Tuesday, 7 April 2026

Blog

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

భిజ్జo పల్లి లో సీపీఎం ఆధ్యర్యంలో ఆందోళన

భిజ్జo పల్లి లో శుక్రవారం సీపీఎం ఆధ్యర్యంలో పలువురు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు సీపీఎం నాయకుడు కాకు వెంకటయ్య మాట్లాడుతూ ఉదయగిరి బండగాని పల్లి ఘాట్ రోడ్డు నిర్మాణన్ని వెంటనే చేపట్టాలన్నారు , ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమత్తులు చేపట్టడం తో పాటు కల్వర్ట్ పై బ్రిడ్జి లు నిర్మించాలన్నారు కొండ కింద గ్రామాలకు సరైన రోడ్ వసతి లేక ఇబ్బంది పడుతున్నారని , ప్రభుత్వం వారిపై దృష్టి పెట్టాలన్నారు

ఎన్ టి ఆర్ జిల్లా

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో క్షేత్ర పంటల నష్ట తీవ్రత మరియు నివారణ చర్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు….

తుఫాను ప్రభావిత ప్రాంతాలలో క్షేత్ర పంటల నష్ట తీవ్రత మరియు నివారణ చర్యలపై వ్యవసాయ శాస్త్రవేత్తల సూచనలు…. తుఫాను ప్రభావంతో నష్టపోయిన తిరువూరు డివిజన్‌లోని కాకర్ల మరియు లక్ష్మీపురం గ్రామాలను అక్టోబర్ 31, 2025న వ్యవసాయ విశ్వవిద్యాలయ అధికారులు, కె.వి.కె. శాస్త్రవేత్తలు మరియు జిల్లా వ్యవసాయ అధికారులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు రైతులను కలిసి, పంట నష్టం తీవ్రతను అంచనా వేసి, నివారణ చర్యలపై విలువైన సూచనలు చేశారు. వరి పంటలో తీసుకోవాల్సిన ముఖ్య జాగ్రత్తలు తుఫాను కారణంగా వర్షం తగ్గి ఎండ తీవ్రత పెరిగితే, ఎండాకు తెగులు, మానిపండు తెగులు, మాగుడు తెగులు, ఆకుముడత మరియు దోమపోటు వంటి తెగుళ్లు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. నీటి తొలగింపు: పొలంలో నిలిచిన నీటిని అంతర్గత కాలువల ద్వారా వెంటనే తొలగించాలి. తెగుళ్ల నివారణ (రంగు మారడం, మాగుడు, మానిపండు): నిలబడి ఉన్న లేదా పడిపోయిన వరి చేలలో గింజలు రంగు మారడం, మాగుడు తెగులు మరియు మానిపండు తెగులు వ్యాప్తిని నివారించడానికి, ఎకరాకు 200 మి.లీ. ప్రొపికోనాజోల్ పిచికారీ చేయాలి. మొలకెత్తడాన్ని తగ్గించడానికి: కోత దశలో నిలిచిన లేదా పడిపోయిన పంటలో కంకిలో మొలకలు కనిపిస్తే, నీటిని తొలగించిన తర్వాత, 5% ఉప్పు ద్రావణం (50 గ్రాములు కల్లు ఉప్పు / లీటరు నీటికి) కలిపి పిచికారీ చేయాలి. ఇది మొలకెత్తడాన్ని మరియు రంగు మారడాన్ని తగ్గిస్తుంది. 🌿 ప్రత్తి పంటలో తీసుకోవలసిన జాగ్రత్తలు అదనపు నీటి తొలగింపు: ప్రత్తి పంట నుండి నిలబడి ఉన్న అదనపు నీటిని వెంటనే బయటకు తీసివేయాలి. పోషకాల నిర్వహణ: ఎండగా ఉన్న సమయంలో 1-2% పొటాషియం నైట్రేట్ లేదా 19:19:19 ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. కాయ తెగులు నివారణ (ముందు జాగ్రత్త): 90 రోజుల పంటలో కాయ తెగులును నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా కాపర్ ఆక్సీక్లోరైడ్ (COC) 600 గ్రా/ఎకరానికి పిచికారీ చేయాలి. మచ్చ తెగుళ్ళ నివారణ: ఆకుల మీద వచ్చే మచ్చ తెగుళ్ళను నివారించడానికి కార్బెండజిమ్ + మాంకోజెబ్ మిశ్రమాన్ని 2.5 గ్రా/లీ చొప్పున పిచికారీ చేయాలి. సూచన: ఈ వాతావరణంలో ఆశించే తెగుళ్ళను డ్రోన్లను ఉపయోగించడం ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీ చేసుకుని కొంతవరకు పంటను కాపాడుకోవలసిందిగా అధికారులు రైతులకు సూచించారు. ఈ క్షేత్ర సందర్శనలో డాక్టర్ ఏ. మనీ డిన్ (వ్యవసాయ ఇంజనీరింగ్, లాం, ఆంగ్రూ), డి.ఎం.ఎఫ్ విజయ కుమారి (వ్యవసాయ జిల్లా అధికారి), డాక్టర్ ఎం. రవి కిషోర్ (ప్రోగ్రాం కోఆర్డినేటర్), డాక్టర్ పి.యన్ శివ ప్రసాద్, డాక్టర్ ఎన్ రాజశేఖర్, శ్రీమతి పద్మ (తిరువూరు ఏవో) మరియు వి.ఏ.ఏ.లు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కార్మిక వర్గం పోరాటాలకు సిద్ధం కావాలి – ఎఐటియుసి రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ పిలుపు

విశాఖపట్నం, అక్టోబర్ 31 (పున్నమి ప్రతినిధి): ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఎఐటియుసి) 106వ ఆవిర్భావ దినోత్సవాన్ని సీతమ్మధార అల్లూరి సీతారామరాజు విగ్రహం వద్ద ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎఐటియుసి జెండాను రాష్ట్ర కార్యదర్శి పడాల రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నారు – “మన దేశంలో జాతీయస్థాయిలో ఏర్పడిన మొట్టమొదటి అఖిల భారత కార్మిక సంఘం ఎఐటియుసి. 1920 అక్టోబర్ 31న ఆవిర్భవించి, నేటికి 106వ ఏట అడుగుపెడుతోంది. స్వాతంత్ర్యోద్యమం నుంచి కార్మిక హక్కుల సాధన వరకు ఎఐటియుసి పోరాట చరిత్ర గొప్పది.” “నరేంద్ర మోదీ ప్రభుత్వం కార్మిక వర్గం సాధించిన హక్కులను నాలుగు కోడ్‌ల రూపంలో కార్పొరేట్లకు అనుకూలంగా మార్చి కార్మికులను బలిపీఠం ఎక్కించే ప్రయత్నం చేస్తోంది. ప్రజల ఆస్తులైన ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, ఆదానీ, వేదాంత వంటి గ్రూపులకు చవకగా కట్టబెట్టి దేశ సంపదను దోచుకుంటున్నారు. 12 ఏళ్ల బీజేపీ పాలనలో కొత్త పరిశ్రమలు రాకపోగా, ఉన్న ఉపాధులు కూడా కోల్పోయాయి,” అని అన్నారు. రాష్ట్ర పరిస్థితులపై మాట్లాడుతూ ఆయన చెప్పారు – “ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులకు ఇచ్చిన హామీలను విస్మరించింది. అన్ని వర్గాల కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటు చేయాలి, హెచ్ఆర్ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలి. కాంట్రాక్ట్ కార్మికుల రెగ్యులరైజేషన్ కోసం ఉద్యమాలు అవసరం,” అని పిలుపునిచ్చారు పడాల రమణ. ఈ కార్యక్రమంలో జిల్లా ఎఐటియుసి నాయకులు, కార్మిక సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో సర్దార్ పటేల్ జయంతి ర్యాలీ – దేశ సమైక్యతే ధ్యేయం..

ఎన్టీఆర్ జిల్లా: తిరువూరులో సర్దార్ పటేల్ జయంతి ర్యాలీ – దేశ సమైక్యతే ధ్యేయం.. తిరువూరు (ఎన్టీఆర్ జిల్లా): భారతదేశ తొలి హోంమంత్రి, ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని ఎన్టీఆర్ జిల్లాలోని తిరువూరులో ఘనంగా వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపి (అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్) ఆధ్వర్యంలో వాహిని కాలేజ్ విద్యార్థులతో కలిసి మధిర రోడ్డు వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం విద్యార్థులు, పోలీసు సిబ్బందితో కలిసి ప్రతిజ్ఞ చేశారు. 👮‍♂️ ఏసిపి, సి.ఐ సందేశం ఈ సందర్భంగా ఏసీపి ప్రసాద్ మాట్లాడుతూ, ఈ ర్యాలీ ప్రధాన ఉద్దేశం భారతీయులందరూ ఐక్యతగా ఉండాలనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే అని తెలిపారు. కులము, మతము, ప్రాంతము అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఐక్యతగా జీవించాలని ఆయన పిలుపునిచ్చారు. సర్కిల్ ఇన్స్పెక్టర్ (సి.ఐ) గిరిబాబు మాట్లాడుతూ, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి జన్మదినాన్ని దేశమంతా జరుపుకోవడం ఆయన కృషికి నిదర్శనమన్నారు. స్వాతంత్ర్యం తరువాత భారతదేశంలో ఉన్న 500కు పైగా సంస్థానాలను ఏకం చేసి, కాశ్మీరు నుండి కన్యాకుమారి వరకు అఖండ భారతవనిగా ఏర్పాటు చేసి, ‘ఒకే దేశం – ఒకే పాలన’ ఉండటానికి కృషి చేసిన మహనీయుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ అని కొనియాడారు. మనమంతా భారతీయులుగా కలిసి ఉండటానికి పాటుపడిన పటేల్ గారిని స్మరించుకోవడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు. తిరువూరు, మధిర రోడ్డు వరకు ర్యాలీ నిర్వహించారు.

కామారెడ్డి

భారీ వర్షాలతో దెబ్బతిన్న ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్

కామారెడ్డి, 31అక్టోబర్, ( పున్నమి ప్రతినిధి ) : రామారెడ్డి మండలంతో పాటు జిల్లాలో వివిధ ప్రాంతాలలో గత రెండు రోజుల క్రితం కురిసిన భారీ వర్షాలకు తడిసిన ధాన్యాన్ని అధికారులు వెంటనే కొనుగోలు చేయాలని రామారెడ్డి మాజీ ఎంపీపీ నారెడ్డి దశరథ్ రెడ్డి డిమాండ్ చేశారు.శుక్రవారం ఆయన రామారెడ్డి మండల కేంద్రం పోసానిపేట్ కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. ఈ సంద ర్భంగా రైతు సమస్యలను ప్రత్యక్షంగా గమనించిన దశరథ్‌రెడ్డి, తడిసి నల్లబడిన ధాన్యం కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొ న్నారు. ముఖ్యమంత్రి గతంలో ఇచ్చిన హామీ మేరకు సన్న వరికి క్వింటాల్‌కు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని, గత సీజన్‌లో రావలసిన బోనస్ తక్షణమే విడుదల చేయాలని ఆయన కోరారు. అలాగే రెండునెలల క్రితం కురిసిన వర్షాలతో పంట లు నష్టపోయినా ఇప్పటి వరకు ప్రభుత్వం నష్టప రిహారం ఇవ్వకపోవడం దారుణమని విమర్శించా రు.ప్రభుత్వం వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ధర్నాలు, రాస్తారోకోలు చేయాల్సి వస్తుందని ఆయ న హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రామారెడ్డి గ్రామ కమిటీ అధ్యక్షుడు నర్సారెడ్డి, పోసానిపేట్ అధ్యక్షుడు టాంకర్ రవి, ఇసనపల్లి మాజీ సర్పంచ్ లింగాపూర్ శంకర్, పోసానిపేట్ రైతు బంధు మాజీ అధ్యక్షుడు తిరుపతి, ఉప సర్పంచ్ నరేష్, సుద్దాల లింగం, జంగం లింగం, బాల్దేవ్, చిన్న అంజయ్య, హనుమయల రాజయ్య, సొసైటీ మాజీ డైరెక్టర్ ఇసాయిపేట రాజు, బుచ్చి బాలయ్య, కర్రోల రాజేష్, తుత్తుల స్వామి తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నవంబర్ 1 న విద్యార్దులకు పోటీలు

ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు భారత రాజ్యాంగంపై శనివారం వ్యాస రచన , క్విజ్ పోటీలు నిర్వహిస్త్నట్లు ఏం ఈ ఓ టీ వెంకటేశ్వర్లు తెలిపారు పాఠశాల స్థాయిలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్దులు అర్హులని చెప్పారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

🔸అమరులైన పోలీస్ వారికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కాకర్ల..! 🔸ఉదయగిరిలో జాతీయ పోలీస్ సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహణ – రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 🔸అమరులైన పోలీసు వీరుల త్యాగాలు చిరస్మరణీయమైనవి – ఎమ్మెల్యే సురేష్ గారు. 🔸ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నోవా బ్లడ్ సెంటర్ సహకారంతో పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరము ఏర్పాటు..!

🔸అమరులైన పోలీస్ వారికి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే కాకర్ల..! 🔸ఉదయగిరిలో జాతీయ పోలీస్ సంస్మరణ వారోత్సవాలు ఘనంగా నిర్వహణ – రక్తదాన శిబిరాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్ 🔸అమరులైన పోలీసు వీరుల త్యాగాలు చిరస్మరణీయమైనవి – ఎమ్మెల్యే సురేష్ గారు. 🔸ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో నోవా బ్లడ్ సెంటర్ సహకారంతో పోలీస్ కార్యాలయ ప్రాంగణంలో రక్తదాన శిబిరము ఏర్పాటు..! ఉదయగిరి అక్టోబర్ 31న మండల కేంద్రంలోని సర్కిల్ ఇన్స్పెక్టర్ వారి కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పోలీస్ సంస్మరణ వారోత్సవాలు మరియు జాతీయ ఐక్యత – 2025 దినోత్సవం ఘనంగా నిర్వహించబడినవి. ఈ సందర్భంగా ఉదయగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ ఎన్. వెంకట్రావు గారి ఆధ్వర్యంలో, నోవా బ్లడ్ సెంటర్ వారి సహకారంతో రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గౌరవనీయ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు హాజరై రిబ్బన్ కటింగ్ చేసి రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ — స్వాతంత్రం వచ్చినప్పటి నుండి విధి నిర్వహణలో ఇప్పటి వరకు 36వేల మంది పోలీస్ సిబ్బంది ప్రాణాలను అర్పించగా వారి త్యాగాలను గౌరవించుకుంటూ మాన్యశ్రీ గౌరవ ప్రధానమంత్రి వర్యులు శ్రీ నరేంద్ర మోడీ గారు వారి పేర్లతో కూడిన నేషనల్ పోలీస్ మెమోరియల్ ను న్యూఢిల్లీలో ఏర్పాటు చేసి, జాతికి అంకితం చేశారని, ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ఆంధ్రప్రదేశ్ పోలీస్ వారి త్యాగనిరతిని ప్రశంసిస్తూ, అమరు అమరులైన పోలీస్ వీరులను స్మరిస్తూ వారి కుటుంబాలను పరామర్శించి ఓదార్పునిచ్చారని తెలిపారు. వారి బాటలోనే మేము కూడా అమరులైన పోలీస్ కుటుంబాలకు అండగా ఉంటామని తెలిపారు. దేశ భద్రత కోసం ప్రాణాలను పణంగా పెట్టి సేవలందిస్తున్న పోలీసు సిబ్బంది త్యాగాలు అపూర్వమైనవి, అమరులైన వారి త్యాగాలు దేశ చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తాయని పేర్కొన్నారు. పోలీసులు సమాజానికి రక్షణ కవచంలా ఉంటారని, వారి సేవలు ప్రతి పౌరుడికి స్ఫూర్తిదాయకమని తెలిపారు. ప్రతి ఒక్కరూ పోలీసు వ్యవస్థ పట్ల గౌరవభావం కలిగి ఉండి, సమాజ అభివృద్ధిలో భాగస్వాములుగా మారాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమము ముందుగా ఉదయగిరి సర్కిల్ పరిధిలోని ఎనిమిది మండలాల పోలీసు సిబ్బంది, ప్రజా ప్రతినిధులు, స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు కలిసి ర్యాలీగా బయలుదేరి “పోలీస్ అమరవీరులకు జోహార్” అంటూ నినాదాలు చేశారు. ఈ ర్యాలీ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయానికి చేరుకొని అక్కడ స్మారకార్చన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అనేక మంది పోలీసులు, స్థానిక ప్రజాప్రతినిధులు, యువత, నోవా బ్లడ్ సెంటర్ వాలంటీర్లు పాల్గొన్నారు. రక్తదాన శిబిరంలో అనేకమంది స్వచ్ఛందంగా రక్తదానం చేసి, సామాజిక బాధ్యతను చాటుకున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి లో నియోజక వర్గంలో పోలీస్ అమర వీరుల రక్త దాన శిబిరంలో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్

ఉదయగిరి పోలీస్ స్టేషన్లో నియోజక వర్గ స్థాయి రక్త దాన శిబిరాన్ని ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు పోలీసులు ఎమ్మెల్యే కు స్వాగతం పలికారు విది నిర్వహణలో అసువులు బాసిన పోలీస్ అమర వీరులకు నివలుర్పించరు జాతీయ పోలీస్ ఐక్యత దినోత్సవం సందర్భంగా ప్రతీ ఒక్కరూ రక్త దానం చేయడం వల్ల మరొకరికి ప్రాణదానం కాపాడగలరు అని ఆయన కోరారు

E-పేపర్

స్వాతంత్ర్యం తర్వాత భారతదేశాన్ని పటిష్ట పరిచిన మహోన్నతుడు సర్దార్ వల్లభాయ్ పటేల్: డాక్టర్ రవి కృష్ణ

స్వాతంత్ర్య సమరయోధుడు, భారతదేశ ప్రధమ హోం శాఖ మంత్రి, ఉక్కుమనిషిగా పేరుగాంచిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 జయంతి సందర్భంగా స్థానిక కళారాధన,జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో కళారాధన, లయన్స్ క్లబ్, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం ప్రతినిధులు సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కళారాధన ప్రధాన కార్యదర్శి,జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ సర్దార్ పటేల్ స్వాతంత్ర్యం తర్వాత 500 కు పైగా స్వతంత్ర సంస్థానాలను, నైజాం ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసి దేశాన్ని పటిష్టపరిచిన మహోన్నతుడని కొనియాడారు. బార్డోలి సత్యాగ్రహానికి నాయకత్వం వహించి, మహాత్మా గాంధీ ముఖ్య అనుచరుడిగా దేశ స్వాతంత్ర పోరాటంలో కీలక పాత్ర వహించిన మహనీయుడు అన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సర్దార్ పటేల్ స్ఫూర్తిని భావితరాలకు అందించాలనే సంకల్పంతో సర్దార్ సరోవర్ ప్రాజెక్టు సమీపంలో సర్దార్ పటేల్ భారీ విగ్రహాన్ని సమైక్యతకు ప్రతీకగా నిర్మించి సర్దార్ వల్లభాయ్ పటేల్ జ్ఞాపకాలు చిరస్మరణీయం చేశారన్నారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎం.పీ.వి. రమణయ్య, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కళారాధన కార్యవర్గ సభ్యులు శివరామిరెడ్డి, దివ్యాంగుల సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు రంగస్వామి,లయన్స్ క్లబ్ సభ్యులు రామయ్య, వెంకటరమణ, కార్యాలయ కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

స్కూల్ హెడ్ మాస్టర్ కు పదవీ విరమణ

ప్రభుత్వ శాఖల్లో పనీ చేసే ప్రతీ ఉద్యోగికి సహజమని ఉదయగిరి ఏం ఈ ఓ తోట శ్రీనివాసులు, టీ వెంకటేశ్వర్లు తెలిపారు శుక్రవారం ఉదయగిరి లోని హెడ్ మాస్టర్ గా పని చేస్తున్న కప్పా వెంకటేశ్వర్లు పదవీ విరమణ చేశారు ఉపద్యాయ వృత్తి లో ఉన్న ఎంతో మంది విద్యార్ధులను ఆదర్శంగా నిలిపరాన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.