Monday, 6 April 2026

Blog

తిరుపతి

💥అయ్యప్ప మాల ధరించిన విద్యార్థిని స్కూలులోకి అనుమతించని యాజమాన్యం.

💥NTR జిల్లా గొల్లపూడిలోని GIG ఇంటర్నేషనల్ పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి అయ్యప్ప దీక్ష తీసుకుని శుక్రవారం ఉదయం పాఠశాలకు వెళ్లాడు, కానీ యాజమాన్యం ఆ బాలుడిని లోపలికి అనుమతించకుండా ఇంటికి పంపించింది. సమాచారం అందుకున్న అయ్యప్ప మాల ధరించిన భక్తులు,ABVP, RSS కార్యకర్తలు పాఠశాల వద్దకు వెళ్లి ఆగ్రహం వ్యక్తం చేశారు. 💥ఈ విషయాన్ని డీఈవో యు.వి.సుబ్బారావు దృష్టికి తీసుకెళ్లగా ఆయన పాఠశాల యాజమాన్యంతో మాట్లాడడంతో సమస్య సద్దుమనిగింది. 💥 ఈ విషయమై డీఈవో సుబ్బారావు శుక్రవారం స్కూల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. రెండు రోజుల్లో పాఠశాల యాజమాన్యం సంజాయిషీ ఇవ్వాలని పేర్కొన్నారు. అలాగే ఏదైనా ప్రైవేటు, ఎయిడెడ్, తదితర పాఠశాలల్లో చదివే విద్యార్థులు మాల ధరించి వస్తే వారికి అభ్యంతరం తెలపకుండా తరగతి గదిలోకి అనుమతించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

ప్రకాశం

మద్దినేని వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఏలూరు సాంబశివరావు

ఒంగోలు అక్టోబర్ 31న ఒంగోలు నగరంలోని ఎస్‌.జి.వి.ఎస్‌. కన్వెన్షన్ హాల్‌లో మద్దినేని శ్రీనివాసరావు – శ్రీమతి విజయ దంపతుల కుమార్తె కావ్య వివాహం, వరుడు నిఖిల్‌తో అంగరంగ వైభవంగా జరిగినది. ఈ కార్యక్రమమునకు పలువురు ప్రముఖులు హాజరై, నూతన వధూవరులను ఆశీర్వదించారు. ముఖ్యంగా, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు మరియు పర్చూరు ఎమ్మెల్యే శ్రీ ఏలూరి సాంబశివరావు గారు ప్రత్యేక అతిథులుగా హాజరై, నూతన వధూవరులకు తమ ఆశీర్వచనాలను అందించి, ఈ కొత్త జీవితము ప్రేమ, పరస్పర గౌరవం ఆనందోత్సాహాలతో నిండిపోవాలని కోరుకుంటూ కావ్య–నిఖిల్ దంపతులకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బంధుమిత్రులు, స్నేహితులు, ఆత్మీయులు, రాజకీయ నాయకులు మరియు ప్రముఖులు పెద్ద సంఖ్యలో హాజరై ఈ వేడుకను మరింత శోభాయమానం చేశారు.

విశాఖపట్నం

అర్హులైన వారందరికీ త్వరలోనే నూతన పింఛన్లు

*అర్హులైన వారందరికీ త్వరలోనే నూతన పింఛన్లు ఇవ్వబడును – ప్రజా సంక్షేమం, ప్రతి పేదవాడికి అండగా ఉండడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం* – *మొల్లి పెంటిరాజు – డైరెక్టర్* ( ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ ) విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- గాజువాక నియోజకవర్గం, 75 వ వార్డ్ పరిధి లో సీతానగరం, దుర్గవానిపాలెం గ్రామాల్లో పింఛను లబ్ధిదారులకి కూటమి నాయకులు, సచివాలయ సిబ్బంది ఆధ్వర్యంలో పింఛన్లు ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మొల్లి పెంటిరాజు డైరెక్టర్ ఏపీ స్టేట్ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ పాల్గొని, మాట్లాడుతూ త్వరలోనే అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వబడునని, ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లు అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సహాయం అందుతుందని, ప్రజా సంక్షేమం పేద ప్రజలకు అండగా ఉండడం రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 75వ వార్డు అధ్యక్ష, కార్యదర్శులు నమ్మి అప్పారావు ములకలపల్లి పెంటయ్య, వార్డు క్లస్టర్ ఇంచార్జ్ ఉరుకూటి అప్పలరాజు, విశాఖ జిల్లా తెలుగుయువత ఉపాధ్యక్షుడు మొల్లి రమణబాబు, గాజువాక నియోజవర్గం ఎస్సీ సెల్ అధ్యక్షులు వంగలపూడి అప్పలరాజు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు బొంగురాజు, ఉరుకూటి అప్పారావు, కుమార్, సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు, *ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు* గారు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు

పశ్చిమ నియోజకవర్గం శాసనసభ్యులు, *ప్రభుత్వ విప్ శ్రీ గణబాబు* గారు పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్నారు విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- *61వ వార్డు మల్కాపురం,* పల్లి వీధి,నగరాలువీధి,గొల్లవీధి, రెడ్డి వీధి, శెట్టిబలిజివీధి, జాలర్ వీధి,గాంధీజీ వీధి, హరిజన వీధి వరకు *గౌరవ గణబాబు* గారి చేతుల మీదుగా *పెన్షన్ పంపిణీ*, మరియు మొన్న తుఫాన్ బాధితులు సముద్రంలో వేటకి వెళ్లలేని మత్స్యకారులు కూడా నిత్యవసర సరుకులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో గారు, జోనల్ కమిషనర్ గారు, సివిల్ సప్లై ఆఫీసర్ ASO గారు ప్రభుత్వ యంత్రాంగం మరియు కూటమి నాయకుడు కూడా ఈ కార్యక్రమం పాల్గొన్నారు.

విశాఖపట్నం

పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* విశాఖపట్నంపున్నమి ప్రతినిధి:- అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు అందజేస్తామని ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు తెలియజేశారు.ఈరోజు 38 వార్డు పరిధిలో శ్రీ సీతారామ ఆలయ వీధి ప్రాంతంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పలువురు లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పరిపాలన అందిస్తుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ శ్రీ నరసింహాచారి విజయలక్ష్మి దంపతులు, వార్డ్ అధ్యక్షులు, కూటమి సీనియర్ నాయకులు, కూటమి పెద్దలు పాల్గొన్నారు…

E-పేపర్

మగ్దమ్ షావలి దర్గాకు తెదేపా పార్టీ నాయకులతో కలిసి చెద్దర్ సమర్పించిన మేడా విజయ శేఖర్ రెడ్డి

నందలూరు మండలంలో ఎంతో ప్రసిద్ధి చెందినా మగ్దమ్ షావలి దర్గాకు ఉరుస్ మహోత్సవాల సందర్భంగా దర్గా పీఠాధిపతులు ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా తెదేపా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి హాజరయ్యారు.దర్గా కమిటీ మెంబర్లు ఘనంగా శాలువాతో సత్కరించి 25 మంది ముజావర్ల ప్రదర్శన తోటి భారీగా స్వాగతం పలికారు.అనంతరం పీఠాధిపతి మొహినుద్దీన్ హుసేని,స్వగృహం నుండి దర్గా వరకు మేడా విజయ శేఖర్ రెడ్డి చెద్దరును మరియు పూల హారాలను తీసుకపోయి దర్గాలో సమర్పించారు. గురువులయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి మేడా విజయ శేఖర్ రెడ్డి ఆశీర్వదించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎప్పుడు ఉరుసు జరిగినా వేలాదిమందిగా ముస్లిం హిందు సోదరులు మత సామ్రాస్యాన్ని అద్భుతంగా పాటించి అన్ని మతలకు సంబంధించిన పండుగలాగా జరుపుకోవడం ఇక్కడ ఒక అన్యవతి అని తెలిపారు. ప్రతి సంవత్సరం 10 లక్షలకు పైబడి ఖర్చుపెట్టి ఏమాత్రం వైభవాన్ని తగ్గకుండా ముస్లిం సోదరుల ప్రతిష్టను కాపాడుతూ దర్గాకు ఉన్న పవిత్రతను కాపాడుతున్న ఉరుసు నిర్వహిస్తున్న పీఠాధిపతులకు అభినందనలు తెలిపారు.దర్గా పీఠాధిపతులకు వారి వంతు సహాయం ఎప్పుడు ఉంటుందని నందలూరు మండల ముస్లిం సోదరులకు ఎప్పుడు అండగా ఉంటానని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ,టంగుటూరు ఎంపీటీసీ పెంచలయ్య, నందలూరు మండల తెదేపా పార్టీ ముస్లిం మైనార్టీ నాయకులు పఠాన్ మెహర్ ఖాన్,హ్యూమన్ రైట్స్ మైనార్టీ చైర్మన్ సయ్యద్ జుల్ఫికర్, గుజ్జల ఈశ్వరయ్య,టిడిపి సీనియర్ నాయకులు మండెం నాగరాజు.మట్టిబాబు.ఎల్లంరాజు పల్లి శ్రీనివాసులు రెడ్డి,ఆడపూరు గురుకుల పాఠశాల చైర్మన్ ఇరువురి మురళి,టీడీపీ నాయకులు తుమ్మది శివకుమార్, రైల్వే కాంట్రాక్టర్ శివ నరసింహులు,తెదేపా పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

పదవి విరమణ కార్యక్రమంలో పాల్గొన్న టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా

36 సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతోమంది విద్యార్థులకు ఉన్నతముగా తీర్చిదిద్దిన మాడపూరి నారాయణ పదవి విరమణ సందర్భంగా నిర్వహించిన ఘన కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొని వారికి శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా మేడా విజయ శేఖర్ రెడ్డి మాట్లాడుతూ గురువులు సమాజ నిర్మాతలు.విద్యారంగ అభివృద్ధికి వారి కృషి అమూల్యమని.నారాయణ గారి సేవలు ప్రతి ఒక్కరికి ఆదర్శమని అన్నారు. ఈ కార్యక్రమంలో టంగుటూరు ఎంపీటీసీ భువన బోయిన పెంచలయ్య,టిడిపి నాయకులు జయరాం,గుగ్గిళ్ళ సుబ్బరాయుడు,ఆడపూరు స్కూల్ చైర్మన్ ఇరువురి మురళి,పఠాన్ మెహర్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

ఉరుసు మహోత్సవంలో పాల్గొన్న రాజంపేట అసెంబ్లీ టిడిపి ఇన్చార్జ్ చమర్తి

నందలూరు మండలంలో టంగుటూరు రోడ్ లో శుక్రవారం సాయంత్రం ఉరుసు మహోత్సవ నిర్వహణ కమిటీ అజం భాష,మహబూబ్ బాషా ఆహ్వానం మేరకు రాజంపేట టిడిపి ఇన్చార్జ్ చమర్తి జగన్మోహన్ రాజు ఘన స్వాగతం పలికారు. అనంతరం వేడుకలలో పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయనకు నిర్వాహకులు సాధర స్వాగతం పలికారు.ఈ సందర్భంగా చమర్తి మాట్లాడుతూ నందలూరు మండలంలో ఉరుసు మహోత్సవంలో పాల్గొనడం ఎంతో అందంగా ఉందని,ప్రతి వేడుక ఎంతో ప్రత్యేకమైనదని, ఉరుసు మహోత్సవ నిర్వహకులు ఎంతో గొప్పగా ఈ వేడుకలు నిర్వహించడం చాలా ఆనందంగా ఉందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ ఆర్టీసీ చైర్మన్ ఎద్దుల సుబ్బరాయుడు, మైనార్టీ రాష్ట్ర కార్యదర్శి ముస్తాక్ హుస్సేన్, నందలూరు మండల టిడిపి అధ్యక్షుడు జంగం శెట్టి సుబ్బయ్య, టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రేవూరు వేణుగోపాల్, క్లస్టర్ ఇంచార్జ్ పసుపులేటి ప్రవీణ్ కుమార్, సర్పంచ్ యానాది, మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ ఎద్దుల విజయసాగర్, సుధీర్ గీతాంజలి విద్యాసంస్థల అధినేత రమణ, ఒంటిమిట్ట జడ్పిటిసి ముద్దుకృష్ణారెడ్డి, ఎస్సీ సెల్ అధ్యక్షులు శివ, సర్పంచ్ రాము,గంగాధర్, రాజంపేట టిడిపి ఉపాధ్యక్షుడు సతీష్ రాజు,సురేష్,సుబ్బనరసయ్యా, నారప శెట్టి శివ,అల్తాఫ్,మస్తాన్,జానీ, రహీం,పలువురు టిడిపి ముఖ్య నాయకులు కార్యకర్తలు ముస్లిం మైనార్టీ నాయకులు పాల్గొనడం జరిగినది.

E-పేపర్

జాతీయ ఐక్యతా దినోత్సవం పురస్కరించుకొని పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన యల్లటూరు శ్రీనివాసరాజు

రాజంపేట పట్టణం జనసేన పార్టీ కార్యాలయం.యల్లటూరు భవన్ నందు రాజంపేట పార్లమెంటు జనసేన పార్టీ ఇంచార్జ్ యల్లటూరు శ్రీనివాసరాజు భారత తొలి ఉప ప్రధాని, హోంమంత్రి పటేల్ జయంతి సందర్భంగా అయిన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పటేల్ భారతదేశ స్వాతంత్ర్య పోరాటంలో కీలక పాత్ర పోషించారు అని. అతని అసాధారణమైన నాయకత్వానికి, జాతీయ సమైక్యతకు లొంగని నిబద్ధతకు ప్రసిద్ధి చెందిన పటేల్ “భారతదేశపు ఉక్కు మనిషి”గా పిలుస్తారు అని. జాతీయ ఐక్యతా దినోత్సవం విభిన్న రాచరిక రాష్ట్రాలను ఒకే దేశంగా ఏకం చేయడానికి, భారతదేశ ప్రజలలో సంఘీభావ స్ఫూర్తిని పెంపొందించడానికి ఆయన చేసిన ప్రయత్నాలను గుర్తు చేస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పిటిసిలు యల్లటూరు శివరామరాజు,షబ్బీర్ అహ్మద్,మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు అబూ బకర్,నీటి సంఘం చైర్మన్ నారదాసు రామచంద్ర,పత్తి నారాయణ, లక్ష్మీపతి రాజు,బిజెపి నాయకులు వినోద్ వర్మ, గాజుల కులాయప్ప,ప్రసాద్, కొమ్మినేని సుబ్బరాయుడు, మౌలా,గూడూరు శ్రీనివాసరాజు,శంకరరాజు, సురేంద్ర,సాయిరాజు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిన వివాహ శుభకార్యంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న మేడా విజయ శేఖర్ రెడ్డి

నందలూరు మండలం లేబక గ్రామానికి చెందిన ఒంటిమిట్ట కోదండ రామస్వామి నిత్య అన్నదానం స్టాపికులు సంజీవ రాయుడు మేనల్లుడు వివాహ వేడుకలు పెంచలకోన లక్ష్మీ నరసింహ ఆలయంలో నిర్వహించగా వారి పిలుపుమేరకు వారి వివాహ వేడుకలలో ముఖ్యఅతిథిగా పాల్గొని నూతన వధూవరులను టీడీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఆశీర్వదించారు.అదే వివాహానికి హాజరైన టీడీపీ అధికార ప్రతినిధి కోడూరు బాలసుబ్రమణ్యం.మరియు ఆర్టీసీ రీజినల్ మాజీ చైర్మన్ యెద్దల సుబ్బరాయుడు లను మర్యాదపూర్వకంగా కలిసి ఆప్యాంగా పలకరించారు. ఈ కార్యక్రమంలో లేబాక గ్రామ సర్పంచ్ లంకయ్య గారి వెంకట నరసయ్య, టంగుటూరు ఎంపిటిసి భువన బోయిన పెంచలయ్య, సంజీవ రాయుడు,బిగ్గల బాబు, గుగ్గిళ్ళ సుబ్బరాయుడు,రాము యాదవ్ మరియు టిడిపి నాయకులు కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.