Sunday, 5 April 2026

Blog

ఆంధ్రప్రదేశ్

లస్కర్లకు రెయిన్ కోట్లు అందజేసిన డెల్టా ఛైర్మెన్ మురాలశెట్టి సునీల్

పిఠాపురం : పట్టణంలోని ఇరిగేషన్ కార్యాలయం నందు మోoథా తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కోవడంలో కీలకంగా పనిచేసిన పిబిసి పరిధిలో ఉన్న 14 మంది లస్కర్లకు గోదావరి తూర్పు డెల్టా ప్రాజెక్ట్ ఛైర్మన్ మురాలశెట్టి సునీల్ కుమార్ రెయిన్ కోట్లును అందజేశారు. ఈ కార్యక్రమంలో కోటిపల్లి డిసి విజయ గోపాల రాజు, కాజులూరు డిసి లాకాని కృష్ణ చైతన్య, సిరిపురం డిసి పేపకాయల నారాయణరావు, ఎర్రపోతవరం డిసి సుబ్రహ్మణ్యేశ్వర చౌదరి, కొమరిపాలెం డిసి వేణుగోపాల్ రెడ్డి, కాకినాడ డిసి కోప్పిరెడ్డి వీరస్వామి, రామచంద్రపురం డిసి సత్యానంద రెడ్డి, ఇరిగేషన్ డిఈ సంతోష్ కుమార్, జేఈ పద్మజ, జేఈ భవాని, ఇరిగేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

లీగల్ అవార్డులపై వేగవంతమైన చర్యలు – కమిషనర్ అంబేద్కర్ గారికి ఫెడరేషన్ ధన్యవాదాలు

(పున్నమి ప్రతినిధి) ఆంధ్రప్రదేశ్ స్టాంప్ & రిజిస్ట్రేషన్ కమిషనర్ డా. అంబేద్కర్ గారిని ఫెడరేషన్ అఫ్ ఏపీ చిట్ ఫండ్ అసోసియేషన్ ప్రతినిధులు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా, లీగల్ అవార్డుల మంజూరు ప్రక్రియలో డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్లు ఆలస్యం చేస్తున్నారని తెలియజేయగా, కమిషనర్ గారు వెంటనే స్పందించి అన్ని జిల్లా రిజిస్ట్రార్లకు త్వరితగతిన అవార్డులు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. ఫెడరేషన్ తరపున కమిషనర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ — 🔹 శ్రీహరి గారు – సెక్రటరీ 🔹 రవివర్మ గారు – కమిటీ సభ్యుడు 🔹 మోహన్ గారు – ట్రెజరర్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

దామాషా పద్ధతిలో బీసీ కార్పొరేషన్లకు నిధులు

– రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత – బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు ప్రణాళికలు – త్వరలోనే కుట్టుమిషన్ల పంపిణీ – ఆదరణ 3.0తో కుల, చేతివృత్తుల వారికి శాశ్వత ఉపాధి – కార్పొరేషన్ చైర్మన్లకు అన్ని విధాలా ప్రాధాన్యం : మంత్రి సవిత – భువనమ్మకు మంత్రి సవిత అభినందనలు విజయవాడ : జనాభా దామాషా పద్ధతిలో ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయించనున్నట్లు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత మరియు జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత సష్టం చేశారు. బీసీ రక్షణ చట్టం రూపకల్పనకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, ఇదే విషయమై ఇప్పటికే బీసీ మంత్రులతో సమావేశాలు సైతం నిర్వహించామన్నారు. త్వరలోనే కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు కుట్టు మిషన్లు అందజేయనున్నామని వెల్లడించారు. విజయవాడలోని గొల్లపూడి బీసీ భవన్ లో 10 వివిధ బీసీ కులాల కార్పొరేషన్ చైర్మన్లు, డైరెక్టర్లతో మంత్రి సవిత ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా కులాల చేతివృత్తుల అభివృద్ధికి ఏవిధమైన ఆధునిక పరికరాలు అందజేయాలన్న అంశంపై వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం మంత్రి సవిత మాట్లాడుతూ బీసీలను అన్ని రంగాల్లోనూ ముందంజలో నిలపాలన్న సంకల్పంతో టీడీపీ ఆవిర్భవించిందన్నారు. ఆనాడు ఎన్టీఆర్ బీసీల అభ్యున్నతికి ఎన్నో సంస్కరణలు తీసుకురాగా, ఆయన స్ఫూర్తితో పాలన సాగిస్తున్న సీఎం చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెనుబడిన తరగతులకు అండగా నిలుస్తున్నారన్నారు. ఆదరణ పథకాన్ని తీసుకొచ్చి కుల, చేతి వృత్తి దారులకు సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారన్నారు. 2014-19 మధ్య కాలంలో బీసీల సర్వతోముఖాభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయుడు ఎంతో పథకాలు అమలుచేశారన్నారు. అనంతరం వచ్చిన జగన్ బీసీల ద్రోహిగా మిగిలారన్నారు. బీసీలను అన్ని విధాలా అణగదొక్కారన్నారు. 2019-24 మధ్య వెనుకబడిన తరగతులు అన్ని విధాలా తీవ్రంగా నష్టపోయావన్నారు. – కుల వృత్తులకు ఆధునిక పరికరాలు 2024 ఎన్నికల్లో సీఎం చంద్రబాబు, ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ కూటమి ప్రభుత్వం విజయం సాధించడంతో బీసీలకు మరోసారి మంచి రోజులు వచ్చాయన్నారు. బీసీలకు ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని సీఎం చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అమలు చేస్తున్నారన్నారు. చట్టసభల్లో బీసీలకు 33 శాతం రిజర్వేషన్ల కల్పించాలని అసెంబ్లీలో తీర్మానం చేసి అమలు కోసం కేంద్రానికి పంపామన్నారు. బీసీల రక్షణ చట్టం ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు ప్రారంభించామన్నారు. బీసీ మంత్రులతో రెండు పర్యాయాలు సమావేశాలు సైతం నిర్వహించామన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్ల కల్పనకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. రూ.1000 కోట్లతో ఆదరణ 3.0 పథకానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రస్తుత అభిరుచులకు అనుగుణంగా కుల, చేతివృత్తిదారులకు ఆదరణ 3.0 పథకం కింద ఆధునిక పరికరాలు అందజేయనున్నట్లు తెలిపారు. కుల, చేతివృత్తిదారులకు శాశ్వత ఉపాధే సీఎం చంద్రబాబు లక్ష్యమన్నారు. – బీసీ బిడ్డల విద్యకు ప్రాధాన్యం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి బీసీ బిడ్డల విద్యకు సీఎం చంద్రబాబు అధిక ప్రాధాన్యమిస్తున్నారని మంత్రి సవిత వెల్లడించారు. గత ప్రభుత్వం పెట్టిన డైట్, కాస్మోటిక్ ఛార్జీల బకాయిలను అధికారంలోకి రాగానే చెల్లించామన్నారు. హాస్టళ్ల మరమ్మతులకు రూ.20 కోట్లు మంజూరు చేశామని, ఇటీవల మరో రూ.60 కోట్లు అందజేశామని తెలిపారు. అన్ని హాస్టళ్లు, గురుకులాల్లో సీసీ కెమెరాలు, ఆర్వో ప్లాంట్లు, ఇన్వర్టర్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ కోచింగ్ అందజేశామన్నారు. బీసీ కార్పొరేషన్ ద్వారా అందజేసిన కోచింగ్ ఎందరో బీసీ అభ్యర్థులు ఉపాధ్యాయులుగా నియమితులయ్యారన్నారు. – బీసీ పాలక మండళ్లకు విధులు, నిధులు బీసీ పాలక మండళ్లను ఉత్సవ విగ్రహాల మాదిరిగా చూడకుండా వాటికి విధులు, నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు మంత్రి సవిత వెల్లడించారు. దామాషా పద్ధతిలో ఆయా కార్పొరేషన్లకు నిధులు కేటాయించినున్నట్లు తెలిపారు. బీసీ కార్పొరేషన్ల చైర్మన్లకు సీఎం చంద్రబాబు త్వరలోనే తీపికబురు అందిస్తారని మంత్రి తెలిపారు. – భువనమ్మకు మంత్రి సవిత అభినందనలు లండన్ లో పత్రిష్టాత్మకమైన రెండు అవార్డులను మంగళవారం అందుకోనున్న నారా భువనేశ్వరికి మంత్రి సవిత అభినందనలు తెలియజేశారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చేస్తున్న సామాజిక సేవలను గుర్తిస్తూ లండన్ లోని ఇనిస్ట్యిటూట్ ఆఫ్ డైరెక్టర్స్(ఐవోడీ) సంస్థ నారా భువనేశ్వరికి డిస్టింగ్విష్డ్ ఫెలోషిప్ 2025 అవార్డు ప్రకటించడం హర్షణీయమన్నారు. అదే వేదికపై ఎక్స్ లెన్స్ ఇన్ కార్పొరేట్ గవర్నెన్స్ విభాగంలో హెరిటేజ్ ఫుడ్ కు లభించిన గోల్డెన్ పీకాక్ అవార్డును కూడా ఎండీ హోదాలో భువనేశ్వరి అందుకోనున్నారన్నారు. ప్రపంచ కప్ గెలుచుకున్న మహిళా టీమిండియా జట్టుకు మంత్రి సవిత అభినందనలు తెలియజేశారు. అనంతరం మంత్రి సవితను కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఘనంగా సత్కరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎస్.సత్యనారాయణ, ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు కుడిపూడి సత్తిబాబు, రోణంకి కృష్ణంనాయుడు, దేవంద్రప్ప, నందం అబద్ధయ్య, మరుపిల్ల తిరుమలేశ్వరరావు, మళ్ల సురేంద్ర, సీఆర్ రాజన్, పేరేపి ఈశ్వర్, వీరంకి వెంకట గురుమూర్తి, సీహెచ్.సావిత్రి, రెడ్డి అనంతకుమారి, శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ రెడ్డి సుబ్రహ్మణ్యం, వివిధ ఆంధ్రప్రదేశ్ కార్పొరేషన్ డైరెక్టర్స్ చప్పిడి వెంకటేశ్వరరావు, పెంకే వెంకటేష్, వమ్మి బాలాజీ, పెంకే జగదీష్ ,జయబాబు గుడాల, కడలి వెంకటేశ్వరరావు, కేతా శ్రీను, లక్ష్మణరావు టేకుముడి, మధుసూదనరావు అనసూరి, చిట్టిబానా రామలిగేశ్వరావు, బీసీ సంక్షేమ శాఖాధికారులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్

జ్ఞాపకాల రూపమే – కవిత్వం

పూల మకరందమే సుమగంధమైతే సరసన నిలిచిన నీ జత ప్రియ నందనమైతే వలపులపూతోటలు వికసించి పోవా విరిసిన నవ కుసుమాలు పరిమళించిపోవా ఎద మాటున దాగిన మాట వినిపించే క్షణాన విశ్వమంతటా మన జ్ఞాపకాలే విస్తుపోక క్షణక్షణం ప్రేమ పోరాటాలే… కవిత్వం ఒక జ్ఞాపకాల భాండాగారం కవిత్వం కరగని కన్నీటి కావ్యం కవిత్వం కర్షకుడి అసంపూర్ణ జీవం కవిత్వం కనురెప్పలా కాచే అమ్మ జీవితం కవిత్వం భావాలను దాచుంచే ప్రణయ శబ్దం కవిత్వం వర్ణించలేని, వర్ణనకే అందని ఓ మధుర భావం అంటూ కవిత్వం గురించి, కవనాన్ని వర్ణించడం గురించి, ఒక కవిత్వం అంటే ఏమిటి అని ఆరాధించే అతని అక్షరాలే అర్థంగా నిలుచున్నాయి, సురేందర్ గారి కవిత్వం ఎంతో సుందరంగా, స్పష్టంగా, అర్థవంతంగా ఉందనడంలో అతిశయోక్తి లేదని చెప్పాలి. – ఇక కవిత్వం విషయానికి వస్తే… – శీర్షిక : కవిత్వం తప్ప నేనేమీ ఇవ్వగలను చేతులతో..! నేనేమీ చెప్పగలను మాటలతో..! ఓ ప్రేమ కావ్యాన్ని మీ పచ్చని వాకిట్లో ముత్యాల ముగ్గులతో నింపడం తప్ప..!! నేనేమి చూడగలను కనులతో..! నేనేమి శ్వాసించగలను ఊపిరితో..! ఓ మాధుర్యమైన భావాల్ని కలబోసిన కావ్యాన్ని నీ హృదయ సంద్రంలో ప్రేమ కవిత్వమై రాయడం తప్ప..!! – రచయిత : డా. పగిడిపల్లి సురేందర్ – సమీక్ష నేనేమీ ఇవ్వగలను చేతులతో, నేనేమి చెప్పగలను మాటలతో, ఓ ప్రేమ కావ్యాన్ని మీ పచ్చని వాకిట్లో ముత్యాల ముగ్గులతో నింపడం తప్ప… అర్థవంతమైన భావాలకు ప్రతీక అని చెప్పాలా లేక అర్ధాన్ని నింపుకున్న అక్షరాల హరివిల్లు అని వర్ణించాలా చేతులతో ఇవ్వలేనిది, మాటలతో చెప్పలేనిది ప్రేమ కావ్యం గా మారి ముత్యాలముగ్గులో స్పష్టంగా కనిపిస్తుంది వహ్వా ఏమి వర్ణన మనసుకి ఉత్తేజాన్ని ఇస్తూ, మనసైన వారి జ్ఞాపకాలకు రూపంగా నిలిచిపోతున్నాయి ఈ భావాలు, మధురమైన అక్షర కావ్యాలు… నేనేమి చూడగలను కనులతో, నేనేమి శ్వాసించగలను ఊపిరితో, మాధుర్యమైన భావాల్ని కలబోసి కావ్యాన్ని నీ హృదయ సంద్రంలో ప్రేమ కవిత్వమై రాయడం తప్ప అంటూ భావావేశాన్ని గుండెల్లో దాచుకుని, మధురమైన, మాధుర్యమైన తలపుల వలపులతో హృదిని కోమలంగా తాకుతున్న ప్రేమ కవిత్వాన్ని తప్ప ఇంకేమీ ఇవ్వగలను బహుమతిగా కన్నులతో చూడలేనిది చేతితో తాకలేనిది అందమైన నీ హృదయమే కదా, నన్ను నీలో నింపుకున్న మృదు మధురమైన ఆ అంతరంగమే కదా…. ఒక్కొక్క అక్షరం అమృతమై కురుస్తుంది ఒక్కొక్క పదం మనసుని తాకి మైమరపిస్తుంది ఒక్కొక్క వాక్యం విశిష్టమైన అర్ధాన్ని పులుముకుని కనుల ముందు సాక్షాత్కరిస్తుంది. ఇలాంటి మరెన్నో మనసుకు హత్తుకునే కవనాలు మీరు లిఖించాలని, అనంతమైన ఈ సాహిత్య లోకానికి దిక్సూచిగా మీ అక్షరాలు మారాలని, మరెన్నో రచనలు చేసి పాఠకుల మనసులు గెలవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. – సమీక్ష : పోలగాని భాను తేజశ్రీ

ఎన్ టి ఆర్ జిల్లా

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో – జగ్గయ్యపేటలో మెగా జాబ్ మేళా! పోస్టర్ ఆవిష్కరించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)

ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ సంస్థ ఆధ్వర్యంలో జరుగనున్న మెగా జాబ్ మేళా పోస్టర్ను జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ — రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు వివిధ రంగాలలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్హతలు: 10వ తరగతి / ఇంటర్ / డిప్లొమా / డిగ్రీ పాల్గొనే కంపెనీలు: 20కి పైగా ప్రముఖ సంస్థలు తేదీ: నవంబర్ 21, 2025 (శుక్రవారం) సమయం: ఉదయం 9:00 గంటలకు స్థలం: జె.ఆర్.సి. కాలేజీ, జగ్గయ్యపేట పూర్తి వివరాలు ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ అధికారిక ప్రకటనల్లో అందుబాటులో ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని వినియోగించు కొని తమ భవిష్యత్తు నిర్మించు కోవాలని ఎమ్మెల్యే పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు: స్కిల్ డెవలప్మెంట్ ప్రతినిధులు కిరణ్, మోహన్, కోఆర్డినేటర్ రామ తులసి, లైఫ్ స్కిల్స్ ఒకేషనల్ జూనియర్ కాలేజీ ప్రిన్సిపాల్ తంగేళ్ల వెంకటేశ్వర రాజు,డి.సి.కెనాల్ వైస్ చైర్మన్ మన్నె నారాయణ రావు తదితరులు.

ఎన్ టి ఆర్ జిల్లా

నందిగామలో మృతుల కుటుంబాలను పరామర్శించిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య

ల్దిగామ పట్టణంలోని 16వ వార్డు నివాసి తమ్మిశెట్టి రాజు మరియు 15వ వార్డు నివాసి వేముల కాంచన ఇటీవల మృతిచెందిన నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వారి కుటుంబాలనుపరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కూటమి నేతలతో కలిసి మృతుల చిత్రపటాలకు పూల మాలలు వేసి నివాళులర్పిం చారు. అనంతరం వారి పవిత్ర ఆత్మలకు శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థించారు. తరువాత కుటుంబ సభ్యులను ఓదార్చి, సానుభూతి తెలియ జేసిన ఎమ్మెల్యే సౌమ్య, బాధిత కుటుంబాలకు అన్ని విధాలా సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.

ఆంధ్రప్రదేశ్

బండ్లమూడి మాదిగ పల్లె పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

కనిగిరి: ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం బండ్లమూడి మాదిగ పల్లి పై దాడి చేసి శ్రీనివాస్ రెడ్డి ని వెంటనే అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదు చేయాలని ప్రకాశం జిల్లా దళిత హక్కుల పోరాట సమితి జిల్లా కార్యదర్శి పందిటి మోహన్ డిమాండ్ చేశారు. మంగళవారం కనిగిరిలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో దళితులకు రక్షణ కరువైందని సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి నియోజకవర్గమైన పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే పట్టించుకోలేదు నేడు మాదిగ పల్లె కర్రలతో కత్తులతో దాడి జరిగిందని ఇది ఎంత మాత్రం సహించరానిదని శ్రీనివాస్ రెడ్డి, రమణారెడ్డి ఇతర పెత్తందారులు చెందిన గొర్రెలు ధ్వంసం చేస్తే దానిపై మాదిగ పల్లె చెందిన వారు ఫిర్యాదు చేయగా సిఐ కానిస్టేబుల్ ను పంపించి ఎంక్వయిరీ చేస్తుండగా కానిస్టేబుల్ సమక్షంలోనే మాదిగ పల్లెపై దాడి చేయడం దుర్మార్గమైన చర్య అని దీనిని సుమోటోగా స్వీకరించి వెంటనే వారిని అరెస్టు చేసి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ నమోదుచేయాలని స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడుస్తున్న దేశంలో ఇటువంటి అల్లర్లు ఏదో ఒక మూలన జరుగుతున్నాయని మేధావులు కులం ఎక్కడుంది స్వతంత్ర భారతదేశంలో కులం లేదంటూ పెద్దపెద్ద సూక్తులు చెబుతున్నా మేధావులకు ఇది కనువిప్పు కావాలని దాడి చేసిన వారిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు.

ఎన్ టి ఆర్ జిల్లా

“ట్రంప్ అడుగులకు మడుగు లొత్తే మోడీ లొంగుబాటు విధానంపై పోరాడదాం” – ఎస్ఎఫ్ఐ

కంచికచర్ల మండలంలోని ఎన్టీఆర్ జూనియర్ మరియు కె.వి.పారామెడికల్ కళాశాలల్లో ఎస్ఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో అమెరికా టారీఫ్ సుంకాలపై జరిగిన సదస్సులో మోడీ ప్రభుత్వ విదేశాంగ విధానంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. ఎస్ఎఫ్ఐ నాయకులు కోట కళ్యాణ్ మరియు గోపి నాయక్ మాట్లాడుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రారం భించిన వాణిజ్య యుద్ధం భారతదేశంతో సహా ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలను దెబ్బతీస్తోందని, ముఖ్యంగా భారత వ్యవసాయ, పారిశ్రామిక, సేవారంగాలు సంక్షోభంలోకి నెడుతున్నాయని పేర్కొన్నారు. టెక్స్టైల్, గార్మెంట్, పట్టు రంగాలు నష్టపోతుండడంతో కార్మికులు, రైతులు, విద్యార్థులు కష్టాల్లో పడుతున్నారని తెలిపారు. వారు మోడీ ప్రభుత్వం”అమెరికా ప్రయోజ నాలకు లొంగిపోయినది” అని విమర్శిస్తూ, స్వతంత్ర విదేశాంగ విధానానికి తూట్లు పొడుస్తోం దని అన్నారు. అమెరికా సామ్రా జ్యవాదానికి వ్యతిరేకంగా ప్రజలు, విద్యార్థులు ఉద్యమిం చాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. గోపి నాయక్ మాట్లాడుతూ – ట్రంప్ విధానాల వల్ల భారత వ్యవసాయ ఉత్పత్తుల ధరలు పడిపోతాయని, రైతులుదివాలా తీయాల్సి వస్తుందని హెచ్చరించారు.మోడీ ప్రభుత్వం పార్లమెంట్‌ను విశ్వాసంలోకి తీసుకోకుండా అమెరికాతో ఒప్పందాలు కుదురుస్తోందని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజ నాలు కాపాడాల్సిన బాధ్యత ఉన్నా, టిడిపి మరియు వైసీపీ ప్రభుత్వాలు మౌనం వహిస్తు న్నాయని అన్నారు. ఈ సదస్సు లో దీపిక, వరలక్ష్మి, తులసి, ప్రేమ్ కుమార్ తదితర విద్యార్థి నాయకులు పాల్గొన్నారు.

E-పేపర్

బకాయి జీతాలు వెంటనే చెల్లించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి ఆర్ యం టి యు డిమాండ్.

బకాయి జీతాలు వెంటనే చెల్లించి కార్మిక కుటుంబాలను ఆదుకోవాలి ఆర్ యం టి యు డిమాండ్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 04 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్): నవంబర్ 4 మంగళవారం నాడు ఆర్ ఎమ్ టి యు అన్నమయ్య జిల్లా కన్వీనర్ కామ్రేడ్ దాసరి జయచంద్ర పంచాయతీ కార్యాలయం నందు కార్మిక సమస్యల గూర్చి మాట్లాడుతూ పంచాయితీ,గ్రీన్ అంబాసిడర్లకు, మూడు నేలలుజీతాలు , ఆఫీస్ స్టాప్ మరియు మేస్త్రీలకు ఆరు నేల పెండింగ్ జీతాలు చెల్లించాలని, కనీస వేతనం అమలు చేయాలని వారి డిమాండ్ చేశారు!గ్రామపంచాయతీ కార్మికులకు గ్రీన్ అంబాసిడర్లకు మరియు బకాయి జీతాలు వెంటనే చెల్లించాలని, కనీస వేతనం ఇరవై ఒక్క వేలు ఇవ్వాలని, డిమాండ్ చేస్తూ ఆర్ యం టి యు అన్నమయ్య జిల్లా కన్వీనర్, దాసరి జయచంద్ర కార్మికులను ఉద్దేశించి మాట్లాడుతూ, పెండింగ్లో ఉన్న జీతాలను తక్షణం చెల్లించాలని, కనీస వేతనం21,000,ఇవ్వాలి. గ్రామపంచాయతీ కార్మికులకు గౌరవ హైకోర్టు 2015 వ సంవత్సరంలో ఇచ్చిన తీర్పును అమలు చేయాలన్నారు. మున్సిపల్ కార్మికులకు అమలు చేస్తున్న ఆక్యుపేషనల్ హెల్త్ అలవెన్స్ 6000 ఇవ్వాలి. 132వ జి.ఓ అమలకు 551 జీవో ఆటంకముగా ఉన్నది. దీనిని రద్దుచేసి, 132, 57 జీవోలు: ఆమలు, టెండర్లు రద్దు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, బకాయి జీతాలు చెల్లింపు, పనిముట్లు, రక్షణ పరికరాలు, యూనిఫామ్, చెప్పులు, సబ్బులు, నూనెలు, టవల్స్ తదితర సమస్యలను చేపట్టడం గురించి గ్రామ పరిశుభ్రత ప్రజారోగ్యం పర్యావరణాన్ని కాపాడేందుకు మా ప్రాణాలను పణంగా పెడుతున్నాము. విష వాయువులు మా ఆరోగ్యాన్ని సైతం దెబ్బతీస్తున్నాయి ప్రజలకు ప్రభుత్వం తరపున సేవలు చేస్తున్నాము. అయినా ప్రతి నెల జీతాలు ఇవ్వడం లేదు. సుమారు 03 నుండి 06 నెలల జీతాలు: బకాయిలు ఉన్నాయి. స్వచ్చ భారత్ కార్మికులకు కుడా రెండు నుండి 11నెలలు బాకయిలు ఉన్నాయి. దీనితో మా కుటుంబాలు పస్తులు తో బతకాల్సి వస్తున్నది. గత మూడు సంవత్సరాలుగా జీతాలు కూడా పెంచలేదు. నిత్యం పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలు, పెట్రోలు, డీజిల్, గ్యాస్, కరెంటు, ఆర్టీసీ చార్జీలు, విద్యా వైద్య ఖర్చులు, ఇంటి కిరాయిలు అనేక చెట్లు పెరిగాయి. కావున మా బాధలను అర్థం చేసుకొని బకాయి జీతాలు వెంటనే చెల్లించడంతో పాటు మా జీతాలను 21 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. ఏళ్లతరబడి వెట్టిచాకిరి చేస్తున్నా ప్రభుత్వాలు తమ గోడు పట్టించుకోవడం లేదని. గ్రామపంచాయతీ కార్మికులకు గౌరవ హైకోర్టు 2015 వ సంవత్సరంలో ఇచ్చిన తీర్పును అమలు చేయకుండా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. కార్మికులను నిర్ధాక్షణంగా. తొలగిస్తున్నారు. వెంటనే కార్మికుల తొలగింపు నిలుపుదల చేసి గౌరవ హైకోర్టు తీర్పును అమలు చేయాలని డిమాండ్ చేశారు. కనీస డిమాండ్ చేశారు. వేతనాలు, గుర్తింపు కార్డు, పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా పథకాలను అమలు చేయాలని 1999 లో జీవో ఎంఎస్ నెంబర్ 551 నీ జారీ చేశారు. 2019 ఫిబ్రవరి 8న ఇచ్చిన జీవో ఎంఎస్ నెంబర్ 132 సహితం అమలు జరగడం లేదని. ఇస్తున్న నామమాత్రపు జీతాలు కూడా ప్రతి నెల ‘ ఇవ్వకుండా నెలల తరబడి పెండింగ్ లు పెడుతున్నారు. ఎలా బ్రతుకుతారని ప్రశ్నించారు. లేని యెడల రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా రాబోయే రోజులలో నిరవధిక సమ్మె చేపడతామని హెచ్చరించారు…. ఈ కార్యక్రమంలో రాజేష్, పెంచలమ్మ, పుల్లయ్య, వెంకటేష్, గజ, పెంచలయ్య, కృష్ణవేణి, కిషోర్, సుధాకర్, వెంకటేష్, సుబ్బారెడ్డి, మహేష్, శివ ,రాణి, తేజ,గంగయ్య ,సుబ్రహ్మణ్యం, పెంచలయ్య, జయరామయ్య, గంగయ్య, రమణ, వెంకటయ్య. మొదలగు కార్మికులు పాల్గొన్నారు.

కడప

*విద్యార్థులకు ఫీజు రిఎంబర్స్ కష్టాలు *

పున్నమి (వైస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు) నవంబర్ 4 మంగళవారం పట్టణ చివర్లోని శెట్టి పల్లి వద్దనున్న S.L.V.ఇన్స్టిట్యూట్ అఫ్ ఫార్మసూటికల్స్ సైన్స్ వారి JNTU విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జరుగు పరీక్షల కొరకు ఫార్మసీ విద్యార్థులకు ఈనెల 6 వ తేదీ నుండి జరగవలసిన పరీక్షల దృశ్ష్య కళాశాల యజమాన్యం విద్యార్థులను విద్యార్థుల తల్లితండ్రులను ముక్కు పిండి డబ్బులు వసూలు చేస్తున్నారు పరీక్షలు దగ్గర పడటంతో విద్యార్థిని విద్యార్థులకు హాల్ టికెట్స్ ఇవ్వకుండా వారి తల్లితండ్రులను సైతం ఇబ్బందులకు గురించేస్తూ ఫీజు కట్టని పక్షంలో హాల్ టికెట్స్ ఇవ్వము అని తెగేసి చెప్పడంతో ఏం చేయాలో తోచని పరిస్థితులలో విద్యార్థిని విద్యార్థుల తల్లితండ్రులు కళాశాల ప్రవేశ సమయంలో మీ అమ్మాయి అబ్బాయి కి మా కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చింది మీరు మాకు కేవల విశ్వవ్విద్యాలయ ఫీజు పరీక్ష ఫీజు వ్యాన్ ఫీజు కడితే చాలు అన్నా యాజమాన్యం ప్రస్తుతం గతంలో చెప్పిన మాటలను గంగలో కలిపే విధంగా మీరు ఫీజు చెల్లించక పొతే మేము విద్య ను బోధించే అధ్యాపకులకు జీతాలు ఎలా ఇవ్వాలి కళాశాల ఏవిధంగా నిర్వహించాలి అని విద్యార్థుల తల్లితండ్రులకు ఎదురు ప్రశ్నించడం వీరికి పరిపాతీగా మారింది అదేంటి సర్ ప్రవేశసమయంలో నెమో విశ్వవ్విద్యాలయ ఫీజు పరీక్ష ఫీజు వ్యాన్ ఫీజు కడితే చాలు అన్నా మీరు ఇప్పుడేంటి ఇలా మాట్లాడుతున్నారే అని ఎవరైనా ప్రశ్నిస్తే మా యాజమాన్యం మీకేమైనా అలాగని రాతపూత్వకంగా వ్రాసి ఇచ్చి ఉంటే తీసుకురండి అని దురుసుగా సమాధానం ఇస్తుంటే ఆశ్చర్య పోవడం విద్యార్థుల తల్లితండ్రుల వంతవుతుంది గతంలో 2024 లో ఇదే విధంగా ఒక విద్యార్థురాలిని హింసిస్తుంటే ఆ అమ్మాయి ప్రొద్దుటూరు కోర్ట్ నందు కళాశాల యాజమాన్యం పై ఫిర్యాదు చేయగా యాజమాన్యం ఆ అమ్మాయిని పరీక్షలకు అనుమతించారాని సమాచారం.విద్యార్థుల తల్లితండ్రులు పరీక్ష ల హాల్ టికెట్ గురించి మాట్లాడాలని వస్తే వారిని దాదాపు 3 గంటలు వెయిట్ చేయించడం గమనార్హం కాలేజ్ ఛైర్మెన్ తో మాట్లాడితే ఛైర్మెన్ ప్రిన్సిపాల్ తో మాట్లాడాలని ప్రిన్సిపాల్ తో మాట్లాడితే ఛైర్మెన్తో మాట్లాడాలని వారిని విసిగిస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారు కనుక ఈ కూటమి ప్రభుత్వం లో విద్యా శాఖ మంత్రి స్వయాన మన రాష్ట్ర ముఖ్యమంత్రి తనయుడే కావడం తో ఈ విషయం లో విద్య శాఖ మంత్రి వర్యులు జోక్యం చేసుకొని విద్యార్థులకు వారి తల్లి తండ్రులకు న్యాయం చేయాలనీ పలువురు కోరుకుంటున్నారు ఇలా ఒక్కో సారి ఒక్కో విధంగా మాట్లాడే కళాశాలపై కఠినంగా వ్యవహరించి ఇలాంటి కళాశాలల గుర్తింపునువ్రద్దు చేయాలనీ వారూ కోరుకుంటున్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.