Sunday, 5 April 2026

Blog

తిరుపతి

పట్టణప్రజలు సీజనల్ వ్యాదులకు గురుకాకుండా చర్యలు తీసుకోవాలీ- జన సైనికులు

శ్రీకాళహస్తి పట్టణంలో ఇటీవలి వర్షాలు, మొంథా తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండటంతో దోమల పెరుగుదల తీవ్రమయ్యే అవకాశం వునందున సోమవారం నాడు జనసేన పార్టీ నాయకులు మునిసిపల్ కమిషనర్ ని కలిసి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్బంగా జన సైనికులు మాట్లాడుతూ…. పట్టణ ప్రజలు డెంగ్యూ, వైరల్ ఫీవర్ వంటి వ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని, మురుగునీటి పారుదల వ్యవస్థను మెరుగుపరచి ఫాగింగ్, శానిటేషన్, క్లీనింగ్ కార్యక్రమాలు తక్షణమే ప్రారంభించాలని అదేవిధంగా పట్టణంలో కుక్కలు, పందుల బెడద తీవ్రంగా పెరుగుతుండటంతో, పిల్లలు, వృద్ధులు కుక్కల దాడులకు గురవడం, పందులు రహదారులపై సంచరిస్తూ అసౌకర్యం కలిగించడం వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని తెలిపారు. ఈ సమస్యలను అరికట్టేందుకు కుక్కల పట్టి, టీకా కార్యక్రమాలు, పందుల నిర్మూలన చర్యలు తక్షణమే చేపట్టాలని మునిసిపల్ అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్, జయప్రకాష్, మాధవ మహేష్, దినేష్, సురేష్, బాలాజి తదితరులు పాల్గొన్నారు.

తిరుపతి

అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్న బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసన సభ సబ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి అనుబంధ ఆలయమైన శ్రీశ్రీశ్రీ అర్ధనారీశ్వర స్వామి దేవాలయంలో తిరుపతి జిల్లా రైస్ మిల్లర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఈశ్వర్ రెడ్డి ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమానికి విచ్చేసిన బొజ్జల బృందమ్మకు ఆలయార్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి దర్శన ఏర్పాట్లు చేయగా ఈశ్వర్ రెడ్డి బృందమ్మకు శాలువాతో సన్మానించి చిరుసత్కారం చేయడం జరిగినది. అనంతరం ఆమె ఆన్నదాన కార్యక్రమంలో పాల్గొని భక్తులకు అన్నప్రయాద వితరణ చేశారు.

తిరుపతి

మాజీ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షున్ని సన్మానించిన గాలి మురళి నాయుడు

తొట్టంబేడు మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు. కే వి బి పురం మండల పార్టీ అధ్యక్షులు, తొట్టంబేడు మండల మాజీ మార్కెటింగ్ కమిటీ అధ్యక్షులు రామాంజుల నాయుడు, స్వగ్రామమైన కేవీబి పురంలో నూతన గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొని అనంతరం బీసా బత్తిన రామానుజుల నాయుడుని శాలువాతో సన్మానించారు. ఈ సందర్బనగా తొట్టంబేడు మండల మాజీ మండల పార్టీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు, మాట్లాడుతూ .. గ్రామంలో నూతన గృహప్రవేశం చేసి పేద ప్రజలకు సేవ చేసే భాగ్యాన్ని కల్పించడం పూర్వజన్మ సుకృతం అని, ప్రజలకు అందుబాటులో ఉండటం శుభపరిణామమని, శ్రీకాళహస్తీశ్వర స్వామి సమేత జ్ఞాన ప్రసూనాంబ అమ్మవారి ఆశీస్సులు రామానుజుల నాయుడుకి మెండుగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో కర్లపూడి ఆయకట్టు అధ్యక్షులు చీళ్ల వెంకట మునిరెడ్డి. మురళి నాయుడు, మాజీ మార్కెటింగ్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్ నాయుడు, రైతు విభాగం అధ్యక్షులు గోపీనాథ్ రెడ్డి, మాజీ జడ్పీటీసీ శ్రీహరి యాదవ్, మాజీ సర్పంచ్ అవసరం సురేష్, తదితరులు పాల్గొన్నారు

తిరుపతి

పాలక మండలి సభ్యునిగా లక్ష్మీనారాయణ ప్రమాణస్వీకారం

శ్రీకాళహస్తి నవంబర్ 03, పున్నమి టెంపుల్ న్యూస్ : శ్రీకాళహస్తీశ్వర స్వామి, శ్రీ జ్ఞాన ప్రసూనాంబకదేవి ఆలయ కార్యనిర్వహణ అధికారి బాపి రెడ్డి నూతన సభ్యుడు పుట్టపర్తికి చెందిన లక్ష్మీనారాయణచే ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం పాలకమండలి చైర్మన్ శ్రీ కొట్టే సాయి ప్రసాద్, రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షులు కోలా ఆనంద్, ప్రముఖ సినీ నటుడు నారా రోహిత్ దంపతులు ముఖ్య అతిథులుగా పాల్గొనగా, పాలకమండలి సభ్యులు ఆలయ అధికారులు శ్రీకాళహస్తి కోపరేటివ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్ బాలు, ఢిల్లీ బాబు హాజరయ్యారు.

తిరుపతి

శ్రీకాళహస్తి లో మున్సిపల్ కమీషనర్ ను కలిసిన జనసేన నాయకులు

శ్రీకాళహస్తి పట్టణంలో మున్సిపల్ కార్యాలయం నందు జనసేన నాయకులు మున్సిపల్ కమిషనర్ ని కలిసి పట్టణంలోని పలు సమస్యలపై చర్చించడం జరిగింది. అందులో భాగంగా ఇటీవల కోసం అనేక ప్రాంతాల్లో నీరు నిల్వ ఉండడం చేత దోమలు పెరిగి ప్రజలు డెంగ్యూ,మలేరియా వంటి వైరల్ ఫీవర్ల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని మురుగు నీటిపారుదల వ్యవస్థను మెరుగుపరచాలని,శానిటేషన్ క్లీనింగ్ కార్యక్రమాలు తక్షణమే ప్రారంభించాలని అన్నారు.అదేవిధంగా పట్టణంలో కుక్కలు బెడద మరియు పందులు ఎక్కువగా ఉండటంతో పిల్లలు మరియు వృద్ధులు కుక్కల దాడులకు గురవుతున్నారని,పందులు రహదారుల పై సంచరిస్తూ వాహనాలకు అసౌకర్యం కలిగిస్తున్నాయని,అధికారులు స్పందించి ఈ సమస్యలకు పరిష్కారం చూపే విధంగా తగు చర్యలు తీసుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు.

తిరుపతి

భారత రాజ్యాంగం నిర్వహణ పోటీల్లో బోనుపల్లి విద్యార్థినికి ప్రథమ స్థానం

శ్రీకాళహస్తి నవంబర్ 03 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి నియోజకవర్గం స్థాయిలో బోనుపల్లి విద్యార్థిని మహిజ ప్రతిభ: భారత రాజ్యాంగ దినోత్సవం నవంబరు 26 కి గుర్తుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం శ్రీకాళహస్తి అసెంబ్లీ స్థాయిలో భారత రాజ్యాంగంపై నిర్వహించిన పోటీల్లో తొట్టంబేడు మండలంలోని బోనుపల్లి హైస్కూల్ విద్యార్థిని S. మహిజ ప్రథమ స్థానంలో నిలిచినందుకుగాను DYEO మహేశ్వర రావు విద్యార్థిని పరత్యేకంగా అభినందించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ… భారత రాజ్యాంగంపై నిర్వహణ పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచిన విద్యార్థిని S. మహిజ 2025 నవంబర్ 26వ తారీఖున ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అసెంబ్లీలో పాల్గొననుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో MEO బాలయ్య, ప్రముఖ సాంఘిక శాస్త్ర ఉపాద్యాయములు చిరంజీవులు, గ్రామ పెద్దలు, బోనుపల్లి హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు భారతి, గైడ్ టీచర్ ఆదూరు శంకరరెడ్డి పాల్గొని విద్యార్థిని మహిజను అభినందించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

మాక్ అసెంబ్లీలో ఎంపికైన విద్యార్థిని సత్కరించిన ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

నందిగామ పట్టణంలోని కాకాని నగర్‌లో ఉన్న ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయంలో సోమవారం ఒక కార్యక్రమం జరిగింది. చందర్లపాడు మండలం కోనాయపాలెం గ్రామానికి చెందిన పదవ తరగతి విద్యార్థి వల్లపు అరవింద్, నవంబర్ 26న భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించనున్న మాక్ అసెంబ్లీలో పాల్గొనడానికి ఎంపికైనందుకు ఎమ్మెల్యే సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య అరవింద్‌ను శాలువాతో సత్కరించి, పుష్ప గుచ్ఛం అందజేశారు. “ఇది మీ ప్రతిభకు గుర్తింపు.భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలనిఆశిస్తున్నాను” అని ఆమె అభినందించారు. అరవింద్‌కి ఈ విజయావకాశం కల్పించిన ఉపాధ్యాయులు, కుటుంబ సభ్యులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు విద్యార్థు ల్లో ప్రజాస్వామ్య విలువలపై అవగాహన పెంపొందించడంలో దోహదపడతాయని స్థానికులు అభిప్రాయపడ్డారు.

జాతీయ అంతర్జాతీయ

*గుండెలు…పగిలే ఫొటో..*😢 *రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మరణించారని, అందులో 15 నెలల పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.

*గుండెలు…పగిలే ఫొటో..*😢 *రంగారెడ్డి జిల్లా మీర్జాగూడలో జరిగిన ఆర్టీసీ బస్సు ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. ఇప్పటివరకు 17 మంది మరణించారని, అందులో 15 నెలల పాప కూడా ఉన్నట్లు తెలుస్తోంది. తల్లి, బిడ్డ మృతదేహాలను బస్సులో నుంచి బయటకు తీసి రోడ్డుపై ఉంచిన ఫొటో కన్నీరు తెప్పిస్తోంది. ప్రమాద సమయంలో టిప్పర్ మితిమీరిన వేగంతో వెళ్లినట్లు సమాచారం. ఘటనాస్థలం వద్ద ప్రయాణికుల ఆర్తనాదాలతో భీతావహ వాతావరణం నెలకొంది.*

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో 37 మంది లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కుల పంపిణీ

మొత్తం రూ.24.17 లక్షల సాయం – ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య చేతుల మీదుగా పంపిణీ నందిగామ పట్టణం కాకాని నగర్‌ లో సోమవారం నాడు సీఎం సహాయనిధి ద్వారా మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య తమ కార్యాలయంలో కూటమినేతల సమక్షంలో మొత్తం 37 మంది లబ్ధిదారులకు రూ.24 లక్షల 17 వేల 420 రూపాయలచెక్కులను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సౌమ్య మాట్లాడుతూ – “ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందు లను గుర్తించి సీఎం అందిస్తున్న సహాయనిధి అనేక కుటుంబా లకు బలమైన అండగా నిలుస్తోంది. ఈ సాయంప్రజలకు జీవనాధారంగా మారుతోంది. ప్రజల సమస్యలు పరిష్కరించ డంలో ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రజల పక్షానే ఉంది” అని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి, కూటమినేతలు, స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. లబ్ధి దారులు ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే సౌమ్య కు కృతజ్ఞతలు తెలుపుతూ, ఈ ఆర్థిక సాయం తమ కుటుంబాలకు ఎంతో దోహదం చేసిందని అభిప్రాయపడ్డారు.

ఎన్ టి ఆర్ జిల్లా

భారత మహిళా క్రికెట్ జట్టుకు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హృదయపూర్వక శుభాకాంక్షలు

ప్రపంచ విజేతగా వరల్డ్ కప్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా క్రికెట్ జట్టుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హృదయపూర్వక అభినందన లు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ – “భారత మహిళా జట్టు చూపిన అద్భుత ప్రతిభ, కృషి, పట్టుదల భారత క్రీడా గౌరవాన్ని ప్రపంచ వేదికపై మరింత ఎత్తుకు తీసుకెళ్లింది. ప్రతి భారతీయుడికి ఇది గర్వ కారణం. మహిళా క్రీడాకారిణు లు ప్రదర్శించిన పోరాటపటిమ దేశ యువతకుస్ఫూర్తిదాయకం. ఈ విజయం భారత క్రీడా చరిత్ర లో సువర్ణాక్షరాలతో నిలిచిపో తుంది” అని పేర్కొన్నారు. అలాగే, భవిష్యత్తులో మరెన్నో అంతర్జాతీయ విజయాలను సాధించి భారతదేశ ప్రతిష్ఠను మరింతగా పెంచాలని ఆకాంక్షిం చారు. తంగిరాల సౌమ్య భారత మహిళా జట్టు క్రీడాకారిణులు, కోచ్ బృందం మరియు భారత క్రికెట్ బోర్డుకు అభినందనలు తెలుపుతూ, “ఈ విజయం భారత క్రీడా రంగానికి ఒక మైలురాయిగా నిలుస్తుంది” అని అన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.