Monday, 6 April 2026

Blog

జోగులాంబ గద్వాల

అధికారులనిర్లక్ష్య వైఖరే… విద్యార్థుల కు శాపం గా మారింది! గద్వాల జిల్లా హాస్పటల్ లో ధర్మవరం బీసీ హాస్టల్.. విద్యార్థుల ను పరా మర్శించినజిల్లా MRPS నాయకులు!

జోగులాంబ గద్వాల్ నవంబర్ 01( పున్నమి ప్రతినిధి) జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్ తాలూకా ధర్మవరం బీసీ హాస్టల్ విద్యార్థులు ఫుడ్ పాయిజాన్ కారణం గా అశ్వస్థ గురై దాదాపు గా 58 మంది విద్యార్థులు గద్వాల ప్రభుత్వ హాస్పటల్ నందు చికిత్సపొందుదుతున్నా విషయం తెలుసుకొని.. గౌరవ మంద కృష్ణ మాదిగ గారి సైన్యం. MRPS జోగులాంబ గద్వాల జిల్లా ప్రధాన నాయకత్వం హాస్పిటల్ కు చేరుకుని బాధితుల ను పరామర్శించటం జరిగింది *అలాగే వారి ఆరోగ్య పరిస్థితి గురించి డ్యూటీ డాక్టర్స్ తో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కోరారు. అనంతరం… MRPS జిల్లా మాజీ అధ్యక్షులు, MSP జిల్లా కన్వీనర్ ఐజ రాజు మాదిగ, గద్వాల అశోక్ మాదిగ మాట్లాడుతూ… జిల్లా లో సంక్షేమ హాస్టల్స్ విద్యార్థుల కు…రోజు, రోజు కు రక్షణ లేకుండా పోతుంది. జిల్లా అధికారుల పర్యవేక్షణ లేక పోవడం హాస్టల్ వార్డెన్స్ బాధ్యత రహితంగా వ్యవారిస్తున్నారు దీనితో సంక్షేమ హాస్టల్స్ పూర్తిగా నిర్లక్షానికి గురవుతున్నాయ్. కొన్ని హాస్టల్స్ లో వంట వారిదే పెత్త నం సాగుతూ. ఇలాంటి నిర్లక్ష్యం గా వంటలు చేస్తూ పిల్లల ప్రాణాలతో చాలగటం ఆడుతున్నారు కావున జిల్లా కలెక్టర్ గారు ఈ సంఘటన పై పూర్తి స్థాయి లో విచారణ జరిపంచి బాద్యులైన వారి పై తగు చర్యలు తీసుకోవాని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమం లో జిల్లా MRPS మాజీ ప్రధాన కార్యదర్శి మోషే మాదిగ, జిల్లా కొ… కన్వినర్ గద్వాల పర్శరామ్ మాదిగ, కన్నా మాదిగ, మాజీ ఎంపీటీసీ ఎల్లప్ప మాదిగ, రంజిత్ కుమార్ మాదిగ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ప్రాణాలు బలి అవుతున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం: మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు

ప్రజల ప్రాణాలు బలి అవుతున్నా పట్టించుకోని కూటమి ప్రభుత్వం: మాజీ శాసనసభ్యులు కొరుముట్ల శ్రీనివాసులు అన్నమయ్య జిల్లా అక్టోబర్ 31 ( పున్నమి న్యూస్ ప్రతినిధి ):కడప నుండి తిరుపతి కి నిత్యం తిరుపతిలోని ఆసుపత్రులకు,తిరుమలకు, చెన్నైకు పలు దేవాలయాలకు,వెళ్లే ప్రధాన రహదారి అయిన ఎన్ హెచ్ఐఏ 716 ముఖ్యంగా కోడూరు నుండి రోడ్లు గుంతలమయం అయ్యి మరింత అద్వానంగా ఉండడంతో చాలామంది ప్రయాణికులకు, ముఖ్యంగా వృద్ధులు పసిపిల్లలు, బాలింతలు గర్భవతులు ఎన్నో వ్యయ ప్రయాసలు కోర్చి ప్రయాణం చేయవలసిన పరిస్థితి ఉన్నదని, కొన్ని సందర్భాల్లో ప్రమాదాలు జరుగుతూ ఎంతోమంది ప్రాణాలు పోయినా కూడా ఈ కూటమి ప్రభుత్వానికి ఎటువంటి చలనం లేకుండా ఉండడంతో అక్టోబర్ 31 శుక్రవారం నాడు ముందుగా గత ప్రభుత్వం లో వేసిన రోడ్లను పరిశీలిస్తూ నాటికి ఇప్పటికీ తేడా చూడాలంటూ రైల్వే కోడూరు మండల పరిధిలోని ఉప్పరపల్లి నుండి మాధవరంపోడు జ్యోతి నగర్ వరకు నడుచుకుంటూ రహదారిని టేపుతో కొలతలు వేసి ఒక్కో గుంత 15 అడుగుల పొడవు 4 అడుగుల వెడల్పుతో గుంతలమైమైనా రోడ్లను పరిశీలించి అనంతరం పత్రిక విలేకరులతో మాట్లాడుతూ గత వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హాయంలో ఇటువంటి సమస్యను అప్పుడే గ్రహించి రాజంపేట పార్లమెంటు సభ్యులు పీవీ మిథున్ రెడ్డి సహకారం తో నియోజకవర్గం లోని ముఖ్య నాయకులతో కలిసి అనేకమార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్ర మంత్రిని కలిసి 2700 కోట్ల రూపాయలతో కడప నుండి రేణిగుంట వరకు గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవే రహదారి పనులు మంజూరు చేయించుకోగా తర్వాత ఎన్నికల రావడం ప్రభుత్వాలు మారి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్న పనులు మొదలు పెట్టకపోవడం దౌర్భాగ్యమని నిత్యం ఎంతోమంది ప్రమాదాలు బారిన పడి ప్రాణాలు పోతున్న, ఇటీవల పలువురు యువకులు వారి యొక్క సోషల్ మీడియా ఖాతాల్లో ఈ రోడ్డుపైన విశ్లేషించి ప్రభుత్వ పెద్దలని ప్రశ్నించినందుకు వారిని కూడా భయభ్రాంతులకు గురి చేస్తున్నారని ఈ కూటమి ప్రభుత్వ నాయకులు వారి యొక్క సొంత లాభాల కోసం చూపించే శ్రద్ధ ప్రజలపై చూపిస్తే బాగుంటది అని ఇప్పటికైనా మొద్దు నిద్రలేచి కళ్ళు తెరిచి కనీసం తాత్కాలికంగా ప్యాచ్అప్ పనులు జరిపించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని.లేనియెడల ప్రతి పంచాయతీలోని ప్రజలను తీసుకొచ్చి నేషనల్ హైవేపైనే భారీ రాస్తారోకో కు దిగుతామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించిన కొరముట్ల శ్రీనివాసులు. ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండల వైఎస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజా రెడ్డి, ఉప సర్పంచ్ శివ సాయి, సర్పంచ్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మందల నాగేంద్ర, స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నంద బాల, సర్పంచ్ ఈశ్వరయ్య యాదవ్, శ్రీరామ్ వినోద్,ఎంపీటీసీ బండారు మల్లికార్జున,ఎక్స్ జెడ్పిటిసి రాజేశ్వరమ్మ, అరుణమ్మ, రాజగోపాల్, గల్లా శ్రీను, సుబ్బరాయుడు, శంకరయ్య, యనమాల చైతన్య,రాజా, మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

జోగులాంబ గద్వాల

ఇండియా నుండి ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కి సలెక్ట్ అయినా… కుర్వ హరి కృష్ణ

ఇండియా నుండి ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కి సలెక్ట్ అయినా… కుర్వ హరి కృష్ణ జోగులాంబ గద్వాల్ నవంబర్ 01(పున్నమి ప్రతినిధి) జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం చిన్న తాండ్రపాడు నివాసి అయిన కుర్వ హరి కృష్ణ s/o భీముడు. నేపాల్ లో జరిగే ఇండో నేపాల్ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 1500 మీటర్స్ రన్నింగ్ రేస్ కి ఇండియా తరపున సెలెక్ట్ కావడం జరిగింది. గతంలో కూడా హరి కృష్ణ నేషనల్ స్థాయిలో కూడా మంచి ప్రతిభ కనబరిచి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీద కూడా ప్రశంస అందుకోవడం జరిగింది. ఇప్పుడు హరికృష్ణ ఇంటర్నేషనల్ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ కి సలెక్ట్ కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేయడం జరిగింది

అనకాపల్లి

ఐ ఎ ఎస్ లా! అదానికి ఎజెంట్లా!

ఐ ఎ ఎస్ లు చదువు కుని అదాని నవయుగ కంపెనీలకు ఎజెంట్లుగా వ్యహరించడం ఆది వాసీలను కార్పొరేట్ సంస్థలకు తాకట్టు పెట్టాలని చూడటం అత్యంత దుర్మార్గపు చర్యని ఆంధ్రప్రదేశ్ వ్వవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు డి వెంకన్న పేర్కొన్నారు శనివారం అయిన ఓ ప్రకటన విడుదల చేసారు గిరిజన ప్రాంతంలో హైడ్రో పవర్ ప్లాంట్లు ఒప్పందాలకు సంబంధించిన జిఒ నెంబర్లు 2, 13, 51 లను రద్దు చేయాలని గత కొంత కాలంగా పోరాడుతున్న ఆదివాసీలకు అవ గాహన లేక పోవడంతో ఉద్యమాలు చేస్తున్నారని ప్రాజెక్టులు వల్ల ఆదివాసిలకు గిరిజనులకు నష్టం జరగదని 4,500 మందికి పత్యేక్షంగా ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కలుగు తాయని కంపెనీ ద్వారా నష్ట పోయిన వారికి అంగన్వాడీ బిల్డింగ్ లు కమ్యూనిటీ హల్స్ రోడ్లు,ఇల్లులు పోయిన వారికి పున రావాసం క్రింద 8 లక్షలు వరకు పరిహారం ఇస్తారని అదాని నవయుగ కంపెనీలు ఎజెంటు లాగ! అల్లూరి జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ మాట్లాడటం హస్య స్పదంగా ఉందన్నారు ఎక్కడైనా ఐఎఎస్ హోదాలో ఉన్న కలెక్టర్లు ప్రజలు మనోభావాలను అర్దం చేసుకుని వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి నివేదిక పంపించి మెజార్టీ ప్రజలకు న్యాయం చేయాలని చూడాలి తప్ప జీవ నోపాధి కోసం తమ మనుగడ కోసం ఉద్య మాలు చేస్తున్న ఆదివాసీ గిరిజనులకు అవ గాహన లెదని అర్థం చేసు కోవడం లేదని అబద్దపు మాటలతో గిరిజనులకు మాయమాటలు చేప్పి కంపినీలకు అనుకూలంగా ఒప్పించడం కోసం పూనుకోవడం విడ్డూరంగా ఉందన్నారు అనిచి వేత ఎక్కడ ఉంటే తిరుగు బాటు అక్కడ ఉంటుందని ఆదివాసీలకు ఉద్యమాలు కోత్తెమి కాదని కలెక్టర్ గారు గుర్తించాలని పేర్కొన్నారు,హైడ్రో పవర్ ప్రాజెక్టుల వల్ల ఆదివాసీ గ్రామాలు, భూములు,అడవులు పర్యవరణం సహజ వనరులు నష్ట పోవని కలెక్టర్ గారే గిరిజనులు ఉద్య మాన్ని తప్పు దోవ పట్టించె విధంగా ప్రచారం చేయడం అత్యంత దుర్మార్గ మన్నారు,దీన్ని ప్రజాస్వామ్య వాదు ప్రజా సంఘాలు స్వచ్ఛంద సంస్థలు తీవ్రంగా ఖండించాలని కోరారు పెదకోట రైవాడ కు విద్యుత్ ఉత్పత్తి పెంచు కోవ డానికి ఇచ్చిన జీవో నెంబరు 51 రైవాడ ప్రాజెక్టుకు పూర్తిగా క్యాచ్ మెంట్ ఎరియాలో ఉందని ఈ జివో వల్ల వేలాది ఎకారాలు పంట భూములు లక్ష లాది మంది విశాఖ త్రాగు నీటి అవసారాలకు నష్టం వస్తుందని కలెక్టర్ కు తెలుసా! అని ప్రశ్నించారు? చిట్టం వలస,గుజ్జెలి వద్ద హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణాలతో నాలుగు మండలాల పరిధిలోని 15 పంచాయతీల్లో 145 ఆది వాసీ గ్రామాలు జల సమాధి అవుతాయని,గిరిజనులు అందోన చేందుతున్నారని తెలిపారు, వేలాది ఎకారాలకు సాగునీరు లక్షలాది మందికి త్రాగునీరు అందిస్తున్న రైవాడ క్యాచ్ మెంట్ ఎరియాలో హైడ్రోపవర్ ప్రాజెక్టులకు ఎలా అనుమతులు ఇస్తారని రైతులు అందోన చేందు తుంటే ఈప్రాజెక్టులతో ఉపాధి వస్తుందని ఉద్యోగాలు వస్తాయని నమ్మించాలని చూడటం దారుణ మన్నారు,కలెక్టర్ గారు గిరిజన చట్టాలకు గిరిజనులకు రక్షకునిగా ఉండాలి తప్ప నవయుగ, అదాని ప్రైవేటు సంస్థలకు సేవకునిగా ఉండ రాదని ఆదివాసీలను గిరిజనుల ను ఒప్పించే కంటే అదాని నవయుగ కంపెనీలు యాజ మాన్యంను ఒప్పించి గిరిజనుకు నష్టం కలుగకుండా వెనుకకు పంపాలని చూస్తే కలెక్టర్ గారికి గౌరవం దక్కుందని తెలిపారు గిరిజనులు మనో భావాలను అర్దం చేసు కోని వాస్తవ పరిస్థితులను ప్రభుత్వానికి వివ రించాలని తక్షణమే ఏజెన్సీలో హైడ్రో పవర్ ప్రాజెక్టుల నిర్మాణానికి ఇచ్చిన జిఒలతో పాటు పెదకోట రైవాడ క్యాచ్ మెంట్ ఎరియాలో ఇచ్చిన జివో నెంబరు 51 ని తక్షణమే రద్దు చేయాలని వెంకన్న డిమాండ్ చేసారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

యన్ టీ ర్ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న టీడీపీ గ్రామ కమిటి మెంబర్ మాల్యాద్రి

దుత్తలూరు మండలంలోని తురకపల్లీ గ్రామంలొ శనివారం ఉదయం యన్ టి ఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో టీడీపీ గ్రామ కమిటి సభ్యుడు పోలు మాల్యాద్రి పాల్గోని పించన్ దారులకు స్వయంగా అందజేశారు గ్రామ ప్రజలకు ఉదయం వేళ ప్రత్యేక ఏర్పాట్లు చేయడంతో కార్యక్రమం సజావుగా సాగింది లబ్ది దారులు పింఛన్లు స్వీకరించి ఆనందo వ్యక్తం చేశారు ఈ సందర్బంగా పో లు మాల్యాద్రి మాట్లాడుతూ యన్ టీ ర్ భరోసా పథకం పేదలు,వృద్దులు , దివ్యంగులు కు నిజమైన ఆర్ధిక బలాన్ని అందిస్తోంది ప్రతీ లబ్ది దరుడు సకాలంలో రేషన్ పంపిణీ చేస్తామని పేర్కొన్నారు

విశాఖపట్నం

గాజువాకలో కెనరా బ్యాంక్ కొత్త బ్రాంచ్ ప్రారంభం

గాజువాక అక్టోబర్ ( పున్నమి ప్రతినిధి) ఓల్డ్ గాజువాక 80 అడుగుల రోడ్‌లోని శ్యామల స్వీట్స్ పై అంతస్థులో కనరా బ్యాంక్ కొత్త బ్రాంచ్ ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవానికి కెనరా బ్యాంక్ డిప్యూటీ జనరల్ మేనేజర్ శ్రీ ఏ. పి. రావు, ప్రాంతీయ మేనేజర్ & ఏజీఎం శ్రీ ఎన్. మధుసూదనరెడ్డి ప్రధాన అతిథులుగా హాజరై బ్రాంచ్‌ను ప్రారంభించారు. ప్రాంత ప్రజలు, వ్యాపారవేత్తలు విస్తృతంగా హాజరై ఈ వేడుకను విజయవంతం చేశారు. సుమారు 120 మంది స్థానికులు పాల్గొన్నారు. స్థానికంగా కాతా బాలకృష్ణ, పిలా రామకృష్ణ గార్లు స్ట్రాంగ్ రూమ్‌ను ప్రారంభించగా, ఎం. కృష్ణారావు దంపతులు కాష్ కౌంటర్‌ను ఆరంభించారు. ఆటోనగర్, గాజువాక ప్రాంతాల నుండి వాసివా, ఐలా సంస్థల ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. వ్యాపారులు తమ కరెంట్ అకౌంట్లు కనరా బ్యాంక్‌లో ప్రారంభించాలనే ఆసక్తి చూపగా, కొంతమంది రుణాలను కూడా ఈ బ్యాంక్‌కు బదిలీ చేయాలనే ఉత్సాహం వ్యక్తం చేశారు. ప్రారంభోత్సవం అనంతరం కొత్త సేవింగ్స్ అకౌంట్లు ప్రారంభమవగా, లోన్ ప్రతిపాదనలు కూడా చర్చించబడ్డాయి. బ్రాంచ్ మేనేజర్ శ్రీ బి. విజయ్ కుమార్ గారు మాట్లాడుతూ – > “ప్రజల సహకారంతో ఈ బ్రాంచ్‌ను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేస్తాం. సేవింగ్స్, కరెంట్ అకౌంట్లు, గృహ, వాహన, వ్యాపార రుణాలు వంటి అన్ని రకాల సేవలు ఒకే చోట అందుబాటులో ఉంటాయి” అన్నారు. ప్రజలు తమ ఆర్థిక అవసరాల కోసం బ్రాంచ్ హెడ్ శ్రీ బి. విజయ్ కుమార్ (📞 8331019132) ను సంప్రదించవచ్చు. ప్రాంత వ్యాపారవేత్తలు కనరా బ్యాంక్ అందిస్తున్న సేవలను అభినందిస్తూ, “ప్రజలకు దగ్గరగా ఉండే బ్యాంకింగ్ సేవలతో కనరా బ్యాంక్ పేరు మరింత విశ్వసనీయంగా నిలుస్తుంది” అని పేర్కొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఆయుష్మాన్ కార్డు ఉంటే ఉచితంగా ₹5 లక్షల వైద్యం!

PM-JAY ఆయుష్మాన్ భారత్ కార్డ్ గురించి తెలుసుకోండి. అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ వెంటనే అప్లై చేసుకోండి! ముఖ్య ప్రయోజనాలు (Key Benefits) ఇది కేంద్ర ప్రభుత్వ అతిపెద్ద Health Insurance Scheme. ఈ కార్డు ఉన్న కుటుంబాలకు సంవత్సరానికి రూ. 5 లక్షల వరకు ఉచిత వైద్య సేవలు అందుతాయి. దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందవచ్చు. క్యాన్సర్, గుండె జబ్బులు, డయాలసిస్, ఆపరేషన్లు వంటి వాటికి కూడా ఉచితంగా వైద్యం చేయబడుతుంది. ఎవరు అర్హులు? (Eligibility Highlights) ఈ పథకం ముఖ్యంగా ఆర్థికంగా బలహీనంగా ఉన్న కుటుంబాల కోసం. ఒకే గది నివాసాలలో ఉండే కుటుంబాలు. 16 నుండి 59 ఏళ్ల వయస్సు గల మగ సభ్యుడు లేని కుటుంబాలు. సొంత భూమి లేని కుటుంబాలు. గృహ కార్మికులు, పారిశుధ్య కార్మికులు, వీధి వ్యాపారులు (Street Vendors), డ్రైవర్లు/కండక్టర్లు వంటి రవాణా కార్మికులు. 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు అందరూ అర్హులే. అప్లై చేయండి! (Application Process) ముందుగా, www.pmjay.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి మీ ప్రాథమిక వివరాలతో అర్హత (Eligibility) ఉందో లేదో చెక్ చేసుకోండి. అర్హత ఉంటే, CSC (Common Service Center) లను లేదా ప్రభుత్వంతో ఒప్పందం చేసుకున్న ఆసుపత్రులను సంప్రదించండి. Aadhaar Card లేదా Ration Card వంటి గుర్తింపు పత్రాలు తప్పనిసరి.

E-పేపర్

గన్నవరం బిజెపి ఆఫీసులో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు*

*గన్నవరం బిజెపి ఆఫీసులో ఘనంగా సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుకలు* గన్నవరం, అక్టోబర్ 31 ( పున్నమి ప్రతినిధి సురేష్) గన్నవరం బిజెపి ఆఫీసులో సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమం నిర్వహించారు. కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు చిగురుపాటి కుమార్ స్వామి ఆధ్వర్యంలో, గన్నవరం మండల అధ్యక్షులు నీలం అశోక్ అధ్యక్షతన ఈ కార్యక్రమం జరిగింది. ​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆధునిక భారత నిర్మాణంలో చేసిన అపూర్వ కృషిని స్మరించారు. 562 సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసి దేశ ఏకీకరణకు అమూల్యమైన సేవలు అందించిన పటేల్ త్యాగం, నాయకత్వం భవిష్యత్ తరాలకు ప్రేరణగా నిలుస్తుందని గుర్తు చేశారు. ​​కిసాన్ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ నాదెండ్ల మోహన్, ఎఎంసి డైరెక్టర్ కానూరు శేషమాధవి, అసెంబ్లీ కన్వీనర్ కురుమద్దాల ఫణికుమార్,ఎస్సీ మోర్చా మాజీ వైస్ ప్రెసిడెంట్ మేడూరి శేషుబాబు, నీటి సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, మండల ఉపాధ్యక్షులు మోతే దుర్గారావు, మండల సెక్రటరీ పస్తం ప్రసాద్, మండల జనరల్ సెక్రటరీ వెంకటకృష్ణ, ఉంగుటూరు మాజీ మండల అధ్యక్షులు రామ్ కోటి, గన్నవరం మాజీ మండల అధ్యక్షులు చంద్రశేఖర్ రెడ్డి, ఆత్మనిర్భర్ భారత్ మండల కన్వీనర్ పాము సిద్ధూ, అలాగే కొల్లి శ్రీను, అబ్బురి జాన్, అప్పల ఆనంద్, చంటి బాబు, నాగరాజు, చిన్నం రాము, రేమాలి అంజలి, మామిడి అనూష తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అన్నమయ్య

ప్రజల నమ్మకానికి నిదర్శనం — సీఎం రిలీఫ్ ఫండ్

చిట్వేల్ మండలంలో నలుగురికి రూ.6.52 లక్షల చెక్కుల పంపిణీ చిట్వేల్, అక్టోబర్ 31పున్నమి ప్రతినిధి ప్రజల కష్టసుఖాలకు అండగా నిలుస్తూ, ఆపదలో ఉన్న వారికి భరోసానిస్తుంది ముఖ్యమంత్రి సహాయనిధి. ఈ క్రమంలో చిట్వేల్ మండల పరిధిలో నలుగురు అర్హులైన లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను ప్రభుత్వ విప్, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ శుక్రవారం అందజేశారు. తిమ్మయ్యపాలెం పంచాయతీ పరిధిలోని గట్టుమీదపల్లి గ్రామానికి చెందిన తుపాకుల నాగభూషణంకు రూ.68,987, పోల్లోపల్లి పంచాయతీ పరిధిలోని బోయపల్లి గ్రామానికి చెందిన జల్లి సుజాతకు రూ.4,50,000, మైలపల్లి పంచాయతీ గొల్లపల్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డికు రూ.1,18,881, చిట్వేల్ హరిజనవాడకు చెందిన సింగనమల సుబ్రహ్మణ్యంకు రూ.14,000 మొత్తంలో చెక్కులు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మాట్లాడుతూ, ప్రజల కష్టసుఖాలకు అండగా నిలవడం కూటమి ప్రభుత్వ ధ్యేయం. ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ ప్రజల నమ్మకానికి ప్రతీక. ప్రతి అర్హుడికి ప్రభుత్వం సహాయం చేరేలా కృషి చేస్తున్నాం అన్నారు. రైల్వే కోడూరు నియోజకవర్గం టీడీపీ ఇంచార్జ్, చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ఆయన సతీమణి ముక్కా వరలక్ష్మి మాట్లాడుతూ, సీఎం రిలీఫ్ ఫండ్ సాధారణ కుటుంబాలకు ఆశ, ధైర్యాన్ని ఇస్తోంది. ఇది ప్రభుత్వం ప్రజల పట్ల చూపుతున్న చిత్తశుద్ధికి నిదర్శనం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలోమాదాసు నరసింహ, ఏదోటి రాజశేఖర్ నాయుడు, సత్యనారాయణ నాయుడు, వెంకటేశ్వర్లు నాయుడు, తుపాకుల పెంచలయ్య, షేక్ రియాజ్, మద్దూరి మన్మధ, సువారపు నాగేష్, పెద్దమ్మ గారి సాయి, సింగిరి సుబ్రమణ్యం, దాది రామచంద్ర, బండారు మణికంఠ, కొత్తూరు ఈశ్వరయ్య, యానాది రాజు, హరి నాయుడు, వెంకటసుబ్బయ్య, నాగేంద్ర, బోయపల్లి నరసింహులు, పవన్ రాజు, సింగనమల శివ తదితర ఎన్డీఏ కార్యకర్తలు పాల్గొన్నారు.

విశాఖపట్నం

వాకర్స్ మహోద్యమ చైతన్య స్ఫూర్తి ప్రధాత ఆళ్వార్ దాస్!* ఎంవీపీ కాలనీ,

వాకర్స్ మహోద్యమ చైతన్య స్ఫూర్తి ప్రధాత స్వర్గీయ సుంకరి ఆళ్వార్ దాస్ అని వాకర్స్ ఇంటర్నేషనల్ పూర్వ అధ్యక్షులు, డా.ఎస్ పి రవీంద్ర పేర్కొన్నారు. వాకర్స్ ఇంటర్నేషనల్, అనుబంధ వాకర్స్ క్లబ్స్, నగరంలోని ఆళ్వార్ దాస్ విద్యా సంస్థల ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఎంవీపి కాలనీ నాలుగు రోడ్ల కూడలిలోను , ఐ ఐ ఎ ఎం క్యాంపస్ లలో స్వర్గీయ ఆళ్వార్ దాస్ 95 వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా డా.రవీంద్ర మాట్లాడుతూ” నడవండి – నడిపించండి” అనే నినాదంతో 1986 సం.లో ఆళ్వార్ దాస్ స్థాపించిన వాకర్స్ ఇంటర్నేషనల్ నేడు దేశ విదేశాలలో1600 శాఖలతో రెండులక్షల 25వేలమందికి పైగా వాకర్స్ సభ్యులతో విస్తరించిందని, వ్యక్తిగత ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ అనేక సామాజిక సేవా కార్యక్రమాలను వాకర్స్ నిర్వహించడం జరుగుతుంద న్నారు. అలాగే 1978 సం. లో నాటి విద్యాశాఖ మంత్రిగా తానే స్వయంగా మూడు విద్యా సంస్థలను స్థాపించారని, నేడు 32 విద్యా సంస్థల వేలాది విద్యార్థులకు మార్గదర్శక మౌతున్నాయని రవీంద్ర పేర్కొన్నారు. ఈ వేడుకలల ఆళ్వార్ దాస్ విద్యాసంస్థల అధినేతలు డా. విజయ రవీంద్ర డా. రాజేంద్ర, డా,విజయ రాజేంద్ర, కె. అరుణ్ కుమార్, కె.పద్మాసాగరి, రాహుల్, దివ్యదాస్, సూర్యతేజ, దీపికదాస్,కళ్యాణ్, వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్టీ ఎ హెచ్ ఎన్ వెంకటరావు, ఆచార్య బాలమోహన్ దాస్, ప్రొఫెసర్ కృష్ణ మోహన్ తదితరులు పాల్గొని నగరంలోని పలు ఆళ్వార్ దాస్ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులు అర్పించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.