Monday, 6 April 2026

Blog

కాకినాడ

పెద్దాపురంలో RDSS పనులతో విద్యుత్ అంతరాయం: 3 నవంబర్ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు

పున్నమి న్యూస్, పెద్దాపురం, నవంబర్ 2 ఆంధ్రప్రదేశ్ తూర్పు విద్యుత్ వితరణ కార్పొరేషన్ లిమిటెడ్ (APEPDCL) ప్రవేశపెట్టిన రూరల్ డిస్ట్రిబ్యూషన్ స్ట్రెంగ్తెనింగ్ అండ్ సిస్టమ్ ఇంప్రూవ్‌మెంట్ (RDSS) పథకం కింద పెద్దాపురం పట్టణంలో ముఖ్యమైన పనులు చేపట్టనున్నారు. ఈ పనుల కారణంగా, పట్టణ పరిధిలోని అనేక ప్రాంతాల్లో 3 నవంబర్, సోమవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు విద్యుత్ అంతరాయం జరుగనుందని అధికారులు తెలిపారు. శతాబ్ది పార్క్ దగ్గర 33/11 కే.వి. సబ్ స్టేషన్ నుంచి RTC మరియు రామారావు పేట మీదుగా విద్యుత్ సరఫరా మార్గాల్లో జరిగే మెయింటెనెన్స్ పనుల వల్ల ఈ అంతరాయం ఏర్పడుతుంది. పట్టణంలోని పాత పెద్దాపురం, దర్గా సెంటర్, చేపల వీధి, తాడితోట, కుమ్మర వీధి, నాగేశ్వరావు వీధి, పాత బస్ స్టాండ్, వర్జుల వారి వీధి, మిరపకాయల వీధి, మెయిన్ రోడ్, కొత్త పేట, సత్తిరెడ్డి పేట, నువ్వులగుంట వీధి, మరిడమ్మా టెంపుల్, గోలి వారి వీధి, అంకాయ్యమ్మా పేట, సుబ్బయమ్మ పేట ప్రాంతాల్లో ఈ అంతరాయం ప్రభావితం చేస్తుంది. వినియోగదారులు ముందుగానే ఏర్పాట్లు చేసుకోవాలని, పనులు సాఫీగా జరిగేలా అందరూ సహకరించాలని అధికారులు పిలుపునిచ్చారు. “RDSS పథకం కింద ఈ పనులు భవిష్యత్తులో విద్యుత్ సరఫరాను మరింత మెరుగుపరచడానికి ఉపయోగపడతాయి. కాబట్టి, వినియోగదారుల సహకారం అత్యవసరం” అని ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్, ఆపరేషన్) శ్రీ ఎ.వి.ఎన్.డి.ఎస్. ప్రభాకర్ తెలిపారు. ప్రస్తుతం పెద్దాపురం మండలంలో RDSS పథకం కింద అనేక సబ్ స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్ల అప్‌గ్రేడేషన్ పనులు జరుగుతున్నాయి. ఈ పనుల వల్ల తాత్కాలిక అంతరాయాలు జరగినప్పటికీ, దీర్ఘకాలంలో విద్యుత్ సరఫరా మరింత స్థిరత్వం పొందుతుందని అధికారులు తెలిపారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

వింజమూరులో “ముత్యాలమ్మ తల్లి మ్యారేజ్ ఈవెంట్స్” ప్రారంభించిన ఎమ్మెల్యే కాకర్ల

వింజమూరు మండల కేంద్రంలో బయ్యపురెడ్డి రవిశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన “ముత్యాలమ్మ తల్లి మ్యారేజ్ ఈవెంట్స్” కార్యాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు రిబ్బన్ కట్ చేసి షాప్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ — వింజమూరులో నూతనంగా ప్రారంభమైన “ముత్యాలమ్మ తల్లి మ్యారేజ్ ఈవెంట్స్”స్థానిక ప్రజలకు వివాహాలు, శుభకార్యాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణలో సమగ్ర సేవలను అందించి ఈ సంస్థ మరింత అభివృద్ధి చెంది, ఈ ప్రాంతంలో విశ్వసనీయమైన ఈవెంట్ మేనేజ్‌మెంట్ సెంటర్‌గా ఎదగాలని ఆకాంక్షిస్తూ రవిశంకర్ రెడ్డి మరియు ఆయన బృందానికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక మండల నాయకులు, కార్యకర్తలు, గ్రామ పెద్దలు, బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ

నల్గొండ జిల్లా పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసుల పరిష్కారంకై 15న ప్రత్యేక లోక్ ఆధాలత్ : చైర్మన్

నకిరేకల్ : నవంబర్ (పున్నమి ప్రతినిధి ) రాష్ట్ర లీగల్ సర్వీస్ అథారిటీ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లా పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసులు, ఫ్రీ లిటిగేషన్ కేసుల పరిష్కారం నిమిత్తం ఈనెల 15న ప్రత్యేక లోక్ ఆధాలత్ ఉంటుందని, మొదటి అదనపు జిల్లా జడ్జి మరియు జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ చైర్మన్ జి సంపూర్ణ ఆనంద్ ఒక ప్రకటనలో తెలిపారు. అందువల్ల జిల్లాలోని కక్షిదారులు ఈ నెల 15 న నిర్వహించే ప్రత్యేక అదాలత్ లో వారి పెండింగ్ కేసులు, ప్రీ లిటిగేషన్ కేసులను పరిష్కరించుకోవాలని కోరారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు రెడ్ క్రాస్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా ఎస్‌.కే. ఖాదర్ భాషా బాధ్యతల స్వీకరణ

ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ నెల్లూరు శాఖ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్‌గా ఎస్‌.కే. ఖాదర్ భాషా శనివారం బాధ్యతలు స్వీకరించారు. పొదలకూరు రోడ్డులోని క్యాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ వాకాటి విజయ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఖాదర్ భాషా సేవాభావం, ప్రజలతో మమేకమై పనిచేసే నిబద్ధత సంస్థ సేవా కార్యక్రమాలకు పెద్దగా దోహదం చేస్తుందని అభిప్రాయపడ్డారు. రెడ్ క్రాస్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు ప్రజలకు చేరేటట్లు చర్యలు చేపడతామని తెలిపారు. నయం కాని వ్యాధులను కూడా విజయవంతంగా నయం చేస్తూ, పేషెంట్లకు ఉచిత భోజన సదుపాయం అందిస్తూ, మానవతా విలువలను నిలబెట్టే కేంద్రంగా నెల్లూరు క్యాన్సర్ హాస్పిటల్ ఎదుగుతోందని ఆయన పేర్కొన్నారు. కార్యక్రమంలో డాక్టర్ పి. లక్ష్మీ, ఎస్‌.కే. ఆయిషా, దాసరి సుందరం, అరవ రాయప్ప, అరవ ప్రవీణ్ కుమార్, రాచపాలెం రఘు, ఏ. జయరాములు, జగన్నాథం తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

*రాష్ట్రంలో అక్టోబర్‌ 2025 నెలలో నికర జీఎస్‌టీ వసూళ్లు 8.77% వృద్ధి నమోదు… *రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్*

*రాష్ట్రంలో అక్టోబర్‌ 2025 నెలలో నికర జీఎస్‌టీ వసూళ్లు 8.77% వృద్ధి నమోదు… *రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్* *బాబు ఏ రాష్ట్ర ప్రభుత్వం జీఎస్‌టీ 2.0 సంస్కరణలను అమలులోకి తీసుకు వచ్చిన తర్వాత 2025 అక్టోబర్‌ నెలలో ఆదాయ వృద్ధిని సాధించింది. ప్రధాన వినియోగ వస్తువులు, ఔషధాలు, సిమెంట్‌ వంటి పలు వస్తువులపై పన్ను రేట్లు తగ్గించినప్పటికీ, నికర జీఎస్‌టీ వసూళ్లు గత ఏడాది అక్టోబర్‌తో పోలిస్తే 8.77% వృద్ధి రేటు సాధించాయి. జీఎస్‌టీ పరిహార సెస్‌ (Compensation Cess) పొగాకు ఉత్పత్తుల మినహా అన్ని వస్తువులపై తొలగించబడింది. పన్ను రేట్లు తగ్గినా వినియోగం పెరగడం, ప్రభుత్వ ప్రణాళికాత్మక విధానాలు, పటిష్టంగా పన్ను అమలు వ్యవస్థల వల్ల ఈ వృద్ధి సాధ్యమైంది. *ప్రధానాంశాలు: *నికర జీఎస్‌టీ వసూళ్లు:* ₹3,021 కోట్లు_ ఇప్పటివరకు అక్టోబర్ నెలలో రెండవ అత్యధిక స్థాయి. *స్థూల జీఎస్‌టీ వసూళ్లు: ₹3,490 కోట్లు — అక్టోబర్ నెలలో మూడవ అత్యధిక స్థాయి. ఏప్రిల్‌ నుండి అక్టోబర్‌ 2025 వరకు ప్రతి నెలా వసూళ్లు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే అధికంగా నమోదయ్యాయి. *SGST వసూళ్లు* : ₹1,247 కోట్లు (6.2% వృద్ధి) *IGST సెటిల్‌మెంట్‌:* ₹1,773 కోట్లు (10.65% వృద్ధి) పెట్రోలియం VAT: ₹1,282 కోట్లు (7.88% వృద్ధి) *ప్రొఫెషనల్‌ ట్యాక్స్‌: అక్టోబర్‌లో 18.26% వృద్ధి *ప్రభుత్వ చర్యలు: *డేటా అనలిటిక్స్‌ వినియోగం:* పన్ను ఎగవేతలు, తప్పుడు ITC క్లెయిమ్స్‌ గుర్తించేందుకు ఆధునిక డేటా విశ్లేషణ, కృత్రిమ మేధస్సు పద్ధతుల వినియోగం. *కేంద్ర–రాష్ట్ర సమన్వయం: IGST సెటిల్‌మెంట్‌ వేగవంతం చేయడం, పెద్ద బకాయిదారులపై చర్యలు. *పనితీరు ఆధారిత నియామకాలు: పన్ను వసూళ్లలో ప్రతిభ చూపిన అధికారులను అధిక ఆదాయ సామర్థ్యం గల ప్రాంతాలలో నియమించడం. *IGST రివర్సల్‌:* ₹279 కోట్ల తప్పుడు క్రెడిట్లను రద్దు చేయడం. *రిటర్న్‌ ఫైలింగ్‌ పెంపు:* పన్ను చెల్లింపుదారుల సమయానుసార రిటర్న్స్ సమర్పణను నిర్బంధించడం. *బలమైన దర్యాప్తు వ్యవస్థ:* పన్ను మోసాలు, తప్పుడు లావాదేవీలను ముందుగానే గుర్తించి చర్యలు తీసుకోవటం *డిఫాల్టర్లపై ప్రత్యేక డ్రైవ్‌: గతంలో అధిక పన్ను చెల్లించి ఈ ఏడాది రిటర్న్‌ ఫైలింగ్‌ చేయని వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవటం *ఆస్తి, బ్యాంకు ఖాతా ద్వారా వసూళ్లు:* నిరంతర బకాయిదారులపై వేగవంతమైన వసూలు చర్యలు. *మొత్తం వసూళ్లు: అక్టోబర్‌ 2025 లో అన్ని విభాగాల్లో కలిపి ₹4,458 కోట్లు వసూలయ్యాయి, ఇది గత ఏడాది అక్టోబర్‌ (₹4,126 కోట్లు) కంటే 8.03% అధికం. ఏప్రిల్‌–అక్టోబర్‌ 2025 మధ్య కాలంలో మొత్తం ఆదాయం 5.58% వృద్ధి సాధించింది. ఈ ఫలితాలు రాష్ట్ర ప్రభుత్వ సమర్థ పన్ను పరిపాలన, బలమైన పర్యవేక్షణ, డేటా ఆధారిత చర్యలు, పన్ను చెల్లింపుదారుల విస్తరణకు సంకేతంగా పేర్కొనవచ్చునని ప్రధాన రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ బాబు ఏ ఆ ప్రకటన లో తెలియజేశారు..

అల్లూరి సీతారామరాజు

అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆరోగ్య రధం వైద్య శిబిరం

అరకులోయ (పున్నమి ప్రతినిధి), నవంబర్:1 అరకులోయ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యంలో శనివారం APDMC ఆరోగ్య రధం వారితో మెడికల్ క్యాంప్ నిర్వహించారు. ప్రిన్సిపల్ డా కేబీకే నాయక్ మాట్లాడుతూ.. విద్యార్థులు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఎటువంటి ఆరోగ్య సమస్య వచ్చినా ప్రారంభ దశలోనే పరిష్కరించుకోవాలన్నారు. ఆరోగ్య రధం డాక్టర్ జి కుశల్ చైతన్య 68 మందికి వైద్య పరీక్షలు చేసి, అవసరమైన వారికి మందులు అందించారు. కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ పి కొండబాబు, ఎన్ఎస్ఎస్ పిఓలు నాగబాబు, విజయలక్ష్మి, అనిత కుమారి, అధ్యాపకులు పాల్గొన్నారు.

నారాయణపేట

ఘనంగా మంత్రి వాకిటి శ్రీహరీ జన్మదిన వేడుకలు

నారాయణపేట జిల్లా క్రిష్ణ మండలం,కున్సి గ్రామంలో మంత్రి వాకిటి శ్రీహరీ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమానికి గ్రామ పెద్దలు,యువకులు , కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు రాజప్ప గౌడ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు పిట్టల్ సిద్దప్ప మాస్టర్,గ్రామ మాజీ సర్పంచ్,అంజప్ప, ఖాన్దొడ్డి నారాయణ, ,నల్లే శ్రీనివాసులు ,గడ్డమీది శరణ్, బాడియల్ శరణం బస్వా , తంగిడి సూగప్ప తంగిడి సుదర్శన్, పల్దొడ్డి శరణప్ప గౌడ, నల్లె వెంకటేష్ కాంగ్రెస్ యూత్ లీడర్స్ పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది, డాక్టర్ వాకిటి శ్రీహరి గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేక్ కట్ చేస్తూ అభిమానం చాటుకోవడం జరిగింది.

అల్లూరి సీతారామరాజు

అరకు: రచ్చబండ నిర్మాణానికి శంకుస్థాపన

అరకులోయ మండలం బస్కి పంచాయతీ, బస్కి గ్రామంలో రచ్చబండ నిర్మాణ పనులకు వైస్ ఎంపీపీ కిల్లో రామన్న, సర్పంచ్ పాడి రమేష్ లు శంకుస్థాపన చేశారు. 15వ ఆర్ధిక సంఘం నిధుల నుండి రచ్చబండ నిర్మాణానికి లక్ష రూపాయలు కేటాయించినట్లు సర్పంచ్ పాడి రమేష్ తెలిపారు. రచ్చబండ అందుబాటులోకి వస్తే గ్రామానికి సంబందిన సమావేశాలు, ప్రభుత్వ కార్యక్రమాలు చేయడానికి బాగుంటుందని వైస్ ఎంపీపీ రామన్న అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు.

E-పేపర్

ఉచిత మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం ప్రారంభించిన ASP ఎం.జావళి ఆల్ఫోన్స్ IPS

నంద్యాల జిల్లా పోలీస్ వారి కుటుంబాల సంక్షేమం కొరకు ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు నంద్యాల పట్టణంలోని RK ఫంక్షన్ హాల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక అక్టోబర్ 21వ తేదీ నుండి 31 వ తారీకు వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ నంద్యాల రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి IPS జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N. యుగంధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనంతరం ASP .జావళి IPS జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N. యుగంధర్ బాబు AR డి.ఎస్.పి శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి,ఇన్స్పెక్టర్లు జీవన గంగనాథ్ బాబు ఈశ్వరయ్య కృష్ణయ్య స్వయంగా రక్తదానం చేసి శిబిరానికి వచ్చిన వారికి ఆదర్శంగా నిలవడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా 32 మంది పోలీసు అధికారులు వారి సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడంతో పాటు నంద్యాల SVR ఇంజనీరింగ్ కళాశాల ,గవర్నమెంట్ కాలేజ్ ,రామకృష్ణ కాలేజ్ ,RGM కాలేజ్ ల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని స్వచ్ఛందంగా 148 మంది రక్తదానం చేయడం జరిగింది.

Blog

ఉచిత మెగా వైద్య శిబిరం మరియు రక్తదాన శిబిరం ప్రారంభించిన ASP ఎం.జావళి ఆల్ఫోన్స్ IPS

నంద్యాల జిల్లా పోలీస్ వారి కుటుంబాల సంక్షేమం కొరకు ప్రతి ఒక్క పోలీస్ సిబ్బంది ఆరోగ్యంగా ఉండాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ జిల్లా ఎస్పీ సునీల్ సునీల్ షొరాణ్ IPS ఆదేశాలమేరకు నంద్యాల పట్టణంలోని RK ఫంక్షన్ హాల్ నందు ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాక అక్టోబర్ 21వ తేదీ నుండి 31 వ తారీకు వరకు పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా విధి నిర్వహణలో అమరులైన పోలీసులను స్మరించుకుంటూ నంద్యాల రెడ్ క్రాస్ సొసైటీ వారి ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఆదేశాలమేరకు నంద్యాల సబ్ డివిజన్ ASP ఎం.జావళి IPS జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N. యుగంధర్ బాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది అనంతరం ASP .జావళి IPS జిల్లా అడిషనల్ ఎస్పీ అడ్మిన్ N. యుగంధర్ బాబు AR డి.ఎస్.పి శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి శ్రీనివాసరెడ్డి,ఇన్స్పెక్టర్లు జీవన గంగనాథ్ బాబు ఈశ్వరయ్య కృష్ణయ్య స్వయంగా రక్తదానం చేసి శిబిరానికి వచ్చిన వారికి ఆదర్శంగా నిలవడం జరిగింది. అనంతరం ఈ కార్యక్రమంలో భాగంగా 32 మంది పోలీసు అధికారులు వారి సిబ్బంది స్వచ్ఛందంగా రక్తదానం చేయడంతో పాటు నంద్యాల SVR ఇంజనీరింగ్ కళాశాల ,గవర్నమెంట్ కాలేజ్ ,రామకృష్ణ కాలేజ్ ,RGM కాలేజ్ ల నుండి విద్యార్థిని విద్యార్థులు పాల్గొని స్వచ్ఛందంగా 148 మంది రక్తదానం చేయడం జరిగింది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.