Monday, 6 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

తుఫాన్ బాధిత అగ్నికులక్షత్రియ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన పెడన MLA కాగితకృష్ణప్రసాద్ గారు

మొంథా తుపాను కారణంగా నష్టపోయిన అగ్నికుల క్షత్రియ కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించార ఈ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు, బంటుమిల్లి మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు గారు, డిసి చైర్మన్ బొర్ర కాశీ గారు చోరంపూడి సర్పంచ్ రేవు గోపాలకృష్ణ గారు, మరియు కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో బంటుమిల్లి మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు గారు, DC చైర్మన్ బొర్రా. కాశీ గారు, చోరంపూడి సర్పంచ్ రేవు గోపాలకృష్ణ గారు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

జనగాం

నష్టపోయిన రైతులను కచ్చితంగా నష్టపరిహారం ఇవ్వాలి

స్టేషన్ ఘనపూర్ మండలం లోని సముద్రాల గ్రామంలో బిజెపి పార్టీ ఆధ్వర్యంలో పంట నష్టపోయిన రైతులను పరామర్శించడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్రంలోని ఫసల్ భీమ వచ్చిన పథకం అమలు చేయడం లేదని బిజెపి మండల ఉపాధ్యక్షుడు కత్తుల రాజు అన్నారు నష్టపోయిన రైతులను కచ్చితంగా నష్టపరిహారం రైతులకు ఎకరానికి 50,000 ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది బిజెపి ఇతర రాష్ట్రాల పసల్ బీమా యోజన పథకం అమలు జరుగుతున్నాయి కానీ మన రాష్ట్రంలో జరగడం లేదు ఫసల్ బీమా యోజన ద్వారా నష్టపోయిన రైతులను కేంద్ర ప్రభుత్వం ఆదుకుంటుంది వెంటనే పసల్ బీమా యోజన అమలు చేయాలి అని డిమాండ్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సముద్రాల గ్రామ బీజేపీ నాయకులు పలుకొన్నారు

ఆంధ్రప్రదేశ్

పెడన నియోజకవర్గం లో పలు గ్రామాలలో పర్యటించిన, MLA కాగిత కృష్ణప్రసాద్ gaaru

పెడన నియోజకవర్గంలో గూడూరు మరియు కృత్తివెన్ను మండలాల లో ని పలు గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తూ , తుఫాన్ వల్ల నష్టపోయిన పంట పొలాలను పరిశీలిస్తూన్న పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు.. రైతులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని, ప్రభుత్వం రైతుల పక్షాన నిలబడి అవసరమైన సహాయ చర్యలు తీసుకునేలా ప్రయత్నిస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, కార్యకర్తలు, అధికారులు, గ్రామస్తులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

అమలాపురం సహస్ర బ్లడ్ సెంటర్ వారి సహకారంతో

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా లక్కవరం మంగిన గురవయ్య విద్యార్థి సంస్థ వారు మరియు ఎ వి ఎస్ ఆంధ్ర విద్యార్థి సంఘం వారి ఆధ్వర్యంలో సహస్ర బ్లడ్ సెంటర్ వారి సహకారంతో ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చెయ్యడం జరిగింది ఈ సహాయం కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొని విజయవంతం చేసారు.

ఆంధ్రప్రదేశ్

మొంథా తుఫాన్ బాధిత రైతులను పరామర్శించిన ఏపీ పీసీసీ చీఫ్ వైయస్ షర్మిలారెడ్డి

బంటుమిల్లి మండలం అర్తమూరు గ్రామం సాతులూరు రోడ్డులో పర్యటించిన షర్మిలా రెడ్డి గారు మాట్లాడుతూ, అసలే పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక విలవిలలాడుతున్న రైతుకు మొంథా తుఫాను తీవ్ర నష్టాన్ని కలుగజేసింది. ఈ ఒక్క గ్రామంలోనే 400 ఎకరాల వరి నీట మునిగిందని, రాష్ట్రమంతా కలిపి వరి,జొన్న, పత్తి, వేరుశెనగ,ఆక్వాకల్చర్ లాంటి మొత్తం వ్యవసాయం లో దాదాపు 20 నుండి 22 లక్షల ఎకరాలు పంట దెబ్బతిన్నదని, వ్యవసాయం సహా మిగిలిన అన్ని రంగాలలో కలిపి దాదాపు 20 వేల కోట్ల రూపాయల నష్టం కలిగించిందని ఆమె తెలియజేశారు. వ్యవసాయ శాఖ అధికారులు నష్టపోయిన పంటను అసలు సర్వె చేయడం లేదని అంటున్నారని ఆమె ఆరోపించారు. రైతు పండించిన పంటను అమ్ముకునే దిక్కు ఉండడం లేదని మిల్లర్ల దగ్గరకు వెళితే వాళ్లు కూడా దోపిడీ చేస్తున్నారని, ప్రభుత్వాలు పట్టించుకోవడంలేదని ఆమె ఆరోపించారు నష్టపోయిన ప్రతి రైతుకు ఎకరాకు 25 వేల రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని, స్తోమత లేక రైతులు పంట బీమా కూడా చెల్లించలేకపోతున్నారని ప్రభుత్వమే ఆ బీమా కూడా చెల్లించి రైతులను ఆదుకోవాలని కాంగ్రెస్ పార్టీ తరఫున తీవ్రంగా డిమాండ్ చేశారు.

విశాఖపట్నం

శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి రాట

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- బురుజుపేట శ్రీశ్రీశ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 19వ తేదీ నుంచి జరగబోయే మార్గశిర మాస మాసోత్సవములు సందర్భంగా రాట మహోత్సవ వేడుక ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొని ప్రత్యేక పూజ అనంతరం రాట మహోత్సవ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహించారు అనంతరం అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించి నిర్వహించారు ఆశీర్వచనం చేసే తీర్థప్రసాదంలో అందజేశారు కార్యక్రమంలో ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ అమ్మవారి ఉత్సవములు ఘనంగా జరగడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు స్థానిక ప్రజలకు మరియు వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలవకుండా నూతన వరవడితో దర్శనం ఏర్పాట్లు జరుగుతాయని తెలిపారు కార్యక్రమంలో ఆలయ ఈవో శ్రీమతి శోభారాణి ఏఈవోలు ఆలయ సిబ్బంది స్థానిక కార్పొరేటర్స్ విజయలక్ష్మి నరసింహాచారి గారు కూటమి వార్డు అధ్యక్షులు స్థానిక టిడిపి జనసేన బిజెపి నాయకులు పాల్గొన్నారు

E-పేపర్

భోళా శంకర్ సేవా సమితి ద్వార నిత్యావసర సరుకులు కడప నివాసి శ్రీపతి నాగ్లోకేశ్వర్ నాథ్

రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి భోళా శంకర్ సేవా సమితి ద్వార నిత్యావసర సరుకులు మరియు బియ్యము కడప నివాసి శ్రీపతి నాగ్లోకేశ్వర్ నాథ్ పుట్టిన రోజు సందర్భంగా రైల్వే కోడూర్. రెడ్‌వుడ్ పార్క్ వద్ద ఉన్నా వెంకటేశ్వరపురం.ఎస్.టి కాలని నివాసి ఆయేనా కొండా రెడ్డి అంజలి అనే కిడ్నీ పై సెంటు మరియు నిరుపెదరాలైన మహిళ కు మా భోలా శంకర్ సేవా సమితి అధ్యక్షుడు మంధల నాగేంద్ర మరియు c.h.రమేష్ ద్వారా వారికి నిత్యావసర సరుకులు మరియు బియ్యము పంపిని చెయ్యడం జరిగింది ఇలాగే ప్రతి ఒక్కరు ఆలో చించి నీరు పేదలకు మీరు కుడాసహాయ సహకరాలు అందించాలని మా బోలా శంకర్ సేవా సమితి ద్వారా తెలియ చేస్తున్నా ము.ఈ కార్యక్రమములో పాల్గొనవారు భోలాశంకర్ సేవా సమితి సభ్యులు ఉత్తరాది శివకుమార్ వాస బాబు పుల్ల సెట్టి.రాజేశ్వరమ్మ. మణి నర్సరంపేట.భూంపల్లి.నాగరాజ.మహంకాళి సుబ్రమణ్యం కొప్పల.శంకరయ్య ప్రసాద్. లక్ష్మయ్య పెనుకొండ సుబ్బరాయుడు.కొర్లకుంట.శంకర ఇ.చైతన్య రమణ.st.కాలనీ ఎన్.కుమార్.

E-పేపర్

ఎన్టీఆర్ భరోసా పేదల కు వరం ఉమ్మల రాజు సుబ్బరాజు

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నవంబర్ 1 (పున్నమి న్యూస్ ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడుగు బలహీన వర్గాల అవ్వ తాతల పెన్షన్ ఓబులవారిపల్లి మండలం బొమ్మ వరం పంచాయతీలో తెలుగుదేశం యువ నాయకులు ఉమ్మల రాజు సుబ్బరాజు చేతులు మీదుగా అందజేయడం జరిగింది

E-పేపర్

ఎన్టీఆర్ భరోసా పేదల కు వరం ఉమ్మల రాజు సుబ్బరాజు

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నవంబర్ 1 (పున్నమి న్యూస్ ప్రతినిధి) రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడుగు బలహీన వర్గాల అవ్వ తాతల పెన్షన్ ఓబులవారిపల్లి మండలం బొమ్మ వరం పంచాయతీలో తెలుగుదేశం యువ నాయకులు ఉమ్మల రాజు సుబ్బరాజు చేతులు మీదుగా అందజేయడం జరిగింది

విశాఖపట్నం

ప్రతి ఆదివారం విశాఖలో ఆర్గానిక్ సంత

ప్రతి ఆదివారం విశాఖలో ఆర్గానిక్ సంత – ఆదివారం ఉదయం 9 గంటల నుండి ఎయు నార్త్ క్యాంపస్ ఎం హబ్ లో విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:- – దాట్ల సుబ్రహ్మణ్య వర్మ, జిల్లా అధ్యక్షులు, గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం విశాఖ నగరంలో నిర్వహించె ప్రకృతి ఆధారంగా నుండె పంటల సంతను జయప్రదం చేయండి అని గో ఆధారిత ప్రకృతి రైతులు సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ పిలుపునిచ్చారు. శనివారం మధ్యాహ్నం ఎ హబ్ వద్ద కలిసిన విలేఖరులతో మాట్లాడారు. 2వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5గంటల వరకూ  ఆంధ్ర విశ్వవిద్యాలయం, ఎ హబ్, మద్దిలపాలెం లో నిర్వహించబోయే విశాఖ ఆర్గానిక్ సంతను జయప్రదం చేయాలని కోరారు. ఎటువంటి హానికర కెమికల్స్ వాడకుండా పండించిన బియ్యం, పప్పులు, కూరగాయలు,చెక్క గానుగ నూనెలు, బెల్లం, ఖాదీ, చేనేత వస్త్రాలు విక్రయించడం జరుగుతుంది అన్నారు. కంపోస్టింగ్, టెర్రస్ గార్డెన్, బయో ఫెర్టిలైజర్స్, హస్తకళలు మొదలైన వాటిపై వర్క్ షాప్లు నిర్వహించడం జరుగుతుంది అన్నారు. ఈ కార్యక్రమంలో సంఘం జిల్లా కార్యదర్శి పాలేం నేచురల్స్ అశోక్ , గ్రీన్ క్లైమేట్ టీం ఎన్ జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం తదితరులు పాల్గొని మాట్లాడారు .

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.