Tuesday, 7 April 2026

Blog

రంగారెడ్డి

*మాట ముచ్చట కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సబితా ఇంద్రారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31 : జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ చేపట్టిన *మాట ముచ్చటలో* భాగంగా సోమాజిగూడ డివిజన్ శ్రీనగర్ కాలనిలో ఓ టిఫీన్ సెంటర్ లో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ శాసనసభ్యురాలు సబితా ఇంద్రారెడ్డి స్థానికులతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలు ఎదురుకొంటున్న సమస్యల గురించి సబితా ఇంద్రారెడ్డి ఆరాతీయగా. స్థానికులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామలను అమలు చేయకుండా మమ్మల్ని మోసం చేస్తుందని రెండు సంవత్సరాలు గడుస్తున్నా 420 హామీలలో ఒకటి రెండు మినహాయిస్తే పూర్తి స్థాయిలోఅమలు చేయలేకపోయారని ఇకముందు కూడా అమలు చేయలేరని అర్థమైపోయిందని చెప్పిన స్థానికులు ఏదిఏమైనా తెలంగాణ రాష్ట్రానికి బిఆర్ఎస్ పాలన రావాలని వారి కోరికను వెళ్లబుచ్చారు సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం మళ్ళీ గాడిన పడాలంటే జూబ్లీహిల్స్ నుంచే కేసీఆర్ కి మద్దతు తెలుపుతూ బిఆర్ఎస్ పార్టీ బలపరిచిన జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే అభ్యర్థి మాగంటి సునీతా గోపినాథ్ కారు గుర్తుకు ఓటేసి అత్యధిక మెజారిటీ తో గెలిపించాలన్నారు. కార్యక్రమంలో స్థానికులు, బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

మైనార్టీల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి: లక్ష్మారెడ్డి—ముస్లింలకు 200 కుట్టు మిషన్ల పంపిణీ—కాంగ్రెస్ ప్రభుత్వం, KLR కు ధన్యవాదాలు: మైనార్టీ నేతలు*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31 : ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలే కాకుండా అదనంగా అనేక సంక్షేమ పథకాలను తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అమలు చేస్తున్నామని మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.ఇవాళ మహేశ్వరం నియోజకవర్గ వ్యాప్తంగా 200 మంది ముస్లిం మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. రంగారెడ్డి జిల్లా మైనార్టీ వెల్పేర్ అధికారుల ఆధ్వర్యంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సి హెచ్ యాదయ్య, మార్కెట్ కమిటీ ఇందిరమ్మ కమిటీలు ముస్లిం సోదరీమణులకు అందజేశారు.మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జి లక్ష్మారెడ్డి కృషితో అన్ని వర్గాలకు మేలు, అభివృద్ధి జరుగుతుందని మైనార్టీ నేతలు అన్నారు. కుట్టు మిషన్లతో స్వయం ఉపాధి దొరికిందని మైనార్టీలు హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారికి ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ నేతలు, ఇందిరమ్మ కమిటీ సభ్యులు టెంపుల్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

తిరుపతి

అత్తి వరదరాజ స్వామి కి వివిధ పుష్పాలతో అలంకరణ

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానము నకు అనుబంధాలయమైన శ్రీప్రసన్న వరద రాజస్వామి ఆలయo నందు శుక్రవారం శ్రీ అత్తి వరదరాజ స్వామి వారి పూర్ణాహుతి అనంతరం స్వామివారిని పలు రకాల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించడం జరిగింది.స్వామివారికి విశేష పూజలు నిర్వహించి దూప దీప నైవేద్యాలను సమర్పించారు.అనంతరం భక్తులకు దర్శనం భాగ్యం కల్పించారు.

రంగారెడ్డి

పున్న దినేష్ సుస్మితల వివాహ వేడుకల్లో పాల్గొన..దేప భాస్కర్ రెడ్డి

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 31 : మహేశ్వరం నియోజకవర్గం రామకృష్ణాపురం డివిజన్ కంటెస్టెడ్ కార్పొరేటర్ పున్న నిర్మల గణేష్ కుమారుడు పున్న దినేష్ సుస్మితల వివాహ వేడుకల్లో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్ దేప భాస్కర్ రెడ్డి ఈ కార్యక్రమంలో రాష్ట్ర యువజన కాంగ్రెస్ పార్టీ నాయకులు చిలుక ఉపేందర్ రెడ్డి గడ్డి అన్నారం మార్కెట్ కమిటీ డైరెక్టర్ బండి మధుసూదన్ రావు,గట్ల రవీంద్ర బొడ్డుపల్లి మహేందర్ పగడాల ఎల్లయ్య, లింగా స్వామి గౌడ్, దినేష్ సింగ్, పెద్దవూర సైదులు, హంస భాస్కర్,జగన్నాథం మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొనారు…

అమరావతి

NTR వైద్య సేవ కార్పొరేట్ పెనల్ సమ్మె విరమణ పై ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలతో తుది చర్చలు

NTR వైద్య సేవ కార్పొరేట్ పెనల్ సమ్మె విరమణ పై ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలతో తుది చర్చలు అమరావతి ఈ రోజు విజయవాడ NTR వైద్య సేవా కార్యలయంలో ప్రైవేట్ ఆసుపత్రులు యాజమాన్యాలతో వైద్య సేవ కార్పొరేట్ పేనల్ సమ్మె విరమణ పై మరో దఫా చర్చలు జరిపారు ఎప్పటికప్పుడు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు గారి సూచనల మేరకు మెడికల్ & హెల్త్ ప్రినిస్పల్ సెక్రటరీ స్వరూప్ గౌర్ ఐఏఎస్ గారు NTR వైద్య సేవ సీఈఓ దినేశ్ (ఐఏఎస్) గారు చైర్మెన్ సీతంరాజు సుధాకర్ గారు కలసి ప్రైవేట్ ఆసుపత్రి యాజమాన్యాలతో తుది చర్చలు జరిపారు.

విశాఖపట్నం

పెందుర్తి నియోజకవర్గం మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్,

పెందుర్తి నియోజకవర్గం మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాల ప్రజలకు నిత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న నగర మేయర్, విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి: పెందుర్తి తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయాన్ని నిత్యవసర సరుకులను పంపిణీ చేయడం జరిగిందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయన పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం జీవీఎంసీ 96 వ వార్డు పెందుర్తి మహిళా ప్రగతి కేంద్రం సమావేశ మందిరంలో అనకాపల్లి పార్లమెంటు సభ్యులు సీఎం రమేష్, పెందుర్తి శాసనసభ్యులు పంచకర్ల రమేష్ బాబు, ఆంధ్ర ప్రదేశ్ ఆయిల్ సీడ్స్ చైర్మన్ గండి బాబ్జి లతో కలిసి బాధితులకు నిత్యవసర సరుకులను అందించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం మొoథా తుఫాన్ ప్రభావిత ప్రాంత ప్రజలకు ఆర్థిక సాయంతో పాటు నిత్యావసర సరుకులు అందించడం జరిగిందని తెలిపారు. పెందుర్తి నియోజవర్గం జీవీఎంసీ 96 వ వార్డు ఏకలవ్య కాలనీ తుఫాన్ ప్రభావంతో పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు అత్యవసర సరుకులు పంపిణీ కార్యక్రమం మరియు తక్షణ ఆర్థిక సహాయం కింద ఒక మనిషికి ₹1000 గరిష్టంగా కుటుంబానికి మూడు వేల రూపాయల నగదును పంపిణీ చేసామన్నారు. ఈ యొక్క కార్యక్రమంలో మండల రెవెన్యూ అధికారి వెంకట అప్పారావు, జీవీఎంసీ 8వ జోనల్ కమిషనర్ శంకరరావు, అనకాపల్లి జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు ద్వారపురెడ్డి పరమేశ్వర రావు ,జీవీఎంసీ వార్డు కార్పొరేటర్లు రాపర్తి కన్నా , బల్ల శ్రీనివాసరావు , సేనాపతి శంకర్రావు,ముమ్మన దేవుడు , నియోజవర్గం బిజెపి పార్టీ ఇంచార్జ్ గొర్లి రాము నాయుడు ,పెందుర్తి పిఎసిఎస్ చైర్మన్ ఐతి సింహాచలం, ఏపీ ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ మడక పార్వతి , ఏఎంసి వైస్ చైర్మన్ గోరపిల్లి సోము నాయుడు, ఏఎంసీ డైరెక్టర్ ఆర్ఎస్ నాయుడు, ఉరిటి గోవింద్, సంతోష్, ముమ్మన సతీష్, గొంతిన హైమవతి, ఎంపీటీసీ గొల్లవిల్లి రమణ, మండల పార్టీ అధ్యక్షులు కొరుపోలు రాము నాయుడు, వార్డు అధ్యక్షులు డిబిఎల్ నాయుడు, కంచిపాటి మధు, పిన్నింటి పార్వతి మొదలగు పెందుర్తి మండలం ఉమ్మడి ఎన్ డి ఏ మహాకూటమి నాయకులు కార్యకర్తలు, వీర మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

జివిఎంసి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కు 22 వినతులు.

జివిఎంసి టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కు 22 వినతులు. – జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు విశాఖపట్నం అక్టోబర్పున్నమి ప్రతినిధి: మహా విశాఖపట్నం నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ లో 22 వినతులు వచ్చాయని జీవీఎంసీ చీఫ్ సిటీ ప్లానరు ఎ.ప్రభాకారరావు తెలిపారు. శుక్రవారం ఆయన జీవీఎంసీ ప్రధాన కార్యాలయం లో సిపి లు, డీసీపీలు, ఏసీపీ లతో కలిసి ప్రత్యేకంగా టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా చీఫ్ సిటీ ప్లానరు మాట్లాడుతూ జీవీఎంసీ లో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న PGRS కార్యక్రమం లో జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి అధికంగా ఫిర్యాదులు నమోదవుతున్నందున, జివిఎంసి పట్టణ ప్రణాళికా విభాగానికి సంబంధించి ప్రజల నుండి ఫిర్యాదులు/ వినతులను స్వీకరించేఁదుకు గానూ ప్రత్యేకంగా ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరమ్ కార్యక్రమానికి సంబంధించి 22 వినతులు స్వీకరించడం జరిగినదని, అందులో ముఖ్యంగా 1వ జోన్ కు 01, 2వ జోన్ కు 02, 3వ జోన్ కు 06, 5వ జోన్ కు 06, 6వ జోన్ కు 01, 8వ జోన్ కు 06 వినతులు వచ్చాయని తెలిపారు. స్వీకరించిన వినతులను /ఫిర్యాదులను నిర్ణీత సమయంలో టౌన్ ప్లానింగు అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించాలని ఆదేశించడమైనదన్నారు. పట్టణ ప్రణాళికా విభాగమునకు సంబంధించి ఫిర్యాదులు, అర్జీలు మొదలైనవి ప్రతి శుక్రవారం టౌన్ ప్లానింగ్ ఓపెన్ ఫోరం కార్యక్రమంలో ప్రజలు నమోదు చేసుకోవచ్చునని తెలిపారు

ఖమ్మం

ఆస్తి కోసం కుటుంబాన్నే హతమార్చిన నిందితుడికి జీవిత ఖైదు

*ఆస్తి కోసం కుటుంబాన్నే హతమార్చిన నిందితుడికి జీవిత ఖైదు* ఆస్తి కోసం కుటుంబాన్నే హతమార్చిన నిందుతుడు పిట్టల వెంకటేశ్వర్లు కు జీవిత ఖైదు శిక్ష విదిస్తూ సత్తుపల్లిలో గౌరవనీయులైన VI ADJఎం.శ్రీనివాస్ రావు గారు తీర్పు వెల్లడించారు. వివరాల్లోకి వెళ్తే… తల్లాడ మండలం గోపాలపేట గ్రామానికి చెందిన పిట్టల వెంకటేశ్వర్లుకి తల్లి పిచ్చమ్మతో పాటు భార్య, ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. జల్సాలకు అలవాటుపడిన వెంకటేశ్వర్లు రెండేళ్ల కిందట మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని కట్టుకున్న భార్య పిట్టల దుర్గను హత్య చేశాడు. ఈ కేసులో కొంతకాలం జైలు జీవితం గడిపి ఆ తరువాత బెయిల్‌పై బైటికి వచ్చాడు. దుర్గ మరణాంతరం గోపాలపేటలోని నానమ్మ పిట్టల పిచ్చమ్మ వద్దే ఆమె మనవరాళ్ల్లు నీరజ, ఝాన్సీ ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో కన్నతల్లి నివాసం ఉంటున్న ఇంటిపై వెంకటేశ్వర్లుకు కన్నుపడింది. తన కొడుకు నేర ప్రవృత్తి గు రించి తెలిసిన పిచ్చమ్మ ఇద్దరు మనవరాళ్ల భవిష్యత్తు గురించి ఆలోచనలో పడింది. దీంతో తన పేరిట ఉన్న ఆస్తిని తన మనమరాళ్ళ పేరు మీ ద మార్చాలని నిర్ణయించుకుంది. తల్లిపై కక్ష పెంచుకొని హత్యకు ప్రణాళిక రచించి 17.05.2024 న ముగ్గురుని హతమార్చాడు. కేసు విచారణ అధికారి ఎన్. సాగర్ (సర్కిల్-ఇన్‌స్పెక్టర్) Addl పబ్లిక్ ప్రాసిక్యూటర్ SK.అబ్దుల్ బాషా అనుసంధాన అధికారులు – కె.శ్రీకాంత్ ఎస్సై డి.నాగేశ్వరరావు HC CDOs బి. హరిదాస్ హెచ్‌సి చెన్నారావు మరళీకృష్ణ లను పోలీస్ కమిషనర్ సునీల్ దత్ అభినందించారు.

జనగాం

బేడ బుడగ జంగం జిల్లా నూతన కమిటీని విజయవంతం చేయండి. బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వారణాసి శివవర్మ

పున్నమి: అక్టోబర్ 31 ప్రతినిధి: జనగాం జిల్లా, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గం: బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి, తేదీ 02-11-2025 రోజున జనగాం జిల్లా, స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గంలో గవర్నమెంట్ హాస్పిటల్ ఎనక అంజయ్య ప్లాట్లు లో ఉదయం 11-00 గంటలకు, బేడ బుడగ జంగం శ్రీకారం టీం ఆధ్వర్యంలో బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి జనగాం జిల్లా కమిటీ మరియు యూత్ ఫెడరేషన్ నూతన కమిటీలు నిర్వహించబోతున్నాము. బేడ బుడగ జంగం నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయవంతం చేయాలని బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వారణాసి శివవర్మ, జనగాం జిల్లా అధ్యక్షులు పస్తం యాకయ్య, ప్రధాన కార్యదర్శి పస్తం రాజు, శ్రీకారం టీం సభ్యులు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయనమాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం ఏర్పాడి 11 సంవత్సరంలు పూర్తి అవుతున్న ప్రభుత్వాలు మారిన బేడ బుడగ జంగం సమస్యలు మాత్రం పరిష్కరించ లేకపోయారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం బేడ బుడగ జంగం కులా సర్టిఫికెట్లు కొన్ని జిల్లాల్లో ఇవ్వడం లేదని కోరారు. బేడ బుడగ జంగం కళాకారులకు పింఛన్లు, మా బేడ బుడగ జంగాలకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు, ఇంద్రమ్మ ఇండ్లు కూడా అందుత లేవు అని కోరారు. అధిక సంఖ్యలో బేడ బుడగ జంగాలు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమానికి బేడ బుడగ జంగం జేఏసీ చైర్మన్ తూర్పాటి హనుమంతు, హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప, వ్యవస్థాపక చైర్పర్సన్ గగనం శ్రీనివాసులు, జేఎసి కన్వీనర్ గగనం వెంకటస్వామి, రాష్ట్ర అధ్యక్షులు గగనం శేఖర్, ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు సిరివాటి శ్రీనివాసులు, బేడ బుడగ జంగం జేఏసీ నాయకులు, హక్కుల పోరాట సమితి రాష్ట్ర నాయకులు తదితరులు పాల్గొంటారు అని ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

విశాఖపట్నం

భాగస్వామ్య స‌ద‌స్సు విజ‌య‌వంత‌మ‌య్యేలా పెద్ద‌యెత్తున ఏర్పాట్లు*

*భాగస్వామ్య స‌ద‌స్సు విజ‌య‌వంత‌మ‌య్యేలా పెద్ద‌యెత్తున ఏర్పాట్లు* *న‌వంబ‌ర్ 14, 15వ తేదీల్లో జ‌ర‌గ‌నున్న స‌ద‌స్సు ఏర్పాట్ల‌పై క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ స‌మీక్ష‌ *ప్ర‌తిష్టాత్మ‌క కార్య‌క్ర‌మానికి దేశ, విదేశాల నుంచి మూడు వేల మంది హాజ‌ర‌వుతార‌ని వెల్ల‌డి విశాఖ‌ప‌ట్టణం, అక్టోబ‌ర్ పున్నమి ప్రతినిధి ః విక‌సిత్ భార‌త్, స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్యాల సాధ‌నలో భాగంగా న‌వంబ‌ర్ 14, 15వ తేదీల్లో విశాఖ‌ప‌ట్ట‌ణం వేదిక‌గా జ‌రిగే ప్ర‌పంచ స్థాయి భాగ‌స్వామ్య స‌ద‌స్సు విజ‌య‌వంత‌మ‌య్యేలా పెద్ద‌యెత్తున ఏర్పాట్లు చేయాల‌ని అధికారుల‌ను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ ఆదేశించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన ఈ కార్య‌క్ర‌మానికి దేశ, విదేశాల నుంచి మూడు వేల మంది అతిథులు విచ్చేస్తున్నార‌ని, అంబాసిడ‌ర్లు, కాన్సులేట‌ర్లు, కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు, రాజ‌కీయ, వ్యాపార రంగ‌ ప్ర‌ముఖులు అందులో ఉంటార‌ని పేర్కొన్నారు. కావున అధికారులంతా స‌మ‌న్వ‌యం వ‌హించి, అంకిత‌భావంతో ప‌ని చేయాల‌ని, ఇప్ప‌టి నుంచే ప‌నిలో నిమ‌గ్న‌మ‌వ్వాల‌ని నిర్దేశించారు. ఏయూ ఇంజనీరింగ్ క‌ళాశాల మైదానంలో స‌ద‌స్సు జ‌రుగుతుంద‌ని, ఇప్ప‌టి నుంచే అధికారులు వేదిక వ‌ద్ద‌కు వెళ్లి చేయాల్సిన ప‌నుల‌పై అవ‌గాహ‌న పెంచుకోవాల‌ని, సీఐఐ అధికారుల‌తో స‌మ్వ‌యం చేసుకొని ముందుకు సాగాల‌ని సూచించారు. జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, జీవీఎంసీ క‌మిష‌న‌ర్ కేత‌న్ గార్గ్, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి శుక్ర‌వారం ఉద‌యం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో స‌న్నాహ‌క స‌మ‌న్వ‌య క‌మిటీ స‌మావేశం నిర్వ‌హించిన ఆయ‌న ప‌లు అంశాల‌పై దిశానిర్దేశం చేశారు. *అతిథులు హ్యీపీగా ఫీల్ అవ్వాలి.. ఓ మ‌ధురానుభూతిగా నిలవాలి* దేశ‌, విదేశాల నుంచి వ‌చ్చే అతిథులు హ్యాపీగా ఫీల్ అవ్వాల‌ని, ఆ దిశ‌గా ప్రోటోకాల్ వ్య‌వ‌హారాలు ఉండాల‌ని స‌మావేశంలో భాగంగా క‌లెక్ట‌ర్ పేర్కొన్నారు. ఎయిర్ పోర్టు, రైల్వే స్టేష‌న్ ల వ‌ద్ద ప్ర‌త్యేక హెల్ప్ డెస్కులు పెట్టాల‌ని, వ‌చ్చే అతిథులకు క‌ళాకారుల ద్వారా సంప్ర‌దాయ రీతిలో స్వాగ‌తం ప‌లికాల‌న్నారు. స్థానిక సంప్ర‌దాయాల‌ను ప‌రిచ‌యం చేసేలా సాంస్కృతిక కార్య‌క్ర‌మాలు ఉండాల‌న్నారు. ఈ మేర‌కు సంబంధిత అధికారులు ముందుగానే ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేసుకొని చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని, వ‌చ్చిన అతిథుల‌కు ఈ స‌దస్సు ఓ మ‌ధురానుభూతిగా నిల‌వాల‌ని పేర్కొన్నారు. వారు వ‌చ్చి వెళ్లే వ‌ర‌కు గౌర‌వంగా చూసుకోవాల‌ని, కార్య‌క్ర‌మ షెడ్యూల్ ఇత‌ర వివ‌రాల‌ను వారికి ముందుగానే లైజ‌న్ అధికారుల ద్వారా అంద‌జేయాల‌ని సూచించారు. ఎక్క‌డా స‌మ‌న్వ‌య లోపం, అసౌక‌ర్యం లేకుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవాల‌ని చెప్పారు. న‌గ‌ర సుంద‌రీక‌ర‌ణ‌కు అధిక ప్రాధాన్య‌త ఇవ్వాల‌ని పచ్చ‌ని మొక్క‌ల‌ను నాటాల‌ని, రోడ్ల‌కు మ‌ర‌మ్మ‌తులు చేప‌ట్టాల‌ని, కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌, షెడ్యూల్, ఇత‌ర వివ‌రాల‌తో కూడిన హోర్డింగ్ లు పెట్టాల‌ని, అతిథుల‌కు కాఫీ టేబుల్ బుక్స్, టూరిస్ట్ మ్యాన్యువ‌ల్ బుక్స్ అంద‌జేయాల‌ని సూచించారు. *రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ‌, డెలిగేట్స్ కిట్ల అంద‌జేత‌, పాసుల జారీ స‌జావుగా సాగాలి* @స‌ద‌స్సు రెండు రోజుల పాటు జ‌రుగ‌నున్న నేప‌థ్యంలో వ‌చ్చిన అతిథులు, ప‌ర్యాట‌క ప్రాంతాల‌ను, స్థానిక ఆల‌యాల‌ను సంద‌ర్శించే అవ‌కాశం ఉంద‌ని, కావున‌ న‌గ‌ర సుంద‌రీక‌ర‌ణ‌, ప‌ర్యాట‌క ప్రాంతాలు, ఆల‌యాల వ‌ద్ద ఆతిథ్య కార్య‌క్ర‌మాల‌కు ప‌క్కా ఏర్పాట్లు చేసుకోవాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. ప్ర‌ధాన వేదిక వ‌ద్ద హార్టీక‌ల్చ‌ర్ విభాగం ఆధ్వ‌ర్యంలో గ్రీన్ మేట్ వేయాల‌ని, ఆక‌ర్ష‌నీయంగా ఉండేలా ప‌చ్చని మొక్క‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని చెప్పారు. మూడు వేల మంది రాక‌పోక‌లు, సీటింగ్, భోజ‌న‌, వ‌స‌తి ఏర్పాట్లు, తాగునీరు, టాయిలెట్ల నిర్వ‌హ‌ణ ఏర్పాట్ల‌ను ప్ర‌ణాళికాయుతంగా చేసుకోవాల‌ని, లైజ‌న్ అధికారులు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని, ప్ర‌తి అంశంలోనూ స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని సూచించారు. రిజిస్ట్రేష‌న్ ప్ర‌క్రియ స‌జావుగా సాగేలా సాంకేతిక‌త‌ను వినియోగించాల‌ని, డెలిగేట్ కిట్స్, పాసుల జారీ, ప్ర‌ధాన స‌ద‌స్సు, అనుబంధ స‌ద‌స్సులు, బ్రేక్ అవుట్ సెష‌న్ల నిర్వ‌హ‌ణ‌ విష‌యంలో ఇబ్బందులు రాకుండా చూసుకోవాల‌న్నారు. *రాక‌పోక‌లు, పార్కింగు వ‌స‌తిపై ప్ర‌త్యేక దృష్టి సారించాలి* @ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల మైదానం పైభాగంలో పీఎం, సీఎం, ఉప రాష్ట్రప‌తి నేరుగా ల్యాండ్ అయ్యేలా హెలీప్యాడ్ లు సిద్దం చేయాల‌ని, అక్క‌డ నుంచి ప్ర‌ధాన వేదిక వ‌ద్ద‌కు చేరుకునే మార్గాల‌ను వేయాల‌ని, ఇత‌ర ఏర్పాట్లు ముంద‌స్తుగా చేసుకోవాల‌ని సంబంధిత అధికారుల‌ను క‌లెక్ట‌ర్ ఆదేశించారు. కార్య‌క్ర‌మంలో కేంద్ర‌, రాష్ట్ర మంత్రులు, ఇత‌ర రాజ‌కీయ‌, అధికార, వ్యాపార ప్ర‌ముఖులు భాగ‌స్వామ్యం అవుతార‌ని, వారి వాహ‌నాల రాక‌పోక‌లు, పార్కింగ్ వ‌స‌తి త‌దిత‌ర అంశాల‌ను జాగ్ర‌త్త‌గా డీల్ చేయాల‌ని పేర్కొన్నారు. పీఎం, సీఎం గ్రీన్ రూమ్ లు, బోర్డు, మీటింగు రూముల‌ను ప‌క్కాగా సిద్ధం చేయాల‌ని, బ్యాక్ ఆఫీసుల‌కు అనుగుణంగా చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని సూచించారు. ముఖ్య‌మంత్రి రెండు రోజుల పాటు స‌ద‌స్సు వ‌ద్దే ఉంటార‌ని, వివిధ కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తార‌ని, దానికి త‌గ్గ‌ట్టుగా అధికారులు స‌మ‌న్వ‌యం చేసుకోవాల‌ని చెప్పారు. అన్ని ర‌కాల భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించాల‌ని, ఫైర్, ఎల‌క్ట్రిక‌ల్ సేఫ్టీ విభాగాలు అప్ర‌మ‌త్తంగా వ్య‌వ‌హ‌రించాల‌ని, నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రా ఉండేలా చూసుకోవాల‌ని ఆదేశించారు. కార్య‌క్ర‌మ నిర్వ‌హ‌ణ‌లో భాగంగా జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్ నోడ‌ల్ అధికారిగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని, క‌లెక్ట‌రేట్లో కంట్రోల్ రూమ్ ఉంటుంద‌ని, అక్క‌డ నుంచే అన్ని ర‌కాల స‌హాయ‌, స‌హ‌కారాలు అందుతాయ‌ని అధికారుల‌కు చెప్పారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.