Saturday, 4 April 2026

Blog

విశాఖపట్నం

*సీ.ఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి*

*సీ.ఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని *_సీ.ఎం రిలీఫ్‌ ఫండ్‌ లబ్ధిదారులకు* 63.59.60, 57 వార్డులో_ *గణబాబు చెక్కులను పంపిణీ చేశారు* . ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న *గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు* సీ.ఎం రిలీఫ్ ఫండ్ ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు . పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీ.ఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు అందిస్తున్నామని గణబాబు అన్నారు . ఈ నేపథ్యంలో పేదలకు చెందిన పట్నాల గోవిందు- రూ.71,664/-, 57వార్డ్ సురకత్తుల జ్యోతి- రూ. 25,000/-, 63 వార్డ్. రామస్వామిఉమాపతి- రూ.74,605/-, 58 వార్డ్. గీసాల అప్పలరాజు- రూ.55,180/-, 57వార్డ్ బొల్లప్రగడ త్రినాధ రావు- రూ.1,57,978/-, 58 వార్డ్ డోక్లా ధనుశ్రీ C/O రామలక్ష్మి- రూ.30,000/-, 59 వార్డ్ పిళ్ళిచాతుర్య- రూ.20,000/-, 57వార్డ్ దండ్రురమేష్- రూ.52,660/-, 58 వార్డ్. చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు అందజేశారు. చెక్కులు అందుకున్న వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన గణబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ అంగ దుర్గా ప్రశాంతి, 63 కార్పొరేటర్ గల్లా చిన్న, శిరం. ఉమా మహేశ్వరి, రామ్మోహన్ నాయుడు,పోతబత్తుల శ్రీను, 57వార్డ్ అధ్యక్షుడు పెంటకోట అజయ్, 57వార్డ్ కార్పొరేటర్ మురు వాణి మరియు టీడీపీ జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

ఘనంగా 1200 వ సంవత్సరానికి సంబంధించిన కొత్తపేట రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి పూజలు*

పున్నమి నవంబరు 05 నెల్లూరు జిల్లా దుత్తలూరు మండలం కొత్తపేట గ్రామంలో 1200 వ సంవత్సరానికి చెందిన రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో కార్తీక పౌర్ణమి వేడుకలను ప్రజలు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకు న్నారు. రోజు ఉదయం, సాయంత్రం వేళల్లో దీపారాధనలతో ఆలయాల్లో పూజలు నిర్వహిస్తు వస్తున్నారు. భక్తులు వేకువజామునే కార్తీక స్నానాలు ఆచరించి అక్కడికి వెళ్లి కాగడ హారతి, దీపారాధన పూజల్లో పాల్గొంటుండడంతో ఆలయాల్లో కార్తీక శోభ సంతరించుకుంది. కార్తీక పౌర్ణమిని పురస్కరించుకొని స్థానిక కొత్తపేట శివాలయంల్లో కార్తీక మాస పూజలతో , దీపారాధన ఉత్సవాలు కొనసాగాయి. అదేవిధంగా, సంధ్య రాత్రివేళల్లో మహిళలు భక్తిశ్రద్ధలతో చేపట్టారు. దీపారాధన వెలిగించి తమ ఇంటి దేవతకు పూజలు నిర్వహించి భక్తిశ్రద్ధలతో నోములు నిర్వహించుకున్నారు. అదేవిధంగా, పలు ఆలయాలు, మండలంలోని ఆయా గ్రామాల్లో కార్తీక దీపోత్సవం. కార్యక్రమని మహిళలు, యువకులు, నాయకులు పాల్గొన్నారు. దుత్తలూరు మండలంలోని పలు దేవాలయాల వద్ద భక్తులు కార్తీక జ్యోతులను వెలిగించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ దేవస్థానం చాలా మహిమలు కలిగిన దేవస్థానం అని తెలియజేశారు ఈ దేవస్థానాన్ని ప్రభుత్వం గుర్తించి అభివృద్ధి చేస్తే బాగుంటుందని తెలియజేశారు

అమరావతి

జిల్లాల పునర్విభజన పై మంత్రి వర్గ ఉప సంఘం భేటీ*

*అమరావతి-సచివాలయం* *జిల్లాల పునర్విభజన పై మంత్రి వర్గ ఉప సంఘం భేటీ* *హాజరైన మంత్రులు నాదెండ్ల మనోహర్, అనగాని సత్యప్రసాద్, నిమ్మల రామానాయుడు, బిసి జనార్దన్ రెడ్డి, వంగలపూడి అనిత* *వర్చువల్ గా హాజరైన మంత్రులు సత్యకుమర్ యాదవ్, నారాయణ* *కొత్త జిల్లాల ఏర్పాటు, రెవెన్యూ డివిజన్ ల్ మార్పుల పై చర్చ*

ఆంధ్రప్రదేశ్

తుఫాన్ ప్రభావిత బాధిత కుటుంబానికి పరిహారం అందజేత

పెడన నియోజకవర్గం కృత్తివెన్ను మండలం కృత్తివెన్ను గ్రామంలో మొంథా తుఫాన్ ప్రభావం వల్ల మరణించిన కొయ్య సుబ్బారావు గారి కుటుంబానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రకటించిన 5 లక్షల రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన చెక్కు ని ఈ రోజు పెడన శాసనసభ్యులు శ్రీ కాగిత కృష్ణ ప్రసాద్ గారు అందించడం జరిగింది. ప్రకృతి వైపరీత్యాల్లో సైతం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు అన్ని విధాల అండగా నిలిచిందని, మొంతా తుఫాన్ నేపద్యంలో తీసుకున్న ముందస్తు చర్యల వల్ల ప్రజలకు ఎంతో మేలు చేయగలిగామని, ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యల పట్ల ప్రజలు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ గారు తెలిపారు.

E-పేపర్

శివాలయంలో అంగరంగ వైభవంగా కార్తీక పౌర్ణమి దీపం

రైల్వేకోడూరు అక్టోబర్ పున్నమి ప్రతినిధి రైల్వేకోడూరు స్థానిక శివాలయంలో ఈరోజు వేకువ జాము నుండి శివాలయంలో శివనామ స్మరణ మారు మ్రోగినది అంతేకాకుండా భక్తులు ప్రత్యేకంగా స్త్రీలు వేకువ జామున శివుడిని దర్శించుకుని ఆ తరువాత కార్తీక పౌర్ణమి నీ పురస్కరించుకొని కార్తీక దీపం పెట్టడం జరిగినది .కార్తీకమాసంలో శివుడికి అతి పవిత్రమైన మాసం కార్తీక మాసం అందువలన స్త్రీలు ప్రత్యేకంగా స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుందని ఆలయ అర్చకులు పవన్ కుమార్ శర్మ యోగీశ్వర శర్మ తెలపడం జరిగినది. కార్తీకదీపం అనంతరం అమ్మవార్లకు ప్రత్యేకమైన అలంకారంతో పూజలు చేయడం జరిగిందని వారు తెలిపారు. పూజానంతరం అల్పాహారం 1500 మందికి షేక్ షంషీద్ భాష వచ్చిన భక్తులకు ఏర్పాటు చేయడం జరిగినదని తెలిపారు.

పశ్చిమ గోదావరి

జైన్ దేవాలయాలను సందర్శించిన ఎమ్మెల్యే అంజిబాబు

భీమవరం : కార్తిక పౌర్ణమి సందర్భంగా జైన్ లు ఎంతో పవిత్రంగా చేసుకునే పండుగ పూర్ణిమ మేళా మహోత్సవమని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. పెద అమిరంలోని జైన్ దేవాలయంలో బుధవారం జరిగిన కార్తీక పూర్ణిమ మేళా మహోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే కార్తీక పూర్ణిమ మేళా మహోత్సవాన్ని ఇంతా వైభవంగా సంప్రదాయ బద్దంగా నిర్వహించడం అభినందనీయమని అన్నారు. ముందుగా స్వామివారికి అభిషేకాలు, హారతులు అందించారు. దేవాలయ ప్రాంగణంలో కీర్తనలను ఆలపించారు. కార్యక్రమంలో మెహందర్ కుమార్ జైన్, ప్రకాష్ కుమార్ జైన్, నరేష్ కుమార్ జైన్, రమేష్ కుమార్ జైన్, ప్రమోద్ కుమార్ జైన్, వినోద్ కుమార్ జైన్, వబిలిశెట్టి రామకృష్ణ, యర్రంశెట్టి శివకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

కామారెడ్డి

ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు

కామారెడ్డి ఐదు నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) : ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించినట్టు పార్టీ సభ్యులు తెలిపారు.కార్తీక పౌర్ణమి పర్వదినం సందర్భంగా తాడ్వాయి మండ లంలోని భ్రహ్మజివాడి గ్రామంలో ఉన్న సిద్ధులగుట్ట సిద్ధేశ్వర స్వామి ఆలయంలో 34వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఎల్లారెడ్డి నియోజకవర్గ ఎమ్మెల్యే మదన్ మోహన్హా హాజరై, స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజ లు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ, ఎల్లా రెడ్డి నియోజకవర్గ ప్రజలకు కార్తీక పౌర్ణమి శుభా కాంక్షలు తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతోష లతో, ఆరోగ్యంగా ఉండాలని, రైతులకు మంచి పంటలు పండాలని, వ్యవసాయ రంగం అభివృద్ధి చెందాలని సిద్దేశ్వర స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. “ఎల్లారెడ్డి ప్రజలపై సిద్దేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని ఆకాంక్షిస్తున్నా ను” అని భావోద్వేగంగా తెలిపారు.ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చిన భక్తుల సౌకర్యాల అంశంపై స్పందించిన మదన్ మోహన్ గారు, ఆలయానికి చేరుకోవడానికి భక్తులు ఏకంగా 350 మెట్లు ఎక్కవలసి వస్తుందని గుర్తించి, త్వర లోనే మెట్ల నిర్మాణం మరియు సీసీ రోడ్ ఏర్పాటు కు చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. భక్తు ల సౌలభ్యం కోసం అవసరమైన మౌలిక సదుపా యాలు కల్పిస్తామని అన్నారు.అలాగే ఈ ఆల యాన్ని రాష్ట్రవ్యాప్త పుణ్యక్షేత్రంగా అభివృద్ధి చేయాలనే సంకల్పాన్ని ఎమ్మెల్యే వ్యక్తం చేశారు. ఇటీవల సదాశివనగర్ మండలంలోని భూపాల్లి గ్రామ శివాలయం మరియు రాజంపేట్ మండలం లోని కొండాపూర్ గ్రామ ఎల్లమ్మ తల్లి ఆలయానికి ఇచ్చిన హామీ మేరకు కొండ శిఖరం పైకి సీసీ రోడ్ నిర్మాణం పూర్తయ్యిందని గుర్తు చేశారు.ప్రజల ఆధ్యాత్మికాభివృద్ధి, ఆలయాల అభ్యున్నతి, భక్తుల సౌకర్యాల కోసం ప్రభుత్వం అందించే అవకాశా లను సమర్థంగా వినియోగించి, ప్రతి పుణ్యక్షేత్రం అభివృద్ధి దిశగా కృషి చేస్తానని ఎమ్మెల్యే తెలిపా రు.

E-పేపర్

పచిపులుసు సుదర్శన్ గుప్త గారి నూతన గృహ ప్రవేశoలో పాల్గొన్న వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి

రాజంపేట పట్టణం* రాజంపేట వస్త్ర వ్యాపారుల సంఘం అద్యక్షులు శ్రీ పచిపులుసు సుదర్శన్ గుప్త గారి నూతన గృహ ప్రవేశ సందర్బంగా వారి ఆహవనం మేరుకు విచ్చిన రాజంపేట ఎమ్మెల్యే, అన్నమయ్య జిల్లా వైయస్ఆర్సిపి పార్టీ ఆదిక్షులు శ్రీ ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి గారు వారికి స్వగతం పలికిన సుదర్శన్ గుప్త గారు వారి కుమారుడు శ్రీనివాసులు గారు , వీరికి మన అమర్‌నాథ్ రెడ్డి గారు శుభకాంక్షలు తేలిపారు ఈ కారిక్రమం లో రాజంపేట మున్సిపల్ కౌన్సిలర్, అన్నమయ్య జిల్లా ysrcp వాణిజ్య విభాగం అద్యక్షుడు,రాజంపేట వస్త్ర వ్యాపారుల సంఘం కార్యదర్శి సనిశెట్టి నవీన్ కుమార్ గారు మరియూ ysrcp నాయకులు పాల్గొన్నారు.

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

గుండెపోటుతో మరణించిన గంగపట్ల కొండయ్య కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన : కోట్టే_వెంకటేశ్వర్లు

వింజమూరు మండలం, నేరేడుపల్లి గ్రామానికి చెందిన జనసేన సభ్యత్వం కలిగిన గంగపట్ల కొండయ్య ఇటీవల గుండెపోటుతో మరణించిన విషయం తెలుసుకొని జనసేన పార్టీ ఉదయగిరి నియోజకవర్గ సమన్వయ కర్త కొట్టే వెంకటేశ్వర్లు వారి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. ఈ సందర్భంగా వారి ఆర్థిక పరిస్థితి తెలుసుకొని కొండయ్య సతీమణి జయంతి గారికి 12 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించడం జరిగింది. వారి కుటుంబానికి, పిల్లలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని భరోసా కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమములో వింజమూరు మండల అధ్యక్షులు బండారు సత్యనారాయణ, జనసేన నాయకుడు ఇమ్రాన్ తదితరులు పాల్గొన్నారు

E-పేపర్

మతాలకు అతీతంగా శివాలయంలో అల్పహార0 ఏర్పాటుచేసిన ముస్లిం సోదరుడు షంషీర్ భాష

మతాలకు అతీతంగా శివాలయంలో అల్పహార0 ఏర్పాటుచేసిన ముస్లిం సోదరుడు షంషీర్ భాష రైల్వేకోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి కోడూరు పట్టణంలోని శివాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా బిస్మిల్లా బిర్యానీ సెంటర్ అధినేత ముస్లిం సోదరుడు షంషీర్ భాష మతాలకు అతీతంగా గత పది సంవత్సరాలుగా హిందూ ముస్లింలు అంటూ మతాలపరంగా వేరు కాదు మనుషులంతా ఒకే మతం ఒకే కులం అనే నినాదంతో శివాలయంలో ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి రోజున గత పది సంవత్సరాలు ముస్లిం సోదరుడు అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగినదని సుమారు శివాలయంలో 1500 మందికి అల్పాహార విందు ఏర్పాటు చేయడం జరిగిందని షంషేర్ భాష తెలిపారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.