Monday, 6 April 2026

Blog

అనకాపల్లి

అర్లి లో పెన్షన్ పంపిణీ కార్యక్రమం

మాడుగుల, నవంబర్ 01: మాడుగుల నియోజకవర్గంలోని అర్లి గ్రామంలో ఈరోజు పెన్షన్ పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శాసనసభ్యులు బండారు సత్యనారాయణ మూర్తి పాల్గొని లబ్ధిదారులకు స్వయంగా పెన్షన్లు అందజేశారు. ఈ సందర్భంలో రాష్ట్ర కొప్పుల వెలమ కార్పొరేషన్ చైర్మన్ పీవీజీ కుమార్ పాల్గొని పేదల సంక్షేమం కోసం ప్రభుత్వం చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు. లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తూ నేతల సేవా భావాన్ని ప్రశంసించారు.

అనకాపల్లి

శ్రీ సత్యసాయి శతవర్ష జన్మదిన వేడుకలకు పీవీజీకి ఆహ్వానం

ఈ నెల 23వ తేదీన పుట్టపర్తి అధ్యాత్మిక కేంద్రంలో జరగనున్న భగవాన్ శ్రీ సత్యసాయి బాబా శతవర్ష జన్మదిన వేడుకలకు రావాలని రాష్ట్ర వెలమ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ పోలుపర్తి వెంకట గణేష్ కుమార్ (పీవీజీ కుమార్) కి శ్రీ సత్యసాయి సేవా సంస్థల అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు కశిరెడ్డి అప్పలనాయుడు శనివారం ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయనతో పాటు జిల్లా సహసమన్వయకర్త కన్నూరు అప్పలనాయుడు, కె.కోటపాడు జె.ఎస్‌.ఎం. ఫిల్లింగ్ స్టేషన్ యజమాని జూరెడ్డి రాము, మండల పరిషత్ మాజీ అధ్యక్షురాలు సబ్బవరపు పుష్పవతి ప్రతినిధి సబ్బవరపు రామునాయుడు, సబ్బవరం మండల శ్రీ సత్యసాయి సేవా సంస్థల ఇన్‌చార్జి కర్రి బంగారు నాయుడు, సాయి భక్తులు చుక్కల జగన్నాధం, బండారు కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

గద్వాల్ విద్యార్థులకు అస్వస్థత…. హాస్టల్ వార్డెన్ సస్పెండ్.

గద్వాల్ విద్యార్థులకు అస్వస్థత…. హాస్టల్ వార్డెన్ సస్పెండ్. గద్వాల్ నవంబర్ 01(పున్నమి ప్రతినిధి) గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మారం బీసీ హాస్టల్ ఫుడ్ పాయిజన్ కారణంగా 54మంది విద్యార్థులు అస్వస్థకు గురైన సంఘటన పైన జిల్లా కలెక్టర్ బి ఏం సంతోష్ తీవ్రంగా స్పందించారు. హాస్టల్ వార్డెన్ జయరాములును తక్షణమే సస్పెండ్ చేయాలనీ అధికారులను అదేశించారు. అస్వస్థత జరిగిన సమయంలో వార్డెన్ అందుబాటులో లేకపోవడం విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది

అనకాపల్లి

అప్ నిరాహార దీక్ష ఆరవరోజుకు చేరినా కూటమి నాయకులకు చీమకుట్టినట్లయినా లేదు*

వెంకన్నపాలెం నుండి చోడవరం మాడుగుల రోలుగుంట వడ్డాది పాడేరు రహదారులు వెంటనే పునర్నిర్మాణం చేయాలని నేటికి ఆరు రోజులుగా చోడవరం తాసిల్దార్ గారి కార్యాలయం పక్కన ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష జరుగుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చి రెండు సంవత్సరాలు గడుస్తున్నా, కూటమి నాయకులు ప్రజల ఇబ్బందులను గమనించకుండా ఏదో ఆలోచనలో పడ్డారు. కూటమి నాయకులను ప్రజలు ఎంతగానో నమ్మి ఓట్లు వేసి గెలిపించినందుకు ఇంటికి సురక్షితంగా చేరే దారే లేకుండా పోయింది. సాయంత్రం సమయాల్లో వాహనదారులందరూ తీరని ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లు చెరువులుగా మారిపోవడం వల్ల మహిళలు, స్కూల్ బస్సులు, 108 వాహనాలు తదితర వాహనాలన్నీ కూడా తీరని ఇబ్బందులు పడుతున్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను స్థానిక నాయకులు చోడవరం మాడుగుల నియోజకవర్గ కూటమి నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు చంద్రబాబు నాయుడు గారి ఇంటిముందు ధర్నా చేసిన నిధులు తెచ్చి రోడ్లు పునః ప్రారంభించి ప్రజలు సురక్షితంగా ఇంటికి చేరే విధంగా చేయవలసిన బాధ్యత కూటమి నాయకులపై ఉంది. ఇదివరకు ఉన్న కాంట్రాక్టర్లను పక్కనపెట్టి కొత్త కాంట్రాక్టర్లకు ఈ రోడ్డు నిర్మాణం అప్పగించాలి. పాతవారిని పక్కన పెట్టండి ప్రజల ప్రాణాలు ముఖ్యం కాంట్రాక్టర్లు కాదు. వెంటనే కూటమి నాయకులు స్పందించి రోడ్ల పనులు పునర్మించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో అనకాపల్లి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు, అల్లూరి జిల్లా ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ ఎస్ గంగరాజు గారు, చోడవరం నియోజకవర్గ ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ వేగి మహాలక్ష్మి నాయుడు, అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్త ఏ త్రినాథ్ గారు, పాడేరు మహిళా ప్రతినిధులు ముష్య నానమ్మ, రూడీ రవణమ్మ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్న బక్కి వెంకయ్య దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందినటువంటి కూడ వెళ్లి రామలింగేశ్వర స్వామిని దర్శించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ గౌరవ భక్కి వెంకయ్య గారు ఉదయం దర్శించుకున్నారు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం పోతిరెడ్డిపేట్ వెళ్లి అక్కడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరియు ప్రాథమిక పాఠశాలను జిల్లా విద్యాధికారి శ్రీనివాస్ రెడ్డి గారితో కలసి పరిశీలించారు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందిస్తున్నారా లేదా అని ప్రత్యక్షంగా పరిశీలించారు పాఠశాలలో ఉన్నటువంటి వసతులను సదుపాయాలు చూసి లేని వాటిపై జిల్లా విద్యాధికారి గారికి దృష్టికి తీసుకెళ్లారు జిల్లా విద్యాధికారి సానుకూలంగా స్పందించి సమస్య త్వరలోనే పరిష్కారం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దోమకొండ అంజయ్య గౌడ్ దుబ్బాక మాజీ ఏఎంసీ చైర్మన్ చింతల జ్యోతి దయాకర్ నవీన్ గ్రామస్తులు పాల్గొన్నారు

తెలంగాణ

పథకాలను రద్దుచేస్తామన్న రేవంత్ రెడ్డికి జూబ్లీహిల్స్ ప్రజలు బుద్ధి చెప్తారు* *ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి*

తెలంగాణా నవంబర్ 01(పున్నమి ప్రతినిధి) *ఎల్లారెడ్డి గూడలో మాగంటి సునీతమ్మ గెలుపుకోసం ఎన్నికల ప్రచారం జూబ్లీహిల్స్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ కి ఓటు వేయకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి మాగంటి సునీతమ్మకు ఓటు వేసి గెలిపిస్తే అన్ని పథకాలను రద్దు చేస్తాం అని ఎన్నికల సందర్భంగా జూబ్లీహిల్స్ లోని రోడ్ షోలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకు జూబ్లీహిల్స్ ప్రజలు గమనిస్తున్నారని ఓటు వేయకుంటే పథకాలను రద్ద చేస్తారా? ఇదేనా ఒక ముఖ్యమంత్రి ఇచ్చే సందేశం అని ఉమ్మడి పాలమూరు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచార సందర్బంగా అన్నారు.సోమాజిగూడ డివిజన్ లోని ఎల్లారెడ్డిగూడలో మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ కు ఓటు వేయకుంటే పథకాలను రద్దు చేస్తామన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బుద్ధి చెప్పడానికి సింద్ధంగా ఉన్నామని జూబ్లీహిల్స్ ప్రజలు తెలుపుతున్నారని అన్నారు.ఈ ప్రచారంలో మాజీ కార్పోరేటర్ మహేష్ యాదవ్, భూత్ ఇన్చార్జులు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారిగా నూతన బాధ్యతలు తీసుకున్నటువంటి వినోద్ కుమార్

సిద్దిపేట జిల్లా పంచాయతీ అధికారిగా (DPO) గోoడోల్ల. వినోద్ కుమార్ గారిని నియమిస్తూ రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషన్ జి. శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు ఇప్పటివరకు ఉన్న సిద్దిపేట జిల్లా డిపిఓ గా పని చేసిన దేవికి దేవిని తిరిగి పూర్వ స్థానమైన పెద్దపల్లి జిల్లా డిఎల్బిఓ గా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు గ్రూప్ -1 ఎంపికైనటువంటి ఆరుగురు డిపిఓ లుగా పోస్టింగ్ ఇస్తున్నట్టు పంచాయతీరాజ్ కమిషన్ ఉత్తర్వులు జారీ చేశారు

E-పేపర్

ఎన్టీఆర్ భరోసా అందించిన ఉమ్మలరాజు సుబ్బరాజు

ఎన్టీఆర్ భరోసా అందించిన ఉమ్మలరాజు సుబ్బరాజు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు అక్టోబర్ 1 పున్నమి న్యూస్ ప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడుగు బలహీన వర్గాల అవ్వ తాతల పెన్షన్ ఓబులవారిపల్లి మండలం బొమ్మ వరం పంచాయతీలో తెలుగుదేశం యువ నాయకులు ఉమ్మల రాజు సుబ్బరాజు చేతులు మీదుగా అందజేయడం జరిగింది పెన్షన్ అందుకున్న ప్రజలు ఈ సందర్భంగా సంతోషం వెలిబుచpచ్చారు

E-పేపర్

వైయస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ కు గాను ప్రతి నెల ఆర్థిక సహాయం

కోడూరు టౌన్ న్యూ కృష్ణ నగర్ నివాసి అయిన పేరూరు శివ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు అతనిపై చెట్టు పడి కాళ్ళు చచ్చుపడ్డాయి విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్ఆర్సిపి బీసీ సెల్ నాయకుడు కొన్ని పాటి.ప్రసాద్ గారు విషయాన్ని కోడూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామిరెడ్డి ప ధ్వజరెడ్డి గారికి తెలియజేయగా ఆయన ఫిజియోథెరపీ డబ్బులను నెలనెలా ఇస్తున్నాడు అందులో భాగంగా రెండో నెలకు గాను 14 వేల రూపాయలను స్థానిక వైఎస్ఆర్సిపి నాయకుల ద్వారా బాధితుడైన పేరూరు శివ గారికి ఫిజియోథెరపీ ఖర్చుల నిమిత్తం పైకం అందజేసిన. కోడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మాందల నాగేంద్ర మండల ట్రేడ్ యూనియన్ కొప్పల శంకరయ్య బీసీ సెల్ వైసిపి కె శివశంకర్ .లక్ష్మయ్య గార్లు పాల్గొన్నారు.

E-పేపర్

రామిరెడ్డి ప ధ్వజరెడ్డి ఫిజియోథెరపీ గాను ప్రతి నెల ఆర్థిక సాయం

కోడూరు టౌన్ న్యూ కృష్ణ నగర్ నివాసి అయిన పేరూరు శివ వ్యవసాయ పనులు చేసుకుంటూ ఉండగా ప్రమాదవశాత్తు అతనిపై చెట్టు పడి కాళ్ళు చచ్చుపడ్డాయి విషయం తెలుసుకున్న స్థానిక వైఎస్ఆర్సిపి బీసీ సెల్ నాయకుడు కొన్ని పాటి.ప్రసాద్ గారు విషయాన్ని కోడూరు మండల వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రామిరెడ్డి ప ధ్వజరెడ్డి గారికి తెలియజేయగా ఆయన ఫిజియోథెరపీ డబ్బులను నెలనెలా ఇస్తున్నాడు అందులో భాగంగా రెండో నెలకు గాను 14 వేల రూపాయలను స్థానిక వైఎస్ఆర్సిపి నాయకుల ద్వారా బాధితుడైన పేరూరు శివ గారికి ఫిజియోథెరపీ ఖర్చుల నిమిత్తం పైకం అందజేసిన. కోడూరు పట్టణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సిహెచ్ రమేష్ బాబు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంయుక్త కార్యదర్శి మాందల నాగేంద్ర మండల ట్రేడ్ యూనియన్ కొప్పల శంకరయ్య బీసీ సెల్ వైసిపి కె శివశంకర్ .లక్ష్మయ్య గార్లు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.