానికి రక్షణ కవచంలా ఉంటారని, వారి సేవలు ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీసు వ్యవస్థ పట్ల గౌరవభావం కలిగి ఉండి, సమాజ అభివృద్ధిలో భాగస్వాములుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమము ముందుగా ఉదయగిరి సర్కిల్ పరిధిలోని ఎనిమిది మండలాల పోలీసు సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కలిసి ర్యాలీగా బయలుదేరి “పోలీస్ అమరవీరులకు జోహార్” అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ స్మారకార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, నోవా బ్లడ్ సెంటర్ వాలంటీర్లు పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో అనేకమంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి, సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

విశాఖపట్నం

సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహానికి నివాళులర్పించిన బీజేపీ నాయకులు

శుక్రవారం బీజేపీ విశాఖపట్నం జిల్లా అధ్యక్షులు ఎం ఎం ఎన్ పరశు రామ రాజు ఆధ్వర్యంలో సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి 150 వ జయంతి సందర్భంగా వాల్తేర్ క్లబ్ ఎదురుగా ఉన్న సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ విగ్రహం వద్ద భారతీయ జనతా పార్టీ నాయకులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎం ఎం ఎన్ పరశు రామ రాజు మాట్లాడుతూ ఉక్కు మనిషి సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ ప్రజలందరి గుండెల్లో చిరస్మరణీయుడుగా నిలిచిపోయే వ్యక్తి అని కొనియాడారు. సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు తన చాణక్య నీతితో 562 సంస్థానాలను విలీనం చేసి భారతదేశాన్ని ఒకటిగా చేసారు అన్నారు. మన దేశానికి స్వాతంత్య్రం రావడమనేది ఎంతోమంది త్యాగధనుల పోరాట ఫలితం అని అన్నారు. స్వాతంత్య్ర పోరాటంలో చంద్రశేఖర్ ఆజాద్, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, మౌలానా ఆజాద్ లాంటి అమరవీరులు త్యాగ ఫలాన్ని చిన్నదిగా చూపించి, స్వాతంత్య్రం తరువాత ఏర్పడిన ప్రభుత్వాలు ఒక కుటుంబాన్ని మాత్రమే ప్రచారం చేస్తూ దేశంలోని ప్రతిష్టాత్మక సంస్థలు అన్నిటికి ఒక కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల పేర్లను మాత్రమే పెట్టడం జరిగిందని అన్నారు. ఈ సంప్రదాయాన్ని సరిదిద్దే క్రమంలో మోడీ ప్రధానమంత్రి అయిన వెంటనే గాంధీజీ జన్మదినమైన అక్టోబర్ 2 ను స్వచ్ఛత దివస్ గాను, దీన్ దయాల్ ఉపాధ్యాయ గారి జన్మదినమైన సెప్టెంబర్ 25 ను అంత్యోదయ దివస్ గాను, సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జన్మదినమైన అక్టోబర్ 31 ను రాష్ట్రీయ ఐక్యత దివస్ గాను పాటిస్తూ ప్రపంచంలోనే అతి ఎత్తైన సర్ధార్ వల్లభ్ భాయ్ గారి 182 మీటర్ల ఎత్తైన భవ్య విగ్రహాన్ని నిర్మించి, ఆ విగ్రహాన్ని ప్రధాన మంత్రి స్వయంగా ఆవిష్కరించడం జరిగిందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా అక్టోబర్ 31 వ తేదీన సర్ధార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతిని ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశమంతటా ఎంతో ఘనంగా జరుపుతుందని అన్నారు. సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా స్వాతంత్య్ర ఉద్యమంలోనే కాకుండా దేశప్రజల సంక్షేమం కోసం అనేక సాంఘిక ఉద్యమాలను చేపట్టారని, భారత రాజ్యాంగం రచనలో ప్రముఖ పాత్ర వహించి, రాజ్యాంగ రచనలో అతిముఖ్యమైన ప్రాథమిక హక్కుల కమిటీకి చైర్మెన్‌గా వ్యవహరించారు అని తెలిపారు. అనేక సంస్థానాలను భారత దేశంలో విలీనం చేయడానికి కృషి చేసి అందుకు సహకరించని వారి మీద మిలటరీ చర్యలకు కూడా వెనుకాడకుండా ఈనాటి భౌగోళిక భారత దేశం ఏర్పడటానికి ముఖ్య కారకులయ్యారని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఉమ్మిడి సుజాత రాజ్, బీజేపీ రాష్ట్ర కోశాధికారి ఎం నాగేంద్ర, బీజేపీ పార్వతీపురం జిల్లా ఇంచార్జి ఎస్ వి ఎస్ ప్రకాష్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర మీడియా ప్యానలిస్ట్ కే ఎన్ పి చక్రవర్తి, బీజేపపి జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీరంగం ధనేశ్వర రావు, దాడి పురుషోత్తం రమేష్, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు డి కృష్ణంరాజు, తలాడ గిరిజ, బీజేపీ జిల్లా కార్యదర్శి లెంక శ్రీరామ్, కారుభుక్త పద్మ, టి భారతి ఇతర నాయకులు కార్యకర్తలు పాల్గొని సర్దార్ వల్లభ్ భాయ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

నిర్మల్

విద్యార్థులు సామాజిక సేవా దృక్పథం తో పాటు ముందుకు సాగాలి క్రమశిక్షణతో ముందుకు సాగాలి

విద్యార్థులు సామాజిక సేవా దృక్పథం తో పాటు ముందుకు సాగాలి క్రమశిక్షణతో ముందుకు సాగాలి గోపాల్ రావ్ పాటిల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భైంసా జాతీయ సేవా పథకము వాటోలి గ్రామంలో స్పెషల్ క్యాంప్ ముగింపు సమావేశం భాగంగా గ్రామంలో ఈరోజు NSS వాలంటీర్లను ఉద్దేశించి బైంసా అడిషనల్ ఎస్పీ శ్రీ అవినాష్ కుమార్ గారు మాట్లాడుతూ విద్యార్థులు కాలేజ్ టు విలేజ్ అని ఎన్ఎస్ఎస్ లో భాగంగా గ్రామాల్లోకి వచ్చి వివిధ కార్యక్రమాలు చేయడం స్వచ్ఛభారత్ మొక్కలు నాటడం సామాజిక సర్వే చేస్తూ గ్రామస్తులను ప్లాస్టిక్ నివారణతో పాటు సామాజిక అంశాలపైన అవగాహన కల్పించడం అభినందనీయమని అంటూ అలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థులు గ్రామస్తులతో మమేకమైన తీరు వారు ఎదుర్కొన్న పరిస్థితులు విద్యార్థుల నుంచి అడిగి తెలుసుకుంటూ విద్యార్థులు కొత్తగా నేర్చుకున్న అంశాలు మర్చిపోకూడదని తాను కూడా ఒకప్పుడు NCC విద్యార్థినినని ఇందులో చేరిన ప్రతి విద్యార్థి చక్కని విద్యతోపాటు క్రమశిక్షణను కలిగి ఉంటారని ఆ విధంగా ప్రతి విద్యార్థి సామాజిక సాంఘిక అవగాహనతో పాటు సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని వారన్నారు ఈ కార్యక్రమంలో మరో అతిథి బైంసా పట్టణ సిఐ ఎన్ గోపీనాథ్ గారు కూడా విద్యార్థులకు వివిధ సూచనలు చేశారు కళాశాల ప్రిన్సిపల్ శ్రీ కర్రోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ విద్యార్థులు ఏడు రోజుల స్పెషల్ క్యాంపులో ఎన్నో కార్యక్రమాలు చేపట్టారని ఈ కార్యక్రమాల పట్ల మేము చేసిన సర్వే గాని విద్యార్థులు చేసిన సర్వే ద్వారా గ్రామస్తులు ఎంతో సంతోషంగా కరంగా విద్యార్థులను అభినందించారని ఈ క్యాంపుకు గ్రామ మాజీ సర్పంచ్ సచిన్ అలాగే వైద్యనాథ్ నాగేష్ లాంటి వారి తోడ్పాటును మర్చిపోలేమని అన్నారు విద్యార్థులు ఈ ఏడు రోజుల క్యాంపులో సేవా దృక్పథంతో పనిచేయడమే కాదు గ్రామ స్వరాజ్యం అంటే ఏమిటి గ్రామంలో ఉన్న వివిధ అంశాల పైన అవగాహనను పెంచుకున్నారని వారన్నారు .ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు ఆరె .రాజు డా ఓం ప్రకాష్ లో మాట్లాడుతూ ఈ క్యాంపులో గ్రామస్తుల తోడ్పాటు గాని విద్యార్థుల సేవా దృక్పథం అభినందనీయమని ఈ ఏడు రోజుల క్యాంపులో వారు చేసిన వివిధ సేవా కార్యక్రమాలు మొక్కలు నాటడం ఉచిత మెగా మెడికల్ క్యాంపు గ్రామస్తులకు ఎంతో సహాయపడ్డాయని కోరుకుంటూ వీటికి సహాయపడిన వారికి ధన్యవాదాలు తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో కళాశాల సిపిడీసి ప్రెసిడెంట్ డాక్టర్ నాగేష్ కార్యదర్శి మనోజ్ సభ్యులు బాజీరావు మోసిన్లు విద్యార్థులు చేసిన సేవా కార్యక్రమాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రైజ్ మనీ తో పాటు వారిని అభినందిస్తూ ఇటువంటి సేవా దృక్పథం వీడనాడకూడదని చక్కగా చదువుకొని మంచి ఉద్యోగాన్ని సంపాదించి తల్లిదండ్రులకు పేరు తీసుకురావాలని అప్పుడే జన్మ సార్థకత అవుతుందని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు. ఇంకా ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్ డా పవన్ కుమార్ డా భీమ్రావు పి జి రెడ్డి యు రవికుమార్ డా శంకర్ గుంత సుధాకర్ డా కల్పన డా నహె దా గలు ఇతర అధ్యాపకులు పాల్గొన్నారు ఏడు రోజుల క్యాంపులో ఉత్తమంగా సేవలు అందించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయ సిబ్బంది ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్స్ వారిని అభినందిస్తూ వివిధ బహుమతులను అందించారు

విశాఖపట్నం

36వ వార్డులో జామియా మసీదు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్

విశాఖపట్నం, అక్టోబర్ 31: దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ 36వ వార్డులోని జామియా మసీదును సందర్శించి, పునర్నిర్మాణ పనులను పరిశీలించారు. మసీదు నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించినందుకు మసీదు పెద్దలు, యువత ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఇచ్చిన హామీ ప్రకారం మసీదు నిర్మాణాన్ని పూర్తి చేశామని తెలిపారు. విశాలమైన ప్రాంగణంలో సుందరంగా మసీదు నిర్మాణం జరగడం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. మసీదు పునర్నిర్మాణంలో సహకరించిన వక్ బోర్డు అధికారులకు, మసీదు కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. తాను మాటమీద నిలబడే మనిషినని, ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం తన బాధ్యతగా భావిస్తానని ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనంతరం మసీదు కమిటీ రెన్యువల్ కాపీని అందజేశారు. తరువాత గార్విషరీఫ్ కార్యక్రమంలో పాల్గొని విందు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వక్ బోర్డు ఇన్స్పెక్టర్ అహ్మద్, మసీదు అధ్యక్షుడు అక్బర్ బాషా, పెద్దలు షరీఫ్, రహమతుల్లా, షకీల్, సలీం, స్థానిక వార్డు కార్పొరేటర్ మాసిపోగుమేరీ జాన్స్ రాజు, నియోజకవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శివప్రసాద్ రెడ్డి, సీనియర్ నాయకుడు జీకే, జనసేన యువజన విభాగం నేత శివ గణేష్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అద్భుతం… మాయా ప్రపంచం బీచ్ రోడ్ లో మాయా వరల్డ్ ను ప్రారంభించిన VMRDA చైర్మన్ ఎం వి ప్రణవ్ గోపాల్

విశాఖ సాగర తీరంలో TU 142 ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన *మాయా వరల్డ్ ను* VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాయా వరల్డ్ ను సందర్శించిన తదుపరి ఆయన మాట్లాడుతూ ఈ మాయా వరల్డ్ దేశంలోనే మొదటిసారిగా విశాఖలో ఏర్పాటు చేయటం అభినదనీయమని పేర్కొన్నారు. వి ఎం ఆర్ డి ఎ ప్రాంగణంలో మాయా వరల్డ్ నగర వాసులతో పాటు పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ఉందని తెలిపారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన “ఇమాజిన్ రూమ్స్” తరహాలో రూపొందించిన ఈ మ్యూజియం, కళ్లకు కనువిందు చేసే లైటింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతిని కలిగిస్తోందనీ తెలిపారు. మ్యూజియంలో మిరర్ రూమ్స్, స్పేస్ గెలాక్సీ థీమ్, ఫ్లవర్ గార్డెన్ థీమ్, డ్రీమ్ స్కేప్, మెజికల్ ఫారెస్ట్ లాంటి ప్రత్యేక కాన్సెప్ట్‌లతో ఏర్పటు చేసిన గదుల్లో సంచరిస్తే వింత అనుభూతి లభిస్తుందని చెప్పారు. ఫోటోషూట్లకు, రీల్స్‌ తీయడానికి ఇది సరిగ్గా సరిపోయే ప్రదేశమని చెప్పారు. సెల్ఫీలకు, వీడియోలకు అనువైన ప్రాంతంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ కె రమేశ్ , ఈ ఈ దుర్గా ప్రసాద్, డి ఈ మూర్తి, మాయా వరల్డ్ నిర్వాహకులు Capt. NR కుమార్ తదితరులు పాల్గొన్నారు.

జనగాం

ఇప్పగూడెం గ్రామపంచాయతీ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది తేట్టకుంట కట్ట తెగిపోవడం వల్ల కట్ట కింద ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది

ఈరోజు ఇప్పగూడెం గ్రామపంచాయతీ వద్ద రైతులు నిరసన వ్యక్తం చేయడం జరిగింది తేట్టకుంట కట్ట తెగిపోవడం వల్ల కట్ట కింద ఉన్న రైతులు తీవ్రంగా నష్టపోవడం జరిగింది గతంలో కట్టను ధ్వంసం చేసిన వారి పైన చర్యలు తీసుకోకుండా వదిలేయడం వల్ల ఈరోజు రైతులకి తీవ్ర నష్టం జరిగింది ఇది అధికారుల నిర్లక్ష్యనికి ఇది నిదర్శనం అధికారులు వెంటనే వారిపైన చర్యలు తీసుకోవాలని లేని యెడల ప్రభుత్వ కార్యాలయాలు ముట్టడి చేస్తామని వెంటనే కట్టకు మరమత్తులు చేసి రైతులను ఆదుకోవాలని ఇక్కడ ఉన్న రైతులకి ఒక ఎకరం అర ఎకరం భూమి తప్ప ఇంక ఎక్కువ ఉండదు ఎక్కువ మొత్తం లో దళితులు ఉంటారు అలాగే ఒక పసలు పండించుకుని సంవత్సరం మొత్తం పుట గడుపుకునే వారే ఇక్కడి రైతులు అప్పులు చేసి పెట్టుబడులు పెట్టి చేతికి వచ్చిన పంట నిట మునిగి పోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు పంట నష్టపోయిన రైతులకు నష్టరిహారం అందించి ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు ఈ కార్యక్రమంలో రైతులు నౌండ్ల గట్టుమల్లు బొంకూరి బిక్షపతి మంద మహేందర్ బొంకూరి మహేష్ బొంకూరి మదర్ మాచర్ల రమేష్ గద్దల గట్టుమల్లు సింగపురం మోష బైరపాక శ్రీనివాస్ బొంకురి వెంకటయ్య బొంకూరు శ్రీనివాస్ చాగంటి సుమన్ మంతపురం మహేష్ బొంకూరు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

రన్ ఫర్ యూనిటీ నందు పాల్గొన్న నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు.

నగరంలోని వుడా చిల్డ్రన్ ఎరీనా కూడలి నుండి సర్క్యూట్ హౌస్ వద్ద గల పటేల్ జంక్షన్ వరకూ నిర్వహించిన ఈ ఐక్యత ర్యాలీ (రన్ ఫర్ యూనిటీ) నందు నగర సీపీ పోలీసు అధికారులు మరియు సిబ్బంది తో పాల్గొని, అందరిలో ఐక్యత స్ఫూర్తి నింపారు. పటేల్ జంక్షన్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి సీపీ గారు పూలమాల వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ ఈ రోజు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు అక్టోబర్ 31 రాష్ట్రీయ ఏక్తాదివాస్ గా మనము ఘనంగా జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రతిచోట ఏక్తాదివాస్ ఐక్యతకు గుర్తుగా జరుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు చూస్తే మన దేశం ఈ పరిస్థితిలో లేనే లేదు హైదరాబాద్, గోవా, కాశ్మీర్ ఇంకా చాలా ప్రెసిడెన్సిలుగా ఉండేవి, వాటి ఏకీకరణ అప్పుడు చాలా కష్టమైన పనిగా ఉన్నా, అప్పటి మన హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పగలు రాత్రి కృషిచేసి, కష్టపడి కొన్నిచోట్ల ఐక్యత కోసం తెలియపరచి, మిలటరీ యాక్షన్ ద్వారా అన్ని ప్రెసిడెన్సీలను ఏకం చేశారు. కాబట్టి కులమత భాషలు ఎన్ని ఉన్నా దేశ ఐక్యత కోసం ఆయన తన జీవితం అంకితం చేశారు. ఈ రోజుకి కూడా ప్రపంచంలోని యూనిటీ అండ్ డైవర్సిటీ కు ప్రతీకగా భారతదేశం ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూపించిన మార్గం, సందేశం మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన పోలీసు వ్యవస్థ కూడా అంత చక్కగా ఉంది అంటే ఆయన ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం నడుపుతున్నాం కాబట్టి పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉంది, ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి, ఐక్యతకు గుర్తుగా ప్రతీకగా తీసుకొని ఈ రోజు ఈ పరుగు ఆయనకు అంకితం, ఆయన చూపించిన మార్గానికి అంకితం. మీరందరూ ఇలాగే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన దేశం కోసం ఎటువంటి త్యాగం అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ ఈరోజు మీ అందరికీ రాష్ట్రీయ ఏక్తాదివాస్ అభినందనలు శుభాకాంక్షలు, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన విశాఖపట్నం సిటీ పోలీస్ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు. అనంతరం నగర సిపి డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్. , నగర పోలీసు అధికారులు, సిబ్బందితో దేశ ఐక్యతకు, అంతర్గత భద్రతకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురంలో పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి

అమలాపురం పట్టణం భూపయ్య అగ్రహారం, వడ్లమాని వారి వీధలోని ఒక అపార్ట్మెంట్లో నిర్వహిస్తున్న పేకాట…. పక్కా సమాచారంతో పేకాట శిబిరంపై పోలీసులు మెరుపు దాడి…. 17 మంది పేకాట రాయుళ్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు….. 17మంది పేకాట రాయుళ్ల తో పాటు రూ. 30,140 వేలు నగదు స్వాదీనం చేసుకుని కేసు నమోదు చేసిన పట్టణ పోలీసులు…. ఇటీవల కాలంలో అమలాపురంలో ఎక్కడపడితే అక్కడ పేకాట స్థావరాలు ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున జూదం జరుగుతుందని విపరీత ప్రచారం…. రంగంలోకి దిగిన పోలీసులు.. పేకాటె స్థావరాలు పై మెరుపు దాడి చేసి పేకాట రాయుళ్ల అరెస్టు చేసి కేసులు నమోదు చేస్తున్న అమలాపురం పట్టణ పోలీసులు….

విశాఖపట్నం

స్వర్గీయ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవం ఘనంగా

అనకాపల్లి, అక్టోబర్ 31: దేశ సమైక్యతకు, సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివాస్) అనకాపల్లి జిల్లా పోలీసు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, ఐపీఎస్ ఆదేశాల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు ఎం.దేవ ప్రసాద్, ఎల్.మోహన రావు పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ— సర్దార్ పటేల్ దేశ ఐక్యతకు, సమగ్రతకు చేసిన సేవలు చిరస్మరణీయమని, అనేక రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్‌లో విలీనం చేయడం ద్వారా ఆయన నిజమైన జాతీయ నాయకుడిగా నిలిచారని పేర్కొన్నారు. పటేల్ చూపిన దేశభక్తి, ఐక్యతా దృక్పథం ప్రతి భారతీయునికి స్ఫూర్తిదాయకమని అన్నారు. తరువాత పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి దేశ ఐకమత్యం, భద్రతను కాపాడేందుకు అంకితభావంతో పనిచేయాలని, ఈ సందేశాన్ని ప్రజల్లో విస్తరింపజేయాలని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్లు లక్ష్మణమూర్తి, లక్ష్మీ, రమేష్, మన్మధరావు, ఎస్సైలు రమణయ్య, ప్రసాద్, సత్యనారాయణతో పాటు ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.