గద్వాల్ :ఇంటర్నేషనల్ రన్నింగ్ రేస్ లో చిన్న తాండ్రపాడు చిన్నోడు ఫస్ట్ గద్వాల్ నవంబర్ 5(పున్నమి ప్రతినిధి) జోగులాంబ గద్వాల్ జిల్లా ఐజ మండలం చిన్న తాండ్రపాడు గ్రామానికి చెందిన కుర్వ హరికృష్ణ ఇంటర్నేషనల్ రన్నింగ్ పోటీలు నేపాల్ రాష్టంలో జరిగాయి. 42 కిలోమీటర్ల రన్నింగ్ రేస్ లో పాలొగొన్న హరికృష్ణ సునాయాసంగా 42 కిలోమీటర్లు రన్నింగ్ చేసి ఇంటర్నేషనల్ స్థాయి లో మొదటి స్థానంలో నిలిచాడు. మారుమూల గ్రామం నుండి ఇంటర్నేషనల్ స్థాయిలో మొదటి స్థానం రావడం గర్వంగా ఉందని గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేసారు
డుంబ్రిగుడ మండలం, కండ్రూం పంచాయితీలో బుధవారం పోలీసులు పరివర్తన కార్యక్రమం నిర్వహించారు. ఈ మేరకు ఎస్ఐ పాపినాయుడు మాట్లాడుతూ.. గంజాయి సాగు, రవాణ, వినియోగం చట్టరీత్యా నేరమని పేర్కొన్నారు. గంజాయి తో జీవితాలు నాశనం చేసుకోవద్దని కార్యక్రమంలో పాల్గొన్న అరకు సీఐ హిమగిరి సూచించారు. గంజాయి ద్వారా కొనుగోలు చేసిన ఆస్తులను ప్రభుత్వం జప్తు చేస్తుందన్నారు. సర్పంచ్ హరి, ఎంపీటీసీ ఆనంద్ పంచాయితీ ప్రజలు పాల్గొన్నారు.
విశాఖ గాజువాక నవంబర్ (పున్నమి ప్రతినిధి): అవినీతి నిరోధక శాఖ సంచలన సోదాలు – పలు కార్యాలయాల్లో రికార్డుల తనిఖీ విశాఖ జిల్లాలోని పలు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు బుధవారం ఉదయం నుండి సోదాలు నిర్వహిస్తున్నారు. ఏకకాలంలో మధురవాడ జోన్–1, జోన్–2, పెదగంట్యాడ, ఆనందపురం తదితర కార్యాలయాల్లో దాడులు కొనసాగుతున్నట్లు సమాచారం. ఈ దాడుల సందర్భంగా అధికారులు రికార్డులు, రిజిస్ట్రేషన్ వివరాలు, లావాదేవీలపై సమగ్రంగా పరిశీలనలు చేపట్టారు. దాడులకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది. అయితే, ప్రాథమిక సమాచారం ప్రకారం కొన్ని అనుమానాస్పద రిజిస్ట్రేషన్లపై ఏసీబీ అధికారులు దృష్టి సారించినట్లు తెలిసింది.
*నేతన్న పొదుపు పథకం అమలు ఎప్పుడు?* గత ప్రభుత్వం చేనేత కార్మికులకు మరియు పవర్ లూం కార్మికుల కొరకు త్రిఫ్ట్ (పొదుపు) పథకాన్ని ప్రవేశ పెట్టడం జరిగింది. ఈ పథకం కొనసాగింపుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం పథకంలో భాగంగా నేతన్న పొదుపు పేరుతో దరఖాస్తులను స్వీకరించింది. చేనేత కార్మికులకు తిరిగి ఈ స్కీముని ప్రారంభించింది. కానీ పవర్లూమ్ కార్మికులకు మాత్రం మే 2025 లో ఈ స్కీం పూర్తి అయి ఇప్పటికీ ఆరు మాసాలు అవుతున్న తిరిగి ప్రారంభం కాలేదు. ఎంతో ప్రయోజనంగా ఉన్న ఈ స్కీము ప్రారంభం కాకపోవడంతో నేత కార్మికులు నిరాశలో ఉన్నారు. ప్రభుత్వం వెంటనే స్కీముని పునః ప్రారంభించి వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నది.
*కార్తీక పౌర్ణమి వైశిష్ట్యం* …. డాక్టర్ ఐ మంజుల శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్ధార్థ మహిళా కళాశాల విజయవాడ……. కార్తీక పౌర్ణమి కార్తీకమాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిధి. ఇది చాలా విశిష్టత కలిగిన రోజు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. హరిహరులకు ఎంతో ప్రీతికరమైన మాసం కనుక ఇద్దరినీ సేవిస్తే, ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి మాసము మనకు ప్రత్యేకమైనది. ఏ మాసపు ప్రత్యేకత ఆ మాసానిది. కార్తీక మాసంలో ప్రతిరోజు ప్రధానమైనదే. ఏకాదశులు,శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి శక్తివంతమైనవి. నెల రోజుల్లో చేసే పూజల ఫలితం ఒక ఎత్తు.పౌర్ణమి రోజున చేసే పూజ కార్య కలాపాలు ఒక ఎత్తు. **అభిషేక ప్రియో శివః** అభిషేక ప్రియుడు శివుడు గనుక శివాలయములలో రుద్రాభిషేకం చేయించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించిన కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రగాఢ విశ్వాసం.’ ఈ మాసంలో రుద్రాభిషేకాలు కేదారేశ్వర వ్రతం, కార్తీక దామోదర పూజ,తులసి పూజ, తులసి ఉసిరి కలిపి పూజ ,క్షీరాబ్ది ద్వాదశి పూజ,దీప దానాలు,పసుపు లింగార్చన.. స్త్రీ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పాలు,తాంబూలం తో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానం చేయటం ముఖ్యమైన కార్యములు.ఇవి ఆచరించినట్లయితే సర్వ శుభాలు చేకూరుతాయి అని పెద్దల శ్రీ సూక్తి. నదీ స్నానములకు ఈ మాసంలో ప్రాముఖ్యత. నదులు సమీపంలో లేనట్లయితే బావుల దగ్గర గాని, చెరువుల వద్ద గాని స్నానమాచరించవలెను. *_గంగేచ యమునే చైవా గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు* అను శ్లోకంతో స్నానం చేయవలెను.కార్తీక పౌర్ణమి దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యం కలిగిన రోజు. శైవాలయాలలో వైష్ణ వాలయాలలో దీపారాధనలు చేస్తారు. శివాలయాలలో ధ్వజస్తంభం మీద నందా దీపం పేరుతో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. కార్తీకదీపం వెలిగిస్తారు. వైష్ణమాలయాలలో ధ్వజస్తంభం ఎదుట తులసికోట వద్ద గోపురం మీద పెరుమాళ్ళ సన్నిధిలో పిండితో చేసిన దీపాలు ఉసిరికాయల మీద ఇలా పలు రకాలుగా దీపాలను వెలిగిస్తారు. దీపారాధన అనంతరం ఆయా స్థలాల్లో దీపాలను ఉంచటం…… పసుపు,కుంకుమ,అక్షతలు, పుష్పాలు ‘ సమర్పించి అప్పుడు దీపాలను ఆయా స్థలాల్లో ఉంచాలి . ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వరం వ్రతం ఒకటి భక్తులు వాళ్ల కోరికలను నెరవేర్చి సౌభాగ్యాన్ని కలిగించే వ్రతం ఇది. ఈ దీపారాధనలకు ఆవు నెయ్యిని ఉపయోగించడం వలన వాతావరణ కాలుష్యాన్ని కొంతవరకు అరికట్టవచ్చు. ప్రదోషంలో కాలకృత్యాలను తీర్చుకుని శివాలయంలో కానీ విష్ణు ఆలయాల్లో గాని రావి చెట్టువద్ద గాని, అరటి దొప్పలలో గాని, ఆకుదుప్పలలో గాని దీపాలను వెలిగించాలి. నదులలో దీపదానం చేయాలి.అది అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఒక బకెట్లో నీళ్లు కానీ ఒక టబ్లో నీళ్లను తీసుకొని వాటిలో దీపదానం చేయవచ్చు. సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. రాక్షస సంహారం జరిగినందున ఆనందంతో శివతాండవం జరిగింది. ఈరోజున దీపాలను వెలిగిస్తే సకల పాపాలు తొలగిపోతాయి.కార్తీక సోమ వారాల్లో మహాభిషేకాలు, రుద్రాభిషేకాలు,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరపడం పరిపాటి.కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం శుభప్రదం. కార్తీక పౌర్ణమి నాడు అన్నదానం,వస్త్ర దానం విశేష ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా బెల్లాన్ని దానం చేస్తే లక్ష్మీదేవి ఆనందిస్తుంది అని పెద్దల మాట. తులసి,రావి చెట్ల వద్ద దీప దానం చేస్తే శుభం. గోదానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి ఇవ్వడం ఆనవాయితీ. ఈరోజున 365 ఒత్తులను వెలిగించడం వలన సంవత్సరం పొడుగునా ఏ ఒక్కరోజు వెలిగించకపోయినా….. అన్ని రోజులపుణ్యాన్ని… ఈరోజు వెలిగించే దీపాలతో పొందవచ్చు. *దీపం జ్యోతి: పర0బ్రహ్మ దీపం సర్వతమోపహః దీ పేన సాధ్యతే సర్వం *…🙏🙏🙏
విద్యార్థుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న నారాయణ విద్యాసంస్థల గుర్తింపును రద్దు చేయాలి..ఏఐవైఎఫ్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దార్ల రాజశేఖర్ అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 5 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ -): నియోజకవర్గంలోని కోడూరు మండలంలో ఉన్నటువంటి నారాయణ విద్యాసంస్థలల యొక్క గుర్తింపును రద్దు చేయాలని అఖిల భారతి యువ సింగమాల సింగమాల వెంకటేష్జ న సమైక్య ( ఏఐవైఎఫ్ ) అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దార్ల రాజశేఖర్ డిమాండ్ చేశారు. ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా శారీరకంగా హింసకు గురి చేస్తూ ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారు. స్కూల్ టైం కాకుండా, ట్యూషన్ పేర్లతో ఎక్స్ట్రా తరగతులు పేరుతో, విద్యార్థులను ఉదయం 6:30 నుండి రాత్రి 8:30 , మరియు 9 వరకు తరగతి గదిలో విద్యార్థులు కూర్చొని పెడుతున్నారు కనీసం వారికి భోజనం టైం కూడా 20 నుండి 30 నిమిషాల మాత్రమే ఇస్తున్నారు కనీసం ఒక గంట సమయం కూడా కేటాయించడం లేదు. అంతేకాకుండా ఆదివారాలు వారాలు, రెండో శనివారాలు సెలవులు కూడా ఇవ్వకుండా తరగతులను నడుపుతున్నారు నారాయణ పాఠశాల విద్యా సంస్థల యాజమాన్యం వారి ఇష్టం వచ్చినట్టు విద్యార్థులను హింసకు గురి చేస్తున్నారు విద్యార్థుల యొక్క మానసిక పరిస్థితులను పట్టించుకోకుండా ర్యాంకుల కోసం విద్యార్థులను మానసికంగా, శారీరికంగా ఇబ్బందులు గురి చేస్తున్నారు. కనీసం ఒక గంట అయినా శారీరక ఉల్లాసానికి దోహదపడే క్రీడలు ఆడించాలన్న ఆలోచన కూడా వారికి లేదు అందువల్ల వారిలో మానసిక ఒత్తిడి ఎక్కువై ప్రాణాలు తీసుకునే పరిస్థితికి విద్యార్థులు వస్తున్నారు, శనివారం నాడు స్వయంగా నేనే రాత్రి 7:30 ఆ సమయంలో నారాయణ స్కూల్ లో చదువుతున్న విద్యార్థి కళ్ళు తిరిగి పడిపోయింది సృహ కోల్పోయింది, ఆ విద్యార్థిని నేనే ఆసుపత్రికి తీసుకొని వెళ్లి వదిలి రావడం జరిగింది. విద్యార్థుల యొక్క ప్రాణాలతో చెలగాటమాడుతున్న అంతేకాకుండా అధిక ఫీజులతో విద్యార్థుల యొక్క తల్లిదండ్రుల రక్త మాంసాలతో వ్యాపారం చేస్తున్నారు, తల్లిదండ్రులు అధిక పేజీలు కట్టుకోలేక అప్పులు చేసుకొని వాటిని కట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకునే వరకు స్కూల్ యాజమాన్యాలు ఒత్తిడి చేస్తున్నాయి. కాబట్టి ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా విద్యాశాఖ అధికారులు నారాయణ విద్యాసంస్థలపై కఠిన చర్యలు తీసుకోవాలని. అఖిల భారత యువజన సమాఖ్య(AIYF) గా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు దార్ల రాజశేఖర్ డిమాండ్ చేశారు. అలా చేయండి ఎడల జిల్లా వ్యాప్తంగా ఉన్న నారాయణ విద్యాసంస్థల పై ముత్తడి చేస్తామని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో రైల్వే కోడూరు మండల నాయకులు కోరముట్ల గణేష్, మందారపు హరి పాల్గొన్నారు.

ఉదయగిరి లో వెలసిన శ్రీ పార్వతీ పరమేశ్వర స్వామి ఆలయంలో కార్తీక పౌర్ణమి వేడుక లు ఘనంగా జరిగాయి భక్తులు తెల్లారుజామునేనుంచే తల స్తాన్నా లు ఆచరించి కార్తీక దీపాలు వెలిగించారు అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు కొబ్బరి కాయ ,కర్పూరం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు
సోమవారం నాడు రాజమహేంద్రవరం ఆది కవి నన్నయ్య విశ్వవిద్యాలయంలో నిర్వహించబడిన ఆల్ ఇండియన్ ఇంటర్ యూనివర్సిటీ సెలెక్షన్స్ లో వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలకు జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.డి. చెన్నారావు ప్రోద్భలంతో కళాశాల స్పోర్ట్స్ ఇంచార్జ్ శ్రీ రాయుడు శ్రీను గారు కళాశాల మొదటి సంవత్సరం కెమిస్ట్రీ విభాగం నుండి వై. కృష్ణార్జుస్ మరియు ఎమ్. దుర్గా ప్రసాద్ విధ్యార్ధులను రిజిలింగ్(కుస్తీ) 57 కేజ్ కేటగిరీ పోటీకి పంపించడం జరిగింది. ఈ సెలెక్షన్స్ విభాగంలో జగ్గంపేట విద్యార్థులు వై. కృష్ణార్జున్ మొదటి స్థానాన్ని (Gold medal) మరియు ఎమ్. దుర్గా ప్రసాద్ తృతీయ స్థానాన్ని (Bronze medal) కైవసం చేసుకుని తమ ప్రతిభను దాటారు. మొదటి స్థానం సాదించిన వై. కృష్ణార్జుస్ జాతీయ స్థాయి రిజిలింగ్ పోటీలకు ఎంపికయ్యి జగ్గంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల యొక్క కీర్తిని జాతీయ స్థాయిలో నిలపడం జరిగింది. వై. కృష్ణార్జుస్ జనవరి 2026 లో జాతీయ స్థాయిలో జరిగే రిజిలింగ్ పోటీలకు చండీఘర్ (పంజాబ్) లో పాల్గొంటాడని ప్రిన్సిపల్ గారు తెలిపారు. తేదీ 04-11-2025, మంగళవారం నాడు కళాశాలలో ప్రిన్సిపల్ డా. డి. చెన్నారావు గారు విజయం సాధించి కళాశాల కీర్తిని జాతీయ స్థాయిలో నిలిపిన విధ్యార్థులకు అభినందన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సంధార్బంగా కళాశాల ప్రిన్సిపల్ గారు మాట్లాడుతూ విజయం సాదించిన విధ్యార్థులు అంతర్జాతీయ స్థాయిలో నిలబడాలని ఆశీర్వదించారు, ప్రతి విధ్యార్థి వీరిని ఆదర్శంగా తీసుకుని క్రీడారంగంలో తమ ప్రతిభను చాటాలని భవిష్యత్తులో మంచి స్థాయిలో ఉండాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ శ్రీ.సి. హెచ్. బాలరాజు గారు, ఐ. క్యూ.ఏ. సి కో-ఆర్డినేటర్ డా. పి.వి.వి. సత్యా నారాయణ గారు, కెమిస్ట్రీ అధ్యాపకులు వి. మల్లికార్జున శర్మ గారు, హిస్టరీ అద్యాపకులు ఆర్. శ్రీనుగారు, తెలుగు అధ్యాపకులు, డా. డి.సత్యలత గారు, గణిత ఆధ్యాపకులు సి.హెచ్.ఝాన్సీరాణి గారు, ఫిజిక్స్ అధ్యాపకులు వి.గోపాల కృష్ణ గారు, కామర్స్ ఆద్యాపకులు డా.జి. సురేష్ , పి.పద్మ శేఖర్ గll, కె. వెంకట రావు, కంప్యూటర్ ఆధ్యాపకులు వి. దేవి ప్రసన్న , జువాలజీ ఆద్యాపకులు పి.శ్రీనివాస రావు, బొటాని అధ్యాపకులు వై. నవీన ఇతర అద్యపకేతర సిబ్బంది మరియు విద్యార్ధిని, విద్యార్థులు పాల్గొన్నారు.
*సంకాపురం రాముడు గారిని ఘనంగా సన్మానించిన దళిత ఫోరమ్ జర్నలిస్టులు* గద్వాల్ నవంబర్ 5(పున్నమి ప్రతినిధి) *ఈరోజు జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో దళిత జర్నలిస్టుల ఫోరమ్ 10 వ రాష్ట్ర మహాసభలకు సహకరించిన అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు* గారిని *రాష్ట్ర దళిత జర్నలిస్టు ఫోరమ్ అధ్యక్షుడు కాశపోగు జాన్, ఆంజనేయులు,శ్రీకాంత్ ఘనంగా సత్కరించారు …అనంతరం,రిపోర్టర్ శ్రీకాంత్ కు అయిజ మండల సింగిల్ విండో మాజీ అధ్యక్షులు సంకాపురం రాముడు గారి చేతుల మీదుగా మెమోంట్ అందజేశారు…* ఈ కార్యక్రమంలో బిందాస్,శ్రీనివాస్ గౌడ్,తూముకుంట కె.కె,హనుమంతు, నాయకులు మరియు తదితరులు పాల్గొన్నారు.
పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం. రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.