Monday, 6 April 2026

Blog

E-పేపర్

ఆంధ్ర రాష్ట్ర అవిర్బావ ధీనోత్సవ సందర్బంగా రాజంపేట ఆర్య వైశ్య యూత్ ఘనంగా నివాళులర్పించారు

రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి ఆంధ్రరాష్ట్రం కోరకు ప్రాణత్యాగం చేసి ప్రత్యేక రాష్ట్రం కోరకు పాటుపడిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు గారికి ఆంధ్ర రాష్ట్ర అవిర్బావ ధీనోత్సవ సందర్బంగా రాజంపేట ఆర్య వైశ్య యూత్ ఘనంగా నివాలు అర్పించి వారి త్యాగాలు గుర్తు చేసుకోవడం జరిగింది,ఈ కారిక్రమం కు ముక్య అతిధి గా రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ వాణిజ్య విభాగం అద్యక్షులు సనిశెట్టి నవీన్ కుమార్ గారు , రాజంపేట శ్రీ ఆర్య వైశ్య యువజన సంఘం అద్యక్షుడు బొగ్గరపు రాజేష్ గుప్తా,కార్యదర్శి సనిశెట్టి నరేంద్ర,సహ కార్యదర్శి రాజా శ్రీనివాస్,ఆర్య వైశ్య సీనియర్ నాయకులు అన్నపూర్ణ మురళి,పెరకం కృష్ణ, పాలెంపల్లి కార్తీక్,బవిరిశెట్టి రమేష్,కర్ణాటకం మధు,పచిపులుసు హరి తడితులు పాల్గొన్నారు.

E-పేపర్

900 సంవత్సరాల నాటి విగ్రహం లభ్యం* ఆనందోత్సాహంలో గ్రామస్తులు

తూర్పుగోదావరి జిల్లా ప్రతినిధి పున్నమి న్యూస్ ✍️రెడ్డి సత్య సుబ్రహ్మణ్యం సీనియర్ రిపోర్టర్ 9989086083. తూ. గో జిల్లా… గోపాలపురం మండలం *900 సంవత్సరాల నాటి విగ్రహం లభ్యం* ఆనందోత్సాహంలో గ్రామస్తులు గోపాలపురం గ్రామంలో 100 సంవత్సరాల నాటి విగ్నేశ్వర స్వామి ఆలయం జీర్ణావస్థకు రావడంతో పునర్ నిర్మించడానికి దేవాలయాన్ని కూల్చిన వినాయక భక్తులు…. ఈ నేపథ్యంలో దేవాలయం కింద ఉన్న మట్టిని తీసి ట్రాక్టర్లతో రెండు నెలల క్రితం ఊరి చివరన కారంపూడి సత్యనారాయణ కు చెందిన కర్రల మిషన్ లో వేశామని తెలిపారు….. తుఫాను నేపథ్యంలో కురిసిన భారీ వర్షానికి మట్టి కరిగి విగ్రహం తల కనపడటంతో అక్కడే ఉన్న సత్యనారాయణ అనుమానంతో తవ్వి చూశారు…. విగ్రహం బయటపడడంతో గ్రామస్తులు అక్కడకు చేరుకుని విగ్రహాన్ని బయటకు తీసి పూజాది కార్యక్రమాలు నిర్వహించారు….. గ్రామ పెద్దలు ఈ విశేషానికి విగ్రహాన్ని పరీక్షించడానికి ప్రముఖ తిరుపతి దేవస్థాన ఆఁస్తానా పండితులు వెంకటేశ్వర శాస్త్రి ను ఫటాహుటిన రప్పించారు….. విగ్రహాన్ని పరీక్షించిన పండితులు ఈ విగ్రహం రుక్మిణీ సమేత గోపాల స్వామి విగ్రహం అని ఇది 900 సంవత్సరాల క్రితం నాటి విగ్రహం అత్యంత మహిమా గల విగ్రహముగా తెలిపారు…. ఈ విగ్రహాన్ని నీటితో కడగగా లేత ఆకుపచ్చ రంగుగా మారుతుందని ఇటువంటి రాయి భారతదేశంలో ఒక్క తమిళనాడు రాష్ట్రంలోనే దొరుకుతుందని ఆయన అన్నారు…. ఇటువంటి విగ్రహాలు దక్షిణ భారతదేశంలో చాలా అరుదుగా మూడు చోట్ల మాత్రమే ఉన్నాయని ఆయన తెలియజేశారు…. ఈ విగ్రహం దొరకడం పట్ల గోపాలపురం గ్రామ ప్రజ లు చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు…. పెద్దల సహకారంతో గ్రామంలో ఆలయాన్ని నిర్మిస్తామని తెలిపారు. End

విశాఖపట్నం

మత్స్యకారులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కూటమి నాయకులు*

*మత్స్యకారులకు నిత్యావసరాలు పంపిణీ చేసిన కూటమి నాయకులు* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- గంగవరం పల్లిపాలెంలో కూటమి ప్రభుత్వం పేదలకు రేషన్ పంపిణీ చేసింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న విశాఖ డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరాజు, బాజపా రాష్ట్ర మీడియా పేనలిస్ట్ మరియు గాజువాక ఇంచార్జ్ కరణంరెడ్డి నరసింగరావు టిడిపి నాయకులు పెదగంట్యాడ తహసీల్దార్ ఆమని , ఏఎస్ఓ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మొంధా తుఫాను కారణంగా చేపల వేటకు వెల్లని మత్స్యకారులను గుర్తించి కూటమి ప్రభుత్వం తరపున టిడిపి రాష్ట్ర అధ్యక్షులు మరియు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు సూచనలు మేరకు ఒక్కో కుటుంబానికి యాభై కేజీల బియ్యం, కేజీ కందిపప్పు, ఉల్లిపాయలు, పంచదార,నూనె,బంగాళదుంపలు వంటి నిత్యావసరాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో పదమూడు వేల మందికి ఉచితంగా రేషన్ పంపిణీ చేసామని తెలిపారు. అనంతరం పలువురు వృద్ధులకు నాలుగు వేల రూపాయల చొప్పున ఫించన్ నగదు అందజేశారు. కార్యక్రమంలో మొల్లి పెంటి రాజు, పేర్ల అప్పారావు, గరికిన మాధవి,అమ్మోరు, ముసలయ్య , శంకరరావు, కోవిరి హరికృష్ణ, కోన చిన అప్పారావు, జ్యోతి రెడ్డి, కోవిరి పెంటయ్య, మాధవ్, పెదప్పయ్య,కదిరి పోలరాజు,తదితరులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

నాగవంశం కళ్యాణ మండప నిర్మాణానికి ప్రభుత్వ నిధులు మంజూరు చేస్తాం – MLA బొండా ఉమ

విజయవాడ సెంట్రల్ నియోజక వర్గం 57వ డివిజన్‌లోని NTR నగర్‌లో నిర్మాణంలో ఉన్న నాగవంశం కళ్యాణ మండప పనులను శనివారం ఉదయం ప్రభుత్వ విప్, సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యుడు బొండా ఉమామహేశ్వరరావు పర్యవేక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2024లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సెంట్రల్ నియోజకవర్గ అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయని, ఇప్పటి వరకు ₹350 కోట్లకు పైగా నిధు లతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. బీసీ, ఎస్సీ, మైనార్టీల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తున్నామని, బీసీ భవన్ నిర్మాణంతోపాటు నాగవంశం కళ్యాణ మండప పనులను కూడా త్వరితగతిన పూర్తి చేస్తామని చెప్పారు. అవసరమైతే అదనపు నిధులు కూడా మంజూరు చేయించేం దుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ నాగవంశ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ ఎరుబోతు రమణారావు, స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

పల్లగిరి గ్రామంలో సామాజిక సేవా స్ఫూర్తి – పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు

నందిగామ మండలం పల్లగిరి గ్రామంలో శనివారం జరిగిన సామాజిక భద్రతా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఉత్సాహం గా జరిగింది. ఈ కార్యక్రమంలో విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాద్ చిన్ని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఎమ్మెల్యే సౌమ్య అధికారులు, కూటమి నేతలతో కలిసి ఇంటింటికీ వెళ్లి ప్రజల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ప్రజలతో ఆప్యాయంగా మాట్లాడి ప్రభుత్వ పథకాలపై వారి అభిప్రాయాలను తెలుసు కున్నారు. ఎంపీ కేశినేని శివనాద్ చిన్ని ప్రజల సేవలో ఎల్లప్పుడూ ఉంటామని పేర్కొనగా, ఎమ్మెల్యే సౌమ్య ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయ కత్వంలో ప్రతి బలహీన వర్గానికి ప్రభుత్వం అండగా ఉందని అన్నారు. గ్రామ ప్రజలు నాయ కులను తమ మధ్య చూసి ఆనందం వ్యక్తం చేస్తూ, పెన్షన్ పంపిణీ పట్ల చూపిన శ్రద్ధకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు బచ్చుల సుబ్రహ్మణ్యం బోస్, చైర్మన్లు, కూటమి నేతలు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీకాకుళం 

కాషీబుగ్గలో విషాదం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట – 9మంది మృతి, పలువురు గాయాలు

శ్రీకాకుళం జిల్లా కాషీబుగ్గ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శనివారం ఉదయం ఘోర ప్రమాదం జరిగింది. భారీగా తరలివచ్చిన భక్తుల రద్దీ కారణంగా ఆలయ ప్రాంగణంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో 9మంది భక్తులు మృతి చెందగా, మరో ముప్పై మందికి పైగా గాయపడ్డారు. ఘటన వివరాలు కార్తీకమాసం ప్రారంభం కావడంతో ఉదయం నుంచి వేలాదిమంది భక్తులు స్వామి దర్శనం కోసం కాషీబుగ్గకు తరలివచ్చారు. ఆలయంలో సన్నివేశం పెరగడంతో భక్తులు ఒకేసారి గర్భగుడికి చేరడానికి ప్రయత్నించగా తొక్కిసలాట జరిగింది. కొంతమంది అక్కడికక్కడే స్పృహ తప్పగా, కొంతమందిని అత్యవసరంగా సమీప ఆసుపత్రులకు తరలించారు. దుర్ఘటన సమయంలో స్వామి దర్శన క్యూలైన్‌లో నియంత్రణ చర్యలు తగినంతగా లేవని స్థానికులు తెలిపారు. ఒకే ప్రవేశ ద్వారం ఉండటంతో బయటకు వెళ్లే మార్గం సరిగా లేకపోవడమే పెద్ద కారణమని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయ నేపథ్యం ఈ ఆలయాన్ని హరి ముకుంద్ పండా ఐదేళ్ల క్రితం 12 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించారు. తిరుమల దర్శనం సాధ్యం కాని భక్తులు తమ ప్రాంతంలోనే వేంకటేశ్వర స్వామిని దర్శించాలనే సంకల్పంతో ఈ దేవాలయాన్ని ప్రతిష్ఠించారు. తన వ్యక్తిగత భూమిలో స్వంత నిధులతో ఈ ఆలయాన్ని తీర్చిదిద్దిన హరి ముకుంద్ పండా, కాషీబుగ్గను “చిన్న తిరుమల”గా తీర్చిదిద్దాలనే సంకల్పం వ్యక్తం చేసినట్లు సమాచారం. రక్షణ చర్యలు ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీములు, పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని పలాస, శ్రీకాకుళం, విశాఖ వైద్యశాలలకు తరలించారు. అంబులెన్సులు వరుసగా రావడంతో ఆలయ ప్రాంగణం శోకసంద్రంగా మారింది. మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రభుత్వం సంతాపం తెలిపింది. అధికారుల స్పందన రాష్ట్ర ప్రభుత్వం ఈ ఘటనపై విచారణ ఆదేశించింది. జిల్లా కలెక్టర్, ఎస్పీ కాషీబుగ్గకు చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. భద్రతా ఏర్పాట్లలో లోపాలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. స్థానికులు, భక్తులు ఇలా స్పందించారు: “ఇంత పవిత్రమైన స్థలంలో ఇలాంటి ఘటన జరగడం మనసును కలచివేసింది. ఈ ఆలయం ఆధ్యాత్మిక కేంద్రముగా ఎదగాలని కోరుకుంటాం, కానీ భక్తుల భద్రతకూ ప్రాధాన్యం ఇవ్వాలి.” ఆలయ విశేషాలు కాషీబుగ్గ, శ్రీకాకుళం జిల్లాలో 12 ఎకరాలు విస్తీర్ణంలో హరి ముకుంద్ పండా అనే వ్యక్తి నిర్మించారు అది చిన్న తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన కారణంగా భక్తుల సంఖ్య గణనీయంగా పెరిగింది భక్తుల భద్రత, క్యూలైన్ నిర్వహణ, అవుట్‌లెట్ మార్గాలు, అత్యవసర ఎగ్జిట్ సదుపాయాలు వంటి అంశాలను భవిష్యత్తులో కచ్చితంగా పునర్‌వ్యవస్థీకరించాలని అధికారులు సూచించారు.

గూడూరు

ఎస్.కే.ఆర్. డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఎం. సింహాద్రి

స్థానిక ఎస్కేఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా డాక్టర్ ఎం. సింహాద్రి శుక్రవారం ప్రిన్సిపాల్ గా బాధ్యతలు స్వీకరించారు. గతంలో పాణ్యం ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ గా పనిచేసి కమిషనర్ ఆఫ్ కాలేజీఏట్ ఎడ్యుకేషన్ ఉత్తర్వుల మేరకు ఎఫ్ఎసి ప్రిన్సిపాల్ డాక్టర్ వై. శ్రీనివాసులు నుండి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా నూతన ప్రిన్సిపాల్ కు అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థిని విద్యార్థులు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

అమరజీవి పొట్టి శ్రీరాములుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల నివాళి

ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భంగా అమరజీవి పొట్టి శ్రీరాములు కు ఘన నివాళులు అర్పించారు. నవంబర్ 1న నందిగామ మండలం మాగల్లు గ్రామంలో కొమ్మినేని రవిశంకర్ నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ నియోజక వర్గ ఇన్చార్జి మొండితోక జగన్మోహనరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇన్చార్జి తన్నీరు నాగేశ్వరరావు పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ — “తెలుగువారికి ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు పొట్టి శ్రీరాములు త్యాగమే మూలం. ఆయన ఆత్మబలిదానంతోనే భాషాపరమైన రాష్ట్రాల ఏర్పాటుకు మార్గం సుగమ మైంది. దేశంలో భాషా ఆధారం గా ఏర్పడిన తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం ఆయన త్యాగానికి నిలువెత్తు నిదర్శనం” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, పార్టీ కార్యకర్తలు, పెద్దలు మరియు ప్రజాప్రతినిధు లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

➖ *కాశీబుగ్గ ఆలయం పూర్తి గా ప్రైవేట్ వ్యక్తులు అధీనం లో ఉన్న దేవాలయం*: మంత్రి ఆనం

అమరావతి 01-11-2025 ➖ శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకర ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ➖ *ఈ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నదని, దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు.* ➖ సుమారు 2000 మందిని మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా 25 వేల మంది భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ➖ *ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.* ➖ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ➖ ఇంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రైవేట్ వ్యక్తులు ఎటువంటి సమాచారం ప్రభుత్వానికి లేదా దేవాదాయ శాఖకు అందించలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి గారు తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల కామర్స్ మరియు మేనేజ్మెంట్ విభాగం వారు FICCI -FLOW , విజయవాడ వారి సంయుక్త ఆధ్వర్యంలో

విజయవాడ…లబ్బీపేట… పున్నమి ప్రతినిధి…. *SHE RISES : UNLOCKING HER POWER IN A DIGITAL WORLD..* ….. *డిజిటల్ ప్రపంచంలో శక్తిని అన్లాక్ చేయడంలో మహిళల పాత్ర..* అనే అంశం మీద (27.10.2025, 30.10.2025, 31.10. 2025 ) మూడు రోజుల వర్క్ షాప్ ను నిర్వహించారు. *YOUTH MENTOR AND GUIDE FICCI FLO VIJAYAWADA CHAPTER….. FOUZIA TARANNUM..* ఈ వర్క్ షాప్ కు మెంటరుగా వ్యవహరించారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగిస్తూ…… ప్రస్తుతం ప్రపంచం అంతా సోషల్ మీడియా చుట్టూ తిరుగుతుందని, ఆ మీడియానే ప్రగతికి మెట్లుగా ఉపయోగించుకుంటూ తమ కెరియర్లో అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. యువత ఎంటర్ప్రైన్యూర్‌గా ఎదిగి ఇతరులకు ఉపాధి అవకాశాలను కల్పించి, దేశ పురోభివృద్ధికి కృషి చేయాలని దిశానిర్దేశం చేశారు. విద్యార్థి దశలోనే యువత లక్ష్యాలను నిర్ధారించుకొని వాటి సాధనకు కృషి చేయాలని,’ భావోద్వేగాలను నియంత్రించుకుంటూ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవాలని, అవగాహన కల్పించారు. ముఖ్యంగా విద్యార్థులు విలువలకు ప్రాధాన్యం ఇస్తూ, తమ రంగoలో ముందుకు సాగాలని అభిలషించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఎంటర్ప్రైన్యూర్‌గా విజయం సాధించడంలో Digital skills ప్రముఖ పాత్ర పోషిస్తాయని తెలియజేశారు. ఎంటర్ప్రైన్యూర్ గా విజయం సాధించిన వారి విజయగాధలను వివరించి విద్యార్థులలో ప్రేరణను నింపారు. ఈ వర్క్ షాప్ లో భాగంగా పోలీస్ వారు “shakthi app” మీద అవగాహన సదస్సును ఏర్పాటు చేశారు. ఈ యాప్ ను వమో మరియు లింగ బేధం లేకుండా అందరూ ఉపయోగించుకోవచ్చని, శక్తి యాప్ సిటిజన్స్ కు ఒక ఆయుధం వంటిదని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో శ్రీవాసవీ (CI), మహిళా పోలీస్ స్టేషన్MD సాహేరా(CI), J. లక్ష్మి (SI) women and child safty wing, Vijayawada వారు పాల్గొన్నారు. వర్క్ షాప్ అనంతరం విద్యార్థులకు certificates ను అందజేశారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ Dr.V.V సుబ్రహ్మణ్య కుమార్ గారు, కామర్స్ మరియు మేనేజ్మెంట్ విభాగాధిపతి డాక్టర్. వి. సంధ్యా లక్ష్మి గారు , Mrs Amrita kumar … chairperson FICCI-FLOW, Fouzia tarannum (initiative head and mentor), సుప్రియ మలినేని సీనియర్ vice chairperson FICCI-FLOW, అట్లూరి సుమ secretary , FICCI-FLOW సభ్యులు, కామర్స్ మరియు మేనేజ్మెంట్ అధ్యాపకులు ,విద్యార్థినులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.