Monday, 6 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

1983 – 2011 – 2025: భారత క్రికెట్‌ గర్వగాథ! హర్మాన్ ప్రీత్ కౌర్‌ చరిత్ర సృష్టించింది

2025 మహిళల వరల్డ్ కప్ విజేత భారత్ – దక్షిణాఫ్రికాపై ఘన విజయం భారత్ సాధించింది భారత మహిళల క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది! 2025 మహిళల వరల్డ్ కప్ ఫైనల్లో దక్షిణాఫ్రికాపై ఘన విజయం సాధించి కప్‌ను కైవసం చేసుకుంది. హర్మాన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో జట్టు అద్భుత ప్రదర్శనతో దేశం మరోసారి గర్వపడేలా చేసింది. భారత క్రికెట్ చరిత్రలో మరో సువర్ణ అధ్యాయం రాసుకుంది. హర్మాన్ ప్రీత్ కౌర్‌ సారథ్యంలో భారత మహిళల జట్టు 2025 వరల్డ్ కప్‌ను గెలుచుకుని అద్భుత విజయాన్ని సాధించింది. 1983 లో కపిల్ దేవ్ జట్టు, 2011 లో ధోనీ నాయకత్వం తర్వాత ఇప్పుడు 2025 లో హర్మాన్ ప్రీత్ కౌర్‌ పేరు కూడా ఆ గర్వకరమైన జాబితాలో చేరింది. భారత మహిళల జట్టు కలల్ని నిజం చేస్తూ దేశానికి కొత్త గౌరవాన్ని తీసుకువచ్చింది. ఇది భారత క్రికెట్ గర్వానికి మరో చిరస్మరణీయ క్షణం!

తెలంగాణ

జనగణన ముందస్తు కార్యక్రమం ను తిప్పర్తి మండలంలో నిర్వహించిన : జిల్లా కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) జనగణన కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండలం లో నిర్వహించనున్న 2027 జనగణన ముందస్తు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ లను ఆదేశించారు. 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ముందస్తు గణన కార్యక్రమాన్ని పైలట్ పద్ధతిలో చేపట్టేందుకు ఎంపిక చేయగా పట్టణ ప్రాంతంలో జిహెచ్ఎంసి, గ్రామీణ ప్రాంతాల్లో నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం, గిరిజన ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. ఇందులో భాగంగా తిప్పర్తి మండలం లోని మామిడాల, ఇండ్లూరు, సర్వారం, తిప్పర్తి, జంగారెడ్డిగూడెంలలో జనగణన చేయనున్నారు. తిప్పర్తి రైతు వేదికలో ఆదివారం నుండి మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో జనగణన నిర్వహిస్తున్నందున ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలని క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు వస్తే రాష్ట్రస్థాయికి ఈ సమస్యలను తీసుకువెళ్లడం ద్వారా సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ ముందస్తు జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 10 నుండి 15 వరకు పైన పేర్కొన్న ఐదు గ్రామాలలో ఎన్యుమరేటర్లు, ఇండ్లకు వెళ్లి మొబైల్ యాప్ లో ఇండ్లను మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. అనంతరం ఈనెల 15 నుండి 30 వరకు ఇంటింటికి వెళ్లి నిర్దేశించిన ప్రొఫార్మాలో డిజిటల్ విధానంలో జనాభా లెక్కలను పూర్తి వివరాలతో సేకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రాష్ట్ర గణాంక శాఖ జెడి లాజరస్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

తెలంగాణ

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు వడ్లు ఆరబోసిన రైతులు, ఇతర పంటల రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు….

సిద్ధిపేట

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ. 1,75,000/.

జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు శ్రీ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి గారు దూల్మిట్ట మండలం, లింగాపూర్ గ్రామానికి చెందిన కొడాలి పూర్ణచంద్రరావు గారికి వారి వైద్య చికిత్స నిమిత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయనిధి (CMRF) ద్వారా మంజూరైన రూ. 1,75,000/- (ఒక లక్ష డెబ్బై ఐదు వేల రూపాయల) విలువైన LOC పత్రాన్ని జనగామ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో అందజేశారు.ఈ కార్యక్రమంలో జనగామ మార్కెట్ కమిటీ చైర్మన్ బానుక శివరాజ్ యాదవ్, సిద్దిపేట జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శి సందీటి లక్ష్మారెడ్డి డిసిసి వైస్ ప్రెసిడెంట్ గంగం నరసింహారెడ్డి నర్మెట మండలం అధ్యక్షులు రాజబోయిన లక్ష్మీనారాయణ పాల్గొన్నారు.

E-పేపర్

రాష్ట్రంలో చంద్రబాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని పేర్కొన్న ఎమ్మెల్సీ ఇసాక్ బాష

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో భక్తులకు భద్రత కరువైందని నంద్యాల ఎమ్మెల్సీ ఇసాక్ బాష, వైసీపీ నేతలు పేర్కొన్నారు. తాజాగా శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో జరిగిన తొక్కి సలాటలో 10 మంది భక్తులు మృత్యువాతపడటం అనేక మంది గాయాలపాలవటంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యవైఖరి స్పష్టంగా కనిపిస్తున్నదని వైసీపీ నేతలు ఆరోపించారు. నంద్యాల మాజీ ఎమ్మెల్యే శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి ఆద్వర్యంలో నేడు నంద్యాల పట్టణం గాంధీ చౌక్ వద్ద వైసీపీ నేతలు ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మున్సిపల్ చైర్ పర్సన్ మాబున్నీసా, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాల్మిల్ అమీర్, జిల్లా ప్రధాన కార్యదర్శి సోమశేఖర్ రెడ్డి ఇతర నాయకుల ఆధ్వర్యంలో కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో తొక్కిసలాటలో మృతి చెందిన భక్తుల ఆత్మలకు శాంతి చేకూరాలని కొవొత్తులు వెలిగించి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఇసాక్ బాష, మున్సిపల్ చైర్పర్సన్ మరియు వైపీపీ నేతలు మాట్లాడుతూ… కూటమి ప్రభుత్వంలో భక్తులకు భద్రత కరువైందని, కాళీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని ఆలయ ధర్మకర్త పాండే స్థానిక పోలీసులకు ముందస్తు చర్యలు చేపట్టాలని చెప్పారని అయినా పోలీసులు భక్తులకు భద్రత కల్పించడంలో విఫలం చెందారని ఆరోపించారు. దేవాదాయ శాఖ మంత్రి కాళీ బుగ్గ వెంకటేశ్వర ఆలయం దేవాదాయశాఖ పరిదిలోకి రాదని చెప్పడం ఎంతో దారుణంగా ఉందని, ఇది ప్రభుత్వ నిర్లక్షధోరణికి నిదర్శనం అన్నారు. హోమంత్రి ఆలయానికి వచ్చే భక్తులకు భద్రత కల్పించలేక పోవడం ప్రభుత్వ వైఫల్యం అన్నారు. కూటమి ప్రభుత్వంలో భక్తుల ప్రాణాలకు విలువలేకుండా పోయిందని పేర్కొన్నారు. గతంలో జరిగిన పలు సంఘటనలు పునరావృతం కాకుండా భక్తులకు రక్షణ, భద్రత కల్పించాల్సిందిపోయి తప్పించుకొనే విధానంలో ఉండటం ఎంతో దారుణం అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ జిల్లా మేధావుల విభాగం అధ్యక్షుడు రసూల్ ఆజాద్, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రెటరీ శశికళ రెడ్డి, జిల్లా కార్యదర్శి దేవనగర్ బాష, జిల్లా క్రిష్టియన్ మైనార్టీ అధ్యక్షుడు కారురవికుమార్, అసెంబ్లీ క్రిష్టియన్ మైనార్టీ అధ్యక్షుడు మనోజ్ కుమార్, జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తిరుపతి, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

తెలంగాణ

తెలంగాణలో మరో రెండు రోజులు వర్షాలు..

తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు రోజుల పాటు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ పడే ఛాన్స్ ఉందని తెలిపింది. ఈ మేరకు వడ్లు ఆరబోసిన రైతులు, ఇతర పంటల రైతులు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు….

Blog

మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని కలిసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాబొట్ల భరద్వాజ్ శర్మ

నంద్యాల : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్.ఎం.డి. ఫరూక్ ని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాబొట్ల భరద్వాజ్ శర్మ ఈ రోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ ని కలిసిన సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాబొట్ల భరద్వాజ్ శర్మ శ్రీశైలం దేవస్థానం మరియు భక్తుల సౌకర్యాలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్లారు శ్రీశైలం అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి మంత్రి ఫరూక్‌ తో చర్చించినట్లు తెలిసింది ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యుడు చిటాబొట్ల భరద్వాజ్ శర్మ ను అభినందించారు ఈ కార్యక్రమంలో కాంట్రాక్టర్ ఇరగదీన్నెల బాలు పాల్గొన్నారు

E-పేపర్

నంద్యాల టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన నంద్యాల జిల్లా ఐఎంఏ కార్యదర్శి డా. మహమ్మద్ రఫీ

నంద్యాల జిల్లా నూతన ఐఎంఏ (ఇండియన్ మెడికల్ అసోసియేషన్) కార్యదర్శిగా ఇటీవల ఎన్నికైన ప్రముఖ వైద్యులు డాక్టర్ మహమ్మద్ రఫీ ఈరోజు తెలుగుదేశం పార్టీ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ ని నంద్యాల టీడీపీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ సందర్భంగా ఎన్ఎండి ఫిరోజ్ మాట్లాడుతూ వైద్యులు సమాజానికి చేస్తున్న సేవలను కొనియాడారు. “నంద్యాల జిల్లా ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు కృషి చేస్తున్న ఐఎంఏ కి ప్రభుత్వం తరఫున, నా తరఫున పూర్తి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ ఉంటాయని” ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

రైతుల పంటలకు గడువు పొడిగింపు

ఉదయగిరి వ్యవసాయ సబ్ డివిజన్ పరిధిలోని రైతులు పంటలను ఈ క్రాప్ నందు నమోదుకొనేందుకు ప్రభుత్వం గడువు ఈ నెల 8 వ తేదీ వరకు పెంచినట్లు స్థానిక వ్యవసాయ సహాయ సంచాలకుడు చెన్నారెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తెలిపారు పంటలు సాగు చేసిన రైతులు తప్పకుండా రైతు కేంద్రం లోని గ్రామ వ్యవసాయ సహయకులను కలిసి పంట నమోదు చేసుకుంటేనే ప్రభుత్వ రాయితీ పధ కా లు వర్థిస్తాయన్నారు.

Blog

జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ ప్రారంభించిన :- డాక్టర్ రవి కృష్ణ

నంద్యాల జిల్లా చెస్ సంఘం,నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో, నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో ఆదివారం స్థానిక ఈపూరి శేషయ్య శెట్టి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జింకా ఆడిటోరియంలో జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ పోటీలు ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవికృష్ణ అధ్యక్షతన జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో టోర్నమెంట్ స్పాన్సర్ ఆత్మకూరు సుదర్శనం శెట్టి, ప్రముఖ వైద్యులు డాక్టర్ గెలివి సహదేవుడు,లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు అతిథులుగా పాల్గొని ప్రసంగించారు డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ చదరంగం క్రీడ ఏకాగ్రతను ఇనుముడింప చేస్తుందని తద్వారా చదువులో కూడా రాణించడానికి అవకాశాలు అధికమవుతాయని అన్నారు. ఆత్మకూరు సుదర్శనం శెట్టి మాట్లాడుతూ మొబైల్ ఫోన్ పిల్లలలో దుష్ప్రభావం చూపుతున్నదని,దాని నుంచి పిల్లల దృష్టి క్రీడలపై ఉండేలా చేస్తే పిల్లలలో మేధో వికాసం జరుగుతుందన్నారు. డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు క్రీడలు, కళలు వారి వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయని అన్నారు.విద్యార్థులు క్రీడలలో పాల్గొంటే క్రమశిక్షణ కూడా అలవడుతుందని అన్నారు. క్రీడలలో నిరంతర సాధన విజయానికి సోపానం అన్నారు నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి పర్యవేక్షణలో ఆత్మకూరు సుదర్శనం శెట్టి, డాక్టర్ గెలివి సహదేవుడు చదరంగం బోర్డుపై పావులు కదిలించి పోటీలు ప్రారంభించారు ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా చెస్ సంఘం కార్యదర్శి రామ సుబ్బారెడ్డి, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కార్యదర్శి తాతిరెడ్డి భాస్కర రెడ్డి,కోశాధికారి అమిదేల జనార్ధన్, టోర్నమెంట్ కోఆర్డినేటర్ వెంకటరావు, లయన్స్ క్లబ్ సభ్యులు మేడం చంద్రశేఖర్, గెలివి శ్రీకాంత్,ఆర్బిటర్ సుజాత, వ్యాయామ ఉపాధ్యాయులు కళ్యాణ చక్రవర్తి, 150 మంది క్రీడాకారులు, వారి తల్లిదండ్రులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.