Monday, 6 April 2026

Blog

విశాఖపట్నం

ఉత్తర నియోజకవర్గం 45వ వార్డులో ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ. విష్ణుకుమార్ రాజు

ఉత్తర నియోజకవర్గం 45వ వార్డులో ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పీ. విష్ణుకుమార్ రాజు గారు విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోని ప్రతి అర్హుడికి పెన్షన్ అందేలా చర్యలు చేపట్టారని తెలిపారు. ప్రజలకు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబం సంతోషంగా ఉండాలన్నదే ప్రభుత్వం లక్ష్యమని చెప్పారు. కార్యక్రమంలో జీవీఎంసీ జోనల్ కమిషనర్ శ్రీ రాము గారు, ఏపీడి శ్రీమతి పుణ్యవతి గారు, బీజేపీ–టిడిపి–జనసేన కూటమి నాయకులు ముత్యాల నాయుడు గారు, వార్డ్ అధ్యక్షులు నూకరాజు గారు, త్రినాధ్ గారు, వెంకటరమణ గారు, రాంబాబు గారు, సౌజన్య గారు, ఆశీర్వాదం గారు, రాజు గారు, మధు గారు, నాగరాజు గారు, సచివాలయ సిబ్బంది మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఆర్యవైశ్య సంఘం – నందిగామ పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఘన నివాళి

నవంబర్ 1వ తేదీ, ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం సందర్భం గా, నందిగామలోని స్థానిక వాసవి బజార్‌లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమం జరిగింది. సంఘం నేత పారేపల్లి సాయిబాబు నేతృత్వంలో, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు అర్పించి ఘన నివాళులు చెప్పబడ్డాయి. ఈ సందర్భంగా సాయిబాబు మాట్లాడుతూ, పెనుగొండను “వాసవి పెనుగొండ”గా నామకరణం చేసుకోవడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, బి.సి.సంక్షేమ శాఖ మంత్రి సవిత, కూటమి ప్రభుత్వం ప్రతినిధులు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, జిల్లా ఇన్చార్జి మంత్రివర్యులు సత్య కుమార్, నందిగామ శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆర్యవైశ్యుల అభీష్టం మేరకు ఈ అంశాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళటానికి రాష్ట్రఆర్యవైశ్య వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ కు ధన్యవాదాలు తెలిపారు. కార్యక్రమంలో పారేపల్లి సాయిబాబు, పబ్బతి జనార్దన రావు, సముద్రాల ఈశ్వరయ్య, పులిపాటి వెంకటేశ్వరరావు, అడ్డగిరి కృష్ణమూర్తి, కుంచం విజయ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

దక్షిణ నియోజకవర్గం 34 వార్డు లో మనోరమ థియేటర్ సాయిబాబా ఆలయం వద్ద జనవాణి (పబ్లిక్ గ్రీవెన్స్)కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*

*దక్షిణ నియోజకవర్గం 34 వార్డు లో మనోరమ థియేటర్ సాయిబాబా ఆలయం వద్ద జనవాణి (పబ్లిక్ గ్రీవెన్స్)కార్యక్రమం లో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- *ప్రజల నుంచి నేరుగా వినతలు స్వీకరించిన ఎమ్మెల్యే* *జనవాణి కార్యక్రమానికి విచ్చేసిన 31, 34, 35 వార్డుల ప్రజలు* *ప్రజల విన్నపాలపై తక్షణమే స్పందిస్తున్న ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు* *జనవాణి లో హాజరైన జోనల్ కమిషనర్ శ్రీ మల్లయ్య నాయుడు గారు, వివిధ విభాగాల అధిపతులు (HOD), పోలీస్ సిబ్బంది,జీవీఎంసీ సిబ్బంది, సచివాల సిబ్బంది* *ప్రజా సమస్యల పరిష్కార వేదికగా జనవాణి కార్యక్రమం* ఈరోజు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 34వ వార్డు మనోరమ థియేటర్, సాయిబాబా ఆలయం వద్దవద్ద జనవాణి కార్యక్రమం నిర్వహించారు. స్థానిక కూటమి వార్డు అధ్యక్షులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ గారు పలువురు నుంచి వినతలు స్వీకరించారు. ఈ సందర్భంగా పలు సమస్యలు అక్కడికక్కడే అధికారుల సమక్షంలో కొన్ని అర్జీలు పరిష్కారం కాగా పరిష్కారం కానీ అర్జీలను వెంటనే పరిష్కరించమని సంబంధిత అధికారులకు తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ప్రజలకు కష్టాలకు కన్నీళ్ళను మిగిల్చిందనీ తెలిపారు. ప్రజల వద్దకు తానే స్వయంగా వెళ్లి సమస్యలను పరిష్కరించడం ఎమ్మెల్యేగా ఎంతో సంతృప్తిని ఇస్తుందని తెలిపారు. అదే విధంగా నియోజకవర్గంలో ఎవరికైనా ఇటువంటి సమస్యలు ఉన్న తమను సంప్రదించాలని తెలిపారు. నియోజకవర్గం ప్రజల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తున్నామని, కూటమి పాలనలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని గుర్తు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రజా సంక్షేమ పాలన అందిస్తున్న విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో నియోజకవర్గ జనసేన పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివ ప్రసాద్ రెడ్డి గారు, ఇతర కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, స్టేట్ డైరెక్టర్లు, కూటమి వార్డు అధ్యక్షులు, సీనియర్ నాయకులు, వివిధ విభాగాల అధిపతులు, కార్పొరేటర్ శ్రీ నాగరాజు గారు, జీవీఎంసీ సిబ్బంది, సచివాల సిబ్బంది , రెవిన్యూ సిబ్బంది, పోలీస్ సిబ్బంది ఎలక్ట్రికల్ సిబ్బంది, కూటమి నేతలు పాల్గొన్నారు..

అమరావతి

కాశీబుగ్గ ఆలయం పూర్తి గా ప్రైవేట్ వ్యక్తులు అధీనం లో ఉన్న దేవాలయం*: మంత్రి ఆనం

అమరావతి *కాశీబుగ్గ ఆలయం పూర్తి గా ప్రైవేట్ వ్యక్తులు అధీనం లో ఉన్న దేవాలయం*: మంత్రి ఆనం శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దురదృష్టకర ఘటనపై దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ➖ *ఈ ఆలయం పూర్తిగా ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్నదని, దేవాదాయ శాఖకు లేదా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని మంత్రి స్పష్టం చేశారు.* ➖ సుమారు 2000 మందిని మాత్రమే పట్టే ఈ దేవస్థానానికి ఒక్కసారిగా 25 వేల మంది భక్తులు రావడంతో ఈ ఘటన చోటు చేసుకుందని తెలిపారు. ➖ *ఈ ఘటనకు బాధ్యులైన వారిపై తక్షణ చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు.* ➖ ప్రైవేట్ వ్యక్తుల ఆధీనంలో నడుస్తున్న ఆలయాలపై ప్రత్యేక దృష్టి పెట్టి, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ➖ ఇంతమంది భక్తులు వచ్చే అవకాశం ఉన్నప్పటికీ, ప్రైవేట్ వ్యక్తులు ఎటువంటి సమాచారం ప్రభుత్వానికి లేదా దేవాదాయ శాఖకు అందించలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు.

విశాఖపట్నం

మత్స్యకారులకు 50 కేజీలు బియ్యం తో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ

*మత్స్యకారులకు 50 కేజీలు బియ్యం తో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు* విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- తుఫాను కారణంగా వేట నిషేధిత సహకారం ద్వారా మత్స్యకారుల కుటుంబాలకు సహాయం నిమిత్తం కూటమి ప్రభుత్వం 50 కేజీలు బియ్యంతో పాటు నిత్యావసర వస్తువుల పంపిణీ కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు 34వ వార్డులో పలువురు మత్స్యకారులు కు 50 కేజీలు బియ్యంతో పాటు నిత్యాసర వస్తువులను ఎమ్మెల్యే గారి చేతుల మీదగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల పక్షపాతి ప్రభుత్వం అని మరొకసారి నిరూపతమైందని తెలియజేశారు . తుఫాను వలన ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ముందుగానే చర్యలు తీసుకునీ , నష్ట నివారణ చర్యలు చేపట్టిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి మరియు ఉప ముఖ్య మంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, ప్రభుత్వ అధికారులకు ధన్యవాదాలు తెలియజేశారు. కార్యక్రమంలో ఎఎస్ఓ శ్రీహరి గారు, కూటమి నేతలు పాల్గొన్నారు..

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ, జగ్గయ్యపేట వరద ప్రభావిత ప్రాంతాలను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు సందర్శించారు

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మరియు జగ్గయ్యపేట నియోజకవర్గాల వరద ముంపు ప్రభావిత ప్రాంతాలలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు పర్యటన నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షుడు దేవినేని అవినాష్, నందిగామ నియోజకవర్గ ఇంచార్జ్ మొండితోక జగన్మో హనరావు, జగ్గయ్యపేట నియోజకవర్గ ఇంచార్జ్ తన్నీరు నాగేశ్వరరావు కలిసి రైతుల పంటపొలాలను పరిశీలించి, వారిని పరామర్శించారు. వారు పర్యటన అనంతరం మీడియాతో మాట్లాడి, పరిస్థితిని సమీక్షించి, భవిష్యత్తు లో రైతుల సమస్యలకు సమర్థ వంతమైన పరిష్కారాలు తీసుకునే అంశంపై వ్యాఖ్యానించారు.

E-పేపర్

ఎన్టీఆర్ భరోసా పేదలకు వరం పెన్షన్ పంపిణీ చేసిన ఉమ్మడి రోజు సుబ్బరాజు

అన్నమయ్య జిల్లా రైల్వే కోడ ూరు నవంబర్ 1 పున్నమి న్యూస్ ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడుగు బలహీన వర్గాల అవ్వ తాతల పెన్షన్ ఓబులవారిపల్లి మండలం బొమ్మ వరం పంచాయతీలో తెలుగుదేశం యువ నాయకులు ఉమ్మల రాజు సుబ్బరాజు చేతులు మీదుగా అందజేయడం జరిగింది

అమరావతి

కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరిన మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుండి విశాఖకు బయలుదేరిన మంత్రి నారా లోకేష్ విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గ చేరుకుంటారు తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శిస్తారు

కాశీబుగ్గ తొక్కిసలాట జరిగిన ప్రాంతానికి హుటాహుటిన బయలుదేరిన మంత్రి నారా లోకేష్ హైదరాబాద్ నుండి విశాఖకు బయలుదేరిన మంత్రి నారా లోకేష్ విశాఖ విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో కాశీబుగ్గ చేరుకుంటారు తొక్కిసలాట జరిగిన ప్రాంతాన్ని పరిశీలిస్తారు మృతుల కుటుంబ సభ్యులను, గాయపడిన వారిని పరామర్శిస్తారు బాధితులను ఆదుకునేందుకు చేసే సహాయం, భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులు, ప్రజా ప్రతినిధులతో సమీక్షిస్తారు.

శ్రీకాకుళం 

కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిదిమంది మృతి*

*కాశిబుగ్గ ఆలయంలో తొక్కిసలాట.. తొమ్మిదిమంది మృతి* శ్రీకాకుళం( విశాఖపట్నం) పున్నమి ప్రతినిధి:- శ్రీకాకుళం జిల్లాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కాశిబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో తొమ్మిది మంది భక్తులు మృతి చెందగా.. పలువురు గాయపడినట్లు సమాచారం. కాగా మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ఏకాదశి కావడంతో వేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలి వచ్చారు. రెయిలింగ్ ఊడటంతో భక్తులు కింద పడ్డారు. 5 ఏళ్ల క్రితం…12 ఎకరాల్లో 10 కోట్ల వ్యయం తో పండా ఎస్టేట్ లో హరిముకుంద్ పండా నిర్మించిన ఆలయం…..ఇప్పటికీ 90 ఏళ్ల వయసులో ఆలయ నిర్మాణ బాధ్యతలు ఆయనే దగ్గరుండి చూసుకుంటారు….ఓపెన్ గా పెద్ద గేట్ ఉంటుంది…ఆపే సెక్యూరిటీ ఎవరూ ఉండరు….నేరుగా వెళ్లి పోవడమే….క్యూ లైన్ సిస్టమ్ కూడా పెద్ద బలంగా ఉండదు…..ఆలయం లోపల మాత్రం విశాలంగా ఉంటుంది…

విశాఖపట్నం

ఆంధ్రజాతిని అవమానించిన కూటమి ప్రభుత్వం

ఆంధ్రజాతిని అవమానించిన కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశును అనాథను చేసిన కూటమి ప్రభుత్వం తన గౌరవాన్ని తానే దిగజార్చుకొన్న కూటమి ప్రభుత్వం విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- “నవంబరు-01” ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలుగుదండు ఆధ్వర్యవంలో..మద్దిలపాలెం కూడలి, తెలుగుతల్లి విగ్రహం వద్ద “తెలుగుతల్లికి నీరాజనం” వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు కవులు, కళాకారులు, సాహితీవేత్తలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, భాషాభిమానులు పాల్గొని తెలుగుతల్లికి పుష్పాభిషేకం చేసి..మాతృభాష రక్షణ కోసం “టిట్టిభ సత్యాగ్రహం” ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమంలో.. తెలుగుదండు అధ్యక్షుడు పరవస్తు సూరి మాట్లాడుతూ.. ఈ సంవత్సరమైనా మన రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా “ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం” నిర్వహిస్తుందని ఆశించామని, కానీ చివరకు నిరాశే మిగిలిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవాన్నే నిర్వహించలేని ఈ కూటమి ప్రభుత్వం.. అంతర్జాతీయ స్థాయిలో అమరావతి నిర్మించి ఆంధ్రులను ఉద్ధరిస్తామనడంం కేవలం బూటకం అని విమర్శించారు. మన రాష్ట్రం స్వార్థపూరిత కూటమి పాలకుల పాలబడిందని, మోసపోయామని, మన భాషా సంస్కృతులకు పెద్ద ముప్పే వాటిల్లిందని.. పోరాటం చేసియైనా మన భాషా సంస్కృతులను కాపాడుకొని, భావి తరాలకు భద్రంగా అందజేయడం మన కర్తవ్యం అని అన్నాడు. కార్యక్రమంలో పాల్గొనిన పలువురు భాషోద్యమకారులు మాట్లాడుతూ.. మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర కావస్తున్నా ఇంతవరకు అధికార భాషా సంఘాన్ని ఏర్పాటు చేయలేదని, తూతూమంత్రం సంఘాలను ఏర్పాటు చేస్తూ…ఈ పాలకులు వేదికలపై మాత్రం తెలుగుభాష గురించి తియ్యగా కబుర్లు చెబుతూ, నిస్సిగ్గుగా ఆంగ్లభాషకు కొమ్ము కాస్తున్నారనీ నిరసన తెలియజేశారు. కార్యక్రమంలో… తిరుపతి రాజమన్నార్, ప్రజా గాయకుడు దేవిశ్రీ, శ్యామ్ సుందర్, పంతుల లలిత, మదరిండియా, మాధవి, సాహితీవేత్త అడపా రామకృష్ణ, ఆచార్య సూరప్పడు, చేబియ్యం మోహన్, సహృదయ సురేశ్ మరియు అధిక సంఖ్యలో ఆంధ్ర విశ్వవిద్యాలయం విద్యార్థులు, ఆచార్యులు, భాషాభిమానులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.