Monday, 6 April 2026

Blog

విశాఖపట్నం

కాశీబుగ్గ తొక్కిసలాట సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేకే రాజు*

*కాశీబుగ్గ తొక్కిసలాట సంఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేకే రాజు* *ఈ సంఘటనకు ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమని ఆరోపణ* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో వెంకటేశ్వర ఆలయంలో తొక్కేసిలాటలో పది మంది భక్తులు దుర్మరణం చెందిన నేపథ్యంలో విశాఖ జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేకే రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇలాంటి సంఘటనలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయని , ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇది ఒక నిదర్శనమని కేకే రాజు విమర్శించారు. ప్రభుత్వానికి ఉన్న ఇంటెలిజెన్సీ ప్రకారం ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరిగినప్పుడు ఎంత మంది భక్తులు వస్తున్నారూ అన్నది అంచనా వేసి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉండగా ఎవరూ పట్టనట్లుగా ఉండడంతో భక్తులు తొక్కిసలాటలో దుర్మరణం పాలవుతున్నారని అన్నారు. నాడు తిరుపతి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఇటీవలే సింహాచలంలో సంఘటనలు, నేడు కాశీబుగ్గలో జరిగిన సంఘటనలు అధికారులు పాలకులు నిర్లక్ష్యం కారణంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయని ఆరోపించారు. బాధిత కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

E-పేపర్

గన్నవరం వేదికగా కృష్ణా జిల్లా అండర్-17 షటిల్ బాడ్మింటన్ ఎంపికలు*

ఉత్సాహంగా కృష్ణా జిల్లా స్థాయి షటిల్ బాడ్మింటన్ ఎంపికలు” గన్నవరం:నియోజకవర్గం: నవంబర్ 1 పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణా జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో శనివారం నాడు గన్నవరం కే.వి.ఆర్ ఇండోర్ స్టేడియం లో అండర్ 17 బాల, బాలికల షటిల్ బాడ్మింటన్ ఎంపికలు ఉత్సాహం గా జరిగాయి.జిల్లా నలుమూలల నుండి వచ్చిన క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యం ప్రదర్శించి పోటీపడ్డారు. ఎంపికలకు ముందు జరిగిన కార్యక్రమం లో జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య కార్యదర్సులు యం అరుణ, జి. రాంబాబు లు మాట్లాడుతూ సత్తా కలిగిన క్రీడాకారులను జిల్లా జట్టు కు ఎంపిక చేసి రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం లో గన్నవరం నియోజకవర్గ క్రీడా సమన్వయ కర్త ధనియాల నాగరాజు, సీనియర్ వ్యాయామ విద్య ఉపాధ్యాయులు సి.హెచ్. చంద్ర శేఖర్, గన్నవరం వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు కే.వి.ఆర్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. వ్యాయామ విద్య ఉపాధ్యాయులు అశోక్,ముకుంద, గంగాధర్ కృష్ణ ప్రియ, రామారావు, వెంకటేశ్వరరావు,బాలకృష్ణ,గీత,టాన్య గిరి, శాంతి, సుజాత తది తదితరులు ఎంపికలు నిర్వహించారు.

అమరావతి

మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన హోం మంత్రి వంగలపూడి అనిత పనితీరును ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు

*అమరావతి*(విశాఖపట్నం పున్నమి ప్రతినిధి):- *మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన హోం మంత్రి వంగలపూడి అనిత పనితీరును ప్రశంసించిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు* మొంథా తుపానులో ప్రజలకు అండగా నిలిచిన హోం మంత్రి వంగలపూడి అనిత పనితీరును ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారు. మొంథా తుఫాను సమయంలో అత్యుత్తమ సేవలు అందించిన అధికారులను, సిబ్బందిని శనివారం అమరావతిలోని ఉండవల్లి ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో సీఎం సత్కరించారు. ఈ సందర్భంగా హోం మంత్రి వంగలపూడి అనితకు ప్రశంసా పత్రం మరియు ఉత్తమ సేవా అవార్డు ను ముఖ్యమంత్రి స్వయంగా అందజేశారు. తుఫాను సమయంలో ప్రజల రక్షణ, సహాయక చర్యల సమన్వయంలో కీలక పాత్ర పోషించినందుకు హోం మంత్రిని సీఎం ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ సందర్భంగా మంత్రి వంగలపూడి అనిత మాట్లాడుతూ ప్రజాసేవలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చూపిన మార్గం మాకు దిశానిర్దేశమన్నారు. మీ శిష్యరికంలో ప్రజలకు సేవ చేయడం నేర్చుకున్నామని చెప్పారు. ప్రజల సమస్యలను తెలుసుకుని, వారికి ఎల్లప్పుడూ అందుబాటులో ఉండడం మా బాధ్యతగా భావిస్తున్నాం అని తెలిపారు. మీ చేతుల మీదుగా ‘సైక్లోన్ మొంథా ఫైటర్’ సర్టిఫికెట్ స్వీకరించడం, మీ నుంచి ప్రశంసలు అందుకోవడం నా జీవితంలో మర్చిపోలేని అనుభవమన్నారు. ముఖ్యమంత్రి గారి మార్గదర్శకంలోనే మొంథా తుఫాను సమయంలో ఒక్క ప్రాణం కూడా కోల్పోకుండా కాపాడగలిగాం అని అన్నారు. తుఫాను సమయంలో ప్రజలకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా మంత్రి అనిత ధన్యవాదాలు తెలిపారు.

అన్నమయ్య

మగ్దమ్ షా వల్లీ ఉరుసు ఉత్సవాలకు హాజరైన తులసి రెడ్డి

మగ్దమ్ షావలి దర్గాకు ఉరుస్ మహోత్సవాల సందర్భంగా దర్గా పీఠాధిపతులు మరియు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు యూసుఫ్ ఆహ్వాన మేరకు ముఖ్యఅతిథిగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్. తులసి రెడ్డి హాజరయ్యారు.దర్గా కమిటీ మెంబర్లు ఘనంగా శాలువాతో సత్కరించి స్వాగతం పలికారు.అనంతరం పీఠాధిపతి మొహినుద్దీన్ హుసేని,వారి స్వగృహం నుండి దర్గా వరకు తులసి రెడ్డి చెద్దరును మరియు పూల హారాలను తీసుకపోయి దర్గాలో సమర్పించారు. గురువులయ్య ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి తులసి రెడ్డినీ ఆశీర్వదించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నందలూరు మండలంలో ఇంత మహతాదులో కుల మతాలకు వ్యతిరేకంగా మగ్దమ్ షా దర్గా ఉత్సవాలకు అందరూ కలిసి పాల్గొనడం చాలా గొప్పదని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజంపేట కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పూల భాస్కర్, పిసిసి సభ్యులు అతింజేరి శ్రీనాథ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు అమర్నాథ్ రెడ్డి, ఉత్తన్న, మహా దేవయ్య తోపిరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి, ఐచర్ రమణ, చిన్న కోట్ల నాగరాజు తదితరులు పాల్గొన్నారు,

కామారెడ్డి

జిల్లాలో బలవర్ధక అన్నం పంపిణీ ప్రారంభం

కామారెడ్డి, 01 నవంబర్, (పున్నమి ప్రతినిధి) : ప్రజల ఆరోగ్య రక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వ కొత్త అడుగురాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ రామారెడ్డి మండ లాలలో బలవర్ధక అన్నం పంపిణీ కార్యక్ర మం ఘనంగా ప్రారంభమైందని. సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి తెలిపారు సందర్భంగా వారు మాట్లా డుతూ,పోషకాహార ప్రజారోగ్య విభాగాల సంయు క్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో లబ్ధిదా రులకు ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక అన్నం) అందజే శారని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పర చాలని ప్రభుత్వ సంకల్పంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సాధారణ బియ్యంలో ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ (B12) వంటి సూక్ష్మ పోషకాలు కలిపిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నా రని అన్నారు. దీని ద్వారా ప్రత్యేకించి మహిళలు, చిన్నపిల్లలు, విద్యార్థులలో రక్తహీనత ( అనేమి యా ) సమస్యను తగ్గించడం ప్రధాన లక్ష్యం. పేద మధ్యతరగతి కుటుంబాలకు పోషక ఆహార భద్రత తో పాటు ఆరోగ్య రక్షణ అందించే దిశగా ఈ పథ కం కీలకంగా నిలుస్తుందని అధికారులు తెలిపా రు.ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ మహ్మద్ ఇర్షా దుద్దిన్,సీనియర్ నాయకులు బొలిపెల్లి మహేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆకుల సిద్దిరాం లు, ఆకుల గంగరాజం, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నితిన్ గౌడ్, సాగర్ రెడ్డి, చెరుకు ప్రసా ద్, లింబాయల శ్రీనివాస్ రెడ్డి, శేకెల్లి మహేందర్, ఆకుల బాలయ్య, తిరుపతి కృష్ణమూర్తిలు తదిత రులు పాల్గొన్నారు.

తిరుపతి

శ్రీకాళహస్తీశ్వర స్వామి వారిని దర్శించుకున్న ఇస్రో చైర్మన్

ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఇస్రో చైర్మన్ వి.నారాయణన్ శనివారం శ్రీకాళహస్తికి విచ్చేశారు.వారికి ధర్మకర్తల మండలి అధ్యక్షుడు కొట్టే సాయి సాదరంగా స్వాగతం పలికి శ్రీ జ్ఞాన ప్రసూనాంబికా సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి ప్రత్యేక దర్శనం చేయించారు.దర్శనం అనంతరం వేదపండితులు వేద మంత్రాలతో ప్రత్యేక ఆశీర్వచనాలు అందించగా,కొట్టే సాయి వాయు లింగేశ్వరుని తీర్థప్రసాదాలు, చిత్రపటం మరియు శేషవస్త్రం అందజేయడం జరిగింది.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామ నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ఉచిత పెన్షన్ పంపిణీ

నందిగామలోని పేద ఆర్యవైశ్య 10 కుటుంబాలకు నవంబర్ నెలకుగాను పెన్షన్ పంపిణీ జరిగింది. ప్రతి కుటుంబానికి నెలకు ₹500 చొప్పున పంపిణీ జరిగింది. ఈ కార్యక్రమాన్ని పారేపల్లి సాయిబాబు, ఆర్యవైశ్య సంఘం, నందిగామ ఆధ్వర్యంలో నిర్వహించారు. పంపిణీ కార్యక్రమం శనివారం ఉదయం 10:00 గంటలకు జరిగింది. *స్పాన్సర్లు* : నందిగామ వాసవీ వృథ్యాప్య పెన్షన్స్ ఆర్యవైశ్య బాలభక్త సమాజం శ్రీ శ్రీనివాసా ఆర్యవైశ్య కళ్యాణ మండపం (చైర్మన్) గాంధీ సెంటర్ గణపతి ఉత్సవ కమిటీ (అధ్యక్షులు కుంచం లక్ష్మీనారాయణ & ధర్మపత్ని విజయలక్ష్మీ) పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో కుంచం విజయలక్ష్మీ చేతుల మీదుగా కేటాయించబడింది. *పాల్గొన్నవారు* : పబ్బతి జనార్దనరావు, ఆర్యవైశ్య సంఘం నాయకుడు, సముద్రాల ఈశ్వరయ్య, పులిపాటి వెంకటేశ్వరరావు, వాసవీ క్లబ్ సిల్వర్ స్టార్ KCGF అధ్యక్షుడు, అడ్డగిరి కృష్ణమూర్తి, ఇతర సంఘ నాయకులు. ఈ కార్యక్రమం ద్వారా నిరుపేద ఆర్యవైశ్య కుటుంబాలకు ఆర్థిక సహాయం అందించడం లక్ష్యంగా జరుగుతుంది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోటి సంతకాల స్వీకరణ కట్టువపల్లిగ్రామంలో

*”ప్రైవేటీకరణను వెనక్కి తీసుకోవాల్సిందే” – కాకాణి పూజిత* *SPS నెల్లూరు జిల్లా:* *తేది:01-11-2025* *సర్వేపల్లి నియోజకవర్గం,మనుబోలు మండలం,కోలనుకుదురు.కట్టువపల్లి గ్రామంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాణి పూజితగారు”

ఆంధ్రప్రదేశ్

తుఫాన్ బాధిత అగ్నికులక్షత్రియ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన పెడన MLA కాగితకృష్ణప్రసాద్ గారు

మొంథా తుపాను కారణంగా నష్టపోయిన అగ్నికుల క్షత్రియ కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించార ఈ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు, బంటుమిల్లి మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు గారు, డిసి చైర్మన్ బొర్ర కాశీ గారు చోరంపూడి సర్పంచ్ రేవు గోపాలకృష్ణ గారు, మరియు కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

తుఫాన్ బాధిత అగ్నికులక్షత్రియ కుటుంబాలకు నిత్యావసర వస్తువులు పంపిణి చేసిన పెడన MLA కాగితకృష్ణప్రసాద్ గారు

మొంథా తుపాను కారణంగా నష్టపోయిన అగ్నికుల క్షత్రియ కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తుపాను ప్రభావిత ప్రాంతాల్లోని కుటుంబాలకు ఉచితంగా నిత్యావసర సరకులను పంపిణీ చేయాలని నిర్ణయించింది.ఈ మేరకు పెడన నియోజకవర్గం బంటుమిల్లి మండలం చోరంపూడి గ్రామంలో నిత్యవసర వస్తువులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించార ఈ కార్యక్రమంలో పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు, బంటుమిల్లి మండలం టిడిపి పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు గారు, డిసి చైర్మన్ బొర్ర కాశీ గారు చోరంపూడి సర్పంచ్ రేవు గోపాలకృష్ణ గారు, మరియు కూటమి నాయకులు కార్యకర్తలు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం లో బంటుమిల్లి మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు కూనపురెడ్డి వీరబాబు గారు, DC చైర్మన్ బొర్రా. కాశీ గారు, చోరంపూడి సర్పంచ్ రేవు గోపాలకృష్ణ గారు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.