Monday, 6 April 2026

Blog

E-పేపర్

వైన్ షాపు వచ్చె.. టీచర్ ఉద్యోగం పాయె

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 వైన్ షాపు వచ్చె.. టీచర్ ఉద్యోగం పాయె తెలంగాణ : మద్యం టెండర్లలో పాల్గొన్న మహిళా టీచరు ఉద్యోగo పోయింది. ఈ ఘటన మహబూబ్నగర్ లో చోటుచేసుకుంది. రాంనగర్ బాలికల పాఠశాల పీఈటీ పుష్ప…. మద్యం టెండర్లో పాల్గొని, ధర్మపూర్ వైన్ షాప్ దక్కించుకుంది. అయితే, ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి టెండర్లకు అర్హులు కాదని నిబంధనలు ఉండటంతో ఫిర్యాదులు వచ్చాయి. దీనిపై విచారణ చేపట్టిన విద్యా శాఖ అధికారులు.. పీఈటీ పుష్పను సస్పెండ్ చేశారు.

అల్లూరి సీతారామరాజు

కాశీబుగ్గ దేవాలయ ఘటన బాధాకరం : అరకు ఎమ్మెల్యే రేగం

అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:02 శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కిసిలాట ఘటనలో భక్తులు దుర్మరణం చెందడం పట్ల వారికి సానుభూతి వ్యక్తం చేస్తూ,వారి ఆత్మకు సంపూర్ణ శాంతి చేకూరాలని ఆకాంక్షిస్తూ అరకు ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం గారి ఆధ్వర్యంలో అరకులోయ ప్రధాన కూడలిలో కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో మరణించిన వారి ఆత్మలకు శాంతి కలగాలని మరియు ఈ ఘటన లో నష్టపోయిన కుటుంబాలకు సంఘీభావంగా శాంతియుత కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ అరకులోయ మండల పార్టీ అధ్యక్షుడు స్వాభి రామ్మూర్తి, మాజీ విశాఖపట్నం జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షుడు కమ్మిడి అశోక్, వైసీపీ అరకులోయ మండల పార్టీ ఉపాధ్యక్షుడు విజయ్ కుమార్, వైసీపీ అరకు నియోజకవర్గం బీసీ సెల్ అధ్యక్షుడు నరసింగ రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి శెట్టి అప్పాలు, బస్కి గ్రామపంచాయతీ సర్పంచ్ రమేష్, మడగడ గ్రామ పంచాయతీ సూపర్ సర్పంచ్ బాలరాజు, సుంకర మెట్ట గ్రామ పంచాయతీ అధ్యక్షుడు కొర్ర అర్జున్ రావు, వైసిపి నేతలు గుంజేడి ప్రసాద్, కామేష్, లబుడు బారికి కిరణ్ కుమార్, బంగురు శాంతి, శేఖర్, పంచాడి తిరుపతి రావు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

శ్రీశ్రీశ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర గోడ పత్రికను ఆవిష్కరించిన ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 రోజు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంవర్గం- మంచాల మండలం లోని ఆరుట్ల గ్రామంలో నవంబర్ 5 వ తేదీ నుండి ప్రారంభం కానున్న శ్రీశ్రీశ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి జాతర గోడ పత్రికను ఆవిష్కరించిన ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు శ్రీ మల్ రెడ్డి రంగారెడ్డి

రంగారెడ్డి

మీర్పేట్ పద్మశాలి సంక్షేమ సంఘం అధ్యక్షులుగా పాలాది చైతన్య

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని ఆదివారం మీర్పేట్ పద్మశాలి సంక్షేమ సంఘం నూతన కార్యవర్గమును ఎన్నుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వ్యవస్థాపక అధ్యక్షులు గంజి శ్రీనివాస్ హాజరై నూతన కార్యవర్గం ఎన్నుకోవడం జరిగింది మీర్పేట్ పద్మశాలి సంక్షేమ సంఘం నూతన అధ్యక్షునిగా పాలాది చైతన్యను నియమిస్తున్నట్టు తెలిపారు యువకుడు కుల సంఘానికి సేవ చేయడానికి ఆసక్తిగా ఉన్నాడని గమనించి అతనికి సంఘం అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తున్నట్లు తెలియజేశారు కార్యదర్శిగా గద్దె బాలరాజ్ కోశాధికారిగా గద్దె సుధాకర్ ఎన్నుకోవడం జరిగింది ఈ సందర్భంగా వ్యవస్థాపక అధ్యక్షులు గంజి శ్రీనివాస్ మాట్లాడుతూ పద్మశాలి సంక్షేమ సంఘం2023 ఏర్పాటు చేశానని పద్మశాలీల అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తానని అన్నారు నూతనంగా ఎన్నికైన అధ్యక్షులు పాలాది చైతన్య యువకుడని ఆయన నాయకత్వంలో సంఘం అభివృద్ధి చెందుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

అల్లూరి సీతారామరాజు

పకృతి వ్యవసాయ పద్ధతులకు ప్రాధాన్యం — రైతు సాధికారిక సంస్థ సీఈవో టి. బాబురావు నాయుడు

గూడెం కొత్తవీధి(పున్నమి ప్రతినిధి), నవంబర్: 2 ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పకృతి వ్యవసాయ పద్ధతులను పెద్దఎత్తున ప్రోత్సహించేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని, పకృతి వ్యవసాయంలో పండిస్తున్న పంటలకు ప్రీమియం ధరలు లభించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని ఆంధ్రప్రదేశ్ రైతు సాధికారిక సంస్థ సీఈవో టి. బాబురావు నాయుడు తెలిపారు. గిరిజన వికాస్ స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో గూడెం కొత్తవీధి మండలంలోని దామనాపల్లి, దేవరపల్లి, పెదవలస పంచాయతీల పరిధి గ్రామాల్లో పకృతి వ్యవసాయ పద్ధతులను అమలు చేస్తున్న రైతులను ఆయన సందర్శించి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పకృతి వ్యవసాయం భూమికి, రైతుకి మేలు చేసే విధానం అని, దీన్ని మరింత విస్తృతంగా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పలు పద్ధతులను అవలంబిస్తోందని పేర్కొన్నారు. పకృతి పద్ధతుల్లో పండిన పంటలకు స్థిరమైన మార్కెటింగ్ వ్యవస్థను ఏర్పరచేందుకు చర్యలు ప్రారంభించామని చెప్పారు. పెదవలస పంచాయతీ టెంట్ల వీధిలో గిరిజన రైతులు రైజ్డ్ బెడ్ పద్ధతిలో సాగు చేస్తున్న పసుపు పంటలను పరిశీలించి రైతులను అభినందించారు. అనంతరం దేవరపల్లి పంచాయతీ చుట్టుగుంది గ్రామాన్ని సందర్శించి, పకృతి విధానంలో సాగు చేస్తున్న వరి పంటలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో అల్లూరి సీతారామరాజు జిల్లా డీపీఎం భాస్కర్ రావు, గిరిజన వికాస్ సెక్రటరీ నెల్లూరు వెంకట సత్యనారాయణ, ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ యమున, రమ్య తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం

*# BR NEWS 99 #* పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 హైదరాబాద్‌లో పలుచోట్ల భారీ వర్షం కూకట్‌పల్లి, ఫిల్మ్‌నగర్‌, జూబ్లీహిల్స్‌, బంజారాహిల్స్‌లో వర్షం. మియాపూర్‌, చందానగర్‌, జీడిమెట్లలో వాన. పంజాగుట్ట, అమీర్‌పేట్‌, బేగంపేట్‌లో వర్షం

నిర్మల్

*భువన జాతీయ క్రీడాకారిణిగా ఎదగడం నిర్మల్ కు గర్వకారణం – శ్రీహరి రావు.*

నిర్మల్ నవంబర్ (పున్నమి ప్రతినిధి) క్రికెట్, సాఫ్ట్బాల్, బేస్బాల్ క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదిగిన నిర్మల్ మండలం మేడిపల్లికి చెందిన పోతుగంటి భువనను డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు, ఏఎంసీ ఛైర్మన్ భీమిరెడ్డి సన్మానించారు. మారుమూల గ్రామం నుంచి ఎదగడం నిర్మల్ జిల్లాకే గర్వకారణంగా నిలిచిందని శ్రీహరి రావు కొనియాడారు. అనంతరం భువనకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈటేల శ్రీనివాస్, కుంట పద్మాకర్, కుంట వేణు గోపాల్, కొట్టే శేఖర్, కాండ్లి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

*భువన జాతీయ క్రీడాకారిణిగా ఎదగడం నిర్మల్ కు గర్వకారణం – శ్రీహరి రావు.*

నిర్మల్ నవంబర్ (పున్నమి ప్రతినిధి) క్రికెట్, సాఫ్ట్బాల్, బేస్బాల్ క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదిగిన నిర్మల్ మండలం మేడిపల్లికి చెందిన పోతుగంటి భువనను డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు, ఏఎంసీ ఛైర్మన్ భీమిరెడ్డి సన్మానించారు. మారుమూల గ్రామం నుంచి ఎదగడం నిర్మల్ జిల్లాకే గర్వకారణంగా నిలిచిందని శ్రీహరి రావు కొనియాడారు. అనంతరం భువనకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈటేల శ్రీనివాస్, కుంట పద్మాకర్, కుంట వేణు గోపాల్, కొట్టే శేఖర్, కాండ్లి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నిర్మల్

*భువన జాతీయ క్రీడాకారిణిగా ఎదగడం నిర్మల్ కు గర్వకారణం – శ్రీహరి రావు.*

నిర్మల్ నవంబర్ (పున్నమి ప్రతినిధి) క్రికెట్, సాఫ్ట్బాల్, బేస్బాల్ క్రీడల్లో జాతీయ స్థాయికి ఎదిగిన నిర్మల్ మండలం మేడిపల్లికి చెందిన పోతుగంటి భువనను డీసీసీ అధ్యక్షుడు శ్రీహరి రావు, ఏఎంసీ ఛైర్మన్ భీమిరెడ్డి సన్మానించారు. మారుమూల గ్రామం నుంచి ఎదగడం నిర్మల్ జిల్లాకే గర్వకారణంగా నిలిచిందని శ్రీహరి రావు కొనియాడారు. అనంతరం భువనకు రూ.10 వేల ఆర్థిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో ఈటేల శ్రీనివాస్, కుంట పద్మాకర్, కుంట వేణు గోపాల్, కొట్టే శేఖర్, కాండ్లి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

మాజీ మంత్రి గొల్లపల్లి. జోగి రమేష్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను

మాజీ మంత్రి జోగి రమేష్ గారి అరెస్టు పూర్తిగా అక్రమం, ఇది రాజకీయ కక్షసాధింపు చర్య – మాజీ మంత్రి గొల్లపల్లి. జోగి రమేష్ గారి అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేయడానికే ఈ అరెస్టు. కక్షసాధింపు చర్యలకు కేరాఫ్ అడ్రస్ చంద్రబాబు నాయుడు. మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ గారిని కల్తీ మద్యం కేసులో అరెస్టు చేయడం అత్యంత అన్యాయం, రాజకీయ దురుద్దేశపూర్వక చర్య అని, ఇది పూర్తిగా కూటమి ప్రభుత్వ కక్షసాధింపు రాజకీయమని మాజీ మంత్రి, రాజోలు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ శ్రీ గొల్లపల్లి సూర్యారావు గారు అన్నారు నకిలీ మద్యం వ్యవహారంలో జోగి రమేష్ గారికి ఏ విధమైన సంబంధం లేకపోయినా, కూటమి ప్రభుత్వం ప్రతీకార రాజకీయాల పంథాలో నడుస్తూ, బీసీ వర్గానికి చెందిన నాయకుడిని లక్ష్యంగా చేసుకుందని గొల్లపల్లి విమర్శించారు. జోగి రమేష్ గారు ఇప్పటికే విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా ప్రమాణం చేసి తన నిర్దోషిత్వాన్ని ప్రజల ముందు నిరూపించారు. అయినప్పటికీ, చంద్రబాబు ప్రభుత్వం తమ పాలనా వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ఈ అక్రమ అరెస్టు నాటకం ఆడుతోందని ఆమె అన్నారు. గత 18 నెలలుగా కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ కాలంలోనే బయటపడిన నకిలీ మద్యం, లిక్కర్ మాఫియా వ్యవహారాలు బహిర్గతమయ్యాయి. పట్టుబడ్డవారిలో టీడీపీకి చెందిన నేతలు, అభ్యర్థులు, మంత్రులు, లోకేష్‌కు సన్నిహితులు ఉన్నప్పటికీ, వారిపై ఏ చర్యలూ తీసుకోలేదని సూర్యారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. లేని లిక్కర్ స్కామ్‌లను సృష్టించి, తప్పుడు విచారణలు జరిపి, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను అక్రమంగా అరెస్ట్ చేయడం కూటమి ప్రభుత్వానికి రాజకీయ పద్ధతిగా మారిందని పేర్కొన్నారు. ఇదంతా కాశీబుగ్గ ఆలయంలో జరిగిన తొక్కిసలాట ఘటనలో ప్రభుత్వ వైఫల్యాన్ని, అలాగే మొంథా తుపాన్ వల్ల తీవ్రంగా నష్టపోయిన రైతుల గోడును ప్రజల దృష్టి నుండి మళ్లించడానికే చేసిన కుట్ర అని సూర్యారావు గారు విమర్శించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.