Sunday, 5 April 2026

Blog

ఎన్ టి ఆర్ జిల్లా

రైతుల పక్షాన నిలిచిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ₹10.5 కోట్లు నష్టపరిహారం రైతుల చేతుల్లోకి

జగ్గయ్యపేట మండలంలోని సాయి తిరుమల కోల్డ్‌స్టోరేజ్‌లో సుమారు ఏడు నెలల క్రితం జరిగిన అగ్నిప్రమాదంలోమిరప, ఇతర వ్యవసాయ ఉత్పత్తులు పూర్తిగా నష్టపోయాయి. ఈ ప్రమాదంలో మొత్తం 207 మంది రైతులు తీవ్ర నష్టాన్ని ఎదుర్కొన్నారు. కరెంట్ షార్ట్ సర్క్యూట్ కారణంగా సంభవిం చిన ఈ అగ్నిప్రమాదంలో కోల్డ్‌ స్టోరేజ్ పూర్తిగా ధ్వంసమైంది. అయితే, రైతుల న్యాయం కోసం కృషి చేసిన జగ్గయ్యపేట ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నిరంతర ప్రయత్నాల ఫలితంగా, కోల్డ్‌స్టోరేజ్ యాజమాన్యం నుండి ₹10.5 కోట్లు నష్టపరిహా రంగా రైతులకు చెల్లింపులు జరిపారు. ఇన్సూరెన్స్ రిన్యువల్ చేయకపోయినా, యాజమాన్యం స్వయంగా ప్రతి రైతుకూ పరిహారం అందించడం రాష్ట్రంలో ఇదే మొదటి ఘనత వహించిన ఘటనగా నిలిచింది. ఈ సందర్భంగా రైతులఎమ్మెల్యే రాజగోపాల్ కుహృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతూ, ఆయన ప్రజాప్రతినిధిగా చూపిన మానవతా దృక్పథాన్ని ప్రశంసించారు.

ఆంధ్రప్రదేశ్

అభివృద్ధి సంక్షేమ పథకాలే కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దుబ్బాక

జూబ్లీహిల్స్ నియోజకవర్గం షేక్ పేట డివిజన్ లొ జోరుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం. జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఉప ఎన్నికల్లో భాగంగా షేక్ పేట డివిజన్ పరిధిలో దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు.సిద్దిపేట నియోజకవర్గ ఇంచార్జి పూజల హరికృష్ణ, చేగుంట,అక్బర్ పేట-భూంపల్లి మండలల కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పాదయాత్ర లో పాల్గొని డోర్ టు డోర్ ప్రచారం చేసారు. ప్రజలతో మమేకమై ప్రతి ఇంటి వద్దకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి పనులను.. సంక్షేమ పథకాలను వివరించారు.. చెరుకు శ్రీనివాస్ రెడ్డి గారు మాట్లాడుతూ..“ప్రజల ఆశయాలను నెరవేర్చే శక్తి కాంగ్రెస్ పార్టీదే. అభివృద్ధి, సంక్షేమం అందించే చేతి గుర్తుకు మీ విలువైన ఓటు వేసి నవీన్ యాదవ్ గారిని భారీ మెజారిటీ తో గెలుపించాలని కోరారు…. ఈ కార్యక్రమంలో దుబ్బాక నియోజకవర్గం అక్బర్ పేట-భూంపల్లి, చేగుంట మండలల నాయకులు..కార్యకర్తలు.. యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు..

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

రాజోలు నియోజకవర్గంలో విజయవంతమైన మాలల ఆత్మీయ సమావేశం

రాజోలు నియోజకవర్గం మలికిపురం మండలం విశ్వేశ్వరాయపురంలో దళిత నాయకులు గెడ్డం సింహా అధ్యక్షతన సోమవారం జరిగిన మాలల ఆత్మీయ సమావేశం విజయవంతమైయింది. ఈ సమావేశంలో ముఖ్యాతిదిగా పాల్గొన్న రాజోలు శాసనసభ్యులు దేవ వరప్రసాద్ మాట్లాడుతూ రాజోలు నియోజకవర్గంలో ఎస్సీలు ఎదుర్కొంటున్న అన్నీ సమస్యలను పరిష్కరిస్తాం అన్నారు. తొలుత బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి ఎమ్మెల్యే దేవ వరప్రసాద్ పూలమాలలేసి నివాళులర్పిచిన పిమ్మట దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ బుద్ధవదనం చేసి కార్యక్రమాన్ని ప్రారంభించగా నలంద ఎడ్యుకేషనల్ ట్రస్ట్ చైర్మన్ తాడి సత్యనారాయణ సభాపరిచయం చేసారు. అనంతరం జరిగిన సమావేశంలో మాల నాయకులు మాట్లాడుతూ లేవనెత్తిన సమస్యలన్నింటిని త్వరలనే పరిష్కరిస్తానని ఎమ్మెల్యే దేవ హామీ ఇచ్చారు. సరేళ్ళ విజయప్రసాద్, గెడ్డం తులసీ భాస్కరరావు, పొలుమూరి శ్యాంబాబు, దేవ రాజేంద్రప్రసాద్, చింత రాజబాబు, జాలెం సుబ్బారావు, బొంతు మణిరాజు, బత్తుల లక్ష్మణరావు, తోటే ప్రతాప్, రాపాక మహేష్, మట్టా సురేష్, కలిగితి పళ్ళం రాజు, చిలకపాటి శ్రీధర్, తదితరులు మాట్లాడారు. అనంతరం నల్లి శివకుమార్ వందన సమర్పణ చేసి కార్యక్రమాన్ని ముగించారు.ఈ కార్యక్రమంలో జెడ్పిటిసి దొండపాటి అన్నపూర్ణమ్మ, వైస్ ఎంపీపీ కొల్లాబత్తుల నాని నియోజకవర్గంలోని మాల సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, దళిత సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

E-పేపర్

రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చిగళ్ల నితిన్ కిషోర్ RTC బస్సు – కంకర టిప్పర్ డికొని ప్రమాదం జరగడం విషాదకారo

చేవెళ్ళ రోడ్డు ప్రమాదం క్షేత్రగతులను మరియు ప్రమాదం జరిగిన చోటును సందర్శించి మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలని ప్రభుత్వం పై డిమాండ్ చేసిన రంగారెడ్డి జిల్లా బహుజన్ సమాజ్ పార్టీ నాయకులు RTC బస్సు – కంకర టిప్పర్ డికొని ప్రమాదం జరగడం విషాదకారమని ఈరోజు వరకు 25 మంది మరణించారు ఇంకా పెరిగే అవకాశం ఉంది రోడ్డు విస్తరణ లేక పోవడం గుంతలు ఉండటం ప్రమాదం జరిగింది కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలు తక్షణమే స్పందించి కొత్తగా గుంతలు పూడ్చాలి రోడ్డు విస్తరణ చేపట్టాలి ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధిత* కుటుంబలకు 50 లక్షల రూపాయల ఎక్సగ్రేషియా ఉద్యోగం కలిపించాలని నాయకులు నిరసన,ధర్నా బహుజన్ సమాజ్ పార్టీ తరుపున డిమాండ్ చేశారు ఈ కార్యక్రమం లో రంగారెడ్డి జిల్లా ఇంచార్జి పల్లాటి రాములు రంగారెడ్డి జిల్లా ఇంచార్జి బండారి రవికుమార్ ముదిరాజ్ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు దొడ్డి శ్రీనివాస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు బొర్రా అనంత రాములు రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి బచ్చిగళ్ల నితిన్ కిషోర్ రంగారెడ్డి జిల్లా మహిళా ఇంచార్జి కంబాలపల్లి శాంత చేవెళ్ళ అధ్యక్షులు టప్ప క్రిష్ణ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం కోశాధికారి బంగరిగళ్ళ మహేందర్ యాచారం మండల ప్రధాన కార్యదర్శి చెక్క సతీష్ మహారాజ్ చేవెళ్ల మండల నాయకులు బిక్షపతి ,రవీందర్ ,కుమార్ ,శేఖర్ ,పరమేష్ తదితరులు పాల్గొన్నారు

విశాఖపట్నం

జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 137 వినతులు.

జివిఎంసి “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” లో 137 వినతులు. – నగర మేయర్ పీలా శ్రీనివాసరావు. *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న “ప్రజా సమస్యల పరిష్కార వేదిక” (PGRS) కార్యక్రమంలో జీవీఎంసీ లో అన్ని విభాగాలకు కలిపి 137 వినతులు వచ్చాయని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. సోమవారం ఆయన జివిఎంసి ప్రధాన కార్యాలయం లోని పాత సమావేశ మందిరం లో జివిఎంసి అదనపు కమిషనర్ డి.వి.రమణమూర్తి తో కలసి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న“ప్రజా సమస్యల పరిష్కార వేదిక” కార్యక్రమానికి జివిఎంసికి సంబంధించి 137 అర్జీలు/ఫిర్యాదులు స్వీకరించడం జరిగిందని తెలిపారు. అందులో ముఖ్యంగా 1వ జోన్ కు 01, 2వ జోన్ కు 20, 3వ జోన్ కు 16, 4వ జోన్ కు 25, 5వ జోన్ కు 17, 6వ జోనుకు 34, 7వ జోనుకు 02, 8వ జోన్ కు 16, జివిఎంసి ప్రధాన కార్యాలయానికి 06 ఫిర్యాదులు అందాయని తెలిపారు. అలాగే జివిఎంసి అడ్మినిస్ట్రేషన్ & అకౌంట్సు విభాగమునకు 07, రెవెన్యూ విభాగమునకు 13, ప్రజారోగ్య విభాగమునకు 08, పట్టణ ప్రణాళిక విభాగమునకు 58, ఇంజినీరింగు విభాగమునకు 26, మొక్కల విభాగమునకు 07, యుసిడి విభాగమునకు 18 కలిపి మొత్తంగా 137 ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు. అనంతరం అదనపు కమిషనరు మాట్లాడుతూ ఫిర్యాదులకు సంబంధించిన విభాగాధిపతులు ప్రజలు పెట్టుకున్న అర్జీలను/ ఫిర్యాదులను అదే రోజు వెంటనే పరిశీలిస్తూ, సంబంధిత ఫిర్యాదు దారులతో సంప్రదించి నిర్ణీత సమయంలో పరిష్కరించాలని, వచ్చిన అర్జీలపై అధికారులు వెంటనే స్పందించి కార్యాచరణ అదే రోజు చేపట్టాలని, ప్రతివారం అదే ఫిర్యాదులు తిరిగి ప్రజలు సమర్పించకుండా ఆయా సమస్యలను నిర్ణీత సమయం లో పరిష్కరించాలని జివిఎంసి అధికారులను, జోనల్ కమీషనర్లను అదనపు కమిషనర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రధాన వైద్యాధికారి డాక్టర్ ఇ.ఎన్.వి నరేష్ కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ సి. వాసుదేవ రెడ్డి, ఫైనాన్సర్ అడ్వైజర్ మల్లికాంబ, సిసిపి ఏ.ప్రభాకర రావు, పర్యవేక్షక ఇంజనీర్లు కె.శ్రీనివాసరావు, సంపత్ కుమార్, ఏడుకొండలు, డిసిఆర్ ఎస్.శ్రీనివాసరావు, కార్యనిర్వాహక ఇంజినీర్లు ఎమ్.ఆర్.ఎస్ అప్పారావు, పిఒ-యుసిడి పి.ప్రసన్నవాణి, డిపిఓ శాంతి కుమారి, డీసీపీలు హరిదాసు, రామమోహనరావు, ఏసీపీ లు, సివిఒ డా.రవికుమార్, స్పోర్ట్స్ డైరెక్టర్ అప్పలరాజు, ఆర్.ఎఫ్.ఒ కృపావర్మ తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు ప్రజల నుండి పి.జి.ఆర్‌.ఎస్. (PGRS) ఫిర్యాదులను స్వీకరించారు.

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ఉత్తర నియోజకవర్గంలోని మాధవధార వద్ద ఉన్న పి-4 స్వర్ణాంధ్ర కార్యాచరణ ప్రణాళిక కార్యాలయంలో ఎమ్మెల్యే, బీజేపీ ఫ్లోర్ లీడర్ శ్రీ పి. విష్ణుకుమార్ రాజు గారు ప్రజల నుండి పి.జి.ఆర్‌.ఎస్. (PGRS) ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించారు. ఎమ్మెల్యే గారు ప్రజల అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులకు — జోనల్ కమిషనర్ శ్రీ రాము గారు, టౌన్ ప్లానింగ్ సిబ్బంది, ఏ.ఇలు, వాటర్ వర్క్స్ సిబ్బంది, పబ్లిక్ వర్క్స్ విభాగం ఏపిడీ శ్రీమతి పుణ్యవతి గారు, శ్రీమతి పద్మావతి గారు, శ్రీ తిరుపతి రావు గారు మరియు ఇతర అధికారులకు పంపిస్తూ, అవసరమైన చర్యలు వెంటనే తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ అధికారులు, బీజేపీ–టిడిపి–జనసేన కూటమి నాయకులు వరప్రసాద్, పద్మజ, రామకృష్ణ, కోఇలాడ వెంకటేష్, అప్పారావు , వేణుగోపాల్, జామి శ్రీను,బంగార్రాజు, శ్రీనివాస్, కీర్తి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు. ప్రజా దర్బార్‌కు మంచి స్పందన లభించింది. ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు గారు మాట్లాడుతూ — “ప్రతి సోమవారం ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 1:00 గంటల వరకు ఈ కార్యాలయంలో అందుబాటులో ఉంటాను. ప్రజలు తమ సమస్యలను లిఖితపూర్వకంగా సమర్పించి, రసీదు తీసుకోవాలని కోరుతున్నాను. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తాను” అని అన్నారు.

విశాఖపట్నం

ప్రతి ఒక్కరు సేవా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి — డాక్టర్ కందుల నాగరాజు

ప్రతి ఒక్కరు సేవా స్ఫూర్తితో ముందుకు వెళ్లాలి — డాక్టర్ కందుల నాగరాజు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ప్రతి ఒక్కరూ సేవాస్ఫూర్తితో ముందుకు వెళ్లాలని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు, 32వ వార్డు కార్పొరేటర్ డాక్టర్ కందులు నాగరాజు తెలిపారు. పుష్పవతి అయిన 34 వ వార్డులో నేతాజీ నగర్ ప్రాంతానికి చెందిన శరణ్య, రేణుకలకు డాక్టర్ కందుల నాగరాజు అలాగే, హోటల్స్ అసోసియేషన్ అధ్యక్షులు బాలకృష్ణ చేతుల మీదుగా వెండి పట్టీలు, పట్టు వస్త్రాలు, పసుపు కుంకుమ అందజేశారు. అనంతరం డాక్టర్ కందుల నాగరాజు మాట్లాడుతూ సాటి వారికి సహాయం చేయాలని సంకల్పంతో ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని కోరారు. సమాజమే దేవాలయంగా భావించే తాను నిస్వార్ధంగా చేస్తున్న సేవలకు ప్రజల నుంచి అనూహ్య స్పందన వస్తుందని చెప్పారు. ఎప్పుడు ఎవరికీ ఏ అవసరం వచ్చినా తాను ఎప్పుడూ అందుబాటులో ఉంటూ వారికి సహాయం చేస్తూ వస్తున్నానని తెలిపారు. అందరూ బాగుండాలి అందులో నేనుండాలి అనే లక్ష్యంతో తాను ముందుకు వెళ్తున్నట్లు వెల్లడించారు. తాను ప్రతి విషయాన్ని పాజిటివ్గా ఆలోచించి అదేవిధంగా తన ఆలోచనలు అమలు చేస్తానని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సతీష్, రామానాయుడు ,రాజు, కందుల కృష్ణ, శ్రీను , గౌరీ, నాగమణి ,కుమారి, కనకరత్నం, వెంకటేష్, జానకి, కుమారి తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

కాంగ్రెస్ తోనే ప్రజా స్వామ్యానికి ఊపిరి : ప్రియాంక దండి*

*కాంగ్రెస్ తోనే ప్రజా స్వామ్యానికి ఊపిరి : ప్రియాంక దండి* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* దేశంలో ఎప్పుడు లేని విధంగా మోదీ హయాంలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని కాంగ్రెస్ పార్టీ విశాఖ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి అన్నారు. సోమవారం ఆంధ్ర విశ్వ విద్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి ” ఓటు చోర్, గద్దె చోడ్ ” సంతకాల సేకరణ కార్యక్రమం చేసారు, విశ్రాంతి ఆచార్యులు జాన్ మాస్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రియాంక మాట్లాడుతూ దేశంలో అన్ని వ్యవస్థలను ఎన్ డి ఏ ప్రభుత్వం నాశనం చేసిందని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడ చేతిలో పెట్టుకొని ఓట్లు దొంగతనం చేసి అధికారంలోకి వస్తోందని, ప్రజలు మేలుకోవాల్సిన సమయం వచ్చింది, మన ఓటుని దొంగలించి బీజేపీకి సహకరిస్తున్న కేంద్ర ఎన్నికల సంఘానికి ప్రజలు ఉద్యమంలా లేఖలు రాసి ప్రజాగ్రహాన్ని తెలియజేయాలని ప్రియాంక పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మైనారిటీ సెల్ జిల్లా అధ్యక్షులు మొహమ్మద్ ఆలీ,జగన్ మురారి, వార్డు అధ్యక్షులు భోగవరపు శ్రీనివాస్, ఈగల మోహన్ సాయి, వేమూరి సురేష్, చింతగుంటి వెంకటేష్,యూత్ కాంగ్రెస్ నాయకులు చంద్ర మౌళి, ఎన్ ఎస్ యు ఐ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

పీజీఆర్ఎస్ ఫిర్యాదుదారుల‌తో జిల్లా అధికారులే నేరుగా మాట్లాడాలి*

*పీజీఆర్ఎస్ ఫిర్యాదుదారుల‌తో జిల్లా అధికారులే నేరుగా మాట్లాడాలి* *ఆదేశించిన జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ *వివిధ స‌మ‌స్య‌ల‌పై 413 విన‌తులు స‌మ‌ర్పించిన ప్ర‌జ‌లు *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ప్ర‌జా స‌మ‌స్య‌ల ప‌రిష్కారంలో భాగంగా ఫిర్యాదుదారుల‌తో సంబంధిత శాఖల‌ జిల్లాస్థాయి అధికారులే నేరుగా మాట్లాడాల‌ని, దిగువ స్థాయి సిబ్బంది మాట్లాడ్డానికి వీల్లేద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ తేల్చి చెప్పారు. ఆడిట్ నివేదిక‌ల ప‌రిశీల‌న‌, ప్ర‌జాభిప్రాయ సేక‌ర‌ణలో ప్ర‌జ‌ల నుంచి వ‌చ్చిన స్పంద‌న, సంతృప్తి త‌దిత‌ర నివేదిక‌ల సునిశిత ప‌రిశీల‌న అనంత‌రం క‌లెక్ట‌ర్ ఈ మేర‌కు ఆదేశాలు జారీ చేశారు. ఇత‌ర అధికారుల‌తో, సిబ్బందితో ఫోన్లు చేయించి తూతూమంత్రంగా ఎండార్స్మెంట్ ఇవ్వ‌డానికి వీల్లేద‌ని, ప్ర‌తీ ఫిర్యాదుదారుతో అధికారులు త‌ప్ప‌కుండా మాట్లాడాల్సిందేన‌ని ఉద్ఘాటించారు. గ‌తంలో వ‌చ్చిన ఫిర్యాదులు, అధికారులు తీసుకున్న చ‌ర్య‌లు, ఇచ్చిన నివేదిక‌ల‌ను క్షుణ్నంగా ప‌రిశీలించిన ఆయ‌న అధికారులు ఫిర్యాదుల ప‌రిష్కారంలో మ‌రింత చొరవ చూపాల‌ని, కాల‌యాప‌న చేయ‌కుండా నిర్ణీత స‌మ‌యంలో చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఆదేశించారు. సోమ‌వారం క‌లెక్ట‌రేట్ మీటింగు హాలులో నిర్వ‌హించిన పీజీఆర్ఎస్ లో జాయింట క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్ తో క‌లిసి ఆయ‌న ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించారు. ఈ సంద‌ర్భంగా అధికారుల‌కు ప‌లు అంశాల‌పై మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేశారు. స‌మ‌స్య‌పై పూర్తి అవగాహ‌న‌తో ఉండాల‌ని, నాణ్య‌మైన ప‌రిష్కారం చూప‌డం ద్వారా ఫిర్యాదులు పున‌రావృతం కాకుండా చూడొచ్చ‌న్నారు. ఫిర్యాదు స్థితిగ‌తుల‌పై ప్ర‌జ‌ల‌కు విడ‌మ‌రిచి చెప్పాల‌న్నారు. *వివిధ స‌మ‌స్య‌ల‌పై 413 విన‌తులు స‌మ‌ర్పించిన ప్ర‌జ‌లు* పీజీఆర్ఎస్ లో భాగంగా ప్ర‌జ‌లు వివిధ స‌మ‌స్య‌ల‌పై 413 విన‌తులు స‌మ‌ర్పించారు. వాటిలో రెవెన్యూ విభాగానికి చెందిన‌వి 148, జీవీఎంసీకి చెందిన‌వి 126, పోలీస్ శాఖకు సంబంధించి 32, ఇత‌ర శాఖ‌ల‌కు సంబంధించిన‌వి 107 ఫిర్యాదులు ఉన్నాయి. జాయింట్ క‌లెక్ట‌ర్ కె. మ‌యూర్ అశోక్, జీవీఎఎంసీ అద‌న‌పు క‌మిష‌న‌ర్ వ‌ర్మ ప్ర‌జ‌ల నుంచి విన‌తులు స్వీక‌రించారు. వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు, త‌దిత‌రులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

ఆంధ్రా మెడికల్ కాలేజీలో లో ” ఆహ్వాన్ 2025″

*ఆంధ్రా మెడికల్ కాలేజీలో లో ” ఆహ్వాన్ 2025″ ఫ్రెషర్స్ డే వేడుకలకు హాజరైన దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, గౌరవ కలెక్టర్ శ్రీ హరేంద్ర ప్రసాద్ గారు* * *కూటమి ప్రభుత్వం విద్యకు, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్న ఎమ్మెల్యే* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- “`కేజీహెచ్, ఆంధ్రా మెడికల్ కాలేజీలో కాబ్ ఆడిటోరియం లో “ఆహ్వాన్ 2025” ఫ్రెషర్స్ డే వేడుకలకు దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, జిల్లా కలెక్టర్ శ్రీ హరేందర్ ప్రసాద్ గారు హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన అనంతరం కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమంలో వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ ఫ్రెషర్స్ డే ద్వారా స్నేహపూర్వక వాతావరణం ఏర్పడుతుందని అన్నారు. కొత్త విద్యార్థులలో క్రమశిక్షణ , విలువలు, సృజనాత్మక, ఆవిష్కరణ లతో ముందుకు సాగాలని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం విద్యకు, ఆరోగ్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందని, గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు , రాష్ట్ర మంత్రివర్యులు లోకేష్ గారు , సత్య కుమార్ గారు , ప్రభుత్వ యంత్రాంగం ప్రజా ఆరోగ్య ప్రమాణాలు పెంచడానికి ఎంతో కృషి చేస్తుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ ప్రిన్సిపల్ శ్రీమతి సంధ్యాదేవి గారు, సూపర్డెంట్ శ్రీమతి వాణి గారు, వైద్య విభాగం పెద్దలు శ్రీ మన్మధరావు గారు, శ్రీమతి కృష్ణవేణి గారు, శ్రీమతి శ్యామలగారు, శ్రీమతి వాసవి లత గారు, శ్రీ శ్రీహరి గారు, కూటమి నేతలు శ్రీ జగదీష్ గారు, శ్రీ సతీష్ పొన్నం గారు, శ్రీ జగన్ గారు, శ్రీ రాజశేఖర్ గారు, స్థానిక జనసేన వార్డు అధ్యక్షురాలు శ్రీమతి యజ్ఞశ్రీ గారు పాల్గొన్నారు…“`

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.