Monday, 6 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

పరీక్షలు చేస్తాము…. కానీ రిజల్ట్ పేపర్లు ఇవ్వలేము

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం భూంపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పేషంట్స్ వచ్చినప్పుడు డాక్టర్ గారు రాసినటువంటి రక్త పరీక్షలను చేస్తున్న తిరిగి వచ్చిన రిపోర్టును రిజల్ట్ ను పేపర్ రూపేనా ఇవ్వనంటున్నటువంటి ఆసుపత్రి సిబ్బంది అధికారులు పేషంట్స్ అడిగినప్పటికీ పేపర్ లేవు పేపర్లు తెచ్చుకోవడానికి డబ్బులు లేవు అని చేతులెత్తేస్తున్న వైనం పేషెంట్స్ వారికి వచ్చిన జబ్బును తగ్గని పరిస్థితులలో పెద్ద ఆసుపత్రిలో చూపించుకోవడానికి చేపిచ్చుకున్నటువంటి రక్త పరీక్షల కాగితాలు లేవని వాపోతున్నారు

కడప

ప్రొద్దుటూరు పట్టణంలోని పలు cc రోడ్లకు భూమి పూజ

పున్నమి (ప్రొద్దుటూరు) నవంబర్ 3 సోమవారం పట్టణం లోని 16 వ వార్డ్ ఐడియల్ స్కూల్ వద్ద 35 లక్షల cc రోడ్డు పనులకు అలాగే రాయల్ ఫంక్షన్ హాల్ ఎదురు వీధి ఖాదర్ హుస్సేన్ మసీదు వీధి 30 లక్షల cc రోడ్డు పనులకు భూమి పూజ నిర్వహించిన ప్రొద్దతూరు శాసన సభ్యులు నంద్యాల వరద రాజుల రెడ్డి ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ తెదేపా రాష్ట్ర కార్యక్రమం నిర్వహాక కార్యదర్శి. అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ అధ్యక్షులు S.ముక్తియార్, తెదేపా ప్రొద్దుటూరు పట్టణ అధ్యక్షులు ఖలీల్ బాషా, మునిసిపల్ కమిషనర్ రవి చంద్ర రెడ్డి, మునిసిపల్ D. E రాజేష్ పలువురు తెదేపా కార్యకర్తలు మునిపల్లి సిబ్బంది పాల్గొన్నారు.

తిరుపతి

బైక్ ను ఢీ కొట్టిన వ్యాను

*బిగ్ బ్రేకింగ్ న్యూస్ :* *నాయుడుపేట పూతలపట్టు 71 వ జాతీయ రహదారి గుర్రపుతోట వద్ద రోడ్డు ప్రమాదం* బైక్ ను ఢీ కొట్టిన వ్యాను రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి ఒకరికి గాయాలు ఘటనా స్థలాన్ని పరశీలిస్తున్న ఎస్సై నాగరాజు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

గుంటూరు

స్వర్గీయ టి. కృష్ణ చిరస్మరణీయుడు సాంస్కృతిక కార్యక్రమంలో పలువురు వక్తలు

నవంబర్2 పున్నమి ప్రతినిధి @ గుంటూరు స్థానిక బృందావనం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం ప్రాంగణంలో ఉన్న అన్నమయ్య కళావేదిక లో స్వర్గీయ సినీ దర్శకులు టి. కృష్ణ సంస్కృతి కార్యక్రమం ఆదివారం సాయంత్రం 6గంటలకు డాక్టర్ బద్రి పీర్ కుమార్ సభా పరిచయంతో ప్రారంభమై విజయవంతంగా నిర్వహించడం జరిగింది. సామాజిక చైతన్య స్ఫూర్తిని కలిగించే అద్భుతమైన చిత్రాలకు దర్శకత్వం వహించి అతి తక్కువ కాలంలో సినీ చరిత్రలో మంచి పేరు తెచ్చుకున్న వారు టి. కృష్ణ. వెండి తెర అరుణ కిరణం సినీ దర్శకులు టి. కృష్ణని స్మరించుకుంటూ పలువురు వక్తలు ప్రసంగించారు. కృష్ణ గారు చిరస్మరణీయులని, ఉషాకిరణ్ మూవీస్ వారి ప్రతిఘటన చిత్రానికి కథ, మాటలు, అందించడంతో పాటు దర్శకత్వం వహించి సంచలన విజయాన్ని అందుకున్నారని, దర్శకత్వం వహించినవి ఏడు చిత్రాలే అయినప్పటికీ సామాజిక సృహ కలిగిన అద్భుత చిత్రాలని, ఆయన దర్శకత్వం వహించిన ప్రతిఘటన, రేపటి పౌరులు మొదలైన చిత్రాలు సమాజాన్ని ఆలోచింపజేసినవని ఇటువంటి చిత్రాలు సమాజానికి ఉపయోగపడతాయని టి. కృష్ణ గారిని ఆదర్శంగా తీసుకుని మరిన్ని సందేశాత్మక చిత్రాల నిర్మాణం జరగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో నటనాలయ అధ్యక్షులు నీలం మందారావు, సభాధ్యక్షులు డాక్టర్ జి.ఎస్. ప్రసాద్ రెడ్డి, ముఖ్య అతిథి నల్లూరి వెంకటేశ్వర్లు, గుంటూరు సిఐడి డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ డి.ఎస్.పి. గోలి లక్ష్మయ్య, కె.వి మెమోరియల్ పరిషత్ వ్యవస్థాపక కార్యదర్శి పి. శివప్రసాద్, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు చిటిపోతు మస్తానయ్య, రచయిత దర్శకులు రాయపాటి ఆశీర్వాదం, ఆత్మకూరు ప్రసాద్, నెల్లూరు సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సభా కార్యక్రమం అనంతరం స్నేహాంజలి ఆర్ట్స్ కొండేవరం పిఠాపురం వారిచే బర్రె సత్యనారాయణ రచించిన “చింత చచ్చినా” హాస్య నాటికను ప్రదర్శించారు.

E-పేపర్

శుభ సోమవారం శుభోదయం : బోళా శంకరుడు

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 శుభ సోమవారం శుభోదయం : బోళా శంకరుడు శుభోదయం సోమవారం, శివనామ స్మరణతో! కార్తీక కాంతుల్లో, కైలాసవాసుని రూపం! ఉదయ కిరణాలు తాకే వేళ, ఓంకార నాదంతో, బోళా శంకరుడు మెరిసెను, విభూది కాంతులతో. గంగమ్మ శిరసున నర్తించగా, చంద్రవంక చల్లగా, తొలి పొద్దు వెలుగులో, త్రిశూలం దేదీప్యమానం. నీలకంఠుని రూపం, నిలువెత్తు కరుణామయం, కోరిన కోర్కెలు తీర్చే, భోళాతనపు నిలయం. నందీశ్వరుని అరుపు, డమరుక ధ్వని ప్రతిధ్వని, ప్రకృతి అంతా పులకించె, పరమేశ్వరుని దర్శనమై. కార్తీక సోమవారం, కఠిన తపస్సుల ఫలం, దీపారాధన చేయగా, దీవెనలిచ్చే శివం. పాపాలు పటాపంచల్, పూజించిన భక్తులకు, ముక్తిని ప్రసాదించు, ముక్కంటి బోళా శంకర! హర హర మహాదేవ శంభో

ఎన్ టి ఆర్ జిల్లా

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి చర్యలు* *4వ డివిజన్‌లో డీఎంఎస్‌ విజయం సంఘం విజయవాడ గ్రాండ్‌ బజార్‌ను ప్రారంభించిన ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌*

మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ప్రత్యేకంగా చర్యలు తీసుకుంటున్నారని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. ఆదివారం ఉదయం తూర్పు నియోజకవర్గ పరిధిలోని 4వ డివిజన్‌ ఏపీఐఐసీ కాలనీలో డీఎంఎస్‌ విజయం సంఘం, విజయవాడ గ్రాండ్‌ బజార్‌ కు ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ ముఖ్య అతిధిగా హాజరై, ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ మాట్లాడుతూ మహిళలను ఆర్థికంగా బలోపేతంగా ఉండాలని 1995వ సంవత్సరంలోనే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆలోచించి డ్వాక్రా వ్యవస్థను అమలు చేశారన్నారు. అన్న ఎన్టీఆర్‌ మహిళలకు ఆస్తి హక్కులో వాటా కల్పించారన్నారు. ఇంట్లో ఒక మహిళ చదువుకుంటే ఆ ఇల్లు మొత్తం చదువుకున్నట్లేనని చెప్పారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమలు చేసిన డ్వాక్రా గ్రూపు వ్యవస్థ ద్వారా నేడు మహిళలు ఆర్థికంగా చాలా బలంగా ఉన్నారన్నారు. నేడు బ్యాంకు ఉద్యోగులందరూ బిజీగా ఉండడానికి, బ్యాంకుల పనితీరు బాగుండడానికి ఒక కారణం డ్వాక్రా సంఘాల సభ్యులు బ్యాంకుల్లో నిర్వహిస్తున్న లావాదేవీలేనని అభిప్రాయపడ్డారు. మహిళలకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. భవిష్యత్తులో మహిళలను అన్ని రంగాల్లో బలోపేతం చేసేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామమోహన్‌ చెప్పారు. డీఎంఎస్‌ విజయం సంఘం, విజయవాడ గ్రాండ్‌ బజార్‌ అధ్యక్షురాలు పీ.నళిని మాట్లాడుతూ మహిళలను ఉపాధి చూపించి వారికి జీవనోపాధి కల్పించడానికి తమ సంఘం అనేక కార్యక్రమాలను నిర్వహిస్తోందని చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రాండ్‌ బజార్‌ కార్యదర్శి సుబ్బలక్ష్మి, కోశాధికారి స్వన్న, గ్రోత్‌ ఆఫీసర్‌ వీవీఎన్‌. లక్ష్మి, ట్రైనింగ్‌ ఆఫీసర్‌ నీలిమ పాల్గొన్నారు.

ఖమ్మం

ఖమ్మం టౌన్ 57వ డివిజన్లో ప్రజల తో భారతీయ జనతా పార్టీ కంటెస్టెంట్ కార్పొరేటర్

ఈ రోజున 57 వాస్తవ్యులు వెంకటేశ్వరరావు గారికి ఆరోగ్యరీత్యా వారుకి ఖమ్మంలోని వెంకటేశ్వర హాస్పిటల్ స్టంట్ వేయడం జరిగింది. ఈ రోజున వారి ఇంటికి వెళ్లి వారిని పరామర్శించి ఆయుష్మాన్ భారత్ స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్, అలాగే సీఎం రిలీఫ్ ఫండ్ గురించి వారికి వివరించి వారి ఆరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకోవడం జరిగింది.అని ఖమ్మం 57వ డివిజన్ కాంటెస్టెడ్ కార్పొరేటర్ భారతీయ జనతా పార్టీ రెండవ పట్టణ ప్రధాన కార్యదర్శి శ్రీ రుద్ర గాని మాధవ్ తెలియజేశారు 57వ డివిజన్లో మౌలిక వసతులు కాకుండా ప్రతి వ్యక్తితో సంబంధాలు కొనసాగిస్తూ సమాజ సేవే పరమావధిగా ముందుకు సాగుతున్న శ్రీ రుద్ర గాని మాధవ్ గారిని డివిజన్ ప్రజలు ఆదరిస్తున్నారు ప్రజలతో మమేకమై ప్రజా సమస్యలపై పోరాడుతున్న మాధవ్ గారిని కొనియాడారు

రంగారెడ్డి

రంగారెడ్డి జిల్లా బస్సు ప్రమాద ఘటన లో మృతుల సంఖ్య పెరిగే అవకాశం….*.

నవంబర్ 3 పున్నమి రంగారెడ్డి జిల్లా తాండూరు బస్ డిపోకు చెందిన బస్సును సోమవారం కంకర ట్రక్కు ఢీకొట్టడంతో 24 మంది ప్రయాణికులు మృతి చెందగా, పలువురు తీవ్రంగా గాయపడ్డారు. చేవెళ్ల మండలం మీర్జాగూడ గ్రామ సమీపంలో ఈ సంఘటన జరిగింది, కంకర లోడ్ తో వెళ్తున్న టిప్పర్ తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టింది. దీంతో12 మంది పురుషులు, 11 మంది మహిళలు, ఒక చిన్నారి సహా 24 మంది మరణించారు. తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సు డ్రైవర్ కూడా మృతుల్లో ఉన్నాడు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.బస్సులో దాదాపు 70 మంది ప్రయాణికులు ఉన్నారని, వీరిలో ఎక్కువ మంది విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నారని అధికారులు తెలిపారు. గాయపడిన వారిని చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సుపై కంకర పడటంతో, అనేక మంది ప్రయాణికులు వాహనం లోపలచిక్కుకుపోయారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. సహాయక చర్యల సమయంలో, చేవెళ్ల సర్కిల్ ఇన్‌స్పెక్టర్ భూపాల్ శ్రీధర్ పై ఒక JCB ఎక్కి ఎడమ కాలుకు తీవ్ర గాయమైంది. CI ని చికిత్స కోసం చేవెళ్ల ఆసుపత్రికి తరలించారు. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా హైదరాబాద్-బీజాపూర్ హైవేపై భారీ ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. చేవెళ్ల-వికారాబాద్ మార్గంలో పెద్ద సంఖ్యలో వాహనాలు నిలిచిపోయాయి… ప్రమాదవస్థలానికి వచ్చిన చేవెళ్లే ఎమ్మెల్యే … ఎమ్మెల్యే నాలుగు గంటలైన ప్రమాద స్థలానికి రాకపోవడంతో ప్రజల తీవ్ర ఆగ్రహం… సంఘటన స్థలం నుండి ఎమ్మెల్యేని పంపించిన పోలీసులు..

ఖమ్మం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో హైటెన్షన్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా.. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో హైటెన్షన్ బిఆర్ఎస్ కార్యాలన్నీ తగలబెట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు.. బిఆర్ఎస్ కార్యాలయం పై దాడి, టిఆర్ఎస్ ఫ్లెక్సీలు, ఫర్నిచర్ ,ధ్వంసం చేసిన కాంగ్రెస్ కార్యకర్తలు బిఆర్ఎస్ కార్యాలయం కాంగ్రెస్ పార్టీ కి చెందిన స్థలం అంటూ నినాదాలు బిఆర్ఎస్ కార్యాలయాన్ని పూర్తిగా స్వాధీనపరుచుకున్న కాంగ్రెస్ నేతలు భారీగా చేరుకున్న ఇరు వర్గాలు పరిస్థితి ఉద్రిక్తం భారీగా పోలీసుల మోహరింపు. ఎమ్మెల్యే పాయం ,పొంగులేటి నాయకత్వం వర్ధిల్లాలి జై కాంగ్రెస్, అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళనలో పాల్గొన్న కాంగ్రెస్ శ్రేణులు

తెలంగాణ

చేవెళ్ల సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. 17 మంది మృతి..

తెలంగాణా నవంబర్ 3(పున్నమి ప్రతినిధి) రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం చేవెళ్ల మండలం మీర్జాగూడ సమీపంలో తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్‌ ఢీకొట్టింది. దీంతో ఇద్దరు డ్రైవర్లు సహా 17 మంది దుర్మరణం చెందారు. మరికొందరు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బస్సుపై కంకర లోడు పడిపోవడంతో పలువురు ప్రయాణికులు అందులో కూరుకుపోయారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మూడు జేసీబీల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. కంకరలో కూరుకుపోయిన వారిని బయటకు తీస్తున్నారు. ఇప్పటివరకు 15 మందిని బస్సులోనుంచి బయటకు తీశారు. క్షతగాత్రులను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. తాండూరు డిపోకు చెందిన ఎక్స్‌ప్రెస్‌ బస్సు తాండూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బస్సులో సుమారు 70 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వారిలో ఎక్కువగా విద్యార్థులు, ఉద్యోగులు ఉన్నట్లు తెలుస్తున్నది. విద్యార్థులు హైదరాబాద్‌లోని పలు కాలేజీల్లో చదువుతున్నట్లు సమాచారం. బస్సుపై టిప్పర్‌ పడిపోవడంతో డ్రైవర్‌ వైపు పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. ప్రయాణికుల ఆర్తనాలతో ప్రమాద స్థలం హృదయవిదారకంగా మారింది. రోడ్డు ప్రమాదంతో హైదరాబాద్‌-బీజాపూర్‌ హైవేపై భారీగా ట్రాఫిక్‌జామ్‌ అయింది. చేవెళ్ల-వికారాబాద్‌ మార్గంలో పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. దీంతో ఘటనా స్థలానికి అంబులెన్స్‌కు కూడా చేరుకోలేని పరిస్థితి ఏర్పడింది

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.