Monday, 6 April 2026

Blog

రంగారెడ్డి

*పేదల సొంతింటి కలను నెరవేర్చుతాం: కిచ్చెన్న* —ఎన్టీఆర్ నగర్ వాసులకు హామీ ఇచ్చిన లక్ష్మారెడ్డి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 01 : మహేశ్వరం నియోజకవర్గంలో ఇళ్లు లేని నిరుపేదలందరికీ పక్కా ఇళ్లు ఇస్తామని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు.కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇందిరమ్మ ఇళ్లు కట్టించి ఇస్తున్నామని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రతీ పేదవాడికి ఇళ్లు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్, బస్సు ప్రయాణం కల్పిస్తూ… అండగా నిలుస్తున్నామని కేఎల్ఆర్ తెలిపారు. ప్రజాపాలనలో అందరికీ ఇడ్లు, రేషన్ కార్డులు, విద్య, ఆరోగ్యం ఉచితంగా అందించాలనే సంకల్పంతో తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందన్నారు కిచ్చెన్న.త్వరలోనే ఎన్టీఆర్ నగర్ వాసులకు డబుల్ బెడ్ రూమ్స్ మంజూరు చేసి మంత్రి శ్రీధర్ బాబు తో కలిసి గృహప్రవేశం చేయిస్తానని లక్ష్మారెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మహేశ్వరం నియోజకవర్గం కాంగ్రెస్ శ్రేణులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

రంగారెడ్డి

*మహిళా శక్తే బీఆర్ఎస్ బలం : ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి* —మహిళలు సామాజిక–రాజకీయ రంగాల్లో వారి పాత్రపై చర్చ *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 01 : జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మహిళా సదస్సులో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి పాల్గొన్నారు సభలో మహిళల భాగస్వామ్యం, సామాజిక–రాజకీయ రంగాల్లో వారి పాత్రపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వంచించి మహిళల్ని మోసం చేసిందని మహిళలకు ఇచ్చిన ఏ ఒక్క హామీ అయినా నెరవేర్చారా ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలి అంటే రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి, బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా ప్రజలను కోరారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఎమ్మెల్సీ నాగారకుంట నవీన్ రెడ్డి తాండూర్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పలువురు మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

రంగారెడ్డి

*హైదరాబాద్ అభివృద్ధికి మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అవసరం : సబితా ఇంద్రారెడ్డి* –నాగార్జున నగర్ కాలనీ అసోసియేషన్ సభ్యులతో మాటముచ్చట *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 01 : జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజిగూడ డివిజన్‌లోని నాగార్జున నగర్ కాలనీలో అసోసియేషన్ సభ్యులతో మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి సమావేశమయ్యారు.ఈ సందర్భంగా సభ్యులు గత రెండు సంవత్సరాలుగా ఎదుర్కొంటున్న సమస్యలను ఎమ్మెల్యేకి వివరించారు.సభలో సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ గత సీఎం కె.చంద్రశేఖరరావు పాలనలో హైదరాబాద్ నగరాన్ని సుందరంగా తీర్చిదిద్దారని, మౌలిక సదుపాయాలను మెరుగుపరిచి, రహదారులు, డ్రైనేజీ వ్యవస్థలను పునరుద్ధరించి, నగర ప్రజలకు 24 గంటల విద్యుత్ సరఫరా మరియు శుభ్రమైన తాగునీటిని అందించారని తెలిపారు.హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి చెందాలంటే మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే అవసరమని పేర్కొన్నారు.అందుకే రాబోయే జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత గోపీనాథ్ ని భారీ మెజార్టీతో గెలిపించాలి అని ఆమె ప్రజలను కోరారు.

రంగారెడ్డి

*మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుని పరామర్శించిన..తీగల కృష్ణారెడ్డి *

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 01 : తండ్రిని కోల్పోయిన బాధలో ఉన్న తన్నీరు హరీష్ రావు ని శనివారం వారి నివాసానికి వెళ్లి పరామర్శించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన మహేశ్వరం మాజీ శాసనసభ్యులు తీగలకృష్ణా రెడ్డి వారి వెంట మాజీ సర్పంచ్ పల్లె పాండు గౌడ్ సీనియర్ నాయకులు నాగేందర్ గౌడ్, బుచ్చి రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు

శ్రీకాకుళం 

కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి నారా లోకేష్‌, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు*

*కాశీబుగ్గలో జరిగిన దుర్ఘటన బాధిత కుటుంబాలను పరామర్శించిన మంత్రి నారా లోకేష్‌, రాష్ట్ర తెలుగుదేశం అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు* *శ్రీకాకుళం, నవంబర్( విశాఖ పున్నమి ప్రతినిధి):* కాశీబుగ్గ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరిగిన తొక్కిసలాట ఘటన మనసును కలిచివేసిందని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు తెలిపారు. ఈ ఘటనలో భక్తులు ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో విశాఖపట్నం విమానాశ్రయానికి విచ్చేసిన యువనేత, ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారిని పల్లా శ్రీనివాసరావు గారు కలసి, ఆయనతో పాటు కేంద్ర మంత్రి శ్రీ కింజరాపు రామ్మోహన్ నాయుడు గారు, హోం మంత్రి శ్రీమతి అనిత గారు కలిసి కాశీబుగ్గకు పయనమయ్యారు. అనంతరం అక్కడికి చేరుకుని మృతి చెందిన భక్తుల కుటుంబాలను పరామర్శించి, క్షతగాత్రుల పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ.. దేవాలయం పూర్తిగా ప్రైవేట్ ట్రస్ట్ ఆధీనంలో నడుస్తోంది. ఇది దేవాదాయశాఖ పరిధిలో లేదు. వేలాదిగా భక్తులు తరలి వస్తున్నా ప్రభుత్వానికి ముందస్తు సమాచారం ఇవ్వకపోవడం తీవ్ర నిర్లక్ష్యం. రెండు వేల మంది కూడా సరిపోని ప్రాంగణంలో ఇరవై వేల మందిని అనుమతించడం నిర్వాహకుల వైఫల్యమే అని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ ఫేక్ ప్రచారాలను ఉద్దేశించి పల్లా శ్రీనివాసరావు గారు ఘాటుగా స్పందిస్తూ.. ఫేక్ పార్టీ వైసీపీకి ఇప్పుడు ఏమీ దొరకడం లేదు… వారి జీవితమే ఫేక్. గతంలో వివేకాను హత్య చేసి ‘గుండెపోటు’ అన్నారు. తర్వాత సునీత ఫిర్యాదుతో ‘గొడ్డలిపోటు’ అని ఒప్పుకున్నారు. ఆధారాలు చెరిపేసినవాళ్లకు రాజకీయాలు చేసే అర్హత ఉందా? నేరస్తులు రాజకీయ పార్టీ పెట్టి ఫేక్ ప్రచారం చేయడం ప్రజలను మోసం చేయడమే అని విమర్శించారు. కర్నూలు బస్సు ప్రమాదంలోనూ, ఇప్పుడు కాశీబుగ్గ ఘటనలోనూ ఫేక్ ప్రచారమే వారి ఆయుధం అయింది. కానీ ప్రజలు ఇప్పుడు ఆ తప్పుడు ప్రచారాలను నమ్మడం లేదు అని పల్లా గారు వ్యాఖ్యానించారు. పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ..కాశీబుగ్గ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు ప్రభుత్వం తక్షణ సహాయం అందిస్తోంది. క్షతగాత్రులకు వైద్యసహాయం కల్పించేందుకు యంత్రాంగం వెంటనే స్పందించడం అభినందనీయమైన విషయం. ప్రైవేట్ దేవాలయం కావడంతో రద్దీ నియంత్రణలో లోపం జరిగింది. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వం ఇప్పటికే సూచించింది. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలుస్తుంది అని పల్లా గారు తెలిపారు.

ఎన్ టి ఆర్ జిల్లా

ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌పై అక్రమ కేసు కొట్టివేత

** వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చేసిన అరాచక పాలనకు వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శాసనసభ్యులు గద్దె రామమోహన్ చేపట్టిన ఆందోళనలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం నమోదు చేయించిన 27వ అక్రమ కేసును శుక్రవారం నాడు విజయవాడలోని ఎంపీ ఎమ్మెల్యేల కేసులు విచారించే ప్రత్యే కోర్టు కొట్టివేసింది. ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌పై స్పెషల్‌ కోర్టు ఫర్‌ ది ట్రయల్‌ ఆఫ్‌ క్రిమినల్‌ కేసస్‌ ప్రివేంటివ్‌ టూ ఎమ్మెల్యేలు, ఎంపీలు ఆఫ్‌ ది ఆంధ్రప్రదేశ్‌ కోర్టులో నమోదైన కేసుకు సంబంధించి శుక్రవారం కోర్టుకు హాజరయ్యారు. గతంలోనే వాదనలు విన్న న్యాయమూర్తులు శుక్రవారం తుది తీర్పును ఇస్తూ ఆ కేసును కొట్టి వేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అవలంబించిన అరాచక పాలన, ప్రజా వ్యతిరేక విధానాలను నిరశిస్తూ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ ఆందోళనలను అణిచి వేయడానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అక్రమంగా కేసులు నమోదు చేసిందన్నారు. వారి కేసులకు ఏమాత్రం బెదరకుండా ప్రజలతో కలిసి ఆందోళనలు నిర్వహించినట్లు చెప్పారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ పార్టీకి ప్రజలు తమ ఓటు అనే ఆయుధంతో 11 అసెంబ్లీ సీట్లకే పరిమితం చేశారన్నారు. ఈ ఎన్నికల్లో కూటమి పార్టీ నాయకులను ప్రజలు భారీ మెజార్టీలతో గెలిపించారని గుర్తుచేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పెట్టించిన అక్రమ కేసులను కోర్టు కొట్టివేయడం పట్ల గద్దె రామమోహన్ ఆనందం వ్యక్తం చేశారు.

హైదరాబాద్

ఈ నెల 3 నుంచి హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు

పున్నమి: నవంబర్ 01 హైదరాబాద్: ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అన్ని టెర్మినల్స్‌లో మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయని ఎల్‌&టీ మెట్రో రైలు యాజమాన్యం తెలిపారు.

అన్నమయ్య

ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో పాల్గొన్న ఎద్దల విజయ సాగర్

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్మత్కంగా ప్రవేశపెట్టిన ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో ముఖ్యమంత్రివర్యులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు నందులూరు గ్రామపంచాయతీ పెటగడ్డ పరిసరాలలో తెలుగుదేశం పార్టీ నాయకులతో మరియు సచివాలయం సిబ్బందితో కలిసి ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమంలో రాజంపేట అగ్రికల్చర్ మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ ఎద్దల విజయ సాగర్ పాల్గొని వారి చేతుల మీదగా పెన్షన్ లబ్ధిదారులకు అందించడం జరిగినది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదల సేవలో పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని కూటమి ప్రభుత్వం పేదలకు అన్ని విధాలుగా సహకరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నందలూరు సర్పంచ్ రాము,ఉప్పుశెట్టి సుధీర్ కుమార్ ,గంధం గంగాధర్,గుండు సురేష్,ఉప్పు శెట్టి రెడ్డయ్య, మహబూబ్ బాషా, గ్రామ పంచాయతీ సెక్రెటరీ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

ఓటు ప్రాముఖ్యత గురించి ప్రజలలో అవగాహన కార్యక్రమం

రాయచోటి ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాల ఎన్ఎస్ఎస్ యూనిట్ 1 ఎం,పీ యు,పి ఉర్దూ స్కూల్ నందు ఓటు ప్రాముఖ్యత గురించి ప్రత్యేక శిబిరం నిర్వహించడమైనది.ఇందులో భాగంగా 5వ రోజు ఓటు ప్రాముఖ్యత గురించి ఎన్ఎస్ఎస్ బృందం ప్రజలలో అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ పి,జ్యోతి మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటు ఒక పౌరుని అత్యంత శక్తివంతమైన ఆయుధమని పేర్కొన్నారు. ఓటు హక్కు ప్రాముఖ్యత పై అవగాహన కల్పించేందుకు ఎన్ఎస్ఎస్ ప్రత్యేక కార్యక్రమం నిర్వహించిందని అన్నారు.ఓటు వేయడం ప్రతి పౌరుని బాధ్యత అని, మనం ఓటు ద్వారా మంచి నాయకత్వాన్ని ఎంచుకోవచ్చని ప్రజలకు తెలిపారు. ఒక ఓటు కూడా దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తి కలిగినదని ప్రజలకు వివరించారు.సమాజంలో మంచి మార్పు కోరుకునే ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని వారు ప్రజలకు తెలిపారు.ఓటు మీ హక్కు మాత్రమే కాదు అది మీ భవిష్యత్తు కూడా అనే నినాదంతో ఎన్ఎస్ఎస్ కార్యక్రమం ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ జి. వెంకటరమణ, అధ్యాపకులు మరియు విద్యార్థినులు పాల్గొన్నారు,

అమరావతి

గల్లంతైన బీసీ హాస్టల్ విద్యార్థి ఆచూకీ కనుక్కోండి*

*గల్లంతైన బీసీ హాస్టల్ విద్యార్థి ఆచూకీ కనుక్కోండి* *రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత ఆదేశం* *అమరావతి* ( విశాఖ పున్నమి ప్రతినిధి) : అనకాపల్లి జిల్లా పరవాడ మండలంలోని ముత్యాలమ్మపాలెం బీచ్ లో బీసీ హాస్టల్ విద్యార్థి గల్లంతు కావడంపై రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. విద్యార్థి ఆచూకీ కోసం విస్తృతంగా గాలించాలని జిల్లా కలెక్టర్ ను, డీబీసీడబ్ల్యూను ఆదేశించారు. ఈ మేరకు శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో మంత్రి సవిత తెలిపారు. పరవాడ మండలం తానం బీసీ హాస్టల్ లో ఉంటూ రావికమతంలోని తోటవానిపాలెం గ్రామానికి చెందిన సూర్రెడ్డి భానుప్రసాద్ పదో తరగతి చదువుతున్నాడు. తుఫాన్ సెలవుల అనంతరం శుక్రవారం సాయంత్ర హాస్టల్ కు వచ్చాడు. శనివారం హాస్టల్ లో ఎఫ్ఆర్ఎస్ వేసి, అదే హాస్టల్ లో ఉంటున్న తోటి స్నేహితులు పదో తరగతి విద్యార్థి ఎం.చందు, తొమ్మిదో తరగతి విద్యార్థి ఎస్.రామచంద్రతో కలిసి తాము చదువుతున్న తానం ఉన్నత పాఠశాలకు శనివారం ఉదయం వెళ్లారు. వారు స్కూల్ కు వెళ్లకుండా పూర్వ బీసీ హాస్టల్ విద్యార్థి ఎన్.సిద్ధుతో కలిసి పరవాడ మండలంలోని ముత్యాలమ్మ పాలెం బీచ్ కు వెళ్లారు. వారు స్నానానికి సిద్ధమవుతుండగా, సముద్రం ఉధృతంగా ఉందని అక్కడే ఉన్న జాలర్లు హెచ్చరించారు. ఆ మాటలు పట్టించుకోకుండా ఆ నలుగురూ సముద్రంలోకి స్నానానికి దిగగానే, అలల ఉధృతికి లోపలికి కొట్టుకుపోయారు. అదే సమయంలో అప్రమత్తమైన జాలర్లు చందు, రామచంద్ర, సిద్ధూను కాపాడారు. అప్పటికే భానుప్రసాద్ అలల ఉధృతికి గల్లంతయ్యాడని జిల్లా బీసీ సంక్షేమ శాఖాధికారి శ్రీదేవి తెలిపారు. నాలుగు కోస్ట్ గార్డ్ బృందాలతో పాటు గజ ఈతగాళ్లు గల్లంతైన విద్యార్థి తీవ్రంగా గాలిస్తున్నారన్నారి మంత్రి సవితకు తెలిపారు. *మంత్రి సవిత దిగ్భ్రాంతి…* బీసీ హాస్టల్ విద్యార్థి సముద్రంలో గల్లంతయ్యాడన్న విషయం తెలుసుకున్న మంత్రి సవిత.. జిల్లా కలెక్టర్ విజయతో ఫోన్లో మాట్లాడారు. తక్షణమే విద్యార్థి ఆచూకీ కనిపెట్టాలని, కోస్టుగార్డులు, గజ ఈతగాళ్ల సాయం తీసుకోవాలని కలెక్టర్ ను, తక్షణమే విద్యార్థి తల్లిదండ్రులకు సమాచారమందించాలని డీబీసీడబ్ల్యూవో శ్రీదేవిని, బీసీ సంక్షేమ శాఖ అడిషనల్ డైరెక్టర్ చంద్రశేఖర్ రాజును మంత్రి ఆదేశించారు. విద్యార్థి గల్లంతు కావడంపై ఆ ప్రకటనలో మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.