Sunday, 5 April 2026

Blog

ములుగు

పాలంపేటలో జెడ్ పి హెచ్ ఎస్ 69వ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడా పోటీలు ముఖ్యఅతిథిగా వెంకటాపూర్ ఎస్సై చల్ల రాజు

వెంకటాపూర్ మండలం పాలంపేట గ్రామంలో జెడ్ పి హెచ్ ఎస్ 69 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ క్రీడలు ప్రారంభమయ్యాయి ఈ కార్యక్రమానికి వెంకటాపూర్ ఎస్ఐ చల్ల రాజు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ముఖ్యఅతిథిగా హాజరై ఈ క్రీడలు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు చదువుతోపాటు క్రీడలో ముందు రావాలి క్రీడలు శారీరక దారుఢ్యంతో పాటు మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తాయని తెలిపారు క్రీడా స్ఫూర్తి ద్వారా క్రమశిక్షణ జట్టు భావన పెరుగుతుందని ఆయన అన్నారు అంతేకాకుండా మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని తాము ఎంచుకున్న క్రీడల్లో ఉత్తమ ప్రతిభను కనబరచాలని విద్యార్థులకు సూచించారు

E-పేపర్

స్వదేశీ వస్తువుల వినియోగం పట్ల అవగాహనా తెలియజేస్తున్న బీజేపీ మండల అధ్యకుడు దామోదర్ నాయుడు

*స్వదేశీ వస్తువుల వినియోగం పట్ల అవగాహన తెలియజేస్తున్న బి జె పి మండల అధ్యక్షుడు దామోదర్ నాయుడు* పున్నమి న్యూస్ నవంబర్ 04 ( ప్యాపిలి) బిజెపి కేంద్ర, రాష్ట్ర పార్టీల ఆదేశాల మేరకు, బిజెపి నంద్యాల జిల్లా అధ్యక్షులు డాక్టర్ అభిరుచి మధు సూచనల మేరకు, ఆత్మ నిర్భర్ భారత్ సంకల్ప అభియాన్ లో భాగంగా ప్రతి ఇంట స్వదేశీ-ఇంటింటా స్వదేశీ అనే నినాదంతో బిజెపి ప్యాపిలి మండల అధ్యక్షులు కే. బి.దామోదర్ నాయుడు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమ ఇంచార్జి రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు గాజుల ఉషా లక్ష్మి ముఖ్య అతిథి మరియు నంద్యాల జిల్లా ఉపాధ్యక్షులు సందు వెంకటరమణ మాట్లాడుతూ, స్వదేశీ వస్తువుల వినియోగం పట్ల కలిగే ప్రయోజనాలను గురించి మరియు గోడ స్టిక్కర్లను అతికించి పాంప్లెట్లను ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో ఓబిసి మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ నెంబర్ చేసికే.సి. మద్దిలేటి, రామాంజనేయులు, చంద్రకళ, మామిళ్ళపల్లి మద్దిలేటి, మల్లికార్జున, ఓబుల్ రెడ్డి, సీతారాముడు మరియు బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొని ఈ కార్యక్రమం విజయవంతం చేశారు.

E-పేపర్

నిరుద్యోగులకు మంచి సువర్ణవకాశం

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో నిరుద్యోగ యువత కోసం ఈ నెల 6న పాల్వంచ డిగ్రీ ప్రభుత్వ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వాస్తునట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి కొండపల్లి శ్రీరామ్ తెలిపారు. సేల్స్ కన్సల్టెంట్ -13పోస్ట్స్ ఏదైనా డిగ్రీ టూవీలర్ లైసెన్స్ కలిగి ఉండాలి.సర్వీస్ అడ్వైసర్ -2పోస్ట్స్ గాను డీజిల్ మెకానిక్ లేదా బీటెక్ మెకానికల్ పూర్తి చేసి ఉండాలి.. వయసు 22-30సంవత్సరాలు కలిగి ఉండాలి. పైన పోస్టులకి క్వాలిఫికేషన్ ఉన్నవాళ్లు 10గంటలకు అన్ని సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని తెలిపారు.

జయశంకర్ భూపాలపల్లి

జేడి మల్లంపల్లి బ్రిడ్జి మరమ్మత్తులు

ములుగు నుండి వచ్చే భారీ వాహనాలు అబ్బాపూర్ మీదుగా చిన్న వాహనాలు భూపాల్ నగర్ మీదుగా వెళ్లాలి హనుమకొండ నుంచి వచ్చే భారీ వాహనాలు వయా పరకాల చిన్న వాహనాలు శ్రీరామ్నగర్ మీదుగా రావాలి ఇది రేపు ఒక్కరోజు మాత్రమే

జయశంకర్ భూపాలపల్లి

జేడి మల్లంపల్లి బ్రిడ్జి మరమ్మత్తులు

ములుగు నుండి వచ్చే భారీ వాహనాలు అబ్బాపూర్ మీదుగా చిన్న వాహనాలు భూపాల్ నగర్ మీదుగా వెళ్లాలి హనుమకొండ నుంచి వచ్చే భారీ వాహనాలు వయా పరకాల చిన్న వాహనాలు శ్రీరామ్నగర్ మీదుగా రావాలి ఇది రేపు ఒక్కరోజు మాత్రమే

E-పేపర్

జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని మార్నింగ్ వాక్ లో ప్రచారం నిర్వహించిన రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రివర్యులు శ్రీ శ్రీధర్ బాబు గారు, మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారు…..

నేడు జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని కృష్ణకాంత్ నాగర్,శ్రీనగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని మార్నింగ్ వాక్ లో ప్రచారం నిర్వహించిన రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గార్లు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది పేదోడి ప్రజా ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలకు నిజమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అనేక సంక్షేమ ప‌ధ‌కాలు అమ‌లు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి న‌వీన్ యాద‌వ్ గారిని బారీ మెజార్టీతో గెలిపించలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి, కిషోర్ రెడ్డి,కార్పొరేటర్స్ లక్ష్మణ్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి,జితేందర్, ప్రేమ కుమార్, విజయ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనారు.

తిరుపతి

వాయులింగేశ్వరుని దర్శించుకున్న చీరాల ఎమ్మెల్యే

శ్రీకాళహస్తీశ్వర స్వామి అమ్మవార్ల దర్శనార్ధం చీరాల శాసనసభ్యులు మద్దలూరి మాల కొండయ్య కుటుంబ సభ్యులతో విచ్చేసి శ్రీ స్వామి, అమ్మవార్లను దర్శనం చేసుకున్నారు. వీరికి ధర్మకర్తల మండలి సభ్యురాలు కె రజిని, ఆలయ అధికారులు, స్వాగతం పలికి శ్రీ స్వామి, అమ్మవార్ల ప్రత్యెక దర్శన ఏర్పాట్లు చేయించి అనంతరం శ్రీ గురు మేధా దక్షణామూర్తి సన్నిధిలో వేద పండితులతో ఆశీర్వదించి శ్రీ స్వామి, అమ్మవార్ల శేష వస్త్రంతో సత్కరించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకుడు బాలు, ఢిల్లీ బాబు, శ్రీకాళహస్తి కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ తదితరులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

మండల స్థాయి లో చెకుముకి టాలెంట్ టెస్ట్

ఉదయగిరి బీసీ కాలనీ జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళ వారం హెచ్ యం నుర్జా హన్ ఆధ్యర్యంలో చెకుముకి టాలెంట్ టెస్ట్ మండల స్థాయిలో నిర్వహించారు హెచ్ యం మాట్లాడుతూ ఈ పరీక్ష ద్వారా విద్యార్ధులలో విజఞానశాస్త్రం పట్ల అభిరుచి పెరుగుతుందన్నారు విద్యార్థుల తమ ప్రతిభను ప్రదర్శించడానికి ఒక అవకాశం ఉంటుందన్నారు గత 35 సంత్సరా లుగా చెకుముకి సైన్స్ ప్రతిభ పరీక్షలు నిర్వహిస్తామన్నరు

తిరుపతి

రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన వారికి నివాళులర్పించిన బొజ్జల బృందమ్మ

శ్రీకాళహస్తి నవంబర్ 04 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి మాతృమూర్తి బొజ్జల బృందమ్మ ఇటీవల రోడ్డు ప్రమాదమలో మృతిచెందిన శ్రీకాళహస్తి పట్టణానికి చెందిన 4వ వార్డు వాస్తవ్యులు (నక్క హరిజనవాడ) ఉలస సుబ్రహ్మణ్యం, ఉలస రూపేష్, వీరు ఇరువురు తండ్రి కొడుకులు పెళ్లకూరు వద్ద రోడ్డు ప్రమాదంలో మృతి చెందారని తెలిసి స్థానిక వారి పార్థివ దేహాలకు పూలమాలలు వేసి వారికి నివాళులర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేసి తెలుగుదేశం పార్టీ తరఫున వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని వారికి తెలియజేశారు ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు జి విజయ్ కుమార్ క్లస్టర్ ఇంచార్జ్ పేట బాలాజీ మూడో వార్డు గోవిందు, శివ, నిండ్ర సుధాకర్ రాంబాబు ,రామ్మూర్తి ,బాబు, మనీ, సన్నీ ,గుప్తా విజయ్ తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.