శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం ప్రసన్న రెడ్డి నగర్ నందు కార్తీక మాసంలో వచ్చే విశిష్టమైన కార్తీక పౌర్ణమి రోజు ఓంకారేశ్వర శివలింగంనకు విశేష ద్రవ్యములతో విశేష పూలతో అభిషేకాలు జరిగినవి. ప్రత్యేకంగా స్వామివారికి ఈరోజు అన్నాభిషేకం జరిగినది. తదుపరి అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు తదుపరి అయ్యప్ప స్వామి వారికి ప్రత్యేక పూజలు గావించి భారీ అన్నదాన కార్యక్రమమును బత్తల బాలమురళి వారి ధర్మపత్ని వెంగమ్మ కుమార్తెలు ప్రవీణ,మనస్విని కుమారుడు శాండిల్ సౌరి తల్లి దొరసానమ్మ గార్లు అన్నదానం గావించిరి. అదేవిధంగా సాయంత్రం లక్ష దీపోత్సవం, జ్వాలాతోరణం జరుగును. పై యావత్ కార్యక్రమాన్ని ఉభయ దాతలుగా పై వ్యక్తులు నిర్వహించరి. పై కార్యక్రమంలో దేవస్థాన కమిటీ చైర్మన్ కరకల మాలకొండ రెడ్డి, గురు స్వాములు వసంతరావు మస్తాన్ రెడ్డి ఏ సి డి సి ప్రసాద్ స్వామి,కొంకల శ్రీనివాస్ రెడ్డి , తదితరులు పాల్గొనేరి.
కాకినాడ : జనసేన అధ్యక్షుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదల పవన్ కల్యాణ్ ఆశయాల మేరకు, కాకినాడ పార్లమెంట్ సభ్యుడు తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ స్పూర్తితో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సివిల్ సప్లయ్ కార్పొరేషన్ ఛైర్మన్ తోట సుధీర్ ల ఆశయాలకు అనుగుణంగా జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. కాకినాడ జగన్నాధపురంలోని 14వ డివిజన్ లో ఇటీవల మృతి చెందిన కర్రి చిన్న కుటుంబ సభ్యులను బుధవారం ఉదయం కలిసి తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆ కుటుంబం పెద్ద దిక్కు కోల్పోయిందని తెలుసుకున్న జనసేన సీనియర్ నాయకుడు మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) వారి కుటుంబానికి రెండు నెలలకు సరిపడా బియ్యం, నిత్యవసర సరుకులు అందించారు. ఇప్పటి వరకు 304 మందికి తన శక్తి మేరకు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా మచ్చా గంగాధర్ (ఎంజిఆర్) మాట్లాడుతూ పది మందికి సేవ చేయడంలో వచ్చే తృప్తి తనకు చాలా ఆనందాన్ని కలిగిస్తుందన్నారు. కాకినాడ పట్టణంలోనే కాక, పిఠాపురం, కాకినాడ రూరల్, అలాగే కాకినాడ జిల్లాలో ఎక్కడైనా ఆపదలో ఉంటే తనకు తెలిసిన మరుక్షణం స్పందించి, తనవంతు సహాయం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకుడు పొన్నాడ నాగేశ్వరరావు, జనసేన పార్టీ వీర మహిళలు బంటు లీల, రచ్చ ధనలక్ష్మి, మోనా, సుజాత, దీప్తి, జనసైనికులు తదితరులు పాల్గొన్నారు.
కార్తీక మాసం శుభ పౌర్ణమి వేల శ్రీవారి సేవకులచే ఉసిరి చెట్టుకి ఉసిరి దీపారాధన తో పాటు వనభోజన కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేసుకునే శ్రీవారి సేవకులు బెల్లంకొండ ప్రసాద్ గారికి ధన్యవాదాలు .
పున్నమి 05 నవంబర్: దుత్తలూరు నెల్లూరు జిల్లా, దుత్తలూరు మండలం, కొత్తపేట గ్రామంలో భక్త జనులచే నిర్మించబడిన నూతనాలయము నందు శ్రీ అడవి పేరంటాలమమ్ము సింహవానము శిఖర కలశము మొదలైంది దేవతా విగ్రహముల ప్రతిష్టా మహోత్సవములు. గ్రామ ప్రజలు కుటుంబ సమేతంగా విగ్రహ ప్రతిష్ట లో పాల్గొంటున్నారు మంగళవాయిధ్యములు, వేదమంత్రస్వస్తి, యజమానులు యాగశాలా ప్రవేశము, జ్యోతి ప్రజ్వలన, శ్రీ మహాగణపతి పూజ, స్వసిత పుణ్యాహవాచనమ్, దీక్షా కంకణ ధారణ, పంచగవ్య ప్రోసన, అఖండల ప్రజ్వలన, ప్రధాన కలశస్థాపన, పంచబ్రహ్మమండల, సర్వతోభద్రమండల, నవగ్రహ యోగిని, వాస్తు, క్షేత్రపాలక మండల దేవతావాహగమ్, విగ్రహములు, యాగశాల ప్రవేశము, పంచామృత అధివాసము, పూజలు, తీర్ధప్రసాదములు. వల్మీపూజ, మృత్తికాసంగ్రహణ, అంకురారోపణ, యంత్రపూజలు, అవాహిత మండల దేవతా హెూమములు, విగ్రహములు, జలాధివాసం, పూజలు, తీర్థప్రసాదములు అన్నదాన వసతి కూడా గ్రామ ప్రజలు సమకూర్చారు
అనాధాశ్రమం కోసం బియ్యం బట్టలు సేకరిస్తున్న విస్డం సెంట్రల్ స్కూల్ రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు మండలం స్థానిక కొత్త బజారులోని విస్డం సెంట్రల్ స్కూల్ ఆధ్వర్యంలో అనాధ పిల్లల మరియు వృద్ధుల కోసం బియ్యము బట్టలు కావాలని చెప్పడంతో స్కూల్ విద్యార్థులు మేమున్నామని భరోసా ఇచ్చి స్కూల్లోని ప్రతి ఒక్క విద్యార్థి చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు అందించడం జరిగిందని విస్డం సెంట్రల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు మరియు అధ్యాపక బృందం. కేవలం చదివే కాదు పేదలకు అనాధలకు వృద్ధులకు సహాయం చేయడంలో కూడా మేము ముందున్నాము అని నిరూపిస్తున్న రైల్వే కోడూర్ విస్డం సెంట్రల్ స్కూల్ విద్యార్థినీ విద్యార్థులు. ఇప్పటివరకు 600 కేజీల బియ్యం పాత బట్టలు అలాగే నగదు సేకరించి వారికి కావలసిన ప్లేట్లు మొగులు బకెట్లు, దుప్పట్లు అందజేయుటకు సిద్ధంగా ఉన్న విస్డం సెంట్రల్ స్కూల్ కరస్పాండెంట్ డాక్టర్ టి ప్రదీప్, ప్రిన్సిపాల్ ప్రియాంక ఇంచార్జ్ ముఖేష్ ,ఉంగరాల శివప్రకాష్ కు అందజేయడం జరిగినదని. బైసాని కారుణ్య శ్రీ ఆరవ తరగతి, బైసాని వకృత్ సాయి మూడవ తరగతి వారికి బియ్యము బట్టలు ఇవ్వడం జరిగినది.
శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారిని దర్శించుకున్న ముక్కా సాయి వికాస్ రెడ్డి అన్నమయ్య జిల్లా, రైల్వే కోడూరు నవంబర్ 05 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్) : రైల్వే కోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం, పొందలూరు పంచాయతీ చక్రం పేట నందు కార్తీక పౌర్ణమి శుభసందర్భంగా ఆలయ కమిటీ వారు, ప్రజలు ఆహ్వానం మేరకు శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొన్న రైల్వే కోడూరు నియోజకవర్గ టీడీపీ పార్టీ ఇంచార్జ్, కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి తనయుడు, యువ నాయకులు ముక్కా సాయి వికాస్ రెడ్డి. అనంతరం ఆలయ కమిటీ వారు ప్రజలు ముక్కా సాయి వికాస్ రెడ్డి ని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేయడం జరిగినది,ఈ కార్యక్రమం లొ కూటమి నాయుకులు పాల్కొన్నారు.
చిట్వేలులో నూతన ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభం… ప్రారంభించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం నవంబర్ 05 (పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్) రైల్వే కోడూరు నియోజకవర్గం చిట్వేలు మండలంలో గతంలో పాత ఆసుపత్రి భవనం శిధిలావస్థకు చేరుకోవడంతో చిట్వేలు మండల ప్రజలు వైద్య సేవల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రజల అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని నూతన భవనంలో ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆరోగ్య కేంద్రాన్ని పూర్తి చేసి లాంచనంగ బుధవారం నాడు ఆసుపత్రిని ప్రారంభించిన అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్,కుడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి, ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ , పాల్గొన్న ముక్కా సాయి వికాస్ రెడ్డి ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి సంబంధించిన అన్ని అవసరాలను పర్యవేక్షిస్తామని భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు ఎదురైనా అండగా నిలబడతామని కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలియ జేశారు ఈ సందర్భంగా ముక్కా రూపానంద రెడ్డి మాట్లాడుతూ, “చిట్వేలు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశ్యంతో అన్ని అవసరమైన వసతులను ఈ ఆసుపత్రిలో ఏర్పాటు చేశాం. ఇంకా మరిన్ని సదుపాయాలను కల్పించే దిశగా కృషి చేస్తాం, అదేవిధంగా కలెక్టర్ కు ఇంకా కొన్ని సదుపాయాలు డాక్టర్ ద్వారా తెలపడం జరిగింది అవి కూడా మంజూరు చేయిస్తానని తెలిపారు, చిట్వేలుకు తన మనసులో ప్రత్యేకమైన స్థానం ఉందని, రద్దయిన కోడూరు చిట్వేల్ రోడ్డును మంజూరు చెయించుకోని త్వరలో పూర్తి చేసి ప్రారంభించ బోతున్నామని ముక్క రూపానంద రెడ్డి పేర్కొన్నారు. *అరవ శ్రీధర్ గారు మాట్లాడుతూ* , “ప్రజల ఆరోగ్యం ప్రభుత్వానికి ప్రాధాన్యత. గ్రామీణ ప్రాంతాల్లో కూడా నాణ్యమైన వైద్య సదుపాయాలు అందించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. చిట్వేలు ఆరోగ్య కేంద్రం ప్రారంభం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయి” అని అన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది సంబంధిత అధికారులు కూటమి నాయకులు, డీసీఎంఎస్ చైర్మన్ ఎర్రగుండ్ల జయప్రకాష్ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఖమ్మం పున్నమి ప్రతి నిధి ఖమ్మం నగరంలోని 53వ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ అభ్యర్థి శ్రీమతి ధనియాకుల శ్రీలత గారు మరియు బీజేపీ ఖమ్మం రెండవ పట్టణ అధ్యక్షులు శ్రీ ధనియాకుల వెంకట్ నారాయణ యాదవ్ గారు కార్తీక పౌర్ణమి సందర్భంగా ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ — “కార్తీక పౌర్ణమి పవిత్ర దినం ప్రతి ఇంటా భక్తి, శాంతి, సౌభాగ్యాలను నింపాలని, భగవాన్ శివుడి ఆశీర్వాదం అందరిపై కురవాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాం” అని తెలిపారు.
ఖమ్మం నవంబర్ (పున్నమి ప్రతి నిధి) శ్రీ రాజసాయి మందిరం, వి.యం. బంజర వారి ఆధ్వర్యంలో శ్రీమతి విజయనర్సింహా రెడ్డి జ్ఞాపకార్ధం మమత మెడికల్ కాలేజ్ & సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖమ్మం సంయుక్త ఆధ్వర్యంలో ఉచిత మెగా కంటి వైద్య శిబిరం ని నవంబర్ 8, 2025న ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 2 గంటల వరకు నిర్వహించబడనుంది అని నీలపు ఉమా సుబ్రహ్మణ్యం రెడ్డి తెలియజేశారు ఈ శిబిరం జె.డి.పి.హెచ్.ఎస్. స్కూల్, వి.యం. బంజర, పెనుబల్లి మండలం లో జరగనుందని అర్హత కలిగిన కంటి రోగులకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి, అవసరమైనవారికి ఉచిత కంటి ఆపరేషన్‌లు కూడా చేయబడతాయని శిబిరంలో కంటి నిపుణులు పాల్గొని పరీక్షలు నిర్వహించనున్నారని ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు
*కార్తీక పౌర్ణమి వైశిష్ట్యం* .. కార్తీక పౌర్ణమి, కార్తీకమాసంలో శుక్లపక్షంలో వచ్చే పౌర్ణమి తిధి. ఇది చాలా విశిష్టత కలిగిన రోజు. శివ కేశవులకు అత్యంత ప్రీతికరమైన మాసం. హరిహరులకు ఎంతో ప్రీతికరమైన మాసం కనుక ఇద్దరినీ సేవిస్తే, ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి.అని పురాణాలు చెబుతున్నాయి. ప్రతి మాసము మనకు ప్రత్యేకమైనది. ఏ మాసపు ప్రత్యేకత ఆ మాసానిది. కార్తీక మాసంలో ప్రతిరోజూ ప్రధానమైనదే. ఏకాదశులు,శుద్ధ ద్వాదశి, పౌర్ణమి దినాలు ఒకదానికంటే మరొకటి శక్తివంతమైనవి. నెల రోజుల్లో చేసే పూజల ఫలితం ఒక ఎత్తు.పౌర్ణమి రోజున చేసే పూజ కార్య కలాపాలు ఒక ఎత్తు. **అభిషేక ప్రియో శివః** అభిషేక ప్రియుడు శివుడు గనుక శివాలయములలో రుద్రాభిషేకం చేయించిన వారికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. ఏకాదశ రుద్రాభిషేకాలు చేయించిన కోటి జన్మల పుణ్యఫలం ప్రాప్తిస్తుందని ప్రగాఢ విశ్వాసం.’ ఈ మాసంలో రుద్రాభిషేకాలు,కేదారేశ్వర వ్రతం, కార్తీక దామోదర పూజ,తులసి పూజ, తులసి,ఉసిరి కలిపి పూజ ,క్షీరాబ్ది ద్వాదశి పూజ,దీప దానాలు,పసుపు లింగార్చన.. స్త్రీ సౌభాగ్యం కోసం పసుపు, కుంకుమ, పుష్పాలు,తాంబూలం తో పాటు కార్తీక పురాణ పుస్తకాలను దానం చేయటం ముఖ్యమైన కార్యములు.ఇవి ఆచరించినట్లయితే సర్వ శుభాలు చేకూరుతాయి అని పెద్దల శ్రీ సూక్తి. నదీ స్నానములకు ఈ మాసంలో ప్రాముఖ్యత. నదులు సమీపంలో లేనట్లయితే బావుల దగ్గర గాని, చెరువుల వద్ద గాని స్నానమాచరించవలెను. *_గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు* అను శ్లోకంతో స్నానం చేయవలెను.కార్తీక పౌర్ణమి దీపారాధనకు అత్యంత ప్రాముఖ్యం కలిగిన రోజు. శైవాలయాలలో వైష్ణ వాలయాలలో దీపారాధనలు చేస్తారు. శివాలయాలలో ధ్వజస్తంభం మీద *నందా దీపం* పేరుతో అఖండ దీపాన్ని వెలిగిస్తారు. వైష్ణవాలయాలలో ధ్వజస్తంభం ఎదుట, తులసికోట వద్ద,గోపురం మీద,పెరుమాళ్ళ సన్నిధిలో పిండితో చేసిన దీపాలు, ఉసిరికాయల మీద ఇలా పలు రకాలుగా దీపాలను వెలిగిస్తారు. దీపారాధన అనంతరం ఆయా స్థలాల్లో దీపాలను ఉంచటం…… పసుపు,కుంకుమ,అక్షతలు, పుష్పాలు ‘ సమర్పించి అప్పుడు దీపాలను ఆయా స్థలాల్లో ఉంచాలి . ఈరోజు ఆచరించే వ్రతాలలో భక్తేశ్వర వ్రతం ఒకటి. భక్తులు వాళ్ల కోరికలను నెరవేర్చి సౌభాగ్యాన్ని కలిగించే వ్రతం ఇది. ఈ దీపారాధనలకు ఆవు నెయ్యిని ఉపయోగించడం వలన వాతావరణ కాలుష్యాన్ని కొంతవరకు అరికట్టవచ్చు. ప్రదోషంలో కాలకృత్యాలను తీర్చుకుని శివాలయంలో కానీ విష్ణు ఆలయాల్లో గాని రావి చెట్టువద్ద గాని, అరటి దొప్పలలో గాని, ఆకుదుప్పలలో గాని దీపాలను వెలిగించాలి. నదులలో దీపదానం చేయాలి.అది అవకాశం లేని వాళ్ళు ఇంట్లో ఒక బకెట్లో కానీ…. ఒక టబ్బులో గానీ నీళ్లను తీసుకొని వాటిలో దీపదానం చేయవచ్చు. త్రిపురాసురులను సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. రాక్షస సంహారం జరిగినందున ఆనందంతో శివతాండవం జరిగింది. ఈరోజున దీపాలను వెలిగిస్తే సకల పాపాలు తొలగిపోతాయి.కార్తీక సోమ వారాల్లో మహాభిషేకాలు, రుద్రాభిషేకాలు,శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం జరపడం పరిపాటి.కార్తీక పౌర్ణమి నాడు సముద్ర స్నానం శుభప్రదం. కార్తీక పౌర్ణమి నాడు అన్నదానం,వస్త్ర దానం విశేష ఫలితాలను అందిస్తుంది. ముఖ్యంగా బెల్లాన్ని దానం చేస్తే లక్ష్మీదేవి ఆనందిస్తుంది అని పెద్దల మాట. తులసి,రావి చెట్ల వద్ద దీప దానం చేస్తే శుభం. గోదానం చేస్తే మంచి ఫలితం లభిస్తుంది. చంద్రుడికి పచ్చి పాలను నీటిలో కలిపి ఇవ్వడం ఆనవాయితీ. ఈరోజున 365 ఒత్తులను వెలిగించడం వలన సంవత్సరం పొడుగునా ఏ ఒక్కరోజు వెలిగించకపోయినా….. అన్ని రోజులపుణ్యాన్ని… ఈరోజు వెలిగించే దీపాలతో పొందవచ్చు అని అంటుంటారు. *దీపం జ్యోతి: పరoబ్రహ్మ దీపం సర్వతమోపహః దీ పేన సాధ్యతే సర్వం సంధ్యా దీపా నమోస్తుతే *.. .🙏🙏🙏సర్వే జనా: సుఖినో భవంతు….
పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం. రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.