మరో భారీ నష్టం జరిగే అవకాశం…
*నవంబర్ 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం.* అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే సూచన. అల్పపీడన ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం. అక్టోబర్, నవంబరుల్లోనే తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ బీభత్సం..
*నవంబర్ 4న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం.* అండమాన్ ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే సూచన. అల్పపీడన ప్రభావంతో మళ్లీ భారీ వర్షాలు పడే అవకాశం. అక్టోబర్, నవంబరుల్లోనే తెలుగు రాష్ట్రాలపై తుఫాన్ బీభత్సం..
ఇటీవల అనంతసాగరం మండలంలో కురిసిన భారీ వర్షాల కారణంగా సుమారుగా 150 ఎకరాల పంట నష్టపోయిన రైతులను బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర అధ్యక్షులు చిగురుపాటి కుమారస్వామి పరామర్శించిన అనంతరం మండలంలో ముస్తాపురం, పాతలపల్లి, లొ వర్షం కారణంగా పాడైన పంట పొలాలను సందర్శించారు అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా నష్టపోయిన అందరికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. మరియు రైతుల వద్ద నుండి దాన్యం దళారులు కాకుండా నేరుగా మిల్లర్లు కోనేవిధముగా జిల్లాలో ఉన్న మంత్రులు చొరవ తీసుకోవాలని వారుకోరారు. ఈ కార్యక్రమంలో కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేమారెడ్డి సురేంద్ర నాధ్ reddi, జిల్లా కిసాన్ మోర్చ అధ్యక్షులు వినయ్ నారాయణ, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి హర్షవర్ధన్, బీజేపీ సీనియర్ నాయకులు అల్లంపాటి రమణారెడ్డి మరియు బీజేపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.
నందిగామ పట్టణ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శుక్రవారం పార్టీ పట్టణ అధ్యక్షుడు మొనగంటి కామేశ్వరరావు ఆధ్వర్యంలో భారత మాజీ గృహశాఖా మంత్రి, ఐరన్ మ్యాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు వల్లభభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత 520 సంస్థా నాలుగా విడిపోయిన భారత దేశాన్ని ఏకీకృతం చేసి, సంపూర్ణ స్వతంత్ర భారతదేశంగా రూపుదిద్దిన ఘనత సర్దార్ వల్లభభాయ్ పటేల్‌దేనని గుర్తు చేశారు. హైదరాబాద్, జునాగడ్ వంటి సంస్థానాలను భారతదేశం లో కలిపి జాతీయ ఐక్యతకు మార్గదర్శకుడైన పటేల్ సేవలను ప్రశంసించారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి పోరుగంటి నరసింహారావు, బండార్ కేదార్నాథ్ శర్మ, తొర్లికొండ సీతారామయ్య, పులిపాటి లక్ష్మణరావు, చిరుమామిళ్ల శ్రీనివాసరావు, షేక్ సైదా, ఊటుకూరు వెంకట సత్యనారాయణ గుప్తా, తుటారి వెంకటకృష్ణ, ఎర్రగొర్ల లక్ష్మణ్, బోనం రామిరెడ్డి, పింజార కుమారి, రామాచారి, శివనరసింహారావు, ముచ్చింతాల శ్రీనివాసరావు, కేతేపల్లి ప్రసాద్, మాలెపు శ్రీనివాసరావు, రమణ తదితరులు పాల్గొన్నారు.
శ్రీకాళహస్తి అక్టోబర్ 31 , పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని చెంచులక్ష్మి కాలనీలో స్టెప్స్ స్వచ్చంద సంస్థ ఆధ్వర్యంలో పథక సంచాలకులు డాక్టర్ ప్రమీలమ్మ ప్రజలకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం జరిగింది. ఈ శిబిరంలో వైద్యలు కాలనీ వాసులకు వర్షాల కారణంగా వచ్చేటటువంటి జబ్బులు గురించి ఆరోగ్య అవగాహన కల్పించి వారికి ఉచిత మందులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్టెప్స్ మేనేజర్ భాస్కర్, ఏఎన్ఎం మౌనిక, అవుట్ వర్కర్స్ సునీత,కళావతి, కీర్తి పాల్గొనడం జరిగింది.
*పోలీస్ కు అభివందనం* — గంజాయి స్థావరాలు గుర్తించి పట్టుకున్నారు పున్నమి ప్రతినిధి – భుక్యా వినోద్ కుమార్ 31 అక్టోబర్ 2025, మణుగూరు మణుగూరు/ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు పోలీస్ కు అభివందనం ఎన్నో ఎన్నెన్నో జీవితాలను గంజాయి భారీ నుండి పెద్ద ఎత్తున కాపాడిన మన పోలీస్ శాఖకు ఆదర్శంగా నిలిచిన చైతన్యానికి గాంధీ బొమ్మ సెంటర్ ప్రజల స్ఫూర్తి నేడు ఎంతోమంది యువతి యువకుల జీవితాలకు మరో మలుపుగా నిలవడం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు మణుగూరులో పెద్ద ఎత్తున గంజాయిని నెలరోజుల చైతన్యం పేరిట డీఎస్పీ రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎన్నో సమావేశాలు ఎన్నెన్నో అవేర్నెస్ ప్రోగ్రాములు మొత్తం కలగలిపి చైతన్యానికి ప్రజల మద్దతు సమాచారం మేరకు పెద్ద ఎత్తున గంజాయి పట్టివేత అంతర్ జిల్లాల గంజాయి వ్యాపారులను సైతం పకడ్బంధినిగాతో ఆపరేషన్ గంజాయిలో పట్టుకోవడం విశేషం. ఇంత పెద్ద మొత్తంలో గంజాయిని పట్టుకోవడంలో జిల్లా ఎస్పీ చైతన్యం పేరిట తీసుకువచ్చిన మరో చైతన్యానికి మణుగూరు నిదర్శనమని పలువురు సీనియర్ సిటిజన్స్ పట్టణ ప్రజానీకం అభినందిస్తున్నారు. 24 గంటలు మణుగూరు పోలీస్ డివిజనల్ పరిధిలో గంజాయి నిఘ డ్రగ్స్ మహమ్మారిపై కొనసాగడం ఎస్పీ ఆదేశాల మేరకు డి.ఎస్.పి వంగ రవీందర్ రెడ్డి నిరంతర పర్యవేక్షణలో మణుగూరు పోలీస్ శాఖ అహర్నిశలు కృషి చేయడం ఇందుకు నిదర్శనం.
న్యాయస్థానం ఆర్డర్ పై చిన్నచూపు చూస్తున్నా మున్సిపాలిటీ కార్యాలయం* **పూర్తి బిల్డింగు సీల్ చేయాలని* *సాగర్ డిమాండ్ చేశారు* పత్రిక మీడియా మిత్రులకు నా యొక్క నమస్కారాలు నేను ఎస్ పి కే సాగర్ గత సంవత్సర కాలం అనగా 2024 జనవరి నుండి భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ సెంటర్ వద్ద తాటిపల్లి సత్యనారాయణ రాజబాబు గారు రాజబాబు గారు మున్సిపాలిటీ కార్యాలయంలో తీసుకున్న గృహనిర్మాణ అనుమతులను ఉల్లంఘించి వారి యొక్క భవన నిర్మాణాలు చేపడుతున్నారని మున్సిపల్ కమిషనర్ భూపాలపల్లి గారికి 2024 సంవత్సరంలో రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది. నా ఫిర్యాదు పై అప్పటి కమిషనర్ గారు గాని అప్పటి ఇప్పటి టౌన్ ప్లానింగ్ అధికారులు కానీ ఎటువంటి చర్యలు తీసుకోకపోగా నేను పదేపదే మున్సిపాలిటీ కార్యాలయం వారు నేను ఇవ్వబడిన దరఖాస్తుపై ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదు అని నేను జిల్లా కలెక్టర్ గారికి కూడా జిల్లా కలెక్టర్ గారికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేయడం జరిగింది జిల్లా కలెక్టర్ గారు కూడా ఎటువంటి చర్యలు తీసుకోకపోగా సదర్ బిల్డింగ్ యజమాని గారికి ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరిస్తున్నట్లు నాకు సమాచారం వచ్చింది అట్టి సమాచారం దృశ్య నేను ఇక్కడ న్యాయం జరగదని నేను చేయబోయే పోరాటము నా వ్యక్తిగతం కోసం కాదని ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా సంక్షేమం కోసం ఈరోజు ఈ యొక్క భవనము అంబేద్కర్ సెంటర్లో అత్యంత రద్దీ జన సంచారం కలుగు ప్రదేశంలో నిర్మాణం జరుగుతున్నదని జి ప్లస్ ఫోర్ మరియు పెంట్ హౌస్ సెల్లార్ లు నిర్మిస్తున్నారు అని సింగరేణి ప్రాంతంలో అధిక ఫ్లోర్లతో నిర్మాణాలు జరిగితే ఆ ఫ్లోర్లు కృంగిపోయి భవనాలు కూలిపోయే అవకాశం ఉందని ఈ భవనము అధిక కోళ్లతో నిర్మాణాలు జరుగుతే అధిక ప్రాణం నష్టం జరిగే అవకాశం ఉందని సదరు అధికారులు గమనించాలని పలుమార్లు మొరపెట్టుకున్నా కూడా నా ఆవేదన జిల్లా కలెక్టర్ గారు గమనించాలని కోరాను కానీ జిల్లా కలెక్టర్ గారు గాని మున్సిపాలిటీ కమిషనర్ గారు గాని స్థానిక ఎమ్మెల్యే గాని ప్రజా సంక్షేమం అవసరం లేనట్టుగా భావిస్తున్నట్లు నాకు అనిపించింది దీనిపైన ఇక్కడ న్యాయం జరగదని భావించి గౌరవ రాష్ట్ర న్యాయస్థానాన్ని లంచు మోషన్ ద్వారా ఈ భవనము ఓపెన్ కాకుండా చూడాలని ఇటువంటి భవనాలు భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో సింగరేణి ప్రాంతం అయినందున పర్మిషన్లు చూడాలని గౌరవ న్యాయస్థానాన్ని నేను కోరడం జరిగింది గౌరవ రాష్ట్ర న్యాయస్థానం నా అభ్యర్థనను పరిగణంలోకి తీసుకొని ప్రస్తుతము ఓపెనింగ్ సిద్ధంగా ఉన్నటువంటి సురక్ష భవనం పేరుతో ఉన్న సత్యనారాయణ రాజబాబు గారి భవనాన్ని ఉల్లంఘించబడిన ఫ్లోర్లు మరియు స్ట్రక్చర్స్ ని డివియేషన్ జరిగిన ప్రతి చోట సీజ్ చేయాలని గౌరవ రాష్ట్ర న్యాయస్థానము మధ్యంతర ఉత్తర్వులు 26/08/2025; రోజున జారీ చేయడం జరిగినది అట్టి మద్యంతర ఉత్తర్వులపై శ్రీయుత మున్సిపాలిటీ కమిషనర్ భూపాలపల్లి గారు పూర్తిస్థాయిలో డివిజన్ జరిగిన ప్రతి చోటా సీల్ చేయకుండా నామమాత్రంగా ఆ భవనం యొక్క సెల్లార్ మరియు పెంట్ హౌస్ మాత్రమే ఫీజు చేయడం జరిగింది. గౌరవ రాష్ట్ర న్యాయస్థానం జారీ చేయబడిన ఆర్డర్ను తుంగలో తొక్కుతూ ఆ భవన యజమానులకు ప్రత్యక్షంగా మరియు పరోక్షంగా సహకరిస్తూ ఆ భవనాన్ని జి ప్లస్ టు వరకు ఓపెన్ చేసుకోవాలని అంతర్గతంగా అధికారులు భవన యజమాని గారికి సహకరిస్తున్నట్లు భూపాలపల్లి మున్సిపాలిటీ ప్రజలు మాట్లాడుతున్నారు నేను అడుగుతా ఉన్న మున్సిపల్ కమిషనర్ భూపాలపల్లి గారిని నేను ఏమైనా నా వ్యక్తిగతంగా చేస్తా ఉన్న ఈ రోజు నేను ప్రజాసంక్షేమం కోసం ప్రాణ నష్టం జరగకుండా ఈ మున్సిపాలిటీ ప్రాంతము సింగరేణి ప్రాంతం అయినందున ఇక్కడ అధిక ఫ్లోర్లతో భవనాలు నిర్మిస్తే తెలిసి తెలవని ప్రజలకు ప్రాణనష్టం జరుగుతుందని భావించి మీకు రాజకీయ ఒత్తిడి ఉన్నదని గ్రహించి కూడా నేను గౌరవ రాష్ట్ర న్యాయస్థానాన్ని సందర్శించి సదరు ఆర్డర్ ను తీసుకొస్తే ఆ ఆర్డర్ ను మీరు తుంగలో తొక్కడం మీకు ఏమైనా న్యాయమేనా అని నేను అడుగుతా ఉన్న ఈరోజు మున్సిపల్ కమిషనర్ గారు మీరు ప్రజల పక్షాన ఉన్నారా లేకపోతే రాజకీయ నాయకుల పక్షాన ఉన్నారా భూపాలపల్లి ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని మున్సిపాలిటీ కమిషనర్ను అడుగుతా ఉన్న మున్సిపాలిటీ కమిషనర్ గారు మీకు జీతభత్యాలు రాష్ట్ర ప్రజలు ఇస్తున్నారా రాజకీయ నాయకులు ఇస్తున్నారు అని అడుగుతా ఉన్నా మీరు ప్రజా సంక్షేమం కోసం పనిచేయాల్సిన వ్యక్తులు ఈరోజు రాజకీయ ముసుగుల కంట్రోల్ లో ఉండిపోతే ఎలా అని అడుగుతా ఉన్నా. మున్సిపాలిటీ కమిషనర్ భూపాలపల్లి గారు తమరు తక్షణమే స్పందించాలి సురక్ష హాస్పిటల్ పేరుతో ఉన్న బిల్డింగును గౌరవ రాష్ట్ర న్యాయస్థాన ఆర్డర్ను ఇప్పటికైనా గౌరవించి తమరు డివియేషన్ జరిగిన ప్రతి చోట గుర్తించి సీల్ చేయాలని తమరిని కోరుతున్నాను మరియు మీరు ఇకనైనా భూపాలపల్లి మున్సిపాలిటీ కమిషనర్ గా వ్యవహరించి ఎక్కడ ఎక్కడ అయితే భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పర్మిషన్ల నులిగించబడిన బిల్డింగులను గుర్తించాలి అధిక ఫ్లోర్లతో నిర్మించబడుతున్న భవనాలను సేల్ చేయాలి పరిమితులకు లోబడి కట్టుకోవాలని ప్రజలకు సూచించాలని మున్సిపాలిటీ కమిషనర్ను డిమాండ్ చేసారు ఈ కార్యక్రమం లో తెలుగుదేశం పార్టీ జిల్లా నాయకులు గంధం రాకేష్ జశ్వంత్ రాజు కుమార్ శ్రీకాంత్ చరణ్ మరియు పలువురు పాల్గొన్నారు
*వికాస్ జూనియర్ కాలేజ్ ని సందర్శించిన బిఎన్ కండ్రిగ ఎంఈఓ సి సుబ్రహ్మణ్యం గారు* ఈ సందర్భంగా బాలురకు మరియు బాలికలకు ప్రత్యేకమైన టాయిలెట్ సద్దిపాయాలు ఉన్నాయా లేవా అని తనిఖీ చేసి చాలా విలాసవంతంగా ఉన్నాయని చెప్పారు ప్రతి క్లాస్ రూమ్స్ కూడా తనిఖీ చేయడం జరిగింది మరియు విద్యార్థుల యొక్క అభ్యున్నతి గురించి వారి యొక్క చదువు వివరాలు తెలుసుకోవడం జరిగింది ప్రత్యేకంగా సైన్స్ విద్యార్థులకి ఎంతో అమూల్యమైన సూచనలు చేయడం జరిగింది నీట్, ఎంసెట్ ,ఐ ఎస్ ఎస్ ఆర్ గురించి ఉన్నత విద్యని ఎలా అధిరోహించాలి కృషి పట్టుదల శ్రమ తో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులును ప్రోత్సహించారు ఈ కార్యక్రమంలో వికాస్ జూనియర్ కళాశాల కరస్పాండెంట్ ఉగుమూడి మనోహర్ ప్రిన్సిపల్ కత్తి హేమచంద్ర కళాశాల అకాడమిక్ కోఆర్డినేటర్ పిగిలం వెంకటరమణ మరియు అధ్యాపకులు బృందం పాల్గొన్నారు
ఉదయగిరి లో ని దిలావర్ బావి విది మదారాస్ లో శుక్రవారం స్టూడెంట్ ఇస్లామిక్ అర్గనైజేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర నాయకులు అబ్దుల్ హాఫిజ్ మాట్లాడుతూ యువతను సన్మార్గంలో నడిపించేలా చేయడమే లక్ష్యం మన్నారు నేటి సమజంలో యువత చెడు వ్యసనాలకు బానిసలు అవుతున్నారన్నారు 42 సంత్సరకాలంగా తమ సంస్థ యువకులా సమస్య పరిష్కారానికి విశేష కృషి చేస్తుందన్నారు.
మంగంపేట నందు ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రైల్వే కోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి ఏపీఎండీసీ అడ్మినిస్ట్రేషన్ ఆవరణలో ఏఐటియుసి 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏపీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోకూరు మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. తుమ్మల కృష్ణ చైతన్య అధ్యక్షతన సలివెందుల మునిశేఖర్ పార్ల రామచంద్రయ్య ఏఐటియుసి జెండాను ఎగరవేయడం జరిగినది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పండుగోలమణి, సిపిఐ పార్టీ రైల్వే కోడూరు కార్యదర్శి జ్యోతి చిన్నయ్య,అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు సరోజనమ్మ, స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు దార్ల రాజశేఖర్, సిపిఐ ఓబులవారిపల్లి మండల కార్యదర్శి నాగమ్మ ఏపీఎండిసి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏఐటీయూసీ మన భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర కార్మిక సంఘం 1920 అక్టోబర్ 31న దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబాయి నగరంలో ఆవిర్భవించింది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులలో కార్మిక గర్జనల నుండి కార్మికుల అణచివేతకు బ్రిటిష్ ప్రభుత్వ కుట్రల నుండి ఎన్నో వీరోచిత కార్యాచరణ నేపథ్యంలో ఏఐటీయూసీ ఆవిర్భవించింది. ప్రధమ అధ్యక్షులుగా లాలాలజపతిరాయ్ ని, ప్రధాన కార్యదర్శి గా వి.యం. పవార్ ని మహాసభ ఎన్నుకున్నాది. ఆ తరువాత కాలంలో పండిట్ జవర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వి.వి.గిరి, సరోజినినాయుడు, సి.ఆర్.దాస్ ఇంకా చాలామంది స్వాతంత్ర్యోద్యమ, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఏఐటీయూసీ నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించారు. 1921లో ఝారియాలో జరిగిన ఏఐటీయూసీ ద్వితీయ మహాసభల్లో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని అందరికన్నా ముందే నినదించి మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ. భారతదేశ స్వతంత్ర పోరాట వేదికగా గుర్తింపు పొందిన భారత జాతీయ కాంగ్రెస్ ఏఐటీయూసీ చేసిన తీర్మాణాన్ని వ్యతిరేకించింది. ఆ తరువాత స్వతంత్ర పోరాటంలో ఏఐటీయూసీ అగ్రభాగాన నిలబడిపోతుందని ఎనిమిదేళ్ళ తరువాత 1929 సంవత్సరంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని ఏఐటీయూసీ చేసిన తీర్మాణాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించింది. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రజలందరికీ, స్వేచ్చా, సమానత్వంతో పాటు కార్మికవర్గ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా దేశంలో ఎన్నో పోరాటాలు నడిపిన చరిత్ర ఏఐటీయూసీ కి మాత్రమే ఉంది ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వం కార్మికవర్గం పై దాడులు, అర్ధాకలి, అణిచివేత నుండి కార్మిక వర్గాన్ని విముక్తి చేస్తూ మరోవైపు వారిని సంఘటితం చేస్తూ దేశ స్వతంత్ర ఉద్యమంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో వారి తొత్తులైన స్వదేశీ పెట్టుబడిదారులతో కార్మిక హక్కుల కొరకు వారి జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం ఎన్నో అలుపెరగని నిర్విరామ పోరాటాలు చేసి కార్మిక వర్గం నేడు అనుభవిస్తున్న సౌకర్యాలను, అమల్లో ఉన్న చట్టాలను ఎన్నిటినో సాధించిన ఘనత ప్రప్రథమంగా ఏఐటీయూసీ కి దక్కుతుంది . 1923 కార్మిక నష్టపరిహార చట్టం. 1926 ఇండియన్ ట్రెడ్ యూనియన్ చట్టం. 1936 వేతనాల చెల్లింపు చట్టం. 1947 పారిశ్రామిక వివాదాల చట్టం. 1948 పారిశ్రామిక ఉద్యోగ స్థాయి నియామక చట్టం. 1966 షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం. 1920 లో పురుడోసుకున్న నాటి నుంచి భారత కార్మిక వర్గానికి ఒకే ఒక్క కేంద్ర కార్మిక సంఘంగా భాసిల్లి దాదాపు 44 రకాల చట్టాలకు రూపశిల్పిగా నిలిచిన చరిత్ర ఏఐటియుసి కి మాత్రమే ఉంది. ప్రభుత్వరంగ స్థాపన, పరిరక్షణ కొరకు అహర్నిశలు కృషి సల్పిన, సలుపుతున్న జాతీయ అతి పెద్ద కార్మిక సంఘం ఏఐటియుసి అని కొనియాడారు. భారతదేశంలో కార్మిక వర్గం నెత్తురు చిందించి ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి కార్మిక చట్టాలను రూపుమాపి బడా కార్పొరేట్ యాజమాన్యాలకు కార్మికులని కట్టుబానిసలుగా మార్చే దుర్మార్గాలకి పాల్పడుతున్నదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలను పరిరక్షించేందుకు, కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు కార్మికులందరూ ఐక్యమై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు అసోసియేషన్ నాయకులు మరియు ఏపీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు గురసాల దినేష్, బత్తల హరి, వడ్డీ లక్ష్మీనారాయణ, నారదాసు మణికంఠ, పుల్లగంటి బాలు గుంతా భాను ప్రకాష్, కాలవ సుబ్రహ్మణ్యం వడ్డీ విజయ్ కృష్ణ, పోకూరు మనోజ్, కొట్టిడి సాయి, పార్ల కిషోర్, గ్రందే మణికంఠ రసూల్, నరసింహులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జయరాం వెంకటరమణ తేజ, దళిత హక్కుల పోరాట సమితి నాయకులు శివయ్య, నాగేశ్వరరావు కార్మికులు పాల్గొన్నారు.
భిజ్జo పల్లి లో శుక్రవారం సీపీఎం ఆధ్యర్యంలో పలువురు గ్రామస్తులు ఆందోళన చేపట్టారు సీపీఎం నాయకుడు కాకు వెంకటయ్య మాట్లాడుతూ ఉదయగిరి బండగాని పల్లి ఘాట్ రోడ్డు నిర్మాణన్ని వెంటనే చేపట్టాలన్నారు , ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమత్తులు చేపట్టడం తో పాటు కల్వర్ట్ పై బ్రిడ్జి లు నిర్మించాలన్నారు కొండ కింద గ్రామాలకు సరైన రోడ్ వసతి లేక ఇబ్బంది పడుతున్నారని , ప్రభుత్వం వారిపై దృష్టి పెట్టాలన్నారు