Monday, 6 April 2026

Blog

కర్నూలు

భారత మహిళా క్రికెట్ జట్టు విజయం పట్ల పేద్దనెలటూరులో సంబరాలు – Impact ట్రైనర్ లయన్ KK దామోదర రావు గారు

పేద్దనెలతూరు, గోనెగండ్ల మండలం — భారత మహిళా క్రికెట్ జట్టు ప్రపంచ కప్ విజయం సాధించిన సందర్భంగా ఇంపాక్ట్ ట్రైనర్ & లయన్ దామోదర్ రావు గారు ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకను లయన్స్ క్లబ్ ఆఫ్ కర్నూల్ (మెల్విన్ జోన్స్ – 316 D) మరియు ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంయుక్త ఆధ్వర్యంలో పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాస్ లో భాగంగా నిర్వహించారు. విద్యార్థుల్లో జట్టుగా పని చేయడం, క్రమశిక్షణ, మరియు కృషి విలువలను ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ప్రధాన లక్ష్యం. ఈ సందర్భంగా లయన్ దామోదర్ రావు గారు మాట్లాడుతూ — భారత మహిళా జట్టు సాధించిన విజయం ప్రతి విద్యార్థికి ప్రేరణగా నిలుస్తుందని, క్రీడల్లో చూపిన కష్టపడి పనిచేసే తత్వాన్ని చదువులోనూ, జీవితంలోనూ అనుసరించాలని సూచించారు. కార్యక్రమంలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని “చాంపియన్స్” పోస్టర్ ముందు తాము కూడా భవిష్యత్తులో విజేతలుగా నిలుస్తామని సంకేతంగా థంబ్స్ అప్ ఇచ్చారు. పాఠశాల ప్రాంగణం దేశభక్తి, ప్రేరణ, ఆనందంతో నిండిపోయింది. ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమాలు గ్రామీణ ప్రాంతాల విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసం, నాయకత్వం, మరియు విజయం పట్ల నిబద్ధతను పెంపొందిస్తున్నాయి.

అనకాపల్లి

మానవత్వం చాటుకున్న హోం మంత్రి అనిత రోడ్డు ప్రమాదంలో గాయపడిన వారిని స్వయంగా ఆస్పత్రికి తరలించిన మంత్రి హోం మంత్రికి ప్రజల నుంచి అభినందనల వెల్లువ

కష్టంలో ఉన్న వారిని చూసి వెంటనే సహాయం చేయాలనే మానవత్వం మరోసారి చాటుకున్నారు రాష్ట్ర హోం మంత్రి అనితమ్మ. యలమంచిలి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పలువురు గాయపడిన విషయం తెలుసుకున్న అనితమ్మ తన కాన్వాయ్‌ను ఆపించి స్వయంగా సహాయ చర్యల్లో పాల్గొన్నారు. విశాఖపట్నం నుంచి నక్కపల్లి వైపు ప్రయాణిస్తున్న సమయంలో ప్రమాద ఘటనను చూసిన అనితమ్మ క్షణం ఆలస్యం చేయకుండా వాహనాల నుంచి దిగిపడి ఉన్న క్షతగాత్రులను ఆదుకున్నారు. గాయపడిన వారిని సాంత్వనపరుస్తూ, సిబ్బందికి తక్షణ చర్యలు చేపట్టమని ఆదేశించారు. అనంతరం బాధితులను ప్రభుత్వ వాహనాలు మరియు అంబులెన్స్‌ల ద్వారా యలమంచిలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించే ఏర్పాట్లు స్వయంగా పర్యవేక్షించారు. తరువాత ఆస్పత్రికి చేరుకుని వైద్య సేవల పురోగతిని స్వయంగా పరిశీలించారు. గాయపడిన వారితో మాట్లాడుతూ ధైర్యం నింపి, అవసరమైన సహాయాన్ని అందించారు. ఓ సామాన్య మహిళలా మారి బాధితులను ఓదారుస్తూ సపర్యలు చేసిన అనితమ్మను చూసి స్థానిక ప్రజలు “నాయకురాలంటే ఇలానే ఉండాలి” అని ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజల జీవితాల పట్ల చూపిన సానుభూతి, మానవతా విలువలను ప్రతిబింబించిన ఈ చర్యకు సామాజిక వర్గాలనుంచి కూడా అభినందనలు వెల్లువెత్తుతున్నాయి

ఎన్ టి ఆర్ జిల్లా

విజయవాడ ఐటీఐ కాలేజీ రోడ్డులో వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు

విజయవాడ ఐటీఐ కాలేజీ రోడ్డులో వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ను విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ప్రారంభించారు. ఆపరేషన్ థియేటర్, ఐసీయూ, వీఐపీ, ఏసీ జనరల్ వార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వసుధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఎండీ జి.లక్ష్మీ కుమార్, సీఈవో కె.సుధాకర్ తో పాటు ఎంపీ కేశినేని చిన్ని(శివనాథ్), మంత్రి కొల్లు రవీంద్ర, విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఉక్కుమనిషి పటేల్ 150వ జయంతి సందర్భంగా గాన ప్రియను సత్కరించిన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు

పెందుర్తి నియోజకవర్గం సుజాతనగర్ క్యాంపు కార్యాలయంలో ఈరోజు దేశ ఐక్యతకు ప్రతీక అయిన ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా రాజ్యసభ సెంట్రల్ హాల్లో ప్రసంగించిన మడుతూరి గాన ప్రియను పెందుర్తి ఎమ్మెల్యే, జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం రూరల్ జిల్లా అధ్యక్షుడు పంచకర్ల రమేష్ బాబు సత్కరించారు. గత అక్టోబర్ 31న దేశ రాజధాని ఢిల్లీలోని రాజ్యసభ సెంట్రల్ హాల్‌లో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో, విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామానికి చెందిన, ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతున్న మడుతూరి గాన ప్రియా, సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి గొప్పతనం, దేశ ఐక్యతకు ఆయన చేసిన కృషి గురించి ప్రసంగించి అందరి ప్రశంసలు పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు ఆమెకు సాలువా కప్పి సత్కరించి అభినందనలు తెలిపారు. యువతిలో దేశభక్తి, సేవా భావం పెంపొందించడం అవసరమని, గాన ప్రియా వంటి ప్రతిభావంతులైన విద్యార్థులు సమాజానికి ఆదర్శంగా నిలుస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గొల్లవిల్లి రమణ, కంచిపాటి మధు, మడక బంగార్రాజు, గన్రెడ్డి రమేష్ తదితర నాయకులు, ఉమ్మడి ఎన్‌డిఏ మహాకూటమి కార్యకర్తలు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

పీజీఆర్ఎస్ ఫిర్యాదుదారుల‌తో జిల్లా అధికారులే నేరుగా మాట్లాడాలి ఆదేశించిన జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ వివిధ స‌మ‌స్య‌ల‌పై 413 విన‌తులు స‌మ‌ర్పించిన ప్ర‌జ‌లు

ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో భాగంగా ఫిర్యాదుదారుల‌తో సంబంధిత శాఖల‌ జిల్లాస్థాయి అధికారులే నేరుగా మాట్లాడాల‌ని, దిగువ స్థాయి సిబ్బంది మాట్లాడ్డానికి వీల్లేద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ తేల్చి చెప్పారు. ఆడిట్ నివేదిక‌ల ప‌రిశీల‌న‌, ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న, సంతృప్తి త‌దిత‌ర నివేదిక‌ల సునిశిత ప‌రిశీల‌న అనంత‌రం క‌లెక్ట‌ర్ ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇత‌ర అధికారుల‌తో, సిబ్బందితో ఫోన్లు చేయించి తూతూమంత్రంగా ఎండార్స్మెంట్ ఇవ్వ‌డానికి వీల్లేద‌ని, ప్ర‌తీ ఫిర్యాదుదారుతో అధికారులు త‌ప్ప‌కుండా మాట్లాడాల్సిందేన‌ని ఉద్ఘాటించారు. గ‌తంలో వ‌చ్చిన ఫిర్యాదులు, అధికారులు తీసుకున్న చ‌ర్య‌లు, ఇచ్చిన నివేదిక‌ల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించిన ఆయ‌న అధికారులు ఫిర్యాదుల ప‌రిష్కారంలో మ‌రింత చొరవ చూపాల‌ని, కాల‌యాప‌న చేయ‌కుండా నిర్ణీత స‌మ‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో నిర్వ‌హించిన పీజీఆర్ఎస్ లో జాయింట క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ తో క‌లిసి ఆయ‌న ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ప‌లు అంశాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. స‌మ‌స్య‌పై పూర్తి అవగాహ‌న‌తో ఉండాల‌ని, నాణ్య‌మైన ప‌రిష్కారం చూప‌డం ద్వారా ఫిర్యాదులు పున‌రావృతం కాకుండా చూడొచ్చ‌న్నారు. ఫిర్యాదు స్థితిగ‌తుల‌పై ప్ర‌జ‌ల‌కు విడ‌మ‌రిచి చెప్పాల‌న్నారు. పీజీఆర్ఎస్ లో భాగంగా ప్ర‌జ‌లు వివిధ స‌మ‌స్య‌ల‌పై 413 విన‌తులు స‌మ‌ర్పించారు. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందిన‌వి 148, జీవీఎంసీకి చెందిన‌వి 126, పోలీస్ శాఖకు సంబంధించి 32, ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించిన‌వి 107 ఫిర్యాదులు ఉన్నాయి. జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, జీవీఎఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్ వ‌ర్మ ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఖమ్మం

బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకులు తాండ్రవినోద్ రావు

ఖమ్మం (పున్నమి ప్రతి నిధి ) జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి గెలుపు కోసం విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు బీజేపీ రాష్ట్ర నాయకులు ఖమ్మం పార్లమెంట్ కంటెస్టడ్ అభ్యర్థి తాంద్ర వినోద్ రావు. వివరాల్లోకి వెళ్తే.. జూబ్లీహిల్స్ సిట్టింగ్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హఠాత్ మరణంతో ఉప ఎన్నికలు అనివార్యమయ్యాయి. ఈ నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా లంకల దీపక్ రెడ్డి కి పార్టీ అధిష్ఠానం టికెట్ మంజూరు చేసింది.. జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ప్రచారం చేస్తూ ప్రతి ఒక్క ఓటరుని కలుస్తు ముందు కు సాగుతున్నారు. ఈ సం దర్భముగా తాండ్ర వినోద్ రావు మాట్లాడుతూ, బిజెపి రాష్ట్ర అధ్యక్షుల సారథ్యంలో ప్రతి బూత్‌లో, ప్రతి గడప వద్ద విస్తృతంగా ప్రచారం జరుగుతోందని తెలిపారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం జూబ్లీహిల్స్‌లో అభివృద్ధి కార్యక్రమాలు చేయడంలో విఫలమయ్యాయని విమర్శించారు. అలాగే, కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ నేతృత్వంలో ప్రజల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుండగా, రాష్ట్ర ప్రభుత్వం వాటిని సరైన విధంగా వినియోగించడంలో విఫలమవుతోందని ఆరోపించారు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నేతృత్వంలో ఎన్నికల ప్రచారం ఉత్సాహంగా సాగుతుందని, కేంద్రం విడుదల చేసిన వందల కోట్ల రూపాయల నిధులను రేవంత్ సర్కార్ వినియోగించకపోవడం విచారకరమని అన్నారు. రేపు 11 న జరగనున్న జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రజలు బిజెపి అభ్యర్థి లంకల దీపక్ రెడ్డి విజయం సాధించేలా ఆశీర్వదించాలని తాండ్ర వినోద్ రావు పిలుపునిచ్చారు. ప్రచారంలో ఎక్కడికి వెళ్లినా ప్రజలు బిజెపిని విశేషంగా ఆదరిస్తుండటం గర్వకారణమని, రాబోయే కాలంలో భారతీయ జనతా పార్టీ తిరుగులేని శక్తిగా నిలుస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

విశాఖపట్నం

కాంగ్రెస్ తోనే ప్రజా స్వామ్యానికి ఊపిరి : ప్రియాంక దండి

దేశంలో ఎప్పుడు లేని విధంగా మోదీ హయాంలో ప్రజాస్వామ్యం ఖూనీ అవుతోందని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి అన్నారు. సోమవారం ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ” ఓటు చోర్, గద్దె చోడ్ ” సంతకాల సేకరణ కార్యక్రమం చేసారు, విశ్రాంతి ఆచార్యులు జాన్ మాస్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక మాట్లాడుతూ దేశంలో అన్ని వ్యవస్థలను ఎన్ డి ఏ ప్రభుత్వం నాశనం చేసిందని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడ చేతిలో పెట్టుకొని ఓట్లు దొంగతనం చేసి అధికారంలోకి వస్తోందని, ప్రజలు మేలుకోవాల్సిన సమయం వచ్చింది, మన ఓటుని దొంగలించి బీజేపీకి సహకరిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రజలు ఉద్యమంలా లేఖలు రాసి ప్రజాగ్రహాన్ని తెలియజేయాలని ప్రియాంక పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఆలీ,జగన్ మురారి, వార్డు అధ్యక్షులు భోగవరపు శ్రీనివాస్, ఈగల మోహన్ సాయి, వేమూరి సురేష్, చింతగుంటి వెంకటేష్,యూత్ కాంగ్రెస్ నాయకులు చంద్ర మౌళి, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

48వ వార్డులో మౌలిక వసతుల కల్పనకు కృషి చేయాలని జీవీఎంసీ మేయర్‌కు వినతి రిటైనింగ్ వాల్, అంగన్వాడీ మరమ్మతులు, ప్రధాన డ్రైనేజీ నిర్మాణం చేయాలని గంకల డిమాండ్

జీవీఎంసీ 48వ వార్డులో మౌలిక వసతుల అభివృద్ధి కోసం తక్షణ చర్యలు తీసుకోవాలని జీవీఎంసీ 48వ వార్డు కార్పొరేటర్, బీజేపీ ఫ్లోర్ లీడర్, స్టాండింగ్ కమిటీ సభ్యురాలు గంకల కవిత అప్పారావు యాదవ్ జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావును కలసి వినతి పత్రం సమర్పించారు. గంకల మాట్లాడుతూ, ఇందిరానగర్-2 ప్రాంతంలో వర్షాకాలంలో రిటైనింగ్ వాల్ లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వెంటనే రిటైనింగ్ వాల్ నిర్మాణం చేపట్టాలని కోరారు. అలాగే 1990లో నిర్మించిన అంగన్వాడీ భవనం పాడైపోవడంతో చిన్నారులు, సిబ్బంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, భవనానికి తక్షణ మరమ్మతులు అవసరమని తెలిపారు. వార్డులోని ప్రధాన డ్రైనేజీలు, కాలువలు దెబ్బతిన్నాయని వాటి పునర్నిర్మాణం తక్షణం చేపట్టాలని సూచించారు. అదేవిధంగా 75A, 13A, 74A, 76A, 78A, 190A ట్రాన్స్‌ఫార్మర్‌ల పరిధిలో సుమారు 200 వీధి దీపాలు మసకబారిన స్థితిలో ఉన్నాయని, వాటి స్థానంలో నూతన వీధి దీపాలు ఏర్పాటు చేయాలని కోరారు. వార్డులో సుమారు 10 కొత్త రింగ్ పోల్స్ ఏర్పాటు అవసరమని కూడా గంకల తెలిపారు. మౌలిక వసతుల అభివృద్ధిపై తన వినతిని సానుకూలంగా పరిగణించనున్నట్లు జీవీఎంసీ మేయర్ పీలా శ్రీనివాసరావు స్పందించినట్లు గంకల పేర్కొన్నారు.

E-పేపర్

నిచ్చితార్థ వేడుకలో పాల్గొన్న BRS పార్టీ భువనగిరి పార్లమెంటు ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు క్యామ మల్లేష్

పున్నమి ప్రతినిధి ఆలంపల్లి దుర్గేష్ 9640204826 ఇబ్రహీంపట్నం మండల మాజీ ZPTC పొట్టి ఐలయ్య కుమారుడు రవి చంద్ర,సుష్మిత నిచ్చితార్థ వేడుకలో పాల్గొన్న BRS పార్టీ భువనగిరి పార్లమెంటు ఇంచార్జ్ తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం అధ్యక్షులు క్యామ మల్లేష్

ఆంధ్రప్రదేశ్

42%బీసీ రిజర్వేషన్స్ పార్లమెంట్లో చట్టం చేసి 9th షెడ్యూల్ చేర్చి రక్షణ కల్పించాలి.42% బిసి రిజర్వేషన్ సాధన సమితి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలకు స్థానిక ఎన్నికల్లో మరియు విద్యా,ఉద్యోగ రంగాల్లో 42% రిజర్వేషన్స్ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కల్పించాలని ఈరోజు సిద్దిపేట అర్బన్ మండల MRO గారికి వినతి పత్రం అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం బిల్ నెంబర్ 3 మరియు 4 ద్వారా మార్చ్ 2025 న విద్యా,ఉద్యోగాలు సంస్థల్లో42% శాతం పెంచుతూ ఆమోదించింది ఈ బిల్లులు ఆమోదం పొందిన తర్వాత కేంద్రాన్ని పంపబడి ఏడు నెలలు కావస్తున్న ఇంకా 9th షెడ్యూల్లో చేర్చడానికి పెండింగ్లో ఉన్నాయి, బిల్లును వెంటనే పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లులను 9వ షెడ్యూల్లో తీర్చడానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని సాధన సమితి నాయకులు తెలియజేశారు.**42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవిలు గారు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ జస్టిస్ ఈశ్వరయ్య, డాక్టర్ విశారదన్ మహారాజ్, బాలగోని బాలరాజ్ గౌడ్ గారి పిలుపుమేరకు ఈరోజు రిప్రెసెంటేషన్ ఇవ్వడం జరిగింది.* *ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు కేంద్ర ప్రభుత్వం కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని వెంటనే బీసీలకు రాజ్యాంగబద్ధంగా వారి జనాభా ప్రకారం రిజర్వేషన్స్ కల్పించాలని, రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నటువంటి బిజెపి పార్టీపై యుద్ధం చేసి రాబోయే పార్లమెంట్ సీతాకాల సీత సమావేశాల్లో 42% రిజర్వేషన్స్42% రిజర్వేషన్స్ ఉప వర్గీకరణ చేయాలని అణగారిన వర్గాలకు సామాజిక న్యాయం జరిగేలా చూడాలని డిమాండ్ చేశారు.* *ఈ కార్యక్రమంలో బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ నాయకులు రవిబాబు, బోయిని సదన్, డి బి రాజు, యాదగిరి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.*

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.