Monday, 6 April 2026

Blog

తిరుపతి

రామచంద్రపురంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేసిన ఆర్డీవో

తిరుపతి ఆర్డీవో రామ్మోహన్ రామచంద్రపురం మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందించారు. రామచంద్రపురం 01 నవంబర్ పున్నమి ప్రతినిధి తిరుపతి జిల్లా రామచంద్రపురం మండలంలోని సి రామాపురం ఎస్టీ కాలనీలో తిరుపతి ఆర్డీవో రామ్మోహన్ ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులు ఇంటికి వెళ్లి అందించారు. ఈ సందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ ప్రతి నెల ఒకటో తేదీ లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు అర్హులందరికీ అందించడంతో వారందరూ సంతోషంగా ఉండారన్నారు. సచివాలయ సిబ్బంది కూడా ఉదయం 6:30 గంటలకే మండలంలోని గ్రామాలలో లబ్ధిదారుల ఇంటికి వెళ్లి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను అందించడం జరుగుతున్నదన్నారు. మొదటి రోజే 100% పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల తాహసిల్దార్ మధుసూదన్ రావు, ఇన్చార్జ్ ఎంపీడీవో శ్రీనివాసులు, కూటమి నాయకులు కేసులు నాయుడు, నరసింహారెడ్డి , కోలాహరిప్రసాద్ , విజయ్ కుమార్, మునిరామిరెడ్డి, సురేంద్ర నాయుడు, హరి ప్రసాద్, రవి , కార్యకర్తలు రెవిన్యూ సిబ్బంది, సచివాలయ సిబ్బంది తదితరులుపాల్గొన్నారు.

విశాఖపట్నం

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసిన విశాఖ నగర మేయర్

ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను పంపిణీ చేసిన నగర మేయర్ *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *: ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లతోనే వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు ఆర్థిక భరోసా కలుగుతుందని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. శనివారం ఆయన 8వ జోన్ 98 వార్డు పరిధిలో అప్పన్నపాలెం ప్రాంతంలో ఎన్టీఆర్ భరోసా సామాజిక పించను పంపిణీ కార్యక్రమంలో పాల్గొని పింఛన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం బడుగు బలహీన వర్గాలతో పాటు దారిద్యరేఖకు దిగువున ఉన్న వారికి ఎంతో కృషి చేస్తుందన్నారు. కనీస అవసరాలు తీర్చుకోలేని వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలు, దీర్ఘకాలిక రోగులకు చంద్రబాబు అండగా ఉంటూ పెద్దన్న పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ప్రతినెల 1వ తేదీన అర్హులైన ప్రతి ఒక్కరికి ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లను అందిస్తున్నారని తెలిపారు. 98వ వార్డులో అప్పన్నపాలెం లోని పలువురికి ఇంటింటికి వెళ్లి ఎన్టీఆర్ సామాజిక పింఛన్లను అందించడం జరిగిందని తెలిపారు. సామాజిక పింఛన్ల పెంపు అనేది తెలుగుదేశం ప్రభుత్వం తోనే సాధ్యమని, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పింఛన్లు ఇవ్వడం జరుగుతుందని మేయర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో 8వ జోన్ జోన్ల కమిషనర్ హెచ్ విజయ శంకర్, వార్డ్ కార్పొరేటర్ పీ.వీ. నరసింహం, జివిఎంసి ఏపిడి చిరంజీవి, వార్డ్ సచివాలయం వెల్ఫేర్ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

ఖమ్మం

*వైన్ షాప్ వచ్చింది…! ఉద్యోగం పోయింది..!!

*వైన్ షాప్ వచ్చింది…! ఉద్యోగం పోయింది..!!* మహబూబ్‌నగర్ జిల్లా రాంనగర్ బాలికల ఉన్నత పాఠశాలలో పీఈటీ గా పనిచేస్తున్న పుష్ప పేరుతో ఆమె భర్త ఇటీవల మద్యం టెండర్ వేయగా వారికి *ధర్మపూర్ వైన్‌షాప్* లక్కీ డిప్‌లో దక్కింది. ఇందుకు సంబంధించి పుష్ప అధికారుల సమక్షంలో సంతకం చేసి తదనంతర ప్రక్రియను సైతం పూర్తి చేశారు. అయితే ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మద్యం టెండర్లు దక్కించుకోవడానికి అర్హులు కాదని నిబంధనలు ఉండడంతో ఓ వ్యక్తి టెండర్ల ఖరారు రోజునే అధికారులకు ఫిర్యాదు చేశాడు. ఈ అంశం మీడియా, సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఈ నేపథ్యంలో అధికారులు ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకొని విచారణ జరిపారు. పీఈటీ పుష్ప మద్యం టెండర్ల దాఖలు నుంచి షాపు దక్కేవరకు చేసిన ప్రక్రియలకు సంబంధించి అన్ని ఆధారాలు సేకరించి నివేదించగా పరిశీలించిన జిల్లా విద్యాశాఖ అధికారి ప్రవీణ్‌కుమార్ ఇవాళ *పీఈటీని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు* జారీ చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

స్కూటీ, బైక్‌పై వాగు పరిశీలన — ప్రజల సమస్యలపై చిత్తశుద్ధి తో ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ఎన్టీఆర్ జిల్లా నందిగామ మండలం కమ్మవారిపాలెం గ్రామంలో మంగలి వాగు పరిస్థితిని శనివారం ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని), ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ మరియు నందిగామ నియోజకవర్గ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పరిశీలించారు. వాహనాలు వెళ్లడానికి అనుకూలమైన మార్గం లేకపోవడంతో ఇద్దరూ స్కూటీ, బైక్‌లపై ప్రయాణించి వాగు పరిసరాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకొని, రహదారులు మరియు వంతెనలు నిర్మాణానికి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రజల సమస్యల పరిష్కారమే తమ ప్రధాన లక్ష్యమని ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య స్పష్టం చేశారు. వాగు ప్రాంత అభివృద్ధికి తక్షణ చర్యలు చేపడతామని అధికారులు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

పెద్దపాడు లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ – లబ్ధిదారులకు పింఛన్లు అందించిన రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకటరామారావు…!!!

కలిగిరి, నవంబర్ 1 :(పున్నమి న్యూస్):// ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ సూచనలతో, కలిగిరి మండలంలోని పెదకొండూరు పంచాయతీ పరిధిలోని పెద్దపాడు గ్రామంలోని మిక్ససింగ్ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు పాల్గొని, పింఛన్ లబ్ధిదారులకు పింఛన్ అందజేశారు.ఈ సందర్భంగా రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకటరామారావు,పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు, మరియు స్పోజ్ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు స్వహస్తాలతో పింఛన్లు అందజేశారు. ఆయన ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, “ప్రతినెలా మీకు పింఛన్ సమయానికి అందుతుందా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?” అని ఆరా తీశారు. లబ్ధిదారులు తమకు ప్రతి నెలా మొదటి తేదీన పింఛన్ సమయానికి అందుతున్నదని తెలిపారు. తెలుగు రైతు అధ్యక్షులు బొల్లినేని వెంకట రామారావు,మాట్లాడుతూ-ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం అనేక సంస్కరణలను అమలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది ఎన్టీఆర్ భరోసా పథకం. ఈ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు వంటి అనేక వర్గాలకు గౌరవప్రదమైన జీవనం అందించే విధంగా ప్రతినెలా మొదటి తేదీన పింఛన్ అందించే విధానం ప్రారంభమైంది. ఇది ప్రభుత్వ ప్రజా సంక్షేమ నిబద్ధతకు నిదర్శనం” అని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సమయానికి, పారదర్శకంగా పింఛన్ అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది అని తెలిపారు.ఈ కార్యక్రమంలో,మాజీ సర్పంచ్ మొక్కా హజరత్ రావు, మరియు గ్రామ సచివాలయ అగ్రికల్చర్ అసిస్టెంట్,పెంచలరావు,పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ప్రశంసా పత్రం అందుకున్న సీఐ

మొంథా తుఫాన్ సందర్భంగా ఉత్తమ సేవలందించిన రాజోలు పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ నరేశ్ కుమారు సీఎం చంద్రబాబు నాయుడు శనివారం ప్రశంసా పత్రం అందజేశారు. తుఫానులో అహర్నిశలు పాటుపడి ప్రజా రక్షణకు ఉత్తమ సేవలందించినందుకు గాను సీఐకి ప్రభుత్వం తగిన గుర్తింపునిచ్చింది. సీఐను నరేశ్ కుమార్ను రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ అభినందించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉల్లాస్ అక్షరాంధ్రలో భాగస్వామ్యం కావాలి: నోడల్ ఆఫీసర్

ఉల్లాస్ అక్షరాంధ్ర’ అక్షరాస్యత కార్యక్రమం అందరూ భాగస్వాములు కావాలని జిల్లా స్థాయి వయోజన విద్య నోడల్ ఆఫీసర్ జి. విజయ భాస్కరరావు కోరారు. శనివారం రాజోలు మండల సమైక్య కార్యాలయంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అక్షరాంధ్ర ఉల్లాస్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరక్షరాస్యు లందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆయన స్వచ్ఛంద ఉపాధ్యాయులకు వివరించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఉల్లాస్ అక్షరాంధ్రలో భాగస్వామ్యం కావాలి: నోడల్ ఆఫీసర్

ఉల్లాస్ అక్షరాంధ్ర’ అక్షరాస్యత కార్యక్రమం అందరూ భాగస్వాములు కావాలని జిల్లా స్థాయి వయోజన విద్య నోడల్ ఆఫీసర్ జి. విజయ భాస్కరరావు కోరారు. శనివారం రాజోలు మండల సమైక్య కార్యాలయంలో ఎంపీడీవో వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో అక్షరాంధ్ర ఉల్లాస్ శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. నిరక్షరాస్యు లందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేయాలని ఆయన స్వచ్ఛంద ఉపాధ్యాయులకు వివరించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

బాధితులను ప్రభుత్వం ఆదుకుంటుంది: అమూల్య

మొంథా తుఫాన్ బాధితులను కూటమి ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకుంటుందని రాజోలు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జి గొల్లపల్లి అమూల్య అన్నారు. శనివారం సాయంత్రం తాటిపాకలో తుఫాన్ బాధితులకు ఆమె నిత్యావసర వస్తువులతోపాటు ప్రభుత్వం సమకూర్చిన రూ.3వేల నగదును పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కోటిపల్లి రత్నమాలతో పాటు కూటమి నాయకులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జిల్లావ్యాప్తంగా రూ.102 కోట్ల పెన్షన్లు పంపిణీ: కలెక్టర్

అంబేడ్కర్ కోనసీమ జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెలకు సంబంధించి ఎన్టీఆర్ భరోసా పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన రూ. 102 కోట్ల పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందించడం జరుగుతుందని కలెక్టర్ మహేశ్ కుమార్ తెలిపారు. అమలాపురం మండలం ఈదరపల్లిలో ఆయన శనివారం లబ్ధిదారులకు పెన్షన్లను అందజేశారు. ఏ విధమైన అవకతవకలకు తావు లేకుండా పారదర్శకంగా ప్రభుత్వం పెన్షన్ల పథకాన్ని అమలు చేస్తుందన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.