Tuesday, 7 April 2026

Blog

విశాఖపట్నం

గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం*

*గల్లంతైన బాలిక మృతదేహం లభ్యం* *విశాఖపట్నంఅక్టోబర్ పున్నమి ప్రతినిధి * విశాఖ జిల్లా పద్మనాభం మండలం తునిపొలం గ్రామంలో గురువారం గెడ్డలో గల్లంతైన 13 ఏళ్ల ధనుశ్రీ మృతదేహం శుక్రవారం ఉదయం లభ్యమైంది. తండ్రితో కలిసి బట్టలు ఉతకడానికి వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తు గెడ్డలో పడిపోవడంతో ఈ విషాదం చోటుచేసుకుంది. పోలీసులు చేపట్టిన గాలింపు చర్యల్లో మృతదేహం లభించింది. కుమార్తె మృతదేహం వద్ద తల్లి కన్నీరుమున్నీరైంది, ఇది చూసిన పలువురు కంటతడి పెట్టారు.

విశాఖపట్నం

నవంబరు 07న 4వ జోన్ లో బహిరంగ వేలం నిర్వహణ

నవంబరు 07న 4వ జోన్ లో బహిరంగ వేలం నిర్వహణ. – 4 వ జోనల్ కమిషనర్ ఎమ్ .మల్లయ్య నాయుడు. *విశాఖపట్నం దివ్యదర్శిని న్యూస్*: మహా విశాఖపట్నం నగర పాలక సంస్థ 4వ జోన్ లో పలు వాణిజ్య సముదాయాల దుకాణాలకు, ఒక కళ్యాణ మండపం, ఒక మార్కెట్, జీవీఎంసీ మెయిన్ ఆఫీ కాంటీన్ నకు నవంబరు 07న తేది ఉ.గం.11.00 లకు బహిరంగ వేలం పాట నిర్వహించడం జరుగునని 4వ జోన్ జోనల్ కమిషనర్ ఎమ్.మల్లయ్య నాయుడు బుధవారం పత్రికా ప్రకటన ద్వారా తెలిపారు. జివిఎంసి 4వ జోన్ (సూర్యబాగ్) పరిధిలో గల డైక్స్ ట్యాంక్ వాణిజ్య సముదాయము, జగదాంబ జంక్షన్ వద్ద వాణిజ్య సముదాయము, పాత బస్ స్టాండ్ దుకాణాములు, పద్మనగర్ వాణిజ్య సముదాయము, సూర్యబాగ్ వాణిజ్య సముదాయము, టి.ఎస్.ఆర్ కాంప్లెక్స్ వాణిజ్య సముదాయము, అంగడిదిబ్బ వాణిజ్య సముదాయము, జివిఎంసి ప్రధాన కార్యాలయంలోని కాంటీన్, రెల్లి వీధిలోని అంబేద్కర్ కళ్యాణ మండపం, రెల్లివీధి రోడ్ సైడ్ ఫిష్ మార్కెట్లును 3 సంవత్సరముల కాల పరిమితికి గుత్తకు ఇచ్చేందుకు తేదీ 07-11- 2025 ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాట నిర్వహించబడునని జోనల్ కమిషనర్ తెలిపారు. సదరు వేలంపాటలో పాల్గొనదలచిన వారు దరావత్తు సొమ్ము తదితర పూర్తి వివరాలకు 4వ జోనల్ కార్యాలయం పని వేళలో పర్యవేక్షకులను సంప్రదించగలరని జోనల్ కమిషనర్ తెలిపారు.

తెలంగాణ

కేంద్రంలో బిజెపి మోడీ ప్రభుత్వం 44 కార్మిక చట్టాలను కొనసాగిస్తూ, 4 లేబర్ కోడ్స్ రద్దు చేసేవరకు పోరాడాలి.. ఏఐటీయూసీ రామగుండం నగర సమితి అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ లా పిలుపు కనీస వేతనం 26 వేలు ఇవ్వాలి ఏఐటీయూసీ 106వ జయంతోత్సవాలను వారం రోజులపాటు నిర్వహించాలి

పున్నమి అక్టోబర్ 31 గోదావరిఖని: ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ ఏఐటీయూసీ రామగుండం నగర సమితి ఆధ్వర్యంలో గోదావరిఖని డిపో ముందున్న ఆర్ టి సి ఎంప్లాయిస్ యూనియన్ జెండాకు ఏఐటీయూసీ రామగుండం నగర కమిటీ ప్రధాన కార్యదర్శి శనగరపు చంద్రశేఖర్ ఏఐటీయూసీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. బ్రిటీష్ పాలనలోనే కార్మిక హక్కుల కోసం, చట్టాల కోసం పోరాడి గత 100 సంవత్సరాలుగా సంవత్సరాలుగా 44 కార్మిక చట్టాలను సాధించింది ఏఐటీయూసీ. కానీ నేడు కేంద్రంలో బిజెపి మోడి ప్రభుత్వం కార్మిక హక్కులను హరించే విధంగా 29 కార్మిక చట్టాలను రద్దు చేసి 4 లేబర్ కోడ్స్ తీసుకు వచ్చి వ్యాపారం సులభతరం చేసేందుకు ఆదా అని అంబానీలకు లాభం చేకూర్చే విధంగా కార్మికులకు ద్రోహం చేస్తుందని అవి రద్దు చేసే వరకు పోరాటం కొనసాగిస్తామని కార్మిక వర్గానికి పిలుపు నిచ్చారు. బొంబాయి నగరంలో 1920 అక్టోబర్ 31 వ తేదీన ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు లాలా లజపతిరాయ్ అధ్యక్షతన ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటీయూసీ) ఏర్పడిందని, నాటి నుంచి కార్మికవర్గ హక్కుల కోసమేగాక దేశ స్వాతంత్ర్యం కోసం అనేక పోరాటాలు చేసిందన్నారు. ఆ తర్వాత ఆధునిక భారతదేశ నిర్మాణం కోసం అద్వితీయమైన కృషి చేసి, అసాధారణ త్యాగాలు, బలిదానాలు, పోలీసు దాష్టీకాలు,పెట్టుబడుదార్ల గూండాల దాడులు, యావత్ జీవిత శిక్షలు, మరణ దండనలతో ఉన్న సమయంలో యావత్ కార్మిక,ప్రజల పక్షాన ఏఐటీయూసీ ముందుండి పోరాడిందన్నారు. కోట్లాది మంది కార్మికవర్గ గొంతుకగా వారి గుండెల్లో స్థానం సంపాదించుకుందని, ఏఐటీయూసీ ఒకానొక చారిత్రక నేపథ్యంలో ఏర్పడిందని వారు కొనియాడారు.సామ్రాజ్యవాదులు విధించిన నూతన రాజ్యాంగ చట్టానికి బదులుగా “వయోజన ఓటింగ్” హక్కుతో ఒక “రాజ్యాంగ సభ”ను ఏర్పాటు చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసిందన్నారు. సంపూర్ణ స్వాతంత్ర్యం అనే నినాదం ఈ డిమాండ్ ను మొదటి సారిగా లేవనెత్తిన ఘనత ఏఐటీయూసీకే దక్కుతుందన్నారు.ఏఐటీయూసీ స్వాతంత్య్ర పోరాటంలో కీలక భాగంగా వ్యవహరించింది. అందువల్లనే, స్వాతంత్ర్యానంతరం ఏర్పడిన తర్వాత రాజ్యాంగంలో కొన్ని కార్మిక హక్కులకు కొద్దిపాటి హామీలు కల్పించారన్నారు. గత 105 సంవత్సరాలుగా కార్మిక వర్గం అనేక పోరాటాలు, త్యాగాలు చేసి మరి కొన్ని హక్కులను సాధించుకోగలిగింది. కానీ వాటి అమలులో మాత్రం ప్రభుత్వాలు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. న్యాయస్థానాలలోనూ కార్మికులకు సరైన న్యాయం దొరకటం లేదు. కేంద్రంలో నరేంద్రమోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత, 29 కార్మిక చట్టాలను రద్దుచేసి, 4 ‘కోడ్స్’గా అమల్లోకి తీసుకు వస్తున్నారు. కార్మిక వర్గాన్ని బ్రిటీష్ కాలం నాటి దుర్భర పరిస్థితికి నెట్టేస్తున్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం. *ఇప్పుడేమో నాలుగు కార్మిక కోడ్ల కొనసాగింపుగా “శ్రమ్ శక్తి ఎన్ఐటీఐ 2026” పేరుతో నూతన జాతీయ కార్మిక విధానాన్ని ముందుకు తీసుకొస్తున్నారని, వీటిని రద్దు చేయకుంటే పోరాటాలు తప్పవని ఏఐటీయూసీ రామగుండం నగర సమితి అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు అబ్దుల్ కరీం, శనిగరపు చంద్రశేఖర్ లు హెచ్చరించారు*. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ నాయకులు బిక్షపతి,మసూద్ దరిపెల్లి శ్రీనివాస్, మామిడిపల్లి శ్రీనివాస్, కార్మికులు శనిగరపు మతీనా ముర్స లీన్ శేఖర్ శంకర్ శనిగరపు తిరుమల, ఉషాకోయిలా రసజ్ఞ, బి అనిల్ కుమార్,కాసిపేట రాజేశ్వరి,రామగిరి లక్ష్మి, ఠాకూర్ కళావతి, పుల్యాల రాధా, బొందెల సంగీత, పొడి శెట్టి సుగుణ వసంత, పురుషోత్తం పావురం తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

జీవీఎంసీలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు – 2025

జీవీఎంసీలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు – 2025 * ఉద్యోగులు అవినీతి రహితంగా , ప్రజాసేవా భావంతో విధులు నిర్వహించాలి. • ఏసీబీ ఫోన్ నెంబర్ 1064 ప్రజలకు నిత్యం అందుబాటులో ఉంది. ఉద్యోగులు జాగ్రత్తలు పాటించాలి. ఎ సి బి డి ఎస్ పి – బి. వి. ఎస్. ఎస్. రమణమూర్తి . *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*; ప్రభుత్వ ఉద్యోగులు అవినీతి రహితంగా ప్రజాసేవ భావంతో తమ విధులను నిర్వహించాలని అవినీతి నిరోధక శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ బి. వి. ఎస్. ఎస్. రమణమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన 2025 విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సందర్భంగా “విజిలెన్స్ – మన ఉమ్మడి బాధ్యత ” అనే కార్యక్రమాన్ని జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో జీవీఎంసీ కార్యదర్శి బి . వి.రమణ,డిప్యూటీ కమిషనర్ రెవెన్యూ ఎస్. శ్రీనివాసరావు నాతో కలిసి జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులకు , సచివాలయ వార్డు కార్యదర్శులకు అవినీతి నిర్మూలనపై అవగాహనను కల్పించారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులందరితో అవినీతి రహితంగా ఉద్యోగాలను నిర్వహిస్తామనే ప్రతిజ్ఞను చేయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి పురస్కరించుకొని 2025 అక్టోబర్ 27 నుండి సెప్టెంబర్ 22 వరకు అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో 2025 విజిలెన్స్ అవగాహన వారోత్సవాలు సందర్భంగా” విజిలెన్స్ – మన ఉమ్మడి బాధ్యత ” అనే నినాదంతో చేపట్టిన ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు ,ఉద్యోగులు, సచివాలయ వార్డు కార్యదర్శులకు అవగాహన కల్పించడం జరిగిందన్నారు. ప్రతి ప్రభుత్వ ఉద్యోగి అవినీతిరహితంగా,ప్రజాసేవా భావంతో విధులు నిర్వహిస్తూ ప్రజల మన్ననలను పొందుతూ ప్రభుత్వానికి మంచి పేరును తీసుకురావాలని సూచించారు. మనందరం ప్రభుత్వ ఉద్యోగులమేనని ప్రభుత్వం మన పనికి తగిన జీతం ఇస్తుందని, అందువలన ప్రజలు అందించే సేవలలో ఎటువంటి లాభాపేక్ష ఆశించకుండా వారికి సహకరించాలన్నారు. సంస్థలో ఒకరు అవినీతి చేస్తే ఆ చెడ్డపేరు ఆ సంస్థకు వస్తుందని, ఉద్యోగ ధర్మంతో పాటు బాధ్యతలు తెలుసుకొని ప్రజలకు సహాయం చేయాలన్నారు. ఉద్యోగులు సేవా భావంతో చేసే నిజాయితీ, నిబద్ధతలకు ప్రతిఫలంగా మంచి ఫలితాలు దక్కుతాయన్నారు . ధర్మాన్ని వీడి అవినీతి జోలికి పోరాదని, అవినీతితో సంపాదించే సొమ్ము కుటుంబాన్ని రోగాలలో నెట్టుతోందని, అది ఎప్పుడూ నిలవదని తెలిపారు. అవినీతి నిరోధశాఖకు చిన్న ,పెద్ద, స్త్రీ పురుష, లింగ బేధం అన్న తేడా ఉండదని ఉద్యోగి ఏ స్థాయిలో వాడైన అవినీతి చేస్తే వదలదని, ఏసీబీలో ఎన్నో సెక్షన్లు ఉన్నాయని వాటిలో ఏ సెక్షన్ కిందనైనా ఉద్యోగి దొరికితే జైలు పాలై కోర్టుల చుట్టూ తిరగడంతో పాటు ఉద్యోగం నుండి తొలగించడం జరుగుతుందని, దీని వలన కుటుంబం, పిల్లల భవిష్యత్తు నాశనం అవ్వడమే కాకుండా సమాజంలో, కులంలో బంధువులు దూరం చేస్తారన్నారు . దేశంలో ఉద్యోగులందరూ ఐక్యమత్యంతో ఎటువంటి అవినీతికి తావివ్వకుండా తమ ఉద్యోగ ధర్మాన్ని నెరవేస్తే దేశం ఎంతో సుభిక్షంగా ఉంటుందన్నారు .తల్లిదండ్రులు తమ పిల్లలకు చిన్నప్పటినుండి మంచి నడవడిక, ధర్మం, పుణ్యం వంటివి నేర్పాలన్నారు. ప్రజలు ప్రభుత్వ సేవలకు ఉద్యోగుల వద్దకు వచ్చినప్పుడు అవినీతి రహితంగా సేవలందించాలని, లంచం అడిగితే ప్రజలు సిద్ధమై తప్పకుండా ఏసీబీ ఫోన్ నెంబర్ 1064 కు ఫోన్ చేస్తారని, ఆపై లంచం తీసుకుంటూ ప్రభుత్వ ఉద్యోగులు పట్టు పడడం ఖాయమని ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటివరకు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన ఉద్యోగులు ఏ విధమైన దుర్బల జీవితాన్ని అనుభవిస్తున్నారో వివరించారు. అనంతరం ఆయన ఈ వారోత్సవాలలో భాగంగా నవంబర్ 2వ తేదీ ఆదివారం ఉదయం 6 గంటలకు ఆర్కే బీచ్ నుండి పార్కు హోటల్ వరకు నిర్వహించనున్న సైకిల్ ర్యాలీలో జీవీఎంసీ అధికారులు, ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొనాలని డి.ఎస్.పి రమణమూర్తి కోరారు. మన ఉద్యోగం ప్రజలకు సేవ చేసే ఉద్యోగం అని మన అధికారాన్ని , ఉద్యోగ ధర్మాన్ని సద్వినియోగం చేసుకొని ఎటువంటి అవినీతికి, లాభపేక్షకు తావివ్వకుండా సమస్యలతో వచ్చిన వారి సమస్యలను మన సమస్యలుగా భావించి విధులు నిర్వహించి సంస్థకు కుటుంబానికి మంచి పేరు ప్రతిష్టలు తీసుకురావాలని జీవీఎంసీ డిప్యూటీ కమిషనర్ (రెవిన్యూ) శ్రీనివాసరావు పేర్కొన్నారు . ప్రభుత్వ ఉద్యోగులుగా మనం చేరిన నాటి నుండి మన బాధ్యతలు తెలుసుకొని ప్రజలకు సేవ చేసే మంచి గుణాన్ని అలవరచుకోవాలని, పాపం, పుణ్యం, ధర్మం వీటిని తెలుసుకొని ప్రజలకు సేవ చేయు ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని జీవీఎంసీ కార్యదర్శి బీ.వీ. రమణ తెలిపారు. అనంతరం అవినీతి నిరోధక శాఖ ఇన్స్పెక్టర్ శ్రీనివాసరావు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన జ్ఞాపకార్థంగా దేశంలో అతిపెద్ద సంస్థ అయిన అవినీతి నిరోధక శాఖ అవినీతికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. లంచం అడిగినా, తీసుకున్నా ,ప్రభుత్వ ఆస్తులు కొల్లగొట్టినా నేరమేనని, మనం సమాజ సేవ కొరకు విధులు నిర్వహిస్తున్నామని, అవినీతి శాఖ కేసులో ఇరుక్కుంటే వారి కుటుంబం పై భారం పడుతుందని ,ఉద్యోగి జీవితం చాలా దుర్భలంగా మారుతుందన్నారు. మనకు ప్రభుత్వం ఇచ్చిన జీతంతోనే సర్దుకోవాలని ఎటువంటి అవినీతి కార్యక్రమాలకు పాల్పడరాదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్లు మల్లయ్య నాయుడు ,బి .రాము ,కె .కనకమహాలక్ష్మి, బి.ఆర్.ఎస్ .శేషాద్రి, అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఎ .అప్పలనాయుడు , స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజు,అధికారులు, ఉద్యోగులు, సచివాలయాల వార్డు కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

వీధి నాటికతో విజిలెన్స్ అవేర్‌నెస్‌కు నూతన అర్థం – శ్రిష్టి వరల్డ్ స్కూల్ విద్యార్థుల వినూత్న ప్రదర్శన

విశాఖ,ఉక్కునగరం అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖ ఉక్కు పరిశ్రమ (RINL) ఆధ్వర్యంలో జరుగుతున్న “విజిలెన్స్ అవేర్‌నెస్ వీక్” కార్యక్రమంలో భాగంగా, ఉక్కునగరంలో ఒక విభిన్నమైన సృజనాత్మక ప్రదర్శన ఆకట్టుకుంది. శ్రిష్టి వరల్డ్ స్కూల్ విద్యార్థులు ప్రజల్లో అప్రమత్తత (Vigilance) పై అవగాహన కల్పించే ఉద్దేశ్యంతో “వీధి నాటిక (Street Play)” ప్రదర్శించారు. ఈ కార్యక్రమం శ్రిష్టి వరల్డ్ స్కూల్ వ్యవస్థాపకులు మరియు డైరెక్టర్ శ్రీమతి పి. సుశీల రాణి గారి మార్గదర్శకత్వంలో, తెలుగు విభాగం మరియు క్రియేటివ్ టీమ్ సమన్వయంతో నిర్వహించబడింది. విద్యార్థులు తమ ప్రతిభను, నటనను, సందేశాత్మక సంభాషణలను చక్కగా మేళవించి, “విజిలెన్స్ అనేది ప్రతి పౌరుడి బాధ్యత” అనే స్పూర్తిదాయక సందేశాన్ని ప్రేక్షకుల మనసుల్లో నాటారు. నిజాయితీ, నైతికత, మరియు బాధ్యతతో వ్యవహరించడం ద్వారా మాత్రమే సమాజంలో పారదర్శకత నెలకొంటుందని నాటిక ద్వారా విద్యార్థులు స్పష్టంగా తెలియజేశారు. ఈ ప్రదర్శనకు ప్రేక్షకుల నుండి విశేషమైన ప్రశంసలు లభించాయి. విద్యార్థుల ఉత్సాహం, సృజనాత్మకత, సమకాలీనత – ఈ కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆర్‌ఐఎన్‌ఎల్ నిర్వహించిన ఈ కార్యక్రమం, విజిలెన్స్ వారంలో భాగంగా సమాజంలో అప్రమత్తతకు, నిజాయితీకి ప్రాధాన్యం పెంపొందించే దిశగా విజయవంతమైన అడుగుగా నిలిచింది.

తిరుపతి

నేడు శ్రీకాళహస్తిలో రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం

శ్రీకాళహస్తి అక్టోబర్ 31 , పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి పట్టణంలోని శ్రీ దక్షణ కైలాస నగర్ సమీపంలో ఉన్న డాక్టర్ చంద్రశేఖర్ అకాడమీలో శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రస్థాయి క్రీడలు ప్రారంభం కానున్నట్లు శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ, కూటమి కుటుంబ సభ్యులు ప్రకటన ద్వారా తెలిపారు. ఈ క్రీడా పోటీలు 01.10.25 శనివారం నుండి 03.10.25 సోమవారం జరుగునని ఈఐ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రీడాభివృద్ధి (శాప్) చైర్మన్ అనిమిని రవి నాయుడు విచ్చేయుదురని టిడిపి నాయకులు తెలిపారు. ఈ క్రీడలను వీక్షించేందుకు క్రీడాకారులు, క్రీడాభిమానులు, పట్టణ ప్రజలు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు, ప్రతి ఒక్కరు కార్యక్రమాని వీచ్చేసి జయప్రదం చేయలన్నారు.

ఆంధ్రప్రదేశ్

ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి…

హనంకొండ జిల్లా కేంద్రంలో ఈరోజు ఉదయం 9:30 గంటలకు కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘం SC సెల్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ. ఇందిరా గాంధీ గారి 41 వ వర్ధంతి సందర్బంగా ఇందిరా గాంధీ గారి చిత్రపటానికి పూలమాలలువేసి, నివాళులు అర్పించి, వర్ధంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో SC సెల్ రాష్ట్ర కమిటీ వైస్-చైర్మన్ డాక్టర్. మడికొండ శ్రీను, రాష్ట్ర కన్వీనర్, ఉమ్మడి జిల్లా ఇంచార్జి దళిత రత్న దబ్బేట రమేష్, రాష్ట్ర కన్వీనర్ అర్షం అశోక్, నాయకులు వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జీ.ఓ. నెం. 23 ప్రకారం పేదలందరికీ ఇళ్లు – కొత్త బిల్డింగ్ కోసం దరఖాస్తు విధానం

కొత్త ఇంటి నిర్మాణానికి ఎలా అప్లై చెయ్యాలో తెలుసుకోండి. గత ప్రభుత్వంలో మీకు ఇల్లు స్థలం వచ్చి ఉంటే ఇప్పుడు కొత్త బిల్డింగ్‌కు దరఖాస్తు చేసే అవకాశం ఉంది. జీ.ఓ. నెంబర్ 23 ప్రకారం అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి ఇళ్లు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోవడానికి ఈ లింక్‌ను చూడండి: https://youtu.be/g1NIEoaiMKI?si=fPVwPFHJB4I4JQtE

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ పునరుద్ధరణ – ప్రైవేట్ ఆసుపత్రులతో ప్రభుత్వ చర్చలు సఫలం

ఎన్టీఆర్ వైద్య సేవలు (ఆరోగ్యశ్రీ) పథకం కింద సేవలను నిలిపివేసిన ప్రైవేట్ హాస్పిటల్స్ మళ్లీ సేవలు పునరుద్ధరించనున్నాయి. ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. నవంబర్ చివరికల్లా పెండింగ్ బకాయిలు మొత్తం చెల్లించేలా ప్రభుత్వం హామీ ఇచ్చింది. దీనితో రోగులకు మళ్లీ ఆరోగ్యశ్రీ సదుపాయం అందుబాటులోకి రానుంది.

ఎన్ టి ఆర్ జిల్లా

తుఫాను ప్రభావిత కుటుంబా లకు నిత్యావసర సరుకుల పంపిణీ – నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి

ప్రభుత్వ విప్ మరియు నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆదేశాల మేరకు, ఇటీవల తుఫాను ప్రభావంతో నందిగామ పట్టణం లోని పలు వార్డుల్లో అకాల వర్షాలు, వరదల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు సహాయ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా నందిగామ మున్సిపల్ చైర్‌పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమి నాయకులు మరియు పట్టణ అధికారులతో కలిసి బాబు జగజ్జీవన్ రామ్ కమ్యూనిటీ హాల్ నందు ఆశ్రయం పొందిన కుటుంబాలకు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు. మండవ కృష్ణకుమారి మాట్లాడు తూ, ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్కనే ఉంటుందని, విపత్తు సమయంలో ఎవరూ ఇబ్బంది పడకుండా ప్రతి కుటుంబానికి అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అలాగే తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో శుభ్రతా కార్యక్రమాలు, మురుగు నీరు తొలగింపు పనులు వేగంగా కొనసాగుతున్నాయని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కౌన్సిలర్లు, స్థానిక నేతలు, అధికారులు మరియు స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి నిధులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.