Saturday, 4 April 2026

Blog

అమరావతి

అమరావతి* *ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలి*

*అమరావతి* నవంబర్ (విశాఖ )పున్నమి ప్రతినిధి *ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలి* *ఎవరైనా పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తే చర్యలు తప్పవు* *క్రమశిక్షణతో పని చేయండి. 15వ తేది లోపు గ్రామ స్థాయి నుండి నియోజకవర్గ కమిటీల వరకు నియామకాలు పూర్తి కావాలి* *కూటమి నాయకులతో సఖ్యతగా, సమిష్టిగా కలుపుకుంటూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లండి.* *— పార్టీ నాయకులతో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు టెలీ కాన్ఫరెన్స్* నియోజకవర్గాల్లో సరిగ్గా గ్రీవెన్స్ నిర్వహించడం లేదని, నాయకులు ప్రజల సమస్యలు సరైన రీతిలో పరిష్కరించివుంటే మంత్రి లోకేష్ గారి ప్రజాదర్బార్ కు 4వేల మంది ఎందుకు వస్తారు అని నాయకులతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ రావు మండిపడ్డారు. బుధవారం తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో పర్యటించిన ఆయన పార్టీ ముఖ్య నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా నేతలతో ఆయన మాట్లాడుతూ.. జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు ఇకపై ప్రతి శుక్రవారం ప్రతి నియోజకవర్గంలో గ్రీవెన్స్ నిర్వహించాలి అని ఆదేశించారు. ఇక అదే రోజు స్థానిక నాయకులతో సమావేశం నిర్వహించి నియోజకవర్గంలో ఎటువంటి సమస్యలు లేకుండా చూసుకోవాలని కోరారు. నవంబర్ 15వ తేది లోపు నియోజకవర్గ కమిటీల నుంచి గ్రామ స్థాయి కమిటీల వరకు పార్టీ నియామకాలు పూర్తి చేయాలని డెడ్ లైన్ విధించారు. 15వ తేది లోపు పూర్తి చేయలేకపోతే జాతీయ అధ్యక్షులు ఎదుట హాజరుకావాల్సి ఉంటుందని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీ అంటే ఒక సంస్కృతి. క్రమశిక్షణకు మారు పేరు తెలుగుదేశం పార్టీ. కొందరి నాయకుల వలన పార్టీకి చెడ్డపేరు వస్తుందని, పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటువంటి నాయకులు వారి ప్రవర్తన మార్చుకోవాలని, మరలా పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్ళడంలో పార్టీ నాయకులు సఫలం కావాలి, దానికి తగ్గట్టు నియోజకవర్గాల్లో కార్యక్రమాల్లో నిర్వహిస్తూ.. క్యాడర్ ను కలుపుకుంటూ.. క్షేత్రస్థాయిలో పర్యటనలు చేయాలని సూచించారు. కూటమి నేతల మధ్య విభేదాలు సృష్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తుంది.. అందరూ సఖ్యతతో పనిచేయాలి.. సంయమనం పాటించండి.. సోషల్ మీడియాలో వైసీపీ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టండంతో పాటు వైసీపీ దుష్ప్రచారాలకు ప్రజలు ప్రభావితం కాకుండా వాస్తవాలను ప్రజల్లోకి తీసుకెళ్ళాల్సిన బాధ్యత మీపై ఉందని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో పని చేయండని కోరారు. ఈ టెలికాన్ఫరెన్స్ లో టిడిపి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా, జోనల్, పార్లమెంట్, నియోజకవర్గ ఇంచార్జులు, వివిధ కార్పొరేషన్ చైర్మన్లు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

అగ్నిప్రమాద చిన్నారులకు రూ. 10,000 ఆర్థిక సాయం*

*అగ్నిప్రమాద చిన్నారులకు రూ. 10,000 ఆర్థిక సాయం* * *కుటుంబ సభ్యులను పరామర్శించిన వాసుపల్లి* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* అగ్ని ప్రమాదంలో గాయపడిన ఇద్దరు చిన్నారులకు మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాసుపల్లి గణేష్ కుమార్ రూ. 10,000 అందజేసి మరో సారి తన దాతృత్వం చాటుకున్నారు. 30వ వార్డు రెల్లి వీధి పిల్ల అప్పయ్య ప్రాంతంలో అగ్ని ప్రమాదం జరిగి పిల్లా నక్షత్రలహరి, పిల్లా ధనుష్ అనే ఇద్దరు చిన్నారులు కాలిన గాయాలతో చికిత్స పొందుతున్నారు. వార్డ్ అధ్యక్షులు దశమంతుల మాణిక్యాలరావు & వార్డ్ బీసీ సెల్ అధ్యక్షులు వేణు ద్వారా విషయం తెలుసుకున్న పేదల పెన్నిధి వాసుపల్లి గణేష్ కుమార్ ఇంటికి వెళ్లి కుటుంబాన్ని ఓదార్చి చిన్నారులను పరామర్శించారు. అనంతరం కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి ధైర్యం నింపారు. పిల్లలు తొందరగా కోలుకొని చిరునవ్వుతో మళ్ళీ స్కూలుకు వెళ్లే బాగా చదువుకోవాలని వారితో కాసేపు ముచ్చటించారు. ఈ కార్యక్రమంలో 30వ వార్డ్ ప్రెసిడెంట్ దస్మాంతుల మాణిక్యాలరావు, స్టేట్ ఆర్టిఐ సెకరెటరీ దస్మాంతుల చిన్ని, జిల్లా ఆర్టిఐ ప్రెసిడెంట్ వడ్డాది దిలీప్, 37వ వార్డ్ కార్పొరేటర్ చెన్నా జానకిరామ్, వార్డ్ బీసీ సెల్ అధ్యక్షులు వేణు, జిల్లా వైస్ ప్రెసిడెంట్ రేయ్ డేవిడ్ రాజు, జిల్లా బీసీ సెల్ ప్రెసిడెంట్ సనపల రవీంద్ర భారత్,29వ వార్డ్ ప్రెసిడెంట్ పీతల వాసు, 36వ వార్డ్ మహమ్మద్ షకిల్, సౌత్ ఆర్టీఐ ప్రెసిడెంట్ కోరాడ సురేష్, వార్డ్ నాయకులు దస్మాంతుల సంతోషి,సౌత్ sc సెల్ ప్రెసిడెంట్ ఆకుల శ్యామ్,37వ వార్డ్ ఇంచార్జ్ గంగళ్ల రామరాజు,30 వార్డ్ & 36,37 వార్డ్ నాయకులు కార్యకర్తలు భారీగా పాల్గొన్నారు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

నగరంలో 22 ఏ సమస్యని పరిష్కరించండి : ప్రియాంక దండి*

*నగరంలో 22 ఏ సమస్యని పరిష్కరించండి : ప్రియాంక దండి* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి * కాంగ్రెస్ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇంచార్జ్ ప్రియాంక దండి వి ఏం ఆర్ డి ఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ ని బుధవారం కలిసి నగరంలో చాలా మంది స్థలాలు 22A పెట్టడం వల్ల అమ్ముకోవడానికి, బ్యాంక్ ఋణం తీసుకోవడానికి లేదా నిర్మాణాలు చేపట్టడానికి కుదరక ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్య పై వెంటనే ఒక నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.

విశాఖపట్నం

విశాఖపట్నం పోర్ట్ సెక్రటరీ వేణుగోపాల్ గారు ఒరిస్సా పారదీప్ పోర్టుకు డిప్యూటీ చైర్మన్ గా నియమితులు

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-* విశాఖపట్నం పోర్ట్ సెక్రటరీ వేణుగోపాల్ గారు ఒరిస్సా పారదీప్ పోర్టుకు డిప్యూటీ చైర్మన్ గా ,దాదాపు ఐఏఎస్ క్యాడర్ ఉన్న పదోన్నతి పొందడం మాకు ఎంతో ఆనందంగా ఉంది, ఆయన ఆంధ్ర యూనివర్సిటీ పూర్వపు విద్యార్థి కావడం, ఆయన విశాఖ వాసిగా మాకు ఎంతో గర్వంగా ఉందని. పోర్ట్ పూల్ కళాశీల గౌరవ అధ్యక్షుడు మరియు ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సమయం హేమంత కుమార్ దుస్సాలువతో మరియు పుష్పగుచ్చంతో వేణుగోపాల్ గారిని సత్కరించారు. గత 30 సంవత్సరాల నుండి పోర్ట్ పూల్ కళాశాలుగా పనిచేస్తున్న ఉద్యోగస్తులకు కూడా పదోన్నతి కల్పించి, ఉద్యోగ భద్రత తో పాటు వేతనాలు పెంచి, టైం స్కేల్ గా అవకాశం ఇవ్వాలని వేణుగోపాల్ గారిని మరొకసారి వినత పత్రం ఇచ్చి కోరడం జరిగింది. ఇప్పటికే గతంలో చైర్మన్ అంగముత్తు గారి పూర్తి ఆదేశాలతో, వేణుగోపాల్ గారి పర్యవేక్షణలో ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టికి మరియు కేంద్ర మంత్రి దృష్టికి తీసుకు వెళ్లినందుకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు. పోర్ట్ సెక్రటరీ మరియు ఒరిస్సా పారదీప్ పోర్ట్ డిప్యూటీ చైర్మన్ వేణుగోపాల్ గారికి మరొకసారి పోర్టుపుల్ కలసిలను క్రమబద్ధీకరణ గురించి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించి, తప్పకుండా చైర్మన్ గారి దృష్టికి తీసుకువెళ్లి ,తగు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. పోర్ట్ పూల్ కళాసిలు ఈ విషయంపై హర్షం వ్యక్తం చేస్తూ, తప్పట్లతో ఆనందాన్ని పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ అధ్యక్షులు సమయం హేమంత్ కుమార్ తో పాటు కూల్ కళాశీల సెక్రెటరీ సి.హెచ్ పోతురాజు, అధ్యక్షులు కలిమిరెడ్డి అప్పారావు,వాసుపల్లి రాము, కలిష, రమేష్ బాబు, హరికృష్ణ యాదవ్, సిహెచ్ అప్పలరాజు, శ్రీనివాస్ రెడ్డి, అలీమ్, ఏ. నాయుడు తదితర పూల్ కళాసిలు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

విశాఖపట్నం

డ్రగ్ ఫ్రీ విశాఖపట్నం కోసం* *విద్యాలయాలలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాం,*

*విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:-*జనసేన పార్టీ నగర కార్యలయంలో జనసేన, ABVP, TNSF విద్యార్థి సంఘల మీడియా సమావేశంలో ముఖ్యంశాలు* * *డ్రగ్ ఫ్రీ విశాఖపట్నం కోసం* *విద్యాలయాలలో అవగాహన కల్పించేందుకు కృషి చేస్తాం,* * *విద్యార్థి సంఘాల నాయకులు దేశంకోసం త్యాగం చేసిన నాయికుల కోసం చెప్పాలి కానీ, విద్యార్థుల భవిష్యత్తు దారి తప్పేలా వ్యవహరించరాదు*, డా, మర్రివేముల శ్రీనివాస్, జనసేన నాయకులు, మాట్లాడుతూ… * విశాఖ రూప్ రేఖలు మారుతున్న తరుణంలో పడగ విప్పిన డ్రగ్స్ కల్చర్, * “పార్టీ పేరుతో యువతను డ్రగ్స్ బానిసలుగా మార్చిన వైసీపీ నాయకత్వం సిగ్గు పడాలి”, * రాష్ట్ర ప్రభుత్వం డ్రగ్స్ నియంత్రించే కార్యాచరణకు అన్ని యువజన, విద్యార్థి సంఘాలతో పాటు మేధావులచే సదస్సులు ఏర్పాటు చేసి ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియచేసారు, ఆంధ్రప్రదేశ్ ను డ్రగ్స్ రహిత రాష్ట్రం గా చేయాలనీ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది అని దానికి విద్యార్థులు, యువత సహకరించాలని అన్నారు.* *ABVP నేషనల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబెర్,కిరణ్ కుమార్ మాట్లాడుతూ…. * విశ్వ విద్యాలయ కేంద్రంగా జరుగుతున్నా డ్రగ్స్ దందా పై ఉక్కు పదం మోపుతూ టాస్క్ ఫోర్స్ ప్రతి 3 నెలలకు ఒక సారి యూనివర్సిటీలు మరియు కళాశాలలు ను పర్య వెక్షించాలని కోరారు, “విశాఖలో డ్రగ్స్ నెట్‌వర్క్‌పై స్పెషల్ ఇన్వెస్టిగేషన్ కమిటీ ఏర్పాటు చేయాలి, * google లాంటి ప్రతిష్టాత్మక డేటా సెంటర్, కాగ్నిజెంట్, సిఫి, ఐటీ పరిశ్రమలు కేరాఫ్ గా ఉన్న విశాఖను డ్రగ్స్ కు అడ్డాగా యువతను, స్టూడెంట్స్ ని బానిస చేసే కుట్రలో వైసిపి, * ఈ డ్రగ్స్ రాకెట్ వ్యవహారం బయట పడటం తో అన్ని విద్యార్థి సంఘాలు అసహనం వ్యక్తం చేసాయి. *TNSF పార్లమెంట్ ప్రసిడెంట్,రత్న కాంత్ మాట్లాడుతూ…. * కుటమి ప్రభుత్వ అధికారం లోకి వచ్చాక విశాఖలో యాంటీ డ్రగ్ పార్క్ ఏర్పాటు చేస్తుంటే ఇదే విశాఖపట్నం ను మొత్తం మాఫియాగా తయారు చేయాలనుకుంటున్నారా? * యువత భవిష్యత్తు కోసం శ్రమించాలి కానీ వారు భవిష్యతే నాశనం చేసే విధంగా వైసిపి నాయకులు పాటుపడుతున్నారు, * ఈ కేసులో ఎంత పెద్ద వారైనా ఉన్న వారిపై చర్యలు తీసుకోవాలి.. అన్నారు. ఈ కార్యక్రమం లో ABVP డిస్ట్రిక్ట్ కన్వీనర్,నితిన్, సిటీ సెక్రటరీ,ప్రసాద్, టెక్నికల్ స్టేట్ కో కన్వీనర్,వెంకటేష్, AU ఆర్ట్స్ కాలేజీ ప్రసిడెంట్,వెంకయ్యనాయుడు, TNSF వైస్ ప్రసిడెంట్,అవినాష్, స్పాక్స్ పర్సన్ బి. ప్రవీణ్, అర్జీనైజషన్ సెక్రటరీ,భావత, జనసేన నాయకులు పోతు ప్రసాద్, దేవర రఘు మరియు విద్యార్థి సంఘల నాయకులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

రాష్ట్ర భ‌విష్య‌త్తుకు త‌ల‌మానికంగా భాగ‌స్వామ్య స‌ద‌స్సు*

*రాష్ట్ర భ‌విష్య‌త్తుకు త‌ల‌మానికంగా భాగ‌స్వామ్య స‌ద‌స్సు* * ఏయూలో జ‌రుగుతున్న ఏర్పాట్లను ప‌రిశీలించిన‌ ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ‌బాల వీరాంజ‌నేయ స్వామి * 9.8 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబడులు రాక‌తో పాటు, 2.7 ల‌క్ష‌ల కోట్ల ప్రాజెక్టుల‌కు శంకుస్థాప‌న‌లు జ‌రుగుతాయ‌ని వెల్ల‌డి *విశాఖ‌పట్ట‌ణం, నవంబర్ పున్నమి ప్రతినిధి:-* *ఈ నెల 14, 15వ తేదీల్లో విశాఖ‌పట్ట‌ణం వేదిక‌గా జరగనున్న ప్రపంచ స్థాయి భాగస్వామ్య సదస్సు రాష్ట్ర భ‌విష్య‌త్తుకు త‌ల‌మానికం కానుంద‌ని, ఈ మ‌హా కార్యాన్ని దిగ్విజ‌యం చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం అవిర‌ళ కృషి చేస్తోంద‌ని జిల్లా ఇన్ఛార్జి మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి పేర్కొన్నారు. దీనిలో భాగంగా ఇప్ప‌టికే రాష్ట్ర ముఖ్య‌మంత్రి, ఐటీ శాఖ మంత్రి, ఇత‌ర‌ కేబినెట్ మంత్రులు ప‌లు దేశాల్లో ప‌ర్య‌టించి పారిశ్రామిక వేత్త‌ల‌ను, పెట్టుబ‌డిదారుల‌ను ఆహ్వానించార‌ని గుర్తు చేశారు. ఏయూ ఇంజ‌నీరింగ్ క‌ళాశాల మైదానంలో జ‌రుగుతున్న ఏర్పాట్ల‌ను స్థానిక ప్ర‌జా ప్ర‌తినిధులు, జిల్లా క‌లెక్ట‌ర్, ఇత‌ర అధికారుల‌తో క‌లిసి బుధ‌వారం ఆయ‌న ప‌రిశీలించారు. ఈ క్ర‌మంలో మీడియాతో ప‌లు అంశాల‌పై మాట్లాడారు. ప్ర‌పంచ స్థాయి భాగ‌స్వామ్య స‌ద‌స్సును దిగ్విజ‌యం చేసేందుకు రాష్ట్ర ప్ర‌భుత్వం, అధికార యంత్రాంగం ప‌టిష్ట చ‌ర్య‌లు చేప‌డుతోంద‌ని పేర్కొన్నారు. సుమారు 40 పైచిలుకు దేశాల నుంచి వంద‌ల సంఖ్య‌లో అతిథులు, వివిద కంపెనీల ప్ర‌తినిధులు విచ్చేస్తున్నార‌ని తెలిపారు. స‌ద‌స్సు నిర్వ‌హించ‌టం ద్వారా రాష్ట్రానికి రూ.9.8 ల‌క్ష‌ల కోట్ల పెట్టుబ‌డులు వ‌స్తున్నాయ‌ని మంత్రి స్వామి పేర్కొన్నారు. త‌ద్వారా 7.5 లక్ష‌ల మంది యువ‌త‌కు ఉద్యోగావ‌కాలు వ‌స్తాయ‌ని ఆశాభావం వ్య‌క్తం చేశారు. మేనిఫెస్టోలో పేర్కొన్న ప్ర‌కారం 20 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌న‌లో భాగంగా ఇప్ప‌టికే 10 లక్ష‌ల మంది యువ‌త‌కు ఉద్యోగాలు క‌ల్పించే ప్ర‌క్రియ‌ల‌ను పూర్తి చేశామ‌ని చెప్పారు. దేశ‌, విదేశాల నుంచి వ‌చ్చే పారిశ్రామిక వేత్త‌లు, రాజ‌కీయ‌, అధికార ప్ర‌ముఖుల స‌మ‌క్షంలో 410 ఒప్పందాలు జ‌రుగుతాయ‌ని, 2.7 ల‌క్ష‌ల కోట్ల‌తో చేప‌ట్ట‌నున్న ప్రాజెక్టులు శంకుస్థాప‌న‌లు కూడా జరుగుతాయ‌ని మంత్రి వివ‌రించారు. విశాఖ‌ప‌ట్ట‌ణాన్ని పూర్తిస్థాయి ఆర్థిక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు ప్ర‌భుత్వం క‌ట్టుబ‌డి ఉంద‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి ఉద్ఘాటించారు. ఏయూలో జ‌రుగుతున్న ఏర్పాట్లు, వేదిక‌లు, ఇత‌ర అంశాలను జిల్లా క‌లెక్ట‌ర్ ఎం.ఎన్. హ‌రేంధిర ప్ర‌సాద్ మంత్రికి, ఇత‌ర ప్ర‌జా ప్ర‌తినిధుల‌కు మ్యాప్ సహాయంతో వివ‌రించారు. ప‌ర్య‌ట‌న‌లో మంత్రితో పాటు ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణ బాబు, వంశీకృష్ణ శ్రీనివాస్, విష్ణుకుమార్ రాజు, మేయర్ పీలా శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు, జిల్లా క‌లెక్ట‌ర్, సీఐఐ ప్ర‌తినిధి మౌళి, ఇత‌ర అధికారులు ఉన్నారు.

విశాఖపట్నం

భద్రతా లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి

భద్రతా లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- విశాఖ స్టీల్ ప్లాంట్ లో జరుగుతున్న భద్రతా లోపాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని స్టీల్ సిఐటియు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు యు రామస్వామి, జె అయోధ్యరామ్ ఆంధ్ర రాష్ట్ర జాయింట్ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ శ్రీ శివ శంకర్ రెడ్డి గారిని కోరారు. నేడు స్టీల్ సిఐటియు ఆధ్వర్యంలో ప్లాంట్ భద్రత పై విచారణకు మరియు సందర్శన నిమిత్తం విచ్చేసిన శ్రీ శివ శంకర్ రెడ్డి గారిని స్టీల్ ప్లాంట్ భద్రతా విభాగం సమావేశ మందిరంలో కలసి స్టీల్ ప్లాంట్లో జరుగుతున్న భద్రతా లోపాలపై చర్చించి అనంతరం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా స్టీల్ సిఐటియు ప్రధాన కార్యదర్శి జె అయోధ్యరామ్ మాట్లాడుతూ ఈ కాలంలో ప్లాంట్ లో ఎనిమిది ఫ్యాకల్ యాక్సిడెంట్లు జరిగాయని ఆయన అన్నారు. ప్రధానంగా ప్లాంట్ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నందువల్ల అత్యంత వేగంగా తుప్పుపడతాయని దీని నివారణకు తుప్పు పట్టిన ప్రదేశాన్ని తొలగించి మరియు ఆ స్థానంలో కొత్త వాటిని అమర్చి వాటిపై పెయింటింగ్ చేయడం అత్యంత ప్రధానమని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. కానీ నేడు స్టీల్ యాజమాన్యం పెయింటింగ్ చేయమని ఎన్నిసార్లు చెప్పినా కాంట్రాక్టర్ లేడని వాటిపై దృష్టి సారించకపోవడం అత్యంత దుర్మార్గమని ఆయన అన్నారు. సరియైన మెయింటెనెన్స్ లేకపోవడంతో ప్రమాదాలు జరగడం అత్యంత త్వరితగతిన జరుగుతుందని ఆయన వివరించారు. అందుకే కార్మికుల విలువైన ప్రాణాలు కోల్పోవడం జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని మీరు మా యాజమాన్యంతో చర్చించిన సమయంలో ప్లాంట్ లోని పరికరాలను మరియు కార్మికుల ప్రాణాలకు విలువ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. స్టీల్ సిఐటియు అధ్యక్షులు యు రామస్వామి మాట్లాడుతూ కార్మికుల సంఖ్యను తగ్గిస్తూ నేడు యాజమాన్యం తీసుకుంటున్న చర్యల వల్ల కార్మికుల సంఖ్య నానాటికి తగ్గుతోందని ఆయన వివరించారు. కార్మికులను ఒక విభాగం నుంచి వేరొక విభాగంలోనికి మార్చిన సందర్భంలో పని భద్రతపై తగిన అవగాహనను కలిగించవలసిన యాజమాన్యం దాన్ని విస్మరించి కార్మికుల ప్రాణాలతో చెలగాటమాడుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికుల సంఖ్య తగ్గడం వల్ల ఎస్ఎంఎస్ లో కార్మికుల మృతికి కారణమని ఆయన వివరించారు. డిప్లయ్మెంట్ చేస్తున్న కార్మికులకు కనీస భద్రత కల్పించే విధంగా మా యాజమాన్యాన్ని మీరు ఆదేశించాలని ఆయన్ని కోరారు. దీనికి స్పందించిన శ్రీ శివ శంకర్ రెడ్డి గారు మాట్లాడుతూ రానున్న మూడు రోజులు మేము కర్మాగారంలో భద్రతపై పరిశీలిస్తామని ఆయన అన్నారు. ఆ సమయంలో మీరు ఈ విషయాలను మా దృష్టికి తీసుకురావాలని వాటిని మా అధికారులు నోట్ చేసుకునే విధంగా మీరు వివరించండి అని ఆయన అన్నారు. సందర్శన సమయంలో మీరు చెప్పే భద్రతా లోపాలను మరియు మీరు మా దృష్టికి తీసుకువచ్చిన లోపాలను సమన్వయపరిచి మీ యాజమాన్యానికి తగిన సూచనలు అందజేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్టీల్ సిఐటియు నాయకులు బి అప్పారావు, పుల్లారావు, టి వి కె రాజు, బి మహేష్, బి ఎన్ మధుసూదన్, డి ఎస్ వి ఎస్ శ్రీనివాస్, వి ప్రసాద్, ఎం.వి రమణ, వి డి వి పూర్ణచంద్రరావు తదితరులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ తనిఖీ చేసిన ఇన్‌చార్జ్ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి*

*బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్‌ తనిఖీ చేసిన ఇన్‌చార్జ్ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి* *విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి:-* ప్రభుత్వం అందించే కోచింగ్ సద్వినియోగం చేసుకొని బాగా చదివి సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించుకోవాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సామాజిక సంక్షేమ, వికలాంగులు మరియు వయోవృద్ధుల సంక్షేమ శాఖ మరియు జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు డా.డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి విద్యార్థులకు సూచించారు. బుధవారం మధ్యాహ్నం ఋషికొండ వద్ద గల బి.ఆర్. అంబేద్కర్ స్టడీ సర్కిల్ ను సందర్శించారు. ఈ సందర్భంగా లైబ్రరీ, కంప్యూటర్ రూమ్, సెమినార్ హాల్ తదితర వసతులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టడీ సర్కిల్‌లో కోచింగ్ పొందుతున్న విద్యార్థులతో మంత్రి మాట్లాడుతూ తీసుకునే కోచింగ్ సద్వినియోగం చేసుకొని బాగా చదివి సమాజంలో మంచి పేరు, ప్రఖ్యాతులు సంపాదించాలని సూచించారు. విద్యార్థుల వసతి, పాఠశాల వాతావరణం తదితర అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు నివసిస్తున్న హాస్టల్‌ను పరిశీలించి, వసతులు మరింత మెరుగుపరచాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్టడీ సర్కిల్ చుట్టూ ఉన్న ప్రాంగణాన్ని శుభ్రపరచి మొక్కలు నాటేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. చివరగా విద్యార్థిని విద్యార్థులతో ఫోటోలు దిగారు. ఈ కార్యక్రమంలో డీడీ సోషల్ వెల్ఫేర్ రామారావు, జిల్లా గురుకుల పాఠశాల కోఆర్డినేటర్ మిసెస్ గ్రేస్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

విశాఖపట్నం

కార్తీక పౌర్ణమి రాధా కృష్ణుడు గుడిలో పాలు పెరుగు ఎదుమేలా కార్యక్రమం

*కార్తీక పౌర్ణమి రాధా కృష్ణుడు గుడిలో పాలు పెరుగు ఎదుమేలా కార్యక్రమంలో మహా విశాఖ నగర్ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట్ కుమారి శ్రీనివాస్* *విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- *ఈ రోజు కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని బీచ్ రోడ్ గోకుల్ పార్క్ నందు ఉన్నటువంటి రాధా కృష్ణ గుడిలో పాలు పెరుగు ఎదుమేలా శ్రీ విశాఖ జిల్లా యాదవ్ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో అంగరంగ వైభావంగా జరిపారు. ఈ సందర్బంగా మహా విశాఖ నగర్ మాజీ మేయర్ శ్రీమతి శ్రీ గొలగాని హరి వెంకట్ కుమారి శ్రీనివాస్ ప్రత్యేక పూజల్లో పాల్గొని ప్రసాదం వితరణ చేసారు. అనంతరం మాజీ మేయర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం కార్తీక పౌర్ణమి నాడు జగద్గురు ఐనాటివంటి శ్రీ కృష్ణుడు ని పాలు పెరుగు తో పూజించటం అనాదిగా వస్తున్నటి వంటి ఆచారం ఈ యొక్క కార్యక్రమంకి విశాఖ నలుమూలల ఉన్నటు వంటి యాదవ సోదర సోదరిమానులు పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో విశాఖ జిల్లా యాదవ సంక్షేమ సంఘం అధ్యక్షులు కమిటీ సభ్యులు పాల్గొన్నారు*

విశాఖపట్నం

*సీ.ఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి*

*సీ.ఎం సహాయ నిధి పేదలకు పెన్నిధి* విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- సీఎం సహాయ నిధి పేదలకు పెన్నిదని ప్రభుత్వ విప్ పశ్చిమ ఎమ్మెల్యే గణబాబు అన్నారు పశ్చిమ నియోజకవర్గ పరిధిలోని *_సీ.ఎం రిలీఫ్‌ ఫండ్‌ లబ్ధిదారులకు* 63.59.60, 57 వార్డులో_ *గణబాబు చెక్కులను పంపిణీ చేశారు* . ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యం పరంగా ఆపదలో ఉన్నవారికి సకాలంలో చికిత్స కోసం అందిస్తున్న *గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు* సీ.ఎం రిలీఫ్ ఫండ్ ని సద్వినియోగపరచుకోవాలని తెలియజేశారు . పార్టీలకు అతీతంగా కేవలం అర్హతే ఆధారంగా సీ.ఎం రిలీఫ్‌ ఫండ్‌ నిధులు అందిస్తున్నామని గణబాబు అన్నారు . ఈ నేపథ్యంలో పేదలకు చెందిన పట్నాల గోవిందు- రూ.71,664/-, 57వార్డ్ సురకత్తుల జ్యోతి- రూ. 25,000/-, 63 వార్డ్. రామస్వామిఉమాపతి- రూ.74,605/-, 58 వార్డ్. గీసాల అప్పలరాజు- రూ.55,180/-, 57వార్డ్ బొల్లప్రగడ త్రినాధ రావు- రూ.1,57,978/-, 58 వార్డ్ డోక్లా ధనుశ్రీ C/O రామలక్ష్మి- రూ.30,000/-, 59 వార్డ్ పిళ్ళిచాతుర్య- రూ.20,000/-, 57వార్డ్ దండ్రురమేష్- రూ.52,660/-, 58 వార్డ్. చెక్కులను ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గణబాబు అందజేశారు. చెక్కులు అందుకున్న వారు మాట్లాడుతూ వైద్య సహాయం కోసం సీఎం చంద్రబాబు అందించిన నిధులు తమకు అందేలా కృషి చేసిన గణబాబుకి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో జనసేన ఇంచార్జ్ అంగ దుర్గా ప్రశాంతి, 63 కార్పొరేటర్ గల్లా చిన్న, శిరం. ఉమా మహేశ్వరి, రామ్మోహన్ నాయుడు,పోతబత్తుల శ్రీను, 57వార్డ్ అధ్యక్షుడు పెంటకోట అజయ్, 57వార్డ్ కార్పొరేటర్ మురు వాణి మరియు టీడీపీ జనసేన, బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.