Monday, 6 April 2026

Blog

అల్లూరి సీతారామరాజు

వైసీపీ శవరాజకీయాలు మానుకోవాలి: రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్

శ్రీకాకుళం జిల్లా, పలాస మండలం కాశీబుగ్గలో దైవ సన్నిధిలో తొక్కిసలాట వల్ల ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు దైర్యం చెప్పవలసింది పోయి దానిని వైసీపీ పార్టీ నాయకులు రాజకీయం చేయడం దురదృష్టకారమని అరకు పార్లమెంట్ అధ్యక్షులు, రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ అన్నారు. పాడేరు పార్టీ కార్యాలయంలో ఆదివారం ప్రత్యేక విలేకరుల సమావేశం ఏర్పాటు జీసీసీ చైర్మన్ మాట్లాడారు. కార్తీకమాసం కావడంతో భక్తులందరు దైవ దర్శనం కోసం అధిక సంఖ్యలో వెళ్ళటం వల్ల తొక్కిసలాట జరిగి భక్తులు మరణించడం తీవ్ర దిగబ్రాంతికి లోనయ్యామని కిడారి పేర్కొన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి భాధిత కుటుంబాలను పరామర్శించడం, ఓదార్చడం, బాధిత కుటుంబాలను ఆదుకొనే కార్యక్రమం చేస్తుందని జీసీసీ చైర్మెన్ చెప్పారు. పచ్చకామార్లు ఉన్నవాడికి లోకమంత పచ్చగా కనిపించినట్టు ఏ సందర్బంలో అయినా లేక ఏ పరిస్థితిలో అయినా ఎవ్వరు మరణించిన ప్రభుత్వంపై నిందలు మోపడం తప్ప మరి ఏ పని వైసీపీ పార్టీకి లేదని వైసీపీ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బాధిత కుటుంబాలకు భరోసా ఇచ్చి దైర్యం ఇవ్వాలి తప్ప శవరాజకీయాలు మానుకోవాలని కిడారి అన్నారు. ఇప్పటికే రాష్ట్ర, కేంద్ర మంత్రులు నారా లోకేష్, కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రభుత్వం బాధిత కుటుంబాలకు అండగా నిలుస్తుందని తెలిపినట్లు జీసీసీ చైర్మన్ తెలియజేశారు. రాష్ట్ర కూటమి ప్రభుత్వనికి సలహాలు సూచనలు ఇచ్చే విధంగా ఉండాలి తప్పితే శవరాజకీయాలు నుండి వైసీపీ పార్టీ నాయకులు బయిటికి రావాలని వైసీపీ పార్టీకి రాష్ట్ర జీసీసీ చైర్మన్ కిడారి శ్రావణ్ కుమార్ హితావు పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి బాకూరు సర్పంచ్ బాకూరు వెంకటరమణ రాజు, మాజీ జడ్పీటీసీ సాగర సుబ్బారావు, దారెలా సర్పంచ్ పాంగి పాండురంగ స్వామి, శోభకోట సర్పంచ్ పలాసి శశి భూషణం నాయుడు, మాజీ సర్పంచ్ వంతల పూర్ణ, తదితరులు పాల్గొన్నారు.

అల్లూరి సీతారామరాజు

సందర్శకులతో కళకళలాడిన అరకులోయ గిరిజన మ్యూజియం

అరకులోయ(పున్నమి ప్రతినిధి), నవంబర్:02, అరకులోయకు ఆదివారం పర్యాటకుల తాకిడి పెరిగింది. కార్తిక మాసం కావడంతో పర్యాటకుల తాకిడి పెరిగిందని గిరిజన మ్యూజియం సిబ్బంది తెలిపారు. గిరిజన మ్యూజియంలో ఉన్న గిరిజనుల జీవన విధానం, వ్యవసాయ పని ముట్లు, అలంకరణ వస్తువులు, సంత, ఆచార వ్యవహారాలు, సామాజిక స్థితిగతులను తెలిపే కళాకృతులు, దింసా నృత్యాలు పర్యాటకులను ఆకట్టుకున్నాయి. ఆదివారం మ్యూజియంను 1383 మంది పర్యాటకులు సందర్శించినట్లు సిబ్బంది తెలిపారు.

జనగాం

జనగామ లో శాతావాహన ఎక్స్‌ప్రెస్ హాల్టింగ్:బిజెపి జిల్లా అధ్యక్షులు

ఈరోజు భారతీయ జనతా పార్టీ జనగామ జిల్లా కార్యాలయంలో బిజెపి జనగామ జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ ఆధ్వర్యంలో ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సౌడ రమేష్ మాట్లాడుతూ ** జనగామ జిల్లా ప్రాంత ప్రజల ప్రయాణ సౌకర్యార్థం సికింద్రాబాద్ మరియు విజయవాడ మధ్య అత్యంత వేగంగా నడిచే స్థానిక రైలు శాతవాహన SF ఎక్స్‌ప్రెస్ రైలు నంబర్ 12713/12714 కు హాల్ట్ అందించానీ జనగాం రైల్వే స్టేషన్ వద్ద రెండు దిశలలో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌కు హాల్టును ఏర్పాటు చేయాలని గతంలో బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్ సౌత్ సెంట్రల్ రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవత్సవ ను కలిసి జనగామ రైల్వే స్టేషన్ లో శాతవాహన ఎక్స్ప్రెస్ కు హాల్టింగ్ ఇవ్వాలని మాట్లాడి, వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అదే విధంగా జనగామ జిల్లా బిజెపి ముఖ్య నాయకులు బిజెపి జిల్లా అధ్యక్షులు సౌడ రమేష్, ఆరుట్ల దశమంత రెడ్డి , బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కే వి ఎల్ ఎన్ రెడ్డి , విద్యాసాగర్ రెడ్డి ఉడుగుల రమేష్ , జనగామ మునిసిపల్ బిజెపి మాజీ ఫ్లోర్ లీడర్ హరిశ్చంద్ర గుప్తా , శివరాజ్ యాదవ్ , కొంతం శ్రీనివాస్ , దేవరాయ ఎల్లయ్య బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు కలిసి జనగామ ప్రాంతంలో దాదాపు 100 గ్రామాల నుంచి పొట్టకూటి కోసం రోజు హైదరాబాదు వెళ్లి ఉద్యోగాలు, లేబర్ పనులు చేసుకుని తిరిగి వస్తారని కావున ప్రజల ప్రయాణ సౌకర్యార్థం జనగామ రైల్వే స్టేషన్ వద్ద రెండు దిశలలో శాతవాహన ఎక్స్ప్రెస్ కు హాల్టును ఏర్పాటు చేపించవలసిందిగా కోరడం జరిగింది రామచంద్ర రావు వెంటనే స్పందించి కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు ఈ విషయం గూర్చి లేఖ రాయడం జరిగింది అశ్విని వైష్ణవి ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని త్వరితగతిన సంబంధిత అధికారులకు చెప్పి ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది కావున ఈ సందర్భంగా బిజెపి జనగామ జిల్లా అధ్యక్షుడు సౌడ రమేష్ కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ గారికి బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర రావు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. జనగామ రైల్వే స్టేషన్లో శాతవాహన ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ రావటం జనగామ జిల్లా భారతీయ జనతా పార్టీ నాయకుల కృషి వల్లనే వచ్చిందని ఈ హాల్టింగ్ సదుపాయం రేపు 30-10-2025 రోజు నుండి అమలులోకి వస్తుందని ఈ సందర్భంగా తెలియజేశారు చేశారు. ఈ సమావేశంలో జిల్లా ప్రధాన కార్యదర్శులు తోకల ఉమా రాణి ,అంజి రెడ్డి,భాగాల నవీన్ రెడ్డి,జిల్లా కార్యదర్శి సతీష్, జిల్లా మీడియా కన్వీనర్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,కొత్తపేట నియోజక వర్గ వైఎస్ఆర్సిపి పరిశీలకులు,పాటి శివకుమార్ గారు

ప్రెస్ నోట్ : 02/11/2025, మలికిపురం. 01/11/2025 శనివారం నిన్నటి రోజున శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర స్వామి ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ప్రభుత్వం నుండి సరైన ఏర్పాట్లు చేయకపోవడం, పోలీసు బందోబస్తు లేకపోవడం వల్ల జరిగినటువంటి ఈ తొక్కిసలాట లో సుమారు 9 మంది భక్తుల మృతి, 20 మందికి పైగా గాయాలు, ముగ్గురు పరిస్థితి విషమంగా ఉంది,ఈ సంఘటనకి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాల్సిన అవసరం ఉందని , అంత భారీ స్థాయిలో భక్తులు వస్తున్నారని విషయాన్ని ఇంటలిజెన్స్ వ్యవస్థ ద్వారా గాని ప్రభుత్వానికి ఉన్నటువంటి వివిధ వ్యవస్థల ద్వారా గాని కచ్చితంగా సమాచారం తెచ్చుకుని ప్రజల యొక్క భద్రతను చూడాల్సిన ఆవశ్యకత ప్రభుత్వం మీద ఉంది , అయినప్పటికీ ఈ సంఘటనకు బాధ్యత వహించాల్సిన రాష్ట్ర ముఖ్యమంత్రి గానీ మంత్రులు గాని ఆ దేవాలయం దేవాదాయ శాఖ పరిధిలో లేదని, ఇటువంటి సంఘటనలు అలా జరుగుతూ ఉంటాయని బాధ్యత లేకుండా మాట్లాడటం ప్రభుత్వంలో ఉన్నటువంటి బాధ్యత గల ముఖ్యమంత్రి కి మంత్రులకు తగదని దీనికి సంపూర్ణమైన బాధ్యత వహించాల్సిన అవసరం ప్రభుత్వానిదే అని, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి,కొత్తపేట నియోజక వర్గ వైఎస్ఆర్సిపి పరిశీలకులు,పాటి శివకుమార్ గారు తీవ్రంగా ఖండించారు. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తిరుపతి,సింహాచలం వంటి దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నటువంటి పెద్ద దేవాలయాల్లో సైతం ఎక్కువ భక్తులు పోటెత్తేటువంటి దేవాలయాల్లో కూడా సరైన జాగ్రత్తలు తీసుకొని కారణం చేతనే భక్తుల మరణాలు సంభవించాయని, కూటమి ప్రభుత్వ వైఫల్యాలు సుస్పష్టంగా ప్రజలకు అర్థం అవుతున్న సందర్భంలో ఇటువంటి పరిస్థితులను డైవర్ట్ చేయడానికి డైవర్షన్ పాలిటిక్స్ చేయడం ఈ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు నాయుడు గారికి అలవాటుఅని నిన్న శ్రీకాకుళంలో జరిగిన తొక్కిసలాట లో చనిపోయిన ఉదంతానికి ప్రభుత్వం మీద ప్రజల్లో వచ్చుచున్నటువంటి వ్యతిరేకతను డైవర్ట్ చేయడం కోసం మాజీ మంత్రి, బీసీ నేత జోగి రమేష్ గారిని ఆయనకి సంబంధంలేని నకిలీ మద్యం కేసులో అరెస్టు చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలు అర్థం చేసుకుంటున్నారని, జరిగిన తప్పుని హుందాతనంగా ఒప్పుకుని భవిష్యత్తులో ఈ పరిస్థితులు రాకుండగా హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్పాల్సిన ప్రభుత్వం ఈ విధమైన రాజకీయాలు చెయ్యడం సిగ్గు చేటు అని,ఈ ప్రభుత్వం వచ్చిన మొదటి నుంచి కూడా హిందుత్వంపై, హిందూ దేవాలయాలపై, హిందూ దేవాలయాలకు వెళ్తున్నటువంటి భక్తులపై వీరు చూపిస్తున్న నిర్లక్ష్యానికి ప్రజలు ,భగవంతుడు ఈ ప్రభుత్వానికి శిక్ష వేస్తారని పాటి శివకుమార్ అన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజా వైద్యం ప్రజల హక్కు.. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాలు.

ప్రజా వైద్యం ప్రజల హక్కు.. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాలు. ఒక ఉద్యమంలో సాగుతున్న కోటి సంతకాల ప్రజా అభిప్రాయ సేకరణ. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి చేస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం, వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు రోడా కొండయ్య, దనాల రమణయ్య, ధనాల రామారావు ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కుట్రలు పన్నుతో, నాడు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి హాయంలో పూర్తయిన ఏడు మెడికల్ కాలేజీలు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు వంటి నగరాల్లో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే వీలుగా మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు ప్రభుత్వ మంజూరు చేసి విద్యార్థుల సమస్యలను తీర్చిన ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఇంకా నాలుగు కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అవి ఆదోని, మార్కాపురం, మదనపల్లి,పిడుగురాళ్ల, అమలాపురం,బాపట్ల, నర్సీపట్నం,పార్వతీపురం,పాలకొల్లు,పెనుగొండ, పట్టణాల్లో మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు సన్నాహాలు చేసి ఉన్నారన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మెడికల్ కాలేజీలు అన్నిటినీ ప్రైవేట్ పరం చేసేందుకు , ప్రభుత్వం అడుగులు వేస్తుందని అలా ప్రైవేట్ పరం చేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువు అందని ద్రాక్షగా మిగిలిపోతుందని వైఎస్ఆర్సిపి నాయకులు అడ్డుకుంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదని అవి పూర్తిగా ప్రభుత్వం రంగంలోని నడపాలని వైఎస్ఆర్సిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో నాణ్యమైన విద్య వై�

విశాఖపట్నం

ప్రజా ఉద్యమంతోనే అడ్డుకుంటాం!

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో నేటితరం భవిష్యత్తు శూన్యం 📍 29వ వార్డు సంతకాల సేకరణలో మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ విశాఖపట్నం, నవంబర్ 2: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ జరిగితే నేటి తరాల భవిష్యత్తు శూన్యం అవుతుందనీ, వైఎస్సార్‌సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ అన్నారు. జగదాంబ జంక్షన్ వైఎస్సార్ విగ్రహం వద్ద 29వ వార్డు వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు పీతల వాసు ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి వాసుపల్లి ముఖ్య అతిథిగా హాజరై ప్రజలతో కలిసి సంతకాలు చేశారు. “వందేళ్ల చరిత్రను తిరగరాసి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకువచ్చి, 8,700 కోట్ల రూపాయలతో నిర్మాణాలు ప్రారంభించిన జగన్‌మోహన్ రెడ్డి పై రాజకీయ కక్షతో ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం ఆ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తూ నేటి తరాల భవిష్యత్తును నాశనం చేస్తోంది,” అని వాసుపల్లి మండిపడ్డారు. జగనన్న ప్రభుత్వం చేసిన మంచి పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అన్నీ నిలిపివేస్తూ కాలయాపన చేస్తోందని ఆయన విమర్శించారు. ప్రజలకు ప్రైవేటీకరణ వల్ల కలిగే నష్టాన్ని తెలియజేస్తూ ఉద్యమాన్ని విస్తృతం చేస్తామని తెలిపారు. ప్రజా వ్యతిరేక నిర్ణయాలను అడ్డుకునేది ప్రజా ఉద్యమమేనని స్పష్టం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న వారు: స్టేట్ యూత్ సెక్రటరీ కనకల ఈశ్వర్, జిల్లా బీసీ అధ్యక్షులు సనపల రవీంద్ర భరత్, సౌత్ యూత్ ప్రెసిడెంట్ బెవర మహేష్, జిల్లా మహిళా విభాగం జనరల్ సెక్రటరీ నీలాపు లక్ష్మి, జిల్లా RTI సెక్రటరీ ఆరుగుల రాజు, జిల్లా యూత్ సెక్రటరీ తమ్మినేని శ్రీను, జనరల్ సెక్రటరీ గుమ్మడి చంద్రమౌళి, 29వ వార్డు సోషల్ మీడియా ప్రెసిడెంట్ పడాల సూర్య, జిల్లా వికలాంగుల విభాగం జనరల్ సెక్రటరీ కోట ఆనంద ప్రసాద్, ఉరికిటి శివ పండు, ఇందు, వెంకటలక్ష్మి, పప్పు కమల, పైబోడి శివ, ఆబోతుల వెంకటరమణ, చెన్న మురళి, వడ్డాది శివ, గండి వలస పెంటయ్య, చరణ్, కల్చరల్ విభాగం రాష్ట్ర సెక్రటరీ కంటుముచ్చు సాగర్, వాణిజ్య విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్ చేడిపల్లి శివ, 38వ వార్డు యూత్ అధ్యక్షుడు చాపల నూకరాజు (బుడ్డి) తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ప్రజా వైద్యం ప్రజల హక్కు.. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాలు.

ప్రజా వైద్యం ప్రజల హక్కు.. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి కోటి సంతకాలు. ఒక ఉద్యమంలో సాగుతున్న కోటి సంతకాల ప్రజా అభిప్రాయ సేకరణ. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వ్యతిరేకంగా వైఎస్ఆర్సిపి చేస్తున్న కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం, వింజమూరు మండలం ఊటుకూరు గ్రామంలో వైఎస్ఆర్సిపి నాయకులు రోడా కొండయ్య, దనాల రమణయ్య, ధనాల రామారావు ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రజల నుండి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కుట్రలు పన్నుతో, నాడు వైఎస్ఆర్సిపి అధికారంలో ఉన్న సమయంలో వైయస్ జగన్మోహన్ రెడ్డి హాయంలో పూర్తయిన ఏడు మెడికల్ కాలేజీలు విజయనగరం రాజమండ్రి ఏలూరు మచిలీపట్నం నంద్యాల పాడేరు వంటి నగరాల్లో పేద మధ్యతరగతి విద్యార్థులు చదువుకునే వీలుగా మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు ప్రభుత్వ మంజూరు చేసి విద్యార్థుల సమస్యలను తీర్చిన ఘనత వైఎస్ఆర్సిపి ప్రభుత్వానికి దక్కిందన్నారు. ఇంకా నాలుగు కాలేజీలు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయని అవి ఆదోని, మార్కాపురం, మదనపల్లి,పిడుగురాళ్ల, అమలాపురం,బాపట్ల, నర్సీపట్నం,పార్వతీపురం,పాలకొల్లు,పెనుగొండ, పట్టణాల్లో మెడికల్ కాలేజీలో ఏర్పాటుకు సన్నాహాలు చేసి ఉన్నారన్నారు. కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక మెడికల్ కాలేజీలు అన్నిటినీ ప్రైవేట్ పరం చేసేందుకు , ప్రభుత్వం అడుగులు వేస్తుందని అలా ప్రైవేట్ పరం చేస్తే పేద మధ్యతరగతి విద్యార్థులకు చదువు అందని ద్రాక్షగా మిగిలిపోతుందని వైఎస్ఆర్సిపి నాయకులు అడ్డుకుంటున్నారు. కొత్తగా నిర్మిస్తున్న ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వకూడదని అవి పూర్తిగా ప్రభుత్వం రంగంలోని నడపాలని వైఎస్ఆర్సిపి నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ప్రతి జిల్లాలో నాణ్యమైన విద్య వై�

అనకాపల్లి

తుఫాన్ కారణంగా రజాల వద్ద శారదానదికి గండి పూడ్చే పనులను పరిశీలించిన ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్

అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గం నవంబర్ 2 పున్నమి న్యూస్ ప్రతినిధి: రాంబిల్లి మండలం, రజాల వద్ద ఇటీవలే సంభవించిన తుఫాన్ కారణంగా శారదా నదికి పడ్డ గండి పూడ్చే పనులను పరిశీలించిన నియోజవర్గ ఎమ్మెల్యే వర్యులు సుందరపు విజయ్ కుమార్. అధికారులను పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. సుమారు 50 శాతం పనులు పూర్తయినట్లు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండి పూడ్చే పనులలో నాణ్యత పాటిస్తూ త్వరగా పూర్తిచేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

సర్వేపల్లి నియోజకవర్గం, వెంకటాచలం మండలం, గొలగమూడి గ్రామంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీమతి కాకాణి పూజిత

“సర్వేపల్లి వైకాపాలోకి వలసలు” కాకాణి పూజితమ్మ సమక్షంలో గొలగమూడి ఎంపిటిసి దంపతులు శ్రీమతి మేకల రమణమ్మ భర్త రమణయ్య తెలుగుదేశం పార్టీని వీడి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. గొలగమూడి ఎంపిటిసి దంపతులను పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించిన శ్రీమతి కాకాణి పూజిత కాకాణి పూజిత స్క్రోలింగ్ పాయింట్స్:

రంగారెడ్డి

ఎకరా 27 గుంటల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేయించిన హైడ్రా అధికారులు

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 02 : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం హైడ్రా తేవడం వల్ల హస్తినాపురం డివిజన్ పరిధిలో గల హస్తినాపురం నార్త్ ఎక్స్టెన్షన్ కాలనీలో సుమారు 100 కోట్ల రూపాయల విలువచేసే ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడినట్లు జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మెంబర్ హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత నాయక్ తెలిపారు. గత 30 సంవత్సరాల క్రితం నాడు ప్లాట్లు చేసిన సమయంలో పార్కు కోసం కేటాయిం 1. ఎకరా 27 గుంటల భూమిని భూ యజమానులు మాది అని కోర్టుకు వెళ్లగా అట్టి స్థలాన్ని హైడ్రాధికారులు పరిశీలించి మంగళవారం ఒక ఎకరా 27 గుంటల భూమి చుట్టూ ఫెన్సింగ్ చేస్తున్నట్లు తెలిపారు. స్థలాన్ని కార్పొరేటర్ గారు వెళ్లి పరిశీలించి హర్షంవ్యక్తం చేసినట్లు తెలిపారు. త్వరలో అట్టి స్థలంలో ఎల్బీనగర్ నియోజకవర్గంలో ఎక్కడ లేని విధంగా పార్కును నిర్మించనున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైడ్రా తేవడం వల్ల ప్రతిపక్ష నాయకులు చేసిన కుట్రలు కుతంత్రాలను బట్టబయలు చేసి ప్రభుత్వ భూములను కాపాడుతున్నట్లు తెలిపారు. 100 కోట్ల రూపాయల విలువగల భూమిని స్వాధీనం చేసుకోవడం ఈ ప్రాంత వాసులు సంతోషం వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ మధుయాష్ కి గౌడ్ ద్వారా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లి పార్కు నిర్మాణానికి నిధులు మంజూరు చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో కాలనీ సంక్షేమ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి యాదయ్య గౌడ్ కొండల్ రెడ్డి బాలాజీ శ్రీనివాస్ గౌడ్ రామ్ చందర్ స్థానిక కాంగ్రెస్ నాయకులు డేరంగుల కృష్ణ గోపిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.