Monday, 6 April 2026

Blog

ఖమ్మం

ఖమ్మం బిజెపి టూ టౌన్ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా జ్యోతుల యుగంధర్ నాయుడు నియామకం

పువ్వాడ నాగేంద్ర కుమార్ (పున్నమి తెలంగాణ ప్రతి నిధి) భారతీయ జనతా పార్టీ ఖమ్మం టూ టౌన్ కార్యనిర్వాహక ప్రధాన కార్యదర్శిగా శ్రీ జ్యోతుల యుగంధర్ నాయుడు గారిని నియమించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ — బిజెపి సిద్ధాంతం, ఆదర్శాలకు అంకితమై, నీతి, నిజాయితీ, నిబద్ధత, చిత్తశుద్ధి, క్రమశిక్షణతో వ్యవహరిస్తూ సహచర కార్యకర్తలు, పార్టీ కమిటీలతో కలిసి అన్ని కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటానని తెలిపారు. ఖమ్మం టూ టౌన్ ప్రజా సమస్యలను గుర్తించి ఉద్యమాలు చేపట్టి, పార్టీని సంస్థాగతంగా బలపరచి అన్ని వర్గాలలో విస్తరించేందుకు కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. తనపై నమ్మకంతో ఈ బాధ్యత అప్పగించిన ఖమ్మం అధ్యక్షులు ధనియకుల వెంకటనారాయణ గారికి, జిల్లా బిజెపి అధ్యక్షులు నెల్లూరి కోటేశ్వరరావు గారికి, సీనియర్ నాయకులు గెంటేల విద్యాసాగర్, ఒక్కలంక సుబ్రహ్మణ్యం, మేకల నాగేందర్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్ గారికి, ఖమ్మం టూ టౌన్ నాయకులకు, మరియు ఖమ్మం జిల్లా బిజెపి నాయకులందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్

ఎర్రన్నా .. నిన్ను మరువలేమన్నా ..! నిమ్మాడలో ఘనంగా దివంగత నేత మాజీ కేంద్రమంత్రి కింజరాపు ఎర్రన్నాయుడు 13 వర్థంతి

శ్రీ‌కాకుళం జిల్లా కోట‌బొమ్మాళి మండ‌లం, నిమ్మాడలో గ్రామంలో, దివంగత మాజీ కేంద్రమంత్రి ఎర్రన్నాయుడు గారి 13 వర్థంతి కార్యక్రమం ఆదివారం ఘనంగా జరిగింది. ఎర్రన్నాయుడు గారి ఘాట్ వద్ద కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి నివాళులు‌ అర్పించిన రాష్ట్ర వ్య‌వ‌సాయ శాఖ మంత్రి కింజ‌రాపు అచ్చెన్నాయుడు గారు, ఎర్ర‌న్నాయుడు గారి సతీమణి విజయలక్ష్మి, కుమారుడు కేంద్ర పౌర‌వ విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్‌నాయుడు, సోదరులు పీఎసీఎస్ మాజీ అధ్యక్షులు కింజరాపు హరివర ప్రసాద్ గారు, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఓ ఎస్ డి కింజరాపు ప్రభాకర్ గారు , ఎర్రన్నాయుడు ఘాట్ వద్ద నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలాస మాజీ శాసనసభ్యులు గౌతు శ్యాంసుందర్ శివాజీ, శాసన సభ్యులు బండారు సత్యనారాయణమూర్తి, శ్రీకాకుళం శాసన సభ్యులు గొండు శంకర్,పార్లమెంటు సభ్యుడు కలిశెట్టి అప్పలనాయుడు,మాజీ శాసన మండలి సభ్యులు విశ్వప్రసాద్, కూటమి నాయకులు హాజరై ఎర్రన్నాయుడు గారితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుని ఘాట్ వద్ద నివాళులు అర్పించారు.

హైదరాబాద్

ఘనంగా బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి ఎస్సీ ఎస్టీ హెల్పర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 227వ వారం.. బహుజన ఆర్టీసీ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్.

పున్నమి అక్టోబర్ 02 హైదరాబాద్ తార్నాక చింతల్ బస్తీలో గల ప్రపంచ మేధావి బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారివిగ్రహానికి ప్రతి ఆదివారం పూలమాల వేస్తూ నివాళులర్పించడం జరిగింది. ఇది 227 వ వారం చింతల్ బస్తి పెద్దలు మాట్లాడుతూ కన్న కలలు ఏం చేయాలని ఆలోచన భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి ఈ దేశ మూలవాసులు అంతా ఏకమై రాజకీయంగా ఎదగడానికి ముందుకు రావాలని ఎవరి జెండా మోసిన జండా కాడే ఉంచుతారు ముందుకు సాగనివ్వరు కాబట్టి ఇప్పటికైనా బహుజన్లు మహాత్మా జ్యోతిరావు పూలే అంబేడ్కర్ కాన్సిరాం అందర్నీ ఏకం చేస్తూ ముందు పోతామని మాట్లాడినటువంటి వక్తలు తెలియజేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్లు టి లక్ష్మణ్ గూడా నర్సింగ్ రావు, ఎండి అఫ్సర్ బాయ్, టి లక్ష్మణ్, టీ నర్సింగ్ రావు, బహుజన ఆర్టిసి యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుద్దాల సురేష్ తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం

ఇది ముమ్మాటికీ పిరికి పంద చర్య

భద్రాద్రి జిల్లా మణుగూరు బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై కాంగ్రెస్ నాయకుల దాడిని వైరా నియోజకవర్గ బిఆర్ఎస్ పార్టీ నాయకులు లకావత్ గిరిబాబు తీవ్రంగా ఖండించారు. ఇది ఇందిరమ్మ రాజ్యం కాదు రౌడీల రాజ్యం ప్రజల పక్షాన ప్రశ్నిస్తే దాడి చేస్తారా, ఈ దాడి ఓ పిరికిపంద చర్య అని మండిపడ్డారు. పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు కాంగ్రెస్ గుండాలతో బిఆర్ఎస్ పార్టీ కార్యాలయం పై దాడి చేశారని, పోలీసులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషించారని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటున్న ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా ఆని ప్రశ్నించారు. లా అండ్ ఆర్డర్ అదుపు తప్పడానికి సీఎం రేవంత్ రెడ్డి కారణమని విమర్శించారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ విధంగా వ్యవహరిస్తున్నారో అదేవిధంగా ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు వ్యవహరిస్తారు. గత బీఆర్ఎస్ పాలనలో ఎన్నడూ ఇలాంటి దాడులు జరగడంలేదని గుర్తుచేసారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంపై దాడి చేసిన వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

తిరుపతి

*మిధునం వెజ్ రెస్టారెంట్ ను ప్రారంభించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు

* తిరుపతి బస్ స్టాండ్ సమీపంలో మిధునం వెజ్ రెస్టారెంట్ ను ఆదివారం తుడా ఛైర్మన్, తితిదే ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి,ప్రారంభించారు. * ఈ సందర్భంగా తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారిని నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఆయన యజమానులకు,సిబ్బందికి శుభాకాంక్షలు తెలిపారు.

భద్రాద్రి కొత్తగూడెం

భద్రాచలానికి మద్యం పాలసీ వద్దు బాబోయ్

దోచుకోవటానికి సిద్ధంగా ఉన్న మద్యం సిండికేట్ భద్రాచలానికి మద్యం పాలసీ వద్దంటున్న ప్రజలు పున్నమి ప్రతినిధి- భుక్యా వినోద్ కుమార్ 02-11-2025, భద్రాచలం బార్లు తెరిచి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దు మద్యం దుకాణాలు అభివృద్ధికి ఆటంకాలు నిండు ప్రాణాలు బలిగొంటున్న మద్యం మహమ్మారి నోరు మెత పని ప్రధాన రాజకీయ నాయకులు తాగిన మత్తులో అలజడి సృష్టిస్తున్న గ్యాంగ్ వార్లు భద్రాచలం ఏజెన్సీ ప్రాంతంలో మద్యం టెండర్లను రద్దు చేయాలని భద్రాచలానికి మద్యం దుకాణాలకు అనుమతులు ఇవ్వద్దని భద్రాచలం పట్టణ ప్రజలు ముక్తకంఠంతో గళ మెత్తుతున్నారు. ఇప్పటికే ఈ ప్రాంతంలో గత మద్యం పాలసీ వలన యువకులు మద్యం తాగి గ్యాంగ్ వార్లకు ప్రధాన కారణం మద్యం మహమ్మారి అవుతుంది. మద్యం దుకాణాలు అలాగే గల్లీకో బెల్ట్ షాపు ఏర్పాటు చేయడం వలన వీధి వీధినా యువకులు, విద్యార్థులు గొడవలు, కొట్లాటలు నిత్యం భద్రాచలం ప్రాంతంలో అలజడ్లకు కేంద్రంగా మారింది. అలాగే యువకులు మద్యం మత్తులో డ్రైవింగ్ చేయడం వలన అనేకమంది ప్రాణాలు కోల్పోయిన సంఘటనలు ఈ ప్రాంతంలో చోటు చేసుకున్నాయి. తాగిన మత్తులో కత్తులతో దాడులు చేసుకున్న సంఘటనలు ఉన్నాయి. ఈమధ్య దుకాణదారులు సిండికేట్ గా ఏర్పడి ఎక్కడబడితే అక్కడ మద్యాన్ని ఏరులై పారించటం డబ్బుల వ్యామోహంలో చట్టాన్ని కూడా తమ చేతిలోకి తీసుకొని ఇష్టానుసారంగా మద్యం అమ్మకాలను చేపడుతున్నారు విద్యార్థులు కూడా మద్యానికి బానిసై చదువులు మధ్యలోనే ఆపే పరిస్థితి కూడా ఈ ప్రాంతంలో చోటుచేసుకుంది మద్యం లైసెన్స్ దారులు బినామీలుగా మారటం వలన అగ్రవర్ణ బడా వ్యాపారస్తులు ఇదే అదునుగా భావించి లైసెన్సును కొనుగోలు చేసుకుని వారికి నచ్చిన విధంగా మద్యం అమ్మకాలు కొనసాగిస్తున్నారు అధికారులు కూడా చూసి చూడనట్టు వ్యవహరించడం వలన ఈ ప్రాంతంలో భారీ నష్టం చోటు చేసుకుంటుంది. నిత్యం ప్రజలు భయం గుప్పెట్లో బ్రతికే పరిస్థితి కనిపిస్తుంది. ఏ ప్రాంతంలో ఏం జరుగుతుందో ఎక్కడ ఏ వార్త వినాల్సి వస్తుందోనని అనుక్షణం ఒక గండం గా గడుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ ప్రాంతం రాముడు సంచరించిన ప్రాంతంగా చెప్పబడుతుంది. కానీ ఈ ప్రాంతంలో మద్యం సిండికేట్ చీకటి వ్యాపారం వలన ఈ ప్రాంతానికి ఉన్న విశిష్టత కోల్పోవడం చాలా బాధాకరంగా చెప్పవచ్చు అందుకనే భద్రాచలం ప్రాంతాన్ని మద్యం పాలసీ నుండి ఉపసంహరించాలని ఈ ప్రాంతానికి ఉన్న పేరు ప్రతిష్టను కాపాడే బాధ్యత అధికారుల పైన ఉందని స్థానిక ప్రజలు వారి వాదనను వినిపిస్తున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ ఈ విషయంపై పునర ఆలోచన చేసి ఈ ప్రాంత ప్రజల మనోభావాలను దెబ్బతీయకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆధ్యాత్మిక భావంతో ఈ ప్రాంతం విరాజుల్లుతుందని కానీ ఈ మద్యం బారినపడిన యువకుల వలన అనేక అనర్థాలకు దారితీస్తుందని ప్రజానీకం వారి ఆవేదన వ్యక్తపరుస్తున్నారు. సంఘటనలు జరుగుతున్నప్పుడల్లా స్టేషన్లో పెట్టి కేసులు బనాయించడం మరల వాళ్లు బయటకి రావడం పరిపాటిగా మారిందని సంఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయని ప్రజలు ఈ ప్రాంత క్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని మద్యం టెండర్ల ప్రక్రియను భద్రాచలానికి మినహాయించి భద్రాచలం ఔన్నత్యాన్ని కాపాడాలని కోరుతున్నారు.

తిరుపతి

*భారత మహిళా క్రికెట్ జట్టు విజయం కోసం తిరుమలలో పూజలు నిర్వహించిన తుడా చైర్మన్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు

భారత మహిళా క్రికెట్ జట్టు దక్షిణాఫ్రికా మధ్య వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ సందర్భంగా తుడా ఛైర్మన్, తితిదే ఎక్స్ అఫిషియో మెంబర్ డాలర్స్ దివాకర్ రెడ్డి గారు తిరుమల శ్రీవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. * *అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ,“భారత మహిళా క్రికెట్ జట్టు ఈ రోజు దక్షిణాఫ్రికాతో ఫైనల్ పోటీలో తలపడుతోంది.ఈ స్థాయికి చేరుకోవడం జట్టు కృషి, క్రమశిక్షణ, క్రీడాస్ఫూర్తికి నిదర్శనం. మ్యాచ్ ఫలితమేమైనా, వారి ప్రదర్శన భారత క్రీడా చరిత్రలో గర్వకారణం అవుతుంది,” అని తెలిపారు.* * *యువత క్రీడలవైపు మరింత ఆకర్షితులు కావాలని, మహిళలు ప్రతి రంగంలో ప్రతిభ చాటుతున్నారని ఆయన అన్నారు. భారత జట్టు విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ, ఆటగాళ్లు, కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ అందరికీ ఆయన శుభాకాంక్షలు తెలిపారు.* ఈ కార్యక్రమంలో రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ కుమార్, ఉమ్మడి చిత్తూరు జిల్లా సెక్రటరీ సతీష్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

నారాయణపేట

నెల రోజులు గడుస్తున్న పట్టించుకోని మున్సిపాలిటీ సిబ్బంది.

పున్నమి ప్రతినిధి: నారాయణపేట జిల్లా నవంబర్2 నెల రోజులు గడుస్తున్న పట్టించుంచికోని మున్సిపాలిటీ సిబ్బంది క్రిష్ణ మండలంలోని అలంపల్లి గ్రామంలో ప్రభుత్వ పాఠశాల ముందు కానీ ఇంకా ఊర్లో వీధి వీధుల్లో ఇలా చెత్త తో కూడిన మోర్లే ఉన్నాయి…. నెల రోజులు గడుస్తున్న పట్టించుకోని పంచాయతీ సిబ్బంది. పాఠశాల ముందు ఐతే మరి అధ్వానంగా మారినాయి రోజు కంపు కొడుతున్న మోరీలు మురికి నీరు వచ్చి చేరి అక్కడే జామై చెత్తాచెదారంతో నిండిపోయి దోమలు వాలుతున్నాయి, పాఠశాల విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయి, అయినా కూడా పంచాయతీ సిబ్బంది మున్సిపాలిటి వాళ్ళు ఇంకా పట్టించుకోకపోవడం పై కారణం తెలియాల్సి ఉంది ఇప్పటికైనా గ్రామ సిబ్బంది వాళ్లు పట్టించుకోని ఈ డ్రైనేజీ వాటర్ ను క్లియర్ చేయవలసిందిగా కోరుతున్న గ్రామ ప్రజలు, ఇలాగే ముందు ముందు కొనసాగితే పై ఆఫీసర్లకు కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది అని గ్రామ పెద్దలు తెలపడం జరిగింది.

ఖమ్మం

మధిర లోతట్టు ప్రాంతాల వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం దిశగా చర్యలు – జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

పున్నమి ప్రతి నిధి ఖమ్మం ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని లోతట్టు ప్రాంతాల్లో ప్రతి వర్షాకాలంలో ఎదురయ్యే వరద ముంపు సమస్యలకు శాశ్వత పరిష్కారం కోసం సమగ్ర ప్రణాళికతో చర్యలు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశాల మేరకు కలెక్టర్ మధిర మున్సిపాలిటీ పరిధిలోని హనుమాన్ నగర్, ముస్లిం కాలనీలలో వరద ప్రభావిత ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ప్రజలతో మాట్లాడి, వర్షకాలంలో ఎదురవుతున్న ఇబ్బందులను వివరంగా తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను నాణ్యతతో సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. పెద్ద చెరువు బ్యాక్ వాటర్ ప్రభావాన్ని తగ్గించేందుకు సంరక్షణ కాల్వర్టర్లు మరియు స్టామ్ వాటర్ డ్రైన్ల నిర్మాణానికి ప్రతిపాదనలు సమర్పించాలని ఇరిగేషన్ అధికారులను సూచించారు. అలాగే, పట్టణంలోని చెత్తను పూర్తిగా డంపింగ్ యార్డ్‌కు తరలించి రహదారుల వెంట చెత్త కనిపించకుండా చర్యలు తీసుకోవాలని మున్సిపల్ అధికారులను ఆదేశించారు. తదనంతరం మున్సిపల్ కార్యాలయంలో రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్&బీ, మున్సిపల్ శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించి, పట్టణ అభివృద్ధి పనులు మరియు వరద నియంత్రణ చర్యలను పర్యవేక్షించారు. ఈ సమావేశంలో ఇరిగేషన్ డిఇ నాగబ్రహ్మం, ఆర్&బీ డిఇ శంకర్, తహసీల్దార్ రాంబాబు, మున్సిపల్ కమిషనర్ సంపత్ తదితర అధికారులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

నెల్లూరు జిల్లా వైసీపీ యూత్ అధ్యక్షుడు పర్యటన

సీతారామపురం మండలంలో నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ అధ్యక్షుడు ఊటుకూరు నాగార్జున ఆదివారం పర్యటించారు. నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సిపి యూత్ వింగ్ జాయింట్ సెక్రటరీ పాలగిరి ముద్దుకృష్ణమరాజు ఆహ్వానం మేరకు ఊటుకూరు నాగార్జున సీతారామపురం మండలానికి వచ్చారు. సీతారామపురం బస్టాండ్ సెంటర్ వద్ద ఊటుకూరు నాగార్జునకు పాలగిరి ముద్దు కృష్ణంరాజు శాలువా కప్పి ఘన స్వాగతం పలికారు. అనంతరం బస్టాండ్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్ఆర్సిపి యువతను పేరుపేరునా పలకరించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అతి త్వరలోనే ఉదయగిరి నియోజకవర్గ వైఎస్ఆర్సిపి సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డి సమక్షంలో ఉదయగిరి నియోజకవర్గం అంతటా వైఎస్ఆర్సిపి యువతతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. కూటమి వైఫల్యాలను, మోసాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి వైసిపి హయాంలో జగనన్న చేసిన మంచి పనులను ప్రజలకు వివరించాలన్నారు. ప్రతి వైఎస్ఆర్సిపి కార్యకర్తకు వైఎస్ఆర్సిపి నాయకులు, మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తోడుగా అండగా ఉంటారన్నారు. ఇప్పటినుండి ప్రతి కార్యకర్త యువత గ్రామస్థాయి నుండి వైఎస్ఆర్సిపిని బలోపేతం చేసి ఉదయగిరి ఎమ్మెల్యేగా మేకపాటి రాజగోపాల్ రెడ్డిని ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డిని చేసుకొనే వరకు కష్టపడాలన్నారు. అనంతరం గుండుపల్లి గ్రామంలోని వైసీపీ సీనియర్ నాయకుడు మాచిరాజు వెంకటేశ్వరరాజు మేనల్లుడు వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి యువ నాయకులు ఏనుగుల రూపేష్, తెల్ల గొల్ల సిద్దయ్య,మంకెన సురేంద్ర, షేక్. జమీర్, ఓంకారం శ్రీహరి రాజు, ఎస్. నారాయణ రాజు, పవన్ కుమార్, సునీల్, కాజా నాయబ్, రఘు, వినోద్, మస్తాన్, షబ్బీర్, అల్లూరయ్య, అలీ, చంటి, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.