Saturday, 4 April 2026

Blog

తిరుపతి

పాఠశాల నిర్వహుకులతో ఆర్.టి.ఓ ప్రత్యేక సమావేశం

శ్రీకాళహస్తి నవంబర్ 06 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి మోటారు వాహన తనిఖీ కార్యాలయంలో గురువారం నాడు శ్రీకాళహస్తి పరిధిలోని పాఠశాల, కళాశాలల ర్వహుకులతో ఆర్.టి.ఓ ప్రత్యేక సమావేశం నిరవహించడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతము అన్ని స్కూల్ బస్సులు భద్రతాపరమైన తనిఖీలు చేయవలసిన అవసరం ఉందని అలాగే కొత్త బస్సులన్నిటికీ ఫైర్ అలారం సిస్టం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టం ఏర్పాటు చేసి ఉండాలని తెలిపారు. 2019 కంటే పాత వాహనాలకి ఈ సిస్టము అవసరం లేదు కానీ అన్ని బస్సులకి రెండు అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర ద్వారం ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో అద్దాన్ని పగలగొట్టి బయటకు రావడానికి డైమండ్ ఎడ్జ్ హేమర్ ప్రతి వాహనంలో అమర్చాలని తెలిపారు. ప్రతి డ్రైవరు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక యంత్రాన్ని ఎలా వాడాలో తెలుసుకొని ఉండాలని ప్రమాద సమయంలో విద్యార్థులను త్వరితగతిన బస్సు నుండి బయటకు పంపాలని పాఠశాల యాజమాన్యాలు వారికి ఉన్న ప్రతి బస్సును భద్రతాపరమైన అన్ని అంశాలు చట్ట ప్రకారం ఉండేటట్లు చూసుకోవాలని ఆదేశించారు. ఏ విధమైన లోటుపాట్లు ఉన్న ఎడల సరి చేసుకోవాలని తనిఖీలలో పట్టుబడిన యెడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పరిధిలోని కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శివారులో కారు బోల్తా ..గేదెను తప్పించబోయి అదుపు తప్పిన కారు: భార్యాభర్తలకు గాయాలు

పట్టణ శివారులోని ముత్తగూడెం పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు గాయపడినట్లు సమాచారం. రోడ్డుపై అకస్మాత్తుగా అడ్డంగా వచ్చిన గేదెను తప్పించబోయే క్రమంలో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. కారు భద్రాచలానికి చెందినదిగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ప్రమాదంలో గాయపడ్డారు. ​ జరిగిన వెంటనే స్థానికులు వారిని రక్షించి, తిరువూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ​ప్రస్తుతం క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కామారెడ్డి

కళ్యాణ లక్ష్మి భరోసా పేదలకు మేలు

– కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి 6 నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, అన్నారం గ్రామంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా ‘కళ్యాణ లక్ష్మి’ చెక్కుల పంపిణీ కార్యక్ర మం ఘనంగా నిర్వహించబడింది. గ్రామ రైతువేధికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన లబ్దిదారులకు చెక్కులు అందజే సి అనేక మంది కడుపుని ఆనందపరిచారు.మండ లంలోని అన్నారం గ్రామంలో ‘కళ్యాణ లక్ష్మి’ పథకా నికి సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు ఎ మ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అందజేశా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,లబ్ది దారులు, మహిళలు, ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రజలకు మరింత సేవలందించేందుకు తన పరంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణరెడ్డి అన్నారు. ప్రజా స్పందన కార్యక్ర మానికి విచ్చేసిన లబ్దిదారు లు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపా రు.ప్రజలు ప్రభుత్వ పథకాల పరంగా మరిన్ని లబ్ధు లు పొందాలని, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రతి కుటుంబానికి మేలు చేయాలనే ఆకాంక్ష లబ్దిదారు లలో వ్యక్తమైంది.ఇలాంటి పథకాల ద్వారా ఆర్థికం గా వెనుకబడిన కుటుంబాలకు పెద్ద వసతి కలుగు తోందని గ్రామ మహిళలు అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నా రు.

కుమురం భీమ్ ఆసిఫాబాద్

మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం ఇచ్చిన టి డబ్ల్యూ జె ఎఫ్.

కాగజ్నగర్,నవంబర్ 6 : కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ పట్టణంలోని మునిసిపల్ కార్యాలయంలో కూర్చోవడానికి కుర్చీలు లేక వివిధ పనులపై కార్యాలయానికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ మధ్యకాలంలో ఒక వృద్ధ మహిళ మున్సిపల్ కార్యాలయానికి వచ్చి నిలబడి,నిలబడి ఓపిక నశించి స్పృహతప్పి పడిపోవడం జరిగింది. కావున వెంటనే సంబంధిత అధికారులు, మున్సిపల్ కమిషనర్ స్పందించి మున్సిపల్ కార్యాలయానికి వివిధ పనులపై వచ్చే ప్రజలకు మెరుగైన వసతులు కల్పించాలని ముఖ్యంగా కూర్చోవడానికి కుర్చీలు ఏర్పాటు చేయాలని కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా తెలంగాణ వర్కింగ్ జర్నలిస్టు ఫెడరేషన్ తరపున కాగజ్నగర్ మున్సిపల్ కమిషనర్ రాజేందర్ కు ఈరోజు గురువారం వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిడబ్ల్యూజేఎఫ్ జిల్లా అధ్యక్షులు వడ్నాల వెంకన్న, కార్యదర్శి వంగరి ప్రవీణ్, జాయింట్ సెక్రెటరీ కడారి శ్రీనివాస్, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఈర్ల సునీల్ కుమార్, రాష్ట్ర కమిటీ సభ్యులు తాజ్ ఖాన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రదీప్ పాల్గొన్నారు.

జోగులాంబ గద్వాల

రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు జరగాలి..గద్వాల్ కలక్టర్ సంతోష్.

గద్వాల్ నవంబర్ 6(పున్నమి ప్రతినిధి) *రైతులకు ఇబ్బందులు కలగకుండా పత్తి కొనుగోలు జరగాలి..గద్వాల్ కలక్టర్ సంతోష్. రాష్ట్ర వ్యాప్తంగా మిల్లుల యజమానులు తలపెట్టిన సిసిఐ కొనుగోళ్ల బంద్ ను ఉపసంహరించుకోవడం జరిగిందని, ఈ నెల 6వ తేది నుండి యధావిధిగా పత్తి కొనుగోలు ప్రక్రియ జరుగుతుందని రైతులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా జిన్నింగ్ మిల్లుల యజమానులు కొనుగోలు ప్రక్రియను సజావుగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి.యం.సంతోష్ తెలిపారు. అకాల వర్షాల వలన ప్రస్తుత పత్తి కొనుగోలు సీజన్‌ కు సంబంధించిన ఏర్పాట్లు, రైతులకు సరైన ధర (MSP) చెల్లింపు, కొనుగోలు కేంద్రాల వద్ద సౌకర్యాల ఏర్పాటు, తూకం చెల్లింపు ప్రక్రియల పారదర్శకంగా నిర్వహించాలని ఆన్నారు. మద్దతు ధరలకు కొనుగోళ్లు జరిగేలా చూడాలని, రైతులకు అన్ని సదుపాయాలు కల్పించాలని పత్తి కొనుగోళ్లు సీసీఐ ద్వారా మద్దతు ధరలకు పత్తి కొనుగోళ్లు సజావుగా జరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కొనుగోలు కేంద్రాలలో కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి సీసీఐ అధికారులు, జిన్నింగ్ మిల్లుల యజమానులు, ఇతర అధికారుల మధ్య సమన్వయం అవసరమని ఆయన అన్నారు. పత్తి కొనుగోలు ప్రక్రియను రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా, పారదర్శకంగా, వేగంగా జరిగేలా సంబంధిత శాఖాధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సీసీఐ అధికారులు మిల్లుల యజమానులు రైతులకు తగిన మద్దతు ధర చెల్లించడం, తేమ శాతం (Moisture Content) పరిశీలనలో నిబంధనలు పాటించడం, బరువు తూకం పట్ల సక్రమంగా వ్యవహరించాలని సూచించారు.

తెలంగాణ

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆలంపూర్ శాసనసభ్యులు విజయుడు*

తెలంగాణా నవంబర్ 6( పున్నమి ప్రతినిధి) *జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆలంపూర్ శాసనసభ్యులు విజయుడు* *ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ప్రాతినిథ్యం వహిస్తున్న బూత్ లలో ఎన్నికల ప్రచారం* జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలలో మాగంటి సునీతమ్మ గెలుపు కొరకు ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి ఇన్చార్జి వహిస్తున్న 274 నుండి 282 బూతులలో నిర్వహించిన ఎన్నికల ప్రచారం పాల్గొన్నారు అలంపూర్ శాసనసభ్యులు విజయుడు షాద్నగర్ బిఆర్ఎస్ నాయకులు, రామకృష్ణ,తాండ్ర విష్ణువర్ధన్ రెడ్డి, రవీందర్ రెడ్డి,శేఖర్ పంతులు,రాంచందర్,భూత్ ఇన్చార్జులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

కోటి సంతకాలు కార్యక్రమంలో కాకాణి గోవర్ధన్ రెడ్డి

*SPS నెల్లూరు జిల్లా:* *తేది:06-11-2025* *సర్వేపల్లి నియోజకవర్గం, మనుబోలు మండలం ‌ జట్ల కొండూరు పంచాయతీ ‌ కొండూరు సత్రం గ్రామంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రివర్యులు మరియు ఉమ్మడి నెల్లూరు జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డా౹౹ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారు.*

E-పేపర్

మండల ప్రవాస అను కార్యక్రమాన్ని* దిగ్విజయంగా నిర్వహించారు

బిజెపి రాష్ట్ర పార్టీ మరియు జిల్లా పార్టీ ఆదేశాల మేరకు ఈరోజు రైల్వే కోడూరు నియోజకవర్గం, రైల్వే కోడూరు నవంబర్ పున్నమి ప్రతినిధి రైల్వే కోడూరు నియోజకవర్గ o ఓబులవారిపల్లి మండలం లో ఉదయం *మండల ప్రవాస అను కార్యక్రమాన్ని* దిగ్విజయంగా నిర్వహించుకొని మధ్యాహ్నం ముఖ్య అతిధి*గౌ,,తోట శ్రీనివాసులు తో కలసి వర్షాలు వల దెబ్బ తిన్న తొమలపాకు తోటలు పరిశీలించడం మరియు సీనియర్ నాయకులను ఇంటి కి వెళ్లి వారితో పార్టీ కార్యక్రమల గురించి చర్చించడం,ఆత్మనిర్భరభారత్ ఇంటింటా స్వదేశీ- ప్రతి ఇంట స్వదేశీ పేరుతో వ్యాపారస్థుల షాపులు దగరికి వెళ్లి స్వదేశీ వస్తువులు అమ్మడం వల మనకు ఎలాంటి లాభాలు వస్తాయి వారికి వివరించడం కార్యక్రమం నిర్వహించడం జరిగింది. *ఈ కార్యక్రమం మండల అధ్యక్షులు ముక్క రూపేష్ రెడ్డి పర్యవేక్షణలో* మాజీ నియోజకవర్గం ఇంచార్జి,, మండల పదాధికారులు మరియు సీనియర్ నాయకులు తో పాటు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు .

విశాఖపట్నం

విశాఖ రియల్ ఎస్టేట్ ‘హై రైజ్’* – స్కైస్క్రాపర్ సిటీగా ఎదుగుతున్న విశాఖ!

*విశాఖ రియల్ ఎస్టేట్ ‘హై రైజ్’* – స్కైస్క్రాపర్ సిటీగా ఎదుగుతున్న విశాఖ! * *పున్నమి స్టాప్ రిపోర్టర్ : యామల రామమూర్తి ;** ​విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ ఆర్థిక రాజధాని విశాఖపట్నం రియల్ ఎస్టేట్ రంగంలో కొత్త శిఖరాలను చేరుకుంటోంది. నగర స్వరూపం వేగంగా మారుతూ ‘స్కైస్క్రాపర్ సిటీ’గా అవతరిస్తోంది. విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎమ్‌ఆర్‌డీఏ) ఏకంగా యాభై అంతస్తుల వరకూ భవనాలకు అనుమతులు ఇస్తుండటంతో, హై-రైజ్ రెసిడెన్షియల్ ప్రాజెక్టుల నిర్మాణం శరవేగంగా సాగుతోంది. ​25 నుంచి 50 అంతస్తుల వరకు ఉన్న ఈ హై-రైజ్ భవనాలు నలుమూలలా రూపుదిద్దుకుంటున్నాయి. ముఖ్యంగా మధురావాడ, యెండాడ, సిరిపురం వంటి ప్రధాన ప్రాంతాల్లో ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు పునాదులు పడ్డాయి. 2025లో అనుమతులు పొందిన ప్రాజెక్టులు 2026-28 మధ్య కాలంలో పూర్తి కావచ్చని రియల్ ఎస్టేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ​50 అంతస్తుల మెగా ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ​విశాఖ రియల్ ఎస్టేట్ చరిత్రలో ఒక మైలురాయిగా, వీఎమ్‌ఆర్‌డీఏ జూలై 2025లో 50 అంతస్తుల అపార్టుమెంట్ కాంప్లెక్స్‌కు అనుమతి ఇచ్చింది. మధురవాడలోని సర్వే నంబర్ 331/1లో 4.07 ఎకరాల్లో ఆరు 50 అంతస్తుల రెసిడెన్షియల్ టవర్లను నిర్మిస్తున్నారు. ​అందుబాటులో ఉండే అపార్ట్‌మెంట్లు: 3బీహెచ్‌కే, 4బీహెచ్‌కే, 4బీహెచ్‌కే డూప్లెక్స్. ​ప్రీమియం అమెనిటీలు: క్లబ్‌హౌస్, స్విమ్మింగ్ పూల్, పూల్ డెక్, జాగింగ్ & సైక్లింగ్ ట్రాక్‌లు, చైల్డ్రన్ ప్లే ఏరియాలు వంటి అత్యాధునిక సౌకర్యాలు ఈ ప్రాజెక్ట్‌లో భాగంగా ఉండనున్నాయి. ​ఈ ప్రాజెక్ట్ పూర్తయితే, ఇది ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత ఎత్తైన రెసిడెన్షియల్ ప్రాజెక్టుగా నిలవనుంది. ​స్కైలైన్‌ను మారుస్తున్న స్థానిక డెవలపర్లు ​విశాఖలోని ప్రముఖ డెవలపర్లు సైతం 25+ అంతస్తుల హై-రైజ్‌ అపార్టుమెంట్ల నిర్మాణాన్ని చేపట్టారు. ఇప్పటికే ఆరేడు ప్రాజెక్టులు ప్రారంభమయ్యాయి. ఇవి అన్నీ కలిసి విశాఖ స్కైలైన్‌ను మార్చేసి, మధ్యతరగతి, హై-ఎండ్ కుటుంబాలకు అత్యంత ఆకర్షణీయమైన నివాస ఎంపికలుగా మారనున్నాయి. ​హై-డెన్సిటీ అర్బన్ హబ్‌గా విశాఖ ​రియల్ ఎస్టేట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ హై-రైజ్ ప్రాజెక్టులు విశాఖ నగరాన్ని హై-డెన్సిటీ అర్బన్ హబ్‌గా మలుస్తాయి. ముఖ్యంగా ఐటీ కారిడార్ మరియు సుందరమైన బీచ్‌ల సమీపంలో ఈ ప్రాజెక్టులు రావడంతో వీటి ఆకర్షణ మరింత పెరిగింది. ఈ నిర్మాణ రంగ విప్లవంతో విశాఖపట్నం త్వరలోనే హైదరాబాద్, చెన్నై వంటి మెగా సిటీలతో పోటీ పడేందుకు సిద్ధమవుతోందని చెప్పవచ్చు.

E-పేపర్

రాత్రి క్షుద్రపూజల కలకాలం.

వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలోని నిర్మానుష్య ప్రాంతంలో కార్తీక పౌర్ణమి కావడంతో చుట్టు చెట్ల మధ్యన రాత్రి క్షుద్రపూజల కలకలం…దీపం కలశంతో ఎదో జంతువుని బలిహారణ చేసినట్లు ఆనవాళ్లు..! భయాందోళనకు గురవుతున్న ప్రజలు. గతంలోనూ ఇలానే జరిగినట్లు చెబుతున్న గ్రామస్తులు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.