Monday, 6 April 2026

Blog

తెలంగాణ

యువతకు ఉపాధి అవకాశాలు కల్పించెందుకు చర్యలు తీసుకోవాలన్న: జిల్లా కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) సెట్విన్ ఆధ్వర్యంలో చదువుకున్న యువత, విద్యార్థులకు వివిధ కోర్సులలో శిక్షణ ఇవ్వడం ద్వారా ఉపాధి అవకాశాలు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. శనివారం ఆమె ఈ విషయంపై సెట్విన్ ప్రతినిధులు, జిల్లా అధికారులతో తన ఛాంబర్ లో సమావేశం నిర్వహించారు. సెట్విన్ ప్రతినిధి రేణుక మాట్లాడుతూ సెట్విన్ ద్వారా సుమారు 30 కోర్సులలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, తమ శిక్షణ కాలం కేవలం 3 నుండి 6 నెలలు మాత్రమే ఉంటుందని, శిక్షణ పూర్తి చేసుకున్న వారికి డిప్లమా సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుందని ఆమె తెలిపారు.

విశాఖపట్నం

మొంథా తుఫాను బాధిత మత్స్యకారులకు భరోసా కిట్లు పంపిణీ 1200 కుటుంబాలకు సహాయం చేసిన రాష్ట్ర టిడిపి అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు

గాజువాక: నవంబర్ (పున్నమి ప్రతినిధి) మొంథా తుఫాను వల్ల తీవ్ర నష్టపోయిన సుమారు 1200 మత్స్యకార కుటుంబాలకు భరోసా కిట్లు అందజేశారు రాష్ట్ర తెలుగు దేశం పార్టీ అధ్యక్షులు, గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — “జాతీయ విపత్తుల సమయంలో ప్రజలను కాపాడటంలో ఎప్పుడూ ముందుండే నాయకత్వం చూపిన వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారే. ప్రజల అభ్యున్నతే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యం” అని తెలిపారు. గాజువాక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద మత్స్యకార భరోసా కిట్ల పంపిణీ, తుఫాను బాధితులకు రేషన్ సరఫరా కార్యక్రమాన్ని పల్లా శ్రీనివాసరావు లాంఛనంగా ప్రారంభించారు. దిబ్బపాలెం మరియు గంగవరం ప్రాంతాల నుండి తుఫానుతో నష్టపోయిన కుటుంబాలకు పరిహారం అందజేయడం జరిగింది. కార్యక్రమంలో గాజువాక మండల రెవెన్యూ అధికారి శ్రీనివాసరావు, పౌర సరఫరాల అధికారి రవి, ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాదుల శ్రీనివాస్, జిల్లా లీగల్ సెల్ నాయకులు వెన్నెల ఈశ్వరరావు, నియోజకవర్గ నాయకులు అక్కిన లక్ష్మణరావు, బైపిల్లి గాంధీ, గోమాడ వాసు, బలగా బాలు నాయుడు, పోతిన వెంకటేశ్వరరావు, వియ్యపు నరేష్, ఆఫీజ్, దాట్ల శ్రీనివాసరాజు, దువ్వి శ్రీను, లక్కోజు దేవి, యజ్ఞప్రియ, వనజ, కత్తి తిలక్, రోయ విశ్వనాథం, శ్రీనివాస్ రెడ్డి తదితర కూటమి నాయకులు పాల్గొన్నారు.

తిరుపతి

పండుగ వాతావరణంలో జరిగిన బాలోత్సవం*

తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులను విద్య పట్ల ఒత్తిడికి గురి చేయవద్దు అదనపు పాఠ్య కార్యక్రమాలలో పాల్గొనడం కూడా చాలా ముఖ్యం : జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్* తిరుపతి, పున్నమి ప్రతినిధి (రోసిరెడ్డి) నవంబర్ 1 :విద్యార్థులకు చదువుతోపాటు అదనపు పాఠ్య కార్యకలాపాలలో పాల్గొనడం కూడా చాలా ముఖ్యం అని జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్ తెలిపారు. ఉదయం స్థానిక SGS ఆర్ట్స్ కళాశాల మైదానంలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన నాలుగవ బాలోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ డా ఎస్ వెంకటేశ్వర్..జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి బాలోత్సవo కార్యక్రమం పండగ వాతావరణంలో ఉందని ఇలాంటి కార్యక్రమానికి హాజరు కావడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. విద్యార్థులకు విద్యతో పాటు అదనపు పాఠ్య కార్యకలాపాలలో పాల్గొనడం కూడా చాలా అవసరమని, వీటి వలన పిల్లలలో సృజనాత్మక శక్తి మెరుగుపడుతుందని తెలిపారు. ఎక్కువ శాతం మంది పిల్లలను క్లాస్ రూమ్ గదులుకే పరిమితం చేయడం జరుగుతుందనీ అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో ఒకటవ తరగతి నుంచే విద్యార్థులు డాక్టరు, ఇంజనీర్ కావాలని లక్ష్యంతో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఒత్తిడికి గురి చేస్తున్నారని తెలిపారు. ఉద్యోగ అవకాశాలు, ఇతర అవసరాలు దృష్ట్యా ఇంగ్లిష్ భాష పైన ఎక్కువ దృష్టి పెట్టడం, కళాశాలల్లో , పాఠశాలల్లో ఇంగ్లిష్ భాష లో మాట్లాడాలని నిబందన పెట్టడం వలన విద్యార్థులు తెలుగు బాష పై పట్టు కోల్పోతున్నారని తెలిపారు. ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహించడం వలన పిల్లలలో నమ్మకం, ప్రేరణ కలిగి ఆదర్శ విద్యార్థులుగా ఎదుగుతారని తెలిపారు. విద్యార్థులు ఈ మద్య కాలంలో చెడు వ్యసనాలకు గురవుతున్నారని ఇలాంటి కార్యక్రమాలను జరపడం వలన చెడు వ్యసనాల వైపు దృష్టి వెళ్ళకుండా చేయగలగవచ్చన్నారు. ఇలాంటి కార్యక్రమాలను జిల్లాల్లో మరిన్ని జరపాలని ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా జిల్లా యంత్రాంగం అందిస్తుందని ఇక్కడి వచ్చిన విద్యార్థులందరికీ శుభాకాంక్షలు అని తెలిపారు. జిల్లా విద్యాశాఖాదికారి మాట్లాడుతూ… బాలోత్సవo కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతుందని ఈ కార్యక్రమానికి తిరుపతి నుంచే కాకుండా చుట్టుప్రక్కల కాకుండా ప్రాంతాల పాఠశాలల విద్యార్థులు కూడా హాజరవడం జరుగుతుందని తెలిపారు. . ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి విక్రమ్ కుమార్ రెడ్డి, జిల్లా విద్యా శాఖ అధికారి కే.వి.ఎన్ కుమార్, బాలోత్సవo కమిటీ చైర్మన్ టెంకాయల దామోదరం, కస్తూరిబా గాంధీ ట్రస్టు చైర్మన్ పి.సి. రాయలు, రోటరీ క్లబ్ అద్యక్షలు రాజేంద్ర శెట్టి, రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ చైర్మన్ రమేష్ నాథ్ లింగుంట్ల, క్రియా పిల్లల పండుగ సెక్రెటరీ కాకినాడ జగన్నాథ రావు, ఎస్.జి.ఎస్. కాలేజ్ ప్రిన్సిపల్ సత్యనారాయణ, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

బొమ్మరాజుచెరువులో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ – లబ్ధిదారులకు పింఛన్లు స్వయంగా అందించిన ఎమ్మెల్యే కాకర్ల సురేష్..!

కలిగిరి నవంబర్ 1న కలిగిరి మండలంలోని నాగసముద్రం పంచాయతీ పరిధిలోని బొమ్మరాజుచెరువు గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొని పింఛన్ లబ్ధిదారులకు స్వయంగా పింఛన్ అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సురేష్ గారు పింఛన్ లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి, వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు, మరియు స్పోజ్ పెన్షన్ పొందుతున్న లబ్ధిదారులకు స్వహస్తాలతో పింఛన్లు అందజేశారు. ఆయన ప్రజలతో స్నేహపూర్వకంగా మాట్లాడి, “ప్రతినెలా మీకు పింఛన్ సమయానికి అందుతుందా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు?” అని ఆరా తీశారు. లబ్ధిదారులు తమకు ప్రతి నెలా మొదటి తేదీన పింఛన్ సమయానికి అందుతున్నదని తెలిపారు. ఎమ్మెల్యే కాకర్ల సురేష్ గారు మాట్లాడుతూ — “గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ప్రజల సంక్షేమం కోసం అనేక సంస్కరణలను అమలు చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైనది ఎన్టీఆర్ భరోసా పథకం. ఈ పథకం ద్వారా వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, కళాకారులు వంటి అనేక వర్గాలకు గౌరవప్రదమైన జీవనం అందించే విధంగా ప్రతినెలా మొదటి తేదీన పింఛన్ అందించే విధానం ప్రారంభమైంది. ఇది ప్రభుత్వ ప్రజా సంక్షేమ నిబద్ధతకు నిదర్శనం” అని తెలిపారు. ప్రతి ఒక్కరికీ సమయానికి, పారదర్శకంగా పింఛన్ అందేలా ప్రభుత్వం కృషి చేస్తోంది అని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల టిడిపి నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, గ్రామ సచివాలయ సిబ్బంది మరియు గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

తెలంగాణ

ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన: కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యం తడవకుండా టార్పాలిన్లతో కప్పి ఉంచాలని, మళ్లీ వర్షం వచ్చే అవకాశం ఉన్నందున ఇబ్బంది అవుతుందని జిల్లా కలెక్టర్ ఇలాత్రిపాఠీ అన్నారు. శనివారం ఆమె నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల, కొత్తపేట గ్రామాల్లో ఏర్పాటు చేసిన దాన్యం కొనుగోలు కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొత్తపేటలో ప్రస్తుతం ఉన్న కొనుగోలు కేంద్రం ఎత్తున ఉన్నందున ఎక్కడైనా ప్రభుత్వ స్థలం ఉంటే చూడాలని చెప్పారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

విజ్ఞుల సంఘ దర్శనం

రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) అన్ని అసమానతలకు, క్షమించరాని విమర్శలకు మరియు అనవసరమైన నిషేధాలకు వ్యతిరేకంగా నిలకడగా, మనుగడ సాగించింది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా భారత దేశ సేవలో గత 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ పాత్ర మరువలేనిది. ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ( 1925- 2025) , ఆర్ఎస్ఎస్ ఆవిర్భావం, మనుగడ, మరియు దేశ నిర్మాణంలో ఆర్ఎస్ఎస్ పాత్ర పై మరియు భవిష్యత్తులో ఆర్ఎస్ఎస్ ఆవశ్యకత పై మన దేశంలోని గొప్ప వ్యక్తులు దాని గురించి ఏమనుకుంటున్నారో ప్రపంచం తెలుసుకోవలసిన సమయం ఇది. 1) ఆర్ఎస్ఎస్ శిబిరంలో నేను చూసిన క్రమశిక్షణ, అంటరానితనం పూర్తిగా లేకపోవడం, కఠినమైన సరళత నన్ను ఆకట్టుకున్నాయి. దేశంలో ఇలాంటి దృశ్యాన్ని నేను ఇంతకు ముందు ఎక్కడా చూడలేదు. —-మహాత్మా గాంధీ (డిసెంబర్ 25,1934, వార్ధాలోని ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా ) 2) సంఘ్ స్వయం సేవకుల శిబిరాన్ని నేను సందర్శించడం ఇదే మొదటిసారి. ఎటువంటి వ్యత్యాసం గురించి ఎవరికీ తెలియకుండానే సవర్ణియాలు (ఉన్నత కులం), హరిజనులు (దిగువ కులం) మధ్య సంపూర్ణ సమానత్వాన్ని కనుగొన్నందుకు నేను సంతోషిస్తున్నాను. —- డా. B.R. అంబేద్కర్ (1939, పూణే, ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని సందర్శించి న సందర్భంగా) 3) ఆర్ఎస్ఎస్ అనేది ఏ రాజకీయ పార్టీకి విధేయత లేని, సేవకు అంకితమైన సంస్థ. వారు నిజమైన సేవను అందిస్తారు. — కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర స్వామి (1959 ఫిబ్రవరి 23న చెన్నైలోని మైలాపూర్లో ఆర్ఎస్ఎస్ ర్యాలీలో ప్రసంగించి న సందర్భంగా) 4) ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులు బాగా శిక్షణ పొందినవారు, క్రమశిక్షణ కలిగినవారు, వ్యవస్థీకృతమైనవారు. దేశ నిర్మాణంలో స్వయంసేవకులు ప్రముఖ పాత్ర వహిస్తున్నారు. —స్వామి చిన్మయానంద, చిన్మయ మిషన్ (1964, ఎర్నాకుళం, ఆర్ఎస్ఎస్ క్యాంపును సందర్శించిన సందర్భంగా) 5) ఆర్ఎస్ఎస్ ఒక స్వచ్ఛంద సంస్థ, దేశంలో మరే ఇతర సంస్థ దాని దగ్గరకు రాదు. సమాజాన్ని మార్చగల , కులతత్వాన్ని అంతం చేయగల , మరియు పేదల కళ్ళ నుండి కన్నీళ్లను తుడిచివేసే సామర్థ్యం దీనికి మాత్రమే ఉంది. —-జయ ప్రకాష్ నారాయణ (1966, బీహార్ కరువు సమయంలో) 6) కొంతమంది వ్యక్తులు మరియు సంస్థలు పై అభూత కల్పనలు మరియు అవాస్తవాలతో ద్వేషాన్ని పెంచుకుంటారు, ఇలా ద్వేషించబడిన వారిలో ఆర్ఎస్ఎస్ మరియు ఎంఎస్ గోల్వాల్కర్ (గురుజీ) ఉన్నారు. —-కుష్వంత్ సింగ్ ( 1970లో ఢిల్లీ లో గోల్వాల్కర్ @గురుజీ గారిని కలిసిన సందర్భంగా) 7) కొంతమంది వ్యక్తులు మరియు సంస్థలతో మనము కలిసి పని చేసినప్పుడే వారి యొక్క నైతికత ,నిబద్ధత తెలుస్తుంది. ఆర్ఎస్ఎస్ మరియు దాని స్వయం సేవకులు ఈ కోవకే చెందుతారు. —- ఆరిఫ్ మహ్మద్ ఖాన్, (1975 ఎమర్జెన్సీ సమయంలో అలీఘర్ జైలో ఆర్ఎస్ఎస్ స్వయంసేవకులను కలిసినప్పుడు) 8) భారతదేశం మొత్తానికి జాతీయ మరియు సాంస్కృతిక ఐక్యత కు చిహ్నం ఆర్ఎస్ఎస్. — మొరార్జీ దేశాయ్, (ఎమర్జెన్సీ రద్దు సందర్భంగా, 1977) 9) మన దేశంలో క్రమపద్ధతిలో దేశభక్తిని పెంపొందించే ఏకైక సంస్థ ఆర్ఎస్ఎస్ అని నేను చెప్పగలను. ——చో రామస్వామి (2009, చెన్నైలో ఆర్ఎస్ఎస్ ర్యాలీ లో ప్రసంగించిన సందర్భంగా) 10) ఆర్ఎస్ఎస్ లో ఉన్నవారు కేవలం దేశభక్తిని బోధించరు; వారు దానిని ఆచరిస్తారు. వారి పూర్తి నిస్వార్థతను చూసి నేను ఆశ్చర్యపోయాను. —- ఎపిజె అబ్దుల్ కలాం (2014 జూలై 31న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి న సందర్భంగా) 11) ఈ సందర్భంగా మాట్లాడటానికి ఆహ్వానించబడటం ఒక గొప్ప అదృష్టం. మెరుగైన భారతదేశం గురించి కలలు కనే వ్యక్తుల మధ్య ఇక్కడ ఉండటం ఆనందంగా ఉంది. నిజంగా ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు వారి జీవితాలను దేశ అభివృద్ధి కోసంఅంకితం చేస్తున్నారు. — అజీమ్ ప్రేమ్ జీ, (2015 ఏప్రిల్ 15 న న్యూఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని సందర్శించి న సందర్భంగా) 12) మన దేశంలో విపత్తులు సంభవించినప్పుడల్లా, అది కరువు, కాటకాలు, తుఫానులు భూకంపం ,సునామి ఇతర ప్రమాదాలు ఏమైనా కావచ్చు-సహాయక కార్యకలాపాలను ప్రారంభించడానికి ఈ ప్రదేశాలకు మొదట గా చేరే వారిలో ఆర్ఎస్ఎస్ స్వయం సేవకులు ముందు వరుసలో ఉంటారు. —-డా. కె. రాధాకృష్ణన్, ఇస్రో మాజీ చైర్మన్ (2016 జనవరి 10న బెంగళూరులో ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని సందర్శించి న సందర్భంగా) 13) వారి భావజాలానికి వారు కట్టుబడి ఉంటారు, వారి చిత్తశుద్ధిలో సాటిలేనివారు మరియు వారి విధానంలో వారు నిజాయితీగా ఉంటారు. వారు వైవిధ్యంలో ఐక్యతను పాటించడం ద్వారా సమాజంలోని భిన్న వర్గాల మధ్య ఐక్యతను సాధించటానికి ప్రయత్నిస్తారు. — ఫిరోజ్ బఖ్త్ , మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మేనల్లుడు (నవంబర్ 3,2016 న న్యూఢిల్లీలోని ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని సందర్శించి న సందర్భంగా) 14) ఈ శతాబ్దంలో భారతదేశ జాతీయ ఆలోచన మరియు సామూహిక అభ్యాసం రెండింటినీ రూపొందించే అత్యంత ప్రభావవంతమైన సంస్థ బహుశా ఆర్ఎస్ఎస్ ఒక్కటే. —-డేవిడ్ ఫ్రాలీ, డైరెక్టర్, అమెరికన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వేదిక్ స్టడీస్, 2016 15) తప్పుడు అవగాహన కారణంగా ఆర్ఎస్ఎస్ కార్యకలాపాలపై కొన్ని అపోహలు ఉండవచ్చు. నా స్వంత అనుభవంలో, ఆర్ఎస్ఎస్ యొక్క గొప్ప మరియు ప్రముఖ వ్యక్తుల అంకిత భావ సేవను నేను స్వయంగా చూశాను. దీనికి కారణం భగవత్ ధ్వజం ముందు ఉన్న సమర్పణ భావం. —-మాతా అమృతానందమయి, (2017 మార్చి 21న కోయంబత్తూరులోని ఆర్ఎస్ఎస్ శిబిరాన్ని సందర్శించ న సందర్భంగా) 16) ఈ రోజు నేను భారత మాత యొక్క గొప్ప కుమారుడైన ఆర్ఎస్ఎస్ వ్యవస్థాపకులు డాక్టర్ కేశవ బలిరాం హెడ్గేవార్ గారికి నా గౌరవం మరియు నివాళులు అర్పించడానికి ఇక్కడకు వచ్చాను. దేశంలో అణగారిన వర్గాలకు ఆర్ఎస్ఎస్ అందిస్తున్న సేవలు ఎంతో ప్రశంసనీయం. — శ్రీ ప్రణబ్ ముఖర్జీ (2018 జూన్ 7 న ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించి న సందర్భంగా) 17) దేశంలోని దాదాపు అన్ని గ్రామాలలో ఉన్న ఆర్ఎస్ఎస్ శాఖలు పిల్లలను ముఖ్యంగా బాలికలను రక్షించడానికి ఉపయోగపడతాయి. సమాజానికి ఈ విస్తారమైన, క్రమశిక్షణతో కూడిన, కేడర్ ఆధారిత సంస్థ చేస్తున్న సహకారం చాలా గొప్పది. దీనిని తిరస్కరించలేము లేదా విస్మరించలేము. — నోబెల్ గ్రహీత కైలాష్ సత్యార్థి (18 అక్టోబర్, 2018, నాగపూర్ ఆర్ఎస్ఎస్ సభను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా) 18) నేను క్రైస్తవునిగా జన్మించాను, మరియు నేను ఆ మతాన్ని ఆచరిస్తున్నాను, క్రమం తప్పకుండా చర్చికి వెళుతుంటాను. నా ప్రయోజనం ఏమిటంటే, నేను ఆర్ఎస్ఎస్ గురించి కూడా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఈ సంస్థ ఈ దేశానికి క్రమశిక్షణతో కూడిన కేంద్రంగా ఉండటం మన అందరి అదృష్టం. —– జస్టిస్ K.T. థామస్, రిటైర్డ్ సుప్రీంకోర్టు న్యాయమూర్తి (కేరళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో సంభాషిస్తూ, 2019) 19) నేను వివిధ వ్యక్తిగత లాభాల కోసం లేదా కనీసం గుర్తింపు కోరుతున్న రాజకీయ పార్టీల కార్యకర్తలను చూశాను. కానీ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అలా కాదు. వారు స్వచ్ఛందంగా ఎటువంటి లాభాపేక్ష లేకుండా దేశ నిర్మాణంలో భాగమై ఉన్నారు. — రతన్ టాటా (2016 డిసెంబర్ 28 న, 2019 ఏప్రిల్ 18 న నాగపూర్ లోని ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు) 20) ఈరోజు మన దేశ చరిత్రలో ఒక ప్రత్యేక రోజు -;ఆర్ఎస్ఎస్ స్థాపనకు 100 సంవత్సరాలు పూర్తి అవుతున్నాయి .అనేక కష్టాలు ,నిషేధాలు ఎదుర్కొని ఆర్ఎస్ఎస్ మరింత బలంగా విస్తృతంగా నిలబడింది . దేశ ప్రజలందరినీ ఐక్యంగా ఉంచటమే ఆర్ఎస్ఎస్ యొక్క విస్తృత లక్ష్యం. — రామనాధ్ గోవింద్ ( 2 ,అక్టోబర్ ,2025 ,నాగపూర్ లో ఆర్ఎస్ఎస్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించిన సందర్భంగా) దేశభక్తి ,సేవ ,సంస్కృతి పరిరక్షణలో గత 100 సంవత్సరాలుగా ఆర్ఎస్ఎస్ చేస్తున్న కృషి ఎనలేనిది. శారీరిక, మానసిక శిక్షణతో జాతి ,కుల, ప్రాంత, భాష ,వర్గ, వర్ణ, మత భేదాలకు అతీతంగా దేశ ప్రజలను ఐకమత్యంగా ఉంచడమే ఆర్ఎస్ఎస్ యొక్క ప్రధాన లక్ష్యం. సేకరణ ఆచార్య వై .వి .రామిరెడ్డి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తిరుపతి

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మేకపాటి గౌతంరెడ్డి జయంతి వేడుక

వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు మరియు ప్రజాప్రతినిధులకు ముఖ్య మనవి మన ప్రియతమ నాయకులు, దివంగత మంత్రివర్యులు *శ్రీ మేకపాటి గౌతమ్ రెడ్డి గారి* జయంతి కార్యక్రమం *తేది 02.11.2025న నెల్లూరులోని మేకపాటి నివాసంలో ఉదయం10.00 గంటల* నుండి జరుగును. మేకపాటి కుటుంబసభ్యుల ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ హాజరుకావాల్సిందిగా కోరడమైనది (మేకపాటి కార్యాలయము, ఉదయగిరి )

క్రైమ్

రోడ్డు ప్రమాదం మహిళా మృతి

ఉదయగిరి. మర్రిపాడు కదలూరు జంక్షన్ దగ్గర tvs xl పై వెళ్తున్న భార్య భర్తను గుర్తుతెలియని వాహనం డికోట్టడం తో మహిళా స్పాట్ లో మృతి. భర్తను ప్రభుత్వ హాస్పటల్ కీ తరలింపు సంఘటన స్థలానికి Si మరియు సిబ్బంది. పూర్తి వివరాలు తెలియాల్సిన ఉండి

ఆంధ్రప్రదేశ్

తిలారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానంలో భక్తుల రద్దీ (తిలారు (నరసన్నపేట), నవంబర్ పున్నమి ప్రతినిధి)

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలంలోని ప్రసిద్ధ పవిత్ర క్షేత్రం తిలారు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం వద్ద ఈరోజు భక్తుల రద్దీ కనిపించింది. కార్తీకమాసం ప్రారంభం కావడంతో ఉదయం నుంచే స్వామి దర్శనానికి భక్తులు క్యూలైన్లలో నిలబడి ఉత్సాహంగా పాల్గొన్నారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పాలాభిషేకం, పుష్పార్చన, హారతులు, వేద పారాయణాలు ఘనంగా నిర్వహించారు. ఆలయ గోపురం పూలతో, మామిడి తోరణాలతో అలంకరించబడగా, భక్తులు స్వామివారికి కోకోనట్, పాలు, నైవేద్యాలు సమర్పిస్తూ దర్శనం పొందారు.స్థానిక యువకులు, గ్రామస్థులు, భక్తమండళి వలంటీర్లు సేవా కార్యక్రమాల్లో పాల్గొని భక్తులకు సౌకర్యాలు కల్పించారు. ఆలయ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. దూర ప్రాంతాలనుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో విచ్చేయడంతో తిలారు గ్రామం భక్తి సంద్రముగా మారింది. ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ “కార్తీకమాసం ప్రతి శనివారంనాడు ప్రత్యేక అభిషేకాలు, దీపారాధనలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తామని” తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మా జెండా తెలుగుదేశం.. మా నాయకుడు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్..

వింజమూరు నవంబర్ 01 పున్నమి పత్రిక ప్రతినిధి మా జెండా తెలుగుదేశం అని మా నాయకుడు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారని మేమంతా ఒకటేనని, మా మధ్య వర్గ విభేదాలు లేవని, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు, వనిపెంట సుబ్బారెడ్డి, , మాజీ ఎంపీపీ, ఇనగనూరి మోహన్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం వింజమూరులోని తెలుగుదేశం ప్రధాన పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం మండల నాయకులు అందరు ఒకే వేదికపై విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ఇనగనూరి మోహన్ రెడ్డి, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, సీనియర్ నాయకులు వనిపెంట సుబ్బారెడ్డి లు మాట్లాడుతూ వైసిపి పార్టీకి ఉన్న పత్రికలో రోత రాతలు రాస్తున్నారని, మా మధ్య వర్గ విభేదాలు సృష్టిస్తున్నారని, మాకు వర్గాలు లేవని మాదంతా తెలుగుదేశం కుటుంబమని, మా నాయకుడు ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారని తెలిపారు. వింజమూరుకు చెందిన ఒక వైసీపీ నాయకుడు చేసిన కుట్ర ఫలించలేదు అన్నారు. అందుచేత వారి దినపత్రికలో అబూత కల్పనలతో రాశారన్నారు. మా కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు ఉంటే మేమే సర్దుకుంటామని, వాటిని రాజకీయం చేసేందుకు కుటీల ప్రయత్నాలు చేశారన్నారు. గతంలో అనుకున్న ఒప్పందం ప్రకారమే, ఇదంతా జరిగిందని, మాలో ఎవరు గెలిచినా ఒకటేనన్నారు. అలా జరిగి ఉండకూడదని, ఇప్పటికి కూడా ఎందుకు జరిగిందో అర్థం కావడం లేదన్నారు. మా అందరి లక్ష్యం ఒకటేనని వచ్చే ఎన్నికల్లో వైసిపి పార్టీని ఎదుర్కొని, టిడిపి విజయాన్ని ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారికి అందిస్తామన్నారు. ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు యువ నాయకుడు మంత్రి శ్రీ నారా లోకేష్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, నెల్లూరు పార్లమెంటు సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్, అడుగుజాడల్లో నడిచి అభివృద్ధిలో భాగస్వామ్యం అవ్వడం మా అదృష్టంగా భావిస్తామన్నారు. ముగ్గురు నాయకులు కలసికట్టుగా చేతులు కలుపుకొని విక్టరీ చూపించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, సీనియర్ నాయకులు గణపం సుదర్శన్ రెడ్డి, మండల ఉపాధ్యక్షులు ఆనంగి రమణయ్య, ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు యాదవ్, పట్టణ అధ్యక్షులు కోడూరు నాగిరెడ్డి, మంచాల శ్రీనివాసులు నాయుడు, కాటం రమణారెడ్డి, దంతులూరి వెంకటేశ్వర్లు, పాములపాటి మాల్యాద్రి, గురజాల వాసు నాయుడు, షేక్ రఫీ, గంగపట్ల హాజరత్, గవ్వల మల్లికార్జున, ఉప్పుటూరు రత్నం, గాలి శేషయ్య, ఎం రాయుడు, తిరుపతి ఆచారి, దుద్దుగుంట శ్రీనివాసులురెడ్డి, కే ఎస్ నాయుడు, బి జయంత్ రెడ్డి, జి రామచంద్రారెడ్డి, భోజనపు ఆనంద్, తదితరులు ఉన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.