Saturday, 4 April 2026

Blog

విశాఖపట్నం

గాజువాకలో “నా… కార్యకర్త” పోస్టర్ ఆవిష్కరణ ఘనంగా

గాజువాక, నవంబర్ 6 (ప్రత్యేక ప్రతినిధి) తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు, గాజువాక ఎమ్మెల్యే శ్రీ పల్లా శ్రీనివాసరావు ఆదేశాల మేరకు చేపట్టిన “నా… కార్యకర్త” కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ ఈ రోజు గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక సమన్వయకర్త, APIIC డైరెక్టర్ శ్రీ ప్రసాదుల శ్రీను పాల్గొని పోస్టర్‌ను ఆవిష్కరించారు. అలాగే ఏపీ గ్రీనింగ్ అండ్ బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ మురళి మొల్లి పెంటరాజు ప్రత్యేక అతిథిగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ సందర్భంగా ప్రసాదుల శ్రీను మాట్లాడుతూ, “తెలుగుదేశం పార్టీ బలం కార్యకర్తల్లోనే ఉంది. ప్రతి కార్యకర్త పార్టీకి వెన్నెముక. ‘నా… కార్యకర్త’ కార్యక్రమం ద్వారా కార్యకర్తలతో నేరుగా మమేకమై వారి సేవలను గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యమని” తెలిపారు. మొల్లి పెంటరాజు మాట్లాడుతూ, ఎమ్మెల్యే. “పల్లా శ్రీనివాసరావు నాయకత్వంలో గాజువాకలో అభివృద్ధి మాత్రమే కాదు, కార్యకర్తల ఉత్సాహం కూడా కొత్త స్థాయికి చేరుకుంది. పార్టీ బలోపేతానికి ఇలాంటి కార్యక్రమాలు కీలకం” అని పేర్కొన్నారు.

మేడ్చల్ – మల్కాజిగిరి

*✒️- HYD కూకట్ పల్లి పరిధి జగద్గిరిగుట్ట లో నడిరోడ్డుపై యువకుడిపై కత్తితో దాడి*

కూకట్ పల్లి* పరిధిలోని జగద్గిరిగుట్ట బస్టాండ్ వద్ద ఓ యువకుడిపై ఇద్దరు వ్యక్తులు కత్తులతో దాడి చేసిన ఘటన కలకలం రేపింది. దాడిలో యువకుడు తీవ్రంగా గాయపడగా, అక్కడున్న వారు అతడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు. దాడి చేసిన దుండగులు ఘటన తర్వాత అక్కడినుంచి పరారయ్యారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో భయానక వాతావరణం నెలకొంది~

తెలంగాణ

17 శాతం తేమ ఉండే విధంగా చూడాలన్న : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) వర్షాలు తగ్గినందున 17% తేమ వచ్చే విధంగా రైతులు కొనుగోలు కేంద్రాలలో ఉన్న ధాన్యాన్ని బాగా ఆరబెట్టాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రైతులకు సూచించారు. సరైన తేమశాతం, నాణ్యత ప్రమాణవతో ఉన్న ధాన్యాన్ని తక్షణమే కొనుగోలు చేసి మిల్లులకు పంపించాలని, ఇందుకుగాను అవసరమైన లారీలు, హమాలీలు, కాంటాలు అన్ని సిద్ధంగా ఉంచుకోవాలని నిర్వాహకులను ఆదేశించారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

చేయూత అవార్డు గ్రహీతలుగా’ 8వ వార్షికోత్సవానికి ఎంపికైన రఘురామయ్య గారు, శ్రీనివాసరావు గార్కి హృదయపూర్వక అభినందనలు

చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ 8వ వార్షికోత్సవానికి హృదయపూర్వక ఆహ్వానం కాకినాడ పాత బస్ స్టాండ్ సమీపంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో జరగబోయే చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ 8వ వార్షికోత్సవం సందర్భంగా మన అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము. ఈ కార్యక్రమం 2025 నవంబర్ 8వ తేదీ, శనివారం ఉదయం 9:30 గంటలకు ఘనంగా ప్రారంభమవుతుంది. ఉదయం 9:30 గంటలకు ప్రారంభోత్సవం, 10:00 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు, 10:30 గంటలకు అతిథులకు ఆహ్వానం, ప్రార్థన మరియు జ్యోతి ప్రజ్వలన, 11:00 గంటలకు చేయూత సంస్థ ద్వారా లబ్ధిపొందిన వారి స్పందనలు, 11:30 గంటలకు ప్రముఖ అతిథుల సందేశాలు, తదుపరి 12:00 గంటలకు విద్యా, వైద్యం మరియు ఉపాధి కల్పనకై లబ్ధిదారులకు చెక్కులు అందజేత కార్యక్రమం జరుగుతుంది. కార్యక్రమానంతరం విందు ఏర్పాటు చేయబడింది. ఈ సందర్భం లో శ్రీ N. రఘురామయ్యగారు (SA, MPPS అప్పనపల్లి) మరియు శ్రీ K. శ్రీనివాసరావు గారు (SA, ZPHS గోగన్నమటం) చేయూత అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణం. వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము. జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు, ఆదర్శ రైతులు మరియు సమాజసేవకులు సన్మానించబడనున్నారు. ఈ పుణ్య సందర్భంలో తామందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరుచున్నాము. ఆహ్వానించువారు: యమ్.ఎ. ఆలీమ్, ప్రధాన కార్యదర్శి 9989951788 డా. యమ్. రవి కుమార్, వ్యవస్థాపక అధ్యక్షులు 90306 11400 మరియు చేయూత సంస్థ కార్యవర్గ సభ్యులు చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ – అవసరంలో ఉన్నవారికి చేయూతగా నిలుస్తూ, సమాజ upliftment దిశగా అష్టదిక్కులా వెలుగులు నింపుతూ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనమందరం భాగస్వాములమవుదాం!

ఆంధ్రప్రదేశ్

శ్రీసిటీని సందర్శించిన ఏపీ ఎన్నికల కమిషనర్

శ్రీసిటీ, నవంబర్ 06, 2025: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్నే, తన భర్త, కేంద్ర ఎలక్ట్రానిక్స్ & ఐటీ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అజయ్ ప్రకాశ్ సాహ్నేతో కలిసి గురువారం శ్రీసిటీని సందర్శించారు. శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి ఆమెకు సాదర స్వాగతం పలికి, శ్రీసిటీ ప్రగతి, ప్రత్యేకతలను వివరించారు. పరిశ్రమల అభివృద్ధితో పాటు “మేక్ ఇన్ ఇండియా” కార్యక్రమానికి సహకారం, ఉపాధి సృష్టి మరియు ప్రాంతీయ ఆర్థిక అభివృద్ధిలో శ్రీసిటీ కీలక పాత్రను వివరించారు. గతంలో అజయ్ సాహ్నే విలువైన సూచనలతో సాంకేతిక, తయారీ రంగాల్లో శ్రీసిటీకి నూతనోత్సాహం తెచ్చిందని డాక్టర్ సన్నారెడ్డి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆమె చొరవతో ట్రిపుల్-శ్రీసిటీలో జ్ఞాన్ సర్కిల్ వెంచర్స్ స్థాపన, ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్ (EMC) అభివృద్ధి శ్రీసిటీ ప్రగతిలో మైలురాళ్లుగా పేర్కొన్నారు. శ్రీసిటీ పెట్టుబడుల అనుకూల వాతావరణం, ప్రపంచ స్థాయి మౌళిక సదుపాయాలను నీలం సాహ్నీ ప్రశంసించారు. అంతర్జాతీయ వ్యాపార కేంద్రంగా శ్రీసిటీ అభివృద్ధి చెందడం ఆనందంగా వుందన్న ఆమె, ఇందులో భాగస్వామ్యులైన వారందరికీ అభినందనలు తెలిపారు. శ్రీసిటితో తన సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తుచేసుకున్న ప్రకాశ్ సాహ్నే, ఈ సందర్శన ఎంతో మధురానుభూతిని మిగిల్చిందన్నారు. శ్రీసిటీ ప్రగతి ప్రయాణం ఇతర పారిశ్రామికవేత్తలకు ఆదర్శంగా నిలుస్తుందని చెప్పారు. ఈ పర్యటనలో భాగంగా అతిథులు శ్రీసిటీ పరిసరాలతో పాటు ఆల్స్టమ్, హంటర్ డగ్లస్ పరిశ్రమలను సందర్శించారు.

జోగులాంబ గద్వాల

దొరికిన డబ్బులను ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు కు అప్పగించిన మహిళలు* *నిజాయితీని చాటుకున్న మహిళలను అభినందించిన ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు

గద్వాల్ నవంబర్ 6(పున్నమి ప్రతినిధి) *దొరికిన డబ్బులను ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు కు అప్పగించిన మహిళలు* *నిజాయితీని చాటుకున్న మహిళలను అభినందించిన ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు* జోగులాంబ గద్వాల జిల్లా: గద్వాల పట్టణంలోని బాలికల పాఠశాల ముందు 5,000/- ఎవరివో గుర్తుతెలియని వ్యక్తులవి పడిపోయినాయి. అదే దారిలో ముగ్గురు మహిళలు వస్తుండగా అట్టి డబ్బులు వాళ్లకు దొరకడం జరిగింది. ఇట్టి డబ్బులను పక్కనే ఉన్న ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో ట్రాఫిక్ ఎస్.ఐ బాలచంద్రుడు కి అప్పగించడం జరిగింది. అమౌంట్ పోగొట్టుకున్న వారు గద్వాల పట్టణ ట్రాఫిక్ ఎస్.ఐ బాలచంద్రుడు ను సంప్రదించగలరు. డబ్బులు దొరికిన వెంటనే ట్రాఫిక్ ఎస్ఐకి అందించి నిజాయితీని చాటుకున్న మహిళలకు ట్రాఫిక్ ఎస్ఐ అభినందించారు.

జోగులాంబ గద్వాల

మధ్యాహ్నం భోజనం వర్కర్స్ పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలి. TUCI

గద్వాల్ నవంబర్ 6 (పున్నమి ప్రతినిధి) మధ్యాహ్నం భోజనం వర్కర్స్ పెండింగ్లో ఉన్న బిల్లులను తక్షణమే విడుదల చేయాలి తెలంగాణ ప్రగతిశీల మధ్యాహ్నం భోజన వర్కర్స్ యూనియన్ (అనుబంధ TUCI) సంగం ఆధ్వర్యంలో ఆన్ని పాఠశాలలో నవంబర్ 10వ తేదీన అన్ని పాఠశాలలో బందుకు పిలుపునివ్వడం జరిగింది అందులో భాగంగా మధ్యాహ్న వంట బందు చేసి నిరసన చేయాలని పిలుపునివ్వడం జరిగింది ఈరోజు గద్వాల జిల్లా DEO గారికి బందుకు సంబంధించిన వినతి పత్రం ఇవ్వడం జరిగింది జిల్లా వ్యాప్తంగా దాదాపుగా 9 నెలల బిల్లులు పెండింగ్లో ఉన్న పట్టించుకోని ఉన్నత అధికారులు కొన్ని జిల్లాలో ఆగస్టు నెల వరకు బిల్లులు మంజూరైనప్పటికి గద్వాల జిల్లాలో ఇంతవరకు బిల్లులు విడుదల కాలేదు గుడ్డు బిల్లుకు సంబంధించి దాదాపుగా సంవత్సరం కావస్తున్న బిల్స్ చెల్లించడం లేదు కావున వెంటనే మధ్యాహ్నం భోజనం బిల్లులను విడుదల చేయాలి డిమాండ్ చేస్తున్నాం ఈ కార్యక్రమంలో TUCI జిల్లా అధ్యక్షుడూ హనుమంతు మధ్యాహ్నం భోజనం వర్కర్స్ జిల్లా అధ్యక్షులు ఉప్పెర్ కృష్ణ, హరీష్ , రాజు ,శివ, ప్రేమ రాజు, పాల్గొన్నారు

తిరుపతి

పాఠశాల నిర్వహుకులతో ఆర్.టి.ఓ ప్రత్యేక సమావేశం

శ్రీకాళహస్తి నవంబర్ 06 , పున్నమి న్యూస్ : శ్రీకాళహస్తి మోటారు వాహన తనిఖీ కార్యాలయంలో గురువారం నాడు శ్రీకాళహస్తి పరిధిలోని పాఠశాల, కళాశాలల ర్వహుకులతో ఆర్.టి.ఓ ప్రత్యేక సమావేశం నిరవహించడం జరిగింది. ఈ సమావేశంలో శ్రీకాళహస్తి మోటార్ వాహన తనిఖీ అధికారి దామోదర్ నాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుతము అన్ని స్కూల్ బస్సులు భద్రతాపరమైన తనిఖీలు చేయవలసిన అవసరం ఉందని అలాగే కొత్త బస్సులన్నిటికీ ఫైర్ అలారం సిస్టం, ఫైర్ ప్రొటెక్షన్ సిస్టం ఏర్పాటు చేసి ఉండాలని తెలిపారు. 2019 కంటే పాత వాహనాలకి ఈ సిస్టము అవసరం లేదు కానీ అన్ని బస్సులకి రెండు అగ్నిమాపక యంత్రాలు, అత్యవసర ద్వారం ఉండాలని తెలిపారు. అత్యవసర పరిస్థితులలో అద్దాన్ని పగలగొట్టి బయటకు రావడానికి డైమండ్ ఎడ్జ్ హేమర్ ప్రతి వాహనంలో అమర్చాలని తెలిపారు. ప్రతి డ్రైవరు అనుకోని ప్రమాదం జరిగినప్పుడు అగ్నిమాపక యంత్రాన్ని ఎలా వాడాలో తెలుసుకొని ఉండాలని ప్రమాద సమయంలో విద్యార్థులను త్వరితగతిన బస్సు నుండి బయటకు పంపాలని పాఠశాల యాజమాన్యాలు వారికి ఉన్న ప్రతి బస్సును భద్రతాపరమైన అన్ని అంశాలు చట్ట ప్రకారం ఉండేటట్లు చూసుకోవాలని ఆదేశించారు. ఏ విధమైన లోటుపాట్లు ఉన్న ఎడల సరి చేసుకోవాలని తనిఖీలలో పట్టుబడిన యెడల వాహనాలను సీజ్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి పరిధిలోని కళాశాలల కరస్పాండెంట్లు, ప్రిన్సిపాల్స్ పాల్గొన్నారు.

ఎన్ టి ఆర్ జిల్లా

శివారులో కారు బోల్తా ..గేదెను తప్పించబోయి అదుపు తప్పిన కారు: భార్యాభర్తలకు గాయాలు

పట్టణ శివారులోని ముత్తగూడెం పెట్రోల్ బంక్ ఎదురుగా ఒక కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో భార్యాభర్తలు గాయపడినట్లు సమాచారం. రోడ్డుపై అకస్మాత్తుగా అడ్డంగా వచ్చిన గేదెను తప్పించబోయే క్రమంలో కారు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన జరిగింది. కారు భద్రాచలానికి చెందినదిగా గుర్తించారు. కారులో ప్రయాణిస్తున్న భార్యాభర్తలు ప్రమాదంలో గాయపడ్డారు. ​ జరిగిన వెంటనే స్థానికులు వారిని రక్షించి, తిరువూరులోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్చారు. ​ప్రస్తుతం క్షతగాత్రుల ఆరోగ్య పరిస్థితి, పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కామారెడ్డి

కళ్యాణ లక్ష్మి భరోసా పేదలకు మేలు

– కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి కామారెడ్డి 6 నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండలం, అన్నారం గ్రామంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి చేతుల మీదుగా ‘కళ్యాణ లక్ష్మి’ చెక్కుల పంపిణీ కార్యక్ర మం ఘనంగా నిర్వహించబడింది. గ్రామ రైతువేధికలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన లబ్దిదారులకు చెక్కులు అందజే సి అనేక మంది కడుపుని ఆనందపరిచారు.మండ లంలోని అన్నారం గ్రామంలో ‘కళ్యాణ లక్ష్మి’ పథకా నికి సంబంధించిన చెక్కులను లబ్దిదారులకు ఎ మ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డి అందజేశా రు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,లబ్ది దారులు, మహిళలు, ప్రభుత్వ పథకాలను గ్రామ స్థాయిలో అందుబాటులోకి తీసుకురావడమే దీని ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. ప్రజలకు మరింత సేవలందించేందుకు తన పరంగా కృషి చేస్తానని ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణరెడ్డి అన్నారు. ప్రజా స్పందన కార్యక్ర మానికి విచ్చేసిన లబ్దిదారు లు, స్థానిక ప్రజలు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపా రు.ప్రజలు ప్రభుత్వ పథకాల పరంగా మరిన్ని లబ్ధు లు పొందాలని, కళ్యాణ లక్ష్మి వంటి పథకాలు ప్రతి కుటుంబానికి మేలు చేయాలనే ఆకాంక్ష లబ్దిదారు లలో వ్యక్తమైంది.ఇలాంటి పథకాల ద్వారా ఆర్థికం గా వెనుకబడిన కుటుంబాలకు పెద్ద వసతి కలుగు తోందని గ్రామ మహిళలు అన్నారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, అధికారులు, గ్రామ ప్రజలు పాల్గొన్నా రు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.