Saturday, 4 April 2026

Blog

విశాఖపట్నం

బోరా వెంకట ప్రసాద్ యాదవ్ మెమోరియల్ క్రికెట్ టోర్నమెంట్ విజేత మహేష్ లెజెండ్స్

విశాఖ పట్నం పోర్ట్ స్టేడియంలో బుధవారం బోరా వెంకట ప్రసాద్ యాదవ్ జ్ఞాపకార్థం డాన్ ప్రసాద్ కుటుంబ సభ్యులు నిర్వహించిన, డాన్ ప్రసాద్ ప్రీమియం క్రికెట్ లీగ్ (డి పి పి ఎల్) పోటీలు రసవత్తరంగా సాగాయి..ఈ క్రికెట్ లీగ్ పోటీలకు ముఖ్య అతిథిగా విశాఖ పార్లమెంట్ అధ్యక్షులు గండి బాబ్జి విచ్చేశారు. ఈ క్రికెట్ పోటీలకు వివిధ ప్రాంతాల నుండి ఔత్సాహిక క్రికెట్ క్రీడాకారులు వారి వారి టీం లతో హాజరై క్రికెట్ పోటీలో తలపడ్డారు.ఆద్యంతం ఎంతో రసవత్తరంగా సాగిన క్రికెట్ టోర్నమెంట్ లో విజేతలుగా మహేష్ లెజెండ్స్ రన్నరప్ గా కే వి ఆర్ టైటాన్ లు నిలిచారు..ఈ టోర్నమెంట్ లో విజేతలుగా నిలిచిన టీమ్ కు ట్రోఫీ తో పాటు 1,00,000/- నగదు..రన్నరప్ గా నిలిచిన టీంకు 60,000/- నగదు ను ఉత్తమ బ్యాట్స్ మెన్ పి సాయి కు 3000/- ఉత్తమ బౌలర్ బి మనోహర్ కు 3000/- మ్యాన్ ఆఫ్ ద సిరీస్ ఓ వినయ్ కుమార్ 4000/- కు జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు గండి బాబ్జీ చేతులు మీదుగా అందించారు. ఈ క్రికెట్ టోర్నమెంట్ కు 54వ వార్డు అధ్యక్షులు కార్తీక్ కుట్ట, 48వ వార్డు అధ్యక్షులు గొర్లి అప్పారావు, 49వ వార్డు అధ్యక్షులు సంగు వాసు, కోన శ్రీను, కిషోర్ కవి, ఒడిస్సాల లక్ష్మణ్, జే.జే కుమార్, నాగు, డాన్ మిత్రులు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

విశాఖపట్నం

చిన్నారుల మధ్య స్నేహోత్సవం – సాల్మన్ రాజు జన్మదిన వేడుక ప్రత్యేకంగా

చిన్ననాటి స్నేహితుడు సాల్మన్ రాజు జన్మదినాన్ని పురస్కరించుకొని స్నేహితుల బృందం ఓ విశిష్టమైన సేవా కార్యక్రమాన్ని నిర్వహించింది. కేరిన్ లవ్‌లో బుద్ధి మాధ్యమం గల చిన్నారులతో కలిసి పండ్లు, స్నాక్స్ పంచి ఆనందాన్ని పంచుకున్నారు. ఆర్థిక సహాయం లేదా ఆడంబర వేడుకలకు బదులుగా ప్రేమ, మమకారం పంచుకునే ఈ కార్యక్రమం అందరి మనసులను కదిలించింది. చిన్నారుల మధ్య నవ్వులు పూయించడమే ఈ వేడుకకు అసలైన బహుమానమని స్నేహితులు పేర్కొన్నారు. సమాజంలో సేవా భావం పెంచే విధంగా ఈ చిన్న ప్రయత్నం నిలిచిపోతుందని పాల్గొన్న స్నేహితులు భావోద్వేగంతో తెలిపారు.

విశాఖపట్నం

జిల్లా లో ఈ నెల 17 నుండి 30 వరకు కుష్టువ్యాధి గుర్తింపు సర్వే.

విశాఖపట్నం నవంబర్ పున్నమి ప్రతినిధి:- జిల్లా లో ఈ నెల 17 నుండి 30 వరకు కుష్టువ్యాధి గుర్తింపు సర్వే. శరీరంపై స్పర్శ లేని మచ్చలుంటే తెలపండి. కలెక్టర్ MN హరేందిర ప్రసాద్. జిల్లాలోని ఈ నెల 17 నుండి 30 వ తేదీ వరకు కుష్టువ్యాధిని గుర్తించే కార్యక్రమం (LCDC) పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ అన్నారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ ఛాంబర్ లో కుష్టువ్యాధి సర్వే పై జిల్లా సమన్వయ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో కలెక్టర్ హారంధిర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పట్టణ, గ్రామీణ ఆరోగ్య కేంద్రాల పరిధి లోని ఆశా కార్యకర్తలు, మగ వాలంటీర్లు ఇంటింటికి వెళ్లి పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించాలన్నారు. ఎవరైనా తమ శరీరం పై స్పర్శ లేని మచ్చలు ఉన్నట్లయితే ఇంటికి వచ్చే వైద్య సిబ్బందికి తెలియ జేయాలన్నారు. ప్రాధమిక స్థాయిలోనే మచ్చలను గుర్తిస్తే అంగ వైకల్యం రాకుండా ,ఇతరులకు వ్యాపించకుండా ఉంటుందన్నారు.వసతిగృహాల్లో ఉండే పిల్లలను కూడా పరిశీలించాలన్నారు. ప్రతిరోజూ 30 నుండి 40 గృహాలను సందర్శించి వ్యాధి గ్రస్తులు ఉన్నట్లయితే గుర్తించి మందులు ఇవ్వాలన్నారు. మందులు ఉచితంగా ఇవ్వ బడతాయన్నారు. సిబ్బంది ఇంటికి వచ్చినపుడు వారికి సహకరించి తనిఖీ చేయించు కోవాలన్నారు. కుష్టు వ్యాధి నిర్మూలనకు మండల ,గ్రామ స్థాయి లో అధికారులు వైద్య సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా కుష్టు, క్షయ, ఎయిడ్స్ నియంత్రణ అధికారి డా.R .రమేష్, జిల్లా పరిషత్ సి. ఇ. ఓ. నారాయణ మూర్తి, సాంఘిక సంక్షేమ ఉప సంచాలకులు రామారావు,DNMO డా. పద్మావతి, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

ప్రకృతి రక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు — ప్రతి పౌరుడి బాధ్యత.

“ప్రకృతి రక్షణ కేవలం ప్రభుత్వ బాధ్యత కాదు — ప్రతి పౌరుడి బాధ్యత.” – డి ఎమ్ హెచ్ వో వెంకటేశ్వర రావు రాజమహేంద్రవరం : “వరల్డ్ వన్ హెల్త్ డే” పురస్కరించుకొని నవంబర్ 3 నుంచి 9 వరకు “వన్ హెల్త్” వారోత్సవ కార్యక్రమాలు జిల్లాలో నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కె. వెంకటేశ్వరరావు తెలిపారు . స్థానిక డి ఎమ్ హెచ్ వో కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమం లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డా కే. వెంకటేశ్వర రావు మాట్లాడుతూ, “ఆరోగ్యం మహాభాగ్యం. ఒకరి ఆరోగ్యాన్ని కాపాడితే, సమాజంలోని ప్రతి ఒక్కరి ఆరోగ్యాన్ని కాపాడినట్టే అవుతుందని తెలిపారు. ప్రకృతిని సంరక్షించడం ద్వారా మానవజీవితం సురక్షితమవుతుందని, చెట్లు నాటడం జీవరక్షణకు దారి తీస్తుందని ఆయన పేర్కొన్నారు. స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం ప్రకృతిని కాపాడినప్పుడే సాధ్యమవుతుందన్నారు. వ్యాయామం మరియు యోగా మన ఆరోగ్యానికి మూలాధారమని ఆయన తెలిపారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి పౌరుడు తన వంతు పాత్ర పోషించాలన్నారు. “వన్ వరల్డ్ హెల్త్ డే” సందర్భంగా ప్రజల్లో సామాజిక ఆరోగ్య అవగాహన పెంపొందించడం, పర్యావరణ పరిరక్షణపై చైతన్యం కల్పించడం ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం అన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జ్ జిల్లా ఇమ్యునైజేషన్ అధికారి డాక్టర్ షమ్మీకుమార్, డాక్టర్ శ్రీవల్లి (DPMU), సూపరింటెండెంట్ స్టాలిన్, సి.సి. రాజు, కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అన్నమయ్య

రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకోసమే ప్రత్యేక శిబిరాల నిర్వహణ జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్

రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకోసమే జిల్లాలోని మూడు రెవెన్యూ డివిజన్లలో ప్రత్యేక శిబిరాలను నిర్వహించడం జరుగుతోందని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు.బుధవారం జిల్లాలోని నందలూరు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చిన రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు కోసం ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరగగా.ఇందులో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రజల నుంచి వివిధ రకాల అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రజా ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించడం జరిగిందన్నారు.జిల్లా వ్యాప్తంగా మూడు రెవెన్యూ డివిజన్ల పరిధిలో మూడు ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరుగుతోందన్నారు.జిల్లాలో ప్రతి సోమవారం పి.జి.ఆర్.ఎస్ కు అందిన ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించడం పై ప్రత్యేక దృష్టి సారిస్తూ.జిల్లా వ్యాప్తంగా రాజంపేట,మదనపల్లి, రాయచోటి మూడు డివిజన్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించడం జరిగిందన్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌ ద్వారా ప్రజలు సమర్పించిన ఫిర్యాదులు ఏ స్థితిలో ఉన్నాయని, పెండింగ్‌లో ఉన్న ఫిర్యాదులపై స్పష్టత సాధించడం మరియు ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా వినడం వంటి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని,జిల్లా కలెక్టర్ స్వయంగా ఈ కార్యక్రమంపై దృష్టి సారించి, ప్రతి శాఖ విభాగాధికారికి ఫిర్యాదుల పరిష్కారంలో వేగం, ఖచ్చితత్వం, మరియు పారదర్శకతను పాటించే విధంగా చూడాలని సూచించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారిని కలిసిన రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి నేతల నాని గారు

ఈరోజు తాడేపల్లి పార్టీ కార్యాలయం లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారిని కలిసిన రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి నేతల నాని గారు… మెడికల్ కాలేజీల PPP విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తం గా నిర్వహిస్తున్న రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సోషల్ మీడియా పాత్ర అభినందనీయం అనిజగన్ కొనియాడారు అని ఆయన తెలియచేశారు సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఎదిరించి ప్రజలకు అండగా నిలబడాలి అని జగన్ గారు కోరినట్లు ఆయన తెలియచేశారు….

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారిని కలిసిన రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి నేతల నాని గారు

ఈరోజు తాడేపల్లి పార్టీ కార్యాలయం లో మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్ గారిని కలిసిన రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి నేతల నాని గారు… మెడికల్ కాలేజీల PPP విధానానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తం గా నిర్వహిస్తున్న రచ్చబండ కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో సోషల్ మీడియా పాత్ర అభినందనీయం అనిజగన్ కొనియాడారు అని ఆయన తెలియచేశారు సోషల్ మీడియా వేదికగా అధికార పార్టీ చేస్తున్న దుర్మార్గాలను ఎదిరించి ప్రజలకు అండగా నిలబడాలి అని జగన్ గారు కోరినట్లు ఆయన తెలియచేశారు….

అన్నమయ్య

అయ్యప్ప స్వామి రథోత్సవాన్ని ప్రారంభించిన మేడా విజయ శేఖర్ రెడ్డి

నందలూరు మండలం నాగిరెడ్డిపల్లి పంచాయతీ అరవపల్లి గ్రామంలో వెలసిన శ్రీశ్రీశ్రీ కృష్ణ గీతా మందిరం దగ్గర భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి రథోత్సవం కుర్రమణి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా టిడిపి పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మేడా విజయ శేఖర్ రెడ్డి పాల్గొన్నారు.అయ్యప్ప స్వామి రథోత్సవంలో ముందుగా అయిన టెంకాయ కొట్టి రథయాత్రను ఘనంగా ప్రారంభించారు.అనంతరం అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు.గ్రామంలోని అయ్యప్ప స్వామి భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.భక్తి పాటలతో నిర్వహించిన భజన బృందాన్ని తిలకరించారు.రథాన్ని ఘనంగా అలంకరించి ఊరేగింపుగా తీసుకెళ్లారు ఈ కార్యక్రమంలో నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ జంబు సూర్యనారాయణ,వక్ఫ్ బోర్డ్ మాజీ ప్రధాన కార్యదర్శి సయ్యద్ అమీర్,టీడీపీ బీసీ సెల్ రాష్ట్ర నాయకులు తాటి సుబ్బరాయుడు,బీజేపీ నాయకులు హిమగిరి నాథ్,తెలుగుదేశం పార్టీ నాయకులు మట్టి బాబు,మండెం నాగరాజు, ఉప్పు శెట్టి రెడ్డయ్య,పఠాన్ మహర్ ఖాన్,ఎల్లమ్మరాజు పల్లి శ్రీనివాసులు రెడ్డి,నితిన్, కొండిశెట్టి సుదర్శన్,తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

జనగాం

బేడ బుడగ జంగం జాతి ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పనిచేస్తూనే ఉంటాము.. బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప, రాష్ట్ర అధ్యక్షులు గగనం శేఖర్, యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వారణాసి శివవర్మ

పున్నమి: నవంబర్ 05 ప్రతినిధి: జనగాం జిల్లా: స్టేషన్ గన్పూర్: తెలంగాణ బేడ బుడగ జంగం జాతి ప్రజల కోసం చివరి రక్తపు బొట్టు వరకు పనిచేస్తూనే ఉంటాము అని బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు గగనం మంతప్ప, రాష్ట్ర అధ్యక్షులు గగనం శేఖర్ అన్నారు. ఆదివారం బేడ బుడగ జంగం హక్కుల పోరాట సమితి జనగాం జిల్లా నూతన కమిటీలను యూత్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు వారణాసి శివవర్మ, శ్రీకారం టీం ఆధ్వర్యంలో సమావేశం స్టేషన్ గన్పూర్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జనగాం జిల్లా నూతన కమిటీలు నియామకం చేశారు. బి జె హెచ్ పి ఎస్, జిల్లా అధ్యక్షులుగా పస్తం యాకయ్య, ప్రధాన కార్యదర్శిగా పస్తం రాజు, యూత్ ఫెడరేషన్ జిల్లా అధ్యక్షులుగా కళ్లెం శివ, జిల్లా కమిటీలకు 40 మందికి నియామక పత్రాలు అందజేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బేడ బుడగ జంగాలు రాజకీయ, ఆర్థిక సామాజికంగా ముందుకు తీసుకువెళ్లడంలో తమ వంతు పాత్ర వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఉపకులాల రాష్ట్ర అధ్యక్షులు సిరివాటి శ్రీనివాసులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు సిరివాటి రామకృష్ణ, యూత్ ఉపాధ్యక్షులు అశ్వ జమ్మన్న, వారణాసి రామకృష్ణ, ప్రసాద్, పస్తం బాలు, శ్రీహరి, కళ్లెం శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

తూర్పు గోదావరి

పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులోకి తేవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం -ఎమ్మెల్యే గోరంట్ల.

రాజమహేంద్రవరం రూరల్ : పేదలకు అందుబాటులో వైద్యం అందించాలనే ఏకైక లక్ష్యంతో ప్రభుత్వం వార్డులు వారిగా ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తుందని రాజమండ్రి రూరల్ శాసనసభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. స్థానిక 19వ డివిజన్ రైల్వే స్టేషన్ వద్ద ఉన్న మున్సిపల్ కళ్యాణ మండపంలో సఖి సురక్ష కార్యక్రమంలో భాగంగా మెప్మా ఆధ్వర్యంలో మహిళలకు ప్రభుత్వం ద్వారా బుధవారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. మహిళలకు స్క్రీన్ టెస్ట్ లు అవసరమైన వారికి మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్పొరేట్ వైద్యం అంధక ఏ ఒక్కరు ఇబ్బందులు పడకూడదనే లక్ష్యంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని అన్నారు. అవసరమైన వారికి వైద్యం అందించనున్నట్లు పేర్కొన్నారు . ఈ 14 నెలల కాలంలో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా రెండు కోట్ల రూపాయలు నిధులు ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ప్రజల ఆరోగ్యానికి చర్యలు చేపడుతుందన్నారు. శీలం గోవింద్, నిమ్మలపూడి గోవింద్, రొంపిచర్ల ఆంటోనీ, కొప్పిశెట్టి చిన్ని, కక్కల రమేష్, చిట్టిబోయిన శ్రీనివాస్, ఏడాకుల వెంకటేశ్వరరావు, కుంచె హనుమంతరావు, నరసింహమూర్తి, చలమూరి సత్యనారాయణ, సింగవరపు సత్యనారాయణ, కేత అప్పారావు, పాలిక వెంకటరమణ, వాసు, కుసుమ, మెప్మా సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.