Sunday, 5 April 2026

Blog

తెలంగాణ

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు* *తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు*

స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు* *తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు *ఈ నెల 24వ తేదీ లోపు ఎన్నికల తేదీ ప్రకటించాలి* రాజ్యాంగంలోని ఆర్టికల్ 243-E ప్రకారం పంచాయతీల కాల పరిమితి ముగిసిన ఆరు నెలల్లో ఎన్నికలు నిర్వహించాలి తాము బీసీ రిజర్వేషన్ల పట్ల మాత్రమే అభ్యంతరం తెలిపాం, ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అభ్యంతరం తెలుపలేదు బీసీ రిజర్వేషన్ గ్రామాలను పక్కనపెట్టి మిగతా గ్రామాలకు ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపిన ఎస్ఈసీ అలా విభజించి నిర్వహించడం సరికాదని అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు ఈ నెల 24వ తేదీలోపు ఎన్నికల తేదీ ప్రకటించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ

వరంగల్

దుర్వాసన వెదజల్లుతున్న చికెన్ సెంటర్లు.. ఇబ్బందులు ఎదుర్కొంటున్న స్థానికులు.

నల్లబెల్లి నల్లబెల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణంలో చికెన్ సెంటర్ నిర్వాహకుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న చికెన్ సెంటర్ల యజమానుల పోకడలు మితి మీరి పోతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ కోల్లను మూడురోజులకు ఒకసారి దిగుమతులు చేసుకోకుండా దుకాణంలొనే కోళ్లను పెంచడం విడ్డురంగా మారింది. కోళ్లు విడుదల చేసే వ్యర్థాల వలన దుకాణం ముందు నుండి వచ్చే పోయే వాళ్ళకి, పక్కన దుకాణ దారులకు ముక్కు పుటలు అదిరేలా దుర్వాసన వెదజల్లుతుందని చెబుతున్నారు కోళ్ల వ్యర్థాలను ప్రభుత్వ కార్యాలయం ముందు పారబోస్తున్న వ్యాపారులు.. గత కొన్ని రోజులుగా కోళ్ల వ్యర్ధాలను గుట్టుచప్పుడు కాకుండా రాత్రి వేళల్లో చికెన్ సెంటర్ల నిర్వాహకులు మండల ప్రజా పరిషత్ కార్యాలయం మరియు ఎస్సారెస్పీ కాలువలో పారబోస్తున్నారు. కార్యాలయానికి వచ్చే వ్యక్తులకు ఆ వ్యర్ధాలు భరించలేని దుర్వాసన వస్తుండడంతో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం.. ఎస్సారెస్పీ నీటిలో కోళ్ల వ్యర్థాలను పారబోస్తూ ఉండడంతో భూగర్భ జలాలు కలుషితమయ్యే ప్రమాదం పొంచి ఉందని స్థానికులు రైతులు అంటున్నారు. అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదు : వైనాల మధు.. కామన్ మ్యాన్ కోళ్ల వ్యర్ధాలను చికెన్ సెంటర్ల వ్యాపారస్తులు మండల పరిషత్ కార్యాలయం వద్ద వేస్తున్నారని అధికారులకు తెలిపిన పట్టించుకోలేదని అన్నారు. అలాగే బస్టాండ్ దారుణంలో దుర్వాసనతో ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. చికెన్ సెంటర్ల వద్ద నుండి వచ్చే దుర్వాసనతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నామని. అలాగే తక్షణమే చికెన్ సెంటర్ లను బస్టాండ్ ఆవరణము నుండి తీసివేసి ఇప్పటికైనా కోళ్ల వ్యర్ధాలు ఎస్సారెస్పీ కాలువలో మరియు మండల ప్రజా పరిషత్ ఆవరణంలో వెయ్యకుండా కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు

కామారెడ్డి

మదన్ అన్నకు మంత్రి పదవి రావాలని రామారెడ్డిలో ఘనంగా పూజలు

రామారెడ్డి, 4నవంబర్, (పున్నమి ప్రతినిధి) : మదన్ అన్నకు మంత్రి పదవి రావాలని రామారెడ్డిలో ఘనంగా పూజలు నిర్వహించామని కాంగ్రెస్ పార్టీ సభ్యులు తెలిపారు.కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలంలో కార్తీక మాసం మంగళవా రం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో శ్రీ కాల భైరవ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఎల్లారెడ్డి శాసనసభ్యుడు మదన్ అన్న కు రానున్న రోజుల్లో మంత్రి పదవి లభించాలని ఆకాంక్షిస్తూ మండల కాంగ్రెస్ నాయకులు, కార్యకర్త లు, అభిమాను లు పెద్దఎత్తున పాల్గొన్నారు.పూజా కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, గ్రామ స్థాయి నేతలు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు నిర్వహించిన జై కాంగ్రెస్, జై మదన్ అన్న నినాదా లు ఆలయ ప్రాంగణాన్ని అనురంజింపజేశాయి. ప్రధాన నాయకులు మాట్లాడుతూ, మదన్ అన్న ప్రజాధారణ, సేవా తపనకు గుర్తింపుగా మంత్రి పదవి రావడం రామారెడ్డి వారందరి ఆకాంక్ష అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమం జిల్లా కాంగ్రెస్ వర్గాల్లో, స్టేట్లో స్టేట్ లెవల్లో చర్చనీయాంశంగా మారింది.

కామారెడ్డి

బీబీపేట్ గ్రామంలో శ్రీ కాళికాదేవి దేవాలయ పంచమ వార్షికోత్సవానికి ఏర్పాట్లు పూర్తి

కామారెడ్డి, 04 నవంబర్ (పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా బీబీపేట్ గ్రామంలో వెలసిన శ్రీ కాళికాదేవి సమేత కమటేశ్వర స్వామి సహిత శ్రీ గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో పంచమ వార్షికోత్సవ మహోత్స వాలు నవంబర్ 8వ తేదీ శనివారం నుండి 10వ తేదీ సోమవారం వరకు వైభవంగా జరగనున్నా యి. ఈ ఉత్సవాలకు సిద్ధమవుతున్న దేవాలయ పరిసరాల్లో భక్తుల రాకపోకలతో పండుగ వాతావ రణం నెలకొననుంది.ఉత్సవాల కమిటీ సభ్యులు, విశ్వ బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో ఈ శుభకార్య క్రమాలు నిర్వహించబడనున్నాయని తెలిపారు. మూడు రోజులపాటు భక్తులకు తీర్థప్రసాద వితర ణ, హోమాలు, కళ్యాణోత్సవాలు, అన్నప్రసాదం వంటి ధార్మిక కార్యక్రమాలు నిర్వహిస్తారని నిర్వా హకులు తెలిపారు.తేది 8 నవంబర్ ఉదయం సుప్రభాత సేవతో ఉత్సవా లు ప్రారంభమై, పంచా మృతాభిషేకం, గణపతి పూజ, పుణ్యాహవచనం, హోమాలు, మహానైవేద్యం కార్యక్రమాలు జరగను న్నాయి.నవంబర్ 9న ఆరుద్ర నక్షత్రయుక్త పుష్కర లగ్న మహా ముహూర్తంలో శ్రీ కాళికాదేవి సమేత కమటేశ్వర స్వామి కళ్యాణం, అలాగే శ్రీ గోవింద మాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి కళ్యాణం ఘనంగా జరగనుంది.అనంతరం పూర్ణాహుతి ముగిసిన తర్వాత అన్నప్రసాద వితరణ భక్తులకు అందించబడుతుంది.నవంబర్ 10న అమ్మవారి బోనాలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయని ప్రధాన అర్చకులు బ్రహ్మశ్రీ గురు మూర్తి ఆచారి, మంచోజు పూర్ణాచార్య బృందం తెలిపారు. వంగాల దేవి ప్రసాద్ ఆచారి, కొండ శివకుమార్ ఆచారి తదితరు లు వేదపారాయణం, హోమాలు నిర్వహించను న్నారు.దేవీదేవతల అను గ్రహం కోరుతూ భక్తులం దరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపు నిచ్చా రు , ఈ పంచమ వార్షికోత్సవంలో పాల్గొని దైవ సన్నిధిలో ఆశీర్వాదాలు పొందవలని నిర్వాహకు లు తెలిపారు.

క్రైమ్

తృటిలో తప్పిన ప్రమాదం

ములుగు జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని సమ్మక్క సారక్క ఆర్చి సమీపాన ముందు వెళ్తున్న ఇసుక లారీ అకస్మాత్తుగా బ్రేక్ వేసి రివర్స్ గేర్ వేసుకొని వేగంగా వెనుక ఉన్న ఎలక్ట్రిక్ బస్సును ఢీకొంది బస్సు డ్రైవర్ హారన్ కొడుతున్న లారీ డ్రైవర్ విడిపించుకోలేదని ప్రయాణికులు తెలిపారు ఈ ఘటనలో ముందు అద్దం ధ్వంసం అయినప్పటికీ ప్రయాణికులందరూ సురక్షితంగా బయటపడ్డారు ఎవరికి ఇలాంటి గాయాలు కాలేదు

రంగారెడ్డి

కార్యకర్తల్లా… నాయకులు పని చేయాలి: కె ఎల్ ఆర్ –జూబ్లీహిల్స్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు కోసం కృషి* —మహేశ్వరం నియోజకవర్గం ముఖ్య నాయకులకు బూత్ ల బాధ్యత* —ప్రచారంలో పాల్గొనే నేతలు 9గంటలకు చేరుకోవాలి*

పున్నమి రంగారెడ్డి జిల్లా ప్రతినిధి నవంబర్ 04 : ఓ రాజు రాజ్యమేలాలంటే… ఓ మంచి సలహాలు ఇచ్చే మంత్రి ఉండాలి. అలాగే ఓ నాయకుడు ప్రజాప్రతినిధి కావాలంటే కార్యకర్తల్లా పని చేసి సైన్యం ఉండాలని మాజీ ఎమ్మెల్యే కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం సోమాజీగూడ కాలనీల్లో రాత్రి విస్తృత ప్రచారం చేశారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు.ఈ సందర్భంగా కె ఎల్ ఆర్ మాట్లాడుతూ… నాయకులు సైతం కార్యకర్తల్లా పని చేసి నవీన్ యాదవ్ విజయం కోసం కృషి చేయాలని చెప్పారు. ప్రతీ డివిజన్, బూత్ స్థాయిలో మహేశ్వరం నియోజకవర్గంలోని ముఖ్య నాయకులకు బాధ్యతలు అప్పగించారు. ఇంటింటి ప్రచారం, కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరించాలని కోరారు. సీఎం రేవంత్ రెడ్డి అందించే రేషన్ కార్డులు, సన్నబియ్యం, ఉచిత కరెంట్, ఆర్టీసీ బస్సు ప్రయాణం సహా పలు పథకాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 80శాతం ప్రజలు తీసుకుంటున్నారని కేఎల్ఆర్ తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు సహా మహేశ్వరం నియోకవర్గం కాంగ్రెస్ సేనా పాల్గొంది.

ఆంధ్రప్రదేశ్

ప్రజాసేవ చేయడంలోనే నాకు సంతృప్తి ఉంది – జనసేన నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్)

కాకినాడ : జనసేన అధ్యక్షుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ఆశయాల మేరకు కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ స్పూర్తితో జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) నిత్యం ప్రజా సేవ చేస్తూ ఉన్నారు. కాకినాడ పట్టణంలో జగన్నాధపురంలోని 15వ డివిజన్ కి చెందిన వాడ్రేవు దుర్గాప్రసాద్ మృతి చెందారని విషయం తెలుసుకున్న జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) వారి కుటుంబ సభ్యులును సోమవారం కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేసారు. కుటుంబాన్ని పోషించే వ్యక్తి ఆకస్మికంగా చనిపోవడంతో వారి కుటుంబానికి తన వంతు సహాయంగా రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర వస్తువులను అందజేశారు. ఇప్పటి వరకు 303 మందికి ఆర్థిక సహాయం, నిత్యవసర సరుకులు పంపిణీ చేసినట్లు జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజాసేవ చేయడంలోనే తనకు సంతృప్తి ఉందని, నిత్యం ప్రజలకు సేవ చేయడం తనకు ఎంతో ఆనందాన్ని ఇస్తుందన్నారు. పవన్ కళ్యాణ్ ఆశయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లిందుకు తన వంతు కృషి చేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.నూకరాజు, పి.బత్తిరాజు, వెంకటేశ్వర్లు, జనసేన పార్టీ వీర మహిళలు బంటు లీల, సుజాత, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు. – చేవెళ్ళ బస్సు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతికరం తెలంగాణ రాష్ట్రం చేవెళ్ళ దగ్గర చోటు చేసుకున్న ఘోర రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ బస్సును కంకర లారీ ఢీ కొట్టడంతో 24మంది మృతి చెందారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యానని జనసేన పార్టీ సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) అన్నారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానన్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలందించి ఆరోగ్యంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నానని తెలిపారు.

ఎలూరు

రక్తమోడిన తెలుగు రాష్ట్రాలు.. 24 గంటల గడవకముందే వరుసగా 3 ప్రైవేట్ బస్సు ప్రమాదాలు*

ఏలూరు జిల్లా పున్నమి ప్రతినిధి ఏలూరు జిల్లాలో భారతీ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో అయ్యపరాజ గూడెంకి చెందిన వీరంకి ప్రవీణ్ ప్రాణాలు కోల్పోయాడు. మరో పది మందికి గాయాలయ్యాయి. ఏలూరు నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు లింగపాలెం మండలం జూబిలినగర్ దగ్గర ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదానికి ముందు ధర్మాజీగూడెంలో బైక్‌ను ఢీకొట్టింది బస్సు. బైక్‌పై వెళ్తున్న వారు వెంటపడుతారన్న ఆందోళనలో బస్సును వేగంగా నడిపాడు డ్రైవర్. దీంతో బస్సు టర్నింగ్ దగ్గర బోల్తా పడింది. శ్రీసత్యసాయి జిల్లాలో ఐషర్ వాహనాన్ని ఢీకొని బోల్తా పడింది జబ్బర్ ట్రావెల్స్ బస్సు. అర్ధరాత్రి 2 గంటల సమయంలో 44వ జాతీయ రహదారిపై చెన్నేకొత్తపల్లి మండలం దామాజిపల్లి వద్ద జరిగిందీ ప్రమాదం. బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్తోంది జబ్బర్ ట్రావెల్స్ బస్సు. నల్గొండ జిల్లా అద్దంకి-నార్కెట్‌పల్లి హైవేపై వేములపల్లి మండలం బుగ్గబావిగూడెం దగ్గర ట్రాక్టర్‌ను వెనుక నుంచి ఢీకొట్టింది ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు. ప్రమాదంలో ట్రాక్టర్‌పై ప్రయాణిస్తున్న నలుగురికి గాయాలయ్యాయి. 45 మంది ప్రయాణికులతో కావలి నుంచి హైదరాబాదు వెళ్తోంది బస్సు. చేవెళ్లలో నిన్న ఘోర బస్సు ప్రమాదం సంభవించిన సంగతి తెలిసిందే

తూర్పు గోదావరి

భారత మహిళల జట్టు ప్రపంచకప్‌ సాధించడం గర్వకారణం.

-డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే ఇది సాధ్యమైందన్నారు -రాజమహేంద్రి విద్యార్థుల భారీ ర్యాలీ.. సంబరాలు -జయహో జయ జయహో భారత నారి అన్న రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్ధినిలు రాజమహేంద్రవరం : భారత మహిళా జట్టు ప్రపంపకప్‌ గెలవడం చారిత్రాత్మకమని, దేశంలో ఉన్న మహిళలందరూ వారి విజయాన్ని చూసి గర్వపడుతున్నారని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్‌ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేసారు. భారత మహిళల జట్టు వరల్డ్‌ కప్‌ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రి డిగ్రీ, పిజి కళాశాల విద్యార్థులు కళాశాల వద్ద నుంచి గోకవరం బస్టాండ్‌ అంబేద్కర్‌ విగ్రహం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అక్కడ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్‌ టీకే విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్‌ తేతలి సత్య సౌందర్య ముఖ్య అతిథులుగా విచ్చేసారు. టీకే మాట్లాడుతూ భారత మహిళల జట్టు ప్రపంచకప్‌లో పోరాటం చేసి సౌత్‌ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో విజయం సాధించడం అందరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. విమానాలు నడిపే పైలట్లుగా, రైళ్లు నడిపే లోకో పైలట్లుగా, ఆటోడ్రైవర్లుగా కూడా తాము సాధించలేని ఏది లేదన్నట్టుగా కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి అన్ని విధాలుగాను ముందుకు సాగుతున్నారన్నారు. గెలిచిన భారత జట్టుకి బిసిసిఐ 37 కోట్లు ప్రైజ్‌ మనీగా ప్రకటించడం జరిగిందని, వారి విజయాన్ని చూసి ప్రపంచమంతా గర్వపడుతోందన్నారు. ప్రపంచమేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించడానికి మహిళల జట్టుకి శుభాకాంక్షలు తెలిపారు. తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ ఇండియా మహిళా జట్టు ఆల్‌రౌండర్లుగా అన్ని జట్లతో పోరాటం చేసి వరల్డ్‌ కప్‌ని సాధించడం గర్వకారమన్నారు. తమ కళాశాలలో విద్యార్థినులను కూడా ఆల్‌ రౌండర్లుగా తీర్చిదిద్దుతున్నామని, ఏ రంగమైనా మహిళలు తమను తాము నిరూపించుకునేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. దీనికి ముందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బిఆర్‌ అంబేద్కర్‌ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్‌ ఎంకెఎస్‌ ప్రసాద్‌, ఎన్.ఎస్.ఎస్. పిఓ దంటు వీర వెంకటరావు, కళాశాల అధ్యాపకులు జ్యోతిర్మయి, అనూష, శుభదేవి, కీర్తి అధ్యాపకేత్ర సిబ్బంది వీరస్వామి, శాంతి, నాగమ్మ, కళాశాల ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు తది తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

సమాజంలో కీలకమైన ఆయుధం విద్య -ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌.

రాజమహేంద్రవరం : సమాజంలో అతి కీలకమైన ఆయుధం కేవలం ఒక విద్య మాత్రమేనని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అన్నారు. స్థానిక 4వ డివిజన్‌ రాజేంద్రనగర్‌లో రౌండ్‌ టేబుల్‌ ఇండియా వారి సీఎస్‌ఆర్‌ నిధులు రూ. 9 లక్షలతో ఎంపీపీ (సంఘం పాక స్కూల్‌) స్కూల్‌లో ఆధునీకరించిన పనులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ ప్రారంభించారు. అనంతరం తాడేపల్లిగూడెం పరిశీలకులు నక్కా చిట్టిబాబు అధ్యక్షతన జరిగిన సభలో ఆయన మాట్లాడారు. పాఠశాల పరిస్థితిని నక్కా చిట్టిబాబు తన దృష్టికి తీసుకురాగా మరమ్మతులు చేపట్టాలని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకువెళ్లినట్టు తెలిపారు. అయితే సాంకేతిక కారణాల ఆ పనులు చేసేందుకు వీల్లేనందున తాను రౌండ్‌ టేబుల్‌ ఇండియా వారి సహకారాన్ని కోరగా వారు వెంటనే స్పందించి సదరు పాఠశాల శ్లాబ్‌ లీకేజ్‌లు, మరుగు దొడ్ల అభివృద్ధి తదతర పనులను రూ. 9 లక్షలతో చేపట్టారని అభినందించారు. పాఠశాల అనేది ప్రతి ఒక్కరిది అని అన్నారు. అటువంటి దానికి సమస్య వస్తే ప్రతి ఒక్కరూ స్పందించి సహకారం అందించేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. తాను శాసన సభ్యుడిగా ఎన్నికైన తరువాత నగరంలో మూడు స్కూళ్లను ఉన్నత పాఠశాలలుగా మార్చామని గుర్తు చేశారు. మోరంపూడి స్కూల్లో తరగతి గదులు నిర్మించాలని రౌండ్‌ టేబుల్‌ ఇండియా వారిని కోరగా అందుకు వారు అంగీకరించడం సంతోషించదగిన విషయమన్నారు. అలాగే మరిన్ని పాఠశాలల అభివృద్ధికి సహకారం అందిస్తామని వారు హామీ ఇచ్చారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ తెలిపారు. గత పాలకులు పేదలకు ఉపయోగపడే కమ్యూనిటీ హాళ్లను సచివాలయాలుగా మార్చేశారని అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత సదరు కమ్యూనిటీ హాళ్లను పేదలకు అందుకు బాటులోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టిందని, త్వరలోనే ఆ కమ్యూనిటీ హాళ్లను ప్రారంభించనున్నామని తెలిపారు. నక్కా చిట్టిబాబు మాట్లాడుతూ సమస్యల పట్ల త్వరగా స్పందించి పరిష్కారం దిశగా ఆలోచనలు చేసే వ్యక్తి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్‌ అని కొనియాడారు. తన వద్దకు సమస్య అంటూ వచ్చిన ప్రజలకు క్షణాల్లో పరిష్కారం చూపుతున్నారని, తన జీవితంలో ఇటువంటి నాయకుడు, ప్రజా ప్రతినిధిని ఎన్నడూ చూడలేదన్నారు. నగరాభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ఆయన పని చేస్తూ అందరి మన్నన్నలు పొందుతున్నారని అన్నారు. అలాగే కార్పొరేటర్‌గా పాఠశాలతో ఉన్న అనుబంధం, పాఠశాల అభివృద్ధికి చేసిన కృషిని ఈ సందర్భంగా వివరించారు. అనంతరం పాఠశాల అభివృద్ధికి కృషి చేసిన రౌండ్‌ టేబుల్‌ ఇండియా చైర్మన్ మోహన్, వైస్ చైర్మన్ వరుణ్ జెట్టి, సెక్రటరీ సూర్య, శ్రీనివాస్, ఆది శంకర్, తదితరులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కాశి నవీన్‌ కుమార్‌, బండారు శ్రీనివాస్, జక్కంపూడి అర్జున్‌, యాళ్ల శ్రీనివాస్‌, బుడ్డిగ రవి, గూటాల సంజీవ్, గుత్తుల రమేష్, అప్పిరెడ్డి కుమార్, బొట్టా వీరబాబు, శేఖర్, విద్య శాఖ అధికారులు, అధిక సంఖ్యలో స్థానిక మహిళలు తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.