Sunday, 5 April 2026

Blog

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

₹6,000 నిలిపివేతపై ! పీఎం కిసాన్ పథకంలో భారీ తనిఖీ !

పీఎం కిసాన్ పై ఆరోపణల ముఖ్యాంశాలు : ➡️ దేశవ్యాప్తంగా 31.01 లక్షల లబ్ధిదారులు “అనుమానాస్పద” (Suspected) కేసులుగా గుర్తింపు. ➡️ భార్యాభర్తలు ఇద్దరూ ప్రయోజనం పొందిన 17.87 లక్షల మందిని అనర్హులుగా ప్రకటించారు. ➡️ మిగిలిన కేసుల ధృవీకరణ త్వరలో పూర్తి చేయమని రాష్ట్రాలకు ఆదేశాలు. ➡️ ఈ తనిఖీల వల్ల 21వ విడత చెల్లింపులు కొందరికి ఆలస్యం కావచ్చు. ➡️ ఆధార్ / భూమి / బ్యాంక్ వివరాలు తప్పులేకుండా ఉన్నాయో సరి చూసుకోండి. కొత్తగా నమోదు చేసుకునేవారికి ప్రత్యేక రైతు ID తప్పనిసరి కానుంది.

Blog

జిల్లా స్థాయి ఓపెన్ చెస్ టోర్నమెంట్ విజేతలకు బహుమతి ప్రదానం

నంద్యాల జిల్లా చెస్ సంఘం, నంద్యాల లయన్స్ క్లబ్ సంయుక్త నిర్వహణలో ఈపూరి శేషయ్య శెట్టి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల జింకా ఆడిటోరియంలో జరిగిన జిల్లా స్థాయి ఓపెన్ చదరంగం పోటీలలో విజేతలకు నంద్యాల లయన్స్ క్లబ్ వ్యవస్థాపక సభ్యులు, పారిశ్రామికవేత్త ఆత్మకూరు సుదర్శనం శెట్టి సౌజన్యంతో పతకాలు, ట్రోఫీలు, నగదు బహుమతులు అందజేయడం జరిగింది నంద్యాల జిల్లా చెస్ సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి నిర్వహించిన బహుమతి ప్రధానోత్సవం లో నంద్యాల జిల్లా చెస్ సంఘం అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ, ప్రముఖ వైద్యులు డాక్టర్ గెలివి సహదేవుడు, నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు కోశాధికారి అమిదేల జనార్ధన్ అతిథులుగా పాల్గొని మొదటి పది స్థానాలు సాధించిన వారికి ట్రోఫీలు,నగదు బహుమతులు,వివిధ వయసు కేటగిరీలలో విజేతలకు పతకాలు అందజేశారు ఈ సందర్భంగా డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ గెలిచినవారు తమ గెలుపు స్థానాన్ని నిలబెట్టుకోవడానికి,విజయం అందుకోని వారు తదుపరి పోటీలలో విజయాలు సాధించడానికి కోచ్ ల పర్యవేక్షణలో నిత్య సాధన ద్వారా క్రీడలలో ఉన్నత స్థాయికి చేరుకోవచ్చని అన్నారు. ఆ విధమైన అంకితభావం,క్రమశిక్షణ క్రీడాకారులకు చాలా అవసరం అన్నారు ఈ కార్యక్రమంలో చెస్ జిల్లా సంఘం ప్రధాన కార్యదర్శి రామసుబ్బారెడ్డి, లయన్స్ క్లబ్ సభ్యులు మేడం చంద్రశేఖర్,టోర్నమెంట్ పర్యవేక్షకులు వెంకటరావు, గెలివి శ్రీకాంత్, సత్య సాయి పబ్లిక్ స్కూల్ కరస్పాండెంట్ మణికంఠ,నేషనల్ ఆర్బిటర్ సుజాత,వ్యాయామ ఉపాధ్యాయులు మాలిక్ భాషా, జస్ట్ కోచ్ శ్రీనివాసులు బహుమతి ప్రధానోత్సవం లో పాల్గొన్నారు నంద్యాల జిల్లా చదరంగం పోటీ విజేతలు: ఇమామ్ హుసేని ప్రధమ స్థానం,యుగంధర్ ద్వితీయ స్థానం, రిషితా బాయ్ తృతీయ స్థానం సాధించగా, తదుపరి ఆరు స్థానాలు మన్విత్ నాయక్,జానకి రామ రాజు,మోక్షిత్ కుమార్,సాయి కార్తికేయ,శాలెం మణికుమార్,లక్ష్మీ సందీప్,హార్జిత్ వర్మ సాధించి ట్రోఫీలు నగదు బహుమతులు అందుకున్నారు.

E-పేపర్

నేడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారితో కలిసి మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు ఇంటింటి ప్రచారం నిర్వహించినారు.

నేడు జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని సోమాజిగూడ,బోరబండ, యూసఫ్ గూడ డివిజన్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారితో కలిసి మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు,మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్, MLC రాములు నాయక్,మెదక్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మెన్ సుహాసిని రెడ్డి గార్లు ఇంటింటి ప్రచారం నిర్వహించినారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు నిజమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. గల్లీ గల్లీ తిరుగుతూ ప్రజలను కలుసుకుంటూ, స్థానికులతో మాట్లాడిన వారు జూబ్లీహిల్స్ అభివృద్ధి కోసం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ అన్న గారిని గెలిపించాలి. ప్రతి ఒక్కరు మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ అభ్యర్థికి వేయండి అని కోరారు.. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి, కార్పొరేటర్స్ లక్ష్మణ్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి,జితేందర్ ప్రేమ కుమార్, విజయ రెడ్డి,నాగార్జున్, ఆనంద్ రావు,మహిళా నాయకురాలు సావిత్రి, నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

VPR నేత్ర కార్యక్రమం ప్రారంభించిన ఎంపీ వేమిరెడ్డి గారు

ఈరోజు వరికుంటపాడు మండలం రామాపురం గ్రామం నందు విపిఆర్ ఫౌండేషన్ ద్వారా విపిఆర్ నేత్ర అనే కార్యక్రమాన్ని మన ఉదయగిరి నియోజకవర్గంలో ప్రారంభోత్సవానికి విచ్చేసిన నెల్లూరు ఎంపీ గౌరవనీయులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ గారు విచ్చేసి ఈ యొక్క కార్యక్రమాన్ని ప్రారంభోత్సవం చేశార. ఇట్లు. ఉండేలా గురువారెడ్డి దుత్తలూరు టీడీపీ మండలం, మాజి కన్వీనర్

అన్నమయ్య

విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఆధ్వర్యంలో రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని ర్యాలీ

రాజంపేట నవంబర్, 3 (పున్నమి ప్రతినిధి) విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఆధ్వర్యంలో రాజంపేట జిల్లా కేంద్రం చేయాలని రాజంపేట ఆర్టీసీ బస్టాండ్ మొదలగుని పాత బస్టాండ్ నుంచి సబ్ కలెక్టర్ ఆఫీస్ వరకు ర్యాలీ చేపట్టారు.ర్యాలీ అనంతరం రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏవోకి రాజంపేట జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేయాలనీ వినతి పత్రం సమర్పించారు.ఈ సందర్భంగా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ మాట్లాడుతూ రాజంపేటలో ఎప్పటి నుంచో ఐఏఎస్ హోదా కలిగి ఉందని అదేవిధంగా రాజంపేటలో రవాణా సౌకర్యం,నీటి వనరులు,ఖనిజ సంపద,ప్రైవేటు యూనివర్సిటీ, అన్నమయ్య జన్మస్థలం అనేక వాటికి పుట్టినిల్లు రాజంపేట అని తెలిపారు.అన్ని వసతులు కలిగిన రాజంపేటను జిల్లా చేయాలని డిమాండ్ చేస్తున్నాము అని తెలిపారు. ఈ ర్యాలీలో దివ్యాంగుల క్రికెట్ క్రీడాకారుడు శివకోటి, ఉపాధ్యక్షుడు ఖాదర్బాషా, చంద్రశేఖర్,పుల్లంపేట అధ్యక్షుడు సుబ్బనరసారెడ్డి, కృష్ణ,సెక్రెటరీ వెంకట ప్రసాద్ వివిధ మండల విభిన్న ప్రతిభావంతులు అధ్యక్షులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

దాసరి పల్లి లో శాది మంజిల్ ఏర్పాటుకు స్తల పరిశీలన

ఉదయగిరి మండలం పరిధిలోని దాసరి పల్లిలో మంజీల్ ఏర్పాటుకు సోమవారం స్థల పరిశీలన జరిగింది మాజీ సర్పంచ్ సయ్యద్ జా మృద్ , జాఫర్ మోహదిన్ రివెన్వు అధికారులతో కలిసి గ్రామ సర్వే నెంబర్ 1193 లోని 22 సెంట్ల ప్రభుత్వ భూమిలో షాది మంజిల్ తో పాటు పంచాయితీ భవనం నిర్మాణాల ఏర్పాటుకు అధికారులు చర్యలు చేపట్టారు ఈ కార్యక్రమoలో వీఆర్వో వేంకటేశ్వర్లు , సర్వేయర్ మహేష్ పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అస్వస్థత తో నెల్లూరు అపోలో ఆస్పత్రిలో చేరిన మేకపాటి

ఉదయగిరి వైసీపీ సమన్యకర్త మేకపాటి రాజ గోపాల్ రెడ్డి స్వల్ప అస్వస్థతకు అపోలో ఆస్పత్రిలో చేరారు విషయం తెలుసుకున్న వైసీపీ నాయకులు ఆయనను పరామర్శిచేందుకు ఆసుపత్రికి వెళ్లారు గూడూరు వైసీపీ ఎమ్మెల్యే మేరుగ మురళీ దర్ ఆసుపత్రికి వెళ్లి ఆరోగ్య స్థితిగతులపై ఆరా తీశారు అయోర్యోగ్యలతో ఉండాలని ఆయన అభిమానులు ఆకంక్సించారు.

విశాఖపట్నం

పెద్ద మొత్తంలో గంజాయి పట్టివేత

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* మర్రిపాలెం రైల్వే స్టేషన్ పరిధిలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) సిబ్బంది నిర్వహించిన ప్రత్యేక తనిఖీలలో పెద్ద మొత్తంలో గంజాయి పట్టివేత జరిగింది. రైల్వే ప్రాంగణాల్లో అక్రమ రవాణా మరియు నేర కార్యకలాపాలను అరికట్టడమే లక్ష్యంగా ఈ ఆపరేషన్‌ను చేపట్టారు. ఈ ప్రత్యేక తనిఖీని సబ్ ఇన్‌స్పెక్టర్ శ్రీమతి మమత మరియు శ్రీ అనిల్ కుమార్, ఇన్స్పెక్టర్ నేతృత్వంలోని బృందం జాగ్రత్తగా మరియు ప్రణాళికాబద్ధంగా అమలు చేసింది. తనిఖీ సమయంలో రైలు ప్లాట్‌ఫారమ్‌ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఇద్దరు వ్యక్తులు బృందం దృష్టికి వచ్చారు. వారిని ఆపి ప్రశ్నించగా, వారు స్పష్టమైన సమాధానాలు ఇవ్వలేకపోయారు. దీంతో RPF సిబ్బంది వారి సామానును పరిశీలించగా, అందులో నిషేధిత మత్తు పదార్థమైన గంజాయి దాచిపెట్టినట్లు గుర్తించారు. విచారణలో ఆ ఇద్దరు వ్యక్తులు వరుసగా ఒడిశా రాష్ట్రానికి చెందిన జగన్ మాజీ మరియు మహారాష్ట్ర రాష్ట్రంలోని పుణెకు చెందిన వికాస్‌గా గుర్తించబడ్డారు. వారి వద్ద ఉన్న సంచుల్లో మొత్తం 4 కిలోల గంజాయి స్వాధీనం చేయబడింది. గంజాయి రైల్వే మార్గం ద్వారా ఇతర ప్రాంతాలకు రవాణా చేయాలన్న ఉద్దేశంతో వారు తీసుకెళ్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. RPF బృందం తక్షణమే వారిని అదుపులోకి తీసుకుని, చట్టపరమైన విధానాల ప్రకారం సీజ్ మెమో సిద్ధం చేసింది. స్వాధీనం చేసిన గంజాయిని సాక్ష్యాలుగా నమోదు చేసి, నిందితులను మరియు వస్తువులను మరింత దర్యాప్తు కోసం GRP విశాఖపట్నం పోలీసు అధికారుల వద్దకు అప్పగించారు. ఈ ఆపరేషన్ విజయవంతం కావడంలో సిబ్బందిలోని జాగ్రత్త, అప్రమత్తత, మరియు నిబద్ధత కీలక పాత్ర పోషించాయి. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఇలాంటి అక్రమ కార్యకలాపాలపై కఠినంగా వ్యవహరించి, రైల్వే ప్రాంగణాలను సురక్షితంగా ఉంచడంలో తమ కర్తవ్యనిబద్ధతను మరోసారి నిరూపించింది. RPF అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు — రైల్వే ప్రదేశాల్లో అనుమానాస్పద వ్యక్తులు లేదా కార్యకలాపాలు గమనించినప్పుడు వెంటనే సమీప RPF లేదా రైల్వే పోలీసు అధికారులకు సమాచారం అందించాలని, తద్వారా సమాజం భద్రతలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం ఉండాలని సూచించారు.

ఎన్ టి ఆర్ జిల్లా

తుఫాను ప్రభావిత రైతులకు అండగా ప్రభుత్వం — నష్టాలపై సమీక్ష చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ఇటీవల తుఫాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్‌, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రత్తి, మొక్కజొన్న, పెసలు వంటి పంటలను రైతు వారీగానమోదు చేసి, తగిన పరిహారం అందించేం దుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రంగు మారిన వరినీ సైతం ప్రభుత్వం కొనుగోలు చేసేలా స్పష్టమైన సూచనలు ఇచ్చారు. రైతులు మార్క్‌ఫెడ్ ద్వారా పెసలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొక్కజొన్న కొనుగోలు త్వరిత గతిన ప్రారంభించాలన్న అభ్యర్థ నపై ఆమె సానుకూలంగా స్పందించారు. దీనిపైవ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న నాయుడు తో ఫోన్ ద్వారా మాట్లాడి, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి రైతు పక్కన నిలుస్తుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హామీ ఇచ్చారు.

తెలంగాణ

కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ ఇన్సూరెన్స్ ను సద్వినియోగం చేసుకోండి.*

పున్నమి: నవంబర్ 03 తెలంగాణ రాష్ట్రం ➖ ప్రభుత్వ ఉద్యోగులు తప్ప. ➖ కూలీలతో పాటు అందరు అర్హలే. ➖ తెల్ల రేషన్ కార్డు తప్పని సరి. ➖ ఏడాదికి రూ 22 మాత్రమే. 5 స0 రాలు ఒకేసారి చెల్లించాలి,కేవలం 110/-రూ.. మాత్రమే. ➖ అవగాహన పెంచుకుందాం. ➖ అందరికీ చేరేలా చేయండి. 1) 18 నుండి 55 years ఉన్న స్త్రీ,పురుషులు అర్హులు. 2) ప్రభుత్వ ఉద్యోగులు తప్ప ఎలాంటి కూలీలైన,ఇతరులైన ఇందులో చేరవచ్చు. 3) రేషన్ కార్డు,ఆధార్ కార్డు,జిరాక్స్ జత చేయాలి. 4) బ్యాంకు చలానా జత చేసి లేబర్ ఆఫీస్ లో ఇవ్వాలి. ప్రయోజనాలు: 5) పాలసీదారు సహజ మరణం పొందితే రూ.1,30,000/-రులు ఇన్సూరెన్స్ 6.అలాగే ప్రమాద వశాత్తూ మరణం వల్ల రూ.6,00000/- 7) ఒక ఇంట్లో ఇద్దరు ఆడపిల్లలు వుంటే ఒకొక్కరికి వివాహ నజరానాగా 30,000/-రూ,, 8) ప్రసవ కానుకగా రెండు ప్రసవాలకు 30,000/-రూ,,చొప్పున వచ్చే అవకాశం ఉంది. 9) 1 year పాలసీ పొందిన తరువాత లబ్ధిదారునికి ప్రమాదం జరిగి 50% వికలాంగులుగా ఉంటే 2.50 లక్షలు,అదే 100% ఉంటే 5 లక్షల పరిహారం పొందే అవకాశం ఉంది. 👉ఈ లేబర్ ఇన్సూరెన్స్ ఒకసారి 110/-రూ.చెల్లిస్తే 5 సం

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.