Monday, 6 April 2026

Blog

ఖమ్మం

ముత్తగూడెంలో మహిళను హత్య చేసిన దగ్గరి బంధువులు

*ముత్తగూడెంలో మహిళను హత్య చేసిన దగ్గరి బంధువులు* * ఖమ్మం రూరల్ మండలం ముత్తగూడెంలో గునిగంటి నాగమణి(48) అనే మహిళను హత్య చేసిన దగ్గరి బంధువులు. * ఈ సంఘటనలో మరో వ్యక్తికి తీవ్ర గాయాలు. పూర్తి వివరాలు తెలియాల్సి వుంది

తెలంగాణ

చెరువుగట్టులో భక్తుల సందడి

*చెరువుగట్టులో భక్తుల సందడి* కార్తిక మాసం రెండవ సోమవారం సందర్భంగా ప్రముఖ శైవ క్షేత్రమైన చెరువుగట్టు భక్తులతో నిండిపోయింది. తెల్లవారుజాము నుండే భక్తులు శ్రీ పార్వతిజడల రామలింగేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి కార్తీక దీపాలు వెలిగించారు…

మహబూబ్ నగర్

*ఎంపీ గారికి మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారి కాంస్య ప్రతిమను బహుకరిస్తున్న రాష్ట్ర గౌరవ అధ్యక్షులు

*ఈరోజు మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు గౌరవనీయులు శ్రీమతి డీకే అరుణ గారిని వారి నివాసంలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంఎన్ విజయకుమార్ మర్యాదపూర్వకంగా కలిసి రాష్ట్రంలో పండిత సమస్యలు ఎదుర్కొంటున్న వాటిపై సుదీర్ఘంగా మరియు రాష్ట్ర ఉపాధ్యాయుల్లో నెలకొన్న టెట్ ప్రతిస్తంభన పై కూడా చర్చించి అనంతరం ఆమెకు మాజీ రాష్ట్రపతి శాస్త్రవేత్త ఏపీజే అబ్దుల్ కలాం గారి కాంస్య ప్రతిమను బహూకరించడం జరిగింది*

మహబూబ్ నగర్

టెట్ నిబంధనలో సవరణలు తీసుకురావాలని ఎంపీకి వినతిపత్రం

*గౌరవ మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి డీకే అరుణ గారిని వారి నివాసంలో రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ పండిత పరిషత్ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎం ఎన్ విజయకుమార్ కలిసి రాష్ట్రంలో టెట్ విషయంలో నెలకొన్న ప్రతిష్టంభనను తొలగించి దాదాపుగా 45 వేల మంది రాష్ట్రంలో వివిధ యాజమాన్యాల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మేలు జరిగేలా ఉద్యోగ భద్రత కల్పించే విషయంలో చొరవ చూపించి కేంద్ర విద్యా శాఖ మాత్యులు ధర్మేంద్ర ప్రధాన్ గారికి మరియు ప్రధానమంత్రి గారికి రాష్ట్రపతి గారికి ఈ విషయంలో అనుకూలంగా తీర్పు ఇచ్చే విధంగా మెయిల్ చేసి పంపగలరని సంఘ పక్షాన కోరడం జరిగింది అందుకు పార్లమెంటు సభ్యురాలు స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆర్టీఈ యాక్ట్ 2009లో పార్లమెంటు సవరణ చేసి దాదాపుగా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాదిమంది ఉపాధ్యాయులకు సంబంధించిన మరియు రాష్ట్రవ్యాప్తంగా 45,000 మందికి గందరగోళంలో ఉన్నటువంటి ఈ సమస్యను సత్వరమే పరిష్కరించేందుకు తమ వంతుగా కృషి చేస్తానని ఆమె సంఘ బాధ్యులకు హామీ ఇవ్వడం జరిగిందని రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ ఎంఎన్ విజయకుమార్ తెలియజేశారు రాష్ట్ర శాఖ జిల్లా శాఖ పక్షాన వారికి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం*

తూర్పు గోదావరి

బాబు పాలనలో భక్తులకు భద్రత కరువు -రాజమహేంద్రవరంలో వైయస్సార్సీపి కొవ్వొత్తుల ర్యాలీ -తొక్కిసిలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుంది

కాశిబుగ్గ తొక్కిసలాట ఘటనలో మృతి చెందిన భక్తులకు రాజమహేంద్రవరంలో ఆదివారం వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు శ్రద్ధాంజలి ఘటించారు. వైయస్సార్సీపి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ ఆధ్వర్యంలో ఆదివారం రాత్రి స్థానిక కోటిపల్లి బస్టాండ్ జంక్షన్ లో పెద్ద ఎత్తున కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వ నిర్లక్ష్యమే ఈ తొక్కిసలాట ఘటనకు కారణమని నిరసన వ్యక్తం చేశారు. తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుందన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ నినాదాలు చేశారు. కొవ్వొత్తుల నిరసన ర్యాలీకి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్, జిల్లా పార్టీ అధ్యక్షులు మాజీ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ, రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్, కొవ్వూరు నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ శాసనసభ్యులు తలారి వెంకట్రావు, మాజీ శాసనసభ్యులు రౌతు సూర్యప్రకాశరావు, ఏపీ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి రాజమండ్రి పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్చార్జి డాక్టర్ గూడూరి శ్రీనివాస్ మాట్లాడుతూ కాశీబుగ్గలో తొక్కిసలాట దురదృష్టకరం అన్నారు. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఘటన మూడవ తొక్కిసలాట ఘటన అని అన్నారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపితే ప్రభుత్వ నిర్లక్ష్యం బయటపడుతుందన్నారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాని, భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరక్కుండా చూడాలన్నారు.

తూర్పు గోదావరి

ఈ వి ఎమ్ ల అక్రమాలతోనే పవన్ కళ్యాణ్ జనసేన పార్టికి ఎన్నికల గుర్తింపు..

ఎన్నికల సంఘం అధికార దుర్వినియోగంతో ప్రజాస్వామ్యం అపహాస్యం అయ్యింది. రాజమహేంద్రవరం : రాజమండ్రి స్థానిక రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ (ఆర్.పి.సి.) కార్యాలయంలో పార్టీ అధ్యక్షుడు మరియు ప్రముఖ సీనియర్ అడ్వకేట్ మేడా శ్రీనివాస్ శనివారం మీడియాతో మాట్లాడుతూ “రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్” పార్టి ని మోసం చేసి అప్పటికే ప్రచారంలో ఉన్నటువంటి నాకు కేటాయించిన “గాజుగ్లాస్” గుర్తును రద్దు చేయించార ఆరోపించారు. మరోవైపు పవన్ కళ్యాణ్ గెలిచిన 21 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నెన్నో సాంకేతిక సిత్రాలు జరిగాయని, దీనిపై చర్చకు సిద్ధ పండగలరా ! అని సవాలు విసిరారు. ఐతే సవాలకు సంబంధించి జనసేన పార్టి లో సామాజిక స్పృహ వున్నవాళ్లతో నేను చర్చకు సిద్దం అని, సిద్దపడే వారిని ఆహ్వానిస్తున్నామన్నారు.

E-పేపర్

దుర్వాసనతో ప్రజల అవస్థ: కృష్ణా జిల్లా, పెద్దవుటపల్లి వద్ద రోడ్డు పక్కన పేరుకుపోయిన చెత్త.

పెద్దవుటపల్లి: పున్నమి ప్రతినిధి సురేష్ కృష్ణా జిల్లా,గన్నవరం మండలం పరిధిలోని పెద్దవుటపల్లి నుంచి తెంపెల్లి రైల్వే స్టేషన్కు వెళ్లే మార్గంలో పేరుకుపోయిన చెత్త ప్రజలకు తీవ్ర ఇబ్బందులు కలిగిస్తోంది. ఊరిలోని వ్యర్థాలన్నింటినీ తీసుకొచ్చి రోడ్డు పక్కనే వేయడం వల్ల కుళ్లిపోయిన కూరగాయలు,పండ్లు,ఇతర వ్యర్థాల నుంచి వస్తున్న భయంకరమైన దుర్వాసనతో ఆ మార్గంలో ప్రయాణించే స్థానికులు, రైల్వే ప్రయాణికులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. స్థానికంగా నివసించే ప్రజలు తమ గోడును వెళ్లబోసుకుంటూ, ఈ చెత్త కుప్పల వల్ల శ్వాస తీసుకోవడం కూడా కష్టంగా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో దుర్వాసన మరింత ఎక్కువగా ఉంటుందని, దీనివల్ల ఆరోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ఉందని భయపడుతున్నారు. పంచాయతీ సిబ్బంది నిర్లక్ష్యం? స్థానిక ప్రజలు తెలిపిన వివరాల ప్రకారం, ఈ సమస్య గురించి పెద్దవుటపల్లి గ్రామ పంచాయతీ సిబ్బందికి పలుమార్లు విన్నవించినప్పటికీ,వారు పట్టించుకోవడం లేదని తెలుస్తోంది. అంతేకాకుండా,పంచాయతీ సిబ్బందే ఊర్లోని చెత్త అంతా తీసుకొచ్చి ఈ రోడ్డు వద్ద వేస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఈ నిర్లక్ష్యం కారణంగానే రోడ్డు పక్కన భారీ స్థాయిలో చెత్త కుప్పలు పేరుకుపోయాయని వారు వాపోతున్నారు. స్థానిక ప్రజల డిమాండ్ చెత్త నుంచి వస్తున్న ఈ భయంకరమైన వాసనతో మా జీవితాలు దుర్భరంగా మారాయి. ఇది కేవలం పర్యావరణ సమస్యే కాదు, ప్రజారోగ్య సమస్య కూడా. దయచేసి రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా అధికారులు వెంటనే దృష్టి సారించి,ఈ చెత్తను ఇక్కడి నుంచి తొలగించి, గ్రామంలో శాశ్వత చెత్త డంపింగ్ యార్డ్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి,” అని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి,ప్రజల ఇబ్బందులను తొలగించి,పరిసరాలను పరిశుభ్రంగా ఉంచేందుకు తగు చర్యలు తీసుకోవాలని పెద్దవుటపల్లి గ్రామస్తులు కోరుతున్నారు.

జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఎలక్షన్ క్యాంపెన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు పాల్గొన్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంతన్న

జూబ్లీహిల్స్ నియోజవర్గంలో ఎలక్షన్ క్యాంపెన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ తో పాటు పాల్గొన్న మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే గౌరవనీయులు శ్రీ మైనంపల్లి హనుమంతన్న గారితో 138 మౌలాలి డివిజన్ ప్రెసిడెంట్ పోతుల వినోద్ యాదవ్. ప్రచారంలో భాగంగా యూసఫ్ గూడా మరియు బోరబండ లోని గడపగడపకు చేరి అభివృద్ధి పనుల గురించి చర్చిస్తూ సరైన నిర్ణయం తీసుకుని కాంగ్రెస్కు ఓటు వేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో మంద భాస్కర్, చందు, 138 డివిజన్ జనరల్ సెక్రటరీ వకీల్ సలీం, కాంగ్రెస్ మల్కాజ్గిరి సర్కిల్ యూత్ వైస్ ప్రెసిడెంట్ అజయ్, ప్రేమ్, మహమూదా బేగం, తనీష్, అశోక్, అనీష్, రిషి, నీరజ్ మరియు తదితరులు పాల్గొనడం జరిగింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రోడ్డు ప్రమాదాలకు చెక్ – కాంట్రాక్టర్లపై కేంద్రం కఠిన నిర్ణయం

రోడ్డు ప్రమాదాలను తగ్గించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై జాతీయ రహదారులపై ఏదైనా నిర్దిష్ట ప్రాంతంలో ఏడాదిలో ఒకటి కంటే ఎక్కువ ప్రమాదాలు జరిగితే, సంబంధిత రోడ్డు కాంట్రాక్టర్లపై భారీ జరిమానాలు విధించనుంది. రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించకపోవడం, సరైన రహదారి సంరక్షణ లేకపోవడం వంటి కారణాలతో జరిగే ప్రమాదాలపై బాధ్యత కాంట్రాక్టర్లదేనని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ చర్యతో రహదారి పనుల్లో నాణ్యత పెరిగి ప్రమాదాలు తగ్గుతాయని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.