Monday, 6 April 2026

Blog

E-పేపర్

ముద్దం వన్షిక ను ఆశీర్వదించిన మంత్రి ఎన్ఎండి ఫరూక్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ సోషల్ మీడియా పిఆర్వో ముద్దం నాగ నవీన్ కూతురు చిరంజీవి ముద్దం వన్షిక రెండవ పుట్టినరోజు వేడుక సందర్భంగా మంత్రి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా వారి కార్యాలయం నందు కలిశారు ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ చిన్నారి వన్షికను మనసారా ఆశీర్వదించారు చిన్నారి వన్షిక నిండు నూరేళ్లు జీవించాలని, ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్బంగా ముద్దం నాగ నవీన్ మంత్రి ఫరూక్ కి కృతజ్ఞతలు తెలియజేశారు. తనతో పాటు కార్యక్రమంలో పసుపులేటి మీనాక్షి ఉన్నారు

ఆంధ్రప్రదేశ్

EVR Hospital గుడివాడ ఉచిత మెగా క్యాంప్ కు విశేష స్పందన

EVR (ఈడ్పుగంటి వెంకటరామయ్య) మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్- గుడివాడ ఉచిత మెగా క్యాంపుకు విశేష స్పందన వచ్చింది. రాష్ట్రంలోని నలుమూలలనుంచి ప్రజలు ఉదయం 8 గం. నుంచి సాయంకాలం 7. గం. వాస్తునేవున్నరు మేనేజ్మెంట్ సలహా చూసనలతో సిబ్బంది ఎవరికీ ఇబ్బంది కలగకుండా తీవ్రంగా శ్రమించి సుమారుగా 2000 మందికి మంచి సేవలను అందించారు

Blog

మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నంద్యాల జిల్లా ఐఎంఏ కార్యదర్శి మహమ్మద్ రఫీ

నంద్యాల జిల్లా నూతన ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ మహమ్మద్ రఫీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని నంద్యాల టీడీపీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. ఈ సందర్భంగా నూతన కార్యదర్శిగా ఎన్నికైన డాక్టర్ మహమ్మద్ రఫీ మంత్రి ఎన్ఎండి ఫరూక్ తో జిల్లాలో వైద్య రంగానికి సంబంధించిన పలు అంశాలపై క్లుప్తంగా చర్చించారు అనంతరం మంత్రి ఫరూక్ మాట్లాడుతూ ఐఎంఏ కి ప్రభుత్వం తరఫున, నా తరఫున సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు

E-పేపర్

నెరవాటి హాస్పిటల్ లో అలర్జీ, వర్టిగో అత్యాధునిక క్లినిక్ ల ప్రారంభించిన డాక్టర్ రవి కృష్ణ,డాక్టర్ మధుసూదనరావు

పద్మావతి నగర్ లో ఉన్న నెరవాటి మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో శనివారం ఆసుపత్రి నిర్వాహకులు చెవి ముక్కు గొంతు వైద్య నిపుణులు డాక్టర్ నెరవాటి వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో ప్రప్రధమంగా ఏర్పాటు చేసిన అలర్జీ, వర్టిగో అత్యాధునిక క్లినిక్ లను ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ,నంద్యాల ఐఎంఏ అధ్యక్షులు డాక్టర్ మధుసూదనరావు ప్రారంభించారు ఈ సందర్భంగా డాక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ వివిధ రకాల అలర్జీలతో చర్మ, శ్వాసకోశ ఇబ్బందులు పడే వారికి ఏ అలర్జీతో బాధపడుతున్నారో నిర్దిష్టంగా తెలుసుకొని సంబంధిత వైద్యం చేయడానికి తమ అలర్జీ క్లినిక్ లో అత్యాధునిక పరికరాలు, సాంకేతిక నిపుణులు ఏర్పాటు చేశామన్నారు. అదేవిధంగా వర్టిగో అంటే తరచు కళ్ళు తిరగడం, కింద పడిపోవడం వంటి ఇబ్బందులు ఉన్నవారికి వర్టిగో క్లినిక్ లో సంబంధిత కారణాలు తెలుసుకొని దానికి అనుగుణమైన వైద్యం చేయడానికి ఆస్కారం ఉంటుందన్నారు. వర్టిగో క్లినిక్ ను జాతీయస్థాయిలో సేవలు అందిస్తున్న న్యూరో ఈక్విలిబ్రియం సంస్థతో, అలర్జీ క్లినిక్ ను ఏవెక్సియా సంస్థతో కలిసి ఏర్పాటు చేసామన్నారు. వర్టిగో క్లినిక్ లో వర్టిగో స్పెషలిస్ట్ డాక్టర్ అంజు పిల్లై, సాంకేతిక నిపుణులు తపస్వి , అలర్జీ క్లినిక్ లో ప్రబీర్ పట్నాయక్, భాష లు సేవలందిస్తారని తెలిపారు డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదనరావు మాట్లాడుతూ అలర్జీతో బాధపడే వారి సంఖ్య పెరిగిపోతున్న నేపథ్యంలో ఈ క్లినిక్ లు నంద్యాల ప్రాంత ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని అన్నారు ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు ఈ కార్యక్రమంలో నెరవాటి ఆసుపత్రి నిర్వాహకురాలు డాక్టర్ అరుణకుమారి, డాక్టర్ గగన్, పారిశ్రామికవేత్త నెరవాటి సత్యనారాయణ,ఐఎంఏ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ విజయభాస్కర్ రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ మధుసూధన రెడ్డి, ఐఎంఏ రాష్ట్ర నాయకులు డాక్టర్ అనిల్ కుమార్, ఐఎంఏ నంద్యాల కార్యదర్శి డాక్టర్ పనిల్ కుమార్, ఐఎంఏ నంద్యాల నూతన అధ్యక్ష కార్యదర్శులుగా ఎన్నుకోబడ్డ డాక్టర్ శ్రీనివాసరావు డాక్టర్ మహమ్మద్ రఫీ, సీనియర్ వైద్యులు డాక్టర్ సహదేవుడు, డాక్టర్ మురళీకృష్ణ, డాక్టర్ నెట్ల మహేశ్వరరెడ్డి,మహిళా వైద్యులు డాక్టర్ నర్మద, డాక్టర్ మాధవి, డాక్టర్ హరిత, డాక్టర్ లలిత, డాక్టర్ రాధిక జ్యోతి, డాక్టర్ ఆరీఫా బాను, డాక్టర్ తనూజ అధిక సంఖ్యలో నంద్యాల వైద్యులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

నిందితుడిని కఠినంగా శిక్షించాలి: బీజేపీ నేత లక్ష్మీ ప్రసన్న

భారతీయ జనతా పార్టీ ముమ్మిడివరం నియోజకవర్గం, ఐ.పోలవరం మండలం అధ్యక్షులు సాకిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో బాణాపురం లో మైనర్ బాలిక పై జరిగిన లైంగిక వేధింపుల ఘటనపై బాధితురాలి ఇంటికి రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి మరియు గోదావరి జిల్లాల జోనల్ ఇంచార్జి సాలగ్రామ లక్ష్మీప్రసన్న శనివారం వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయని, ఇవి జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్యం తగిన శ్రద్ధ తీసుకోవాలని ఆమె అన్నారు. అలాగే ఈ గ్రామస్తులు మీ బాధితులకు అండగా ఉన్నందుకు వారికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. మా పార్టీ కార్యకర్తలు ఈ బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం అన్నారు. నిందితులు ఎంతటి వారైనా కఠిన శిక్ష పడేలా కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ, ముమ్మిడివరం మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు గోలకోటి వెంకటరెడ్డి, జిల్లా బీజేపీ ఉపాధ్యక్షులు గనిశెట్టి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు మూర్తిరాజు, జిల్లా కోశాధికారి గ్రంధి నానాజి, ఆకుమర్తి బేబీ రాణి, మహిళా మోర్చా స్టేట్ సెక్రటరీ, మాజీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు నందం శ్రీలక్ష్మి, స్పెషల్ ఇన్వైటింగ్ యనమదల రాజ్యలక్ష్మి, జిల్లా ఉపాధ్యక్షురాలు చిలకమర్రి కస్తూరి, జిల్లా సెక్రెటరీ మోకా ఆదిలక్ష్మి, జిల్లా కార్యవర్గ సభ్యురాలు వై.శకుంతల మరియు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

రంగారెడ్డి

ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి

పున్నమి: నవంబర్ 01 ప్రతినిధి దూపం అంజనేయులు రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ట్ మండలం: పెద్ద అంబర్ పేట్ మున్సిపాలిటీ పరిధిలోని కద్బుల్లాపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్ల తొలివిడత ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కొత్తకంటి-రాజమణీ బాలయ్య నిర్మించుకున్న ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశ పూజ కార్యక్రమంలోకి ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి స్థానిక నాయకులతో కలిసి హాజరయ్యారు.లబ్ధిదారులతో కలిసి నూతన గృహప్రవేశంలో పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. తమ సొంత ఇంటి కలను నెరవేర్చిన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పట్ల కృతజ్ఞతలు వ్యక్తం చేస్తూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే కు ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని లబ్ధిదారులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఉదయగిరి లో జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్దులు

SGF క్రీడా పోటీల్లో ఉదయగిరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్దులు డివిజన్ స్థాయి లో సత్తా చాటి జిల్లా స్థాయి పోటీలకు ఎంపికైనట్లు హెడ్ మాస్టర్ శ్రీను వాసులు తెలిపారు 400 మీటర్లు రన్నింగ్ లో మొదటి ప్లేస్ షేక్ ఆలియా ,600మీటర్లు లో షేక్ సునద్ ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు , కబడ్డిలో అండర్ 17విభాగంలో షేక్ ఆఫ్రోజ్ , షేక్ సోయాబ్ ,d వాసు ఎంపికయ్యారు ఎంపికైన విద్యార్ధులను ఉపాధ్యాయ సిబ్బంది అభినందించారు.

నారాయణపేట

ఘనంగా మంత్రి వాకిటి శ్రీహరీ జన్మదిన వేడుకలు

నారాయణపేట జిల్లా క్రిష్ణ మండలంలోని కున్సి గ్రామంలో మంత్రి వాకిటి శ్రీహరీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.ఈ కార్యక్రమానికి మండల అధ్యక్షుడు రాజప్ప గౌడ్ ,పల్దొడ్డి శరణప్ప గౌడ్, మాజీ సర్పంచ్ అంజ్జప్ప గౌడ్,ఖందొడ్డి నారాయణ, గడ్డమీద శరణ్, బి.శరణ్,నల్లె శ్రీనివాసులు, నల్లే వెంకటప్ప,తంగిడి సుగప్ప, ఉప్పరి చంద్రశేఖర్,బడల్ నర్శప్ప ,మరియు గౌళ్ళ బృందం పాల్గొనడం జరిగింది.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

టిడిపి క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు పదర్ల హజరత్ తండ్రి కీ Mla కాకర్ల ఆర్థిక సహాయం

నెల్లూరు జిల్లా కొండాపురం మండలం గొట్టిగుండాల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన కొండాపురం మండల టిడిపి క్రిస్టియన్ సెల్ ఉపాధ్యక్షుడు పదర్ల హజరత్ తండ్రి మస్తాన్ గారు కొంతకాలంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతూ, కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితిలో ఉన్నారు. ఇటీవలి భారీ వర్షాల కారణంగా వారి ఇల్లు తీవ్రంగా దెబ్బతినడంతో, స్లాబ్ పాడై, వర్షపు నీరు ఇంట్లోకి చేరి కుటుంబం అంగన్వాడీ భవనంలో తలదాచుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న ఉదయగిరి ఎమ్మెల్యే శ్రీ కాకర్ల సురేష్ గారు వెంటనే స్పందించి, తమ “కాకర్ల చారిటబుల్ ట్రస్ట్” ద్వారా రూ.20,000 ఆర్థిక సాయం అందజేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీ ఒక కుటుంబం లాంటిది. మా కార్యకర్తలు లేదా వారి కుటుంబాలు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారితో ఉండటం, వారికి అండగా నిలవడం మా బాధ్యత. ఎల్లప్పుడూ టిడిపి కార్యకర్తల పక్కనే ఉంటాను” అని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలినేని చంద్రబాబు నాయుడు, యారం కిష్టయ్య, అల్లిక మధు, రామ్మోహన్, తిరుపాల్ రెడ్డి, పద్మా రెడ్డి, రవీంద్రారెడ్డి, నర్సారెడ్డి తదితర పార్టీ నాయకులు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

తెలంగాణ

జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన :ప్రధాన ఎన్నికల అధికారి

నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి ) ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియను సమర్థవంతంగా చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన హైదరాబాదు నుండి రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఇతర అధికారులతో కలిసి, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఇతర అధికారులతో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) పురోగతిపై సమీక్షించారు. నియోజకవర్గాల వారీగా 2025 ఎలక్టోరల్ జాబితా మ్యాపింగ్ చేసి నాలుగు కేటగిరీలుగా విభజించడం జరిగిందని తెలిపారు. 👉 కేటగిరి ఎ – 1987 కంటే ముందు జన్మించి 2002, 2025 ఎలక్టోరల్ జాబితాలో నమోదు కాబడిన వారు, 👉 కేటగిరి బి లో 1987 కంటే ముందు జన్మించి 2002 ఓటర్ జాబితాలో లేకుండా, 2025 జాబితాలో నమోదు కాబడిన వారు, 👉 కేటగిరి సి లో 1987 నుండి 2002 మధ్యలో జన్మించిన వారు, 2025 ఓటర్ జాబితాలో నమోదు కాబడిన వారు, 👉 కేటగిరీ డి లో 2002 నుండి 2007 మధ్యలో జన్మించిన వారి గా విభజించడం జరిగిందని తెలిపారు. ఓటర్ లిస్ట్ ల జాబితా కు సంబంధించిన 6, 7, 8 ఫారంలను త్వరగా ఎంక్వయిరీ చేసి ఏడు రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.