Tuesday, 7 April 2026

Blog

అన్నమయ్య

గ్రామంలో నిల్వ నీటి తొలగింపు

చిట్వేలి, అక్టోబర్ 31 పున్నమి ప్రతినిధి అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం చిట్వేలి గ్రామ పంచాయతీ పరిధిలో ఇటీవల కురిసిన మొంథా తుఫాన్ కారణంగా గ్రామంలోని పలు ప్రాంతాల్లో వర్షపు నీరు నిల్వ ఉండి ప్రజలకు ఇబ్బందులు కలిగించింది. ఈ పరిస్థితిని గమనించిన గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ చౌడవరం ఉమా మహేశ్వర రెడ్డి తక్షణమే స్పందించి, పంచాయతీ కార్యదర్శికి, సిబ్బందికి నిల్వ నీటిని తొలగించాలన్న ఆదేశాలు జారీ చేశారు. దీనితో పంచాయతీ కార్యదర్శి అధ్యక్షతన పంచాయతీ సిబ్బంది క్షేత్ర స్థాయిలోకి వెళ్లి, శింగనమల వీధి దర్గా సమీపంలో, చంద్ర డాక్టర్ ఇంటి వద్ద, మసీదు దగ్గర, వై.ఎస్.ఆర్ సర్కిల్ ప్రాంతంలో నిల్వ ఉన్న వర్షపు నీటిని పూర్తిగా తొలగించారు. అనంతరం బ్లీచింగ్ పౌడర్ చల్లడం ద్వారా వ్యాధులు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.ఈ సందర్భంగా ఉప సర్పంచ్ ఉమా మహేశ్వర రెడ్డి మాట్లాడుతూ పంచాయతీ పరిధిలో పారిశుధ్యం, నీటి నిల్వలు, చెత్త సమస్యలు వంటి అంశాలపై మేము ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నాము. ప్రజల సహకారం ఉంటే గ్రామ అభివృద్ధి దిశగా మరింత వేగంగా ముందుకు సాగవచ్చు. పంచాయతీ అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు కృషి చేస్తూనే ఉంటాను” అని పేర్కొన్నారు.ఆయన ప్రజలు, పంచాయతీ సిబ్బంది చూపించిన సహకారానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు.

అన్నమయ్య

త్రాగునీటి పైప్‌లైన్ మరమ్మత్తులు చేపించిన సర్పంచ్

చిట్వేల్ అక్టోబర్ 31 పున్నమి ప్రతినిధి పోల్లోపల్లి గ్రామపంచాయతీ పరిధిలో ఇటీవల ప్రధాన త్రాగునీటి పైప్‌లైన్ దెబ్బతినడంతో గ్రామ ప్రజలు కొద్ది రోజులుగా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలిసిన వెంటనే సర్పంచ్ వెంకటసుబ్బమ్మ స్వయంగా రంగంలోకి దిగి పైప్‌లైన్ మరమ్మత్తు పనులను వేగవంతం చేయించారు. పంచాయతీ సెక్రటరీ హరికృష్ణ పర్యవేక్షణలో సిబ్బంది సహకారంతో శుక్రవారం మరమ్మత్తు పనులు పూర్తయ్యాయి. దీంతో తాగునీటి సరఫరా మళ్లీ సాధారణ స్థితికి చేరింది.ఈ సందర్భంగా సర్పంచ్ వెంకటసుబ్బమ్మ మాట్లాడుతూ గ్రామ ప్రజలకు తాగునీటి సమస్యలు రాకుండా నిరంతరం పర్యవేక్షణ కొనసాగిస్తాం. సాంకేతిక లోపాలు తలెత్తినప్పుడు వెంటనే పరిష్కారం కల్పిస్తాం అన్నారు.గ్రామస్తులు మరమ్మత్తు పనులు వేగంగా పూర్తి చేసి నీటి సరఫరా పునరుద్ధరించినందుకు సర్పంచ్ సుబ్బమ్మ, సెక్రటరీ హరికృష్ణకు కృతజ్ఞతలు తెలిపారు.

అన్నమయ్య

ప్రజా ఆరోగ్య పరిరక్షణకు అధికారులు, సర్పంచ్ చొరవ

చిట్వేల్, అక్టోబర్ 31పున్నమి ప్రతినిధి ఇటీవలి వర్షాల అనంతరం మలినాలు, దోమల వ్యాప్తిని అరికట్టేందుకు శుక్రవారం పోల్లోపల్లి గ్రామపంచాయతీ పరిధిలో పారిశుద్ధ్య కార్యక్రమాలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. గ్రామంలోని ప్రధాన రహదారులు, అంతర్గత వీధుల్లో బ్లీచింగ్ పొడి మరియు సున్నం మిశ్రమాన్ని పిచికారి చేయడం జరిగింది.ఈ కార్యక్రమాన్ని చిట్వేల్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి కే. శ్రీనివాసులు, సీనియర్ పంచాయతీ కార్యదర్శి పి. రమణయ్య, పోల్లోపల్లి పంచాయతీ కార్యదర్శి హరికృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ సంగరాజు వెంకటసుబ్బమ్మ పాల్గొని పంచాయతీ సిబ్బందిని ప్రోత్సహించారు.సర్పంచ్ మాట్లాడుతూ, వర్షాల తర్వాత వ్యాధుల వ్యాప్తి ప్రమాదం పెరిగే అవకాశం ఉండడంతో ప్రతి వీధి, కాలనీలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇస్తున్నాం. ప్రజలందరూ సహకరించాలని కోరుకుంటున్నాం అని తెలిపారు.అదేవిధంగా, సి. కందులవారిపల్లిలో కూడా శుక్రవారం బ్లీచింగ్ పొడి, సున్నం చల్లడం ద్వారా శానిటేషన్ కార్యక్రమాలు చేపట్టారు. ప్రజా ఆరోగ్య రక్షణలో భాగంగా ఈ చర్యలు నిరంతరంగా కొనసాగుతాయని అధికారులు పేర్కొన్నారు. స్థానికులు పంచాయతీ చొరవను ప్రశంసిస్తూ, వర్షాల అనంతరం చేపట్టిన పరిశుభ్రత కార్యక్రమాలు ఎంతో అవసరమని అభిప్రాయపడ్డారు.

E-పేపర్

ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. ఏఐటియుసి యూనియన్ ప్రధాన కార్యదర్శి పోకూరి మురళి

ఘనంగా ఏఐటీయూసీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు.. ఏఐటియుసి యూనియన్ ప్రధాన కార్యదర్శి పోకూరి మురళి. అన్నమయ్య జిల్లా అక్టోబర్ 31( పున్నమి పున్నమి): రైల్వే కోడూరు నియోజకవర్గ, ఓబులవారిపల్లి మండలం, మంగంపేటలోని ఏపీఎండీసీ అడ్మినిస్ట్రేషన్ ఆవరణలో ఏఐటీయూసీ 106వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఏపీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోకూరు మురళి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తుమ్మల కృష్ణ చైతన్య అధ్యక్షతన సలివెందుల మునిశేఖర్ పార్ల రామచంద్రయ్య గారు ఏఐటియుసి జెండాను ఎగరవేయడం జరిగినది. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు గంగాధర్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పండుగోలమణి, సిపిఐ పార్టీ రైల్వే కోడూరు కార్యదర్శి జ్యోతి చిన్నయ్య,అంగన్వాడి జిల్లా అధ్యక్షురాలు సరోజనమ్మ, స్టూడెంట్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులు దార్ల రాజశేఖర్, సిపిఐ ఓబులవారిపల్లి మండల కార్యదర్శి నాగమ్మ ఏపీఎండిసి కార్మిక సంఘాల నాయకులు మాట్లాడుతూ ఏఐటీయూసీ మన భారతదేశంలో మొట్టమొదటి కేంద్ర కార్మిక సంఘం 1920 అక్టోబర్ 31న దేశ వాణిజ్య రాజధానిగా పేరొందిన ముంబాయి నగరంలో ఆవిర్భవించింది. మొదటి ప్రపంచ యుద్ధం జరుగుతున్న రోజులలో కార్మిక గర్జనల నుండి కార్మికుల అణచివేతకు బ్రిటిష్ ప్రభుత్వ కుట్రల నుండి ఎన్నో వీరోచిత కార్యాచరణ నేపథ్యంలో ఏఐటీయూసీ ఆవిర్భవించింది. ప్రధమ అధ్యక్షులుగా లాలాలజపతిరాయ్ ని, ప్రధాన కార్యదర్శి గా వి.యం. పవార్ ని మహాసభ ఎన్నుకున్నాది. ఆ తరువాత కాలంలో పండిట్ జవర్ లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, వి.వి.గిరి, సరోజినినాయుడు, సి.ఆర్.దాస్ ఇంకా చాలామంది స్వాతంత్ర్యోద్యమ, రాజకీయ ప్రముఖులు పాల్గొని ఏఐటీయూసీ నిర్వహణలో ప్రముఖ పాత్ర పోషించారు. 1921లో ఝారియాలో జరిగిన ఏఐటీయూసీ ద్వితీయ మహాసభల్లో భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని అందరికన్నా ముందే నినదించి మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ. భారతదేశ స్వతంత్ర పోరాట వేదికగా గుర్తింపు పొందిన భారత జాతీయ కాంగ్రెస్ ఏఐటీయూసీ చేసిన తీర్మాణాన్ని వ్యతిరేకించింది. ఆ తరువాత స్వతంత్ర పోరాటంలో ఏఐటీయూసీ అగ్రభాగాన నిలబడిపోతుందని ఎనిమిదేళ్ళ తరువాత 1929 సంవత్సరంలో సంపూర్ణ స్వాతంత్ర్యం కావాలని ఏఐటీయూసీ చేసిన తీర్మాణాన్ని భారత జాతీయ కాంగ్రెస్ ఆమోదించింది. దేశానికి సంపూర్ణ స్వాతంత్ర్యం ప్రజలందరికీ, స్వేచ్చా, సమానత్వంతో పాటు కార్మికవర్గ హక్కుల పరిరక్షణే లక్ష్యంగా దేశంలో ఎన్నో పోరాటాలు నడిపిన చరిత్ర ఏఐటీయూసీ కి మాత్రమే ఉందని, ఒకవైపు బ్రిటిష్ ప్రభుత్వం కార్మికవర్గం పై దాడులు, అర్ధాకలి, అణిచివేత నుండి కార్మిక వర్గాన్ని విముక్తి చేస్తూ మరోవైపు వారిని సంఘటితం చేస్తూ దేశ స్వతంత్ర ఉద్యమంలో ఏఐటీయూసీ కీలక పాత్ర పోషించిందన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యవాదులతో వారి తొత్తులైన స్వదేశీ పెట్టుబడిదారులతో కార్మిక హక్కుల కొరకు వారి జీవన ప్రమాణాలు మెరుగుదల కోసం ఎన్నో అలుపెరగని నిర్విరామ పోరాటాలు చేసి కార్మిక వర్గం నేడు అనుభవిస్తున్న సౌకర్యాలను, అమల్లో ఉన్న చట్టాలను ఎన్నిటినో సాధించిన ఘనత ప్రప్రథమంగా ఏఐటీయూసీ కి దక్కుతుంది ◆ 1923 కార్మిక నష్టపరిహార చట్టం. ◆1926 ఇండియన్ ట్రెడ్ యూనియన్ చట్టం. ◆1936 వేతనాల చెల్లింపు చట్టం. ◆ 1947 పారిశ్రామిక వివాదాల చట్టం. ◆1948 పారిశ్రామిక ఉద్యోగ స్థాయి నియామక చట్టం. ◆1966 షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్ చట్టం. 1920 లో పురుడోసుకున్న నాటి నుంచి భారత కార్మిక వర్గానికి ఒకే ఒక్క కేంద్ర కార్మిక సంఘంగా భాసిల్లి దాదాపు 44 రకాల చట్టాలకు రూపశిల్పిగా నిలిచిన చరిత్ర ఏఐటియుసి కి మాత్రమే ఉంది. ప్రభుత్వరంగ స్థాపన, పరిరక్షణ కొరకు అహర్నిశలు కృషి సల్పిన, సలుపుతున్న జాతీయ అతి పెద్ద కార్మిక సంఘం ఏఐటియుసి అని కొనియాడారు.భారతదేశంలో కార్మిక వర్గం నెత్తురు చిందించి ప్రాణ త్యాగాలు చేసి సాధించినటువంటి కార్మిక చట్టాలను రూపుమాపి బడా కార్పొరేట్ యాజమాన్యాలకు కార్మికులని కట్టుబానిసలుగా మార్చే దుర్మార్గాలకి పాల్పడుతున్నదన్నారు. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ రంగాలను పరిరక్షించేందుకు, కార్మిక చట్టాలను కాపాడుకునేందుకు కార్మికులందరూ ఐక్యమై పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు అసోసియేషన్ నాయకులు మరియు ఏపీఎంసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు గురసాల దినేష్, బత్తల హరి, వడ్డీ లక్ష్మీనారాయణ, నారదాసు మణికంఠ, పుల్లగంటి బాలు గుంతా భాను ప్రకాష్, కాలవ సుబ్రహ్మణ్యం వడ్డీ విజయ్ కృష్ణ, పోకూరు మనోజ్, కొట్టిడి సాయి, పార్ల కిషోర్, గ్రందే మణికంఠ రసూల్, నరసింహులు వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు జయరాం వెంకటరమణ, తేజ దళిత హక్కుల పోరాట సమితి నాయకులు శివయ్య నాగేశ్వరరావు కార్మికులు పాల్గొన్నారు.

E-పేపర్

నూతన ఎక్స్-రే పరికరాన్ని పరిశీలించిన దేవి రెడ్డి ప్రశాంత్ రెడ్డి.

ఆసుపత్రిలో మౌలిక సదుపాయాలు కల్పించడంలో వెనుకడుగు వేయం.. నూతన ఎక్స్-రే పరికరాన్ని పరిశీలించిన దేవి రెడ్డి ప్రశాంత్ రెడ్డి. అన్నమయ్య జిల్లా అక్టోబర్ 31 ( పున్నమి న్యూస్ ప్రతినిధి ): రైల్వే కోడూరు పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో ఆధునిక టెక్నాలజీ కలిగిన నూతన ఎక్స్-రే పరికరాన్ని డాక్టర్ బృందం ఆహ్వానం మేరకు ఆసుపత్రికి చేరుకొని పరిశీలించడం జరిగినది, అలాగే ప్రజలకు మెరుగు వైద్యం, తగిన సౌకర్యాలు అందించడం కోసం ఎలాంటి కృషి కైనా వెనకాడకుండా ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, దృష్టికి తీసుకువెళ్లి ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పించడానికైనా వెనుకాడబోయే ప్రసక్తే లేదని, ఆరోగ్య శాఖామంత్రి సత్య కుమార్ తో మాట్లాడి ప్రభుత్వ ఆసుపత్రికి అవసరమైన ఆధునిక సదుపాయాలు మౌలిక వసతులు కల్పించడానికి తప్పనిసరిగా కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు వైద్య బృందానికి తెలియజేశామని, వన్ నేషన్ వన్ ఎలక్షన్ అన్నమయ్య జిల్లా కోఆర్డినేటర్ ప్రశాంత రెడ్డి మరియు బిజెపి సీనియర్ నాయకులు మణి తెలియజేశారు.

E-పేపర్

అమృత సంవాదం ద్వారా రైల్వే ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించాలి తల్లెం భరత్ కుమార్ రెడ్డి

అమృత సంవాదం ద్వారా రైల్వే ప్రయాణికులకు మౌలిక వసతులు కల్పించాలి తల్లెం భరత్ కుమార్ రెడ్డి అన్నమయ్య జిల్లా అక్టోబర్ 31 ( పున్నమి న్యూస్ ప్రతినిధి ) అమృత సంవాదం ధ్వారా ఎంపికైన రాజంపేట రైల్వేస్టేషన్ లో ప్రయాణికులకు మౌలిక వసతులు పూర్తిస్థాయిలో కల్పించాలని గుంతకల్లు రైల్వే డిఆర్ యుసి సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి అన్నారు. రైల్వే అధికారులతో శుక్రవారం నిర్వహించిన సమావేశంలో గుంతకల్ రైల్వే డిఆర్ యుసి సభ్యులు తల్లెం భరత్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్బంగా తల్లెం భరత్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రైల్వే స్టేషన్ లో అమృత సంవాదం ద్వారా తొలి విడతలో మంజూరైనా 20 కోట్ల రూపాయల నిధులతో రైల్వేస్టేషన్ లో ఎక్స్ లేటరు,లిఫ్టు, నీటికుళాయిల సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. టికెట్ కౌంటర్ వద్ద అదనంగా ఒక సిబ్బందిని ఏర్పాటు చేయాలన్నారు. పట్టణంలో సాంప్రదాయంగా వైభవంగా నిర్వహించే బలిజపల్లి గంగమ్మ జాతర సారేకు ఇబ్బంది కలగకుండా ట్రస్ పాస్ ఏర్పాటు చేయాలన్నారు. పార్లమెంట్ కేంద్ర బిందువు101 రైల్వే స్టేషన్ ఆనుకొని అండర్ బిడ్జి ఏర్పాటు చేయాలని, రైల్వే విశ్రాంతి గది, అదనపుస్టాపేజెస్ , పార్సల్ గదులు ఏర్పాటు చేయాలన్నారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ఎకశిల నగరం ఒంటిమిట్ట రామాలయ పుణ్యక్షేత్రంలో ప్లాట్ ఫామ్,షెల్టర్,రైలు అదనంగా నిలిలపాలన్నారు. రైల్వే కోడూరు ఆర్చ్, అండర్ ప్రాసెస్ బ్రిడ్జిలలో విద్యుదీకరణ,సీసీ కెమెరాలు ఏర్పాటు, సన్ రూప్,ప్రముఖ పుణ్యక్షేత్రంఅరుణాచలం, వైద్యసదుపాయం కొరకు విఎంసి హాస్పిటల్ సులువుగా ప్రయాణించుటకు గుంటూరు ఎక్స్ప్రెస్ తీరునామాలైకు పొడిగించాలన్నారు. హరిప్రియ ఎక్స్ప్రెస్ ను రైల్వేకోడూరు, రెడ్డిపల్లిలలో నిలపాలని కల్పించి నందలూరు స్టేషన్ లో వాటర్ పాయింట్ ఏర్పాటు చేయాలని అధికారులను కోరారు.నంద్యాల రేణిగుంట డెమో శేట్టిగుంట,పుల్లంపేట నిలపాలని ఓబులవారిపల్లి రైల్వే స్టేషన్ లో హరిప్రియ ఎక్స్ప్రెస్ ,తిరుమల ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ ను నిలపాలని నందదలూరులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నిలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైల్వే సీనియర్ డిఎన్ సుదర్శన్ రెడ్డి,అసిస్టెంట్ కమిషనర్ రాజగోపా రెడ్డి, ఎలక్ట్రికల్ డి ఈ శ్రీనివాసులు,ఏడియన్ వాసుదేవనాయుడు, వైసీపీ వాణిజ్య విభాగం జిల్లా అధ్యక్షులు, మునిసిపల్ కౌన్సిలర్ సనిసెట్టి నవీన్ కుమార్ , సీసీ జనార్దన్ రెడ్డి, ఐ ఓ డబ్ల్యు దినేష్ రెడ్డి, స్టేషన్ మాస్టర్ గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

గ్రీన్ వుడ్ రెడ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పంతంగాని నరసింహ ప్రసాద్.

గ్రీన్ వుడ్ రెడ్ రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న పంతంగాని నరసింహ ప్రసాద్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 31 (పున్నమి న్యూస్ ప్రతినిధి): రైల్వే కోడూరు మండల పరిధిలోని, నూతన్ రెస్టారెంట్ ప్రారంభోత్సవం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు 19 నరసింహ ప్రసాద్ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగినది ఈ సందర్భంగా పంతం గాని, బానిశెట్టి హరి రాయల్ ఆహ్వానం మేరకు విచ్చేసిన పంటంగానే నరసింహ ప్రసాద్ బాలిశెట్టి హరి రాయల్ సత్కరించి వ్యాపారంలో అభివృద్ధి సాధించి పర్యాటకుల మన్ననాడు పొందాలని కోరారు. స్థానిక యువకులకు ఉపాధి కల్పించడంతోపాటు పర్యాటకల దృష్టిని ఆకరించే ఆకర్షించేలా అన్ని రంగులతో మంచి నాణ్యత ప్రమాణాలతో హోటల్ నడుపుతామని తెలిపారు. ఈ సందర్భంగా ప్రారంభోత్సవానికి విచ్చేసిన పంతంగాని నరసింహ ప్రసాద్ కు, బాలిశెట్టి హరి రాయల్ కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్ పోతురాజు నవీన్, ముత్యాల కిషోర్,నాగోలు అమర్నాథ్ ఇతర టిడిపి నాయకులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

అమరావతి

తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్‌ నివేదిక

తుఫాన్‌ నష్టంపై కేంద్రానికి ఏపీ సర్కార్‌ నివేదిక అమరావతి పున్నమి ప్రతినిధి:- 17 శాఖల్లో రూ.5,244 కోట్లు నష్టం వచ్చిందని నివేదిక తక్షణమే సాయం అందించాలని కోరిన ఏపీ ప్రభుత్వం పరిశీలనకు కేంద్ర బృందాలను పంపాలని కోరిన ప్రభుత్వం ఏపీలోని 1,434 గ్రామాలు,48 పట్టణాలపై తుఫాన్ ప్రభావం 161 మండలాల్లో అత్యధిక వర్షపాతం నమోదైందని నివేదిక 4,794 కి.మీ.మేర రోడ్లు దెబ్బతిన్నాయని ఏపీ నివేదిక 1.38 లక్షల హెక్టార్లలో పంట నష్టం జరిగిందని.. రూ.829 కోట్ల నష్టం జరిగిందని పేర్కొన్న సర్కార్‌ ఉద్యానవన పంటలకు రూ.40 కోట్ల నష్టం ఆక్వారంగంలో రూ.514 కోట్ల నష్టం విద్యుత్‌శాఖకు రూ.19 కోట్ల నష్టం నీటిపారుదలశాఖకు రూ.234 కోట్ల నష్టం 23 జిల్లాల పరిధిలోని 3,045 ఇళ్లు ధ్వంసమయ్యాయి-ఏపీ

విశాఖపట్నం

రచ్చబండ కార్యక్రమం – ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ*

*రచ్చబండ కార్యక్రమం – ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ* విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి:- పెందుర్తి నియోజకవర్గం పెందుర్తి మండలం ముదపాక పంచాయతీ గోవిందపురం గ్రామంలో సర్పంచ్ గొలగాని మహాలక్ష్మి ఆద్వర్యంలో సీనియర్ నాయకులు సారిపల్లి గణేశ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ రచ్చబండ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా పెందుర్తి మాజీ శాసనసభ్యులు అన్నంరెడ్డి అదీప్ రాజ్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు.గ్రామ ప్రజలు పాల్గొని ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేటిజేషన్ కు వ్యతిరేకంగా సంతకాలు చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఉప్పిలి కనకరాజు,జిల్లా ఉపాధ్యక్షలు & మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కోడిగుడ్ల దేవి సాంబ,మండల పార్టీ అధ్యక్షులు గోరపల్లి శ్రీను,ఉపాధ్యక్షలు గొంప అప్పారావు,గొరపల్లి సాంబ,గొలగాని అప్పలరాజు, గొలగని మురళి,దేవుడు,చెల్లుబోయిన అప్పలరాజు, బోర పైడిరాజు,నక్క నర్సింగ్ రావు,ముదపాక మోహన్,గ్రామ ప్రజలు ,కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

గ్రీన్ వుడ్ హోటల్ &రెస్టారెంట్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే అరవ శ్రీధర్

*బలిశెట్టి హరికృష్ణ అక్షర గారి ఆహ్వానం మేరకు, గ్రీన్ ఫుడ్ రెస్టారెంట్ వారి “కేఫ్ రాయల్టీ అండ్ టిఫిన్స్” నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు, ముక్కా వరలక్ష్మి గారు, ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* 💐 కోడూరు మండలం లక్ష్మిగారి పల్లి గ్రామానికి చెందిన బలిశెట్టి హరికృష్ణ అక్షర గారి ఆహ్వానం మేరకు,రైల్వే కోడూరు పట్టణం ఆవరణలోని బైపాస్ రోడ్డు నందు గ్రీన్ ఫుడ్ రెస్టారెంట్ వారి “కేఫ్ రాయల్టీ అండ్ టిఫిన్స్” నూతన ప్రారంభోత్సవ కార్యక్రమంలో *ప్రభుత్వ విప్ మరియు రైల్వేకోడూరు శాసనసభ్యులు అరవ శ్రీధర్ గారు, రైల్వేకోడూరు నియోజకవర్గం టిడిపి పార్టీ ఇంచార్జ్ మరియు KUDA చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి గారి సతీమణి ముక్కా వరలక్ష్మి గారు మరియు వారి తనయుడు ముక్కా సాయి వికాస్ రెడ్డి గారు* పాల్గొన్నారు. *ఎమ్మెల్యే అరవ శ్రీధర్ గారు మరియు ముక్కా వరలక్ష్మి గారు* కలిసి రిబ్బన్ కట్ చేసి షాప్ ప్రారంభోత్సవం నిర్వహించారు. అనంతరం జరిగిన పూజా కార్యక్రమంలో ముక్కా వరలక్ష్మి గారు పాల్గొన్నారు.ఈ కార్యక్రమం లొ NDA కూటమి నాయుకులు పాల్కొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.