Tuesday, 7 April 2026

Blog

విశాఖపట్నం

రన్ ఫర్ యూనిటీ నందు పాల్గొన్న నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు.*

*రన్ ఫర్ యూనిటీ నందు పాల్గొన్న నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు.* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* నగరంలోని వుడా చిల్డ్రన్ ఎరీనా కూడలి నుండి సర్క్యూట్ హౌస్ వద్ద గల పటేల్ జంక్షన్ వరకూ నిర్వహించిన ఈ ఐక్యత ర్యాలీ (రన్ ఫర్ యూనిటీ) నందు నగర సీపీ గారు, పోలీసు అధికారులు మరియు సిబ్బంది తో పాల్గొని, అందరిలో ఐక్యత స్ఫూర్తి నింపారు. పటేల్ జంక్షన్ వద్ద ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి సీపీ గారు పూలమాల వేసి నివాళులర్పించారు, ఈ సందర్భంగా సిపి గారు మాట్లాడుతూ ఈ రోజు ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ పుట్టినరోజు అక్టోబర్ 31 రాష్ట్రీయ ఏక్తాదివాస్ గా మనము ఘనంగా జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రతిచోట ఏక్తాదివాస్ ఐక్యతకు గుర్తుగా జరుపుకుంటున్నాం. మనందరికీ తెలుసు మనకు స్వాతంత్రం వచ్చినప్పుడు చూస్తే మన దేశం ఈ పరిస్థితిలో లేనే లేదు హైదరాబాద్, గోవా, కాశ్మీర్ ఇంకా చాలా ప్రెసిడెన్సిలుగా ఉండేవి, వాటి ఏకీకరణ అప్పుడు చాలా కష్టమైన పనిగా ఉన్నా, అప్పటి మన హోమ్ మినిస్టర్ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు పగలు రాత్రి కృషిచేసి, కష్టపడి కొన్నిచోట్ల ఐక్యత కోసం తెలియపరచి, మిలటరీ యాక్షన్ ద్వారా అన్ని ప్రెసిడెన్సీలను ఏకం చేశారు. కాబట్టి కులమత భాషలు ఎన్ని ఉన్నా దేశ ఐక్యత కోసం ఆయన తన జీవితం అంకితం చేశారు. ఈ రోజుకి కూడా ప్రపంచంలోని యూనిటీ అండ్ డైవర్సిటీ కు ప్రతీకగా భారతదేశం ఉంది. సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు చూపించిన మార్గం, సందేశం మనందరం గుర్తుపెట్టుకోవాలి. మన పోలీసు వ్యవస్థ కూడా అంత చక్కగా ఉంది అంటే ఆయన ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం మనం నడుపుతున్నాం కాబట్టి పోలీసు వ్యవస్థ మీద ప్రజలకు నమ్మకం ఉంది, ఆయన ఈరోజు మన మధ్య లేకపోయినా, ఆయనను స్ఫూర్తిగా తీసుకోవాలి, ఐక్యతకు గుర్తుగా ప్రతీకగా తీసుకొని ఈ రోజు ఈ పరుగు ఆయనకు అంకితం, ఆయన చూపించిన మార్గానికి అంకితం. మీరందరూ ఇలాగే ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన దేశం కోసం ఎటువంటి త్యాగం అయినా చేయడానికి సిద్ధంగా ఉంటారని ఆశిస్తూ ఈరోజు మీ అందరికీ రాష్ట్రీయ ఏక్తాదివాస్ అభినందనలు శుభాకాంక్షలు, ఆయనను స్ఫూర్తిగా తీసుకొని మన విశాఖపట్నం సిటీ పోలీస్ కూడా మంచి పేరు తీసుకొస్తారని ఆశిస్తున్నాను అని తెలిపారు. అనంతరం నగర సిపి డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు , నగర పోలీసు అధికారులు, సిబ్బందితో దేశ ఐక్యతకు, అంతర్గత భద్రతకు కట్టుబడి ఉంటామని ప్రమాణం చేయించారు.

విశాఖపట్నం

స్వర్గీయ శ్రీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా “జాతీయ సమైక్యతా దినోత్సవం” (రాష్ట్రీయ ఏక్తా దివస్) లో భాగంగా నివాళులు అర్పించిన డీఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ గారు*

*స్వర్గీయ శ్రీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా “జాతీయ సమైక్యతా దినోత్సవం” (రాష్ట్రీయ ఏక్తా దివస్) లో భాగంగా నివాళులు అర్పించిన డీఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ గారు* *విశాఖపట్నం,అక్టోబర్ పున్నమి ప్రతినిధి:* దేశ సమైక్యత, ఐక్యత మరియు సమగ్రతకు ప్రతీకగా నిలిచిన ఉక్కు మనిషి, స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ నిర్మాణ శిల్పి, భారతదేశ తొలి ఉప ప్రధానమంత్రి మరియు హోం మంత్రి స్వర్గీయ శ్రీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారి జయంతి సందర్భంగా, విశాఖపట్నం రేంజ్ పోలీసు కార్యాలయంలో “జాతీయ సమైక్యతా దినోత్సవం (రాష్ట్రీయ ఏక్తా దివస్)” ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డీఐజీ శ్రీ గోపినాథ్ జట్టి, ఐపీఎస్ గారు పటేల్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తదనంతరం ఆయన మాట్లాడుతూ — భారత స్వాతంత్య్రానంతరం దేశంలోని అనేక రాచరిక రాష్ట్రాలను భారత యూనియన్‌లో విలీనం చేయడంలో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ గారు పోషించిన అత్యంత కీలక పాత్ర దేశ చరిత్రలో చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన చూపిన దారిలోనే మనం దేశ సమైక్యత, సమగ్రత, భద్రతను కాపాడటానికి అంకితభావంతో సేవ చేయాలని పోలీసు సిబ్బందిని పిలుపునిచ్చారు. తరువాత పోలీసు సిబ్బందితో కలిసి దేశ ఐకమత్యం, సమగ్రత, అంతర్గత భద్రతను కాపాడేందుకు అంకితమవుతామనే ప్రతిజ్ఞ చేయించడం జరిగింది. దేశ ప్రజలలో సమైక్యతా భావాన్ని మరింతగా పెంపొందించేందుకు కృషి చేస్తామని డీఐజీ గారు తెలిపారు. ఈ కార్యక్రమంలో కార్యాలయం మేనేజర్ బాల సూర్యారావు, ఇతర అధికారులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

అద్భుతం… మాయా ప్రపంచం * బీచ్ రోడ్ లో మాయా వరల్డ్ ను ప్రారంభించిన VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు

అద్భుతం… మాయా ప్రపంచం * బీచ్ రోడ్ లో మాయా వరల్డ్ ను ప్రారంభించిన VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* విశాఖ సాగర తీరంలో TU 142 ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన *మాయా వరల్డ్ ను* VMRDA చైర్మన్ శ్రీ ఎం వి ప్రణవ్ గోపాల్ గారు ప్రారంభించారు. శుక్రవారం ఉదయం జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి మాయా వరల్డ్ ను సందర్శించిన తదుపరి ఆయన మాట్లాడుతూ ఈ మాయా వరల్డ్ దేశంలోనే మొదటిసారిగా విశాఖలో ఏర్పాటు చేయటం అభినoదనీయమని పేర్కొన్నారు. వి ఎం ఆర్ డి ఎ ప్రాంగణంలో మాయా వరల్డ్ నగర వాసులతో పాటు పర్యాటకులను మరింత ఆకట్టుకునేలా ఉందని తెలిపారు. ప్రపంచంలో ప్రసిద్ధి చెందిన “ఇమాజిన్ రూమ్స్” తరహాలో రూపొందించిన ఈ మ్యూజియం, కళ్లకు కనువిందు చేసే లైటింగ్, అద్దాల ప్రతిబింబాలతో అద్భుత అనుభూతిని కలిగిస్తోందనీ తెలిపారు. మ్యూజియంలో మిరర్ రూమ్స్, స్పేస్ గెలాక్సీ థీమ్, ఫ్లవర్ గార్డెన్ థీమ్, డ్రీమ్ స్కేప్, మెజికల్ ఫారెస్ట్ లాంటి ప్రత్యేక కాన్సెప్ట్‌లతో ఏర్పటు చేసిన గదుల్లో సంచరిస్తే వింత అనుభూతి లభిస్తుందని చెప్పారు. ఫోటోషూట్లకు, రీల్స్‌ తీయడానికి ఇది సరిగ్గా సరిపోయే ప్రదేశమని చెప్పారు. సెల్ఫీలకు, వీడియోలకు అనువైన ప్రాంతంగా పేర్కొన్నారు. కార్యక్రమంలో జాయింట్ కమిషనర్ శ్రీ కె రమేశ్ గారు, ఈ ఈ దుర్గా ప్రసాద్ గారు, డి ఈ మూర్తి గారు, మాయా వరల్డ్ నిర్వాహకులు Capt. NR కుమార్ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

36వ వార్డులో జామియా మసీదును సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*36వ వార్డులో జామియా మసీదును సందర్శించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *మసీదు నిర్మాణ పనులు పరిశీలించిన ఎమ్మెల్యే* *ఎన్ని ఇబ్బందులు ఎదురైనా మసీదు నిర్మాణం ఇచ్చిన మాట ప్రకారం పూర్తి చేయడంజరిగిందని తెలిపిన ఎమ్మెల్యే* *ఎమ్మెల్యే వంశీకృష్ణ గారికి ఘన స్వాగతం పలికిన మసీద్ పెద్దలు, యువత* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* జామియా మసీద్ పునర్నిర్మాణానికి పూర్తి సహాయ సహకారాలు అందించిన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారికి మసీదు పెద్దలు, యువత ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఇచ్చిన హామీ ప్రకారం మసీదు నిర్మాణం చేపట్టడం జరిగిందని తెలియజేశారు. నిర్మాణానికి సహాయ సహకారాలు అందించిన వక్ బోర్డు వారికి మరియు మసీదు కమిటీకి ధన్యవాదాలు తెలియజేశారు. తాను మాటమీద నిలబడే మనిషినీ అని, ఇచ్చిన హామీని నెరవేర్చడం తన బాధ్యతగా స్వీకరిస్తారని మరొకసారి తెలియజేశారు . విశాలమైన ప్రాంతంలో సుందరమైన మసీదు నిర్మాణం చేపట్టడం జరిగింది అని అన్నారు. అనంతరం మసీదు కమిటీ రెన్యువల్ కాపీని అందజేశారు. చివరిగా గార్విషరీఫ్ లో పాల్గొని విందు స్వీకరించారు. కార్యక్రమంలో వక్ బోర్డ్ ఇన్స్పెక్టర్ అహ్మద్, మసీద్ అధ్యక్షులు అక్బర్ బాషా మరియు పెద్దలు షరీఫ్ , రహమతుల్లా, షకీల్ , సలీం మరియు స్థానిక వార్డు కార్పొరేటర్ శ్రీమతి మాసిపోగుమేరీ జాన్స్ రాజుగారు, నియోజవర్గ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివప్రసాద్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు జీకే గారు, జనసేన యువజన విభాగం నేత శ్రీ శివ గణేష్ గారు, ఇతర నాయకులు పాల్గొన్నారు..

విశాఖపట్నం

తుఫాన్ ప్రభావంతో పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులను మరియు తక్షణ ఆర్థిక సహాయం కింద నగదును అందజేసిన ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*తుఫాన్ ప్రభావంతో పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులను మరియు తక్షణ ఆర్థిక సహాయం కింద నగదును అందజేసిన ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* తుఫాన్ ప్రభావంతో పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు నిత్యా వసర వస్తువులను మరియు తక్షణ ఆర్థిక సహాయం కింద నగదును దక్షిణ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు టర్నర్ చౌట్రీ వద్ద గల ఎమ్మార్వో కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తుఫాను ప్రభావం అధికంగా లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతల సమన్వయంతో తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలియజేశారు. గౌరవ ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ,ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు సమర్థవంతంగా పనిచేసారని ,తుఫాను నుంచి ప్రజలను రక్షించారని తెలిపారు . నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రణాళిక బద్దంగా సహాయ సహకారాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానీదని ఈ సందర్భంగా తెలిపారు. తుఫాను ప్రభావానికి గురైన మత్స్యకారులకు 50 కేజీల బియ్యంతో పాటు ఆరు రకాల ఆరు రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో శ్రీ లచ్చన్న పాత్రుడు కూటమి నేతలు శ్రీ శివప్రసాద్ రెడ్డి గారు, శ్రీ మాసిపోక రాజుగారు ,శ్రీ జి కే గారు ,శ్రీ శివ గణేష్ గారు, శ్రీమతి రాజేశ్వరి గారు, శ్రీ రాజు గారు, శ్రీ కుమార్ గారు, శ్రీమతి యజ్ఞశ్రీ గారు ప్రభుత్వ అధికారులు ఏ ఎస్ ఓ శ్రీహరి గారు ఇతర అధికారులు పాల్గొన్నారు

విశాఖపట్నం

అన్నా క్యాంటీన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*అన్నా క్యాంటీన్లో ఆకస్మిక తనిఖీ నిర్వహించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు టర్నల్ చౌట్రీ అన్న క్యాంటీన్ ను ఆకస్మితి తనిఖీ నిర్వహించారు. మధ్యాహ్నం భోజన సమయంలో కాంటీన్ వచ్చిన వారితో మాట్లాడి సమయానికి తెరుస్తున్నారా లేదా ఆహార పదార్థాలు నాణ్యత ఎలా ఉందని, ఏమైనా ఫిర్యాదులు ఉన్నాయా అని స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఆహార పట్టిక, టోకెన్ కౌంటర్, ఆహార పదార్థాలను వడ్డిస్తున్న స్థలం, డైనింగ్ ఏరియాతో పాటు తాగునీరు అందించే ఏర్పాట్లు పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ క్యాంటీన్ పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలని, నాణ్యతలో ఏటువంటి సమస్య తలెత్తకూడదని నిర్వహణకు తెలిపారు .రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రతిష్టాత్మకంగా, ప్రజా శ్రేయస్సుతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ల పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపించాలని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు…

విశాఖపట్నం

వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ఈస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు

వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా ఈస్టర్న్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా, ఈస్ట్రన్ నావల్ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్-ఇన్-చీఫ్ (FOC-in-C)గా 2025 అక్టోబర్ 31న విశాఖపట్నంలో జరిగిన సాంప్రదాయ పరంగా ఘనంగా జరిగిన పరేడ్‌లో బాధ్యతలు స్వీకరించగా, వైస్ అడ్మిరల్ రాజేశ్ పెంఢార్కర్ పదవీ విరమణ చేశారు. ఈ సందర్భంగా సంజయ్ భల్లా గౌరవ వందనాన్ని పరిశీలించి, నావికులు మరియు డీఎస్‌సీ సిబ్బందిని సమీక్షించారు. ఈ కార్యక్రమానికి అన్ని ఫ్లాగ్ అధికారి, నౌకలు, జలాంతర్గాములు, స్థావరాల కమాండింగ్ అధికారి హాజరయ్యారు. భారత నౌకాదళంలో వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా సేవలు 1989 జనవరి 1న ప్రారంభమయ్యాయి. 36 సంవత్సరాల సమృద్ధిగా కొనసాగిన కెరీర్‌లో ఆయన సముద్రంలో, భూభాగంలో అనేక కమాండ్, స్టాఫ్ బాధ్యతలు నిర్వహించారు. కమ్యూనికేషన్ మరియు ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్‌లో ప్రత్యేకత సాధించిన ఆయన, దేశ నౌకాదళానికి చెందిన అనేక ముందస్తు యుద్ధ నౌకలలో సేవలందించారు. అనంతరం INS నిశాంక్, INS తరగిరి, INS బియాస్‌లకు కమాండింగ్ ఆఫీసరుగా, అలాగే ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ ఈస్టర్న్ ఫ్లీట్ (FOCEF)గా సేవలందించారు. ఆయన హయాంలో, వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా అధ్యక్ష్‌పతిగారి నౌకా సమీక్ష (PFR-22) మరియు పలు దేశాల పాల్గొనిన మిలాన్-22 బహుళజాతీయ యుద్ధ విన్యాసాలకు వ్యూహాత్మక కమాండర్‌గా వ్యవహరించారు. నౌకా కేంద్రంలో ACOP (HRD), వెస్ట్రన్ నావల్ కమాండ్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, డైరెక్టర్ MDCC వంటి కీలక భూమిపై పోస్టులో, విదేశీ దౌత్య బాధ్యతలు నిర్వహించారు. FOC-in-C (ఈస్ట్)గా బాధ్యతలు స్వీకరించే ముందు ఆయన నావల్ హెడ్‌క్వార్టర్స్‌లో చీఫ్ ఆఫ్ పర్సనల్ (COP)గా ఉన్నారు. COPగా నియామకాలు, శిక్షణ అభివృద్ధి, నౌకాదళ సిబ్బందికి సమగ్ర సంక్షేమ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేశారు. వైస్ అడ్మిరల్ సంజయ్ భల్లా రాయల్ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ స్టడీస్ (లండన్), నావల్ వార్ కాలేజ్ (గోవా), డిఫెన్స్ సర్వీసెస్ స్టాఫ్ కాలేజ్ (వెల్లింగ్టన్) పూర్వ విద్యార్థి. ఆయన ఎం.ఫిలి (డిఫెన్స్ & స్ట్రాటెజిక్ స్టడీస్), కింగ్స్ కాలేజ్ లండన్ నుండి ఇంటర్నేషనల్ సెక్యూరిటీ & స్ట్రాటెజిక్ స్టడీస్‌లో మాస్టర్స్, మద్రాస్ యూనివర్సిటీ నుండి ఎం.ఎస్‌సి (డిఫెన్స్ & స్ట్రాటెజిక్ స్టడీస్), సీయూఎస్ఏటి నుండి ఎం.ఎస్‌సి (టెలికాం) చేస్తూ విద్యను పూర్తిచేశారు. ఆయన విశిష్ట సేవకి గుర్తింపుగా అతి విశిష్ట సేవా పతకం (ఏవీఎస్‌ఎం) మరియు నౌ సేవా పతకం (ఎన్‌ఎం) కలిపి గౌరవాలు పొందారు.

విశాఖపట్నం

యుపిఎస్సి పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు*

*యుపిఎస్సి పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు* *జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మయూర్ అశోక్* *విశాఖ‌ప‌ట్ట‌ణం,అక్టోబర్ పున్నమి ప్రతినిధి* : జిల్లాలో నవంబర్ 2వ తేదీన జరగబోయే యుపిఎస్సి ( యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్) పరీక్షల నిర్వహణకు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను జిల్లా జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో జాయింట్ కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నవంబర్ 2వ తేదీన జిల్లాలో నిర్వహించబోయే యుపిఎస్సి పరీక్షల నిర్వహణకు సంబంధించి అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ మొత్తం 3268 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరుకానున్నట్లు తెలిపారు. 7 సెంటర్లలో పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని, జనరల్ ఆటిట్యూడ్ టెస్ట్ పరీక్ష ఉదయం 9:30 గంటల నుంచి 11:30 గంటల వరకు, ఆయుర్వేద టెస్ట్ మధ్యాహ్నం 2.00 గంటల నుంచి 4.00 గంటల వరకు నిర్వహించడం జరుగుతుందన్నారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు ఆయా సెంటర్లకు ముందుగా చేరుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాలలో అభ్యర్థులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా విద్యుత్, మెడికల్, జీవీఎంసీ, పోలీసు శాఖలు పూర్తిస్థాయిలో ఏర్పాట్లు చేయాలన్నారు. ముగ్గురు రూట్ అధికారులను, 7 సెంటర్లకు ఏడుగురు తనిఖీ అధికారులను నియమించినట్లు తెలిపారు.

విశాఖపట్నం

ఈ రోజు సాయంత్రం ద్వారకా పోలీసు స్టేషన్ (లా & ఆర్డర్) ను ఆకస్మికంగా సందర్శించి ,ఇన్ స్పెక్షన్ చేపట్టిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు*

ఈ రోజు సాయంత్రం ద్వారకా పోలీసు స్టేషన్ (లా & ఆర్డర్) ను ఆకస్మికంగా సందర్శించి ,ఇన్ స్పెక్షన్ చేపట్టిన నగర పోలీసు కమీషనర్ డా.శంఖబ్రత బాగ్చి, ఐ.పి.ఎస్., గారు* *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి* పోలీసు స్టేషన్ మొత్తం పరిశీలించిన సిపి గారు స్టేషన్ ఫైళ్లను, కేసుల ఫైళ్లను నిశితంగా పరిశీలించి, అన్ని రిజిస్టర్లు అప్డేటెడ్ గా ఉన్నవీ, లేనిదీ పరిశీలించారు.ఫిర్యాదుదారులతో మాట్లాడి వారి సమస్యలు స్టేషన్ నందు పరిష్కరిస్తున్న తీరు తెలుసు కున్నారు, స్టేషన్ పరిసరాలు మొత్తం పరిశీలించిన సీపీ గారు స్టేషన్ ఆవరణ మొత్తం ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలనీ ఆదేశించారు

తెలంగాణ

రెగ్యులర్ గా పాఠశాలకు హాజరు కావాలన్నా : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి ) బాగా చదువుకోవడం ద్వారా సమాజంలో ఉన్నత స్థానాలు అధిరోహించవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి విద్యార్థినిలకు సూచించారు. ఇందుకాను రెగ్యులర్ గా పాఠశాలకు హాజరుకావాలని అన్నారు. శుక్రవారం ఆమె నల్గొండ జిల్లా తిరుమలగిరి సాగర్ మండలంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థుల హాజరు రిజిస్టర్ ను అదేవిధంగా, ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ ను పరిశీలించారు. పేస్ రికగ్నిషన్ ఆఫ్(FRS) ధ్వారా ఆన్లైన్ లో అటెండెన్స్ పరిశీలించారు. కలెక్టర్ వెంట మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, జిల్లా విద్యాశాఖ అధికారి బిక్షపతి, కేజీబీవీ ప్రిన్సిపల్ కవిత తదితరులు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.