Sunday, 5 April 2026

Blog

జోగులాంబ గద్వాల

విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం*. *రూ. 8500 కోట్ల ఫీజురియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలి…BSP

గద్వాల్ నవంబర్ 4(పున్నమి ప్రతినిధి) *విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నా కాంగ్రెస్ ప్రభుత్వం. *రూ. 8500 కోట్ల ఫీజురియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులను వెంటనే విడుదల చేయాలి*.BSP (**జోగులాంబ గద్వాల్ జిల్లా కేంద్రం*) *జిల్లా కేంద్రం బి ఎస్పీ గద్వాల్ నియోజకవర్గం అధ్యక్షులు బండారి s రాజు మాట్లాడుతూ*……. బడుగు బలహీన వర్గాల విద్యార్థులు చదువుకునే ప్రైవేట్ కాలేజీలకు ఇంతవరకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడం అన్యాయం అని అన్నారు, దీనివల్ల ఈరోజు రాష్ట్రంలో ప్రైవేట్ కాలేజీలు మూతపడడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారే పరిస్థితి ఉంది అని అన్నారు. ఈరోజు రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ కాలేజీ మూత పడడం అంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి నైతికంగా పరిపాలన చేసే హక్కు లేదన్నారు .* విద్యాశాఖకు మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయి,22 నెలలు నుంచి విద్యాశాఖకు విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల అనేక సమస్యలు విద్యారంగంలో నెలకొన్నాయి అని అన్నారు,పెండింగ్లో ఉన్న రూ 8500 కోట్ల ఫీజు బకాయిలు ప్రభుత్వం విడుదల చేసీ విద్యార్థులను ఆదుకోవాలి అన్నారు,లేని యెడల విద్యార్థుల పక్షణ బీఎస్పీ పార్టీ తరుపున మా పోరాటం ఆగదు అని హెచ్చరించారు. *ఈ కార్యక్రమం లో బిఎస్పీ నియోజకవర్గం కార్యదర్శి దేవన్న, గద్వాల్ మండలం అధ్యక్షులు గుర్రం గడ్డ శివ, వరకుమార్ పాల్గొన్నారు*.

E-పేపర్

కన్నెగుంట తాగునీటి సమస్య పరిష్కరించాలి సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిగి చెన్నయ

త్రాగు నీటి సమస్య పరిష్కరించాలి సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిగి చెన్నయ్య అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 4 (పున్నమి న్యూస్ ప్రతినిధి – సింగమాల వెంకటేష్ ) రైల్వే కోడూరు మండల పరిధిలోని కన్నె గుంట ఎస్టి కాలనీ లో తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సిగి చెన్నయ్య సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. మంగళవారం, కన్నెగుంటలోని స్థానికులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ దాదాపు 250. కుటుంబాలు వారు నివాసం ఉన్నారన్నారని, త్రాగునీటి సదుపాయానికి కేవలం ఒకే ఒక బోరింగ్ మాత్రమే ఉందన్నారు, ఈ ఒక్క బోరింగ్ మీద ఆధారపడి 200 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. తక్షణమే అధికారులు వెంటనే స్పందించి, ఈ కాలనీకి నీటి బోరు వేసి త్రాగునీటిని ఏర్పాటు చేయాలని, కాలనీలో మౌళిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా, బ్రతుకులు మారలేదని స్థానికులు వాపోతున్నారు అని ఆయన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ నాయకులు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ‌

E-పేపర్

కన్నెగుంట తాగునీటి సమస్య పరిష్కరించాలి సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిగి చెన్నయ

త్రాగు నీటి సమస్య పరిష్కరించాలి సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ పార్టీ జిల్లా కమిటీ సభ్యులు సిగి చెన్నయ్య అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 4 (పున్నమి న్యూస్ ప్రతినిధి – సింగమాల వెంకటేష్ ) రైల్వే కోడూరు మండల పరిధిలోని కన్నె గుంట ఎస్టి కాలనీ లో తాగునీటి సమస్య పరిష్కారం చేయాలని సిపిఐ ఎమ్మెల్యే లిబరేషన్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు సిగి చెన్నయ్య సంబంధిత అధికారులను డిమాండ్ చేశారు. మంగళవారం, కన్నెగుంటలోని స్థానికులతో కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్కడ దాదాపు 250. కుటుంబాలు వారు నివాసం ఉన్నారన్నారని, త్రాగునీటి సదుపాయానికి కేవలం ఒకే ఒక బోరింగ్ మాత్రమే ఉందన్నారు, ఈ ఒక్క బోరింగ్ మీద ఆధారపడి 200 కుటుంబాలు జీవనం కొనసాగిస్తున్నారని అన్నారు. తక్షణమే అధికారులు వెంటనే స్పందించి, ఈ కాలనీకి నీటి బోరు వేసి త్రాగునీటిని ఏర్పాటు చేయాలని, కాలనీలో మౌళిక సదుపాయాలు కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు ప్రభుత్వాలు మారినా పాలకులు మారినా, బ్రతుకులు మారలేదని స్థానికులు వాపోతున్నారు అని ఆయన అన్నారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి సమస్యలు చర్యలు చేపట్టాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో సిపిఐ ఎం ఎల్ లిబరేషన్ నాయకులు సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు ‌

అన్నమయ్య

మంత్రులు మరియు అధికారులతో మర్యాదపూర్వంగా సమావేశమైన మేడా విజయ శేఖర్ రెడ్డి

అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం స్టేట్ గెస్ట్ హౌస్ కు అన్నమయ్య జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశం సందర్భంగా హాజరైన రాష్ట్ర రోడ్ల భవనాల శాఖ మంత్రి మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మరియు,రాష్ట్ర రవాణా,యువజన మరియు క్రీడశాఖ మంత్రి మంత్రివర్యులు మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి .జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మరియు జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లీ అన్నమయ్య జిల్లా స్టేట్ గెస్ట్ హౌస్ నందు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో సత్కరించి టిడిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి ఘన స్వాగతం పలికారు.ఈ కార్యక్రమంలో లేబక సర్పంచ్ లంకయ్య గారి నరసయ్య,టీడీపీ పార్టీ నాయకులు మాడపూరి మురళి,చింతకాయల రత్నం,చుక్క వెంకటేష్,తదితరులు పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన* ఆలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు గారు

గద్వాల్ నవంబర్ 4 (పున్నమి ప్రతినిధి) జోగులంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గo అలంపూర్ మండలం క్యాతూర్ గ్రామం నందు నేడు అలంపూర్ నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ విజయుడు గారి చేతుల మీదుగా మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఘనంగా ప్రారంభించారు,, అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రైతులు లేకుంటే నేటి సమాజానికి తినడానికి తిండి లేదు… కావున రైతుల పట్ల ప్రభుత్వాలు సానుకూలంగా ఉంటూ రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించే విధంగా ప్రభుత్వం ఉండాలని… ఎమ్మెల్యే గారు అన్నారు. అనంతరం నా రైతులకు నేను అండగా ఉంటానని ఆయన అన్నారు, అలాగే రైతులు ఎమ్మెల్యే గారికి శాలువతో సత్కరించడం జరిగింది, ఈ కార్యక్రమంలో బి ఆర్ ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

Others

వైఎస్ జగన్ కాన్వాయ్ కు ప్రమాదం – పలువురికి గాయాలు

కృష్ణా జిల్లాలో మొంథా తుపాను వల్ల నష్టపోయిన పంటలను పరిశీలించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పర్యటిస్తున్న సందర్భంలో, ఆయన కాన్వాయ్ లో స్వల్ప ప్రమాదం చోటు చేసుకుంది. ఉయ్యూరు మండలం గండిగుంట వద్ద జగన్ కాన్వాయ్ లోని కొన్ని వాహనాలు ఒకదానికొకటి ఢీకొనడంతో పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి. ప్రమాదం కారణంగా అక్కడ కొంతసేపు ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇదిలాఉంటే… పర్యటన మార్గమంతా వైసీపీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ కి ఘన స్వాగతం పలికారు. మహిళలు గుమ్మడికాయలతో దిష్టి తీశారు, పూలు చల్లుతూ ఆహ్వానించారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం పడమట సెంటర్ నుంచి పామర్రు నియోజకవర్గంలోని గోపువానిపాలెం వరకు జగన్ పర్యటన కొనసాగింది. కల్లుగీత కార్మికులు ఆయనను కలసి తమ సమస్యలను వివరించారు. ఇక భద్రతా కారణాల దృష్ట్యా పోలీసులు పర్యటనపై ఆంక్షలు విధించారు. కేవలం 500 మంది, 10 వాహనాలకే అనుమతి ఇచ్చారు. ద్విచక్ర వాహనాల ప్రవేశాన్ని పూర్తిగా నిషేధించారు. అలాగే మాజీ ఎమ్మెల్యేలు, గ్రామ, మండల నాయకులకు పర్యటనలో పాల్గొనవద్దని నోటీసులు జారీ చేశారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ట్రాఫిక్ సమస్యలపై వేగవంతమైన చర్య – బారికేడ్లు తొలగించిన అధికారులు

నగరంలోని విజయ్ మహల్ గేట్ సెంటర్ లో ఏర్పాటు చేసిన బారికెట్లను ట్రాఫిక్ అంతరాయం గూర్చి పున్నమి దినపత్రికలో ప్రచురితం ఆయన విషయం విధితమే. ట్రాఫిక్‌కు అంతరాయం కలిగిస్తూ పెద్ద మొత్తంలో ఏర్పాటు చేసిన బారికేడ్లను అధికారులు తొలగించారు ఈ చర్యతో రహదారి పై వాహన రద్దీ తగ్గి, ప్రయాణికులు, వ్యాపారదారులు, స్థానిక ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. గత కొన్ని రోజులుగా ప్రధాన జంక్షన్, రోడ్ల వద్ద బారికేడ్లు అధికంగా ఉండటం వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర ఆటంకం ఏర్పడింది. అంబులెన్స్ సేవలు, విద్యార్థుల రాకపోకలు కూడా ఇబ్బంది పడ్డాయి. ప్రజల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకున్న అధికారులు బారికేడ్‌లను పరిశీలించి, అవసరం లేని వాటిని తొలగించారు. ప్రజలు దీనిని స్వాగతిస్తూ, ట్రాఫిక్ సమస్యలపై త్వరగా స్పందించిన అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. రోడ్లపై సజావుగా వాహనాలు వెళ్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు.

కర్నూలు

శ్రీ కృష్ణ కాలచక్రం 87వ విశ్వశాంతి మహాయోగ మహోత్సవంలో పాల్గొన్నా కలెక్టర్,ఎస్పీ,ఎమ్మెల్యే

ఎమ్మిగనూరు నియోజకవర్గం, గోనెగండ్ల మండలం నవంబర్ 04-11-2025 (పున్నమి ప్రతినిధి) శ్రీ కృష్ణ కాలచక్రం 87వ విశ్వశాంతి మహాయాగ మహోత్సవంలో పాల్గొనేందుకు ఎమ్మిగనూరుకు విచ్చేసిన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి మరియు ఎస్పీ విక్రాంత్ పాటిల్ స్థానిక ఆర్ అండ్ బి అతిథి గృహం వద్ద ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బీవీ జయనాగేశ్వర్ రెడ్డి ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారికి కలిసి పుష్పగుచ్చం అందచేసి శాలువాతో సత్కరించారు.అనంతరం వీవర్స్ కాలనీ మైదానంలోని యజ్ఞశాలలో అట్టహాసంగా నిర్వహించిన హనుమాత్ సహిత సుబ్రహ్మణ్య హోమములు, చండీ హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అర్చకులు వారికి వేదాశీస్సులు అందజేసి ప్రసాదాలు వితరణ చేశరు.

కామారెడ్డి

రైతులకు మట్టి నమూనా పరీక్షల పత్రాలు అందజేత

రామారెడ్డి (నవంబర్ 4): (పున్నమి ప్రతినిధి ) : రైతు నేస్తం కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్రం వ్యాప్తంగా భూసార పరీక్షల పత్రాలు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు. అందులో బాగంగా కా మారెడ్డి జిల్లతో పాటు ప్రతి రైతు వేధికలలో వివిధ మండల కేంద్రంలో గత సంవత్సరం సేకరించిన 3,184 మట్టి నమూనాలకు సంబంధించిన భూసా ర పరీక్ష పత్రాల పంపిణీనిని రామారెడ్డి మండల కేంద్రంలో ప్రారంభించారు.రైతులకు భూసార పరీక్ష పత్రాలను అందజేశారు. జిల్లా వ్యవసాయ అధికా రి మోహన్ రెడ్డి మాట్లాడుతూ, “భూసార పరీక్షలు పంటల సాగు పద్ధతులను మెరుగుపరచడంలో అత్యంత ముఖ్యమైనవి. ఈ పత్రాల ఆధారంగా రైతులు తమ భూమి ఉత్పాదకతను గుర్తించి, తగిన సాగు విధానాలను అనుసరించవచ్చు. ప్రభు త్వం రైతుల సంక్షేమానికి అన్ని విధాల సహకరి స్తోందని ఏడీఏ ఎల్లారెడ్డి సుధా మాధురి చెప్పారు, “భూసార పరీక్ష పత్రాలు రైతులకు పంటల విష యంలో స్పష్టమైన మార్గదర్శకత్వం ఇస్తున్నాయని అన్నారు. దీని వల్ల పంట దిగుబడులు పెరిగినట్టు మనం ఇప్పటికే గమనిస్తున్నామని మండల వ్యవ సాయ అధికారి భాను శ్రీ చెప్పారు, ఈ పత్రాల పంపిణీతో పాటు, భూమి నిర్వహణపై సాంకేతిక సహాయం అందిస్తూ, రైతులకు చక్కటి గైడెన్స్ అందించనున్నామని అన్నారు.”వ్యవసాయ విస్తర ణ అధికారి బి రాకేష్ మాట్లాడుతూ, “రైతులు ఈ పత్రాలను ఉపయోగించి మట్టి స్థితిని తెలుసుకుని, రసాయన ప్రాసెస్ తగ్గించి, పర్యావరణానికి అను కూలమైన వ్యవసాయ పద్ధతులను అవలంబిస్తా రని ఆశిస్తున్నామనిచెప్పారు. రైతులు మాట్లాడు తూ, ఈ పత్రాలు మా పంటల వృద్ధికి మాకు గొప్ప సాయం. ముందుగానే మా భూమి అవసరాలను అర్థం చేసుకుని పంటలు సాగించగలగడం వల్ల దిగుబడి మెరుగవుతుంది” అని అభిప్రాయపడ్డా రు.ఈ కార్యక్రమం రైతుల సంక్షేమానికి మైలురా యి రూపం వలె నిలవాలని స్థానికులు భావిస్తున్నా రు. ఇకపై ఇలాంటి కార్యక్రమాలను మరింత విస్తృ తంగా నిర్వహించాలని కోరుతున్నారు.

E-పేపర్

జాతీయ స్థాయికి యస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఎంపిక.

జాతీయ స్థాయికి యస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఎంపిక. రైల్వేకోడారుకు చెందిన ఎస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన విద్యార్థి ఈ నెల 1.2వ తేది ఏలూరు శనివారం పేట హై స్కూల్ లో 69వ SGF స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ అండర్ 17 రాష్ట్రా స్థాయి టైక్వాండో పోటీలు నిర్వహించారు. ఇందులో రైల్వేకోడూరు పట్టణలో ఉన్న ఎస్.వి.కె స్పోర్ట్స్ అకాడమీకి చెందిన కె. అఖిల యూ.46kg విభాగంలో బంగారు పథకము. సాధించింది . అలాగే బాలుల విభాగంలో ఏ. రామ్ చరణ్. యూ .78 కేజీ విభాగంలోకాంస్య పతకాన్ని సాధించిన వారికి ఈ పతకాలను రైల్వే కోడూరు నియోజకవర్గం సీఐ శ్రీ వెంకటేశ్వర్లు గారు అభినందించి పథకాలు అందజేయడం జరిగింది ఎస్ పీ కే స్పోర్ట్స్ అకాడమీ కోచ్ శివాజీ తెలిపినాడు అలాగేబంగారు పతకము సాధించిన . కే అఖిల ఈనెల 25 నుండి అరుణా ప్రదేశ్ జరగబోమే జాతియ స్థాయి పోటీలకు ఆంధ్రప్రదేశ్ తరఫున పాల్గొని పోతున్న అక్కడ కూడా జాతీయస్థాయిలో బంగారు పతకం సాధించాలని సిఐ వెంకటేశ్వర్లు గారు కోచ్ శివాజీ వ్యాయామ ఉపాధ్యాయులు జయలక్ష్మి అభినందించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.