Monday, 6 April 2026

Blog

E-పేపర్

దుర్వాసనతో ప్రజల అవస్థ: కృష్ణా జిల్లా, పెద్దవుటపల్లి వద్ద రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త.

పెద్దవుటపల్లి: పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణా జిల్లా,గన్నవరం మండలం పరిధిలోని పెద్దవుటపల్లి నుంచి తెంపెల్లి రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలో పేరుకుపోయిన చెత్త ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఊరిలోని వ్యర్థాలన్నింటినీ తీసుకొచ్చి రోడ్డు పక్కనే వేయడం వల్ల కుళ్లిపోయిన కూరగాయలు,పండ్లు,ఇతర వ్యర్థాల నుంచి వస్తున్న భయంకరమైన దుర్వాసనతో ఆ మార్గంలో ప్రయాణించే స్థానికులు, రైల్వే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్థానికంగా నివసించే ప్రజలు తమ గోడును వెళ్లబోసుకుంటూ, ఈ చెత్త కుప్పల వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో దుర్వాసన మరింత ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం? స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సమస్య గురించి పెద్దవుటపల్లి గ్రామ పంచాయతీ సిబ్బందికి పలుమార్లు విన్నవించినప్పటికీ,వారు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా,పంచాయతీ సిబ్బందే ఊర్లోని చెత్త అంతా తీసుకొచ్చి ఈ రోడ్డు వద్ద వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు పక్కన భారీ స్థాయిలో చెత్త కుప్పలు పేరుకుపోయాయని వారు వాపోతున్నారు. స్థానిక ప్రజల డిమాండ్ చెత్త నుంచి వస్తున్న ఈ భయంకరమైన వాసనతో మా జీవితాలు దుర్భరంగా మారాయి. ఇది కేవలం పర్యావరణ సమస్యే కాదు, ప్రజారోగ్య సమస్య కూడా. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే దృష్టి సారించి,ఈ చెత్తను ఇక్కడి నుంచి తొలగించి, గ్రామంలో శాశ్వత చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి,” అని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి,ప్రజల ఇబ్బందులను తొలగించి,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని పెద్దవుటపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

E-పేపర్

దుర్వాసనతో ప్రజల అవస్థ: కృష్ణా జిల్లా, పెద్దవుటపల్లి వద్ద రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త.

పెద్దవుటపల్లి: పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణా జిల్లా,గన్నవరం మండలం పరిధిలోని పెద్దవుటపల్లి నుంచి తెంపెల్లి రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలో పేరుకుపోయిన చెత్త ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఊరిలోని వ్యర్థాలన్నింటినీ తీసుకొచ్చి రోడ్డు పక్కనే వేయడం వల్ల కుళ్లిపోయిన కూరగాయలు,పండ్లు,ఇతర వ్యర్థాల నుంచి వస్తున్న భయంకరమైన దుర్వాసనతో ఆ మార్గంలో ప్రయాణించే స్థానికులు, రైల్వే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్థానికంగా నివసించే ప్రజలు తమ గోడును వెళ్లబోసుకుంటూ, ఈ చెత్త కుప్పల వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో దుర్వాసన మరింత ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం? స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సమస్య గురించి పెద్దవుటపల్లి గ్రామ పంచాయతీ సిబ్బందికి పలుమార్లు విన్నవించినప్పటికీ,వారు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా,పంచాయతీ సిబ్బందే ఊర్లోని చెత్త అంతా తీసుకొచ్చి ఈ రోడ్డు వద్ద వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు పక్కన భారీ స్థాయిలో చెత్త కుప్పలు పేరుకుపోయాయని వారు వాపోతున్నారు. స్థానిక ప్రజల డిమాండ్ చెత్త నుంచి వస్తున్న ఈ భయంకరమైన వాసనతో మా జీవితాలు దుర్భరంగా మారాయి. ఇది కేవలం పర్యావరణ సమస్యే కాదు, ప్రజారోగ్య సమస్య కూడా. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే దృష్టి సారించి,ఈ చెత్తను ఇక్కడి నుంచి తొలగించి, గ్రామంలో శాశ్వత చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి,” అని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి,ప్రజల ఇబ్బందులను తొలగించి,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని పెద్దవుటపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

తెలంగాణ

జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఎలక్షన్ క్యాంపెన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు పాల్గొన్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంతన్న

జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఎలక్షన్ క్యాంపెన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు పాల్గొన్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంతన్న గారితో 138 మౌలాలి డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్. ప్రచారంలో భాగంగా యూసఫ్ గూడా మరియు బోరబండ లోని గడపగడపకు చేరి అభివృద్ధి పనుల గురించి చర్చిస్తూ సరైన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంద భాస్కర్, చందు, 138 డివిజన్ జనరల్ సెక్రటరీ వకీల్ సలీం, కాంగ్రెస్ మల్కాజ్గిరి సర్కిల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ అజయ్, ప్రేమ్, మహమూదా బేగం, తనీష్, అశోక్, అనీష్, రిషి, నీరజ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రోడ్డు ప్రమాదాలకు చెక్ – కాంట్రాక్టర్లపై కేంద్రం కఠిన నిర్ణయం

రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జాతీయ రహదారులపై ఏదైనా నిర్దిష్ట ప్రాంతంలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే, సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్లపై భారీ జరిమానాలు విధించనుంది. రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించకపోవడం, సరైన రహదారి సంరక్షణ లేకపోవడం వంటి కారణాలతో జరిగే ప్రమాదాలపై బాధ్యత కాంట్రాక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్యతో రహదారి పనుల్లో నాణ్యత పెరిగి ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఖమ్మం

ఖమ్మం టూ టౌన్ మండల కార్యవర్గ సమావేశం :

పున్నమి ఖమ్మం ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీ ఆదేశాల మేరకు ఖమ్మం టూ టౌన్ మండల కార్యవర్గ సమావేశం అధ్యక్షుడు ధనియాకుల వెంకటనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో ఖమ్మం బిజెపి టూ టౌన్ పరిధిలోని 15 డివిజన్లకు సంబంధించిన పూర్తి పోలింగ్ బూత్ కమిటీలు, శక్తి కేంద్ర ఇన్‌చార్జిలు పాల్గొన్నారు. వారి వారి డివిజన్ల సమస్యలను తెలుసుకొని పరిష్కార దిశగా ఖమ్మం జిల్లా బీజేపీ పార్టీకి మరియు ప్రభుత్వ అధికారులకు తెలియజేసే విధానం గురించి చర్చించారు. పార్టీ అభివృద్ధి కోసం, రానున్న ఖమ్మం కార్పొరేషన్ ఎన్నికల్లో విజయాన్ని లక్ష్యంగా పెట్టుకొని సీనియర్ నేతల సూచనల మేరకు దిశా నిర్దేశం చేశారు. అనంతరం ఖమ్మం టూ టౌన్ ఆర్గనైజింగ్ జనరల్ సెక్రటరీ గా జ్యోతుల యుగంధర్ నాయుడు ని నియమిస్తూ అధ్యక్షులు ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ నియామక పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో బిజెపి సీనియర్ నాయకులు గంటేల విద్యాసాగర్, ఒక్కలంక సుబ్రహ్మణ్యం, మేకల నాగేందర్, జిల్లా బిజెపి ప్రధాన కార్యదర్శి నల్లగట్టు ప్రవీణ్, కృష్ణ చారి, రుద్రగాని మాధవ్, జ్యోతుల యుగంధర్, నక్క రవి గౌడ్, సురేష్ గౌడ్, తాజనూత్ భద్రం, శ్రీనివాసరెడ్డి, లలిత, ఉపేంద్ర, వెంకట్ మహేందర్, వీరభద్రం, నాగరాజు, చిన్ని కృష్ణ, వెంకట్, గంగాధర్, మేఘన మరియు పోలింగ్ బూత్ అధ్యక్షులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

కాకినాడ

శ్రీ మరిడమ్మ అమ్మవారు దేవస్థానం లో అన్నదాన ప్రసాద వితరణ

పున్నమి న్యూస్, పెద్దాపురం, 2/11. పెద్దాపురం పట్టణంలో వేంచేసియున్న శ్రీ శ్రీ శ్రీ మరిడమ్మ వారి దేవస్థానం నందు ఆదివారం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ కే విజయలక్ష్మి ఆధ్వర్యంలో అమ్మవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి వచ్చు భక్తులకు అన్న ప్రసాద వితరణ నిర్వహించారు. కార్యక్రమంలో నాణ్యత విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు విజయలక్ష్మి తెలిపారు. భక్తులు అమ్మవారి దర్శనం అనంతరం అన్నదాన ప్రసాదం స్వీకరించారు, తమ ఆకలి తీరుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమం లో వేద పండితు ఐవీ ప్రసాద్ శర్మ, ఎస్ విశాస్త్రి, శంకర్ శాస్త్రి, ఆసాదులు రాయ రామచంద్ర ప్రసాద్, రాయ విజయ్ కుమార్, సిబ్బంది వెంకటరమణ, క్రాంతివీర్, గౌరీ, వరహాలు లోవ, శివ తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇండియన్ రైల్వేస్ లోయర్ బెర్త్ & స్లీపింగ్ టైమింగ్స్ — కొత్త నియమాలు (నవంబర్ 1, 2025 నుండి)

1️⃣ లోయర్ బెర్త్ కేటాయింపు ప్రాధాన్యత 🔹 ప్రాధాన్యత వర్గాలు: 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లు, 45 ఏళ్లు పైబడిన మహిళలు, మరియు గర్భిణీ స్త్రీలు. 🔹 సీటు లభ్యతపై ఆధారపడి అమలు: బుకింగ్ సమయంలో అందుబాటులో లేకపోతే, ప్రయాణ సమయంలో ఖాళీ ఉంటే TTE ద్వారా కేటాయిస్తారు. 🔹 ఆన్‌లైన్ బుకింగ్ ఆప్షన్: లోయర్ బెర్త్ అందుబాటులో ఉన్నప్పుడు మాత్రమే టికెట్ బుక్ చేసుకునే కొత్త ఆప్షన్ ప్రారంభమైంది. 2️⃣ నిద్ర మరియు కూర్చునే సమయాలు 🔹 నిద్ర సమయం: రాత్రి 10:00 గంటల నుండి ఉదయం 6:00 గంటల వరకు. 🔹 పగటిపూట నియమం: ఈ సమయం మినహా పగటిపూట బెర్త్‌పై కేవలం కూర్చోవడానికి మాత్రమే అనుమతి. ఇతరులకు అసౌకర్యం కలగకుండా నిద్రపోకూడదు. 🔹 RAC టిక్కెట్లకు నిబంధన: పగటిపూట సైడ్ లోయర్ బెర్త్ పంచుకోవాలి, కానీ రాత్రి ఆ సీటు టికెట్ ఉన్నవారికి మాత్రమే వినియోగ హక్కు ఉంటుంది. 3️⃣ ముందస్తు రిజర్వేషన్ గడువు మార్పు 🔹 కొత్త గడువు: 120 రోజుల బదులు ఇప్పుడు 60 రోజుల ముందే బుకింగ్ చేయవచ్చు. 🔹 ఉద్దేశం: రద్దు సమస్యలు తగ్గించి, బుకింగ్ ప్రక్రియను మరింత సులభతరం చేయడం. ఈ మార్పులు ప్రయాణీకుల సౌకర్యం మరియు బుకింగ్ వ్యవస్థలో పారదర్శకత కోసం అమల్లోకి తెచ్చినవే.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి.

➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప. ➖ కూలీలతో పాటు అందరు అర్హలే. ➖ తెల్ల రేషన్ కార్డు తప్పని సరి. ➖ ఏడాదికి రూ 22 మాత్రమే. 5 స0 రాలు ఒకేసారి చెల్లించాలి,కేవలం 110/-రూ.. మాత్రమే. ➖ అవగాహన పెంచుకుందాం. ➖ అందరికీ చేరేలా చేయండి. 1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ,పురుషులు అర్హులు. 2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు. 3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి. 4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి. ప్రయోజనాలు: 5) పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్ 6.అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/- 7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,, 8) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,,చొప్పున వచ్చే అవకాశం ఉంది. 9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు,అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది. ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ.చెల్లిస్తే 5 సంవత్సరాల వరకు చెల్లించనక్కర్లేదు.అంటే మీరు చెల్లించేది సంవత్సరానికి 22/-రూ,,అన్నమాట వెంటనే మీరు,మీ కుటుంబ సభ్యులు, స్నేహితులు,బంధువు లందరిని చేర్పించండి. ఇలాంటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అత్యంత అవసరమైనవి. కావున వెంటనే మీ మండలంలోని కార్మిక అధికారిని(లేబర్ ఆఫీసర్)MPDO/MRO గార్లను సంప్రదించండి. చివరగా ఒక్క మాట ఈ పథకంలోకి చాలా మంది…..కార్మికులు మాత్రమే చేరవచ్చని అనుకుంటారు. అది కానే కాదు.తెల్ల రేషన్ కార్డు కలిగి వున్న ప్రతి కుటుంబం ఈ పథకానికి అర్హులే… మీ అందరికీ విన్నపము జోక్స్,కార్టూన్లు పంపే బదులు ఈ Msg పంపితే జనం అందరూ తెలుసుకుంటారు. మీకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయె వాటన్నిటికీ send చేయండి (or)ఈ Msg ని కనీసం 3 Groups కు పంపించండి. ఎందుకంటే చాలా మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. 50 నుండి 60 స0 రాల లోపు చనిపోతున్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

*నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి*

*నేడు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి* *తిరుపతి, నవంబర్ 2:* ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ప్రతి సోమవారం డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థలో మొట్టమొదటిసారిగా డయల్ యువర్ సీఎండి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, వైయస్సార్ కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేయడం ద్వారా తమ విద్యుత్ సమస్యలను నేరుగా సిఎండి దృష్టికి తీసుకువచ్చి, వాటిని పరిష్కరించుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు. ప్రతి సోమవారం ఉదయం 10:00 నుంచి 12:00 గంటల వరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనికోరారు. వినియోగదారులు మొబైల్ నంబరు: 9133331912కు చాట్ చేయడం ద్వారా కూడా సమస్యలను అధికారుల దృష్టికి తీసుకురావచ్చని ఆ ప్రకటనలో తెలిపారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ఇస్రో మరో విజయగాధ! LVM3-M5 ప్రయోగం ఘనవిజయం – భారత్‌లోనే అతిపెద్ద ఉపగ్రహం ఆర్బిట్‌లోకి

భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో సాంకేతిక అద్భుతాన్ని సృష్టించింది. LVM3-M5 రాకెట్‌ ద్వారా CMS-3 ఉపగ్రహాన్ని విజయవంతంగా ఆర్బిట్‌లోకి ప్రవేశపెట్టింది. మొత్తం 4,410 కిలోల బరువుతో CMS-3 భారత్‌ రూపొందించిన అతిపెద్ద ఉపగ్రహంగా నిలిచింది. కేవలం 16.09 నిమిషాల్లో కచ్చితంగా ఆర్బిట్‌ను చేరుకున్న ఈ ఉపగ్రహం భారత అంతరిక్ష శాస్త్రవేత్తల ప్రతిభకు నిదర్శనం. చంద్రయాన్‌-3 విజయానికి దారితీసిన అదే శక్తివంతమైన LVM3 రాకెట్‌ మరోసారి తన సామర్థ్యాన్ని చాటుకుంది. ఈ విజయానికి శాస్త్రవేత్తలకు ఇస్రో ఛైర్మన్‌ హృదయపూర్వక అభినందనలు తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.