Monday, 6 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నవంబర్ 3 నుంచి ధాన్యం కొనుగోళ్లు.. 48 గంటల్లోనే బిల్లులు చెల్లింపు

ఏపీ: రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ధాన్యం కొనుగోళ్లు నవంబర్ 3 నుంచి ప్రారంభమవనున్నాయి. ఇందు కోసం 3,013 ఆర్ఎస్కేలు, 2,061 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఈసారి 51 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. రైతులు 7337359375 వాట్సాప్ నంబర్కు “HI” అని పంపి రిజిస్ట్రేషన్ చేసుకరోవాలని సూచించారు కొనుగోలు చేసిన 24 నుండి 48 గంటల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని మంత్రి స్పష్టం చేశారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

నేడే వరల్డ్ కప్ ఫైనల్.. భారత్‌తో దక్షిణాఫ్రికా ఢీ

నేడే వరల్డ్ కప్ ఫైనల్.. భారత్‌తో దక్షిణాఫ్రికా ఢీ ఉమెన్స్ వన్డే వరల్డ్ కప్ చివరి దశకు చేరుకుంది. నవీ ముంబై వేదికగా జరిగే ఈ మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌లో గెలిచిన జట్టుకు ఇదే తొలి వరల్డ్ కప్ కానుంది. భారత జట్టు గతంలో రెండుసార్లు ఫైనల్లో ఓటమి పాలైంది. ఈసారి కప్పు గెలవాలనే పట్టుదలతో ఉంది. ఈ మ్యాచ్ ఇవాళ మధ్యాహ్నం 3 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది.

రంగారెడ్డి

మృతుల కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ 10,000 ఆర్థిక సాయం*

*మృతుల కుటుంబానికి రాధాకృష్ణ చారిటబుల్ 10,000 ఆర్థిక సాయం* పున్నమి ప్రతినిధి నవంబర్ 02 కడ్తాల్ మండలంలోని ఎక్వాయిపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని మాదాపూర్ గ్రామానికి చెందిన బొజ్జ ఎల్లమ్మ శుక్రవారం సాయంత్రం మరణించడం జరిగింది. విషయం తెలుసుకున్న కడ్తాల్ మాజీ జెడ్పిటిసి, లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర ఉపాధ్యక్షుడు రాధాకృష్ణ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ జర్పుల దశరథ్ నాయక్ స్థానిక నాయకులతో కలిసి ఎల్లమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఎల్లమ్మ మృతదేహానికి పూలమాలేసి నివాళులర్పించారు. తదుపరి ఎల్లమ్మ కుటుంబ సభ్యులకు జర్పుల రాధాకృష్ణ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 5000 రూపాయల ఆర్థిక సహాయం అందించగా స్థానిక బీఆర్ఎస్ నాయకులు జెనిగల మహేష్ యాదవ్ 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఎక్కువయి పల్లి బి ఆర్ ఎస్ . నాయకులు 5000 అందించారు అలాగే కడ్తాల్ మండల కేంద్రానికి బీఆర్ఎస్ నాయకులు పోతుగళ్ళ మహేష్ శుక్రవారం హార్ట్ ఎటాక్ తో మరణించారు. మహేష్ కుటుంబాన్ని పరామర్శించి ట్రస్టు ద్వారా 5000 రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఈ కార్యక్రమంలో పిఎసిఎస్ డైరెక్టర్ వీరయ్య సేవ్య నాయక్ వెంకటయ్య గ్రామ కమిటీ అధ్యక్షుడు రామకృష్ణ మాజీ సర్పంచ్ వెంకటేష్ మాజీ ఉపసర్పంచ్ ముత్యాలు నాయకులు బిక్షపతి పాండు మహేష్ కిష్టయ్య రాకేష్ రాజేష్ నవీన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఛలో అమలాపురం

ఘోరాన్ని ఖండించండి బాలికలకు న్యాయం చేయండి తుని ఘటన మరువకముందే, మన జిల్లాలో ఐ. పోలవరం మండలం బాణాపురంలో 10 ఏళ్ల బాలికపై జరిగిన పైశాచిక అఘాయిత్యం మన సమాజానికి సిగ్గుచేటు.నిందితుడైన రాయపురెడ్డి సత్య వెంకట కృష్ణ (బాబీ)ని కఠినంగా శిక్షించాలని, బాధిత బాలికకు తక్షణమే న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ… *భారీ నిరసన ప్రదర్శన* తేదీ: 3-11-25 సోమవారం సమయం :సాయంత్రం 4:30 గంటలకు స్థలం అమలాపురం గడియార స్తంభం సెంటర్ మహిళల, బాలికల భద్రత కోసం న్యాయం కోసం గళం విప్పడానికి ప్రజలందరూ విద్యార్థులు, మేధావులు మహిళలు, యువకులు ఉద్యోగ ఉపాధ్యాయ దళిత ప్రజాసంఘాలు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ నిరసనను జయప్రదం చేస్తారని కోరుతున్నాము ​ప్రజా సంఘాల – ఐక్యవేదిక డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, అమలాపురం

ఆంధ్రప్రదేశ్

అక్బర్ పేట భూంపల్లి మండల పరిధిలో మోతే గ్రామంలో శనివారం రోజు సాయంత్రం గ్రామంలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది గ్రామంలో ఎదురైన ప్రతి వారిని చిన్న పిల్లల తో సహా ఆరుగురిని కరిచింది గ్రామస్తులను ఒక్కసారి భయాందోళనలకు గురిచేసింది గ్రామస్తులు ఆ కుక్కను వెళ్లగొట్టి గాయపడిన చికిత్స నిమిత్తం వారిని దుబ్బాక ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించడం జరిగింది

తిరుపతి

రాజీవ్ నగర్ స్పెషల్ డ్రైవ్ లోనైనా తప్పులు చేసిన అధికారులుపై చర్యలు ఉంటాయా..? లేదా..?

శ్రీకాళహస్తిలోని అన్నీ రాజకీయ పక్షాలకు, అధికారులకు, పాత్రికేయులకు కల్పతరువుగా మారిన రాజీవ్ నగర్ లో 2007 నుంచి జరిగిన అక్రమాలకు కారకులైన సంబంధిత అధికారులు, సిబ్బందిపై చర్యలు లేకపోవడంతో కేవలం ప్లాట్లు కొన్నవారు, విక్రయాలకు పాల్పడిన వారు, ఇళ్ళు కట్టుకున్న పేదలకు కూటమి ప్రభుత్వంలో నిద్రపట్టడం లేదనే విమర్శలు వున్నాయి. కూటమి ప్రభుత్వంలో ఇప్పటి వరకు రెండు మూడు పర్యాయాలు ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి జోక్యం చేసుకుని నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయడానికి మున్సిపల్, రెవిన్యూ అధికారులు,సచివాలయం సిబ్బంది ఇంటింటికి వెళ్లి రికార్డులు పరిశీలించిన విషయం తెలిసిందే. అయితే తిరిగి మళ్ళీ స్పెషల్ డ్రైవ్ పేరుతో రాజీవ్ నగర్ కు వెళుతున్న ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి నిజమైన లబ్ధిదారులకు న్యాయం చేయాలని, అక్రమాలు చేసిన వారికి, వారికి సహకరించిన అధికారులు, సిబ్బందిపై ఎక్కడున్నా జిల్లా కలెక్టర్ ద్వారా కఠిన చర్యలు తీసుకోవాలని రాజీవ్ నగర్ వాసులు, బాధిత కుటుంబాలు కోరుతున్నారు. అలా కాకుండా కేవలం విచారణ చేసి అర్హులుకు ఇంటి పట్టాలు ఇప్పించడం మంచిదే. అయినా అధికారులు పై చర్యలు లేకుంటే తిరిగి వచ్చే వారు మళ్ళీ అక్రమాలకు పాల్పాడే అవకాశం వుంది. అందువల్ల ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి రాజీవ్ నగర్ లో అక్రమాలకు పాల్పడిన, అందుకు సంహరించిన అధికారులు, సిబ్బంది పై కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి అక్రమాలు పునరావృతం కాకుండా చేయాలని రాజీవ్ నగర్ వాసులు కోరుతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లాలో KGBV హాస్టళ్లలో PGT, CRT గెస్ట్ టీచర్ పోస్టుల భర్తీ ప్రారంభం–APC వెంకట సుబ్బయ్య

నెల్లూరు జిల్లాలోని కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల (KGBV) లో PGT, CRT గెస్ట్ పోస్టులకు మహిళా అభ్యర్థుల నియామక ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నియామకానికి సంబంధించి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్ర శిక్షా ప్రాజెక్టు కోఆర్డినేటర్ వెంకటసుబ్బయ్య ఒక ప్రకటనలో తెలిపారు. లింగముద్రం, కందుకూరు, సీతారామపురం, కలిగిరి KGBV హాస్టళ్లలో ఖాళీలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఈ నెల 4వ తేదీ వరకు తమ దరఖాస్తులను సమర్పించవచ్చని పేర్కొన్నారు. ఎంపికైన ఉపాధ్యాయులకు గంటకు రూ.250 చెల్లింపు అందజేస్తారని తెలిపారు. ఈ నియామక ప్రక్రియ పారదర్శకంగా జరుగుతుందని, అర్హత కలిగిన మహిళా అభ్యర్థులు అవకాశం వినియోగించుకోవాలని అధికారులు సూచించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మహాప్రభో! ఈ ఐదు సంవత్సరాలు కందిపప్పు ఇవ్వలేదు – రేషన్‌ కార్డుదారుల ఆవేదన

ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుదారులకు మరోసారి నిరాశ. నవంబర్ నెలలో కూడా కందిపప్పు పంపిణీ జరగకపోవడం పేదలలో ఆవేదన కలిగించింది. గత ఏడు నెలలుగా కందిపప్పు సరఫరా నిలిచిపోవడంతో, ప్రజలు పప్పుతో అన్నం తినే పరిస్థితి లేకుండా పోయింది. ప్రభుత్వం పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా పేదలకు నిత్యావసరాలు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నా, టెండర్ల జాప్యం, సరఫరా లోపాలు కారణంగా కందిపప్పు ఇవ్వలేకపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో కందిపప్పు ధర రూ.100–120 కిలోకు చేరడంతో, పేదలు దాన్ని కొనుగోలు చేయడం కష్టమవుతోంది. రేషన్ డీలర్లు కూడా “స్టాక్ రాలేదు” అంటూ చేతులు ఎత్తేశారు. కూటమి ప్రభుత్వం మొదట్లో కొద్ది నెలలు పంపిణీ చేసినా, తూకం వివాదాల తర్వాత పంపిణీ నిలిపివేసి విచారణ చేశారు. అప్పటి నుంచి పప్పు పంపిణీ మళ్లీ ప్రారంభం కాలేదు. తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రభుత్వం నవంబర్ నెల రేషన్‌ను ముందుగానే ప్రారంభించినా, కందిపప్పు మాత్రం అందించలేకపోయింది. ప్రజలు ప్రభుత్వం వెంటనే స్పందించి, కందిపప్పు సరఫరా పునరుద్ధరించాలనీ కోరుతున్నారు.

రంగారెడ్డి

దాదాపు 40 కాలనీల ప్రజా రవాణా సౌకర్యం కోసం రూ. 4 కోట్ల నిధుల ప్రతిపాదన డిప్యూటీ ఫ్లోర్ లీడర్, కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి

పున్నమి నవంబర్ 02 ప్రతినిధి: రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ మండలం: మన్సూరాబాద్ డివిజన్, హయత్‌నగర్ పరిధిలోని బొమ్మలగూడి నుండి డబుల్ బెడ్ రూం, కుంట్లూరు, తట్టిఅన్నారం, నాగోల్ వైపు వెళ్లే ప్రధాన రహదారి అనేక సంవత్సరాల క్రితం నిర్మించబడింది. కాలక్రమేణా ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెంది, దాదాపు 30 నుండి 40 కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. అయితే బొమ్మల గుడి వద్ద నుండి డబల్ బెడ్ రూమ్ వరకు పాత రోడ్డు ప్రస్తుతం గుంతలమయంతో, రోడ్డంతా పాడవడంతో ఈ కాలనీల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యను గుర్తించిన జిహెచ్ఎంసి డిప్యూటీ ఫ్లోర్ లీడర్, స్థానిక కార్పొరేటర్ కొప్పుల నర్సింహ్మా రెడ్డి ఎల్బీనగర్ జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్ ఆయనను కలసి సమస్యను వివరించారు. దీనిపై స్పందించిన అధికారుల ఆదేశాల మేరకు ఈరోజు జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఈ.ఈ రమేష్ బాబు, డి ఈ కనకయ్య, డబ్ల్యు ఐ సీతారాం పర్యటించారు. ఈ పర్యటనలో కార్పొరేటర్ నర్సింహ్మా రెడ్డి కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు, అధికారులు కలిసి పాదయాత్రగా రహదారి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బొమ్మలగూడి నుండి నాగోల్ వరకు ఉన్న రహదారి పునర్నిర్మాణానికి దాదాపు రూ. 4 కోట్ల నిధులు, ఈ రోడ్డు పూర్తి అయిన తర్వాత సుమారు 40 కాలనీల ప్రజలు సులభంగా ప్రజా రవాణా సదుపాయాన్ని పొందగలరు. రాబోయే రోజుల్లో ఈ రహదారి విస్తరణ, సుందరీకరణ పనులు ప్రారంభమవుతాయి అని తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

2026 మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ

గ్రామీణ ప్రాంతాల్లో స్వామిత్వ హక్కుల కల్పన వేగవంతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గ్రామాల్లోని ఇళ్లు, షాపులు, స్థలాలకు యాజమాన్య హక్కులు కల్పించేందుకు “స్వామిత్వ కార్యక్రమం”ను వేగవంతం చేసింది. 2026 మార్చి నాటికి 45 లక్షల ఆస్తులకు ప్రాపర్టీ కార్డులు జారీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఏడాది డిసెంబర్ నాటికి క్షేత్రస్థాయి సర్వేలు పూర్తిచేయాలని అధికారులు ప్రణాళిక రూపొందించారు. ప్రస్తుతం 6 వేల గ్రామాల్లో డ్రోన్ల సాయంతో ఆస్తుల కొలతలు సేకరిస్తూ, ప్రతి ఇంటి సరిహద్దులు, పొడవు–వెడల్పు వివరాలను “ఆర్థో రెక్టిఫైడ్‌ ఇమేజ్‌” ఆధారంగా రికార్డు చేస్తున్నారు. ఇప్పటివరకు 43 లక్షల ఆస్తుల తనిఖీ పూర్తయింది. ప్రజల అభ్యంతరాలు స్వీకరించిన తర్వాత ప్రాపర్టీ కార్డులు పంపిణీ చేయనున్నారు. ఈ కార్డులు ద్వారా ప్రజలు తమ ఆస్తులపై పూర్తి యాజమాన్య హక్కులు పొందుతారు. ఇళ్లు, స్థలాలు సులభంగా అమ్మకాలు–కొనుగోళ్లు చేయవచ్చు. బ్యాంకు రుణాలు, వారసత్వ బదిలీలు కూడా సులభతరం అవుతాయి. రాష్ట్రవ్యాప్తంగా సచివాలయాలు, పంచాయతీ కార్యాలయాల్లో ఆస్తుల జాబితాలు ప్రదర్శిస్తూ, లోపాలను ప్రజల సూచనలతో సరిచేస్తున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థిక కార్యకలాపాలు పెరగనున్నాయని ప్రభుత్వం ఆశిస్తోంది.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.