Saturday, 4 April 2026

Blog

తిరుపతి

యోగులపర్వతం పై కార్తీక దీపోత్సవం

యోగులపర్వతం పై కార్తీక దీపోత్సవం మహాదీపాన్ని వెలిగించిన శ్రీ ప్రతాప్ స్వామీజీ రామచంద్రాపురం మండలం పున్నమి ప్రతినిధి (రోసిరెడ్డి ) ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పూజ్యశ్రీ ప్రతాప్ స్వామి దివ్య ఆశీస్సులతో, శివకేశువులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసం కార్తీక పౌర్ణమి సందర్భంగా పవిత్ర యోగులపర్వతం పై కార్తీక దీపోత్సవం జరిగింది. ఉదయం నుంచే యోగుల పర్వతంపై వెలిసి ఉన్న శ్రీ మహాగణపతి స్వామికి, శ్రీ బాలసుబ్రమణ్య స్వామికి, మహా శివునికి, నాగదేవతలకు, శ్రీవారి పాదాలకు సుగంధ ద్రవ్యాలతో విశేషాలు అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం ఐదు గంటల 30 నిమిషాలకు దీపోత్సవానికి ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన 6 అడుగుల ఎత్తైన దివ్య దీపం (కొప్పర) 1503 కేజీల నెయ్యి మరియు 2000మీటర్లు ఒత్తు కలిగిన మహాదీపాన్ని ఓం నమశ్శివాయ నామస్మరణల పారావస్యంతో భక్తిశ్రద్ధలతో శ్రీ ప్రతాప్ స్వామీజీ వెలిగించారు. యోగుల పర్వతం శివనామ స్మరణతో మారు మ్రోగింది. పరిసర ప్రాంతాల ప్రజలే కాక ఇతర రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు కార్తీక దీపాన్ని సందర్శించారు. యోగుల పర్వతంపై వచ్చిన భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా నిరంతరం త్రాగునీరు అన్నదానం ప్రసాద వితరణ నిర్వాహకులు చేశారు. ఈ సందర్భంగా గురూజీ భక్తులకు భక్తి ప్రవచనం బోధించారు ఈ దివ్య దీపం ధర్మం, భక్తి, లోకకల్యాణం యొక్క ప్రకాశాన్ని ప్రతిబింబిస్తూ, ఆధ్యాత్మిక సందేశాన్ని వ్యాప్తి వేలాది భక్తులు దీపాలు వెలిగించి, ఈ పవిత్ర దీపోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొని, ప్రకృతి పరిరక్షణ, లోకశాంతి, ప్రజల శ్రేయస్సు, సమాజ సౌభ్రాతృత్వం కోసం ప్రార్థనలు చేశారు. ఆ జ్యోతి వెలుగులో యోగులపర్వతం ఆధ్యాత్మిక క్షేత్రంగా మారి, ప్రతి భక్తుడి హృదయంలో భక్తిజ్యోతి వెలిగించింది. “దీపం ఒకటి వెలిగితే చీకటి తొలగుతుంది, భక్తి వెలిగితే లోకం ప్రకాశిస్తుంది. ధర్మజ్యోతి మన హృదయంలో వెలిగినపుడు, అది యుగయుగాల వెలుగుకి మూలం అవుతుంది.”

తిరుపతి

ఉచిత విద్య, వైద్యంను ప్రభుత్వం పేదలకు దూరం చేస్తోంది ఒక్క సంతకంతో ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను కాపాడుకుందాం

నడవలూరు కోటిసంతకాల సేకరణలో చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి రామచంద్రపురం మండలం రాష్ట్రంలో ఉచిత విద్య, వైద్యంను ప్రభుత్వం పేదలకు దూరం చేస్తోందని, ప్రభుత్వ కుట్రలను అడ్డుకునేందుకు చేపట్టిన ప్రజా ఉద్యమంలో అందరూ భాగస్వాములై ఒక్కసంతకం పెట్టాలని చంద్రగిరి నియోజకవర్గం వైఎస్‌ఆర్‌సీపీ సమన్వయకర్త చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రామచంద్రాపురం మండలం నడవలూరు గ్రామంలో గురువారం జరిగిన కోటి సంతకాల సేకరణలో ఆయన పాలుపంచుకున్నారు. ముందుగా గ్రామస్తులతో సమావేశమైన ఆయన ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలను కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి జగనన్న కట్టిస్తే ఆ కాలేజీలను నిర్వహించడం కూటమి ప్రభుత్వానికి చేతకాక ప్రయివేటుపరం చేస్తోందన్నారు. కొన్ని కాలేజీలు దశల వారీగా నిర్మాణాలు ఆగిపోతే వాటిని పూర్తి చేయలేక కమీషన్ల కోసం కక్కుర్తిపడి ప్రయివేటు వ్యక్తుల చేతిలో పెడుతోందని ఆరోపించారు. గత ప్రభుత్వంలో మొదటి రెండేళ్లు కరోనాతో కాలం గడిచిపోగా మిగిలిన మూడేళ్ల కాలంలో 17 మెడికల్‌ కాలేజీలను కట్టించిన ఘనత ఒక్క జగనన్నకే దక్కుతుందన్నారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా ఏ ముఖ్యమంత్రి చేయలేని సాహసం జగనన్న చేశారని, పేద ప్రజలకు మెరుగైన వైద్యవిద్య, కార్పొరేట్‌ వైద్యం ఉచితంగా అందించాలని తపన పడ్డారన్నారన్నారు. జగనన్న ప్రభుత్వం పేదలకు మంచి జరగాలని చిత్తశుద్ధితో ఆలోచన చేసి మెడికల్‌ కాలేజీలను కట్టిస్తే ఈ కూటమి ప్రభుత్వం కమీషన్లు కోసం కక్కుర్తిపడి వాటిని ప్రయివేటు పరం చేస్తోందన్నారు. పేదలకు అందాల్సిన ఉచిత వైద్యం, విద్యార్థులకు వచ్చే మెడికల్‌ సీట్లును రాకుండా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వమే అడ్డుకోవడం దుర్మార్గమైన చర్యగా బావిస్తున్నామన్నారు. భారత దేశంలో ఎక్కడా ఇలాంటి పరిస్థితి రాలేదని, అది కూడా పిపిపి పద్దతిలో ప్రయివేటు వ్యక్తులకు 66 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చేలా జీఓలు ఇవ్వడం చూస్తుంటే ఆశ్చర్యమేస్తోందన్నారు. 66 ఏళ్ల తరువాత ఆ భవనాలు పదిలంగా ఉంటాయా..? అక్కడ ప్రజలకు అనుకున్నంత స్థాయిలో వైద్యం దొరికే పరిస్థి ఉంటుందా ? అన్న విషయాలు అందరూ ఆలోచన చేయాలన్నారు. ఈ ప్రభుత్వం పేదల కోసం పని చేస్తోందా.. పెద్దలు కోసం పని చేస్తోందా అర్థం కావడం లేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మెడికల్‌ కాలేజీలను ప్రయివేటు పరం చేసే కుట్రలను ఆపాడానికి రాజ్యాంగ పరిరక్షకులైన రాష్ట్ర గవర్నర్‌కు ప్రజల సంతకాలతో కూడిన ప్రతులను అందజేసే బృహత్తరమైన కార్యక్రమానికి జగనన్న పిలుపునిచ్చారన్నారు. ఆయన పిలుపు మేరకు ప్రతి ఒక్కరు ప్రజా ఉద్యమంలో పాల్గొని సంతకాలు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం గ్రామంలో ఇంటింటికీ వెళ్లిన చెవిరెడ్డి మోహిత్‌రెడ్డి ప్రజల నుంచి సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బ్రహ్మానందరెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు ఎద్దుల చంద్రశేఖర్‌రెడ్డి, నడవలూరు సర్పంచ్‌ గణపతిరెడ్డి, ఎంపీటీసీ గిరిధర్‌రెడ్డి, చంద్రగిరి నియోజకవర్గం వాణిజ్య విభాగం అధ్యక్షులు బోడిరెడ్డి నిరంజన్‌రెడ్డి, మండల పార్టీ మహిళాధ్యక్షురాలు జ్యోతి, సి.రామాపురం సర్పంచ్‌ పవన్‌కుమార్‌రెడ్డి, మండల ఎస్సీసెల్‌ అధ్యక్షులు వెంకటేష్, మండల విద్యార్థి విభాగం అధ్యక్షులు యశ్వంత్‌రెడ్డి, పార్టీ సీనియర్‌ నాయకులు గంగరామిరెడ్డి, ముచ్చేలి భాస్కర్‌రెడ్డి, వెంకటరెడ్డి, నడవలూరు మాజీ సర్పంచ్‌ బాబురెడ్డిలతో పాటు పలువురు కార్యకర్తలు, గ్రామస్తులు పాల్గొన్నారు.

ఖమ్మం

బోర్డులకే పరిమితమైన తెలంగాణ క్రీడ ప్రాంగణము*

*బోర్డులకే పరిమితమైన తెలంగాణ క్రీడ ప్రాంగణము* *ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ క్రీడా ప్రాంగణము నిరుపయోగంగా దర్శనమిస్తున్నాయి* *నిధులు వృధా* *కాంట్రాక్టర్ మరియు అధికారులు కలసి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి* *తూతూ మంత్రంగా మట్టి పోసి బోర్డులు ఏర్పాటు చేసి నిధులు డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి* *ఖమ్మం జిల్లాలో అన్ని మండలాలకు సంబంధించి తెలంగాణ క్రీడా ప్రాంగణం పై ప్రత్యేక అధికారులను నియమించి ఉపయోగం లో వచ్చే విధంగా చర్యలు తీసుకోగలరు* ఖమ్మం జిల్లా ( పున్నమి ప్రతినిధి) గుగులోత్ భావుసింగ్ నాయక్ నవంబర్ 07 ఖమ్మం జిల్లాలో ఏర్పాటు చేసినటువంటి తెలంగాణ క్రీడా ప్రాంగణము అనేది తెలంగాణ రాష్ట్రంలోని గ్రామాల్లో క్రీడా మైదానాలను ఏర్పాటు చేయడానికి తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమం ఈ ప్రాంగణాలను ఉపాధి హామీ నిధుల సహాయంతో నిర్మించారు క్రీడ సామాగ్రి వాకింగ్ ట్రాక్ లు పిల్లల ఆట వస్తువులు బెంచ్ లు ఉంటాయి అయితే అట్టి తెలంగాణ క్రీడా ప్రాంగణము నిరుపయోగంగా ఉండడం వల్ల అట్టి పనికి పెట్టినటువంటి నిధులు వృధా అయినట్టుగా అందరికీ తెలుస్తూనే ఉంది ప్రస్తుత పరిస్థితి కొన్ని నివేదికల ప్రకారం కొన్ని క్రీడా ప్రాంగణాలు సరైన నిర్వహణ లేకపోవడం వల్ల నిరుపయోగంగా మారాయని కేవలం బోర్డుల కు మాత్రమే పరిమితమయ్యాయని తెలుస్తుంది ప్రతి టీకేపీలో దాదాపు 300 మొక్కలను నాటి, వాటిని పర్యవేక్షించేందుకు ప్రతి మండలంలో ఒక ప్రత్యేక అధికారిని నియమించారు. కానీ అట్టి మొక్కలలు ప్రస్తుతము ఎక్కడ కూడా కనిపించడం లేదు ఒక్కో క్రీడా ప్రాంగణం కు రెండు నుండి ఎనిమిది లక్షల వరకు ఖర్చు చేశారు అట్టి రూపాయలు వృధా గత బిఆర్ఎస్ ప్రభుత్వాయహంలో ఎంతో ఆర్భాటంగా ఏర్పాటు చేసిన క్రీడా ప్రాంగణాలు నేడు ఆటకు నోచుకోక వెలవెలబోతున్నాయి నిరుపయోగంగా క్రీడా ప్రాంగణాలు నేడు అధికారుల పర్యవేక్షణ నిర్లక్ష్యం మూలంగా అస్తవ్యస్తంగా మారాయి క్రీడా ప్రాంగణాల నిర్మాణం పట్టించుకోకపోవడంతో అవి శిథిల వ్యవస్థకు చేరుకుంటున్నాయి వాటిని ఉపయోగించుకో లేని పరిస్థితి నెలకొంది ప్రస్తుతం క్రీడా ప్రాంగణం నిర్వహణ లేకపోవడంతో చెత్తాచెదారం పిచ్చి మొక్కలతో వెక్కిరిస్తున్నాయి అలాగే క్రీడా ప్రాంగణాలు నిర్వహణ లేకపోవడంతో పశువులకు ఉపయోగకరంగా మారాయి క్రీడా మైదానాలను వినియోగం లోకి తేవాలి జిల్లాలో కోట్ల రూపాయలు నిధులతో క్రీడా ప్రాంగణం ఏర్పాటు చేయగా ప్రస్తుతం అవి నిరూపయోగంగా ఉండడంతో నిధులు వృధా అయ్యాయి గతంలో ఉన్న క్రీడా మైదానాల్లో మట్టి పోసి నిధులు డ్రా చేశారు కొన్ని ప్రాంతాల్లో ఉపయోగం లేని చోట మట్టి పోసి వాలీబాల్ ఆడేందుకు అవసరమైన స్తంభాలను మాత్రమే ఏర్పాటు చేశారు ప్రభుత్వ నిబంధన ప్రకారం రన్నింగ్ ట్రాక్ వాలిబాల్ కోర్ట్ యువత కసరత్తులు చేసేందుకు అవసరమైన పరికరాలు ఏర్పాటు చేయాలి కానీ దానికి విరుద్ధంగా క్రీడా ప్రాంగణాలను అధికారులు ఏర్పాటు చేశారు ప్రజా ప్రతినిధులు మరియు అధికారులు కలిసి కోట్లలో రూపాయలను సొమ్ము చేసుకున్నారనే వార్త జిల్లా ప్రజలలో బాగా వినిపిస్తుంది మరి ప్రజాధనాన్ని వృధా చేసినటువంటి ప్రజాప్రతినిధుల (కాంట్రాక్టర్) మీద అధికారుల మీద ఉన్నతాధికారులు చర్యలు ఎందుకు తీసుకోలేకపోతున్నారు కళ్ళకు కట్టినట్టుగా ప్రస్తుత క్రీడా ప్రాంగణాలు కనిపిస్తున్న వాటిని ఎందుకు వినియోగంలోకి తేలేకపోతున్నారో అర్థం కావడం లేదు

తిరుపతి

శ్రీ గౌరీ సమేత భీమేశ్వర స్వామి

చంద్రగిరి మండల పరిధిలోని పనపాకం గ్రామంలో వెలసిన శ్రీ గౌరీ సమేత భీమేశ్వర స్వామి వారి ఆలయంలో బుధవారం కార్తీక పౌర్ణమి వేడుకలు వైభవంగా జరిగాయి. ఆలయ అర్చకులు స్వామివారికి వివిధ సుగంధ ద్రవ్యాలతో అభిషేకాలు, మరియు అనాభిషేకం, హోమాలు నిర్వహించారు. అనంతరం గుడి ఆవరణ నందు భక్తి శ్రద్ధలతో కార్తీక దీపం వెలిగించారు గ్రామస్తులు స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. కార్తీక పౌర్ణమి సందర్బంగా స్వామివారికి అభిషేకం , జరిపించబడినది తధూపరి స్వామి వారి అలంకార దర్శనం మరియు తీర్థ ప్రసాద వితరణ అన్నదాన కార్యక్రమం జరిగినది. ఇట్లు ఆలయకమిటీ సభ్యులు

E-పేపర్

4 కోట్ల విలువ చేసే భూమిని వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేసిన రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి

పున్నమి ప్రతినిధి: ఆలంపల్లి దుర్గేష్ : 9640204826 : 4 కోట్ల విలువ చేసే భూమిని వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేసిన కోదండరెడ్డి. ఇచ్చిన మాట ప్రకారం తన సొంత భూమిని రాష్ట్ర ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ చేశారు రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి. ఈరోజు ఇబ్రహీం పట్నం సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో అధికారికంగా వ్యవసాయ శాఖకు రిజిస్ట్రేషన్ చేశారు. రెండు నెలల క్రితమే తన సొంత గ్రామం ఐనా యాచారం గ్రామంలోని 4 కోట్ల విలువ చేసే 2 వేల గజాల స్థలాన్ని, అందులో వున్న భవనాన్ని వ్యవసాయశాఖకు రాసివ్వనున్నట్లు ప్రకటించారు. యాచారం మండలంలోని రైతులు పండించే ఉత్పత్తుల నిల్వ, ఇతర వ్యవసాయ పరికరాలు, పనిమొట్లు పెట్టుకోడానికి ఎంతో ఉపయోగకరంగా వుంది. ఇక శాశ్వతంగా రైతులకు ఉపయోగకరంగా ఉండాలంటే ప్రభుత్వానికి రాసిస్తే బాగుంటదనే ఆలోచనతో రైతు కమిషన్ చైర్మన్ కోదండరెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. గతంలోనే ఈ విషయాన్ని స్వయంగా వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావును కలిసి వివరించారు. ఐతే దానికి సంబందించిన అధికారికంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ రోజు ముగిసింది. ఇబ్రహీం పట్నం సబ్ రిజిస్టర్ హర్షన్ ఆధ్వర్యంలో రిజిస్ట్రేషన్ జరిగింది. ఈ ప్రక్రియలో వ్యవసాయ శాఖ తరుపున రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి ఉషా, ఏడీఏ సుజాత, ఏవో రవినాధ్ పాల్గొన్నారు.

నాగర్‌కర్నూల్

*క్రీడాకారులకు దుస్తుల పంపిణీ*

నాగర్ కర్నూల్ జిల్లా ప్రతినిధి నవంబర్ 6 పున్నమి న్యూస్: కల్వకుర్తి పట్టణం బిఎస్ఎన్ఎల్ గ్రౌండ్ లో గత 12 రోజులుగా నిర్విరామంగా ఖోఖో శిక్షణా శిబిరం కొనసాగింది. శిక్షణ పొందిన క్రీడాకారులు గురువారం స్టేట్ మీట్ కు వెళ్తున్న క్రమంలో క్రీడా దుస్తులను ఎలైట్ ఇండియా ప్రాజెక్టు ప్రయివేట్ లిమిటెడ్ యాజమాన్యం పంపిణీ చేసింది. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వివిధ మండలాల నుంచి వచ్చిన క్రీడాకారులకు అడిగిన వెంటనే దుస్తులను పంపిణీ చేసిన ఎలైట్ ఇండియా ప్రాజెక్ట్ ప్రయివేట్ లిమిటెడ్ వారికి మహాబూబ్ నగర్ ఖోఖో అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విలియం, ఆర్గనైజర్  గోకమళ్ళ రాజు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్బంగా ఎలైట్ ఇండియా ఎండి నాగరాజు మాట్లాడుతూ.. నిరుపేద విద్యార్థులకు, క్రీడాకారులకు, పేదలకు సహాయం చేయడమే మా లక్ష్యం అని వారు తెలిపారు.  అతి తక్కువ ధరలకు మా ప్రాజెక్టులో ప్లాట్లు అందించబడును. మా సంస్థ ద్వారా పేద విద్యార్థులకు సేవ చేయడానికి కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ ఏర్పాటు చేశామని తెలిపారు. స్టేట్ మీట్ కు వెళ్తున్న క్రీడాకారులకు ఆయన శుభాకాంక్షలు తెలియజేశారు. పెద్దపల్లిలో జరిగే ఖోఖో సీనియర్ బాలుర బాలికలు రాష్ట్ర స్థాయిలో మంచి ప్రతిభ కనబరిచి గోల్డ్ మెడల్ తీసుకురావాలని వారు ఆకాంక్షించారు. ఎలైట్ ఇండియా ప్రాజెక్ట్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ  సిఎండి రమేష్ యాదవ్, రాజేందర్, నగేష్, బాలరాజు, కార్యక్రమంలో వెల్దండ మండల టిఆర్ఎస్ నాయకులు జంగిలి ఆనంద్, డొక్కా , లింగమయ్య, యాదగిరి తదితరులు పాల్గొన్నారు.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

దివ్యాంగులకు ఉచితంగా త్రీవీలర్ మోటారు సైకిళ్లు

ఈ నెల 25 వరకు దరఖాస్తుల ఆహ్వానం రాష్ట్రంలోని అర్హులైన దివ్యాంగులకు ఉచితంగా 1750 రెట్రోఫిట్ త్రీ వీలర్ మోటారు సైకిళ్లను అందజేస్తామని అందజేస్తామని మంత్రి డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఈ నెల 25 లోపు www.apdas-cac.ap.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.’డ్రైవింగ్ లైసెన్స్ ఉండి, రెగ్యులర్ డిగ్రీ, ఆపై ఉన్నతవిద్య చదువుతున్న విద్యా ర్థులు, పదో తరగతి ఉత్తీర్ణులై స్వయం ఉపాధితో జీవించేవారు, 18 నుంచి 45 ఏళ్ల లోపు ఉండి 70 శాతం అంగవైకల్యం ఉన్న వారు దరఖాస్తు చేసు కొనేందుకు అర్హులు” అని మంత్రి స్వామి వెల్లడించారు.

E-పేపర్

టెన్నిస్ లో మెరిసిన జోషి ప్రియ రెడ్డి

స్కూల్ ఎడ్యుకేషన్ ఆధ్వర్యంలో ఈనెల 1వ తేదీ నుండి 3వ తేదీ వరకు తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో జరిగిన 69వ APSGF టెన్నిస్ టోర్నమెంట్ లో సాయి నగర్ ప్రైవేటు స్కూల్ 10వ తరగతి విద్యార్థిని జోషి ప్రియా రెడ్డి అత్యుత్తమ నైపుణ్యం కనబరచి, జాతీయ స్థాయి టెన్నిస్ పోటీలకు ఎంపికైనట్లు పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ సందర్భంగా విద్యార్థినికి పాఠశాల యాజమాన్యం ప్రత్యేకమైన అభినందనలు తెలియజేసింది. జాతీయస్థాయిలో సైతం గెలుపొందాలని ఆశాభావం వ్యక్తం చేసింది.

డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

జనవరి నుంచి పట్టణాల్లో కిలో రూ.18కే గోధుమ పిండి పంపిణీ

జనవరి నుంచి పట్టణ ప్రాంతాల్లో కిలో రూ.18కే గోధుమ పిండి పంపిణీ చేయనున్నట్లు ఏపీ పౌర సరఫరాల శాఖ ప్రకటించింది. ఆగస్టు 25, 2025న ప్రారంభమైన స్మార్ట్ రేషన్ కార్డ్‌ల పంపిణీ ఇప్పటివరకు 92% పూర్తయింది. దీపం పథకం కింద 90 లక్షల లబ్ధిదారులకు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించారు. మూడో విడత ఈ నెల 30 వరకు కొనసాగనుంది.

నిర్మల్

చిన్న నీటిపారుదల వనరుల వివరాలు సేకరించాలంటూ కలెక్టర్ ఆదేశాలు

నిర్మల్ నవంబర్ 06 (పున్నమి ప్రతినిధి) నిర్మల్ జిల్లాలో చిన్న నీటిపారుదల కింద వచ్చే బోర్లు, బావులు, చెరువులు, కుంటలు, కాలువల వివరాలను సమగ్రంగా సేకరించాలని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ సూచించారు. గురువారం కలెక్టరేట్‌లో సంబంధిత శాఖాధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లా పరిధిలోని అన్ని చిన్న నీటిపారుదల వనరులపై ఖచ్చితమైన సమాచారం సేకరించి, రికార్డులు సక్రమంగా సిద్ధం చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో రత్నకళ్యాణి, సీపీఓ జీవరత్నం, ఇతర శాఖాధికారులు పాల్గొన్నారు. అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేసి, నీటిపారుదల వనరుల సంరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు.

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.